vip security
-
దేశ భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు
-
తీవ్ర విమర్శలు.. ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్న పంజాబ్ సీఎం
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎట్టకేలకు తన నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య నేపథ్యంలో పంజాబ్‌లో వీఐపీలందరికీ భద్రతను పునరుద్ధరించనున్నట్లు గురువారం ప్రకటించారు. జూన్ 7వ తేదీలోగా ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటామని పంజాబ్, హరియాణా హైకోర్టుకు భగవంత్‌మాన్ సర్కార్ గురువారం నివేదించింది. భవిష్యత్తులో మళ్లీ ఈ నిర్ణయాన్ని అమలు చేయడంపైనా ఎలాంటి ఆలోచనలుచేయడం లేదని కోర్టుకు తెలిపింది. సుమారు 400 మందికి పైగా వీఐపీలకు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించడం, ఆ మర్నాడే మూసేవాలా దారుణ హత్య కు గురవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలు తలెత్తడంతో పాటు వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. ఈ నేపథ్యంలోనే సీఎం భగవంత్ మాన్, పునరుద్ధరణ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: సిద్ధూ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం! -
వీఐపీల భద్రతకు ఇక ‘ఎన్ఎస్జీ’ దూరం!
న్యూఢిల్లీ: నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) సిబ్బందిని అత్యంత ప్రముఖుల భద్రత విధుల నుంచి తప్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు దశాబ్దాలుగా ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్స్ వీఐపీల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 1984లో ఈ దళాన్ని ఏర్పాటు చేసినప్పుడు వీరికి ప్రముఖుల భద్రత బాధ్యతలు లేవు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు సంబంధించి ప్రత్యేక శిక్షణ పొందిన దళంగా ఉండేది. ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న అత్యంత ప్రముఖుల భద్రత బాధ్యతలో ఈ దళం ఉంది. ఇకపై వీరందరి భద్రత విధుల్లో నుంచి ఎన్ఎస్జీని తప్పించనున్నారు. వీరి భద్రత బాధ్యతను సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ తదితర పారామిలటరీ దళాలకు అప్పగించనున్నారని ఎన్ఎస్జీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇకపై ఎన్ఎస్జీ కమాండోలను ఉగ్రవాద, హైజాక్ వ్యతిరేక ఆపరేషన్లకు పరిమితం చేయనున్నామని హోం శాఖ అధికారులు తెలిపారు. -
నాకు భద్రత తొలగించారు కానీ.. : స్టాలిన్
చెన్నై : తనకు వీఐపీ భద్రతను తొలగించడంపై డీంఎకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పందించారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ బలగాలకు కృతజ్ఞతలు తెలిపిన స్టాలిన్.. వారిని యూనివర్సిటీలను, విద్యార్థులను రక్షించడానికి వినియోగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘చాలా కాలంగా నాకు భద్రత కల్పించిన సీఆర్పీఎఫ్ అధికారులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే మతం పేరిట హింసకు పాల్పడేవారి నుంచి యూనివర్సిటీలను, విద్యార్థులను రక్షించడానికి సీఆర్పీఎఫ్ అధికారులను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని స్టాలిన్ పేర్కొన్నారు. మరోవైపు డీఎంకే శ్రేణులు స్టాలిన్‌కు వీఐపీ భద్రతను తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్టు డీఎంకే ఎంపీ కనిమొళి ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, స్టాలిన్‌తోపాటు తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు కేంద్ర బలగాల భద్రతను ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్రం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు స్టాలిన్‌కు జెడ్ ప్లస్, పన్నీర్ సెల్వంకు వై ప్లస్ సెక్యూరిటీ ఉండేది. ఇకపై వీరి భద్రతను రాష్ట్ర పోలీసులు చూసుకోనున్నారు. చదవండి : పన్నీర్ సెల్వం, స్టాలిన్లకు కేంద్రం షాక్ -
పన్నీర్ సెల్వం, స్టాలిన్లకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ : తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇరువురు నేతలకు కల్పిస్తున్న వీఐపీ భద్రతను తొలగిస్తున్నట్టు తెలిపింది. వారికి ఇకపై కేంద్ర బలగాల రక్షణ ఉండబోదని గురువారం అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వంకు వై ప్లస్ కేటగిరి, స్టాలిన్‌కు జెడ్ ప్లస్ కేటగిరిల రక్షణ కల్పిస్తున్నారు. ఇటీవల నాయకులకు ఉన్న ముప్పుపై సమీక్ష చేపట్టిన కేంద్ర భద్రత సంస్థలు.. ఈ ఇద్దరు నేతల పేర్లను కేంద్ర భద్రత జాబితా నుంచి తొలగించాయి. దీనికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసింది. అయితే రాష్ట్ర పోలీసులు పన్నీర్ సెల్వం, స్టాలిన్ల సెక్యూరిటీ బాధ్యతలు చేపట్టాక.. కేంద్రం నుంచి అధికారికంగా భద్రతను ఉపసంహరించుకుంటామని అధికారులు వెల్లడించారు. -
పోలీసులకే టోకరా.. 18 నెలలు వీఐపీ సేవలు..!
న్యూఢిల్లీ : ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) ఉద్యోగినంటూ పోలీసులకు టోకరా ఇచ్చి 18 నెలల పాటు రాచమర్యాదలు చేయించుకున్న ఓ యువతి బండారం బట్టబయలైంది. భర్తతో కలిసి ప్రభుత్వ అధికారులను మోసగించినందుకు కటకటాల పాలైంది. ఢిల్లీలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. వివరాలు... సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఉన్నత ఉద్యోగం పొందాలనుకున్న జోయాఖాన్ (35) ఆ కోరిక నెరవేరక పోవడంతో సరికొత్త మోసానికి తెరలేపింది. ఎలాగూ ఉద్యోగం రాలేదు. కానీ, ఆ జాబ్‌లోని ‘మజా’ ఎంజాయ్ చేద్దామని తన భర్త హర్ష్ ప్రతాప్ (40)తో కలిసి నకిలీలలు చేసింది. ఫేక్ ఐడీ కార్డులు సృష్టించి ఢిల్లీ రాజధాని ప్రాంతంలో గల నొయిడా, గురుగ్రామ్, మీరట్, ఘజియాబాద్, మోరాదాబాద్‌లో ఎస్కార్ట్, పోలీసు సేవల్ని యథేచ్ఛగా వాడుకుంది. ఎలా బయటపడింది..? ఈ క్రమంలోనే మార్చి 23న గౌతమ్‌బుద్ధ నగర్ (నొయిడా) ఏఎస్పీ వైభవ్ కృష్ణకి ఫోన్ చేసిన ఖాన్ పోలిస్ ఎస్కార్టును పంపడంలో ఆలస్యమవడం పట్ల కోపం ప్రదర్శించింది. తొందరగా పంపించాలని హుకుం జారీ చేసింది. దీంతో ఈ ‘ఉన్నత ఉద్యోగి’ ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఏఎస్పీ విచారణ చేపట్టారు. ఖాన్, ప్రతాప్ గుట్టు రట్టు కావడంతో వారు నివాసముంటున్న నొయిడా ఎక్స్టెన్షన్స్ నుంచి గురువారం అరెస్టు చేశారు. జోయాఖాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో న్యూక్లియర్ ఆఫీసర్‌గా, అఫ్గనిస్తాన్‌లో యూఎస్ దౌత్యవేత్తగా నకిలీ ఐడీ కార్డులు కలిగి ఉందని తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు విలువైన కార్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇక అఫ్గనిస్తాన్ తదితర దేశాలతో కూడా జోయాఖాన్ వ్యవహారాలు నడిపించిందా అనే ప్రశ్నలను పోలీసులు ఖండించారు. అదంతా అబద్ధమని అన్నారు. ఇలా టోకరా.. వాయిస్ కన్వర్టర్ యాప్, యూఎస్ సెక్యురిటీ కౌన్సిల్ పేరిట ఫేక్ ఈమెయిల్ ద్వారా ఖాన్ పోలీసులను బురిడీ కొట్టించినట్టు తెలిసింది. ల్యాండ్‌లైన్ ద్వారా ఫోన్ చేయడం ద్వారా ఈ విషయం వెలుగులోకి రాలేదని పోలీసులు తెలిపారు. ఇక గతవారం ప్రధాని మోదీ మీరట్‌లో పర్యటించినప్పుడు కూడా ఖాన్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆమె నకిలీ వేషాలను నమ్మిన చాలా మంది ఆమెను ప్రధాని రక్షణ దళంలో సభ్యురాలు అని కూడా అనుకున్నారు. కాగా, ఆమె ల్యాప్‌టాప్‌లో పలువురు రాజకీయ నాయకుల ఫొటోలు ప్రత్యక్షమవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె వాట్సాప్, సోషల్ మీడియా చరిత్రను విచారించిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు స్పష్టం చేశారు. ఇక నిన్నటి వరకు వీఐపీ సేవల్లో తరించిన ఖాన్, ప్రతాప్ అరెస్టులతో స్థానికులు భయాందోళను గురయ్యారు. పోలీసులు, ఉన్నతాధికారులకే టోకరా ఇచ్చిన ఈ ఘరానా మోసగాళ్లు తమనేం చేసేవారోనని కలవరానికి గురయ్యారు. -
ఎర్రబుగ్గలు తీశామంతే.. సెక్యూరిటీ తగ్గదు
వీఐపీల కార్లకు ఎర్రబుగ్గలు తీసేయాలనడంతో ఇప్పుడు చాలామంది పెద్దమనుషుల గుండెలు గుభేలుమంటున్నాయి. తమకు ఇంతకాలం ఉన్న సెక్యూరిటీని కూడా కూడా తీసేస్తారేమోనని అనుమానాలు మొదలయ్యాయి. సెక్యూరిటీ తీసేస్తే తమ గతేంకాను అని చాలామంది అనుకుంటున్నారు. అయితే, అలాంటి భయం ఏమీ అక్కర్లేదని, వీఐపీల భద్రతను తగ్గించే ఆలోచన ఏదీ కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను రక్షించాలని.. అది కొనసాగి తీరుతుందని ఆయన తెలిపారు. వీఐపీ సంస్కృతికి ఫుల్స్టాప్ పెట్టాలనుకున్న కేంద్ర నిర్ణయం వెనక కారణం ఏంటని ప్రశ్నించగా, దేశంలో ప్రతి ఒక్కరూ వీఐపీయే అన్నదే తమ ప్రభుత్వ సిద్ధాంతమని ఆయన తెలిపారు. తాము తీసుకున్నది చిన్న చర్యే అయినా, సమాజంలో అందరినీ సమానంగా చూడాలన్న సందేశం దానివల్ల వెళ్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎర్రబుగ్గల సంస్కృతిని ఆపుతాయని ఆశిస్తున్నామన్నారు. ఇక రామజన్మభూమి బాబ్రీమసీదు వివాదం చాలా కాలంగా కొనసాగుతోందని, అందులో కొత్తేమీ లేదని మరో ప్రశ్నకు సమాధానంగా వెంకయ్య చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం అద్వానీ తదితర నేతలపై ఎలా ఉంటుందని అడిగితే మాత్రం ఆయన స్పందించలేదు. సోషల్ మీడియాను కూడా సెన్సార్ చేయొచ్చని, అది చాలా పెద్ద విషయమని, దానిపై ఆలోచించి అన్ని వర్గాలతోను చర్చించాల్సి ఉందని తెలిపారు.