
న్యూఢిల్లీ : తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇరువురు నేతలకు కల్పిస్తున్న వీఐపీ భద్రతను తొలగిస్తున్నట్టు తెలిపింది. వారికి ఇకపై కేంద్ర బలగాల రక్షణ ఉండబోదని గురువారం అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వంకు వై ప్లస్ కేటగిరి, స్టాలిన్‌కు జెడ్ ప్లస్ కేటగిరిల రక్షణ కల్పిస్తున్నారు.
ఇటీవల నాయకులకు ఉన్న ముప్పుపై సమీక్ష చేపట్టిన కేంద్ర భద్రత సంస్థలు.. ఈ ఇద్దరు నేతల పేర్లను కేంద్ర భద్రత జాబితా నుంచి తొలగించాయి. దీనికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసింది. అయితే రాష్ట్ర పోలీసులు పన్నీర్ సెల్వం, స్టాలిన్‌ల సెక్యూరిటీ బాధ్యతలు చేపట్టాక.. కేంద్రం నుంచి అధికారికంగా భద్రతను ఉపసంహరించుకుంటామని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment