న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొనే భద్రతాబలగాలకు సహకరించేందుకు త్వరలోనే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్‌ఎస్‌జీ) బ్లాక్ క్యాట్ కమెండోలను మోహరించనున్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.
ఎన్‌కౌంటర్లతో పాటు ఉగ్రవాదులు పౌరుల్ని బందీలుగా చేసుకున్న సందర్భాల్లో ప్రాణనష్టం లేకుండా ఆపరేషన్‌ను పూర్తిచేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వెల్లడించారు. ఈ ప్రతిపాదనను ప్రస్తుతం కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోందన్నారు. ఇళ్లలో నక్కిన ఉగ్రవాదుల్ని ఏరివేయడంలో శిక్షణ పొందిన ఎన్‌ఎస్‌జీ కమెండోలు ఆపరేషన్‌లో పాల్గొంటే భద్రతా బలగాల ప్రాణనష్టం గణనీయంగా తగ్గుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment