
ఢిల్లీ ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన విమానం
సాంకేతిక కారణాలతో ఢిల్లీ-లండన్ వర్జిన్ అట్లాంటిక్ విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టులో 4 గంటలుగా నిలిచిపోయింది.
న్యూఢిల్లీ: సాంకేతిక కారణాలతో ఢిల్లీ-లండన్ వర్జిన్ అట్లాంటిక్ విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టులో 4 గంటలుగా నిలిచిపోయింది. ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాల్సిన ఈ విమానం(నంబర్ వీఎస్301) గురువారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాల్సివుంది. సాయంత్రం 6 గంటలకు కూడా పైకి ఎగరలేదు. దీంతో విమానంలోకి ఎక్కిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ప్రయాణికులకు విమాన సిబ్బంది ఎటువంటి ఆహారం ఇవ్వలేదు. వారిని బయటకు కూడా అనుమతించకపోవడంతో విమాన సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాత విమానం బయలుదేరుతుందని సిబ్బంది చెప్పారు.