
న్యూఢిల్లీ: నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్‌ఎస్‌జీ) సిబ్బందిని అత్యంత ప్రముఖుల భద్రత విధుల నుంచి తప్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు దశాబ్దాలుగా ఎన్‌ఎస్‌జీ బ్లాక్ క్యాట్స్ వీఐపీల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 1984లో ఈ దళాన్ని ఏర్పాటు చేసినప్పుడు వీరికి ప్రముఖుల భద్రత బాధ్యతలు లేవు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు సంబంధించి ప్రత్యేక శిక్షణ పొందిన దళంగా ఉండేది. ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న అత్యంత ప్రముఖుల భద్రత బాధ్యతలో ఈ దళం ఉంది. ఇకపై వీరందరి భద్రత విధుల్లో నుంచి ఎన్‌ఎస్‌జీని తప్పించనున్నారు. వీరి భద్రత బాధ్యతను సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ తదితర పారామిలటరీ దళాలకు అప్పగించనున్నారని ఎన్‌ఎస్‌జీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇకపై ఎన్‌ఎస్‌జీ కమాండోలను ఉగ్రవాద, హైజాక్ వ్యతిరేక ఆపరేషన్లకు పరిమితం చేయనున్నామని హోం శాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment