
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : ఓ విమానానికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో హైజాక్ టెన్షన్ వెంటాడింది. రన్ వేపై టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానంలో ఆకస్మాత్తుగా హైజాక్ అలారం మోగింది. నిమిషాల వ్యవధిలోనే భద్రతా బలగాలు విమానాన్ని చుట్టుముట్టడంతో.. ఏం జరుగుతుందోనని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అనంతరం పైలట్ రాంగ్ బటన్ నొక్కడంతోనే అలారం మోగిందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. అరియాన అఫ్గాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 133 మంది ప్రయాణీకులు, సిబ్బందితో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు టేకాఫ్‌కు సిద్ధమైంది.
రన్ వే పై నుంచి విమానం గాల్లోకి ఎగురుతుందనగా.. అలారం మోగడంతో అలజడి రేగింది. దీంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో.. గట్టిగా కేకలు వేశారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు.. పరుగున రన్ వేపైకి వచ్చేశాయి. వెంటనే ఫ్లైట్‌ను చుట్టుముట్టాయి. విమానంలోకి అడుగు పెట్టిన భద్రతా సిబ్బంది ఏం జరిగిందని ఆరా తీయగా.. పైలెట్ పొరపాటున హైజాక్ అలారం బటన్ నొక్కాడని తేలింది. ఈ ఘటనతో విమానం రెండు గంటల ఆలస్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment