
న్యూఢిల్లీలో నిఘా సంస్థల మాక్ డ్రిల్
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని పలు రద్దీ ప్రాంతాలపై కేంద్ర నిఘా సంస్థ దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ ప్రాంతంలో గురువారం భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. అయితే, ఉగ్రవాదుల దాడులు జరిగితే ప్రజల్ని అప్రమత్తం చేసే దిశగా బలగాలు ఈ చర్యలు చేపట్టాయి. ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన మాక్ డ్రిల్ లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) కమాండోలు పాల్గొన్నాయి.