న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి కాందహార్(అఫ్గానిస్తాన్) వెళ్తున్న విమానంలో పైలట్ పొరపాటున ‘హైజాక్ మీట’ నొక్కడం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ విమానాశ్రయంలో శనివారం జరిగిన ఈ ఘటన భద్రతా సిబ్బదిని తెగ హైరానాకు గురిచేసింది. సుమారు రెండు గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతే విమానం బయల్దేరింది. 124 మంది ప్రయాణికులతో అరియానా అఫ్గాన్ విమానం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ అవడానికి సిద్ధమవుతుండగా పైలట్ పొరపాటున హైజాక్ మీట నొక్కాడు. వెంటనే స్పందిన ఎన్‌ఎస్‌జీ కమాండోలు విమానాన్ని చుట్టిముట్టి రన్‌వేకు దూరంగా తీసుకెళ్లి తనిఖీలు నిర్వహించారు. పైలట్ పొరపాటున హైజాక్ మీట నొక్కారని నిర్ధారించుకున్నాక విమానం బయల్దేరడానికి అనుమతిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment