nsg commandos
-
ఎక్కడికక్కడ అప్రమత్తం .. భద్రత కట్టుదిట్టం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కీలక నేతలు హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో.. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమావేశాలు జరిగే మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)తోపాటు నోవాటెల్, రాజ్‌భవన్, బేగంపేట.. మోదీసభ జరిగే పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పెద్దయెత్తున భద్రతాబలగాలు మోహరిస్తున్నాయి. స్పెష ల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ), కేంద్ర బలగాలతో కలిసి నాలుగంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 15 వేల మంది భద్రత, బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ, ఆక్టోపస్, శాంతిభద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు రంగంలోకి దిగుతున్నాయి. నగరవ్యాప్తంగా నిఘా, తనిఖీతోపాటు భారీగా మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రధాని తిరిగే మార్గాల్లో రూట్పార్టీలు ఉంటాయి. దుర్భేద్యంగా హెచ్ఐసీసీ జాగిలాలతో హెచ్ఐసీసీ, నోవాటెల్ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఎత్తైన భవనాల పైనుంచి రూఫ్‌టాప్ వాచ్ చేస్తున్నారు. పాస్ ఉన్న వాహనాలు, వ్యక్తులను మాత్రమే హెచ్ఐసీసీ లోపలికి అనుమతిస్తున్నారు. హైటెక్స్ లోపలికి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్నీ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పాస్‌లేని పోలీస్ వాహనాలను సైతం తిప్పి పంపి స్తున్నారు. హెచ్ఐసీసీ వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ కేంద్రాలలో కరోనా పరీక్షలు నిర్వహించాకే లోపలికి అను మతి ఇస్తున్నారు. ఈ నెల 4వ తేదీ వరకు సైబరాబాద్ కమి షనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఐదుగురి కంటే ఎక్కువమంది గుమిగూడితే అరెస్టు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. శుక్రవా రం పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లిన హైదరా బాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులతో బందోబస్తు, భద్రత ఏర్పాట్లు సమీక్షించారు. మరోపక్క బేగంపేట విమానాశ్రయం నుం చి పరేడ్ గ్రౌండ్స్‌కు, అక్కడ నుంచి రాజ్‌భవన్ వరకు సెక్యూరిటీ, కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. గ్రౌండ్స్ ను శనివారం ఎస్పీజీ అ«ధీనంలోకి తీసుకోనుంది. శుక్రవా రం నుంచే బేగంపేట విమానాశ్రయం, పరేడ్ గ్రౌండ్స్, బాంబు నిర్వీర్యబృందాలతో తనిఖీ చేస్తున్నారు. ముందస్తు అరెస్టులు.. ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలు విధ్వంసానికి దారితీయడం, ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వటంతో ప్రధాని పర్యటన నేపథ్యంలో అకస్మాత్తుగా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎమ్మార్పీఎస్ శనివారం సడక్‌బంద్‌కు పిలుపు ఇవ్వటంతో అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా సైబరాబాద్ పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. నేరచరితులు, రౌడీషీటర్లకు బైండోవర్లు విధిం చా రు. శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలో ఎమ్మార్పీఎస్ పార్టీ కన్వీనర్ రాచమల్ల రాజును పోలీసులు అరెస్టు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు.. హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్ పరిసర ప్రాంతాలలో శని, ఆదివారాల్లో పలు మార్గాలలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. జేఎన్టీయూ నుంచి సైబర్ టవర్స్, మియాపూర్ నుంచి కొత్తగూడ, కావూరి హిల్స్ నుంచి కొత్తగూడ, బయోడైవర్సిటీ నుంచి జేఎన్టీయూ, నారాయణమ్మ కాలేజ్ నుంచి గచ్చిబౌలి మార్గాలలో భారీ వాహనాలకు ప్రవేశం లేదు. ట్రాఫిక్ మళ్లింపు మార్గాలివే.. ►నీరూస్ జంక్షన్ నుంచి కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలను దుర్గం చెరువు – ఇనార్బిట్ – ఐటీసీ కోహినూర్ – ఐకియా – బయోడైవర్సిటీ – గచ్చి బౌలి మీదుగా సీవోడీ జంక్షన్‌కు మళ్లిస్తారు. సైబర్ టవర్స్, హైటెక్స్ జంక్షన్ల మీదుగా ప్రవేశం లేదు. ►మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట మీదుగా హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనాలు రోలింగ్ హిల్స్ – ఏఐజీ హాస్పిటల్ – ఐకియా – ఇన్నార్బిట్ – దుర్గం చెరువు రోడ్ మీదుగా వెళ్లాలి. ►ఆర్సీపురం, చందానగర్ మీదుగా మాదాపూర్, గచ్చిబౌలి వైపునకు వచ్చే వాహనాలు బీహెచ్ఈఎల్ – నల్లగండ్ల – హెచ్‌సీయూ – ఐఐఐటీ – గచ్చిబౌలి రోడ్డు మీదుగా వెళ్లాలి. అల్విన్, కొండాపూర్ రోడ్లో వాహనాలకు ప్రవేశం లేదు. -
రిపబ్లిక్ డే టార్గెట్‌గా భారీ కుట్ర.. దేశ రాజధానిలో బాంబు కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఢిల్లీలో గుర్తుతెలియని దుండగులు బాంబును అమర్చారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలంగా మారింది. స్థానిక ఘాజీపూర్ ఫ్లవర్ మండీలో ఒక బ్యాగ్ ఉండటాన్ని స్థానికులు గమనించారు. చాలాసేపటి నుంచి బ్యాగ్ మార్కెట్లోనే ఉండటంతో అనుమానంతో.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, నేషనల్‌సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక పరికంతో బ్యాగ్ స్కాన్ చేసి పరిశీలించారు. ఆ బ్యాగ్‌లో పేలుడు పదార్థం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే స్థానికులను అప్రమత్తం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. భారీగా భద్రత దళాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. బ్యాగ్‌లో 3 కిలోల ఐఈడీ పేలుడు పరికరం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత.. ఒక రోబో సహయంతో ఆ బ్యాగ్‌ను మైదాన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ భూమిలో ఎనిమిదడుగుల లోతులో ఆ పరికరంను ఉంచి బాంబ్‌ను నిర్వీర్యం చేశారు. నేషనల్ సెక్యురీటి గార్డు అధికారులు సమయానికి స్పందించడంతో పెద్ద ముప్పుతప్పింది. ఇంకా ఎక్కడైన బాంబులు ఉన్నాయా.. అన్న కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్లవర్ మండీ మార్కెట్ భోగి పండుగ నేపథ్యంలో ప్రజలతో రద్దీగా ఉంటుంది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సంవత్సరం పాటు చేపట్టిన దీక్షా స్థలం కూడా ఘాజీపూర్ మండీకి సమీపంలోనే ఉంది. గణతంత్ర దినోత్సవానికి కొద్దిరోజుల ముందే బాంబు ఘటన వెలుగుచూడటంతో నేషనల్ సెక్యూరిటీ గార్డు సిబ్బంది, స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం డీసీపీ ప్రమోద్ కుష్వాహ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని సీసీఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హై అలెర్ట్ కొనసాగుతుంది. చదవండి: యూపీ రాజకీయాల్లో కీలక మార్పులు.. ఎస్పీలో చేరిన ఇద్దరు బీజేపీ మంత్రులు -
కెమ్ ఛో ట్రంప్!
అహ్మదాబాద్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు గుజరాత్ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ రాక సందర్భంగా కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా చర్యలను చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోతెరాలో ప్రధాని మోదీ, ట్రంప్ చేపట్టే తొలి కార్యక్రమానికి ప్రభుత్వం ‘కెమ్ ఛో ట్రంప్’గా నామకరణం చేసింది. గుజరాతీలో ఈ మాటకు..‘ఎలా ఉన్నారు ట్రంప్?’ అని అర్థం. గత ఏడాది అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ పాల్గొన్న ‘హౌడీ మోదీ’ తరహాలోనే ఇది జరగనుంది. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు అడుగుపెట్టిన దగ్గర్నుంచీ వారిని అనుక్షణం వెన్నాడి ఉండేందుకు జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) స్నైపర్ బలగాలను మోహరించనుంది. ఎటువంటి అనూహ్య పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పది వేల మందికిపైగా పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తోంది. ప్రముఖుల భద్రతలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, నిఘా విభాగాలతోపాటు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం కూడా పాలుపంచుకోనున్నాయి. 22 కిలోమీటర్ల రోడ్ షో ఎయిర్‌పోర్టు ప్రాంతం, రోడ్ షో, సబర్మతి ఆశ్రమం, మోతెరా స్టేడియంలో భద్రతను అహ్మదాబాద్ పోలీసులు పర్యవేక్షిస్తారని పోలీస్ డిప్యూటీ కమిషనర్ విజయ్ పటేల్ వెల్లడించారు. ‘బందోబస్తులో 25 మంది ఐపీఎస్ అధికారులు, 65 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 200 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు, 800 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 10 వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నాం. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) ఇప్పటికే ఇక్కడికి చేరుకుంది. ఎన్ఎస్జీ స్నైపర్ యూనిట్లను కీలక ప్రాంతాల్లో మోహరించాం. బాంబు స్క్వాడ్లు నగరంలో ఇప్పటికే తమ పని ప్రారంభించాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం, అటునుంచి మోతెరా స్టేడియం వరకు మొత్తం 22 కిలోమీటర్లు సాగే రోడ్‌షోలో ఎన్ఎస్జీ స్నైపర్ యూనిట్లను మోహరించనున్నాం. అమెరికా సీక్రెట్ సర్వీస్ దళాలతోపాటు నిఘా విభాగం, సీక్రెట్ సర్వీస్ పోలీసులు నిఘాలో పాలుపంచుకుంటున్నారు. అహ్మదాబాద్‌లోని వివిధ హోటళ్లలో బస చేసిన కొత్త అతిథులను, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాం. రోడ్ షోతోపాటు స్టేడియం వద్ద అనుమానాస్పద వస్తువులు గానీ, వ్యక్తులు కనిపించినా తమకు తెలియజేసి, సహకరించాలి’ అని పోలీస్ డిప్యూటీ కమిషనర్ విజయ్ ప్రజలను కోరారు. ఫేస్బుక్ ఇచ్చిన గౌరవం: ట్రంప్ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ తనకు తొలిస్థానం, మోదీకి రెండో స్థానం ప్రకటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్లో ప్రకటించారు. గత నెలలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్..ఫేస్బుక్ తనకు మొదటి స్థానం, భారత ప్రధాని మోదీకి రెండో స్థానం ఇవ్వడాన్ని ప్రస్తావించారు.మోదీ ఫేస్బుక్ ఖాతాలో 4.4 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు 2.75 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. లైక్‌ల దృష్ట్యా చూసినా ఇద్దరి మధ్య అంతరం భారీగా∙ఉంది. మోదీకి 4.45 కోట్ల లైక్‌లు వస్తుండగా, అందులో సగానికి కొద్దిగా ఎక్కువ అంటే 2.6 కోట్లు ట్రంప్‌కు వస్తుంటాయి. రూ.800 కోట్లతో.. అహ్మదాబాద్‌లోని మోతెరాలో రూ.800 కోట్లతో 1.25 లక్షల మంది వీక్షించేందుకు వీలుగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ట్రంప్‌తో కలిసి మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ‘కెమ్ ఛో ట్రంప్’గా నామకరణం చేశారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ట్రంప్ దంపతులకు బలగాలు గౌరవ వందనం సమర్పిస్తాయి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం ముందుగా సబర్మతిలోని గాంధీ ఆశ్రమానికి వెళ్లనుంది. ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ సబర్మతి ఆశ్రమ విశిష్టతను వివరించనున్నారు. అక్కడి నుంచి వారు ఇందిరా బ్రిడ్జి మీదుగా మోతెరా స్టేడియంకు చేరుకుంటారు. నూతనంగా నిర్మించిన స్టేడియంలోని సుమారు 1.20 లక్షల మంది ప్రజలు, ప్రముఖులు వారికి స్వాగతం పలుకుతారని పోలీస్ డిప్యూటీ కమిషనర్ విజయ్ పటేల్ చెప్పారు. ‘ప్రభుత్వం పంపిన ప్రత్యేక ఆహ్వానంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు అక్కడికి వస్తున్నారు. కార్యక్రమం అనంతరం వీరంతా తిరిగి నిర్దేశిత మార్గాల్లో వెళ్లిపోతారు. స్టేడియం చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్ల ప్రాంతాన్ని భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి’ అని ఆయన తెలిపారు.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి సబర్మతి వరకు 22 కిలోమీటర్ల మేర సాగే రోడ్‌షోలో కూడా ఎన్ఎస్జీ స్నైపర్ యూనిట్లను మోహరించనున్నారు. వేలాది మంది ప్రజలు రోడ్డుకు రెండువైపులా నిలబడి అతిథులకు స్వాగతం పలకనున్నారు. ఈ మార్గంలో సాంస్కృతిక ఘనతను చాటే పలు చిత్రాలను ఏర్పాటు చేశారు. -
కూతురు పుట్టిన రోజని పిలిచి..
-
23 మంది పిల్లల్ని కాపాడిన ఎన్ఎస్జీ
ఫరూఖాబాద్(యూపీ) : పుట్టిన రోజు వేడుకకు పిల్లల్ని పిలిచి వారిని బందీలుగా చేసిన ఓ పాత నేరస్తుడిని గురువారం అర్ధరాత్రి ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) చాకచక్యంగా మట్టుబెట్టింది. నేరస్తుడి చెర నుంచి పిల్లలందర్నీ సురక్షితంగా రక్షించింది. ఉత్తర ప్రదేశ్‌లోని మొహ్మదాబాద్ ప్రాంతం కతారియా గ్రామంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మొహమ్మదాబాద్ ప్రాంతం కతారియా గ్రామానికి చెందిన సుభాష్ బథమ్ పాత నేరస్తుడు. తన పుట్టిన రోజు వేడుక అంటూ గురువారం సాయంత్రం చుట్టుపక్కలుండే 23 మంది పిల్లలను ఇంటికి రప్పించుకున్నాడు. అనంతరం వారందరినీ బయటకు వెళ్లకుండా తన ఇంట్లోనే బందీలుగా ఉంచుకున్నాడు. అప్రమత్తమైన అధికారులు, అతడిని ఒప్పించి, పిల్లలను కాపాడేందుకు స్థానిక పెద్దలను, కుటుంబసభ్యులు, బంధువులను రప్పించారు. అక్రమంగా తనపై పోలీసులు హత్యకేసు మోపారంటూ ఆరోపించాడు. అతడి కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యేను కూడా తీసుకువచ్చారు. వారంతా నచ్చజెప్పేందుకు యత్నించగా లోపలి నుంచి ఆరు పర్యాయాలు కాల్పులు జరిపాడు. ఒక నాటుబాంబును కూడా బయట ఉన్న వారిపైకి విసిరాడు. దీంతో ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎన్‌ఎస్‌జీను రంగంలోకి దించింది. అతడిని పలుమార్లు లొంగిపొమ్మని చెప్పగా ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు. దీంతో అతడిని ఎన్ఎస్జీ మట్టుబెట్టింది. పిల్లల్ని అతడి చెర నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. సుభాష్ బథమ్‌కు మతిస్థిమితం లేదని డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు. -
వీఐపీల భద్రతకు ఇక ‘ఎన్ఎస్జీ’ దూరం!
న్యూఢిల్లీ: నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) సిబ్బందిని అత్యంత ప్రముఖుల భద్రత విధుల నుంచి తప్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు దశాబ్దాలుగా ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్స్ వీఐపీల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 1984లో ఈ దళాన్ని ఏర్పాటు చేసినప్పుడు వీరికి ప్రముఖుల భద్రత బాధ్యతలు లేవు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు సంబంధించి ప్రత్యేక శిక్షణ పొందిన దళంగా ఉండేది. ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న అత్యంత ప్రముఖుల భద్రత బాధ్యతలో ఈ దళం ఉంది. ఇకపై వీరందరి భద్రత విధుల్లో నుంచి ఎన్ఎస్జీని తప్పించనున్నారు. వీరి భద్రత బాధ్యతను సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ తదితర పారామిలటరీ దళాలకు అప్పగించనున్నారని ఎన్ఎస్జీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇకపై ఎన్ఎస్జీ కమాండోలను ఉగ్రవాద, హైజాక్ వ్యతిరేక ఆపరేషన్లకు పరిమితం చేయనున్నామని హోం శాఖ అధికారులు తెలిపారు. -
‘హైజాక్’ నొక్కిన పైలట్
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి కాందహార్(అఫ్గానిస్తాన్) వెళ్తున్న విమానంలో పైలట్ పొరపాటున ‘హైజాక్ మీట’ నొక్కడం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ విమానాశ్రయంలో శనివారం జరిగిన ఈ ఘటన భద్రతా సిబ్బదిని తెగ హైరానాకు గురిచేసింది. సుమారు రెండు గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతే విమానం బయల్దేరింది. 124 మంది ప్రయాణికులతో అరియానా అఫ్గాన్ విమానం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ అవడానికి సిద్ధమవుతుండగా పైలట్ పొరపాటున హైజాక్ మీట నొక్కాడు. వెంటనే స్పందిన ఎన్ఎస్జీ కమాండోలు విమానాన్ని చుట్టిముట్టి రన్‌వేకు దూరంగా తీసుకెళ్లి తనిఖీలు నిర్వహించారు. పైలట్ పొరపాటున హైజాక్ మీట నొక్కారని నిర్ధారించుకున్నాక విమానం బయల్దేరడానికి అనుమతిచ్చారు. -
జమ్మూకశ్మీర్‌కు ‘బ్లాక్ క్యాట్స్’!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొనే భద్రతాబలగాలకు సహకరించేందుకు త్వరలోనే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) బ్లాక్ క్యాట్ కమెండోలను మోహరించనున్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఎన్కౌంటర్లతో పాటు ఉగ్రవాదులు పౌరుల్ని బందీలుగా చేసుకున్న సందర్భాల్లో ప్రాణనష్టం లేకుండా ఆపరేషన్‌ను పూర్తిచేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వెల్లడించారు. ఈ ప్రతిపాదనను ప్రస్తుతం కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోందన్నారు. ఇళ్లలో నక్కిన ఉగ్రవాదుల్ని ఏరివేయడంలో శిక్షణ పొందిన ఎన్ఎస్జీ కమెండోలు ఆపరేషన్‌లో పాల్గొంటే భద్రతా బలగాల ప్రాణనష్టం గణనీయంగా తగ్గుతుందన్నారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు వేలం
ప్రముఖ మోటార్ సైకిల్ తయారీదారు రాయల్ ఎన్ఫీల్డ్ తన పాపులర్ బైక్స్‌ను వేలం వేస్తోంది. ముఖ్యంగా సెప్టెంబర్‌లో ప్రారంభించిన 'ఫైట్ ఎగైనెస్ట్ టెర్రర్' లో భాగంగా తన పాపులర్ మోడల్ స్టీల్త్ బ్లాక్ క్లాసిక్ 500 వాహనాలకు ఆన్లైన్ లో వేలం నిర్వహిస్తోంది. కొన్ని వారాల క్రితం, టెర్రరిజంపై అవగాహన కల్పిస్తూ పదిహేనుమంది ఎన్ఎస్జీ కమాండోలు 13 రాష్ట్రాల్లో 8వేల కి.మీటర్ల రోడ్ ట్రిప్ నిర్వహించిన ఈ 15 బైకులను వేలం ద్వారా విక్రయించనుంది. ఇలా వచ్చిన నిధును ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళమివ్వనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్సైట్ అందించిన వివరాల ప్రకారం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) ముఖ్య కమాండోలు ఉపయోగించిన 15 కంపెనీల వాహనాలను ఆన్లైన్ వేలం నేటి ప్రారంభం కానుందని రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది. ట్రిబ్యూట్ టు బ్రేవ్‌హార్ట్ పేరుతో ఈ సేల్ నిర్వహిస్తోంది. వేలం తేదీకి ముందే కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ నమోదు చేసుకున్నవారు మాత్రమే వేలంలో పాల్గొనడానికి అర్హులు. నమోదు చేసుకున్న అభ్యర్థులకు కేటాయించిన స్పెషల్ కోడ్ ద్వారా వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఒక్కో బైకు ధరను రూ.1.9 లక్షలుగా నిర్ణయించింది. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును స్వచ్చంద సంస్థకు ఇవ్వనున్నట్టు సంస్థ తెలిపింది. ఎన్ఎస్జీ మద్దతు ఇస్తున్న వికలాంగ బాలల కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థ ప్రేరణకు ఈ మొత్తాన్ని విరాళంగా ఇస్తామని చెప్పింది. -
ఎర్రకోటలో బాంబు.. రాజధానిలో కలకలం
దేశ రాజధాని ఢిల్లీలోని సుప్రసిద్ధ ఎర్రకోటలో ఓ బాంబు బయటపడింది. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. రాజధానిలో ఎలర్ట్ ప్రకటించారు. సాధారణంగా రోజూ చేసే తనిఖీలలో భాగంగానే ఎర్రకోటలో భద్రతాదళాలు తనిఖీ చేస్తుండగా అక్కడున్న ఓ బావిలో ఈ బాంబు కనిపించింది. వెంటనే నేషనల్ సెక్యూరిటీ గార్డులతో పాటు డీసీపీ నేతృత్వంలోని పోలీసు బృందం కూడా హుటాహుటిన అక్కడకు చేరుకుని భారీ మొత్తంలో ఆ ప్రాంతమంతా తనిఖీలు చేశారు. ఇంకా ఎక్కడైనా ఏమైనా ఉన్నాయేమోనని బాంబు స్క్వాడ్‌ను కూడా తీసుకొచ్చి ముమ్మరంగా గాలించారు. ముందుగా బావిలో ఉన్న గ్రెనేడ్‌ను బయటకు తీసి, దాన్ని నిర్వీర్యం చేసి పరీక్షల కోసం తీసుకెళ్లారు. అది ఏమైనా ప్రపంచయుద్ధ సమయం నాటిదా లేదా వేరే ఏమైనానా అనే విషయాన్ని నిర్ధారించనున్నారు. ఇంతకుముందు ఫిబ్రవరి నెలలో కూడా ఒకసారి ఎర్రకోట లోపల ఉన్న ఓ బావిని శుభ్రం చేస్తుండగా అందులో పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రితో కూడిన కొన్ని బాక్సులు కనిపించాయి. ఇప్పుడు కూడా అలాగే బాంబు బయటపడటంతో ఎన్ఎస్జీ బృందాలకు సైతం సమాచారం అందించారు. స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే లాంటి వేడుకలు జరిగే ఎర్రకోటలో ఇంతలా బాంబులు, పేలుడు పదార్థాలు బయట పడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
విజ్ఞాన్ భవన్లో ఏసీ నుంచి గ్యాస్ లీక్
న్యూఢిల్లీ : విజ్ఞాన్ భవన్ లో శుక్రవారం ఏసీ గ్యాస్ సిలెండర్ లీక్ అయిన ఘటన కలకలం రేపింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అధికారులు, సందర్శకులు భయంతో పరుగులు తీశారు. మరోవైపు ఎన్ఎస్జీ కమాండోలు అప్రమత్తం అయ్యారు. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు విజ్ఞాన్ భవన్లో ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జరిగిన పారిశుద్ధ్య సమ్మేళనంలో పాల్గొన్నారు. గ్యాస్ లీకైన సమయంలో ఆయన ఎగ్జిబిషన్ స్టాల్‌ను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమాండోలు రక్షణగా నిలిచి చంద్రబాబును బయటకు తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
న్యూఢిల్లీలో నిఘా సంస్థల మాక్ డ్రిల్
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని పలు రద్దీ ప్రాంతాలపై కేంద్ర నిఘా సంస్థ దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ ప్రాంతంలో గురువారం భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. అయితే, ఉగ్రవాదుల దాడులు జరిగితే ప్రజల్ని అప్రమత్తం చేసే దిశగా బలగాలు ఈ చర్యలు చేపట్టాయి. ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన మాక్ డ్రిల్ లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) కమాండోలు పాల్గొన్నాయి. -
ఎన్ఎస్జీ, గరుడ కమాండోల మోహరింపు
-
ఎన్ఎస్జీ, గరుడ్ కమాండోల మోహరింపు
భారత భద్రతాదళాల్లోనే అత్యున్నత నైపుణ్యం కలిగిన ఎన్ఎస్జీ, భారత వైమానిక దళానికి చెందిన గరుడ్ కమాండో ఫోర్స్ దళాలు ఉగ్రవాదులపై కౌంటర్ ఎటాక్‌లో పాల్గొంటున్నాయి. పంజాబ్ ఎయిర్‌బేస్ మీద పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని తిప్పికొట్టేందుకు ఈ బలగాలతో పాటు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ దళాలను అక్కడ మోహరించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మొత్తం ఆపరేషన్‌ను సమన్వయం చేస్తున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఉగ్రదాడి మొదలు కాగా, 6-6.30 గంటల మధ్యలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు లోపల ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వాళ్లను కూడా ఇప్పటికే హతమార్చారా.. లేదా అన్న విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. ఉదయం 8 గంటల తర్వాత పెద్దగా కాల్పుల శబ్దాలు వినిపించడం లేదని ఎయిర్‌బేస్‌కు అత్యంత సమీపంలో ఉన్న జాతీయ మీడియా చానళ్ల ప్రతినిధులు చెబుతున్నారు. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించామని, ఇప్పటికే అక్కడున్న భద్రతా దళాలకు వాటిని సహాయంగా అందుబాటులో ఉంచుతున్నామని డీఐజీ విజయ్ ప్రతాప్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదులను పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని డొమెస్టిక్ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశామని, దాంతో టెక్నికల్ ఏరియా మొత్తం సురక్షితంగా ఉందని తెలిపారు. మరోవైపు.. ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్నతాధికారులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం పరిస్థితిని అత్యున్నత స్థాయిలో సమీక్షిస్తున్నారు. ఉగ్రదాడి కారణంగా పంజాబ్‌లోని లూథియానా ప్రాంతంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.