విజ్ఞాన్ భవన్లో ఏసీ నుంచి గ్యాస్ లీక్ | AC Gas cylendar Leak in delhi Vigyan Bhavan | Sakshi
Sakshi News home page

విజ్ఞాన్ భవన్లో ఏసీ నుంచి గ్యాస్ లీక్

Published Fri, Sep 30 2016 3:47 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

AC Gas cylendar Leak in delhi Vigyan Bhavan

న్యూఢిల్లీ :  విజ్ఞాన్ భవన్ లో శుక్రవారం ఏసీ గ్యాస్ సిలెండర్ లీక్ అయిన ఘటన కలకలం రేపింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అధికారులు, సందర్శకులు భయంతో పరుగులు తీశారు. మరోవైపు ఎన్ఎస్జీ కమాండోలు అప్రమత్తం అయ్యారు. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు విజ్ఞాన్ ‌భవన్‌లో ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జరిగిన పారిశుద్ధ్య సమ్మేళనంలో పాల్గొన్నారు. గ్యాస్ లీకైన సమయంలో ఆయన ఎగ్జిబిషన్ స్టాల్ను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమాండోలు రక్షణగా నిలిచి చంద్రబాబును బయటకు తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement