delhi airport
-
ఎయిర్‌పోర్ట్స్.. మాలా‘మాల్’!
ప్రీమియం రిటైల్ స్టోర్స్.. లగ్జరీ బొటిక్స్.. డైనింగ్ ఏరియాలు.. వెల్నెస్ సెంటర్లు.. స్పాలు.. కాఫీ షాపులు.. రెస్టో బార్లు.. 24 గంటలూ కిటకిటలాడే జనాలు... ఇవన్నీ ఏదైనా భారీ షాపింగ్ మాల్లో ప్రత్యేకతలు అనుకుంటున్నారా? ఎయిర్‌పోర్టుల నయా అవతారం ఇది. విమానయాన కార్య కలాపాల నుంచి వచ్చేది అంతంతమాత్రమే కావడంతో ప్రయాణికులకు ప్రపంచస్థాయి షాపింగ్ అనుభవాన్ని అందిస్తూ.. ఆదాయాలను దండిగా పెంచుకుంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలన్నీ ఇప్పుడు షాపింగ్ మాల్స్(shopping mall) కు ఎక్కువ.. ఎయిర్‌పోర్టుల(airport)కు తక్కువ అనే రేంజ్లో నడుస్తున్నాయి!! – సాక్షి, బిజినెస్ డెస్క్దేశీయంగా ఎయిర్‌పోర్టుల నిర్వహణలో దిగ్గజ సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్. భారత్‌లో అతిపెద్ద విమానాశ్రయం ఢిల్లీతోపాటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఈ కంపెనీ చేతిలోనే ఉంది. ప్రయాణికుల రాకపోకల్లో ఇవి రికార్డులు సృష్టిస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో ఢిల్లీ ఎయిర్‌పోర్టు 2 కోట్ల మందికిపైగా ప్రయాణికుల ట్రాఫిక్‌తో దుమ్మురేపింది.తొలి తొమ్మిది నెలల్లో ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్టు ద్వారా లభించిన మొత్తం ఆదాయం రూ.3,775 కోట్లు. ఇందులో విశేషం ఏముందంటారా? తాజా లెక్కల్ని లోతుగా పరిశీలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే! ఆదాయంలో విమాన (ఏరో) కార్యకలాపాల వాటా 20 శాతమే. మరో 57 శాతం విమానయేతర కార్యకలాపాలు (నాన్–ఏరో) సమకూర్చిపెట్టాయి. అంటే రిటైల్, డ్యూటీ–ఫ్రీ సేల్స్, అద్దెలు, ప్రకటనలు, ఆహార–పానీయాల విక్రయం తదితర మార్గాల్లోనే లభించాయి. దీన్నిబట్టి చూస్తే.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఇప్పుడో భారీ మాల్ కింద లెక్క!ఏరో ‘మాల్స్’ కిటకిట..: ఒకవైపు నగరాల్లోని భారీ మాల్స్‌లో రిటైల్ గిరాకీ తగ్గుముఖం పడుతోంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తాజా నివేదిక ప్రకారం... దేశంలోని 8 ప్రధాన నగరాల షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్థలాల లీజింగ్ గతేడాది 10శాతం తగ్గిపోవడం గమనార్హం. అదే ఎయిర్‌పోర్టుల్లోని మాల్స్ మాత్రం కిటకిటలాడి పోతున్నాయి. జీఎంఆర్‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్య అద్దెల రూపంలో ఏకంగా రూ.597 కోట్లు (2024 డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో) లభించడం విశేషం. ప్రయాణికుల రద్దీ చూస్తే.. దేశీ ట్రాఫిక్‌లో 17 శాతం, అంతర్జాతీయ ట్రాఫిక్‌లో 28 శాతంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు టాప్‌లో ఉంది.ఎయిర్‌పోర్టు ఆదాయంలో 28 శాతం రిటైల్, డ్యూటీ–ఫ్రీ షాపుల ద్వారా, 18 శాతం అద్దెల ద్వారా లభించగా, మరో 10 శాతం ఆహార–పానీయాల అమ్మకం ద్వారా తోడైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు డ్యూటీ–ఫ్రీ షాపుల్లో ఒక్కో ప్రయాణికుడి సగటు ఖర్చు రూ.1,026 కావడం గమనార్హం.ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్..ఎయిర్‌పోర్టుల విమాన సంబంధ ఆదాయాల్లో.. ల్యాండింగ్ ఫీజులు, విమానాల పార్కింగ్ చార్జీలు, ప్రయాణికుల సెక్యూరిటీ ఫీజులు, విమానాల టెర్మినల్ స్పేస్ అద్దెలు, గేట్లు, సర్వీసులకు సంబంధించి వినియోగ ఫీజులు కీలకమైనవి. అయితే అంతపెద్ద ఏరియాలో కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈ ఆదాయం ఏ మూలకూ సరిపోదు. అందులోనూ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులు భారీ పెట్టుబడులు, వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి. అందుకే ఎయిర్‌పోర్టులను ఫైవ్‌స్టార్ మాల్స్‌గా మార్చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి కంపెనీలు. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులన్నీ నాన్–ఏరో బిజినెస్‌లపైనే ఫోకస్ చేస్తున్నాయి.సింగపూర్ చాంగి ఎయిర్‌పోర్టుకు కూడా 55 శాతం ఆదాయం నానో–ఏరో కార్యకలాపాల ద్వారానే వస్తోంది. రిటైల్, డ్యూటీ–ఫ్రీ, ఫుడ్–బేవరేజ్ షాపులకు అధిక స్పేస్ కేటాయిస్తుండటంతో ఎయిర్‌పోర్టులు మాల్స్‌ను తలపిస్తున్నాయి. దీంతో షాపింగ్ స్పేస్ పెరిగిపోయి విమానాశ్రయాలు ఇరుకైపోయాయంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి.అంతర్జాతీయంగా ఎయిర్‌పోర్టుల నాన్–ఏరో ఆదాయం సగటున 40–50 శాతం కాగా.. మన దగ్గర దానికి మించి ఉండటం విశేషం. ఆదాయం కోసం మాల్ సదుపాయాలను విస్తరించినప్పటికీ.. ప్రయాణికుల సౌకర్యాలను మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం దుబాయ్, చాంగి ఎయిర్‌పోర్టులను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు.భారత్‌లో అతిపెద్ద మాల్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో..28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం (బిల్టప్ ఏరియా)తో దేశంలోనే అతిపెద్ద మాల్ ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోసిటీలో ఏర్పాటవుతోంది. 2027 మార్చి కల్లా ఈ మెగా మాల్ అందుబాటులోకి వస్తుందని అంచనా. దీని అండర్ గ్రౌండ్లో 8,000కుపైగా కార్లు పార్క్ చేయొచ్చట! వరల్డ్ మార్క్ ఏరోసిటీ పేరుతో 2.5 బిలియన్ డాలర్లతో చేపట్టిన ఫేజ్–2 విస్తరణ ప్రాజెక్టులో భాగమిది.భారత్‌లో తొలి ‘ఏరోట్రోపోలిస్ (విమానాశ్రయం చుట్టూ నిర్మిస్తున్న మెట్రోపాలిటన్ ఏరియా)’గా కూడా ఇది రికార్డు సృష్టించనుంది. భారతీ రియల్టీ సంస్థ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఫేజ్–2లో మొత్తం 35 లక్షల చదరపు అడుగుల లీజింగ్ స్పేస్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఏరోసిటీలోని 11 స్టార్ హోటళ్లలో 5,000 గదులు ఉండగా.. విస్తరణ తర్వాత 15 హోటళ్లు, 7,000 గదులకు పెరగనున్నాయి. కాగా ప్రస్తుతం కొచ్చిలో ఉన్న లులు ఇంటర్నేషనల్ మాల్ 25 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో అతిపెద్ద మాల్గా ఉంది.హైదరాబాద్‌లోనూ..హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న జీఎంఆర్ ఏరోసిటీలో కూడా 20 ఎకరాల్లో భారీ మాల్ నిర్మాణంలో ఉంది. మొత్తం విస్తీర్ణం 8 లక్షల చదరపు అడుగులు. 100కు పైగా దేశ, విదేశీ దిగ్గజ బ్రాండ్ స్టోర్లు సహా అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ స్పేస్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ 2,000 సీట్ల సామర్థ్యంలో ఐనాక్స్ 11 స్క్రీన్ల థియేటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాదే ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా.68.8 బిలియన్ డాలర్లు.. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టు రిటెయిలింగ్ మార్కెట్ అంచనా ఇది. ఏటా 6.9 శాతం వృద్ధి చెందుతుందని లెక్కలేస్తున్నారు. 2023లో ఇది 43.2 బిలియన్ డాలర్లుగా ఉంది.విమాన ప్రయాణికుల జోరు ఇది.. (కోట్లలో)ఎయిర్ ట్రాఫిక్ 2024 2023 వృద్ధి(%)దేశీయ 16.13 15.20 6.11అంతర్జాతీయ 6.45 5.79 11.4 -
ఎయిరిండియా చెక్-ఇన్ సమయంలో మార్పులు
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తన చెక్-ఇన్ సమయాలను సవరించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, విమానాశ్రయ విధానాలను క్రమబద్ధీకరించడానికి ఈ మార్పులు చేసినట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీతోపాటు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఈమేరకు మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది.లండన్ హీత్రూ విమానాశ్రయంలో చెక్-ఇన్ సమయాల్లో మార్పులు ఇలా..చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.గతంలో ఇది 60 నిమిషాలుగా ఉండేది.కొత్త నియమం ద్వారా ప్రయాణికుల రద్దీ సమయాల్లో చెక్-ఇన్, సెక్యూరిటీ క్లియరెన్స్‌ల కోసం తగిన సమయం ఉంటుంది.ఢిల్లీ విమానాశ్రయంలో ఇలా..ఢిల్లీ నుంచి బయలుదేరే అన్ని అంతర్జాతీయ విమానాలకు ఈ నియమాలు అమలుల్లో ఉంటాయి.చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.ఇదీ చదవండి: రైల్లో మంటలు! క్షణాల్లో తప్పించుకునేలా..సవరించిన చెక్-ఇన్ సమయానికి అనుగుణంగా ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించాలనుకునేవారు షెడ్యుల్ సమయం కంటే దాదాపు 3 గంటల ముందుగానే ఉండడం మంచిదని పేర్కొంది. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు.. ఏడు విమానాలు రద్దు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. పొల్యూషన్ కారణంగా ఏర్పడిన పొగమంచు విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత(విజిబులిటీ) తగ్గడంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 8.30 గంటల వరకు దాదాపు 160 విమానాలు ఆలస్యంగా నడిచాయి.ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం విమానాలు బయలుదేరే సమయంలో సగటున 22 నిమిషాల ఆలస్యం జరిగింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండటంతో ఐదు విమానాలను (జైపూర్-04, డెహ్రాడూన్-01) దారి మళ్లించారు. ప్రస్తుతం అన్ని విమాన కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని విమనాశ్రయ అధికారులు పేర్కొన్నారు.ఎకనామిక్ టైమ్స్ వార్తల ప్రకారం దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గినందున సోమవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఏడు విమానాలను రద్దు చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల రాకపోకలపై ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రస్తుతం ఢిల్లీలో ఏర్పడిన పొగమంచు విజిబులిటీని ప్రభావితం చేస్తోంది. ఫలితంగా విమాన షెడ్యూళ్లలో జాప్యం జరగవచ్చు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు విమాన రాకపోకల స్థితిని ఒకసారి చెక్ చేసుకోవాలి’ అని తెలియజేసింది. స్పైస్‌జెట్ కూడా ఇదే విధమైన సూచన చేసింది. ఢిల్లీలో ప్రస్తుతం గాలి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 481కి చేరింది. కాలుష్యం కారణంగా ఏర్పడిన అధ్వాన్న పరిస్థితుల దృష్ట్యా నేటి (సోమవారం) నుంచి ఢిల్లీలో గ్రాప్-4 నిబంధనలను అమలు చేశారు.ఇది కూడా చదవండి: Gujarat: ర్యాగింగ్‌కు ఎంబీబీఎస్ విద్యార్థి బలి -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమానాల రాకపోకలపై ప్రభావం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. ఓ వైపు వాయు కాలుష్యం.. మరోవైపు యమన నదిలో విషపునురగతో దేశ రాజధాని సతమతమవుతోంది. రెండు రోజులుగా తీవ్రమైన కేటగిరిలో గాలి నాణ్యత కొనసాగుతోంది. గురువారం ఉదయం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవరించింది.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 500 స్థాయికి దగ్గరవుతుంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 473గా నమోదైంది. ఫలితంగా విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. దాంతో రోడ్లపై వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించకపోవడంతో ఇబ్బందులుపడ్డారు.దేశ రాజధానిలో కాలుష్యం పెరిగి, దట్టమైన పొగ కమ్ముకోవడంతో విజిబిలిటీ తగ్గింది. ఇది విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్‌కు రాకపోకలు సాగించే సుమారు 300కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఫ్లైట్ రాడార్ 24 సంస్థ తెలిపింది. వీటిలో 115 విమానాలు ఢిల్లీకి వచ్చేవి ఉండగా.. రాజధాని నుంచి బయలు దేరాల్సిన 226 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు పేర్కొంది. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు పేర్కొంది. సగటున 17 నుంచి 54 నిమిషాలు ఆలస్యంగా విమానాలు నడుస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ పొగమంచు రైళ్ల రాకపోలకపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. -
బీజేపీ నేతతో విరాట్ కోహ్లి, గౌతం గంభీర్ (ఫొటోలు)
-
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఫొగట్ కు ఘనస్వాగతం
-
ప్రాణదాతా.. నీకు సలాం! వీడియో వైరల్
ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా డాక్టర్ ఓ వృద్ధుడి( 60 ఏళ్లు) ప్రాణాన్ని కాపాడారు. ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-2లో ఒక వ్యక్తికి గుండెపోటు రావటంతో గమనించి ఆమె వెంటనే స్పందించారు. ఆయన వద్దకు వెళ్లి ఛాతిమీద చేతులతో నొక్కుతూ సీపీఆర్ చేసి స్పృహలోకి వచ్చేలా చేశారు. అనంతరం విమాశ్రయ అధికారులు ఆ వ్యక్తికి వైద్యం అందించారు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. లేడీ డాకర్ట్ చూపిన చొరవకు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. డాక్టర్ చొరవతో ఆ వ్యక్తికి ప్రాణం వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక.. ఆమెను డాక్టర్ విశ్వరాజ్ వేమలగా ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు.Doctors are no less than God 🙏🏻An elderly passenger at the Delhi airport's Terminal 2 was revived by a doctor after he suffered a heart attack on the premises.She deserves an acknowledgement and recognition 👏🏻#DelhiAirport pic.twitter.com/0lOLyKj2RC— Vani Mehrotra (@vani_mehrotra) July 17, 2024 -
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో టీమిండియా ఆటగాళ్లకు గ్రాండ్ వెల్ కమ్
-
భారత్ కు చేరుకున్న వరల్డ్ కప్ ఛాంపియన్స్.. ఘన స్వాగతం
-
దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల మళ్లింపు.. కారణం..
దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 కార్యకలాపాలను టెర్మినల్ 2, 3కు మారుస్తున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం తీవ్రగాలులతో భారీ వర్షం కురవడంతో టర్మినల్ 1లోని కెనొపి(పందిరి) కూలింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.దిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏల్) ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి సహాయక చర్యలు ప్రారంభించింది. శనివారం టెర్మినల్ 1 కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. టెర్మినల్ 1 ద్వారా నిర్వహించే విమాన సర్వీసులను టెర్మినల్ 2, 3కు మారుస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఈ విధానం కొనసాగుతుందని స్పష్టం చేసింది.ఇండిగో శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ..‘శుక్రవారం అర్ధరాత్రి తర్వాత దిల్లీ టెర్మినల్ 1 నుంచి వచ్చిపోయే సంస్థ విమానాలు టెర్మినల్ 2, 3కి షెడ్యుల్ చేయబడ్డాయి. ప్రయాణికులు ఏ టెర్మినల్ వద్దకు రావాలో వాట్సప్, ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా సమాచారం అందిస్తాం. దయచేసి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ముందు సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలి’ అని చెప్పింది.ఇదీ చదవండి: 350 మందికి రూ.1 కోటికి పైగా వేతనం ఇస్తున్న కంపెనీప్రమాద ఘటనకు సంబంధించి డీఐఏల్ స్పందిస్తూ..‘దిల్లీ ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, అగ్నిమాపక, వైద్య బృందం ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ కార్యకలాపాలను మొదలు పెట్టింది. టెర్మినల్ 1 నుంచి ప్రయాణికులను ఇతర ప్రదేశానికి తరలించాం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ (బీసీఏఎస్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), దిల్లీ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) సహా అన్ని సంబంధిత ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నాం. కెనొపి కూలిన ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు, గాయాలైన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నాం’ అని ప్రకటించింది. -
దేశంలో వరుస ఘటనలు.. ప్రకృతి పరంగా కొన్ని.. ప్రమాదాలు మరికొన్ని
ఇటీవల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు వంటి ఊహించని ప్రమాదాలు కొన్ని అయితే, మానవ తప్పిదాలతో జరిగే ఘటనలు మరికొన్ని.. మధ్యకాలంలో గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అత్యంత తీవ్రతతో ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిలో ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినవి కూడా ఉన్నాయి. వరుస ఘటనలతో ఎటునుంచి ఏ ప్రమాదం పొంచి వస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఢిల్లీ ప్రగతి మైదానం సొరంగంలో పగుళ్లుసెంట్రల్ ఢిల్లీని నగర తూర్పు ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ.. రూ. 777 కోట్లతో ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్‌ను కేంద్రం చేపట్టింది.. ఇందులో భాగంగా 1.3 కి.మీ. పొడవైన సొరంగం, ఐదు అండర్‌పాస్‌లు నిర్మించారు. 2022 జూన్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ టన్నెల్లో నీళ్లు నిలిచిపోవడం, పగుళ్లు రావడం వంటి అనేక లోపాలు వెలుగుచూశాయి. పనుల్లో జాప్యం, నిర్వహణ లేమీ కారణంగా సమస్యలు తలెత్తాయి. అనంతం మళ్లీ కోట్ల రూపాయలతతో డిజైన్‌ను సరిదిద్ది, మరమ్మతులు చేశారు.జలమయంగా మారిన అయోధ్యఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో వర్ష బీభత్సం కారణంగా రోడ్లపై మోకాళ్ల వరకు నీరు నిలిచిపోయింది. రామమందీర్ సమీపంలోని ఇళ్లలోకి మురుగునీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామమందిరం చుట్టూ హడావిడిగా నిర్మాణ పనులు చేపట్టడంతోనే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని స్థానికులు అంటున్నారు.మరోవైపు ధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకొని సరిగ్గా ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే.. ప్రధాన గర్భాలయంలో నీరు లీకవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. చిన్నపాటి వర్షానికే ఆలయం నుంచి నీరు కారుతోందని ఆలయ ప్రధాన ఆర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. రామ్‌లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం, వీఐపీ దర్శనం కోసం భక్తులు వచ్చే ప్రదేశం వరకూ పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోందన్నారు.ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయం పైకప్పు లీక్ అవడం ఆశ్చర్యంగా ఉందని, ఇలా ఎందుకు జరిగిందని విస్మయం వ్యక్త ంచేశారు. ఇంత పెద్ద ఇంజనీర్ల సమక్షంలోనే ఇలాంటి ఘటన జరగడం చాలా పొరపాటుగా పేర్కొన్నారు.అయితే గర్భగుడి నుంచి వర్షపు నీరు లీకవుతోందన్న వార్తలపై రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆరోపణలను తోసిపుచ్చారు. పైకప్పు లీక్ కాలేదని, విద్యుత్ తీగల కోసం అమర్చిన పైపుల ద్వారా నీరు కిందకు వచ్చిందని వివరించారు. జబల్పూర్ ఎయిర్ పోర్టు ప్రమాదంమధ్యప్రదేశ్లోని జబల్పూర్ దుమ్నా ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలు కారణంగా టెర్మినల్ రూఫ్‌టాప్ పడిపోయింది. పార్కు చేసిన కారు మీద పడడంతో నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి కొద్ది సేపటి క్రితమే కారులోంచి ఆదాయపు పన్ను అధికారి, డ్రైవర్ కిందకి దిగారు. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.ఇక ఈ విమానాశ్రాయాన్ని కొన్ని నెలల క్రితమే రూ.450 కోట్ల వ్యయంతో పునరుద్ధరించారు. కానీ గురువారం కురిసిన వర్షానికి అతలాకుతలం అయింది. దీంతో నాణ్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో కూలిన రూఫ్ఈ ఘటన జరిగిన ఒక్క రోజుకే ఢిల్లీలోని విమానాశ్రయంలోని టెర్మినల్-1లో పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ఘటనాస్థలానికి చేరుకున్న పొలిసు బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి. టెర్మినల్ 1లో ప్రమాదం జరగడంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అయితే ఎయిర్ పోర్టును నిర్మించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. నాసిరకం మెటీరియల్‌తో ఎయిర్ పోర్టును నిర్మించిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఢిల్లీ టెర్మినల్‌పై కొత్త చర్చ.. మోదీనా లేక కాంగ్రెసా?
ఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 రూఫ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఇక, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే, అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.కాగా, విమానాశ్రయంలో పైకప్పు కూలిన ప్రదేశాన్ని శుక్రవారం ఉదయం రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలిపోయిన టర్మినల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమాన ప్రయాణీకులు అందరికి తగిన ఏర్పాట్లు చేశాం. ఈ ప్రమాదానికి కారణాలను తెలుసుకుంటాం. ఈ టెర్మినల్‌ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించినట్టు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. అది నిజం కాదు. 2009లో టెర్మినల్ నిర్మాణం జరిగిందని క్లారిటీ ఇచ్చారు.మరోవైపు.. ఈ ఘటనలో చనిపోయినవారి కుటుంబానికి రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి రూ.3 లక్షల సాయం అందించనున్నట్టు తెలిపారు. అలాగే, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రామ్మోహన్ పరామర్శించారు.ఇక, ఈ ప్రమాదంపై కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఈ టెర్మినల్‌ను ప్రారంభించారు. 2024వ ఏడాదిలోనే దీన్ని ప్రారంభించారు. మోదీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. బీజేపీ హయాంలో గత పదేళ్లలో పలు నిర్మాణాలు కూలిపోతున్నాయి. ఇలాంటి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదానికి కారణం అదేనా?.. వీడియో వైరల్
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్-1 పైకప్పు శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సందర్బంగా టెర్మినల్ పైకప్పు ట్యాక్సీలు సహా పలు కార్లపై పడిపోవడంతో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.అయితే, భారీ వర్షం నేపథ్యంలో టెర్మినల్ పైకప్పు కూలినట్లు తమకు ఉదయం 5:30 గంటల సమయంలో సమాచారం అందినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఇదురుగాలుల కారణంగా పైకప్పు కూలినట్టు తెలిపారు. మరోవైపు.. టెర్మినల్ పైకప్పుపై పెద్ద మొత్తంలో వరద నీరు ఆగిపోయింది. పైకప్పునకు ఉన్న లీకేజీల కారణంగా కొన్ని గంటల పాటు వర్షపు నీరు కిందకు పారుతూనే ఉంది. ఈ కారణంగానే పైకప్పు కూలిపోయిందని తెలుస్తోంది. Airport Scenes #DelhiRains pic.twitter.com/yzXzzLheFC— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 27, 2024ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు టెర్మినల్1 నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. కూలిన టెర్మినల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.మరోవైపు ప్రమాదంపై ఎక్స్ ద్వారా స్పందిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.. కాసేపటికే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ ప్రమాదంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారీ వర్షాల కారణంగా ఎయిర్‌పోర్టు వెలుపల ఉన్న రూఫ్ భాగం కొంత భాగం కూలిపోయింది. ఈ విషాద ఘటనలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే గాయపడిన నలుగురికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఘటన జరిగిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఫైర్ సేఫ్టీ టీమ్‌ను ఇక్కడికి పంపించాం. ప్రమాద నేపథ్యంలో టెర్మినల్ భవనంలోని మిగిలిన భాగాన్ని మూసివేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు అని తెలిపారు. #WATCH | On portion of canopy collapsed at Delhi airport's Terminal-1, Union Minister of Civil Aviation Ram Mohan Naidu Kinjarapu says, "...we are taking this incident seriously...I want to clarify that the building inaugurated by PM Narendra Modi is on the other side and the… pic.twitter.com/ahb6d9ujc0— ANI (@ANI) June 28, 2024 -
24 గంటల్లో 228 మిల్లీమీటర్లు.. ఢిల్లీ వాన సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ, సాక్షి: రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వాన.. ఢిల్లీని నీట ముంచింది. తెల్లారి చూసేసరికి.. నీట మునిగిన రోడ్లు.. కాలనీలు, అందులో బైకులు, కార్లు నగరవాసుల్ని బిత్తరపోయేలా చేశాయి. మరోవైపు ఢిల్లీఎయిర్‌పోర్ట్ టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలుకాగా, టెర్మినల్-1 వద్ద కార్యకలాపాల్ని అధికారులు నిలిపివేశారు.వేసవి తాపంతో అల్లలాడిపోతున్న దేశరాజధానిని వరుసగా రెండో రోజు వరుణుడు పలకరించాడు. అయితే వర్షం నాన్‌స్టాప్‌గా కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పొద్దుపొద్దున్నే ట్రాఫిక్‌జామ్‌తో జనాలు అవస్తలు పడ్డారు. గత 24 గంటల్లో 228 మిల్లీమిటర్ల వర్షపాతం నమోదు కాగా, కేవలం అర్ధరాత్రి 2.30గం. నుంచి 5.30గం. మధ్యలోనే 150 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఢిల్లీ జూన్ వర్షాల్లో ఇది కొత్త రికార్డు అని అధికారులు అంటున్నారు. #WATCH | Drone visuals from ITO in Delhi show the current situation in the area as it remains waterlogged due to incessant heavy rainfall.(Visuals shot at 10 am) pic.twitter.com/nkN7DDxHwm— ANI (@ANI) June 28, 2024#WATCH | Severe waterlogging in different parts of Delhi, following incessant heavy rainfall.(Visuals from Raisina road and Firozeshah road) pic.twitter.com/HdVpxBFPaR— ANI (@ANI) June 28, 20241936లో జూన్ 28వ తేదీన 235.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, నిన్న కురిసిన వర్షం రెండో అత్యధికం అనేది అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది. #WATCH | People wade through water as incessant rainfall causes waterlogging in parts of Delhi; visuals from Mehrauli Badarpur Road pic.twitter.com/pcMa0eTQzC— ANI (@ANI) June 28, 2024#WATCH | Roads in several parts of Delhi inundated after heavy rainfall overnight(Visuals from Shanti Path) pic.twitter.com/mIBlFtJnGw— ANI (@ANI) June 28, 2024#WATCH | Waterlogging witnessed at several parts of Delhi following heavy rain(Visuals from Moti Bagh) pic.twitter.com/XLV1xs7YyW— ANI (@ANI) June 28, 2024 #WATCH | Heavy overnight rainfall leaves several parts of Delhi waterlogged. Visuals from Mandawali area. pic.twitter.com/UBUCidfoOS— ANI (@ANI) June 28, 2024#WATCH | A truck submerged as incessant rainfall causes severe waterlogging in parts of Delhi. (Visuals from Minto Road) pic.twitter.com/tc2DJQpSVX— ANI (@ANI) June 28, 2024శుక్రవారం వేకువజామున ఈదురు గాలుల వాన ధాటికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిపోయింది. ఘటనలో కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురు అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు మొదలయ్యాయి. ఫైర్ సిబ్బంది క్షతగాత్రుల్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఆరుగురికి గాయాలయ్యాయని, అందులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.శుక్రవారం ఉదయం 5.30గం. ప్రాంతంలో ఘటన జరిగిందని సమాచారం వచ్చిందని, వాళ్లను రక్షించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించామని ఫైర్ విభాగం డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండడంతో.. టెర్మినల్ వద్ద కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. #WATCH | Latest visuals from Terminal-1 of Delhi airport, where a roof collapsed amid heavy rainfall, leaving 6 people injured pic.twitter.com/KzxvkVHRGG— ANI (@ANI) June 28, 2024 #UPDATE | 6 people injured after a roof collapsed at Terminal-1 of Delhi airport: Atul Garg, Fire Director https://t.co/r0ikZqMq9N— ANI (@ANI) June 28, 2024మరోవైపు ఈ ఘటనసహాయక చర్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఎక్స్ ద్వారా తెలియజేశారు. Personally monitoring the roof collapse incident at T1 Delhi Airport. First responders are working at site. Also advised the airlines to assist all affected passengers at T1. The injured have been evacuated to hospital. Rescue operations are still ongoing.— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 28, 2024 -
రష్యన్ మహిళకు వింత అనుభవం : రీల్ తెచ్చిన తంటానేనా?
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రష్యాకు చెందిన మహిళాప్రయాణీకురాలికి చేదు అనుభవం ఎదురైంది. రష్యన్ ట్రావెల్ వ్లాగర్ దినారాకు బోర్డింగ్ పాస్‌పై ఒక పాస్‌పోర్ట్ అధికారి ఫోన్ నంబర్‌ను రాసి ఇవ్వడంతో పాటు మళ్లీ ఇండియాకు వచ్చినప్పుడు కాల్ చేయాలని పేర్కొన్నాడన్న ఆరోపణలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని దినారా సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.ఢిల్లీ విమానాశ్రయంలోని పాస్‌పోర్ట్ కంట్రోల్ ఆఫీసర్ తన బోర్డింగ్ పాస్‌పై అతని ఫోన్ నంబర్‌ను రాసి, నెక్ట్స్ టైం వచ్చినపుడు సంప్రదించాలని పేర్కొన్నట్టు దినారా వీడియోలో ఆరోపించింది. దీనికి సంబంధించిన బోర్డింగ్ పాస్‌ను కూడా చూపించింది. ‘‘అరే యార్, ఈ ప్రవర్తన ఏమిటి?" అంటూ ప్రశ్నించింది. అంతేకాదు దీనిపై ఇది సరి అయినదేనా అంటూ పోల్ కూడా నిర్వహించింది.అయితే ఆ అధికారి ఎవరు అనేది స్పష్టంగా వెల్లడించలేదు. అటు అధికారులనుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol)అయితే, దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా గతవారం ఇండియన్ భర్త కావాలంటూ ఇటీవల ఆమె చేసిన రీల్‌ను కొంతమంది గుర్తుచేసుకున్నారు. బహుశా అందుకే సదరు ఆ అధికారి అలా చేసి ఉంటాడని పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో, దినారా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని QR కోడ్‌తో పాటు, "లుకింగ్ ఫర్ ఏ ఇండియన్ హస్బెండ్" అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేసింది. గోడపై పోస్టర్ అతికిస్తున్న ఈ చిన్న క్లిప్‌కు మూడు మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol) భారతదేశంలో పర్యటిస్తూ తన అనుభవాలతో వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంద్వారా పాపులర్ అయింది దినారా. ప్రస్తుతం స్వదేశానికి వెళ్లి పోయింది. మాస్కో నుండి ఇన్‌స్టా స్టోరీలను పోస్ట్ చేస్తోంది. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.35 కోట్ల హెరాయిన్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు రూ. 35 కోట్ల విలువైన 5 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎవరి కంట పడకుండా హెరాయిన్‌ను లగేజ్ బ్యాగ్‌లో దాచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు నిందితులు. స్కానింగ్ మిషన్‌లో లగేజ్ బ్యాగ్ పెట్టకుండా తప్పించుకునేందుకు యత్నించారు. అయితే కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా స్మగర్లను పట్టుకోవడంతో డ్రగ్స్ సీజ్ చేశారు. -
గొప్పగా మాట్లాడి వస్తే ఇలాగేనా చెక్ చేసేది ?
న్యూఢిల్లీ: పాక్ బాలికల విద్య, హక్కుల ఉద్యమకారిణి మలాలా యూసఫ్జాయ్లాగా తానేమీ స్వదేశం వదిలిపోలేదని, సొంత కశ్మీర్లో హాయిగా ఉన్నానంటూ బ్రిటన్ పార్లమెంట్ భవనంలో ప్రసంగించిన కశ్మీర్ యువతి యానా మిర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్రిటన్ నుంచి విమానంలో తిరిగొచ్చాక ఆమె బ్యాగులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తనిఖీచేయడమే ఆమె ఆగ్రహానికి లోనయ్యారు. బ్రిటన్‌లో భారత్ గురించి గొప్పగా ప్రసంగించిన నాలాంటి వ్యక్తిని ఇలాగేనా అవమానించేది?. ఖరీదైన లూయిస్ విట్టన్ బ్రాండ్ షాపింగ్ ఖాళీ సంచులు తెచి్చనందుకే బిల్లులు ఎగ్గొట్టిన దొంగలా చూస్తున్నారు. నన్ను వాళ్లు ఇండియా మీడియా యోధురాలిగా భావిస్తే మీరేమో ఇక్కడ నన్ను బ్రాండ్ స్మగ్లర్లా భావించి పరువు తీస్తున్నారు’’ అని అధికారులతో స్వరం పెంచి మాట్లాడారు. అధికారులతో వాగ్వాదం తాలూకు వీడియోను స్వయంగా కెమెరాతో షూట్‌చేసి ‘ఎక్స్’లో షేర్చేశారు. దీనిపై ఢిల్లీ కస్టమ్స్ అధికారులు వివరణ ఇచ్చారు. ‘‘ అంతర్జాతీయ ప్రయాణికుల బ్యాగులను స్కానింగ్ చేయడం సర్వసాధారణం. గౌరవం చట్టాలకు అతీతం కాదు. బ్యాగ్ స్కానింగ్‌కు ఆమె ఒప్పకోలేదు’ అని అన్నారు. -
రిపబ్లిక్ డే వేడుకలు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఆంక్షలు
న్యూఢిల్లీ: జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించింది. రిపబ్లిక్ డే సన్నాహాల కారణంగా జనవరి 19 నుంచి 26 వరకు ఉదయం 10.20 గంటల నుంచి 12.45 వరకు విమానాల టేకాఫ్, ల్యాండింగ్లను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పౌరవిమానయానశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఒకటి. రిపబ్లిక్‌డే వేడకల కోసం రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసారి వేడుకల్లో తొలిసారి సరిహద్దు భద్రతా దళానికి(బీఎస్ఎఫ్) చెందిన మహిళా అధికారులతో మార్చ్ నిర్వహించనున్నారు. అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ మహిళా అధికారితోపాటుఇద్దరు సబార్డినేట్ ఆఫీసర్లు.. మొత్తం 144 మంది మహిళా BSF కానిస్టేబుళ్లకు నాయకత్వం వహించనున్నారు. గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో నిఘా పెంచారు. కాగా భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ముస్తాబవుతోంది. జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో నిర్వహించే ఈ భారీ పరేడ్‌కు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిని ప్రధాని మోదీ ఆహ్వానించగా.. ఇందుకు మెక్రాన్ కూడా అంగీకరించారు. దీనిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ‘నా ప్రియమైన మిత్రుడు మోదీ.. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. మీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీతో వేడుకలను జరుపుకోవడానికి నేను వస్తున్నాను’ అని పేర్కొన్నారు. చదవండి: బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ -
Video: ఏడు గంటలు ఆలస్యంగా విమానం.. ప్రయాణికులు రచ్చ రచ్చ!
ఢిల్లీ: విమానం ఆలస్యం కావడంపై ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులు రచ్చ రచ్చ చేశారు. సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. ఏకంగా ఏడు గంటలు విమానం ఆలస్యం గురించి తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని పేర్కొంటూ సహనం కోల్పోయిన ప్రయాణికులు సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పైస్‌జెట్‌కు చెందిన SG-8721 విమానం ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సి ఉంది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు రావాల్సి ఉంది. కానీ ఏకంగా ఏడు గంటలు ఆలస్యంతో విమానాశ్రయానికి వచ్చింది. దీంతో సహనానికి కోల్పోయిన ప్రయాణికులు సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఆలస్యం గురించి తమకు ముందే ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగారు. మధ్యాహ్నం 3:00 సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. #WATCH | Delhi | "Today at about 3:10 pm, it came to notice that a group of passengers bound for Patna by Spicejet airline flight no. SG-8721/STD were creating nuisance at domestic boarding gate 54. On query, it was learnt that the flight was delayed for more than 7 hrs as the… pic.twitter.com/bugwhjdYOK — ANI (@ANI) December 1, 2023 ప్రయాణికుల ఆందోళనలతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది వారిని అదుపు చేశారు. విమానం ఆలస్యం కావడంపై ఎయిర్‌లైన్స్ కూడా స్పందించింది. నిన్న రాత్రి షెడ్యూల్లో మార్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఆలస్యంపై ముందుగానే ప్రయాణికులకు తెలియజేశామని స్పష్టం చేసింది. దీని ప్రకారం తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని ప్రయాణికులను ఇప్పటికే కోరామని ఓ ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం ప్రారంభం -
ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్
-
ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్ చీఫ్.. ఫోక్ సాంగ్‌కు డ్యాన్సులు..
ఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు గురువారం దేశ రాజధానికి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న ఆమెకు దేశవాళీ నృత్య ప్రదర్శనతో ఘనస్వాగతం పలికారు. సంబల్పురి పాటపై సాంప్రదాయ జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సాంస్కృతిక ప్రదర్శనను జార్జివా మెచ్చుకున్నారు. స్వయంగా ఆమె కూడా డ్యాన్సర్లతో పాటు కాలు కదిపారు. స్టేజీ కింద నుంచి నృత్య ప్రదర్శనను చూసిన జార్జివా.. ఒకానొక దశలో డ్యాన్సర్లతో పాటే కాలు కదిపారు. నవ్వులు చిందిస్తూ చప్పట్లతో కళాకారులను మెచ్చుకున్నారు. ఈ వీడియోను కేంద్ర మంత్రి ధర్మెంద్ర ప్రధాన్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పంచుకున్నారు. సంబల్పురి బీట్స్‌ను ఆపడం కష్టం అని యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. Difficult to resist #Sambalpuri beats . MD International Monetary Fund Ms. @KGeorgieva arrives in India for #G20 summit to a #Sambalpuri song and dance welcome . #OdiaPride pic.twitter.com/4tx0nmhUfK — Dharmendra Pradhan (@dpradhanbjp) September 8, 2023 ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది. గంటల వ్యవధిలోనే 19 వేల వ్యూస్ వచ్చాయి. వేలల్లో లైకులు కొట్టారు నెటిజన్లు. ఒడియా నృత్య కళాకారులను మెచ్చుకున్నారు. వీడియో చాలా బాగుందని కామెంట్లు వచ్చాయి. జీ20 వేదికైన భారత్‌కు దేశ విదేశాల నుంచి నేతలు నేడు ఢిల్లీకి వచ్చారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇప్పటికే దేశ రాజధానిలో అడుగు పెట్టారు. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఢిల్లీలో విదేశీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదీ చదవండి: జీ-20: కోవిడ్ కారణంగా మరో నేత మిస్.. పుతిన్, జిన్‌పింగ్ సహా.. -
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘోరప్రమాదం తప్పింది
ఢిల్లీ: బుధవారం మధ్యాహ్నాం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘోరప్రమాదం తప్పింది. విస్తారా ఎయిర్‌లైన్స్‌కే చెందిన రెండు విమానాలు ఒకే రన్‌వేలో ఎదురెదురుగా వచ్చాయి. కాస్తుంటే అవి రెండూ ఢీ కొట్టుకుని పెను విషాదం చోటు చేసుకునేది. అయితే ఓ విమానంలోని మహిళా పైలట్ అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి చేరిన విస్తారా విమానం.. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పర్యవేక్షణలో పార్కింగ్ బే వైపు చేరుకునేందుకు సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో ఢిల్లీ-బాగ్డోగ్రా(పశ్చిమ బెంగాల్) విస్తారా విమానానికి అదే రన్‌వే నుంచి టేకాఫ్‌కు అనుమతిచ్చారు. అయితే రెండు విమానాలు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అహ్మదాబాద్-ఢిల్లీ ఫ్లైట్‌లో ఉన్న కెప్టెన్ సోనూ గిల్(45) జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను అప్రమత్తం చేశారు. దీంతో.. ఘోర ప్రమాదం తప్పింది. ఆ వెంటనే టేకాఫ్ రద్దు చేసి.. ఢిల్లీ-బాగ్డోగ్రా విమానాన్ని తిరిగి పార్కింగ్ వైపు మళ్లించారు. రెండు విమానాల్లో కలిపి 300 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. అది ఈ మధ్యే ప్రారంభమైన రన్‌వే. ఒకవేళ ఆమె(సోనూ గిల్) గనుక అప్రమత్తం చేయకుండా ఉండి ఉంటే ఘోర ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు. ఏటీసీ అధికారి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని డీజీసీఏ(పౌర విమానయాన శాఖ) ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు సంబంధిత అధికారిని విధుల నుంచి తప్పించినట్లు ప్రకటించింది. A potentially catastrophic incident was narrowly averted at #Delhiairport on Wednesday morning when a #Vistara Airlines plane was cleared for take-off while another aircraft was in process of landing. The incident involved Flight UK725 en route from #Delhi to #Bagdogra,… pic.twitter.com/5GnT7RixLF — Thomas Nahar (@Thomasnahar_gfx) August 23, 2023 -
సూడాన్ టూ భారత్.. ఆనందంలో బాధితులు..
న్యూఢిల్లీ: సూడాన్ నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించే ‘ఆపరేషన్ కావేరి’ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో భారతీయులు స్వదేశం చేరుకున్నారు. కేంద్రం భారత వాయుసేన, నావికా దళాల ద్వారా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేరుస్తున్నది. కాగా, ఆపరేషన్ కావేరిలో భాగంగా సూడాన్ నుంచి దాదాపు ఆరువేల మంది భారతీయులు స్వదేశం చేరుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా భారతీయులను సూడాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌కు చేరుస్తున్నది. ఇప్పటికే పలువురు స్వదేశానికి వచ్చేయగా తాజాగా మరో 231 మంది వాయు మార్గంలో ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో భారత్ చేరుకున్న వారి సంఖ్య 6వేలకు చేరుకుంది. ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి వందకు పైగా మందిని తరలించే క్రమంలో తెగువ ప్రదర్శించారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లు. జెడ్డాకు చేరుకునే క్రమంలో పోర్ట్ ఆఫ్ సూడాన్‌కు 121 మందితో కూడిన భారతీయ పౌరుల బృందం చేరుకోవాల్సి ఉంది. అయితే.. చేరుకునే మార్గం లేక వాడి సయ్యద్నా చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న ఏఐఎఫ్ రంగంలోకి దిగింది. వాళ్లను తరలించేందుకు C-130J హెర్క్యులస్‌తో బయల్దేరింది. అయితే.. వాడి సయ్యద్నాలో ఉన్న చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండింగ్‌కు అనుకూలంగా లేని పరిస్థితి. దీంతో.. పైలట్లు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. నైట్ విజన్ గాగుల్స్ సాయంతో ఏమాత్రం తప్పిదం లేకుండా ఎయిర్‌ఫోర్స్ పైలెట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ను చాకచక్యంగా ల్యాండ్ చేశారు. #WATCH | Another flight carrying 231 Indian passengers reaches New Delhi. They have been evacuated from conflict-torn Sudan.#OperationKaveri pic.twitter.com/oESNze3YPd — ANI (@ANI) April 29, 2023 ఇది కూడా చదవండి: సరిహద్దులో సాధారణ స్థిరత్వం: చైనా విదేశాంగ మంత్రి -
విమానం టేకాఫ్ ఆలస్యం.. ప్రయాణికులు, సిబ్బంది మధ్య రచ్చ
ఇటీవల కాలంలో పలు విమానాల్లో అనుచిత ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. విమానాల్లో సాంకేతిక లోపాలు, ప్రయాణికుల అసభ్య ప్రవర్తన వంటివి ఆందోళన రేపుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరోటి చేరింది. విమానం టేకాఫ్ ఆలస్యం కావడంతో ప్రయాణికులకు సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగింది. ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సిన 8721 స్పైస్ జెట్ విమానం షెడ్యూల్ ప్రకారం ఉదంయ 7.20 గంటలకు టెర్మినల్ 3 నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే దాదాపు మూడు గంటలు ఆలస్యంగా అంటే 10.10 గంటలకు బయల్దేరింది. అయితే ముందుగా వాతావరణం అనుకూలించడంతో విమానం టేకాఫ్‌కు ఆలస్యం అవుతోందని ఎయిర్‌లైన్ సిబ్బంది ప్రయాణికులకు తెలియజేశారు. అనంతరం కొద్ది సమాయానికి సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యం అవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో విమానంలోకి ఎక్కి రెండున్నర గంటలకు పైగా నిరీక్షించిన ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. విమానం బయలుదేరడంలో ఆలస్యం కావడంపై విమానాశ్రయంలోని ఎయిర్‌లైన్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. చివరకు ఉదయం 10.10 గంటలకు ఆ విమానం టేకాఫ్ అయ్యింది. చదవండి: వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్‌పై రూ.2 సెస్..ఎక్కడంటే? -
ఏం తెలివిరా నాయనా! ఏకంగా రూ. 64 లక్షలు..
విమానాశ్రయంలో తరుచుగా అక్రమంగా బంగారం, జంతువులు, డబ్బులు తరలిస్తున్న ఘటనలు గురించి విని ఉన్నాం. అదీకూడా వాళ్లకు ఊహకందని విధంగా భలే విచిత్రమైన రీతిలో తరలించిన ఉదంతాలను చూశాం. వాటన్నింటికి మించి అన్నట్లుగా ఇక్కడొక వ్యక్తి ట్రాలీ బ్యాంగ్ హ్యండిల్లో నగదును తరలించాలని చూసి పట్టుబడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుందర్ సింగ్ రిహాల్ అనే వ్యక్తి చెకింగ్ సమయంలో అతని వద్ద సరైన విధంగా డాక్యుమెంట్స్ లేకపోవడంతో అతన్ని ఆపారు. ఆ తర్వాత అతన్ని తనిఖీ చేస్తుండగా అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో.. అధికారుల కస్టమ్స్ అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ స్కాన్ చేయగా ట్రాలీ బ్యాగులో ఏదో ఉన్నట్లు చూపించడంతో ఇంకా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో ట్రాలీ హ్యండిల్లో దాచిన విదేశీ కరెన్సీని నెమ్మదిగా బయటకు తీశారు. ఏకంగా మొత్తం రూ. 65 లక్షలు తరలించేందకు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు. అందులో సుమారు రూ. 60 లక్షలకు సంబంధించి సుమారు 68 వేల యూరోల కరెన్సీ, రూ. 4లక్షలకు సంబంధించిం న్యూజిలాండ్‌కి చెందిన 5 వేల డాలర్లు ఉన్నాయని చెప్పారు. ఐతే నిందితుడు భారీ మొత్తంలో అంత నగదు తరలించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడంలో విఫలమయ్యాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీంతో అతని వద్ద నుంచి భారీ మొత్తంలో ఉన్న ఆ నగదును స్వాధీనం చేసుకోవడమే గాక అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ ప్రయాణికుడు థాయ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ టీహెచ్-332లో బ్యాంకాక్‌కు వెళ్లాల్సి ఉంది. #CISF personnel detected foreign currency (Euro & New Zealand Dollars) worth approx INR 64 lakh concealed inside handle of Trolley Bag at IGI Airport.@CISFHQrs @HMOIndia @PMOIndia @UpendrraRai @BhaaratExpress @AAI_Official @DelhiAirport pic.twitter.com/ERRNZjRCVl — Mitalli Chandola 🇮🇳 (@journomitalli1) January 29, 2023 (చదవండి: చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్) -
విమానంలో మందుబాబుల హల్చల్.. ఎయిర్‌హోస్టస్‌తో అసభ్యకరంగా..
పట్నా: భారతీయ విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలు మరువకముందే ఆదివారం మరో ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఢిల్లీ నుంచి పట్నాకు వస్తున్న ఇండిగో విమానంలో తప్పతాగిన ఇద్దరు ప్రయాణికులు ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించారని వార్తలొచ్చాయి. విమాన సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులతోనూ గొడవ పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, వీరు విమానంలో పట్నాకు వస్తున్నట్లు ఇండిగో సంస్థ ఫిర్యాదుచేయంతో పట్నాలో దిగగానే పట్నా ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ అధికారులు అరెస్ట్‌చేశారు. ప్రస్తుతం బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉన్నందున మద్యసేవనం రాష్ట్రపరిధిలో నేరం. మద్యం తాగి బిహార్‌లో అడుగుపెట్టినందుకే కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. విమానంలో వీరు తోటి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్లు అధికారంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేసే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌పై డీజీసీఏ సీరియస్ న్యూఢిల్లీ: పారిస్–న్యూఢిల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనపై వివరణ ఇవ్వాలని సంస్థను డీజీసీఏ సోమవారం ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్ ఆరున జరిగిన రెండు ఘటనలను అందులో ప్రస్తావించింది. సిబ్బంది సూచనలను లెక్కచేయకుండా బాత్రూమ్లో ధూమపానం చేస్తున్న వ్యక్తిపై, తోటి ప్రయాణికురాలి సీటు, దుప్పటిపై మూత్రవిసర్జన చేసిన మరో తాగుబోతు ప్రయాణికుడిపై అప్పుడే వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలని డీజీసీఏ సూచించింది. ‘ ఏదైనా విమానంలో అనుకోని ఘటన జరిగితే ల్యాండింగ్ జరిగిన 12 గంటల్లోపు మాకు నివేదించాలి. కానీ డిసెంబర్ ఆరున ఘటన జరిగితే జనవరి ఆరున మేం అడిగేదాకా ఆనాటి ఘటనపై సంస్థ ఎలాంటి రిపోర్ట్చేయలేదు. అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికుల విషయంలో మీ వైఖరి నిబంధనలకు అనుగుణంగా లేదు. రెండు వారాల్లోపు నివేదించండి. తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని డీజీసీఏ పేర్కొంది. -
ఈ ప్రయాణం నరకప్రాయం!
ప్రయాణమంటే... సుఖవంతంగా సాగాలని కోరుకుంటాం. సుఖంగా, సౌకర్యంగా, సత్వరంగా, సకాలంలో చేరడం కోసమే విమాన ప్రయాణాలను ఎంచుకుంటాం. కానీ, మన దేశంలో ఇప్పుడు అవి నరకప్రాయంగా మారుతున్నాయా? కొండవీటి చేంతాడంత క్యూలు... బోర్డింగ్ కోసం గంటల కొద్దీ నిరీక్షణ... చీకాకుపరిచేటన్ని చెకింగ్లు... నిలిచే జాగా లేని రద్దీ... ఎటుచూసినా లగేజ్... ట్రాలీల కొరత... విమానాల జాప్యం... ఇదీ ఇప్పుడు పరిస్థితి. రోజూ 1200 విమానాలతో, ఏటా 6.9 కోట్ల ప్రయాణికులతో దేశంలోకెల్లా బిజీగా ఉండే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత వారంగా ఇవే దృశ్యాలు. ఎయిర్పోర్ట్ కాస్తా చేపల బజారులా తయారైందంటూ ఫోటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. సాక్షాత్తూ పౌర విమానయాన మంత్రి సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకొని, రద్దీ నివారణ చర్యలపై చర్చించాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా విమానాశ్రాయాల్లోని లోటుపాట్లపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ప్రస్తుతం గంటలో గమ్యం చేరే దేశీయ విమాన ప్రయాణికులు సైతం గడువు కన్నా కనీసం మూడున్నర గంటల ముందే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రిపోర్ట్ చేయాల్సిన దుఃస్థితి. వేరే లగేజ్ లేకుండా, 7 కిలోల హ్యాండ్ బ్యాగేజీ ఒక్కటే తెచ్చుకొమ్మని ఇండిగో లాంటి విమానయాన సంస్థలు సూచి స్తున్న పరిస్థితి. దేశంలోకెల్లా అతి పెద్దదైన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టీ1, టీ2, టీ3 అని మూడు టెర్మినల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు కొన్ని దేశీయ సర్వీసులూ టీ3 నుంచే నడు స్తుంటాయి. తాజా పరిణామాలతో రద్దీ ఎక్కువగా ఉండే కీలక సమయాలైన ఉదయం, సాయంత్ర వేళల్లో విమానాల సంఖ్యను తగ్గించాలనే యోచన చేస్తున్నారు. కొన్ని సర్వీసులను టీ3 నుంచి ఇతర టెర్మినల్స్‌కు మార్చాలని భావిస్తున్నారు. అయితే, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. పది రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామంటున్న మంత్రివర్యులు దృష్టి పెట్టాల్సింది శాశ్వత పరిష్కారాలపైన! ఒక్క ఢిల్లీలోనే కాదు... పుణే, ముంబయ్, బెంగళూరుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. హైదరాబాద్‌లో సైతం మొన్నటిదాకా వేర్వేరుగా ఉన్న జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల నిష్క్రమణ మార్గాన్ని ఇటీవల టెర్నినల్ విస్తరణ కోసమంటూ ఒకేచోటకు మార్చారు. అలా ఒకేచోట జనం కేంద్రీకృతమై, ఒత్తిడి పెరిగినట్లు వార్త. ప్రపంచీకరణతో పెరుగుతున్న రద్దీకి తగ్గట్టు కొన్నేళ్ళుగా దేశంలో పలు విమానాశ్రయాల ఆధునికీకరణ సాగింది. తీరా ఢిల్లీ వ్యవహారంతో అవన్నీ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జరగలేదని అనుమానం కలుగుతోంది. కొత్తగా గోవాలో మోపా వద్ద కట్టిన ఎయిర్ పోర్ట్ యాత్రిక సామర్థ్యం 44 లక్షలే. అది ఇప్పటికే ఉన్న డాబోలిమ్ ఎయిర్పోర్ట్ కన్నా తక్కువ సత్తా కావడం విడ్డూరం. అనేక దేశాల్లో కోవిడ్ నిర్బంధాలు ఎత్తివేసేసరికి దేశీయంగా, అంతర్జాతీయంగా కసికొద్దీ ప్రయాణాలు చేయడం పెరిగింది. ఇబ్బడిముబ్బడైన ఈ జనంతో ఎయిర్‌పోర్టుల్లో, ఎయిర్‌లైన్స్‌లో ఇప్పుడున్న వసతులపై ఒత్తిడి అధికమైంది. గత ఆదివారం ఒక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచే 4.27 లక్షల మందికి పైగా ప్రయాణించారనేది పరిస్థితికి చిరు సూచన. కోవిడ్ నిబంధనలు ఎత్తేశాక ఈ ఏడాది జూలైలో యూరప్‌లోని పలు విమానాశ్రయాల్లో ఇలాంటి గందరగోళమే నెలకొంది. లండన్‌లోని ప్రసిద్ధ హీత్రూ విమానాశ్రయంలోనూ ఇదే కథ. కరోనా కాలంలో విస్తరణ ప్రణాళిక లకు బ్రేకులు పడ్డ విమానాశ్రయాలు ఇప్పుడు మళ్ళీ ఆ పనులను పట్టాలెక్కించాల్సి ఉంది. ప్రయాణికుల చెకింగ్ పద్ధతి ప్రకారం సాగకపోవడం, విమానాశ్రయ అధికారుల్లో అలసత్వం లాంటి కారణాలతో ఢిల్లీలో గందరగోళం నెలకొంది. ఎయిర్‌లైన్స్ చెక్–ఇన్ కౌంటర్లలో సిబ్బంది లేకపోవడం, ఉన్నా అరకొరగా ఉండడం రద్దీకి దారి తీస్తోంది. సెక్యూరిటీ చెక్ చేయాల్సిన నిపుణు లైన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బంది కూడా తక్కువున్నారు. సీఐఎస్ఎఫ్ ఉద్యోగాలను 3 వేలకు పైగా రద్దు చేసి, వాటి స్థానంలో అనుభవం లేని 2 వేల కన్నా తక్కువ ప్రైవేట్ భద్రతా సిబ్బందిని పెట్టడం లాంటి స్వీయ తప్పిదాలు సవాలక్ష. వీటిని తక్షణం సరిదిద్దాలి. బ్యాగేజ్, బిల్లింగ్ నుంచి బోర్డింగ్ దాకా అన్నిటా 5జి సహా ఆధునిక సాంకేతికతను ఆశ్రయించడం ఓ మార్గం. అంతర్జాతీయ ప్రయాణం చేసి వస్తున్నవారి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ఇప్పటికీ గంటన్నర నుంచి రెండు గంటలు పడుతోంది. ప్రస్తుతానికి విమానంలోనే వివరాలు నింపే పద్ధతి పెడతా మంటున్నా, డిజిటలీకరణ మంచి పరిష్కారం. సంవత్సరాంతపు సెలవులు, పండగలతో రానున్నది ప్రయాణాల కాలం. దాంతో, రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది సరైన వ్యూహరచన, ప్రణాళికాబద్ధంగా ప్రాథమిక వసతులు. కౌంటర్లనూ, సిబ్బందినీ పెంచాలి. స్మార్ట్ సిటీల్లా స్మార్ట్ ఎయిర్‌పోర్ట్‌లు కావాలి. ప్రపంచశ్రేణి టెర్మినల్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికైనా ఢిల్లీ, హైదరాబాద్, ముంబయ్ – ఇలా ఊరికో రకం కాక అన్నిచోట్లా ఒకే ప్రామాణిక సెక్యూరిటీ ప్రోటోకాల్ తేవాలి. ముఖం చూసి గుర్తించే బయోమెట్రిక్ పద్ధతే అదే బోర్డింగ్ పాస్‌గా ‘డిజి యాత్ర’ విధానాన్ని ఇటీవలే 3 ఎయిర్‌పోర్టుల్లో తెచ్చారు. మొక్కుబడిగా కాక దాన్ని అన్నిచోట్లా విస్తరించడం, అవగాహన పెంచడం అవసరం. ప్రపంచంలోని 10 రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీ, ముంబయ్ చేరనున్న వేళ ఇలాంటి క్షేత్రస్థాయి అంశాలపై శ్రద్ధ కీలకం. అలసత్వం వహిస్తే, పదేపదే ఢిల్లీ కథే! -
వామ్మో.. ఈ వాచ్ విలువ ఇన్ని కోట్లా? పోలీసులకు చిక్కడంతో..!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల నుంచి అక్రమంగా విలువైన వస్తువులను తీసుకొస్తుంటే కస్టమ్స్ అధికారులు పసిగట్టి పట్టేస్తుంటారు. అలాంటి సంఘటనే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం జరిగింది. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? పోలీసులు పట్టుకున్న చేతి గడియారాల విలువ తెలిస్తే.. ఆశ్చర్యపోవటం మీ వంతవుతుంది. మొత్తం ఏడు గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వజ్రాలు పొదిగిన వైట్ గోల్డ్ వాచ్ విలువ ఏకంగా రూ.27 కోట్లు ఉంటుందటా.. అత్యంత విలువైన ఏడు చేతి గడియారాలని అక్రమంగా తీసుకొస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టేశారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద విలువైన గడియారాలతో పాటు వజ్రాలు పొదిగిన బ్రెస్లెట్, ఐఫోన్ 14ప్రోను సైతం సీజ్ చేశారు. లగ్జరీ వస్తువులకు పన్నులు, ఇతర సుంకాలు చెల్లించకుండానే దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా జువెలరీ, వాచ్ తయారీ సంస్థ జాకబ్ అండ్ కో.. తయారు చేసిన ఓ వాచ్‌లో విలువైన వజ్రాలు పొదిగారని, అది సంపన్నులు మాత్రమే ధరిస్తారని అధికారులు తెలిపారు. మొత్తం పట్టుబడిన వస్తువుల విలువ రూ.28 కోట్లకుపైగా ఉంటుందని, ఈ స్థాయిలో పట్టుకోవటం ఇదే తొలిసారిగా వెల్లడించారు. 60 కిలోల బంగారంతో సమానమని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘ఎల్జీ సాబ్ జస్ట్ చిల్.. మీలా నా భార్య సైతం చేయలేదు’.. కేజ్రీవాల్ ట్వీట్ -
స్పైస్‌జెట్ నిర్లక్ష్యం.. విమానం వద్దే ప్రయాణికుల పడిగాపులు!
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయంలో దిగాక బస్సు ఏర్పాటు చేయకపోవటం వల్ల సుమారు 45 నిమిషాల పాటు అక్కడే నిరీక్షించారు. ఎంతకూ బస్సు రాకపోవటంతో చాలా మంది తమ లగేజీని పట్టుకుని కాలినడకన టర్మినల్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 186 మంది ప్రయాణికులతో వెళ్లిన స్పైస్‌జెట్ విమానం శనివారం రాత్రి 11.24 గంటలకు హస్తినలో దిగింది. వెంటనే ఓ బస్సు వచ్చి కొంత మందిని టర్మినల్‌కు తీసుకెళ్లింది. మిగిలిన వారు సుమారు 45 నిమిషాలు అక్కడే వేచి ఉన్నారు. బస్సు రాకపోవటంతో అక్కడి నుంచి టర్మినల్ వైపు నడక ప్రారంభించారు. 11 నిమిషాలు నడిచాక 12.20కి బస్సు వచ్చి వారిని తీసుకెళ్లినట్లు కొందరు ప్రయాణికులు తెలిపారు. ఈ విషయంపై స్పైస్‌జెట్ వివరణ ఇచ్చింది. బస్సు రావటానికి కాస్త ఆలస్యం అయిందని, ఆ తర్వాత విమానం వద్ద ఉన్న ప్రయాణికులతో పాటు నడక ప్రారంభించిన వారందరినీ బస్సులో ఎక్కించుకుని టర్మినల్‌కు చేర్చినట్లు తెలిపింది. ‘మా సిబ్బంది ఎన్నిసార్లు సూచించినా కొందరు టర్మినల్ వైపు నడిచారు. బస్సులు వచ్చే సరికి కొంత దూరం వెళ్లారు. వారితో పాటు మిగిలిన వారందరిని బస్సుల్లో టర్మినల్ చేర్చాం.’ అని పేర్కొంది స్పైస్‌జెట్. How often do you see this happening at T3 of the Indira Gandhi International Airport in New Delhi? @flyspicejet kept up cooked up for 45 minutes after announcing “early arrival” of 6 mins at 11:24pm on the SG 8108 Hyd-Delhi. They parked the flight really far away with no buses. pic.twitter.com/sgkR9gXs3Y — Lasya Nadimpally (@nlasya) August 6, 2022 ఇదీ చదవండి: ‘ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలం’.. ఇస్రో అధికారిక ప్రకటన -
45 తుపాకులతో విమానం దిగిన జంట.. అధికారుల షాక్
ఢిల్లీ: బ్యాగుల నిండా తుపాకులతో దేశంలోకి వచ్చిన ఇద్దరు భారతీయులను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. ఆ పిస్తోళ్లు నకిలివా, నిజమైనవా అని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) అవి నిజమైన తుపాకులేనని తెలిపారు. అరెస్టయిన ఇద్దరు జగ్జిత్ సింగ్, జస్విందర్ కౌర్‌లుగా గుర్తించారు అధికారులు. వారిద్దరినీ భార్యాభర్తలుగా నిర్ధారించారు. కాగా, వారిద్దరూ జూలై 10న వియాత్నం నుంచి భారత్‌కు వచ్చారు. జగ్జిత్ సింగ్ తీసుకొచ్చిన రెండు ట్రాలీబ్యాగుల్లో 45 తుపాకులు లభించాయి. వాటిని అతడి సోదరుడు మంజిత్ సింగ్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. జగ్జిత్ సింగ్ ఫ్రాన్స్‌లోని ప్యారీస్ నుంచి వియాత్నంకు వచ్చిన క్రమంలో ఆ ట్రాలీ బ్యాగులను మంజిత్ సింగ్‌కు ఇచ్చాడు. అందులోని మొత్తం 45 తుపాకుల విలువ సుమారు రూ.22,50,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గతంలోనూ 25 తుపాకుల చేరవేత.. అయితే, వీరిద్దరూ ఇలా తుపాకులను చేరవేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఓసారి పిస్తోళ్లు తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. టర్కీ నుంచి భారత్‌కు 25 తుపాకులు తెచ్చినట్లు విచారణ సందర్భంగా నిందితులు అంగీకరించారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న అధికారులు తదుపరి విచారణ చేపట్టినట్టు తెలిపారు. Delhi | An Indian couple that arrived from Vietnam was nabbed & 45 guns worth over Rs 22 lakh from two trolley bags seized. They admitted their previous indulgence in smuggling 25 pieces of guns having a value of over Rs 12 lakh: Commissioner of Customs, IGI Airport & General pic.twitter.com/TvjNbJt5yA — ANI (@ANI) July 13, 2022 ఇదీ చూడండి: కోవిడ్ టీకా తీసుకున్నవారికి రూ.5 వేల రివార్డు.. నిజమెంత? -
వణికిపోయిన ఢిల్లీ నగరం.. ఏమా గాలుల వేగం! వీడియోలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలివాన విజృంభించింది. సోమవారం సాయంత్రం కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన ధాటికి జనజీవనం స్తంభించింది. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇక్కట్లుపడ్డారు. విమానాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ల్యాండింగ్ సమస్యను ఎదుర్కొన్నాయి. అధికారుల నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టాయి. ఇక భీకర గాలుల కారణంగా రోడ్డుపై వెళ్తున్న కార్లు సైతం వణికాయి. పార్కింగ్ చేసి ఉన్న వాహనాలపై చెట్లు కూలడంతో ధ్వంసమయ్యాయి. ఏపీ భవన్లో ఈదురు గాలులు బెంబేలెత్తించాయి. గాలుల వేగానికి నగరంలోని పలు కార్యాలయాల్లో అద్దాలు పగలిపోయాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు ట్విటర్లో ట్రెండ్ అయ్యాయి. #WATCH | Bus trapped under an uprooted tree in the aftermath of a hailstorm in Delhi, causing traffic snarls near Sanchar Bhawan. pic.twitter.com/4Z91pAofpR — ANI (@ANI) May 30, 2022 #WATCH | Delhi gets a relief from scorching heat with a heavy downpour & thunderstorm. Visuals from National Media Centre. pic.twitter.com/7ZZuf05GMg — ANI (@ANI) May 30, 2022 #WATCH | Delhi witnesses uprooted trees amidst a heavy rainfall that hit the national capital. Visuals from Bhai Vir Singh Marg. pic.twitter.com/213buZrif2 — ANI (@ANI) May 30, 2022 #WATCH | Delhi: A car trapped under an uprooted tree in Connaught Place as the national capital received sudden rainfall accompanied by hailstorm. The car was unoccupied and was in the parking lot. pic.twitter.com/wdc7QDK2ZY — ANI (@ANI) May 30, 2022 #WATCH | Delhi: Heavy rain and thunderstorm lashed the national capital this afternoon. Visuals from BJP headquarters. pic.twitter.com/k8TDvjAtQy — ANI (@ANI) May 30, 2022 #WATCH | Bus trapped under an uprooted tree in the aftermath of a hailstorm in Delhi, causing traffic snarls near Sanchar Bhawan. pic.twitter.com/4Z91pAofpR — ANI (@ANI) May 30, 2022 -
ఒమిక్రాన్ ఎఫెక్ట్..! భారత్‌కు వస్తోన్న ఎన్నారైలకు తప్పని తిప్పలు..!
ప్రపంచదేశాలను కోవిడ్-19 కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే సుమారు 38 దేశాలకు పాకింది. అందులో భారత్ కూడా చేరింది. దీంతో భారత ప్రభుత్వం ఒక్కసారిగా అలర్టైంది. విదేశాల నుంచి వచ్చే ఎన్నారైలపై, ఇతర దేశస్తులపై ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లను కచ్చితం చేసింది. ఢిల్లీ, ముంబై ఎయిర్పోట్‌లో పడిగాపులు..! విదేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ను కచ్చితం చేయడంతో ప్రయాణికులు కోవిడ్-19 టెస్ట్‌ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో నెగటివ్ వస్తేనే ఆయా ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్‌లనుంచి బయటకు పంపిస్తున్నారు. అయితే ఒక్కో టెస్ట్ ఫలితాలు రావడానికి ఏకంగా 4-6 గంటల సమయం పడుతోంది. దీంతో ఎన్నారైలు, ఇతర దేశస్థులు గంటలపాటు వేచి ఉండాల్సి వస్తోంది. . ఫుల్ క్రౌడ్..నో కోవిడ్ రిస్ట్రిక్షన్స్..! ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లను భారత ప్రభుత్వం కచ్చితం చేయడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు కాస్తోన్న ప్రయాణికుల ఫోటోను ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్షా గోయెంకా ట్విటర్లో షేర్ చేశారు. కోవిడ్ నిబంధనలను పాటించకుండా ఫుల్ క్రౌడ్‌తో నిండిపోయిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ కోవిడ్ హాట్‌స్పాట్‌గా మారే అవకాశం లేకపోలేదని గోయెంకా అభిప్రాయపడ్డారు. Scenes yesterday at Delhi airport #Covid hotspot pic.twitter.com/SoM6RNumYO — Harsh Goenka (@hvgoenka) December 5, 2021 చదవండి: అమెరికా వెళ్తున్నారా? ఈ రూల్స్ పాటించాల్సిందే ! బైడెన్ సర్కార్ కొత్త ఆదేశాలు -
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ను ముంచెత్తిన వరద నీరు
-
‘బలమైన విమానం చీమల చేతచిక్కి ఆగెన్’.. ఎలాగంటే!
న్యూఢిల్లీ: ‘బలవంతమైన సర్పము చలి చీమల చేతచిక్కి చావదె’... అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా! ఆధునిక యుగంలో దీన్ని కాస్త మార్చి ‘బలమైన విమానం చీమల చేతచిక్కి ఆగెన్’ అని చదువుకునే చిత్రమైన సంఘటన జరిగింది. అలాంటి చిత్రమైన ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. లండన్ వెళ్లే ఎయిర్ఇండియా విమానం చీమల కారణంగా కొన్ని గంటలు ఆగింది. బిజినెస్ క్లాసులో చీమల గుంపు కనిపించడంతో టేకాఫ్ ఆపేశారు. (చదవండి: తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!) ప్రయాణికులను మరో విమానంలోకి ఎక్కించి పంపించారు. ఈ విమానంలోనే భూటాన్ యువరాజు జిగ్మే నాంగ్యేల్ వాంగ్‌చుక్ ఉన్నారు. ఎయిర్ఇండియా విమానాలు ఇటీవల కాలంలో చిత్రమైన కారణాలతో ఆలస్యం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలోనూ సౌదీ అరేబియా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సరకు రవాణా విమానాన్ని కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం విండ్ షీల్డ్‌లో పగుళ్లు గుర్తించడమే ఇందుకు కారణం. అంతకుముందు మేలో దిల్లీ నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్‌లో గబ్బిలం ఉన్నట్లు గుర్తించారు. (చదవండి: Karnataka Toddler Swallowed Coin: ఐదు రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కొని) -
రోజుకు 90,000 మంది ప్రయాణం!
ముంబై: ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఈ నెల 1–10 తేదీల్లో రోజుకు 90,000 మంది ప్రయాణించారు. జీఎంఆర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మే నెల మధ్య కాలంతో పోలిస్తే ఇది అయిదురెట్లు అధికం. జూన్ చివరినాటికి ప్రయాణికుల సంఖ్య రోజుకు 62,000లకు చేరింది. కోవిడ్ పరిస్థితి మెరుగుపడడం, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కారణంగా దేశీయ ట్రాఫిక్ 2023 మార్చినాటికి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో ఇందుకు మరో ఏడాది పడుతుంది. జూలైలో 22.9 లక్షల మంది ఢిల్లీ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారు. 2019 జూలైలో ఈ సంఖ్య 58 లక్షలు నమోదైంది. ఈ కాలంతో పోలిస్తే విమాన సర్వీసులు గత నెలలో 45% తగ్గి 20,800 ఉంది. సందర్శనీయ స్థలాలు తెరవడంతో టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశీయ సామర్థ్యంలో 72.5 శాతం స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించింది. చదవండి : జియో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ ఎప్పుడంటే? -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పీవీ సింధుకు ఘనస్వాగతం
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను మరోసారి రెపరెపలాడించిన తెలుగుతేజం పీవీ సింధుకు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను పీవీ సింధు కలవనుంది. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత ఒలింపిక్ బృందం ఆగస్టు 15 వేడుకలకు హాజరుకానుంది. వేడుకల్లో పాల్గొననున్న బృంద సభ్యులను ప్రధాని మోదీ తన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భారత్ చేరిన చాను: మరో అపురూప కానుక ఇచ్చిన మణిపూర్
న్యూఢిల్లీ: రజత పతకం గెలుపొంది విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన మీరాబాయి చానుకు సొంత రాష్ట్రం మణిపూర్ ప్రభుత్వం కానుకల వర్షం కురిపించింది. పతకం గెలిచిన రోజే రూ.కోటి నగదు బహుమతి ప్రకటించగా తాజాగా సోమవారం ఆమెకు అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదనపు ఎస్పీగా చానును నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ తెలిపారు. అయితే టోక్యో నుంచి స్వదేశానికి చాను సోమవారం చేరుకుంది. ఆమెకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మణిపూర్‌కు చెందిన చాను ఒలింపిక్స్ పోటీల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచి సత్తా చాటింది. ఆమె గెలుపుపై దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్ ప్రభుత్వం ఆమెకు రూ.కోటి నగదు బహుమతితో పాటు ఆ ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. మీరాబాయి టోక్యో ఒలింపిక్స్‌లో ఏకంగా రజత పతకం హస్తగతం చేసుకొని మరో చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా... స్టార్ షట్లర్ పీవీ సింధు తర్వాత విశ్వ క్రీడల్లో రజతం సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణిగా 26 ఏళ్ల మీరాబాయి ఘనత వహించింది. 8 మంది వెయిట్‌లిఫ్టర్లు పాల్గొన్న 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను మొత్తం 202 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు బరువెత్తింది. -
రాజమౌళి అసహనం.. బదులిచ్చిన ఎయిర్పోర్ట్ యాజమాన్యం
కరోనా నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కనీస వసతలను కూడా ఏర్పాటు చేయకపోవడంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జక్కన్న ట్వీట్‌కు ఢిల్లీ ఎయిర్పోర్ట్ యాజమాన్యం స్పందిస్తూ రీట్వీట్ చేసింది. అందులో.. ‘డియర్ రాజమౌళి, ఫీడ్‌బ్యాక్ ఇచ్చినందుకు థాంక్యూ. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఆర్టీపీసీఆర్ వివరాలకు డెస్క్‌లు ఉన్నాయి. మరిన్నీ ఏర్పాటు చేస్తాం. ప్రయాణికులకు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేస్తామని బదులిచ్చింది. శుక్రవారం తెల్లవారు జామున రాజమౌళి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా, కరోనా నిబంధనల ప్రకారం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఆర్టీపీసీఆర్ కోసం పత్రాలు నింపేందుకు అక్కడ సరైన సౌకర్యాలు లేవని ట్వీట్ రూపంలో తెలిపాడు జక్కన్న. ప్రస్తుతం ఈ దర్శకధీరుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు. అక్టోబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. Dear Mr. Rajamouli, thank you for your valuable feedback and this provides us the opportunity for improvement. We have desks at the designated areas for RT-PCR-related purposes; however, increased number of desks and visibility at other locations will improve experience on (1/2) — Delhi Airport (@DelhiAirport) July 2, 2021 -
రాజమౌళికి చేదు అనుభవం.. ట్వీట్ వైరల్
Delhi Airport : ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్న పరిస్థితులపై దర్శకధీరుడు రాజమౌళి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఎయిర్ పోర్ట్‌లో కనీస వసతులు లేవని, తొలిసారి భారత్‌కు వచ్చే విదేశీయులకు ఇది చెడు అభిప్రాయం కలిగించేలా ఉందని ట్వీటర్ వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ‘అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం దరఖాస్తులు ఇచ్చి వాటిలో తగిన సమాచారాన్ని రాసి ఇవ్వమన్నారు. ఆ పత్రాలు నింపడం కోసం కొంతమంది ప్రయాణికులు గోడలకు ఆనుకుని.. మరి కొంతమంది నేలపైనే కూర్చొని వాటిని పూర్తి చేసి ఇచ్చారు. అక్కడ పరిస్థితి చూడడానికి ఏమీ బాలేదు. ఇటువంటి వాటి కోసం చిన్న టేబులైనా ఏర్పాటు చేయాల్సింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే ద్వారం వద్ద ఎన్నో వీధి కుక్కలు ఉన్నాయి. ఇలాంటివి చూస్తే విదేశీయులకు మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి వీటిపై దృష్టి సారించండి ’అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఇక సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం జక్కన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లలో ‘ఆర్ఆర్ఆర్’అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయింది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల మందుకు రానుంది. Dear @DelhiAirport, arrived at 1 AM by lufthanasa flight. Forms were given to fill for the RT PcR test. All the passenges are sitting on the floors or propping against the walls to fill the forms. Not a pretty sight. Providing tables is a simple service. — rajamouli ss (@ssrajamouli) July 2, 2021 And surprised to find so many stray dogs in the hangar outside the exit gate. Again not a great first impression of India for the foreigners. Please look into it. Thank you… — rajamouli ss (@ssrajamouli) July 2, 2021 -
ట్రాలీ బ్యాగుల్లో హెరాయిన్.. మార్కెట్ విలువ రూ.126 కోట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు దేశంలోకి దొంగతనంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. శనివారం జొహన్నెస్‌బర్గ్ నుంచి దోహా మీదుగా వచ్చిన వీరి లగేజీని తనిఖీ చేయగా బ్యాగుల్లో తెల్లటి పౌడర్, గుళికల రూపంలో ఉన్న సుమారు 18 కిలోల బరువున్న రూ.126 కోట్ల విలువైన హెరాయిన్ బయటపడిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ట్రాలీ బ్యాగుల్లో వీటిని కనిపించకుండా దాచి ఉంచారని చెప్పారు. చదవండి: DCPCR: థియరీ ఫార్ములా ప్రాక్టికల్స్‌కు వద్దు Kukatpally: మూఢ నమ్మకం.. తీసింది ప్రాణం -
సెకండ్ వేవ్‌తో విమానయానానికి కష్టాలు
ముంబై: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో విమాన ప్రయాణికుల సంఖ్య పెరగడంలో మరింత జాప్యం జరగనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ వృద్ధి 80-85 శాతానికే పరిమితం కానుంది. గతంలో ఇది 130-135 శాతం పెరగవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. గతేడాది మే 25 తర్వాత విమాన సర్వీసులను పరిమిత స్థాయిలో పునరుద్ధరించాక.. దేశీయంగా ప్రయాణించే వారి సంఖ్య నెమ్మదిగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి గతేడాది స్థాయిలో 64 శాతానికి చేరింది. కానీ మార్చి ఆఖరు, ఏప్రిల్ నుంచి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, వైరస్ కట్టడికి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్తగా ఆంక్షలు విధిస్తుండటం తదితర అంశాలతో మళ్లీ విమాన ప్రయాణాలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలవారీగా చూసినప్పుడు ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా 0.7 శాతం మేర క్షీణించింది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో ప్యాసింజర్ ట్రాఫిక్ 1.4 శాతం పెరిగింది. నెలవారీగా ఏప్రిల్‌లో 28 శాతం డౌన్.. ఇక్రా నివేదిక ప్రకారం 2021 మార్చిలో సగటున రోజువారీ విమాన ప్రయాణికుల సంఖ్య 2.49 లక్షలుగా ఉండగా.. ఏప్రిల్‌లో ఇది 28 శాతం క్షీణించి 1.79 లక్షలకు తగ్గిపోయింది. ఇక మే 1 - మే 16 మధ్య కాలంలో మరింతగా 56 శాతం క్షీణించింది. విమాన ప్రయాణాలు చేయాలంటే భయాలు నెలకొనడంతో పాటు గడిచిన రెండు నెలలుగా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తుండటం కూడా ఇందుకు కారణమని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ రేటింగ్స్) శుభం జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణీకుల సంఖ్య పెరగడంలో మరింత జాప్యం జరగవచ్చని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 80-85 శాతానికి పరిమితం కావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లుగా డిసెంబర్ నాటికి సింహభాగం జనాభాకు (18 ఏళ్లు పైబడినవారు) టీకాలు వేసే ప్రక్రియ పూర్తయితే .. థర్డ్ వేవ్ ప్రభావం కొంత తగ్గే అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు అంచనా వేస్తున్నట్లు జైన్ చెప్పారు. 2023 నాటికి కోవిడ్ పూర్వ స్థాయికి.. తాజా పరిస్థితులను బట్టి చూస్తే 2023 ఆర్థిక సంవత్సరం నాటికి గానీ దేశీయంగా విమానయానం కోవిడ్–19 పూర్వ స్థాయికి కోలుకోలేదని ఇక్రా తెలిపింది. అదే విదేశాలకు విమాన ప్రయాణాల విభాగానికైతే 2024 ఆర్థిక సంవత్సరం దాకా పట్టేస్తుందని వివరించింది. ప్యాసింజర్ ట్రాఫిక్ తగ్గుదల కారణంగా 2022 ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థల నిర్వహణ ఆదాయాలు 12 శాతం క్షీణించి రూ. 12,800 కోట్లకు, నిర్వహణ లాభాలు 40 శాతం క్షీణించి రూ. 2,560 కోట్లకు పరిమితం కావచ్చని పేర్కొంది. వందే భారత్ మిషన్ (వీబీఎం) కింద భారత్‌తో ద్వైపాక్షిక విమాన రవాణా ఒప్పందాలు కుదుర్చుకున్న పలు దేశాలు (అమెరికా, బ్రిటన్ మొదలైనవి).. ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదల కారణంగా తాత్కాలికంగా భారత్ నుంచి ఫ్లయిట్స్‌ను రద్దు చేశాయని తెలిపింది. భారీ స్థాయిలో వేక్సినేషన్, లాక్డౌన్ ఆంక్షల ఎత్తివేత, బిజినెస్ ట్రావెల్, పర్యాటక సంబంధ ప్రయాణాలు మొదలైనవి పుంజుకోవడంపైనే సమీప భవిష్యత్తులో ఏవియేషన్ రంగం కోలుకోవడం ఆధారపడి ఉంటుందని ఇక్రా వివరించింది. ప్రైవేట్ విమానాలకు భలే గిరాకీ.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశీ సంపన్నులు తమ విమాన ప్రయాణాలకు.. కమర్షియల్ ఎయిర్‌లైన్స్ కన్నా ప్రైవేట్ విమానాలను బుక్ చేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రైవేట్ జెట్ ఆపరేటర్లు నడిపే ఫ్లయిట్ సరీ్వసులు గణనీయంగా పెరిగాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం .. జనరల్ ఏవియేషన్ ఫ్లయిట్ సేవలు గతేడాది మార్చిలో 37.7 శాతం క్షీణించగా .. తాజాగా మార్చిలో ఏకంగా 71.8 శాతం వృద్ధి నమోదు చేశాయి. మరోవైపు, కమర్షియల్ విమానయాన సంస్థలు తిరిగి కోవిడ్-19 పూర్వ స్థాయికి తమ కార్యకలాపాలను పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. కొన్నాళ్ల క్రితం రికవరీ మొదలైనట్లు కనిపించినా.. కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో మళ్లీ ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. ప్రైవేట్ జెట్లను బుక్ చేసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం మంది విదేశాలకు, దేశీయంగా ఇతర ప్రాంతాలకు తొలిసారిగా ప్రయాణిస్తున్న వారు ఉంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య గతంతో పోలిస్తే సుమారు 25 శాతం దాకా పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే అత్యవసర వైద్య చికిత్స కోసం ప్రయాణించాల్సిన వారు కూడా ప్రైవేట్ విమానాలను బుక్ చేసుకుంటున్నట్లు వివరించాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక టెర్మినల్.. ప్రైవేట్ విమానాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఇలాంటి ఫ్లైట్స్ కోసం ఢిల్లీ అంతర్జాతీయ విమాశ్రయంలో గతేడాది సెప్టెంబర్‌లో ప్రత్యేకంగా జనరల్ ఏవియేషన్ టెర్మినల్(జీఏటీ)ని ప్రారంభించారు. గణాంకాల ప్రకారం .. ఈ టెర్మినల్ ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య తొలినాళ్లలో రోజుకు 96 మంది దాకా ఉండగా.. మార్చి నాటికి సుమారు 25 శాతం వృద్ధి చెంది 120కి పైగా పెరిగింది. దేశీయంగా తొలి జీఏటీ అయిన ఈ టెర్మినల్‌ను బర్డ్ గ్రూప్, ఎగ్జిక్యూజెట్ ఏవియేషన్ గ్రూప్ కలిసి దాదాపు రూ.150 కోట్లతో నిర్మించాయి. గంటకు 50 మంది ప్రయాణికులు, రోజుకు 150 జెట్స్ నిర్వహణ సామర్థ్యంతో దీన్ని రూపొందించాయి. చదవండి: పన్నెండు రూపాయలతో రూ.2 లక్షల ప్రమాద బీమా -
హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరిన కోవాగ్జిన్
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి వైరస్‌కు విరుగుడుగా తీసుకొచ్చిన వ్యాక్సిన్లు పంపిణీకి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ వ్యాక్సిన్ అన్ని రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ మంగళవారం పుణె నుంచి రాష్ట్రాలకు చేరగా.. తాజాగా భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ రాష్ట్రాలకు పంపించడం మొదలైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి విమానంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను పంపించారు. ఢిల్లీకి ఉదయం 9 గంటల వరకు చేరింది. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 16వ తేదీ నుంచి పెద్ద మొత్తంలో జరగనుంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వినియోగానికి అత్యవసర అనుమతి జారీ చేసిన విషయం తెలిసిందే. 54.72 లక్షల డోసుల వ్యాక్సిన్ రాష్ట్రాలకు చేరగా.. ఇది మొత్తం 1.65 కోట్ల డోసులకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ 1.1 కోట్ల డోసులు ఉత్పత్తి చేయగా.. భారత్ బయోటెక్ 55 లక్షల కోవాగ్జిన్‌ను ఉత్పత్తి చేసింది. -
ఎయిర్ ఇండియా వన్‌లో రాష్ట్రపతి తొలి ప్రయాణం
సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి, న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో అత్యంత ప్రముఖుల అధికారిక పర్యటనల కోసం ఉద్దేశించిన ఎయిరిండియా వన్–బీ777 తన గగన విహారాన్ని మంగళవారం ప్రారంభించింది. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, భారత ప్రథమ మహిళ సవితా కోవింద్ అందులో తొలి ప్రయాణం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వారు ఎయిరిండియా వన్–బీ777 కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లో న్యూఢిల్లీ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వన్‌బీ77 విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. ఎయిరిండియా వన్‌లో తమ తొలి ప్రయాణాన్ని ఆరంభించడానికి ముందు రాష్ట్రపతి దంపతులు న్యూఢిల్లీ పాలం విమానాశ్రయంలో పూజలు నిర్వహించారు. అమెరికా ప్రెసిడెంట్ ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ తరహాలోనే.. అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ తరహాలోనే ఎయిరిండియా వన్ను రూపొందించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు వీవీఐపీల కోసం వాడుతున్న బీ747–400 స్థానంలో ఈ కొత్త బీ777ను తీసుకువచ్చారు. పాత విమానంతో పోలిస్తే ఈ విమాన ఇంధన సామర్థ్యం, రేంజ్ అధికం. రెండు బీ777 విమానాలను ఎయిరిండియా కొనుగోలు చేసింది. ఒక్కో విమానాన్ని రూ.703.83 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తొలి ప్రయాణం సందర్భంగా రాష్ట్రపతి.. పైలట్లను, క్రూ మెంబర్లను, ఎయిర్ ఇండియా బృందాన్ని, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను అభినందించారు. ఎయిరిండియా వన్ పైలెట్లు, సిబ్బందితో రాష్ట్రపతి దంపతులు ఎయిరిండియా వన్‌బీ777 ప్రత్యేకతలివే.. ► అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యంత ఆధునిక సౌకర్యాలను కలిగిన ఎయిరిండియా వన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఏకధాటిగా 17 గంటల పాటు ప్రయాణించగలదు. ► ఎలాంటి వాతావరణ విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. ► క్షిపణి దాడుల నుంచి తనను తాను రక్షించుకునే స్వీయ రక్షణ వ్యవస్థను దీనికి అమర్చారు. ► లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ► కాగా, ఈ విమానం అమెరికాలో సిద్ధమై అక్టోబర్ 1న భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సుజనా అడ్డగింత
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మాజీ నేత (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు), రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరిని (సుజనా చౌదరి) ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. గురువారం ఆయన అమెరికా వెళ్తుండగా... ఆయనపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయి ఉన్న కారణంగా అధికారులు నిలిపేసి... దేశం దాటి వెళ్లకూడదంటూ వెనక్కి పంపేశారు. నిజానికి బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ సంస్థకు సంబంధించి జరిగిన ఫ్రాడ్ వ్యవహారంలో 2016 ఏప్రిల్ 27న సుజనా చౌదరిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఆ తరవాత విచారణ జరుగుతూ వస్తోంది. ఇందులో భాగంగా ఆయన దేశం దాటి వెళ్లిపోకుండా గత ఏడాది జూన్ 18న సీబీఐ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. రకరకాల డొల్ల కంపెనీలను పెట్టి, లేని టర్నోవర్‌ను చూపించి... వాటి ఆధారంగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని, దాదాపు 10వేల కోట్లు ఎగ్గొట్టిన వ్యవహారంలోనూ సుజనా నిందితుడు. తమకు అప్పు ఎగవేశారంటూ గతంలో మారిషస్ బ్యాంకు ఏకంగా ఇండియాకు వచ్చి మరీ ఇక్కడ కేసు దాఖలు చేసింది. కోర్టులో పిటిషన్; అనుమతి మంజూరు ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న నేపథ్యంలో తనను అమెరికా వెళ్లేందుకు అనుమతించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సుజనా చౌదరికి అక్కడ ఊరట లభించింది. అమెరికా వెళ్లేందుకు అనుమతిస్తూనే... భారత్‌కు తిరిగి వచ్చే తేదీని సీబీఐకి ఇవ్వాలని, భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత సీబీఐకి సమాచారం అందించాలని షరతు విధించింది. న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలోని సుజనాచౌదరి బంధువు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆయన్ను చూసేందుకు వెళుతున్నారు కనుక అనుమతించాలంటూ సుజనా తరఫున సీనియర్ న్యాయవాది మాథూర్ హౌస్ మోషన్ దాఖలు చేసి వాదనలు వినిపించారు. గతేడాది జూన్ 18న సీబీఐ లుక్ఔట్ నోటీసులు జారీచేసిందని, దీని గడువు ఏడాది మాత్రమేనని మాథూర్ తెలిపారు. అయితే దీని గడువును మరో ఏడాది పొడిగించామని సీబీఐ స్పెషల్ పీపీ సురేందర్ చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్నాక న్యాయమూర్తి అనుమతి మంజూరు చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
స్టాంపింగ్ తంటా.. మధు యాష్కీ ట్వీట్ వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు స్టాంప్ వేయడానికి ఉపయోగించే సిరా నాణ్యతపై ఆందోళకర విషయం వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు వేసే స్టాంపింగ్ తరువాత తన చేతిపైవచ్చిన కెమికల్ రియాక్షన్ గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీగౌడ్ ట్వీట్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఉపయోగిస్తున్న ఇంక్ కారణంగా తన చేతికి ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ట్యాగ్ చేశారు. దీన్ని పరిశీలించాలంటూ సంబంధిత ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందిస్తూ హర్దీప్ పూరి ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. మంత్రి సత్వర స్పందనపై మధు యాష్కీ సంతోషం వ్యక్తం చేశారు. తనలాంటి అనుభవం మరో ప్రయాణికుడికి రాకూడదని కోరుకున్నారు. అటుఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ స్పందించిన ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు మధుయాష్కీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి విలయంతరువాత విదేశీ విమాన ప్రయాణీకులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల క్వారంటైన్ నిబంధనల కనుగుణంగా కొన్ని విమానాశ్రయాలలో స్టాంపింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా గడిచిన 24 గంటల్లో 74,441 కరోనా కేసులతో, ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 66,23,815కు చేరింది. మరణించిన వారి సంఖ్య 1,02,695 గా ఉంది. Dear @HardeepSPuri Ji, can you please look into the chemical being used at Delhi airport for stamping on passengers coming from abroad? Yesterday I was stamped at @DelhiAirport and this is how my hands look now. pic.twitter.com/Gt1tZvGc8L — Madhu Goud Yaskhi (@MYaskhi) October 4, 2020 -
ఢిల్లీ టు చైనా.. వయా కెనడా
సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్ ముసుగులో భారీ బెట్టింగ్ గేమింగ్‌కు పాల్పడిన కలర్ ప్రిడిక్షన్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న యేహూ అనే చైనీయుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. మరో కీలక నిందితుడు హేమంత్ కోసం గాలిస్తున్నారు. చైనాకు చెందిన బీజింగ్ టీ పవర్ సంస్థ ఈ కలర్ ప్రిడిక్షన్ గేమ్ వెనుక ఉంది. దీనికి అనుబంధంగా ఢిల్లీలోని గుర్గావ్లో ఓ కార్యాలయం పని చేస్తోంది. చైనాకు చెందిన యే హూను తమ సంస్థ సౌత్ ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్‌గా బీజింగ్ టీ పవర్ సంస్థ నియమించింది. ఇతడు ఈ ఏడాది జనవరిలో ఢిల్లీకి చేరుకున్నాడు. ఈ–కామర్స్ సంస్థల పేరుతో అప్పటికే ఢిల్లీలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదై ఉన్న గ్రోవింగ్ ఇన్ఫోటెక్ ప్రెవేట్ లిమిటెడ్, సిలీ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రెవేట్ లిమిటెడ్, పాన్ యన్ టెక్నాలజీస్ సర్వీస్, లింక్‌యన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, డాకీపే ప్రెవేట్ లిమిటెడ్, స్పాట్‌పే ప్రెవేట్ లిమిటెడ్, డైసీలింగ్ ఫైనాన్షియల్ ప్రెవేట్ లిమిటెడ్, హువాహు ఫైనాన్షియల్ ప్రెవేట్ లిమిటెడ్‌ల కార్యకలాపాలు ఇతడు పర్యవేక్షిస్తున్నాడు. ఢిల్లీవాసులు హేమంత్, ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, నీరజ్ తులేలను డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో..: కలర్ ప్రిడిక్షన్ గేమ్ వలలో చిక్కి నష్టపోయిన ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఇటీవల కేసులు నమోదయ్యాయి. ప్రాథమికంగా దర్యాప్తు అధికారులు పేమెంట్ గేట్వేస్పై దృష్టి పెట్టారు. పేటీఎం, గూగుల్ పేల ద్వారా జరిగిన లావాదేవీలను విశ్లేషించారు. బెట్టింగ్‌కు సంబంధించిన నగదు తొలుత డాకీ పే సంస్థకు, అక్కడ నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలోకి వెళ్ళినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో ఆ బ్యాంక్‌కు లేఖ రాసిన దర్యాప్తు అధికారులు రూ.30 కోట్ల బ్యాలెన్స్ ఉన్న రెండు ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. తమ కార్యకలాపాలపై పోలీసుల కన్ను పడిందని తెలుసుకున్న అతడు తక్షణం తమ దేశానికి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. కెనడా విమానం ఎక్కే ప్రయత్నాల్లో... కోవిడ్–19 నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ నుంచి చైనాకు విమాన సర్వీసులు నడవట్లేదు. దీంతో కెనడాకు టికెట్ బుక్ చేసుకున్న యేహూ అక్కడ నుంచి చైనా వెళ్లాలని పథకం వేశాడు. కెనడా విమానం ఎక్కే ప్రయత్నాల్లో ఉండగా ఢిల్లీ విమానా శ్రయంలో సిటీ సైబర్ క్రైమ్ బృందానికి చిక్కాడు. మరోపక్క ఈ కలర్ ప్రిడిక్షన్ నిర్వాహక సంస్థ బీజింగ్ టీ పవర్ సంస్థ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి యేహూను తమ కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఏడున్నర నెల్లోనే రూ.1,100 కోట్లు టర్నోవర్ చేయడంతో పాటు రూ.110 కోట్లను విదేశాలకు తరలించిన నేపథ్యంలో మనీలాండరింగ్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ–కామర్స్ పేరుతో బెట్టింగ్ నిర్వహించిన ఆ ఎనిమిది సంస్థలూ జీఎస్టీ లేదా ఆదాయపుపన్ను చెల్లించలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆయా విభాగాలకు సమాచారం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. -
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల కష్టాలు..
-
తొలి రోజే ప్రయాణికుల కష్టాలు..
న్యూఢిల్లీ : దాదాపు రెండు నెలల తర్వాత పలు దేశీయ విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభమయిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌లకు చేరకున్న ప్రయాణికుల్లో కొందరికి నిరాశే మిగిలింది. దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టుగా కేంద్రం ప్రకటించిగానే పలువురు ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లకు క్యూ కట్టారు. అయితే ముందుగా ప్రకటించిన పలు సర్వీసులు రద్దు కావడంతో.. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలోనే నిరీక్షిస్తున్నారు. చాలా ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సర్వీసులు రద్దు కావడంతో.. గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో సహా దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు నిలిచిపోయారు. విమాన సర్వీసులు పునరుద్దరించబడ్డ తొలి రోజే ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి 80 సర్వీసులను రద్దు చేసినట్టుగా సమాచారం. మరోవైపు హైదరాబాద్ నుంచి ముంబై, ఛండీగఢ్, విశాఖపట్నం, తిరుపతి, నాందేడ్, బెంగళూరు, కడప, పుణె, త్రివేండ్రం, గోవా, కోయంబత్తూరులకు వెళ్లే విమానాలను రద్దు చేశారు. కాగా, పలు రాష్ట్రాలు పరిమిత సంఖ్యలో మాత్రమే విమాన సర్వీసులకు అనుమతించడం, 14 రోజులపాటు క్వారంటైన్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు విమాన సర్వీసులు పున: ప్రారంభం కావడంతో ఎయిర్‌పోర్ట్‌ల వద్ద ప్రయాణికులు సందడి నెలకొంది. ఇప్పటికే పలువురు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. పలు చోట్ల ఎయిర్‌పోర్ట్‌లకు చేరకున్న ప్రయాణికుల చేతుల మీద హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు. తెలంగాణ విషయానికి వస్తే.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్‌కు చేరుకుంది. -
54 రోజులుగా ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కడే!
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో జర్మనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఒకరు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఎడ్గార్డ్ జీబాట్ అనే జర్మన్ జాతీయుడు 54 రోజులుగా ఒంటరిగా ఇక్కడే ఉండిపోయాడు. మార్చి 18న హనోయి నుంచి ఇస్తాంబుల్‌కు వెళుతూ అతడు ఇక్కడ చిక్కుబడిపోయాడు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో టర్కీ నుంచి, అక్కడి నుంచి బయలుదేరే అన్ని విమానాలను భారత్ రద్దు చేసింది. నాలుగు రోజుల తర్వాత అన్ని అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి కొనసాగిస్తోంది. (కరోనా: ఇటలీలో ఇంత తక్కువ.. ఫస్ట్‌టైమ్!) ఇతర ప్రయాణికుల మాదిరిగా ఎడ్గార్డ్ జీబాట్‌ను జర్మనీ రాయబార కార్యాలయానికి అప్పగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తమ దేశంలో అతడికి నేరచరిత్ర ఉన్నందున అతడిని క్వారంటైన్‌ను పంపడానికి ఢిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయం నిరాకరించింది. నేర చరిత్ర ఉన్నందున భారత్ కూడా అతడికి వీసా ఇవ్వలేదు. అతడిని స్వదేశానికి పంపే విషయంపై జర్మన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా ఇప్పటివరకు స్పందన రాలేదని భారత అధికారులు తెలిపారు. జీబాట్ మార్చిన 18న వియత్నాం నుంచి వీట్‌జెట్ ఎయిర్ విమానంలో ఢిల్లీ వచ్చాడు. తన గమ్యస్థానానికి వెళ్లే విమానాలన్నీ రద్దు కావడంతో ఇక్కడే ఉండిపోయాడు. అతడితో పాటు ఉన్న ఇద్దరు శ్రీలంక పౌరులు, మాల్దీవులు, పిలిప్పీన్స్కు చెందిన మరో ఇద్దరు పౌరుల గురించి ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు విమానాశ్రయ అధికారులు సమాచారం అందించారు. ఆయా దేశాలు రాయబార కార్యాలయాల ద్వారా వారికి సౌకర్యాలు కల్పించి, వారిని క్వారంటైన్ చేశాయి. (ఫ్రెండ్‌తో కలిసి పట్టుబడ్డ నటి) జీబాట్ మాత్రం తన లగేజీతో ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయాడు. దినపత్రికలు, మేగజీన్స్ చదువుతూ.. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ అతడు కాలక్షేపం చేస్తున్నాడు. తాను కోరుకున్న చోటికి వెళ్లిపోవచ్చని చెప్పినా విమాన సర్వీసులు లేకపోవడంతో అతడు వెళ్లలేకపోతున్నాడని విమానాశ్రయ అధికారులు తెలిపారు. రిలీఫ్ విమానంలో అంకారాకు పంపేందుకు ప్రయత్నించినా టర్కీ అందుకు ఒప్పుకోకపోవడంతో కుదరలేదని వెల్లడించారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యే వరకు జీబాట్ నిరీక్షించక తప్పదని స్పష్టం చేశారు. కాగా, జీబాట్‌తో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులను సెక్యురిటీ సిబ్బంది అనుమతించలేదు. (గుడ్‌న్యూస్: రేపట్నుంచి రైలు కూత) -
పల్లీల్లో పచ్చనోట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 45 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని పట్టుకున్నట్లు సీఐఎస్ఎఫ్ బలగాలు బుధవారం చెప్పాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్–3 వద్దకు మంగళవారం సాయంత్రం వచ్చిన మురాద్ అలీ (25) అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. దుబాయ్‌కు వెళ్లనున్న అతడి దగ్గర బిస్కెట్ ప్యాకెట్లు, పల్లీలు, ఉడికించిన మాంసపుముద్దలు ఉన్నాయి. అధికారులు వాటిని తెరచి చూడగా అందులో చిన్నగా చుట్టిన విదేశీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. మొత్తం 508 నోట్లు ఉన్నాయని, వాటి విలువ భారత కరెన్సీలో రూ. 45 లక్షలు ఉంటుందని చెప్పారు. వేరుశనక్కాయల పైపొరను పగులగొట్టి అందులో నోట్లను ఉంచి, దాన్ని మళ్లీ జిగురుతో అంటించినట్లు కనుగొన్నారు. బిస్కెట్ ప్యాకెట్లో ప్రతి బిస్కెట్ తర్వాత ఓ నోటును ఉంచి ఆపై దాన్ని సీల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ కరెన్సీని కస్టమ్స్ అధికారులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మురాద్ ఇప్పటికే పలుమార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు గుర్తించారు. -
జయేష్.. అందుకే కొత్త గెటప్
న్యూఢిల్లీ: జయేష్ పటేల్(32) అనే యువకుడు ఓ వృద్ధుడి వేషంలో అమెరికాకు వెళుతూ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టవడం తెల్సిందే. పోలీసు విచారణలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన అతడు అమెరికాలో ఉద్యోగం పొందేందుకు జయేష్ పలుమార్లు ప్రయత్నించినా వీసా దొరకలేదు. ఈ విషయం తెలుసుకున్న భరత్ అనే యువకుడు రూ.30 లక్షలు ఖర్చుపెడితే అమెరికాకు వెళ్లొచ్చని చెప్పాడు. ఇందుకు జయేష్ అంగీకరించడంతో కొందరు ఏజెంట్లు అతడిని పటేల్ నగర్‌లోని ఓ సెలూన్‌కు తీసుకెళ్లారు. దాని యజమాని షంషేర్ తన మేకప్ మాయాజాలం ప్రదర్శించి 32 ఏళ్ల జయేష్‌ను 81 సంవత్సరాల వృద్ధుడిగా మార్చేశాడు. తలకు పాగాతో పాటు పాత కళ్లద్దాలను అమర్చాడు. మరోవైపు ఏజెంట్లు అర్మిక్ సింగ్ పేరుతో జయేష్‌కు నకిలీ పాస్‌పోర్టును అందజేశారు. ఈ వేషంలో తొలుత చెకింగ్‌ను సులభంగా దాటేసిన జయేష్, తన స్వరం వయసుకు తగ్గట్లు లేకపోవడం, ఒంటిపై ముడతలుండకపోవడంతో... సీఐఎస్ఎఫ్ అధికారుల కళ్లలోకి సూటిగా చూడకుండా మాట్లాడటంతో దొరికిపోయాడు. షంషేర్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. (చదవండి: నకిలీ ‘బాబు’ అలా బుక్కయ్యాడన్నమాట!) -
నకిలీ ‘బాబు’ అలా బుక్కయ్యాడన్నమాట!
సాక్షి, న్యూఢిల్లీ: వేషం మార్చి నకిలీ పాస్‌పోర్ట్‌తో విదేశాలకు చెక్కేద్దామనుకున్న వ్యక్తికి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా అధికారులు చెక్ పెట్టారు. సినీ ఫక్కీలో జయేశ్ పటేల్ (32) 81 ఏళ్ల వృద్ధుడిలా వేషం మార్చుకున్నాడు. గడ్డం, కళ్ల జోడు, నెత్తికి, గడ్డానికి తెల్ల రంగు, వీల్ చైర్ ఇలా అన్ని హంగులతో సీనియర్ సిటిజన్లా దర్జాగా న్యూయార్క్‌కు పయనమయ్యాడు. కానీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) అతగాడి వాలకాన్ని, ప్రవర్తనను పసిగట్టేయడంతో అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే..గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జయేశ్ పటేల్ తనను తాను 81 ఏళ్ల అమ్రిక్ సింగ్‌గా మార్చుకున్నాడు. అతని పేరుతో నకిలీ పాస్‌పోర్ట్ సృష్టించాడు. తెల్లని జుట్టు, గడ్డంతో వీల్ చైర్ మీద న్యూయార్క్ వెళ్లేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం చేరుకున్నాడు. అయితే అతని శారీరక రూపానికి, ప్రవర్తనకు సరిపోలకపోవడంతో సిఐఎస్ఎఫ్ ఎస్ఐ రాజ్వీర్ సింగ్ అతగాడిని ప్రశ్నించాడు. నిందితుడు అధికారి కళ్లలోకి సూటిగా చూడకుండా.. బిత్తిరి చూపులు చూడటం మొదలు పెట్టాడు. దీంతో మరింత లోతుగా పరిశీలించగా అసలు గుట్టు రట్టయింది. తదుపరి దర్యాప్తు కోసం జయేష్ పటేల్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగించామనీ, ఈ చట్టవిరుద్ధమైన చర్యకు ఎందుకు పాల్పడ్డాడనే దానిపై దర్యాప్తు జరుగుతోందని సీనియర్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
సీఎం జగన్‌ను కలిసిన ఏయూ విద్యార్థులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఢిల్లీ విమానాశ్రయంలో ఏయూ విద్యార్థులు కలిశారు. గత ప్రభుత్వం తమపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి త్వరలో జీవో జారీ చేసి, కేసులు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. కాగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఒకే దేశం ఒకేసారి ఎన్నికల అంశంపై జరిగిన ఈ చర్చలో 21 రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు. అంతకు ముందు వైఎస్ జగన్ ఢిల్లీ విమానాశ్రయం నుంచి పార్లమెంట్ వరకూ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. -
32 విమానాల దారి మళ్లింపు..!
న్యూఢిల్లీ : వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే 32 విమానాలను శనివారం దారి మళ్లించారు. వర్షం, తీవ్రమైన గాలుల నేపథ్యంలో లక్నో, జైపూర్, అమృత్సర్ ఎయిర్‌పోర్టుల్లో విమానాలను ల్యాండింగ్ చేయించామని అధికారులు తెలిపారు. పది ఫ్లైట్లను సాయంత్రం 4 నుంచి 5 మధ్య, మరో 22 విమానాలను రాత్రి 9 నుంచి 10 మద్య దారి మళ్లించామని వెల్లడించారు. -
సర్వర్ డౌన్ : ఎయిర్‌పోర్ట్‌లో నిలిచిన ప్రయాణీకులు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ సిస్టమ్ సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున 12.20 గంటల ప్రాంతంలో ఇమిగ్రేషన్ సిస్టమ్ సర్వర్ 40 నిమిషాల పాటు నిలిచిపోయింది. సర్వర్ సమస్యతో ఇమిగ్రేషన్ చెక్ కోసం ప్రయాణీకులు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. సర్వర్ సమస్యపై ఎయిర్‌పోర్ట్‌లో బహిరంగ ప్రకటన చేయడంతో పాటు విమానాశ్రయ సిబ్బంది మాన్యువల్ చెకింగ్ ప్రక్రియను చేపట్టారని కొందరు ప్రయాణీకులు వెల్లడించారు. మరికొందరు ప్రయాణీకులు ఇమిగ్రేషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొందని ట్విటర్లో ఫిర్యాదు చేయగా, విమానాశ్రయంలో పొడవాటి క్యూలను చూపే ఫోటోలను ట్వీట్ చేశారు. కాగా ఎయిర్ఇండియా పాసింజర్ సర్వీస్ సిస్టమ్ ఇటీవల ఐదు గంటల పాటు మొరాయించిన కొద్దిరోజులకే ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోని ఇమిగ్రేషన్ సిస్టమ్ సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం గమనార్హం. దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం పట్ల అధికారుల తీరుపై ప్రయాణీకులు మండిపడుతున్నారు. -
రోడ్డెక్కిన జెట్ ఎయిర్వేస్ సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ సంక్షోభంతో అనేక ఇబ్బందుల పాలవుతున్న ఉద్యోగులు పోరుబాట బట్టారు. తమకు జీతాలు, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిబ్బంది ఆందోళనకు దిగారు. పైలట్లతోపాటు ఫ్లైట్ అటెండర్స్, గ్రౌండ్ స్టాఫ్, ఇతర సిబ్బంది ఢిల్లీ విమానాశ్రాయం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. జెట్ ఎయిర్వేస్ యాజమాన్యానికి వ్యతిరేకంగా సేవ్ జెట్‌ఎయిర్‌వేస్ ప్లకార్డులు ప్రదర్శించారు. తక్షణమే తమకు జీతాలు చెల్లించాలని కోరారు. సంస్థ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేసిన పలువురు ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అటు దాదాపు 2వేల మందికి పైగా ఉద్యోగులు శుక్రవారం ముంబైలో ప్రదర్శన నిర్వహించారు. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని దుర్భరస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అటు విమానాలకు అద్దెబకాయిలు చెల్లించలేక ఇప్పటికే పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. ముఖ్యంగా సోమవారం దాకా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. -
భారతీ రియల్టీకి ఏరోసిటీ డెవలప్మెంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:ఏరోసిటీ కమర్షియల్ డెవలప్మెంట్ పనులను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) తాజాగా భారతీ రియల్టీ కన్సార్షియంకు అప్పగించింది. ఢిల్లీలోని ఏరోసిటీలో గేట్‌వే, డౌన్‌టౌన్ డిస్ట్రిక్ట్స్ డిజైన్, డెవలప్, ఫైనాన్స్, కన్స్ట్రక్ట్, ఆపరేట్, మేనేజ్, మెయింటెయిన్ ప్రాతిపదికన ఫేజ్–1లో 4.5 లక్షల చదరపు మీటర్లు, ఫేజ్–2లో సైతం ఇంతే విస్తీర్ణంలో కమర్షియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును కన్సార్షియం చేపట్టనుంది. ఫేజ్–1 అభివృద్ధికి గాను వార్షిక లీజు కింద 2036 వరకు ఏటా డీఐఏఎల్కు రూ.363.5 కోట్లను భారతీ రియల్టీ చెల్లించనుంది. దీనితోపాటు అదనంగా రూ.1,837 కోట్లు వన్ టైం పేమెంట్ చేయనుంది. గడువు మరో 30 ఏళ్లు పొడిగించినట్టయితే భారతీ రియల్టీ వార్షిక లీజు మొత్తంపై 50 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. భారతీ రియల్టీ ఫేజ్–2 ప్రాజెక్టు చేపట్టాలంటే ఫేజ్–1 మాదిరిగా అదనపు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. -
ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. రాకపోకలకు అంతరాయం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాయు కాలుష్యంతో ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడితే తాజాగా, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీంతో గురువారం రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా గురువారం ఉదయం 7.30 నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగమంచు వల్ల 12 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పురుషోత్తం ఎక్స్‌ప్రెస్, బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్, ఫరక్కా ఎక్స్‌ప్రెస్, పూర్వ ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ గుర్గావ్ ఎక్స్ ప్రెస్ వేస్ లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. -
మఫిన్స్‌లో బల్లి.. ఎయిర్‌పోర్ట్‌లో కలకలం
న్యూఢిల్లీ : విమానాశ్రయంలో మఫిన్ తిన్న ఓ ప్రయాణికునికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింద. అదేంటి మఫిన్ తింటే ఫుడ్ పాయిజనింగ్ కావడమేంటని ఆలోచిస్తున్నారా. ఎందుకంటే అతడు తీసుకున్న మఫిన్లో చచ్చిన బల్లి అవశేషాలు కూడా ఉన్నాయి కాబట్టి. ఈ సంఘటన ఢిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. డిసెంబరు 18న ఇది జరిగిన ఈ ఘటన కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన ప్రయాణికుడు డిసెంబరు 18వ తేదీ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో టెర్మినల్ 2లోని బోర్డింగ్ గేట్ 33 సమీపంలోని ప్లాజా ప్రీమియం లాంజ్‌లో విమానం కోసం ఎదురు చూస్తున్నాడు. విమానం బయలుదేరడానికి సమయం ఉండటంతో మఫిన్స్ ఆర్డర్ ఇచ్చాడు. దాన్ని తింటుండగా అతనికి దానిలో చనిపోయిన బల్లి అవశేషాలు కనిపించాయి. ఈ లోపు అతడు వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. దాంతో టెర్మినల్ మేనేజర్ డాక్టర్లను పిలిపించారు. తాను తింటున్న మఫిన్లో చచ్చిపోయిన బల్లి శరీరభాగాలు కనిపించాయని అతడు వైద్యులకు తెలిపాడు. దాంతో డాక్టర్లు అతడికి ప్రాథమిక చికిత్స చేసి సఫ్దార్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు. అంతేకాక ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విమనాశ్రయానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన గురించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ భాటియా విచారణ జరుపుతున్నారు. ప్రయాణికుడు తిన్న ఆహార పదార్థం నమూనాను సేకరించినట్లు ఆయన తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, దోషులుగా తేలిన వారికి శిక్ష పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రయాణికుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. -
ఉత్తర భారతదేశంలో తీవ్ర పొగమంచు
-
కమ్మేసిన పొగమంచు
సాక్షి, ఢిల్లీ: ఉత్తర భారతదేశంలో పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని వల్ల సాధారణ ప్రజలే గాక వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానశ్రయం నుంచి విమానాల రాకపోకలకు నిలిచిపోయ్యాయి. పలు విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయ్యాయి. గడిచిన మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. పొగమంచు కారణంగా సోమవారం హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికిపైగా మృతి చెందిన విషయం తెలిసింది. ప్రధాన రోడ్లను సైతం మంచు కప్పివేయడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలకు దారితీస్తున్నాయి. గడిచిన మూడురోజుల నుంచి చలికి ఉత్తర భారతం వణుకుతోంది. -
పైలట్ తప్పిదంతో వణికిన ప్రయాణికులు!
న్యూఢిల్లీ : ఓ విమానానికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో హైజాక్ టెన్షన్ వెంటాడింది. రన్ వేపై టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానంలో ఆకస్మాత్తుగా హైజాక్ అలారం మోగింది. నిమిషాల వ్యవధిలోనే భద్రతా బలగాలు విమానాన్ని చుట్టుముట్టడంతో.. ఏం జరుగుతుందోనని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అనంతరం పైలట్ రాంగ్ బటన్ నొక్కడంతోనే అలారం మోగిందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. అరియాన అఫ్గాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 133 మంది ప్రయాణీకులు, సిబ్బందితో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు టేకాఫ్‌కు సిద్ధమైంది. రన్ వే పై నుంచి విమానం గాల్లోకి ఎగురుతుందనగా.. అలారం మోగడంతో అలజడి రేగింది. దీంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో.. గట్టిగా కేకలు వేశారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు.. పరుగున రన్ వేపైకి వచ్చేశాయి. వెంటనే ఫ్లైట్‌ను చుట్టుముట్టాయి. విమానంలోకి అడుగు పెట్టిన భద్రతా సిబ్బంది ఏం జరిగిందని ఆరా తీయగా.. పైలెట్ పొరపాటున హైజాక్ అలారం బటన్ నొక్కాడని తేలింది. ఈ ఘటనతో విమానం రెండు గంటల ఆలస్యమైంది. -
‘హైజాక్’ నొక్కిన పైలట్
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి కాందహార్(అఫ్గానిస్తాన్) వెళ్తున్న విమానంలో పైలట్ పొరపాటున ‘హైజాక్ మీట’ నొక్కడం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ విమానాశ్రయంలో శనివారం జరిగిన ఈ ఘటన భద్రతా సిబ్బదిని తెగ హైరానాకు గురిచేసింది. సుమారు రెండు గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతే విమానం బయల్దేరింది. 124 మంది ప్రయాణికులతో అరియానా అఫ్గాన్ విమానం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ అవడానికి సిద్ధమవుతుండగా పైలట్ పొరపాటున హైజాక్ మీట నొక్కాడు. వెంటనే స్పందిన ఎన్ఎస్జీ కమాండోలు విమానాన్ని చుట్టిముట్టి రన్‌వేకు దూరంగా తీసుకెళ్లి తనిఖీలు నిర్వహించారు. పైలట్ పొరపాటున హైజాక్ మీట నొక్కారని నిర్ధారించుకున్నాక విమానం బయల్దేరడానికి అనుమతిచ్చారు. -
పదికోట్ల మందిని గమ్యస్ధానాలకు చేర్చేలా..
సాక్షి,న్యూఢిల్లీ : ఢిల్లీ విమానాశ్రయాన్ని రూ 9000 కోట్లతో సామర్ధ్యం పెంపుతో అప్‌గ్రేడ్ చేయనున్నట్టు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఢిల్లీ విమానాశ్రయాన్ని ఏటా 10 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్ధానాలకు చేర్చేలా మెరుగపరిచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. జీఎంఆర్ గ్రూప్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జర్మనీకి చెందిన ఫ్రాపోర్ట్‌లతో కూడిన కన్సార్షియం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తోంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి రెండు ప్రచురణలను మంగళవారం వెంకయ్య నాయుడు ఆవిష్కరించి ప్రసంగించారు. 2018లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ను 7 కోట్ల మంది ప్రయాణీకులు ఉపయోగించుకోగా, రానున్న సంవత్సరాల్లో ప్రయాణీకుల సామర్ధ్యం 11 కోట్లకు పెరుగుతుందని పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. ఢిల్లీ విమానాశ్రయం లక్ష మందికి నేరుగా, మరో 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలను సమకూర్చిందని చెప్పారు. ఢిల్లీ విమానాశ్రయం పదేళ్ల సేవలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. -
బ్రిటీష్ ఎంపీని వెనక్కి పంపిన భారత్
న్యూఢిల్లీ : బ్రిటీష్ పార్లమెంటేరియన్ లార్డ్ అలెగ్జాండర్ కార్లిలేను ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు భారత్‌లోకి అనుమతించలేదు. సరైన వీసా పత్రాలు లేని కారణంగా ఎయిర్‌పోర్టు అధికారులు అతన్ని తిరిగి వెనక్కి పంపించారు. ఈ ఘటనపై భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ.. కార్లిలే పర్యటన ఉద్దేశం, అతను వీసాలో సమర్పించిన వివరాలు వేర్వేరుగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో అతన్ని తిరిగి ఇంగ్లండ్ పంపించామన్నారు. కార్లీలే ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు న్యాయ సలహాదారునిగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ అవినీతి కేసులో బంగ్లా కోర్టు ఆమెకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె న్యాయ సలహాదారుడిగా ఉన్న కార్లిలేను బంగ్లాదేశ్‌లోని రానివ్వబోమని ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయన జియాకు మద్దతుగా ఇండియాలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు గతంలోనే తెలిపారు. దీని ద్వారా అంతర్జాతీయ మీడియాకు జియా కేసులోని వాస్తవాలను వివరిస్తానని కూడా అన్నారు. కానీ వీసాలో పర్యటన ఉద్దేశాని వేరే విధంగా పేర్కొనడంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
ఇండిగో నిర్వాకం : రన్‌వేపైనే ప్రయాణికుల అగచాట్లు
న్యూఢిల్లీ : ఈ మధ్యన విమానయాన సంస్థలు ప్రయాణికులకు సరైన సదుపాయాలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయనడంలో ఈ ఘటనే నిదర్శనం. ఆదివారం రాత్రి ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ప్రయాణికులు దాదాపు 7 గంటలకు పైగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని రన్‌వేపైనే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి గల కారణం సోమవారం ఉదయం వరకు ఆ ఇండిగో విమానానికి సిబ్బంది అందుబాటులో లేకపోవడం. బస్సులో ఇండిగో విమానం ఆగివున్న రన్‌వేపైకి వచ్చిన ప్రయాణికులకు ఈ చేదు అనుభవం ఏర్పడింది. సిబ్బంది లేకపోవడంతో అక్కడి నుంచి మళ్లీ టర్మినల్ తీసుకెళ్లాల్సిన విమానయాన సంస్థ అధికారులు ప్రయాణికులను అక్కడే గాలికి వదిలేశారు. దీంతో గంటల కొద్దీ వేచిచూసిన ప్రయాణికులు ఏం చేయాలో తోచక ఇండిగో విమానం వద్దనే రన్‌వేపై కూర్చునిపోయారు. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన 6ఈ 2977 విమానం ఆదివారం రాత్రి 10.40 గంటలకు టేకాఫ్ అవ్వాల్సి ఉంది. కానీ సిబ్బంది అందుబాటులో లేరని దాన్ని రన్‌వేపైనే ఆపేశారు. ఇండిగో చేసిన ఈ నిర్వాహకానికి ప్రయాణికులు తీవ్ర మండిపాటుకు గురయ్యారు. వెంటనే ట్విటర్ అకౌంట్లో ఇండిగోపై దుమ్ముత్తిపోశారు. కొందరు రన్‌వేపై తాము పడుతున్న అగచాట్లను ఫోటోలు తీసి సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. కొంతమంది ప్రయాణికులు విమానం వద్ద కూర్చుని ఉండగా.. మరికొందరు అక్కడే కూర్చుండిపోయారు. దాదాపు ఈ విమానం ఏడు గంటలకు పైగా రన్‌వేపైనే ఆగిపోయింది. సోమవారం ఉదయం 6.40కు విమానం టేకాఫ్ అయింది. రన్‌వేపై అగచాట్లు పడుతున్న తమకు ఉదయం ఆరు గంటలకు పీనట్స్, ఫ్రూటీ ఆఫర్ చేశారు కానీ విమానంలోకి ఎక్కనివ్వలేదని ప్రయాణికుడు ప్రణీత్ అలాగ్వాడి ట్వీట్ చేశారు. కనీసం ప్రయాణికులను టర్మినల్లోకి తీసుకెళ్లకపోవడం గమనార్హం. తీవ్ర కోపోద్రిక్తులైన ప్రయాణికులు, బెంగళూరు ఎయిర్‌పోర్టులో సైతం తమ నిరసనను కొనసాగించారు. మరోవైపు ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో, మొత్తంగా 70కి పైగా విమానాలను దారి మళ్లించారు. ఇండిగో కూడా 30 విమానాలను డైవర్ట్ చేసింది. అన్ని విమానయాన సంస్థలు ఈ వాతావరణ పరిస్థితులకు తీవ్ర ప్రభావితమయ్యాయి. అయితే సోమవారం ఉదయం వరకు ప్రయాణికులను ఎందుకు రన్‌వేపైనే వేచిచూడాల్సిన పరిస్థితి కల్పించారో విషయంపై మాత్రం ఇండిగో కామెంట్ చేయలేదు. -
రూ.85 లక్షలు విలువ చేసే 100 ఐఫోన్లు సీజ్
సాక్షి, న్యూఢిల్లీ : ఖరీదైన 100 ఐఫోన్లను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆదివారం దుబాయ్ నుంచి భారత్ వచ్చిన 53 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద దాదాపు రూ. 85 లక్షలు విలువ చేసే ఐఫోన్ ఎక్స్ ఫోన్లను గుర్తించారు. వాటికి సరైన ఆధారాలు చూపని కారణంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఫోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న బంగారం, ఖరీదైన వస్తువులు భారీగా లభిస్తున్నాయి. -
రూ.15 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాలతో ఓ జింబాబ్వే దేశీయురాలు ఢిల్లీ ఎయిర్ట్‌పోర్టులో పట్టుబడింది. పట్టుబడిన డ్రగ్స్‌విలువ రూ.15 కోట్లు ఉంటుందని, ఆమె గోవా మీదుగా ఫిలిఫ్పైన్స్‌లోని మనీలాకు అక్రమంగా సరఫరా చేసేందుకు ప్రయత్నం చేస్తూ పట్టుబడిందని భద్రతా అధికారులు తెలిపారు. ఓ విదేశీయురాలి వద్ద మాదక ద్రవ్యాలు ఉన్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులకు సమాచారం రావడంతో ఈ విషయం పడింది. జింబాబ్వేకు చెందిన బెట్టీ రేమ్ అనే మహిళ ఏప్రిల్ 2న ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో గోవాకు వెళ్లడానికి విమానం ఎక్కేందుకు డిపార్చర్ టెర్మినల్ చేరుకుంది. మూడో నెంబర్ గేటు వద్దకు రాగానే భద్రతా అధికారులకు అనుమానం వచ్చి ఆమెను ఆపేశారు. ఆమె వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను చెక్ చేసేందుకు ఎక్స్-బిస్ మెషిన్ ద్వారా పంపించగా అనుమానాస్పదంగా బ్యాగ్‌లో ఓ పదార్థం కనిపించింది. దీంతో అధికారులు బ్యాగును తెరిచి చూడగా 3 కిలోల బరువున్న ప్యాకెట్ ఉంది. పరిశీలించి చూడగా పాపులర్ పార్టీ డ్రగ్ మెతమ్‌ఫెటమైన్‌గా తేల్చారు. ఈ డ్రగ్‌ను ఐస్ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు విచారణ నిమిత్తం అప్పగించారు. ఈ డ్రగ్స్‌ను ఓ ఆఫ్రికన్ నుంచి తీసుకున్నట్లు విచారణలో తెలిపింది. ఆమె జింబాబ్వే నుంచి ముంబాయికి మార్చి 20న వచ్చింది. అంతకుముందు గతేడాది నవంబర్‌లో కూడా భారత్‌ను సందర్శించింది. మెతమ్‌ఫెటమైన్ అనే డ్రగ్‌ను ఎపిడ్రిన్ అనే డ్రగ్ నుంచి తయారు చేస్తారు. దీనికి ఇండియాతో పాటు పలుదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. -
రూ.58 లక్షల విలువైన బంగారం స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల నుంచి అక్రమంగా బంగారం తెస్తూ ఓ ప్రయాణికుడు దొరికిపోయాడు. ఇందిరా గాంధీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తీసుకువచ్చేందుకు అతగాడు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే... దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి సుమారు రూ.58 లక్షల విలువ చేసే 1930 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ ప్రయాణికుడు బంగారాన్ని .. పలుచని రేకులుగా తయారు చేసి వాటిని అట్ట పెట్టెలు, స్కూలు బ్యాగ్‌ల మధ్య కూర్చి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశాడు. కానీ అతడిని అడ్డగించిన విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు. -
కమ్మేసిన మంచుపొగ.. నిలిచిపోయిన విమానాలు!
-
కమ్మేసిన మంచుపొగ.. నిలిచిపోయిన విమానాలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీని మంచుపొగ కమ్మేసింది. దట్టంగా మంచుపొగ అలుముకోవడం, వెలుతురు మందగించడంతో సోమవారం ఉదయం విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. వెలుతురు మరీ మందగించడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వైమానిక సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఐదు దేశీ విమానాలు, ఏడు అంతర్జాతీయ విమానాలకు అంతరాయం ఏర్పడింది. ఒక విమాన సర్వీస్‌ను రద్దుచేశారు. హస్తినలో వెలుతురు మందగించి.. మంచుపొగ దట్టంగా అలముకోవడంతో ఉదయమైనా చిమ్మచీకటి అలుముకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాయుకాలుష్యం కూడా ప్రమాదకరస్థాయికి చేరడం గమనార్హం. వాయునాణ్యత సూచీలో నగరంలోని షాదిపూర్లో 332, సిరి ఫోర్ట్‌లో 388 పాయింట్లు (రెండు కూడా అత్యంత ప్రమాదకరం) నమోదవ్వగా.. ద్వారకలో 257 పాయింట్లు (తీవ్ర అనారోగ్యకరం), ఐటీవోలో 182పాయింట్లు (అనారోగ్యకరం) నమోదైంది. అటు ఉత్తరప్రదేశ్ వారణాసిలో దట్టమైన పొగమంచు కారణంగా వైమానిక సేవలకు అంతరాయం కలిగింది. -
ఎయిరిండియా ఆహారంలో బొద్దింక
న్యూఢిల్లీ : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా మరో ఇరకాటంలో పడింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రీమియం ప్యాసెంజర్ల ఎయిరిండియా లాంజ్ ఆహార ప్లేటులో బొద్దింక దర్శనమిచ్చింది. ఈ విషయాన్ని ప్యాసెజంర్ తన ట్విట్టర్ అకౌంట్లో ఫిర్యాదు చేశారు. ''డియర్ ఎయిరిండియా.. ఫస్ట్ క్లాస్ ప్యాసెంజర్లు, బిజినెస్‌ల కోసం వాడే మీ ఢిల్లీ వీఐపీ లాంజ్‌కు సర్వ్ చేసిన ఫుడ్‌లో బొద్దింక వచ్చింది. ఇది చాలా అసహ్యకరం'' అంటూ హరీందర్ బవేజ ట్వీట్ చేశారు. బొద్దింక వచ్చిన తన ప్లేటును కూడా ఈ ట్వీట్‌కు పోస్టు చేశారు. ఈ సంఘటనపై వెంటనే స్పందించిన ఎయిరిండియా తన మైక్రోబ్లాగింగ్ సైట్లో క్షమాపణ చెప్పింది. సరియైన చర్యలు తీసుకోవాలని వెంటనే కేటరింగ్ సర్వీసెస్ ప్రొవైడర్‌ను ఆదేశించింది. ''ఇది విన్నందుకు చాలా బాధగా ఉంది. మిస్ హరీందర్... టర్మినల్ 3 వద్ద ఉన్న ఏజెన్సీ మేనేజింగ్ లాంజ్‌ను మేము అలర్ట్ చేశాం. వెంటనే తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ సంఘటనపై మేము చాలా చింతిస్తున్నాం. క్షమించండి'' అంటూ పలు ట్వీట్లను చేసింది. ఈ లాంజ్‌లో కేటరింగ్ సర్వీసులు అందించే సంస్థ ఎయిరిండియా సబ్సిడరీ హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. Dear @airindiain cockroaches on food plates at your Delhi Lounge for biz and first class passengers. Disgusting pic.twitter.com/LEy9GtrgTY — Harinder Baweja (@shammybaweja) December 20, 2017 -
హిండన్ నుంచి ప్రాంతీయ విమానాలు
సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని ప్రాంతీయ విమానాలను తాత్కాలిక ప్రాతిపదికపై ఘాజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి నడిచేందుకు అనుమతించాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ.. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(డయల్)కు విజ్ఞప్తి చేసింది. ఇందుకు ఢిల్లీ విమానాశ్రయం అంగీకరించింది. ఢిల్లీ విమానాశ్రయం, పౌరవిమానయాన మంత్రిత్వశాఖ త్వరలో మెమోరాండం ఆ‹ఫ్ అండర్స్టాండింగ్(ఎంవోయూ)పై సంతకం చేయనున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రస్తుతం విస్తరణ పనులు జరుగుతున్నాయి. విమానాశ్రయం ఇరుకుగా మారినందువల్ల విస్తరణ పనులు పూర్తయ్యేంతవరకు కొన్ని ప్రాంతీయ విమానాలు హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి నడిచేందుకు అనుమతించాలని విమానయానశాఖ డయల్‌ను కోరింది. ఢిల్లీ విమానాశ్రయం ప్రైవేటీకరణ సందర్భంగా కుదరిన ఒప్పందం ప్రకారం ఢిల్లీ విమానాశ్రమానికి 150 కిలో మీటర్ల పరిధిలో వాణిజ్య విమానాలను డయల్ అనుమతి లేకుండా నడుపరాదన్న నియమం దృష్ట్యా ప్రభుత్వం డయల్ అనుమతి కోరింది. స్థానిక అనుసంధాన పథకం కింద ప్రభుత్వం కొత్త రూట్లను వచ్చే నెలలో ప్రకటించనుంది. కొంతకాలం ఢిల్లీ నుంచి విమానాలను హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి నడపవలíని ఉంటుందని ప్రభుత్వం ఈ రూట్ల కోసం బిడ్ వేయనున్నవారికి తెలిపింది. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు జరిగిన తరువాత ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హిండన్ స్టేషన్లో ప్రయాణీకుల సదుపాయాలను అభివద్ధి చేస్తుంది. ఢిల్లీ విమానాశ్రయాలలో విస్తరణ పనుల కింద కొత్త టెర్మినల్, కొత్త రన్‌వే, ఎలివేటెడ్ టాక్సీవే, అంతర్గత రైలు వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం టెర్మినల్–1 సామర్థ్యానికి మించి పనిచేస్తున్నందువల్ల అక్కడి నుంచి విస్తరణ పనులు మొదలుపెడ్తారు. మాస్టర్‌ప్లాన్‌ను మూడు మాడ్యులర్ దశలలో అమలుచేస్తారు. నిష్క్రమణ టెర్మినల్–డి, ఆగమన టెర్మినల్ డి–1సిని కలిపి సాలుకు 4 కోట్ల మంది ప్రాయాణీకుల సామర్థ్యాన్ని తట్టుకునేలా టెర్మినల్–టి1ను అభివృద్ధి చేస్తారు. టెర్మినల్–1 ప్రస్తుతం రెండు కోట్ల ప్రయాణీకుల సామర్థ్యంతో íపనిచేస్తోంది. ఇందులో 22 ఏరోబ్రిడ్జిలు నిర్మిస్తారు. టి3 సామర్థ్యాన్ని కూడా 3.4 కోట్ల ప్రయాణీకుల నుంచి 4 కోట్ల ప్రయాణీకులకు పెంచుతారు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం
న్యూఢిల్లీః ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఓ పైలెట్ డ్రోన్‌ను గుర్తించడంతో ఆదివారం సాయంత్రం విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని మూడు రన్‌వేలను తాత్కాలికంగా మూసివేశారు. షెడ్యూల్ ప్రకారం విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గమ్యస్ధానాలకు చేరుకోవడంలో జాప్యం నెలకొనడంతోఅసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కొద్ది సేపటికి సర్వీసులను పునరుద్ధరించడంతో విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. -
ఎయిర్‌పోర్ట్‌లో బాంబు కలకలం
న్యూఢిల్లీ: బాంబు ఉందన్న అనుమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేపింది. తనిఖీలు చేపట్టిన భద్రతా సిబ్బంది.. అవి ఆటోమొబైల్ విడిభాగాలని తేల్చటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ తెలిపిన వివరాలివీ.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో ఏరియాలో బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఓ పార్సిల్ పడి ఉండటం గమనించిన సిబ్బంది భద్రతా విభాగానికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతా సిబ్బందిని అలెర్ట్ చేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తోపాటు ఎక్స్‌రే ఇమేజ్ యంత్రాన్ని తెప్పించారు. క్షుణ్నంగా పరిశీలించగా అందులో మారుతి కార్ల విడి భాగాలు ఉన్నట్లు తేలింది. ఈ ఘటనతో ఉదయం 9గంటల వరకు ఉద్రిక్తత కొనసాగింది. అనంతరం ఆ పార్సిల్‌ను అందులో ఉన్న చిరునామా ప్రకారం విస్తారా ఫ్లయిట్లో గోవాకు పంపించారు. ఈ విమానాశ్రయంలో భద్రతా బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలు పర్యవేక్షిస్తుండగా అత్యవసర సమయాల్లో సీఐఎస్ఎఫ్ రంగంలోకి దిగుతుంది. -
బాంబు కాదు.. మారుతీ స్పేర్ పార్ట్స్
న్యూఢిల్లీ : బాంబు ఏమోనని విమానశ్రయం సిబ్బదంతా ఒక్కసారిగా హడలిపోయారు. తీరా చూస్తే అవేమిటో తెలుసా? మారుతీ స్పేర్ పార్ట్స్. అసలు విషయానికి వెళ్తే.. ఢిల్లీ విమానశ్రయంలో కార్గో టెర్మినల్‌లో బుధవారం అనుమానాస్పద మెటీరియల్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవేమిటో తెలియక తీవ్ర ఆందోళన చెందారు. ఆ మెటీరియల్నంతా వేరుచేసేశారు. బాంబు గుర్తింపు బృందానికి సమాచారమిచ్చారు. అక్కడికి వచ్చిన బాంబు గుర్తింపు, నిర్మూలించే బృందం, అది బాంకు కాదని తేల్చేసరికి ఒక్కసారిగా ఢిల్లీ విమానశ్రయ సిబ్బంది, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అవి మారుతీ స్పేర్ పార్ట్స్‌గా బాంబు స్క్వాడ్ పేర్కొంది. విచారణ అనంతరం వాటిని బీడీడీఎస్ నెగిటివ్‌గా తేల్చింది. 2016 జనవరిలో కూడా ఐజీఐ ఎయిర్‌పోర్టు పరిధిలో అనుమానిత బాలూన్ను గుర్తించడంతో ఇలాంటి గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. -
ఢిల్లీ నుంచి వెళ్లే ప్యాసింజర్లకు శుభవార్త
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్యాసింజర్లకు శుభవార్త. ఇకపై ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశీయ, విదేశీ సర్వీసులలో ప్రయాణించే వ్యక్తుల నుంచి తీసుకునే యూజర్ డెవలప్మెంట్ ఫీ (యూడీఎఫ్)ను తగ్గించారు. డొమెస్టిక్ సర్వీసుల్లో ప్రయాణించే ప్యాసింజర్స్ ఇక నుంచి కేవలం 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణికులు రూ.45 చెల్లిస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారికంగా ప్రకటించారు. గతంలో డొమెస్టిక్ విమానాలలో ప్రయాణించే వారి నుంచి యూడీఎఫ్‌ను రూ.275 నుంచి గరిష్టంగా రూ.550 వరకు తీసుకునేవారు. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే వారు రూ.635 నుంచి గరిష్టంగా రూ.1,270 చెల్లించేవారు. ఇక ఢిల్లీ నుంచి వెళ్లే విమాన ప్రయాణికులు సాధారణ యూడీఎఫ్ మాత్రమే చెల్లించాల్సి రావడం ప్రయాణికులకు నిజంగా శుభవార్తే. కొత్త చార్జీలతో డొమెస్టిక్ సర్వీస్ ప్రయాణికులకు రూ.233 నుంచి 466 వరకు ఆధా అవగా, ఇంటర్నేషనల్ సర్వీస్ ప్యాసింజర్స్‌కు రూ.518 నుంచి గరిష్టంగా రూ.1,048 వరకు భారం తగ్గనుంది. ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరి అథారిటీ 2015 డిసెంబర్ నెలలోనే ఈ ప్రతిపాదన చేయగా రెండున్నరేళ్ల తర్వాత యూడీఎఫ్ ధరలు సవరించారని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) అధికారులు తెలిపారు. -
విమానం గాల్లో ఉండగానే హల్చల్
న్యూఢిల్లీ : మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే తలుపు తెరవడానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏరోఫ్లోట్ ఎస్‌యూ 232 విమానం మే 22న రష్యా రాజధాని మాస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అందులో ప్రయాణిస్తున్న రష్యన్ జాతీయుడు అలెగ్జాండర్ సమోఖ్వలోవ్ విమానం గాల్లో ఉండగానే తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పైలెట్ ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ కాగానే సీఐఎస్ఎఫ్ బలగాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో అలెగ్జాండర్ రక్తంలో ఆల్కహాల్ శాతం 100 ఎం.ఎల్‌కు 56.7 ఎం.ఎల్గా ఉందని అధికారులు తెలిపారు. ఇరుదేశాల్లో ఇది 30 ఎం.ఎల్‌కు మించకూడదని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించినందుకు విమానయాన నిబంధనలు–1937 ప్రకారం నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. -
ముఖ్యమంత్రికి ఎయిర్‌పోర్టులో షాక్
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో చిత్రమైన అనుభవం ఎదురైంది. వీఐపీలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన బ్యాటరీ కారులో ఆయన వెళ్లబోతుండగా.. ఓ ప్రయాణికుడు కోపంగా వచ్చి ఆయన ముందు సీట్లో కూర్చుని.. 'వీఐపీ సంస్కృతి వద్దు' అంటూ గట్టిగా అరిచాడు. ముంబై నుంచి విమానంలో దిగిన నితీష్ కుమార్ ఆ కారులో కూర్చోగానే అతడు వచ్చి అదే కారులో కూర్చుని అరవడం మొదలుపెట్టాడు. సెక్యూరిటీ వాళ్లు ఆ ప్రయాణికుడిని దిగాల్సిందిగా కోరినా.. అతడు వినలేదు. దాంతో ఏమీ చేయలేక అతడిని కూడా ఆ బ్యాటరీ కారులో తీసుకెళ్లారు. నితీష్ కుమార్ అంతర్జాతీయ లాంజ్ వద్ద దిగిపోగా, రెండో ప్రయాణికుడు మాత్రం ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు వెళ్లాడు. ఢిల్లీ విమానాశ్రయంలో ఎస్కలేటర్లు, వాకలేటర్లు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నా, వీఐపీలను మాత్రం గోల్ఫ్ కార్ట్ తరహా బ్యాటరీ కార్లలో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు తీసుకెళ్తారు. అలాంటివి మొత్తం 30 కార్లు ఉన్నాయి. ముంబై నుంచి నితీష్ వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 310లోనే వచ్చిన ఆ ప్రయాణికుడు.. నేరుగా వచ్చి నితీష్ ఎదురుసీట్లో కూర్చుండిపోయాడు. సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా విమానాశ్రయాల్లో వీఐపీగానే చూస్తారు. వాళ్లకు వ్యక్తిగత భద్రత కల్పిస్తారు. నితీష్‌తో పాటు బ్యాటరీ కారులో కూర్చున్న వ్యక్తి ఆయనకు ఎలాంటి హాని కల్పించకపోవడం, హింసాత్మకంగా ప్రవర్తించకపోవడంతో తాము కూడా మరీ బలవంతం చేయలేదని, ముఖ్యమంత్రి సైతం ఎలాంటి అభ్యంతర వ్యక్తం చేయలేదని విమానాశ్రయాలలో భద్రతా ఏర్పాట్లు చూసే సీఐఎస్ఎఫ్ దళాలు తెలిపాయి. ఒకవైపు వీఐపీ సంస్కృతి వద్దంటూ మంత్రులు, ఇతరుల కార్లమీద ఎర్రబుగ్గలు తీసేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయిస్తే.. మరోవైపు విమానాశ్రయాలలో మాత్రం ఇలా కొంతమందిని ప్రత్యేకంగా చూడటం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అస్సలు నడవలేనివాళ్లు, వృద్ధులు, రోగులకైతే పర్వాలేదు గానీ అంతా బాగానే ఉన్నవారికి ప్రత్యేకంగా ఇలా గోల్ఫ్ కార్టులు కల్పించడం ఎందుకన్న వాదనలున్నాయి. -
రన్ వేపై అదుపుతప్పిన విమానం
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్కు చెందిన విమానం బుధవారం రన్ వేపై దిగుతూ అదుపుతప్పి పక్కకు వెళ్లిపోయింది. ఈ ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం డెహ్రాడూన్ నుంచి న్యూఢిల్లీకి 65 మందితో బయల్దేరిన విమానం రన్ వేపై దిగుతుండగా అదుపు తప్పింది. పైలట్ చాకచక్యంగా విమానాన్ని అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ల్యాండవుతున్న సమయంలో విమాన ముందు చక్రంలో సాంకేతికలోపం తలెత్తడంతో స్టీరింగ్ సమస్య వచ్చినట్లు వివరించారు. పాసింజర్లందరిని వేరే విమానాల ద్వారా గమ్యస్ధానాలకు చేర్చినట్లు వెల్లడించారు. -
బంగారం ఎక్కడ దాచారంటే..
న్యూఢిల్లీ: బంగారం అక్రమ రవాణాలో అక్రమార్కుల తీరు నిఘా అధికారులను సైతం నివ్వెర పరుస్తోంది. బేబీ డైపర్స్ నుంచి శరీర అవయవాలు దాకా దేన్నీ వదలకుండా పసిడి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులకు ఇలాంటి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇందిరాగాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వింత చెప్పు అధికారులను ఆకర్షించింది. అనుమానంతో ఆరాతీస్తే సుమారు రూ. 27 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. ఇండియన్ పాస్ పోర్ట్ తో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఇద్దరు ప్రయాణికులనుంచి బుధవారం దీన్ని స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా కనిపించే స్లిప్పర్స్ లో భారీగా బంగారం పట్టుబడటం అక్రమార్కుల అనుసరిస్తున్న విధానానికి అద్దం పట్టింది. అయినా....చివరికి నిఘా కన్నుకు చిక్కక తప్పలేదు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్న వీరినుంచి 938 గ్రాముల ఈ బంగారాన్నిఅధికారులు సీజ్ చేశారు. 118 చిన్న చిన్న ముక్కలుగా చెప్పుల్లోదాచి పెట్టిన ఈ బంగారం మార్కెట్ విలువ రూ.26.96లక్షలని అధికారులు తెలిపారు. కస్టమ్స్ చట్టం 1962 110 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ కేసులో ఇరువురిని అనుమానితులుగా అదుపులోకి విచారిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన డీమానిటైజేషన్ తరువాత బంగారం అక్రమ రవాణా బాగా పెరిగింది. అనేక రెట్లు పెరిగి పోయిందని అధికారులు చెబుతున్నారు. ఈ వారంలోనే దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడినుంచి అట్టపెట్టెల్లో నల్లని ఇన్సులేట్ టేప్ తో అతికించిన గోల్డ్ ఫాయిల్స్ ను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. 700 గ్రాములున్న దీని విలువ రూ.18.5 లక్షలు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి 2012-2013 కాలంలో 6.6 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా, 2013-2014 లో ఇది 384 కేజీలు పెరిగింది. 2014, 15 సంవత్సరాల్లో 574 కిలోలుగా ఉంది. అయితే 2016 లో మాత్రం 220 కిలోలకు పైగానే అధికారులకు చిక్కింది. దీని విలువ సుమారు రూ 60 కోట్లు. -
చీర, మంగళసూత్రం ఉంటే ఎయిర్‌పోర్టులో కష్టమే!
భారతీయ మహిళలు సంప్రదాయబద్ధంగా మెడలో ధరించే మంగళసూత్రం, మడతలు మడతలుగా భారీ మెటల్ వర్కుతో ఉండే చీరలు.. ఇవన్నీ ఉంటే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇబ్బందేనట. ఎందుకంటే.. అక్కడ కొత్తగా ఏర్పాటుచేసిన అమెరికా కంపెనీ వాళ్ల ఫుల్ బాడీ స్కానర్ వీటి గుండా శరీరాన్ని స్కాన్ చేయలేకపోతోంది. భారతీయ విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు వీలుగా ఫుల్ బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఇందుకోసం అంతర్జాతీయంగా కొటేషన్లు పిలవగా అమెరికన్, జర్మన్ కంపెనీలు తమ స్కానర్లు పంపాయి. ఇప్పటికి అమెరికన్ స్కానర్‌ను పరీక్షించారు. ఇక జర్మన్ స్కానర్ ఏం చేస్తుందో చూడాలి. భారతీయ మహిళలు పలు మడతలు పెట్టి ధరించే చీరల కారణంగా ఈ స్కానర్లు అంత సమర్థంగా చెక్ చేయలేకపోతున్నాయని విమానాశ్రయంలో భద్రతను పర్యవేక్షించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) బలగాలు తెలిపాయి. అలాగే చాలామంది మహిళలు తాము ధరించే మంగళ సూత్రాలను తాత్కాలికంగానైనా తీసి పక్కకు పెట్టడానికి నిరాకరిస్తున్నారు. దాంతో భద్రతా దళాలకు కొంత ఇబ్బంది కలుగుతోంది. ప్రధానంగా ఈ రెండు సమస్యలు తప్ప మిగిలిన అన్ని రకాలుగా అమెరికన్ స్కానర్లు బాగానే పనిచేస్తున్నాయని సీఐఎస్ఎఫ్ తెలిపింది. మెడ నుంచి కాలి వరకు శరీరం మొత్తాన్ని ఇది స్కాన్ చేస్తుందని, అయితే తాము పూర్తి శరీరాన్ని స్కాన్ చేసే మిషన్ అడిగామని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. స్కానింగ్ చేసేముందు శరీరం మీద ఉన్న అన్ని రకాల మెటల్ వస్తువులు తీసేయాలని.. పురుషులు తమ బెల్టులు, వాలెట్లు తీస్తున్నారు గానీ మహిళలు మాత్రం మంగళసూత్రాలను తీసి ట్రేలో పెట్టమంటే ఒప్పుకోవడం లేదని అన్నారు. స్కానింగ్‌ను తప్పనిసరి చేస్తే హిందూ మహిళలను ఒప్పించడం చాలా కష్టం అవుతుందని తెలిపారు. చీర కట్టుకున్నా, మంగళసూత్రం ఉన్నా స్కానర్ నుంచి అలారం వస్తుందని.. ఇది ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం కష్టమని వివరించారు. చీరల్లో అయితే అనేక పొరలుంటాయి. అదే జీన్స్ లేదా ఇతర దుస్తుల్లో అలా ఉండవు. దానికి తోడు చాలామంది చీరల మీద భారీగా వర్క్ చేయించుకుంటారు. దానివల్ల కూడా స్కానర్ పదే పదే కూతలు పెడుతుంది. పదివేల స్కాన్లలో ఒక్కసారి మాత్రం పెన్ను, వాలెట్, కర్చీఫ్ తదితర వస్తువులను ఇది గుర్తించలేకపోతోంది. ఇప్పటివరకు అమెరికన్ స్కానర్‌ను పరిశీలించామని, ఇక జర్మన్ స్కానర్‌ను కూడా చూడాల్సి ఉందని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. ట్రయల్ రన్ పూర్తయితే, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ (బీసీఏఎస్) ఫుల్ బాడీ స్కానింగ్‌ను తప్పనిసరి చేసేందుకు కావల్సిన నియమ నిబంధనలు సిద్ధం చేస్తుంది. -
తాత్కాలికంగా విమాన రాకపోకలు రద్దు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంది. బుధవారం లాగే గురువారం కూడా పొగమంచు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. ఈ రోజు ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో పొగమంచు, వెలుతురులేమి కారణంగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే ఉత్తర రైల్వే పరిధిలో దాదాపు 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నిన్న కూడా పొగమంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. -
ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం
దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లైవ్ బుల్లెట్లు తీసుకెళ్తున్న ఒక ఆస్ట్రేలియన్ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. తన వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగేజిలో అతడు ఈ బుల్లెట్లు తీసుకెళ్తున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. వియన్నా నుంచి గోవా వెళ్లేందుకు ముందుగా ఢిల్లీ వచ్చిన ఆస్ట్రేలియన్ పౌరుడిని సాధారణంగా చెక్ చేసినప్పుడు అతడి బ్యాగేజిలో 5.56ఎంఎం లైవ్ బుల్లెట్లు దొరికాయని వివరించారు. అతడి పేరు డబ్ల్యు జోషెడ్ అని, గోవా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ బుల్లెట్లు తీసుకెళ్లడానికి అతడి వద్ద తగిన పత్రాలు ఏవీ లేవని, అందుకే అదుపులోకి తీసుకుని, ఢిల్లీ పోలీసులకు అప్పగించామని అన్నారు. భారతదేశ చట్టాల ప్రకారం విమానంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీసుకెళ్లడం నేరం. -
ఆ హీరో-హీరోయిన్ల పబ్లిసిటీ కక్కుర్తితో..
-
ఆ హీరో-హీరోయిన్ల పబ్లిసిటీ కక్కుర్తితో..
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భద్రతాపరమైన ఆందోళన బాలీవుడ్ తారలు కత్రినా ఖైఫ్, సిద్ధార్థ మల్హోత్రా సోమవారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బందికి చుక్కలు చూపించారు. తమ తాజా సినిమా 'బార్ బార్ దేఖో'కు పబ్లిసిటీ కల్పించుకునేందుకు ఏకంగా ఎయిర్ పోర్ట్ లో ఈ ఇద్దరు తారలు పిచ్చివేషాలు వేశారు. దీంతో విమానాశ్రయంలో ఒకింత భద్రతాపరమైన ఆందోళన నెలకొంది. కత్రినా, సిద్ధార్థ ముంబైకి వెళ్లే ఎయిరిండియా విమానం (ఏఐ 317) టికెట్లు కొని ఎయిర్ పోర్టులోకి ప్రవేశించారు. ఆ టికెట్లను చూపించి టీ3 ప్రధాన టెర్మినల్ లోకి ప్రవేశించిన ఈ జంట.. ఏకంగా డ్యూటీ ఫ్రీ ఏరియాలోకి వెళ్లి ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కొన్ని డ్యాన్సులు, డైలాగులు చెప్పారు. ఆ తర్వాత తాము టికెట్లు కొనుగోలు చేసిన విమానం ఎక్కకుండా ఇంటిముఖం పట్టారు. వారి తీరుపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ ఎఫ్) అధికారి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన ప్రయాణం చేసే ఉద్దేశం లేకుంటే వారు విజిటర్స్ ఎంట్రీ పాస్ తీసుకొని వచ్చేది ఉండాల్సింది కానీ, ప్రయాణికుల మాదిరిగా ఎయిర్ పోర్టులోకి ప్రవేశించి వారు విమాన సిబ్బందిని, భద్రతా ఏజెన్సీని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. వారు కేవలం సినిమా ప్రమోట్ చేసుకోవడానికే వచ్చినట్టు కనిపించిందని, అందుకే తెగించి మరీ డ్యూటీ ఫ్రీ ఏరియాలోకి వెళ్లారని ఆ అధికారి తప్పుబట్టారు. మరోవైపు విమానం బయలుదేరడానికిముందే టీ3 టెర్మినల్ నుంచి బయటకు వచ్చేందుకు కత్రినా, సిద్ధార్థ ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. ఎయిర్ లైన్ ప్రోసిజర్ పూర్తయిన తర్వాత బయటకు వెళ్లేందుకు అనుమతించారు. -
ఫోన్లు మర్చిపోయి వెళ్లిపోతున్నారు..
న్యూఢిల్లీ : ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారిలో చాలామంది తమ మొబైల్ ఫోన్లు మరిచిపోయి వెళ్లిపోతున్నారు. కొందరు తమ సామాను మరిచిపోయి వెళ్లిపోతుంటారని, ఆ సామాన్లలో మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉంటున్నాయని సీఐఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. స్క్రీనింగ్, చెకింగ్ పాయింట్లు, వెయిటింగ్ ఏరియా, టాయిలెట్లు ఇత్యాది ప్రదేశాలలో ప్రయాణీకులు తమ సామాగ్రిని మరచిపోయి వెళ్లిపోతుంటారని వారు చెప్పారు. తాము వాటిని విమానాశ్రయ అథారిటీ వద్ద జమ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం మొదటి ఐదు నెలల్లో తమకు 895మొబైల్ఫోన్లు లభించినట్లు వారు తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నుంచి మే వరకు ప్రయాణీకులు వదిలి వెళ్లిన సామాగ్రి విలువ మొత్తం రెండు కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. వాటిలో దాదాపు 91 లక్షల రూపాలయ విలువైన సామాగ్రిని ప్రయాణీకులకు తిరిగి అప్పగించారు. మిగతా సామాగ్రి ఇంకా విమానాశ్రయం స్టోర్ రూములలో పడి ఉంది. ప్రయాణీకులు ఎక్కువగా మొబైల్ ఫోను మరిచిపోయి వెళ్తుంటారని, ఈ సంవత్సరం మే వరకు తమకు దొరికిన 895 మొబైల్ ఫోన్లలో 317 మొబైల్ ఫోన్లను మాత్రమే ప్రయాణీకులకు తిరిగి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం సీఐఎస్ఎఫ్ అధికారులకు 2148 మొబైల్ ఫోన్లు లభించాయి. వాటిలో 734 ఫోన్లను యజమానులకు తిరిగి అప్పగించారు. మిగతా 1414 ఫోన్లు ఎయిర్‌పోర్టు అథారిటీ వద్ద జమచేశారు. ప్రయాణీకులు వదిలే వెళ్లే సామాగ్రిలో మొబైల్ ఫోన్లతో పాటు లాప్టాప్ , కెమెరా, రిస్ట్ వాచ్ జ్యుయలరీ వంటి వస్తువులు ఉంటున్నాయి. పాస్‌పోర్టు, పాన్‌కార్డు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా ప్రయాణీకులు మరిచిపోయి వెళ్తుంటారు. సామాను మరిచి వెళ్లిన ప్రయాణీకులు తమ వద్దకు వచ్చి వాటి వివరాలు తెలిపి తీసుకెళ్తుంటారని, అయితే అలాంటి వారి సంఖ్య తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
'పతకం కోసం 12 ఏళ్లు కష్టపడ్డా'
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ లో దేశానికి పతకం సాధించిపెట్టాలన్న తన కలం సాకారమైందని మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపింది. దీని కోసం గత 12 ఏళ్లుగా శ్రమిస్తున్నానని చెప్పింది. రియో ఒలింపిక్స్ భారత్‌కు తొలి పతకం అందించిన సాక్షి మాలిక్ బుధవారం ఢిల్లీ చేరుకుంది. విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తనను ఘనంగా స్వాగతించడం పట్ల సాక్షి మాలిక్ సంతోషం వ్యక్తం చేసింది. ఇదో అద్భుతమైన అనుభవమని వ్యాఖ్యానించింది. దేశానికి పతకం సాధించిపెట్టడం గర్వకారణంగా ఉందని పేర్కొంది. విమానాశ్రయంలో ఇంత ఘనంగా తన కుమార్తెకు స్వాగతం లభిస్తుందని ఊహించలేదని ఆమె తండ్రి సత్బీర్ అన్నారు. ఇది గర్వించదగ్గ క్షణమని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి హర్యానాలోని రోహ్తక్ జిల్లా మొఖ్రా ఖాస్ గ్రామంలోని తన ఇంటికి సాక్షి మాలిక్ చేరుకుంది. ఇక్కడే భారీ జనసమూహం మధ్య ఆమెకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సన్మానం చేయనున్నారు. -
ఎవరీ ఫర్హత్?
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కిన హైదరాబాద్ యువతి సాక్షి, హైదరాబాద్: దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడిన ఫర్హత్ ఉన్నిస్సా హైదరాబాదీ యువతిగా తేలింది. అబుదాబి నుంచి జెట్ ఎయిర్వేస్ విమానంలో వచ్చిన ఈ యువతిని కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఈమె లోదుస్తుల్లో దాచి ఉంచిన రూ.64.39 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణా చేస్తూ పలువురు మహిళలు గతంలో హైదరాబాద్ విమానాశ్రయంలోనూ చిక్కారు. అయితే ఈ యువతుల వెనుక ఉన్న బడా స్మగ్లర్ల వివరాలు పూర్తిగా వెలుగులోకి రాలేదు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల నిఘా పెరగడంతో స్మగ్లర్లు తమ రూటు మార్చుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.హైదరాబాద్‌కు చెందిన బడా స్మగ్లర్లు ఇక్కడి యువతినే వినియోగించి ఢిల్లీ మీదుగా బంగారం అక్రమ రవాణాకు కుట్రపన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫర్హాత్ పూర్వాపరాల కోసం ఢిల్లీ నుంచి ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకుని దర్యాప్తు చేపట్టింది. -
బంగారం.. అక్కడ దాచినా పట్టేశారు..
న్యూఢిల్లీః హైదరాబాద్ కు చెందిన ఓ కిలాడీ లేడీని ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి విమానంలో ఢిల్లీ వచ్చిన ఆమె.. బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానం రావడంతో తనిఖీలు చేపట్టారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆమె... ఇన్నర్ గార్మెట్స్ లో దాచిన.. సుమారు 64,38,960 రూపాయలు ఖరీదు చేసే 2 కేజీల గోల్డ్ బార్లను 160 గ్రాముల బంగారాన్ని ఆమెవద్దనుంచీ స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి జెట్ ఎయిర్వేస్ విమానంలో ఢిల్లీకి వచ్చిన హైదరాబాద్ కు చెందిన మాయ లేడీని ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ (ఎఐయు) అధికారులు.. ఢిల్లీలో అరెస్టు చేశారు. అనంతరం ఆమెను ఫర్హాత్ ఉన్నీసాగా గుర్తించారు. దుబాయ్ నుంచి సుమారు 2 కేజీల గోల్డ్ బార్స్ తో పాటు, 160 గ్రాముల బంగారాన్ని అండర్ గార్మెట్స్ లో దాచి, అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఉన్నీసాను.. ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహిస్తుండగా గుర్తించినట్లు ఎఐయు తెలిపింది. అనంతరం ఆ ప్రయాణీకురాలిని అరెస్టు చేసి, ఆమెవద్దనుంచీ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎఐయు తెలిపింది. విదేశాలనుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రియురాలి కోసం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి!
విదేశాలకు వెళుతున్న ప్రియురాలిని చూసేందుకు నకిలీ టికెట్‌తో ఎయిర్‌పోర్టుకు వెళ్లిన ఓ ప్రయాణికుడు అడ్డంగా బుక్కయ్యాడు. స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో భద్రతా సిబ్బంది హైఅలర్ట్‌గా ఉండటంతో అతని ఆగడానికి అడ్డుకట్ట పడింది. ఈ మేరకు దుందుడుకు చర్యకు పాల్పడిన ఇటలీ దేశస్తుడు అరెస్టయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఆగస్టు 15న నకిలీ టికెట్‌తో విమానాశ్రయంలోకి ప్రవేశించిన నిందితుడు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో ఎయిర్‌పోర్టులో పహారా కాసే సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుంది. అయితే, తాను ప్రయాణికుడిని కాదని అతను విచారణలో స్పష్టం చేశాడు. ఆగస్టు 16న అతడు మాస్కోకు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం కన్ఫర్మ్ అయిన టికెట్ అతని దగ్గర ఉంది. ఈ టికెట్‌ను ఫొటో ఎడిట్ సాఫ్ట్‌వేర్‌తో మార్పులు చేసి ఆగస్టు 16, 15గా మార్చాడు. ఆ టికెట్‌తో అతను ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించాడని, ఆ తర్వాత నకిలీ టికెట్‌ను చింపివేశాడని విచారణలో తేలింది. కాగా, తన ప్రియురాలు చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్ విమానంలో ఆగస్టు 15న ప్రయాణిస్తుండటంతో ఆమెను చూసేందుకు తాను దుండగానికి పాల్పడ్డట్టు నిందితుడు చెప్పాడు. దీంతో అతన్ని అరెస్టుచేసి పోలీసు స్టేషన్‌కు పంపించారు. గత 14 నెలల్లో దాదాపు 30మంది నకిలీ ఈ-టికెట్లతో విమానాశ్రయంలోకి ప్రవేశించి అరెస్టయ్యారు. -
ఎయిర్ పోర్టులో మంత్రి ఆకస్మిక తనిఖీ
న్యూఢిల్లీ: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పుణ్యమా అని ఆయా శాఖల కేంద్ర మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేస్తుండటం అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. నిన్నటికినిన్న సమాచార శాఖ మంత్రిత్వ శాఖకు చెందిన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఉద్యోగుల ఆలస్యంపై మండపడ్డారు. ఇప్పుడు అదే తరహాలో పౌరవిమాయనయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా ఎవరికీ చెప్పాపెట్టకుండా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీ టెర్మినల్(టెర్మినల్1) కు వెళ్లిన మంత్రి అక్కడ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరాతీశారు. గతవారం ఇదే టెర్మినల్ లో ఎయిర్ కండీషనర్ పనిచేయక ప్రయాణికులు ఉక్కపోతను అనుభవించిన సంఘటన దృష్యా ఏసీ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. జులై 5 నాటి పునర్ వ్యవస్థీకరణలో ఆర్థిక శాఖ నుంచి పౌరవిమానయానానికి మారిన జశ్వంత్ సిన్హా.. గత వారం దేశీ విమాన సేవల బలోపేతంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. -
జాత్యహంకారం: 'ఈశాన్య' యువతికి అవమానం
న్యూఢిల్లీ: అమెరికాలో నల్ల జాతీయులపై దాడులు, ప్రతిదాడులను ప్రపంచమంతా ఖండిస్తున్నవేళ.. దేశ రాజధాని ఢిల్లీలో ఈశాన్య పౌరుల పట్ల 'అహంకారం' మరోసారి పురివిప్పింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ కౌంటర్ అధికారి.. ఓ మణిపురి యువతిపై జాత్యంహకార వ్యాఖ్యలుచేశాడు. అంతర్జాతీయ సదస్సుకు భారత ప్రతినిధిగా బయలుదేరిన ఆమెను 'నువ్వు భారతీయురాలిలా లేవే' అని అవమానించాడు. తాను ఎదుర్కొన్న జాతి వివక్షను వివరిస్తూ ఫేస్ బుక్ లో ఆ యువతి పోస్ట్ చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. పాతికేళ్ల యువతి మోనికా కంగెంబం.. ఇంపాల్(మణిపూర్) కేంద్రంగా సామాజిక ఉద్యమాల్లో పాలుపంచుకుంటోంది. గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో 'ప్రత్యేక ఆయుధ చట్టాం'కు వ్యతిరేకంగా పోరాడిన ఆమె.. ప్రస్తుతం విమెన్ అండ్ యూత్ ఫర్ పీస్ అండ్ డెవలప్ మెంట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఈశాన్య రాష్ట్రాల యువత, మహిళల జీవన స్థితిగతుల బాగు కోసం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్యార్థినిగా ఉన్నప్పుడే గ్లోబల్ ఛేంజ్ మేకర్స్, ఆసియా యూత్ సమ్మిట్ లాంటి పలు అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతినిధిగా పాల్గొన్న మోనికా.. జులై రెండో వారంలో సియోల్ (దక్షిణ కొరియా)లో జరగనున్న ప్రపంచ మహిళా సదస్సుకు కూడా భారత్ ప్రతినిధిగా ఎంపికయ్యారు. సియోల్ వెళ్లేందుకు శనివారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లిన ఆమెను ఇమిగ్రేషన్ అధికారి తీవ్రంగా అవమానించినట్లు మోనికా ఆరోపిస్తున్నారు. 'నా పాస్ పోర్టును తీక్షణంగా పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారి.. 'నువ్వు భారతీయురాలిలా కనిపించట్లేదే' అని అన్నాడు. 'ఇండియాలో ఎన్ని రాష్ట్రాలున్నాయో చెప్పు..'అని ప్రశ్నించాడు. అంతవరకు ఓపిక పట్టిన నేను లేట్ అవుతోందనగానే.. 'మిమ్మల్ని వదిలేసి విమానం ఎక్కడికీ పోదు. ముందు నా ప్రశ్నలకు జవాబులు చెప్పండి' అని అన్నాడు. ఆ అధికారి పక్కనున్న మహిళ కూడా మొత్తం వ్యవహారాన్ని ముసిముసి నవ్వులతో చూసిందే తప్ప అతణ్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు' అని మోనికా తన లేఖలో వివరించింది. 'ఇది కచ్చితంగా జాత్యహంకారమే. అయితే నేను మాత్రం నా స్పూర్తిని వదులుకోను' అంటూ లేఖకు ముక్తాయింపునిచ్చారామె. గతంలోనూ దేశ రాజధాని ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పౌరులపై దాడులు జరిగిన నేపథ్యంలో మోనికాకు జరిగిన అవమానంపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్పందిచాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మోనికాపై గతంలో పలు జాతీయ పత్రికల్లో వచ్చిన కథనాల్లో కొన్ని.. -
కశ్మీరీ యువతికి చేదు అనుభవం
న్యూ ఢిల్లీ: బంగ్లాదేశ్ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఓ మెడికల్ విద్యార్థినికి శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఆమెకు అకారణంగా చుక్కలు చూపించారు. ఆమె లగేజీలో బాంబు ఉందని పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు. ఢాకా నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఆమెకు ఢాకా, కోల్‌కతా విమానాశ్రయాల్లో లగేజ్ చెకింగ్ అధికారులు క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ ఢిల్లీలో మాత్రం బాంబు ఉందంటూ అదుపులోకి తీసుకోవటంతో ఆమె షాక్‌కు గురైంది. ఆమెతో ఉన్న ముగ్గురు మిత్రులు సైతం దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ ఫ్రెండ్‌ను వదిలేసిన తరువాతే మేమూ వెళ్తామంటూ విమానాశ్రయంలో భీష్మించుకు కూర్చున్నారు. కొన్ని గంటల పాటు ప్రశ్నించిన తరువాత అధికారులు ఆమెను వదిలేశారు. అదుపులోకి తీసుకున్న సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలుపకపోవటంతో ఆమె తండ్రి ఎయిర్ పోర్ట్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి రాజనాథ్ సింగ్‌ల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో వారు ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్‌ను మిస్సయ్యారు. -
హనీమూన్ నుంచి తిరిగొచ్చి.. భర్తకు షాకిచ్చి!
న్యూఢిల్లీ: ఆ జంటకు కొత్తగా పెళ్లయింది. హిమాలయ పర్వత సానువుల వద్ద ఉన్న బాగ్దోగ్రాకు హనీమూన్‌కు వెళ్లొచ్చారు. హనీమూన్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా భర్తకు షాకిస్తూ.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన వధువు అదృశ్యమైంది. సోమవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులోని వాష్‌రూమ్‌లోకి వెళ్లిన వధువు ఎంతకు బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)ను ఆశ్రయించాడు. దీంతో అతను, సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నీలిరంగు చీర కట్టుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్లిన అతని భార్య.. బయటకు వచ్చేటప్పుడు మాత్రం బురఖా ధరించింది. సీసీటీవీ దృశ్యాల్లో ఆమె ఎత్తు, బరువు, నడకతీరును గమనించిన భర్త బురఖాలో ఉన్నది తన భార్యేనని తెలుసుకొని బిత్తరపోయాడు. ఆమె బురఖా ముసుగు కప్పుకొని వెళ్లి ఓ వ్యక్తిని కలిసింది. అతనికి మరొకడు జత కలిశాడు. ఆ ముగ్గురు ట్యాక్సీల వద్దకు వెళ్లి జనంలో కలిసిపోయారు. ఈ దృశ్యాలన్నింటినీ చూసి బిత్తరపోయిన ఆ నూతన వరుడు లబోదిబోమంటున్నాడు. లక్నో చెందిన ఓ వ్యక్తి విషయంలో ఈ ఘటన జరిగింది. పెళ్లయి హనీమూన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత అతని భార్య తన ప్రియుడితో కలిసి లేచిపోయి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ఉద్దేశపూరితంగానే ఆమె తన హ్యాండ్ బ్యాగ్‌ను, సెల్‌ఫోన్‌ను భర్త వద్ద వదిలేసి వెళ్లిందని భావిస్తున్నారు. ఈ దృశ్యాలు చూసి దిగ్భ్రాంతుడైన సదరు భర్త పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకుండా అక్కడి నుంచి నిష్క్రమించాడు. అతని భార్య స్వచ్ఛందంగా వెళ్లిపోవడంతో ఆమె ప్రియుడితో కలిసి వెళ్లి ఉంటుందని, బాధితుడు ఫిర్యాదు చేయనందున కేసు కూడా నమోదు కాకుండానే ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిందని పోలీసులు అంటున్నారు. -
గర్ల్‌ఫ్రెండ్‌ను చూసేందుకు వచ్చి..
న్యూఢిల్లీ: గర్ల్‌ఫ్రెండ్‌ను చూసేందుకు ఓ విదేశీయుడు అక్రమంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొరబడ్డాడు. నిందితుడు ఢిల్లీ-ఫ్రాంక్ఫర్ట్ నకిలీ విమాన టికెట్‌తో టర్మినల్ 3 లోపలికి ప్రవేశించాడు. చివరకు అధికారులు గుర్తించి అతడ్ని అరెస్ట్ చేశారు. గత సోమవారం జరిగిన ఈ సంఘటన విమానాశ్రయంలో భద్రతాలోపాలను ఎత్తిచూపింది. నిందితుడిని మైకేల్ ఎలియాజ్ రోడ్రిగుజ్గా గుర్తించారు. అతడికి స్పెయిన్ పాస్‌పోర్టు ఉన్నట్టు అధికారులు చెప్పారు. ప్రవేశ ద్వారం వద్ద మైకేల్‌ను సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు మీద టికెట్ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అతడిపై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా తన గర్ల్‌ఫ్రెండ్‌ను చూసేందుకు వచ్చినట్టు అతడు చెప్పాడు. ఢిల్లీ విమానాశ్రయంలోకి భారత ప్రయాణికులతో పాటు విదేశీయులు భారీ సంఖ్యలో వస్తుంటారని, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని కఠిన నిబంధనలను అమలు చేయాల్సిన అవసరముందని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయని, అయితే ఇంతవరకు పరిష్కారం కనుగొనలేదని చెప్పారు. కొందరు నకిలీ టికెట్లతో విమానాశ్రయంలోకి వస్తున్నారని, ఇది భద్రతపరంగా ఆందోళన కలిగించే విషయమని పోలీసులు, సీఐఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్ విమానాశ్రయంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. నకిలీ టికెట్లను గుర్తించేందుకు ప్రవేశ ద్వారాల వద్ద బార్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేయనున్నారు. బ్రసెల్ బాంబు పేలుళ్ల ఘటన అనంతరం ముందుజాగ్రత్తగా విమానాశ్రయాల్లో నిఘాను పెంచారు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం బాంబు బెదిరింపు కలకలం రేపింది. రెండు విమానాల్లో బాంబులు పెట్టినట్లు ఫోన్ కాల్ రావడంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో ఢిల్లీ నుంచి నేపాల్, భువనేశ్వర్ వెళుతున్న రెండు ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేశారు. ప్రయాణికులను కిందకు దించివేసి భద్రతా సిబ్బంది, బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు చేపట్టింది. కాగా ఈ విమానాల్లో నలుగురు ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ ప్రకటించి తనీఖీలు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళ నుంచి 33 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం
ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సోమవారం రాత్రి కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ మహిళ వద్ద నుంచి 33 రౌండ్ల బుల్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మహిళపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హాలీవుడ్ హీరోకు ఢిల్లీలో చేదు అనుభవం
ఢిల్లీ: హాలీవుడ్ హీరో ఒర్లాండో బ్లూమ్కు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు చుక్కలు చూపించారు. సరైన వీసా లేకుండా వచ్చిన ఈ బ్రిటీష్ యాక్టర్‌ను తిరిగి లండన్ ఫ్లైట్ ఎక్కించారు. దీంతో బ్లూమ్ 24 గంటల వ్యవధిలో లండన్, ఢిల్లీల మధ్య రెండు సార్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికి ఉద్దేశపూర్వకంగానే బ్లూమ్‌ను ఇబ్బంది పెట్టినట్లు ఇమిగ్రేషన్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌లో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన బ్లూమ్ కు ఈ చేదు అనుభవం ఎదురవడం గమనార్హం. చివరికి ఈ వ్యవహారంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకొని ఒర్లాండోకు తాత్కాలిక వీసాను మంజూరు చేయాలని ఆదేశించడంతో ఎట్టకేలకు బ్లూమ్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. -
ఢిల్లీ ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన విమానం
న్యూఢిల్లీ: సాంకేతిక కారణాలతో ఢిల్లీ-లండన్ వర్జిన్ అట్లాంటిక్ విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టులో 4 గంటలుగా నిలిచిపోయింది. ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాల్సిన ఈ విమానం(నంబర్ వీఎస్301) గురువారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాల్సివుంది. సాయంత్రం 6 గంటలకు కూడా పైకి ఎగరలేదు. దీంతో విమానంలోకి ఎక్కిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణికులకు విమాన సిబ్బంది ఎటువంటి ఆహారం ఇవ్వలేదు. వారిని బయటకు కూడా అనుమతించకపోవడంతో విమాన సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాత విమానం బయలుదేరుతుందని సిబ్బంది చెప్పారు. -
మదగజాలు మనకెందుకు?
భోగాపురం విమానాశ్రయానికి 4,000 ఎకరాలు ఎందుకు? అక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా బతికి బట్టకట్టగలుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలూ, అంచనాలూ ఏమిటి? కానీ భోగాపురం విమానాశ్రయం హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను అధిగమిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్ముతోంది. అదే జరగాలంటే ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాల ప్రజలు మొత్తం నెలకి ఒక్కసారైనా గగనయానం చేయవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ దిశ దశ తీరు ఆందోళనకు, విచారానికి గురిచేస్తోంది. భారత దేశంలో ప్రభుత్వాలు తాము ఏం చేయదలుచుకున్నాయో, అదే చేస్తుంటాయి. కాబట్టి ప్రజలు వాటిని అదుపులో పెట్టలేరు. ఆ ప్రభుత్వాలు కూలిపోయిన తరువాత కూడా వాటి ద్వారా ఒనగూడిన నష్టాలను ప్రజలు అనుభవిస్తూ ఉండవలసిందే. ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కానీ ఆ ప్రభుత్వం వల్ల సంభవించిన చేటును ప్రజలంతా చవిచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మరో దశాబ్దానికి గాని కోలుకోలేదు. 2004-2014 మధ్య మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ విజ్ఞులైన రాజకీయవేత్తలు తప్పులు జరిగాయని భావించగానే పద్ధతి మార్చు కుంటారు. జాన్ ఎఫ్ కెన్నడీ తాను చేసిన తప్పులను గ్రహించాడు. వాటిని సరిదిద్దుకున్నాడు కూడా. అందుకే ఇప్పటికీ ఆయనను స్మరించుకుంటున్నాం. రైతులు, దళితులు, ఇతరులకు సంబంధించి 2013 భూసేకరణ చట్టం అమలు తీరు మారాలని నేను ముందునుంచీ ఆందోళన చేస్తున్నాను. పోలవరం డ్యామ్ పేరుతో, తాడిపూడి పంపింగ్ పథకం పేరుతో, కాకినాడ సెజ్ కోసం, ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం కోసం, రాజమండ్రి విమానాశ్రయం విస్తరణ కోసం ఈ పేదవర్గాల భూములను బలవంతంగా తీసుకుంటున్నారు. అవసరాలకు అనుగుణంగానే... రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు వంటి మౌలిక వసతులు అవసరమే. కానీ వాటి నిర్మాణం అవసరాలకు అనుగుణంగా జరగాలి. ఓ విమానాశ్రయమో, నౌకాశ్రయమో నిర్మించి పెడితే విమానాలూ, నౌకలూ వాటంతట అవే వస్తాయనుకోవడం తప్పుడు అభిప్రాయం. ఇది రుజువైంది కూడా. చైనా, జపాన్ వంటి దేశాలు మౌలిక వసతుల సామర్థ్యాన్ని అతిగా పెంచుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాలు అవసరం లేని రోడ్లు నిర్మించాయి. వృథాగా రైల్వేమార్గాలను నిర్మించి పెట్టుకున్నాయి. విమానాశ్రయాలను నిర్మించి ఖాళీగా పెట్టుకున్నాయి. దీనితో ఎదురైన ఆర్థికభారం ఆ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. జపాన్ సంపన్న దేశం కాబట్టి తన పౌరులను కష్టాలలో పడకుండా రక్షించుకుంది. చైనాలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు కాబట్టి, ప్రజల ఆగ్రహాన్ని అణచిపెట్టి ఉంచింది. చైనా 150 కొత్త విమానాశ్రయాలను, వందలాది కొత్త నౌకాశ్రయాలను నిర్మించింది. రైల్వే మార్గాన్ని రెట్టింపు చేసింది. వేల మైళ్ల జాతీయ రహదారులను తయారుచేసింది. కానీ వాటిలో చాలావరకు విమానాశ్రయాలలో విమానాల జాడ కానరాదు. నౌకాశ్రయాలలో నౌకల రాకపోకలు ఉండవు. రైల్వే మార్గాలు, జాతీయ రహదారులు ఖాళీ. అతి సామర్థ్యమే చైనా సంక్షోభానికి కారణమని ప్రతి ప్రముఖ ఆర్థికవేత్త చెబుతాడు. అక్కడ ఇప్పుడు చాలా సిమెంట్ కర్మాగారాలను మూసేశారు. కానీ ఒకటి. అవినీతి రాజకీయవేత్తలతో ఆ దేశం వ్యవహరించే తీరు ప్రత్యేకం. అవినీతి వ్యవహారాలలో పట్టుబడితే, అలాంటివాళ్లను కాల్చి చంపే బృందం లేదా ఉరి తీయడానికి తాళ్లు సిద్ధంగా ఉంటాయి. ఒక రైల్వే మంత్రి కాల్పుల బృందం చేతిలో మరణించాడు. ఈ గణాంకాలు తెలియవా? నౌకాశ్రయాలూ, విమానాశ్రయాల స్థాయి మౌలిక వసతుల గురించి ఆంధ్రప్రదేశ్ మాత్రమే మాట్లాడుతోంది. మికెన్సీ వంటి విదేశీ నిపుణులు, సింగపూర్ ప్రభుత్వం దీనికి సలహాదారులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురంలో 4,000 ఎకరాలలో విమానాశ్రయం నిర్మించాలని ఆరాటపడుతోంది. అలాగే రాజమండ్రి విమానాశ్రయాన్ని విస్తరించాలని అనుకుంటోంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం 3,500 ఎకరాలలో విస్తరించి ఉంది. హైదరాబాద్ విమానాశ్రయం కూడా దాదాపు అంతే. ముంబై విమానాశ్రయాన్ని 2,200 ఎకరాలలో నిర్మించారు. హైదరాబాద్‌లోనే బేగంపేట విమానాశ్రయం 700 ఎకరాలలో ఏర్పాటైంది. రోజుకు ఢిల్లీ-1,400, ముంబై-1,200, చెన్నై-400, హైదరాబాద్- 300, అహ్మదాబాద్ - 120, గోవా-100, త్రివేండ్రం-50, విశాఖపట్నం-40, భువనేశ్వర్-35, రాజమండ్రి-16 వంతున విమానాలు రాకపోకలు సాగిస్తాయి. భోగాపురం షాంఘై నగరం కాదు భోగాపురాన్ని ఎవరైనా ఒక పెద్ద నగరంగా భావించగలరా? అదేమైనా చైనాలో షాంఘై నగరమా? విశాఖ విమానాశ్రయానికి 40 విమానాలు రాకపోకలు సాగిస్తుంటే, భోగాపురానికి 4 మించి రాకపోకలు సాగించవు. అసలు ఒక్కటి కూడా రాకపోయినా ఆశ్చర్యం లేదు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నదేమిటి? ఒక్కొక్క ప్రయాణికుడి రూ. 500 వంతున అభివృద్ధి రుసుము కింద చెల్లిస్తే తప్ప వాటిని నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వానికి చెప్పాయి. ఆ రకంగా చూస్తే ప్రయాణికుడు నుంచి రూ. 2,000 వసూలు చేస్తే తప్ప భోగాపురం విమానాశ్రయాన్ని నిర్వహించడం సాధ్యం కాదు. ఒకవేళ ఇది ప్రభుత్వ నిర్వహణలో విమానాశ్రయమైతే, నాసిక్ విమానాశ్రయం మాదిరిగా మూసుకోవాలి. భోగాపురం విమానాశ్రయానికి 4,000 ఎకరాలు ఎందుకు? అక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా బతికి బట్టకట్టగలుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలూ, అంచనాలూ ఏమిటి? కానీ భోగాపురం విమానాశ్రయం హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను అధిగమిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్ముతోంది. అదే జరగాలంటే ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాల ప్రజలు మొత్తం నెలకి ఒక్కసారైనా గగనయానం చేయవలసి ఉంటుంది. విజయవాడ, విశాఖ విమానాశ్రయాలు ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాలు. మరి, కేవలం 200 మైళ్ల పరిధిలో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎందుకు? నిజానికి రాజమండ్రి, విశాఖ, విజయవాడ విమానాశ్రయాలు ఇప్పటికి కూడా ఉదయం, సాయంత్రం తప్ప మిగిలిన సమయం మొత్తం ఖాళీగా ఉంటాయి. ఈ నౌకాశ్రయాలు అవసరమా? ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం, రవ్వ, భావనపాడు నౌకాశ్రయాలు పనిచేస్తున్నాయి. ఇంకా మచిలీపట్నం, నరసాపురం, నిజాంపట్నం, ఓడరేవు, ముత్యాలంపాలెం, భీమునిపట్నం నౌకాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్ పర్యటన సందర్భంగా కేవలం కొన్ని మైళ్ల దూరంలో దగ్గరదగ్గరగానే నౌకాశ్రయాలు చూసి, ఇక్కడ కూడా అలాగే నిర్మిస్తే అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందని అభిప్రాయపడుతున్నారని మీడియాలో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తోంది. కానీ జపాన్‌లో కనిపించే ఆ నౌకాశ్రయాలన్నీ వందల సంవత్సరాల క్రితమే నిర్మించుకున్నవి. 1900 సంవత్సరం నుంచి మొదట రష్యాతో తరువాత అమెరికాతో జరిగిన యుద్ధాల సమయంలో వాటిని నిర్మించుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి చరిత్ర లేదు. భావనపాడు, కళింగపట్నాలలో చేపలవేటకు ఉద్దేశించిన నౌకాశ్రయాల నిర్మాణం పూర్తయింది. తీరా చేపలవేట పడవలను ఎక్కువగా విశాఖలోనే ఉపయోగిస్తున్నారు. కానీ చేపలవేట సాగించే పడవలు లేని చోట్ల వేల ఎకరాలు సేకరించి నౌకాశ్రయాలు నిర్మించారు. చైనాను చూసి మోసపోవద్దు మన నాయకులు చైనాలో పర్యటించి వచ్చి, అక్కడి అభివృద్ధి గురించి ఊదరగొడుతూ ఉంటారు. కానీ చైనా అభివృద్ధిని చూసి ఇవాళ ప్రపంచం నవ్వుకుంటోంది. గడచిన సంవత్సరం 130 చైనా విమానాశ్రయాలు బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూశాయని ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక వ్యాఖ్యానించింది. ఎనిమిదేళ్ల క్రితం ప్రఫుల్ పటేల్ పౌర విమానయాన మంత్రిగా ఉండగా నాసిక్ నగరానికి ఒక విమానాశ్రయాన్ని మంజూరు చేశారు. అక్కడ నుంచి ఒక్క విమానం కూడా ఎగరదు, దిగదు. దానిని వైమానిక దళాన్ని తీసుకోమన్నారు. ఇప్పుడు పటేల్ మంత్రి కాదు. కాబట్టి బంట్రోతు కూడా ఆయన మాట వినడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఆ శాఖను నిర్వహిస్తున్నప్పటికి ఇలాంటి పనికి మాలిన బహుమానాలు మాత్రం మనకి వద్దు. ఇంకో పౌర విమానయాన మంత్రి వస్తే తరువాత పరిస్థితి ఏమిటి? నాలుగు వేల ఎకరాల భూమిని ఎందుకు వృథా చేయాలి? ఈ దండగమారి వ్యవహారాలు ఎందుకు! భోగాపురం విమానాశ్రయం శుద్ధ దండగమారి వ్యవహారం. దేశంలోని మిగిలిన విమానాశ్రయాల కోసం సేకరించిన భూమి, భోగాపురం విమానాశ్రయం కోసం సేకరించిన భూమి కంటే తక్కువేనని గణాంకాలు చెబుతున్నాయి. నాసిక్ విమానాశ్రయం వలె దీనిని మూసివేయడం జరగదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు తీసుకున్న రైతులకు భరోసా ఇవ్వాలి. ఐదేళ్ల తరువాత కూడా విమానాశ్రయం పుంజుకోకపోతే రైతుల భూములు వారికి తిరిగి ఇవ్వాలి. నిజానికి రాకపోకలు సరిగా లేని, 4,000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన విమానాశ్రయాన్ని నిర్వహించే సామర్థ్యం ప్రభుత్వానికి లేదు. అంతా సజావుగా సాగాలంటే ఇక్కడికి రోజుకు కనీసం 500 విమానాలు రాకపోకలు సాగించాలి. మచిలీపట్నం సహా, ఇతర నౌకాశ్రయాలు కూడా వ్యర్థమే. ఇవి సహజ నౌకాశ్రయాలు కాకపోవడం వల్ల, నిత్యం పూడిక తీయవలసిన పని ఉంటుంది. ఇంత భూమి సేకరించడం వెనుక ఆలోచన చూస్తుంటే, ఎవరో రియల్ఎస్టేట్ వ్యాపారులకు భూమి అప్పగించి, మనకి ఇంకో నౌకాశ్రయం వచ్చిందని చెప్పడానికే అని అనిపిస్తుంది. కాకినాడ సెజ్ 10,000 ఎకరాల భూమికి సంబంధించినది. కానీ అక్కడ జరుగుతున్నదేమీ లేదు. సెజ్ పేరుతో తీసుకున్న తమ భూములను వెనక్కు ఇవ్వాలని అక్కడ రైతులు కోరుతున్నారు. ఒకటి వాస్తవం. మహారాజులు కూడా తెల్ల ఏనుగులను భరించలేరు. నిజానికి అనాలోచితంగా నిర్మించిన విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు తెల్ల ఏనుగులు కూడా కాదు. అవి మదగజాలు. మనుషులను చంపడానికే ఉపయోగపడతాయి. అవి మనకొద్దు. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 98682 33111 - పెంటపాటి పుల్లారావు -
పాలెం విమానాశ్రయానికి కలాం పార్థివదేహం
-
ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఎయిర్ఇండియా
-
ఢిల్లీలో అణుధార్మికత లీకేజీ కలకలం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అణుధార్మిక పదార్థం లీకేజీ కలకలం రేపింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అణుధార్మిక పదార్థాలు లీకవడంతో ఆందోళన రేగింది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయే కనుగొనేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బృందం రంగంలోకి దిగింది. టర్కీ నుంచి వచ్చిన కార్గో విమానంలో ఇది వచ్చినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఫోర్టిస్ ఆస్పత్రి కోసం ఇస్తాంబుల్ నుంచి దీన్ని తెప్పించారని ఎన్డీఆర్ఎఫ్ డీజీ తెలిపారు. ఫోర్టిస్ ఆస్పత్రి సిబ్బందిని పిలిపించి విచారిస్తున్నట్టు చెప్పారు. పరిస్థితిని కనిపెట్టి చూస్తున్నామని చెప్పారు. ఎయిర్ పోర్టులోని కార్గో కాంపెక్స్ నుంచి అణుధార్మికత లీకయినట్టు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అణుశక్తి విభాగం బృందం కూడా విమానాశ్రయానికి చేరుకుందన్నారు. అణుధార్మికత లీకేజీని నియంత్రించారని తనకు సమాచారం ఇచ్చారని చెప్పారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అణుధార్మికత లీకైందన్న కోణంలో సీఐఎస్ఎఫ్, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
65 కోట్లు విలువైన కొకైన్ స్వాధీనం
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో రూ.65 కోట్లు విలువైన కొకైన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1.3 కిలోల కొకైన్‌ని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. -
ఇమిగ్రేషన్ అధికారి పైశాచికం
నీకు పిల్లలెంతమంది? స్మోక్ చేస్తావా? చికెన్ తింటావా? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నావా? ఒక్కదానివే వెళుతున్నట్టున్నావ్.. మజా చేయడానికేనా? భర్త ఊళ్లో లేనప్పుడు ఒక్కసారైనా వేరే వ్యక్తితో గడిపావా? నా ద్వారా మూడో సంతానాన్ని కంటావా? మీ ఆయన లేనప్పుడు కాల్ చేస్తా.. నీ ఫోన్ నంబర్ ఎంత?.. ఇవీ.. ఒంటరిగా ప్రయాణిస్తోన్న ఓ మహిళను ఢిల్లీ ఎయిర్ పోర్టు ఇమిగ్రేషన్ అధికారి అడిగిన పైశాచిక ప్రశ్నలు! హాంకాంగ్ లో ఉంటోన్న తన భర్తను కలుసుకునేందుకు మార్చి 18న బెంగుళూరులో బయలుదేరిన మహిళ.. ఇంటర్నేషనల్ సర్వీస్ ఎక్కేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని ఇమిగ్రేషన్ కౌంటర్‌కు వెళ్లింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న వినోద్ కుమార్ అనే ఇమిగ్రేషన్ అసిస్టెంట్ దారుణమైన ప్రశ్నలడిగి ఆ ప్రయాణికురాలిని మానసికంగా, లైంగికంగా వేధించాడు. హాంకాంగ్ వెళ్లే ఫ్లయిట్ ఎక్కేంతవరకు ఆమె వెంటే తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేశాడు. మార్చి 23న భర్తతో కలిసి ఇండియా తిరిగొచ్చిన ఆమె.. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదుచేసింది. స్పందించిన అధికారులు వినోద్ కుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ ఘటనతో ఎయిర్ పోర్టుల్లో మహిళల భద్రత చర్చనీయాంశంగా మారింది. -
విమానం కోసం ప్రయాణికుల పడిగాపులు
హైదరాబాద్ నుంచి లండన్, జర్మనీ బయల్దేరిన ప్రయణికులు ఢిల్లీలో నిలిచిపోయారు. మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో నిలిపివేశారు. ఏ కారణంతో విమానం ఆలస్యం అవుతుందో కూడా ఎయిర్ ఇండియా సిబ్బంది వెల్లడించ లేదు. దీంతో ఎయిర్ పోర్టులోనే ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. -
173 విమానాల రాకపోకలకు ఆటంకం
న్యూఢిల్లీ: పొంగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. పొంగ మంచు దట్టంగా అలముకోవడంతో వెలుతురు మందగించి విజిబిలిటి 50 మీటర్ల దిగువనకు పడిపోయింది. ఫలితంగా ఆరు గంటల పాటు విమాన రాకపోకలు స్తంభించాయి. 173 విమానాలు ఆలస్యంగా నడిచాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణంగా రెండు విమాన సర్వీసులు రద్దు చేశారు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఖలిస్తాన్ టెర్రరిస్టు అరెస్టు
న్యూఢిల్లీ : ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన టెర్రరిస్టును శుక్రవారం పంజాబ్ పోలీసులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. అతడిని హర్మిందర్ మింటూగా గుర్తించారు. థాయిలాండ్ అధికారులు ఆ దేశం నుంచి మింటూను బహిష్కరించారని పోలీసులు తెలిపారు. అతడిని ఆ దేశరాజధాని బ్యాంకాంగ్‌లో అదుపులోకి తీసుకొన్నట్లు తెలిపారు. అత డి సమాచారం సేకరించిన తర్వాత దేశబహిష్కారం చేసినట్లు చెప్పారు. మింటూకు పంజాబ్‌లో పలు ఉగ్రవాద కేసులు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాంతంలో పలు ఉగ్రదాడులకు మింటూ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. -
ఇండిగో విమానంలో మంటలు
న్యూఢిల్లీ: ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన ఇండిగో విమానానికి మంటలంటుకున్నాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత విమానంలో స్వల్పంగా మంటలు వ్యాపించాయి. ప్రయాణికులను అత్యవసర ద్వారాల నుంచి బయటకు తీసుసుకువచ్చారు. ప్రమాద సమయంలో విమానంలో 147 మంది ప్రయాణికులున్నారు. వీరంతా సురక్షితంగా విమానం నుంచి కిందకు దిగారని ఇండిగో యాజమాన్యం తెలిపింది. మంటలు వ్యాపించడానికి గల కారణాలు వెల్లడికాలేదు. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
పౌడర్ తెచ్చిన తంటా..
బాలీవుడ్ నటి రిచా చద్దాకు ఢిల్లీ విమానాశ్రయంలో చేదు అనభవం ఎదురైంది. ఇటీవల ఆమె ముంబై వెళ్లేందుకు ఢిల్లీలో విమానాశ్రయానికి రాగా, బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని సెక్యూరిటీ అధికారులు ఆపేశారు. రెండు గంటలపాటు విచారణ జరిపిన తర్వాత గాని విడిచిపెట్టలేదు. ఇంతకీ ఆమె వద్ద వివాదాస్పదంగా ఉన్న వస్తువు ఏంటో తెలుసా.. ‘పౌడర్’.. అవునండీ.. మీరు చదివింది నిజమే.. రిచా బ్యాగ్‌లో ఉన్న పౌడర్‌పై విమానాశ్రయ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవానికి అది ఆయుర్వేద పద్ధతిలో తయారుచేసిన అందాన్ని సంరక్షించే పౌడరు. రిచా గత ఆరు నెలలుగా తన సౌందర్య రక్షణ కోసం ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రత్యేకంగా తయారుచేసిన ఆయుర్వేద పౌడర్‌ను ప్రయాణ సమయంలో ఆమె నిత్యం తన వెంట తీసుకువెళతారు. అయితే ఈ సారి ప్రయాణంలో ఆ పౌడర్ ఈ అందాల బాలీవుడ్ నటికి తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ విషయాన్ని రిచా ధ్రువీకరించింది.. ‘అవును.. నాకు ఆయుర్వేదంలో విపరీతమైన నమ్మకం. నా వెంట ఎప్పుడూ ఆయుర్వేద ఉత్పత్తులు ఉంటాయి. అయితే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆయుర్వేద పౌడర్‌ను చూసి అనుమానించిన అధికారులకు దాని గురించి పూర్తిగా వివరించాను. రెండు గంటలపాటు వారి అనుమానాలను నివృత్తి చేశాను. వారిపై నాకు ఎటువంటి కోపం లేదు.. వారి పనిని వారు సక్రమంగా నిర్వర్తించారు.. అందుకే వారికి పూర్తిగా సహకరించాను. అయితే అదృష్టం కొద్దీ నా విమానం మిస్ కాలేదు..’ అని ఆమె ముక్తాయించారు. -
బాలీవుడ్ నటిని రెండు గంటలపాటు ...
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి రిచా చద్దాను ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతాధికారులు, ఆధికారులు నిలిపివేసి ప్రశ్నించారు. రిచా చద్దా బ్యాగ్ లో ఉన్న వస్తువుపై అనుమానం తలెత్తడంతో అధికారులు సోదా చేశారు. రిచా చద్దా చర్మ సౌందర్యానికి ఉపయోగించే వస్తువులలో ఓ పౌడర్ పై అధికారులకు అనుమానం కలిగింది. చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందుకు గత ఆరు నెలలుగా సాంప్రదాయ పద్దతిలో ఆయుర్వేద పౌడర్ ఉపయోగిస్తున్నట్టు రిచా చద్దా అధికారులకు వెల్లడించారు. ఆయుర్వేద పౌడర్ చెప్పినా అధికారులకు నమ్మకం కలగపోవడంతో తనను రెండు గంటలపాటు ప్రశ్నించారని రిచా చద్దా మీడియాకు వెల్లడించారు. ఆయుర్వేద వస్తువులపై నాకు నమ్మకం చాలా ఎక్కవ. ముంబైకి ఆయుర్వేద వస్తువులు తీసుకెళ్లడం అలవాటు. ఈసారి మాత్రమే సమస్యగా మారింది అని రిచా చద్దా అన్నారు. తన వెంట ఉన్న ఆయుర్వేద వస్తువులను ఓపెన్ చేసి భద్రతాధికారులు తనిఖీ చేయడం ఇష్టం లేదని.. వాటిని నిలువ చేయడం చాలా కష్టపనైనందున తాను తొలుత నిరాకరించానని.. రెండు గంటలపాటు అధికారులను ఒప్పించడానికి శ్రమించినా.. ఉపయోగం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తనిఖీలకు అంగీకరించానని రిచా చద్దా అన్నారు. 'గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్', 'ఓయే లక్కి! లక్కి ఓయే' అనే చిత్రాల్లో రిచా చద్దా నటించింది. -
ఐదుగురు అగ్ర నేతలను వెంటాడిన ప్రమాదాలు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో అసలైన ప్రజా నాయకులుగా కీర్తిప్రతిష్టలు అందుకున్న ఐదుగురు అగ్ర నేతలను రోడ్డు ప్రమాదాలు కబళించాయి. ప్రజలకు మరింత కాలం సేవ చేయాలనున్న వారిని వెంటాడి మృత్యు ముఖంలోకి లాక్కెళ్లాయి. గోపీనాథ్ ముండే: మహారాష్ట్రలో బీసీ నాయకుడిగా, ప్రజా నేతగా రాజకీయాల్లో రాణిస్తూ వచ్చిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మంగళవారం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ముంబై వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా దారిలో ఓ కారు పక్క నుంచి ఢీకొట్టడంతో తీవ్ర షాక్‌కు గురైన ముండే గుండెపోటు, అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో మృతిచెందారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని 2004, 2009లో ఒంటి చేత్తో గెలిపించిన జన నేత, ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సాహిబ్‌సింగ్ వర్మ: ఢిల్లీ సీఎంగా (1996-1998), కేంద్ర మంత్రిగా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత సాహిబ్‌సింగ్ వర్మ 2007 జూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రాజేశ్ పైలట్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజేశ్ పైలట్ రాజస్థాన్‌లోని దౌసా సమీపంలో 2000 సంవత్సరం జూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మాధవరావు సింధియా: మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తొమ్మిదిసార్లు ఎంపీగా వరుసగా గెలిచిన మాధవరావు సింధియా 2001లో యూపీలో జరిగిన ప్రైవేటు విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. -
బిస్కెట్లు తింటే నిలువు దోపిడే!
న్యూఢిల్లీ:విదేశాల నుంచి నెల క్రితం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన ఒక ఇంజనీర్ ట్యాక్సీ తీసుకొని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. కాన్పూర్ వెళ్లే రైలు కోసం ప్లాట్‌ఫారంపై ఎదురుచూస్తూ కూర్చున్నారు. కాసేపటికి సహా ప్రయాణికుడిలా వచ్చిన వ్యక్తి ఇతనితో మాటలు కలిపాడు. తాగండంటూ టీ ఇచ్చాడు. టీ తాగిన ఇంజనీర్ కొద్దిసేపటికి స్పృహ కోల్పోయాడు. స్పృహ వచ్చాక చూసుకుంటే తన దగ్గరున్న విలువైన వస్తువులన్నీ మాయమైనట్టు బాధితుడు గుర్తించాడు. ఢిల్లీలోని రైల్వే స్టేషన్లలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. జెహర్ ఖురానీ వంటి పలు ముఠాలు ఢిల్లీ నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో ప్రయాణికులకు మత్తుమందులు ఇచ్చి తరచూ దోపిడీలకు పాల్పడుతున్నాయి. ఏటా వందల సంఖ్యలో ఇలాంటివి జరుగుతుండడంతో ఢిల్లీ పోలీసుశాఖ అప్రమత్తమయింది. ఢిల్లీకి వలస వచ్చే పొరుగు రాష్ట్రాలవాసుల్లో చాలా మందికి హిందీ రాదు కాబట్టి నేరాలపై వారి మాతృభాషలోనే అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. నేరాల నిరోధానికి తాము చేస్తున్న ప్రచారం ప్రతి ఒక్కరికీ చేరాలని కోరుకుంటోంది. ఢిల్లీ రైల్వే స్టేషన్లు, బస్టాపుల వంటి రద్దీ ప్రదేశాల్లో మత్తుమందుల రవాణా, దోపిడీ ముఠాల బారిన పడకుండా ప్రజలను రక్షించడానికి తీసుకోవడానికి చర్యల గురించి రైల్వేస్టేషన్లలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రాజధానిలో బీహార్, యూపీవాసుల సంఖ్య అధికం కాబట్టి వారి కోసం భోజ్‌పురి భాషలోనూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ‘యాత్రిజన్ సె అనురోధ్ బా, కోయీ సే జల్డీ దోస్తీ నా కరే, న కెహు కె దెహల్ ఖయీన్’ (అపరిచితులతో చనువుగా వ్యవహరించవద్దని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వారి నుంచి ఆహార పదార్థాలు స్వీకరించవద్దు) అంటూ భోజ్‌పురి భాషలో సాగే సందేశం ఆనంద్‌విహార్ రైల్వే స్టేషన్లో తరచూ వినిపిస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే చాలా రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి కాబట్టి భోజ్‌పురి భాషలో ప్రచారం చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఈ ముఠా సభ్యులు టికెట్ కౌంటర్లు లేదా రైళ్లలో సహప్రయాణికులతో స్నేహంగా మెలుగుతారు. హిందీ, భోజ్‌పురి లేదా బెంగాలీలో మాట్లాడి వారితో చనువు పెంచుకుంటారు. కాసేపు ఆగిన తరువాత వారికి మత్తుమందు కలిపిన బిస్కెట్లు, చాయ్ లేదా కూల్డ్రింకులు ఇస్తారు. బాధితులు స్పృహ కోల్పోగానే వారి దగ్గరున్న విలువైన వస్తువులన్నింటినీ తీసుకొని మాయమవుతారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో మత్తుమందులు ఇవ్వడం కీలకమైన దని, తేలిగ్గా ఎవరు లొంగుతారో ఈ ముఠాలకు బాగా తెలుస్తుందని రైల్వేశాఖ డీసీపీ సంజయ్ భాటియా తెలిపారు. ‘వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులకు మా ప్రచారం చేరేందుకు వీలుగా భోజ్‌పురి భాషలోనూ ప్రచారం చేస్తున్నాం. బెంగాలీలోనూ ఎనౌన్స్‌మెంట్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆనంద్‌విహార్ రైల్వే స్టేషన్లో ప్రతి అరగంటకు ఒకసారి ప్రకటనలు ఇస్తున్నాం. మిగతా స్టేషన్లలోనూ త్వరలోనే ప్రకటనలు ఇస్తాం’ అని ఆయన వివరించారు. ఇలా రైళ్లలో ప్రయాణికులను మోసగిస్తూ గత ఐదేళ్లలో 101 మంది పోలీసులకు చిక్కారు. వీరి నేరాలశైలిని వివరిస్తూ పుస్తకాలు రూపొందించిన పోలీసులు.. వాటిని రైల్వే ఉద్యోగులు, సిబ్బందికి కూడా పంచిపెట్టారు. దొంగల ముఠాల కార్యకలాపాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించాల్సిందిగా ఉద్యోగులందరికీ సూచించామని భాటియా అన్నారు. అపరిచితుల నుంచి తినుబండారాలు తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు. నేరగాళ్ల ఆటకట్టించడానికి తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
టీ-బిల్లు ప్రతులతో మంత్రుల ఫొటోలు
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) ఢిల్లీకి చేరడంతో తెలంగాణ ప్రాంత నాయకులు సంబరపడుతున్నారు. త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెడతారని, ఇక రాష్ట్రం సిద్ధించినట్లేనని భావిస్తున్నారు. హస్తిన చేరిన మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో తెలంగాణ బిల్లు ప్రతులు సూట్ కేసులతో ఫోటోలు దిగారు. కాగా 400 కిలోల గల 15 బండిల్స్ ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ లలితాంబిక ఆధ్వర్యంలో తెలంగాణ బిల్లు ముందుగా ఏపీ భవన్ కు, అక్కడ నుంచి కేంద్ర హోంశాఖకు చేరింది. మరోవైపు తెలంగాణ బిల్లుపై సభ్యుల అభిప్రాయాల నివేదిక ఉదయం 11.45 గంటలకు ఢిల్లీ చేరనుంది. -
ఢిల్లీ విమానాశ్రయంలో కోటి రూపాయల బంగారం పట్టివేత
దాదాపు కోటి రూపాయల విలువైన బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొస్తున్న ఓ వ్యక్తిని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కర్ణాటకలోని అలీపూర్ ప్రాంతానికి చెందిన నిందితుడు బ్యాంకాక్ నుంచి వస్తుండగా కస్టమ్స్ అధికారులు అతడిని పట్టుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అతడి చేతిలో ఉన్న లగేజిలో బంగారు కడ్డీలు దొరికాయి. నాలుగు బంగారు కడ్డీలను తెల్లటి టేపుతో చుట్టారు. అవి ఒక్కొక్కటి కిలో చొప్పున బరువున్నాయి. వీటి విలువ రూ. 1.04 కోట్లు ఉంటుందని కస్టమ్స్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అతడిని అరెస్టు చేసి మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సింగపూర్ వెళ్లే విమానం ఎక్కాల్సి ఉందని అధికారులు చెప్పారు. అతడిని డిసెంబర్ నాలుగో తేదీ వరకు కస్టడీపై తీహార్ జైలుకు పంపారు.