Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Tweet On Chandrababu Negligence In Children Education1
చంద్రబాబూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయంటూ ఎక్స్‌ వేదికగా నిలదీశారు. ‘‘చంద్రబాబు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం నాకు ఆవేదన కలిగించింది.’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.‘‘చంద్రబాబు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియాన్ని, 3వ తరగతి నుంచి టోఫెల్‌, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ నుంచి ఐబీదాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్‌, నాడు-నేడు ఇలా అన్నింటినీ రద్దుచేసి 1-12వ తరగతి విద్యార్థులను, వారి తల్లులను దెబ్బతీశారు. వసతిదీవెన, విద్యాదీవెన నిలిపేసి, డిగ్రీ, ఇంజినీరింగ్‌, డాక్టర్‌ చదువులు చదువుతున్నవారినీ తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారు.’’ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లుల ఖాతాలో జమచేసే వాళ్లం. ఇలా గత విద్యాసంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికం వరకూ రూ.12,609 కోట్లు ఒక్క విద్యాదీవెనకే ఖర్చు చేశాం. తలరాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైఎస్సార్‌సీపీ హయాంలో మొత్తం ఈ రెండు పథకాలకే రూ.18వేల కోట్లు వరకూ ఖర్చు చేశాం.’’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.1.@ncbn గారి కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబుగారు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో… pic.twitter.com/6aXEQoRKqv— YS Jagan Mohan Reddy (@ysjagan) November 24, 2024 ‘‘ఎన్నికల కోడ్‌ కారణంగా జనవరి-మార్చి త్రైమాసికానికి, ఏప్రిల్ లో వెరిఫికేషన్‌ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ ఎన్నికలు అయిన తర్వాత వీళ్లు జూన్‌లో అయినా ఇచ్చారా అంటే అదీలేదు. అప్పటినుంచి ఒక్కపైసాకూడా చెల్లించడంలేదు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితి కూడా అంతే. తర్వాత ఏప్రిల్‌-జూన్‌, తర్వాత జులై-సెప్టెంబరు త్రైమాసికాలకు సంబంధించి ఫీజులు చెల్లింపులో ఎలాంటి అడుగూ ముందుకు పడ్డంలేదు. ఇప్పుడు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం కూడా సగం గడిచిపోయింది. దీంతో కలుపుకుంటే సుమారు రూ.2,800 కోట్లకుపైగా ఫీజులు రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్లు లాడ్జింగ్‌, బోర్డింగ్‌ ‌ఖర్చుల కింద వసతిదీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్‌ నాటికి రూ.3,900 కోట్లకు చేరుకుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం తీరుచూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి. కాళ్లేమో గడపకూడా దాటడం లేదు’’ అని దుయ్యబట్టారు.‘‘ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడంలేదు, చదువులు పూర్తిచేసినవారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లూ ఇవ్వడంలేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడమో చేయాల్సి వస్తోంది. ఏదారీలేనివారు తమ పిల్లలను పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇవి...ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాం, లిక్కర్‌ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దోచిపెట్టే స్కాంలు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధలేకుండా పోయింది. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాం. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.ఇదీ చదవండి: అదిగో పులి... ఇదిగో తోక!సమస్యల వలయంలో సం‘క్షామ’ హాస్టళ్లు

Bigg Boss Telugu 8, Nov 24th Episode Review: Yashmi Freinds, Enemies2
ఆ నలుగురు ఫ్రెండ్స్‌.. గౌతమ్‌ శత్రువన్న యష్మి.. అతడిపైనే బిగ్‌బాంబ్‌

ఒకరి గురించి ఒకరు రాసిన కంప్లైంట్లు చదవడంతోనే సగం ఎపిసోడ్‌ అయిపోయింది. యష్మి వెళ్లిపోతూ.. ఎవరేమనుకున్నా నిఖిల్‌ తన ఫ్రెండ్‌ అని బల్లగుద్ది చెప్పింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్‌ 24) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..నేను చెప్పేదే నిజంనాగార్జున.. ప్రేరణను సేవ్‌ అయినట్లు ప్రకటించడంతో ఆమె ఎమోషనల్‌ అయింది. తర్వాత హౌస్‌మేట్స్‌ అందరూ తమపై వచ్చిన ఫిర్యాదుల చిట్టా చదివి వినిపించారు. తేజ.. తను మాట్లాడాలనుకుంది మాట్లాడి వెళ్లిపోతాడు, నేను చెప్పేదే నిజం అన్న మైండ్‌సెట్‌ నుంచి బయటకు రావాలని నబీల్‌, నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడటం చాలాసార్లు చూశా.. అని పృథ్వీ కంప్లైంట్స్‌ చేశారు. గౌతమ్‌పై వచ్చిన కంప్లైంట్స్‌..అన్‌ప్రిడక్టబుల్‌గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను, త్వరగా ట్రిగ్గర్‌ అవడం నాకు నచ్చదు అని యష్మి గురించి ప్రేరణ ఫిర్యాదు చేసింది. నీ ఇండివిడ్యువాలిటీ కనిపించడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు. అసలైన నువ్వు ఎవరనేది అర్థం కావట్లేదు.. అని రోహిణి పేర్కొంది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు, ఫుడ్‌ అందరితో షేర్‌ చేసుకో అని పృథ్వీ.. కొన్నిసార్లు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడేమో అనిపిస్తుందని అవినాష్‌ .. గౌతమ్‌ గురించి అభిప్రాయపడ్డారు. ఎవరికోసం గేమ్‌ ఆడుతుందో తెలీదునీకు అవినాష్‌ రక్షణ కవచంలా అనిపిస్తోంది.. అవినాష్‌, తేజతోనే ఎక్కువగా ఉంటున్నావ్‌ అని పృథ్వీ. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తోందని తేజ రోహిణి గురించి రాసుకొచ్చారు. తను ఎవరికోసం గేమ్‌ ఆడుతుందో తెలియదు, నామినేషన్స్‌లో క్లారిటీ లేదు, ఆట పట్ల ఆసక్తి అంతకన్నా లేదు అని అవినాష్‌, మేమందరం కష్టపడి తనను మెగా చీఫ్‌ చేశాం. తనను గెలిపించినవారికంటే యూనివర్స్‌కే ఎక్కువ కృతజ్ఞత చూపిస్తుంది అని నబీల్‌.. విష్ణు గురించి కంప్లైంట్‌ చేశారు.ఎక్కువ విని తక్కువ మాట్లాడాలినువ్వొక్కడివే బలవంతుడివని ఆలోచించడం మానేయ్‌.. ప్రతి ఒక్కరికీ టాలెంట్‌ ఉంది. కాబట్టి ఎవర్నీ తక్కువ అంచనా వేయకు అని రోహిణి‌.. గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే గొడవ సృష్టిస్తున్నావ్‌.. అభ్యంతరకర పదాలతో అటాక్‌ చేస్తావ్‌.. అని గౌతమ్‌.. పృథ్వీ గురించి ఫిర్యాదు చేశారు. ఆటలో అయినా, చర్చలో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని నబీల్‌, మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు తన డిక్టేటర్‌ ప్రవర్తన నచ్చలేదని అవినాష్‌.. ప్రేరణకు చెప్పారు.నబీల్‌పై ఫిర్యాదులుకామెడీ వెనకున్న ఎమోషన్స్‌ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం చూపించాలని ప్రేరణ, నీ అరుపు ఎక్కువైందని యష్మి.. అవినాష్‌పై ఫిర్యాదు చేశారు. వైల్డ్‌ కార్డ్స్‌ వచ్చాక నువ్వు మారిపోయి అందరితో బాగుండాలని ప్రయత్నిస్తున్నావని పృథ్వీ, ఒక్కోవారం ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు, పెద్ద విషయాల్ని వదిలేసి నిన్ను ప్రశ్నించినవారిని మాత్రం టార్గెట్‌ చేస్తున్నావని గౌతమ్‌.. నబీల్‌ గురించి తెలిపారు.యష్మి ఎలిమినేట్‌మనసులో మాట డైరెక్ట్‌గా చెప్పుంటే నా గేమ్‌ ఎఫెక్టయ్యేదే కాదు. ఈ జర్నీలో నువ్వు ఫైటర్‌ కన్నా సేఫ్‌ గేమర్‌గానే ఎక్కువ కనిపించావని యష్మి, అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావ్‌.. అతడి గేమ్‌ ప్లానేంటో తెలియదు, అందుకే తనను నమ్మలేనని ప్రేరణ.. నిఖిల్‌ గురించి రాసుకొచ్చారు. అనంతరం నాగార్జున.. నబీల్‌, పృథ్వీని సేవ్‌ చేసి యష్మి ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. నా మాటల వల్ల, ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడుంటే సారీ అంటూ యష్మి కన్నీటితో వీడ్కోలు తీసుకుంది. నిఖిల్‌ నా ఫేవరెట్‌ ఫ్రెండ్‌స్టేజీపైకి వచ్చాక ఆమెతో ఫ్రెండ్స్‌ ఎవరు? శత్రువులు ఎవరు? అన్న గేమ్‌ ఆడించాడు నాగ్‌. ప్రేరణ, నిఖిల్‌, పృథ్వీ, విష్ణుప్రియ తన ఫ్రెండ్స్‌ అంది. నిఖిల్‌ తన ఫేవరెట్‌ ఫ్రెండ్‌ అని, ఎవరేమన్నా తమ స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. శత్రువుల లిస్ట్‌లో గౌతమ్‌, అవినాష్‌, రోహిణిని చేర్చింది. స్నేక్‌ అండ్‌ లాడర్‌ గేమ్‌లో గౌతమ్‌, నిఖిల్‌ పాములని మెజారిటీ హౌస్‌మేట్స్‌ అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకర్ని నామినేట్‌ చేయాలని యష్మిపై భారం వేశాడు నాగ్‌. దీంతో ఆమె గౌతమ్‌పై బిగ్‌బాంబ్‌ వేసింది.మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Jofra Archer sold to Rajasthan Royals for Rs 12.50 crore in IPL 2025 auction3
వేలంలోకి లేటుగా వచ్చేశాడు.. కట్ చేస్తే! రూ. 12.50 కోట్లు కొట్టేశాడు

ఐపీఎల్‌-2025 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై కాసుల వర్షం కురిసింది. వేలానికి ఒక్క రోజు ముందు ఎంట్రీ ఇచ్చిన ఆర్చర్ అనూహ్యంగా భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఆర్చర్‌ను రూ. 12.50 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన జోఫ్రా కోసం తొలుత లక్నో సూపర్ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత పోటీలోకి రాజస్తాన్ రాయల్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆఖరికి ముంబై ఇడియన్స్‌, ఎల్‌ఎస్‌జీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆర్చర్‌ను రాజస్తాన్ సొంతం చేసుకుంది.ఆర్చర్ గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కాగా ఈ ఆక్ష‌న్ కోసం బీసీసీఐ తొలుత షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో ఆర్చ‌ర్‌కు చోటు ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత ఇంగ్లండ్ నుంచి ఎన్‌వోసీ మంజారు కావ‌డంతో ఆఖ‌రినిమిషంలో ఆర్చ‌ర్ పేరును వేలంలోకి బీసీసీఐ చేర్చింది. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 40 మ్యాచ్‌లు ఆడిన ఆర్చ‌ర్ 48 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

My home is not in the buffer zone, says Hydra Ranganath4
మా ఇల్లు బఫర్‌ జోన్‌లో లేదు : హైడ్రా కమిషనర్ రంగనాథ్

సాక్షి,హైదరాబాద్‌ : తన ఇల్లు బఫర్‌ జోన్‌లో ఉందంటూ సోషల్‌ మీడియాలో జరగుతున్న ప్రచారాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్‌లో లేదు. మధురా నగర్‌లో మేం ఉంటున్న ఇల్లుని 4 దశాబ్దాల క్రితం మా తండ్రి నిర్మించారు. కృష్ణకాంత్ పార్కు దిగువున వున్న వేలాది ఇళ్ళ తర్వాత మా ఇల్లు ఉంది. మా తండ్రి నిర్మించిన ఈ ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఒకప్పటి పెద్ద చెరువునే రెండున్నర దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చిన విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చెరువు కట్టకు దిగువున10 మీటర్లు దాటితే.. కింద ఉన్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావు. చెరువు కట్టకు దాదాపు కిలో మీటర్ దూరంలో మా ఇల్లు ఉంది. వాస్తవాలు ఇలా ఉంటే తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.

Sharad Pawar Comments On His Retirement From Politics5
అది వాళ్లకు అనవసరం.. రాజకీయాలకు స్వస్తి పలకడంపై శరద్‌ పవార్‌

ముంబై: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఘోర పరాజయంపై ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్‌ పవార్‌ స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఊహించలేదని, ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయమని అన్నారు .మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శరద్‌ పవార్‌ మాట్లాడారు. 288 అసెంబ్లీ స్థానాల్లో అజిత్‌ పవార్‌ 41 స్థానాల్ని గెలిచారని ప్రస్తావించారు. ఈ సందర్భంగా శరద్‌ పవార్‌ మాట్లాడుతూ.. ఈ ఫలితాల్ని మేం ఊహించలేదు. ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయం. నాకంటే అజిత్‌ పవార్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయనే విషయాన్ని మేం అంగీకరిస్తున్నాం. అయితే ఎన్సీపీ వ్యవస్థాపకుడు ఎవరో మహరాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ స్థాపించిన నాటి నుంచి తొలిసారి శరద్‌ పవార్‌ నేతృత్వంలో ఎన్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది.ఈ తరుణంలో పలువురు ఎన్సీపీ నేతలు.. శరద్‌ పవార్‌ రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. నేను ఏం చేయాలో వాళ్లకు అనవసరం నేను ఏం చేయాలో నేను, నా సహచరులు నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించారు.

IPL 2025 Mega Auction Day 1 Live Updates
ఐపీఎల్‌-2025 మెగా వేలం లైవ్‌ అప్‌డేట్స్‌..

Sakshi Editorial On Winter Woolen cloth In Oka Chali Ratri Story7
మీ చేతి ఉన్నివస్త్రం

‘తపాలా బండి గంటల చప్పుడుకు ఏ పడుచు పిల్లయినా నిద్ర లేచినా మళ్లీ అటు తిరిగి పడుకుని తియ్యటి కలలు కంటుంది’ అని ఉంటుంది చెహోవ్‌ రాసిన ‘ఒక చలి రాత్రి’ కథలో! ఊహించండి. దట్టమైన చలికాలం. రాత్రి మూడు గంటల సమయం. ఏ వెధవ ప్రాణమైనా ముడుక్కుని పడుకుని కాసింత సుఖాన్ని అనుభవించే వేళ. ఒడలు మరిచే వేళ. వెచ్చదనమూ భోగమే అని భావించే వేళ. పొట్టకూటి కోసం, రోజూ చేయాల్సిన పని కోసం తపాలా మూటలను బగ్గీలో వేసుకుని స్టేషనుకు చేర్చక తప్పని మెయిల్‌మేన్‌ మనసులో ఎలా ఉంటుంది? నిశ్శబ్దాన్ని కప్పుకొని గాఢ సుషుప్తిలో ఉన్న ఊరి వీధుల గుండా అతడొక్కడే చలికి వణుకుతూ, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో వెళుతూ ఉంటే అతడి అంతరంగ జగాన ఏముంటుందో ఆ సమయాన ఇళ్లల్లోని గదుల్లో రగ్గుల చాటున శయనిస్తున్న మనుషులకు తెలుస్తుందా?శ్రీమంతులు కూడా భలే వాళ్లులే! చలి రాత్రుళ్లలో వారికి మజాలు చేయాలనిపిస్తుంది. అతిథులను పిలవాలనిపిస్తుంది. పార్టీలూ గీర్టీలూ. పనివాళ్లను తొందరగా ఇళ్లకు పోండి అంటారా ఏమి? లేటు అవర్సు వరకూ పని చేయాల్సిందే! బయట చలి ఉంటుంది. పాకల్లో పసిపిల్లలు ‘కప్పుకోవడానికి ఇవాళైనా దుప్పటి కొనుక్కుని రా నాన్నా’ అని కోరడం గుర్తుకొస్తూ ఉంటుంది. ఒంటి మీదున్న ఈ కనాకష్టం బట్టలతో ఇంతరాత్రి చలిలో ఇంటికి ఎలా చేరాలనే భీతి ఉంటుంది. వెచ్చటి ద్రవాలు గొంతులో ఒంపుకునే శ్రీమంతులు ‘ఒరే... ఆ రగ్గు పట్టుకుపో’ అంటారా? ‘ఈ పాత స్వెటరు నీ కొడుక్కు తొడుగు’ అని దయతో పారేస్తారా? ఆ సోయి ఉంటే కొందరు ఎప్పటికీ శ్రీమంతులు కాలేరు. పాపం పనివాడు రంగడు పార్టీలో యజమాని ఉండగా ఆ అర్ధరాత్రి రగ్గు దొంగిలిస్తాడు. పేదవాణ్ణి దొంగను చేసింది లోపలి పెద్దమనిషా... బయటి చలా? డి.వెంకట్రామయ్య ‘చలి’ కథ ఇది.దర్శకుడు బి.నరసింగరావు కథలు కూడా రాశారు. ‘చలి’ అనే కథ. నగరానికి వచ్చిన వెంటనే మొగుడు పారిపోతే ఆ వలస కూలీ చంకన బిడ్డతో వీధుల్లో తిరుగుతూ చలిరాత్రి ఎక్కడ తల దాచుకోవాలా అని అంగలారుస్తుంటుంది. అక్కడ నిలబడితే ఎవరో కసురుతారు. ఇక్కడ నిలబడితే ఎవరో తరుముతారు. నోరూ వాయి లేని చెట్టు ‘పిచ్చిదానా... నిలుచుంటే నిలుచో. నీకేం వెచ్చదనం ఇవ్వలేను’ అని చిన్నబోతూ చూస్తుంది. చెట్టు కింద తల్లీబిడ్డా వణుకుతుంటారు. చలి. చెట్టు కింద తల్లీ బిడ్డా కొంకర్లు పోతూ ఉంటారు. శీతలం. చెట్టు సమీపంలోని చాటు అటుగా వచ్చి ఆగిన కారులోని యువతీ యువకులకు మంచి ఏకాంతం కల్పిస్తుంది. బయట చలి మరి. ఒకే తావు. చెట్టు కింద చావుకు దగ్గరపడుతూ తల్లీబిడ్డ. అదే తావులో ఏమీ పట్టని వెచ్చని సరస సల్లాపం. చలి ఒకటే! బహు అర్థాల మానవులు.శతకోటి బీదలకు అనంతకోటి ఉపాయాలు. పేదవాడు బతకాలంటే నోరు పెంచాలి. లేదా కండ పెంచాలి. కండ పెంచిన మల్లయ్య రైల్వేస్టేషన్‌ దగ్గర సగం కట్టి వదిలేసిన ఇంటి వసారాను ఆక్రమించుకుంటాడు. తక్కిన కాలాల్లో దాని వల్ల లాభం లేదు. చలికాలం వస్తే మాత్రం రాత్రిళ్లు తల దాచుకోవడానికి అలగా జనాలు ఆ వసారా దగ్గరికి వస్తారు. తలకు ఒక్కరూపాయి ఇస్తే వెచ్చగా పడుకునేందుకు చోటు. కొందరి దగ్గర ఆ రూపాయి కూడా ఉండదు. దీనులు. పేదవాడు మల్లయ్య దయ తలుస్తాడా? తరిమి కొడతాడు. లేచిన ప్రతి ఆకాశహర్మ్యం నా ప్రమేయం ఏముందని నంగనాచి ముఖం పెట్టొచ్చుగాని అది ఎవడో ఒక పేదవాడిలో మంచిని చంపి రాక్షసత్వం నింపుతుంది. వి. రాజా రామమోహనరావు ‘చలి వ్యాపారం’ కథ ఇది.చలిరాత్రి ఎప్పటికీ అయిపోదు. అది పేదవాళ్లకు తామెంత నగ్నంగా జీవిస్తున్నారో గుర్తు చేయడానికే వస్తుంది. చలికి వణికే కన్నబిడ్డల్ని చూపి బాధ పెట్టడానికే వస్తుంది. మనందరం మధ్యతరగతి వాళ్లమే. ఇంటి పనిమనిషిని అడుగుదామా ‘అమ్మా... నీ ఇంట ఒక గొంగళన్నా ఉందా... పిల్లలకు ఉన్ని వస్త్రమైనా ఉందా?’.... ‘చలికి వ్యక్తి మృతి’ అని వార్త. మనిషి చలికి ఎందుకు చనిపోతాడు? ప్రభుత్వం అతనికి ఇస్తానన్న ఇల్లు ఇవ్వకపోతే, ఇల్లు ఏర్పాటు చేసుకునేంత ఉపాధి చూపకపోతే, నీ దిక్కులేని బతుకును ఇక్కడ వెళ్లదీయమని వింటర్‌ షెల్టరైనా చూపకపోతే, తన నిర్లక్ష్యాన్ని తోడు చేసుకుని చలి హత్యలు చేయగలదని గ్రహించకపోతే అప్పుడు ఆ వ్యక్తి ‘చలికి చనిపోయిన వ్యక్తి’గా వార్తలో తేలుతాడు. విలియమ్‌ సారోయాన్‌ అనే రచయిత రాస్తాడు– చలి నుంచి కాపాడటానికి కనీసం శవాల మీదున్న వస్త్రాలనైనా తీసివ్వండ్రా అని! అతని కథలో ఒక యువకుడు ఆకలికి తాళలేక ఓవర్‌కోట్‌ అమ్మి చలితో చచ్చిపోతాడు.పగిలిన గాజుపెంకుతో కోసినట్టుగా ఉంటుందట చలి. అదంత తీవ్రంగా ఉండేది మను షుల్లో నిర్దయను పెంచడానికా? కాదు! దయను పదింతలు చేయడానికి! పాతదుప్పట్లో, పిల్లలు వాడక వదిలేసిన స్వెటర్లో, నాలుగు కంబళ్లు కొనేంత డబ్బు లేకపోలేదులే అని కొత్తవి కొనో వాటిని స్కూటర్లో, కారులో పడేసి ఆఫీసు నుంచి వచ్చేప్పుడు ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చి వస్తే ఎలా ఉంటుందో ఈ చలికాలంలో చూడొద్దా? ఉబ్బెత్తు బ్రాండెడ్‌ బొంతలో నిద్రపోయే వేళ మన చేతి ఉన్నివస్త్రంతో ఒక్కరైనా నిద్ర పోతున్నారన్న భావన పొందవద్దా? అదిగో... అర్థమైందిలే... మీరు అందుకేగా లేచారు!

IPL 2025: Venkatesh Iyer sold to KKR for Rs. 23.75 crore8
వెంకటేష్ అయ్యర్‌కు జాక్ పాట్‌.. ఏకంగా రూ. 23.75 కోట్లు

ఐపీఎల్‌-2025 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేష్‌ అయ్యర్‌ ఊహించని ధర పలికాడు. అయ్యర్‌ను ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అయ్యర్ కోసం కేకేఆర్‌, ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. ఆఖరికి ఆ‍ర్సీబీ పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్‌ను కోల్‌కతా సొంతం చేసుకుంది. గత సీజన్‌లో కూడా వెంకటేష్ అయ్యర్ కేకేఆర్‌కే ప్రాతినిథ్యం వహించాడు. అయితే వేలానికి ముందు అతడిని కేకేఆర్‌ రిటైన్ చేసుకోలేదు.కాగా వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్‌-2021 సీజన్‌లో కేకేఆర్ తరపునే అరంగేట్రం చేశాడు. తొలుత అతడిని రూ.20లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అద్బుతంగా రాణించడంతో 2022 వేలానికి ముందు రూ. 8 కోట్లకు అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది.ఆ తర్వాత రెండు సీజన్ల పాటు తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వెంకటేష్‌ను ఐపీఎల్‌-2025 వేలంలోకి కేకేఆర్‌ విడిచిపెట్టింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా 23.75 కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో వెంకటేష్ ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడి 1326 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఓసెంచరీ, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి,

mancherial district people facing Problems with monkeys attack9
భార్య బాసన్లు కడుగుతుండగా.. భర్త కర్ర పట్టుకుని..

ఇంటావిడ బాసన్లు కడుగుతుంటే ఇంటాయన చేతిలో కర్ర పట్టుకుని నిల్చున్నాడేంటని అనుకుంటున్నారా? ఆలిపై అనుమానంతో కాదు.. ఆవిడను రక్షించడానికే ఆయనీలా పహరా కాస్తున్నారు. ఆ ఊర్లో అందరి ఇళ్లలోనూ ఇంచుమించు అందరూ ఇలాగే చేస్తుంటారు. ఇదేదో ఆచారం అనుకునేరు! మహిళలు ఆరు బయట పనులు చేయడం పూర్తయ్యే వరకు పురుషులు సెక్యురిటీ డ్యూటీ చేయాల్సిందే. ఎందుకంటే వానరాల బారి నుంచి కాపాడుకోవడానికి అని చెబుతున్నారు ఆ ఊరి ప్రజలు.మంచిర్యాల జిల్లాలో కోతులు బెంబేలెత్తిస్తున్నాయి. భీమారం మండల కేంద్రంలో ఆరుబయట ఇంటి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక మహిళ శనివారం తన ఇంటి ఆవరణలో వంటపాత్రలు శుభ్రం చేస్తుండగా.. ఆమె భర్త కర్ర పట్టుకుని కోతుల నుంచి రక్షణ క‌ల్పించాల్సి వ‌చ్చింది. ఇప్పటికే గ్రామంలో అనేక మంది కోతుల దాడిలో గాయపడ్డారు. దీంతో గ్రామంలో కోతుల బాధితుల సంఘమే ఏర్పాటైంది. కోతులను తరలించాలని అటవీ అధికారులు, పంచాయతీ అధికారులకు వినతిపత్రం అందజేసింది. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల ‘సౌర’భాలుఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల నుంచి చంద్రాపూర్‌ వరకు ఇటీవల నిర్మించిన 363వ జాతీయ రహదారిపై.. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని పై వంతెన వద్ద సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రాత్రి వేళ జిగేల్‌మంటున్న సౌర విద్యుద్దీపాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ట్రిపుల్‌ ఐటీలో వాకథాన్‌ నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో శనివారం ఉదయం వాకథాన్‌ నిర్వహించారు. ఇన్‌చార్జ్‌ వీసీ గోవర్దన్, ఎస్పీ జానకీషర్మిల విద్యార్థులతో కలిసి క్యాంపస్‌ ఆవరణలోని ఎకో పార్క్‌లో వాకింగ్‌ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి గోవర్దన్‌ మాట్లాడారు. విద్యార్థుల రక్షణ, సహకారం కోసం ఎస్పీ వర్సిటీని దత్తత తీసుకున్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పాఠ్యేతర కార్యకలాపాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జానకీషర్మిల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్‌కుమార్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ రణదీర్‌ సాగి, అసోసియేట్‌ డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

KL Rahul signed by Delhi Capitals for Rs 14 crore in IPL 2025 auction10
IPL 2025: కేఎల్‌ రాహుల్‌కు భారీ షాక్‌..

ఐపీఎల్‌-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు షాక్ తగిలింది. భారీ ధరకు అమ్ముడుపోతాడనుకున్న రాహుల్‌ను నామమాత్రపు ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. రూ. 14 కోట్లకు రాహుల్‌ను ఢిల్లీ సొంతం చేసుకుంది.రూ. 2 కోట్ల కనీస ధరతో ఈ వేలంలో వచ్చిన రాహుల్ కోసం తొలుత రాయల్ ఛాలెంజర్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ పోటీ పడ్డాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు అతడిని దక్కించుకోవడానికి ప్రయత్నించాయి. అయితే మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఆర్సీబీ, కేకేఆర్ వెనక్కి తగ్గాయి. అయితే ఆఖరికి సీఎస్‌కే కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో రాహుల్ ఢిల్లీ సొంతమయ్యాడు. అతడికి ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు పగ్గాలను అప్పగించే అవకాశముంది. కాగా ఈ వేలంలో ఆర్సీబీ రాహుల్‌ను కొనుగోలు చేస్తుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ వేలంలో మాత్రం అతడికి కోసం ఆర్సీబీ ప్రయత్నించలేదు.కాగా ఐపీఎల్‌-2022 నుంచి 2024 వరకు రాహుల్‌ లక్నో కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండుసార్లు ఆ జట్టును ప్లే ఆఫ్స్‌చేర్చాడు. కానీ అతడిని ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు లక్నో రిటైన్‌ చేసుకోలేదు. అందుకు జట్టు యాజమాని సంజీవ్‌ గోయెంకాతో విభేదాలే కారణమని వార్తలు వినిపించాయి.కాగా ఐపీఎల్‌లో రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 132 మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌.. 45.47 స‌గ‌టుతో 4683 పరుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌ల‌లో 37 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.చదవండి: Yuzvendra Chahal: వేలంలో చహల్‌కు కళ్లు చెదిరే ధర.. జాక్‌పాట్‌ కొట్టేశాడు

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
అది వాళ్లకు అనవసరం.. రాజకీయాలకు స్వస్తి పలకడంపై శరద్‌ పవార్‌

ముంబై:   మహరాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష

title
యూపీలో ఉద్రిక్తత, ముగ్గురు మృతి.. 30మందికి పైగా పోలీసులకు గాయాలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఉద్రిక్తత నెలకొంది.

title
జార్ఖండ్‌ ముఖ‍్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?

రాంచీ : జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా

title
ఈవీఎంల సాయంతో నకిలీ ఓట్లు: మాయావతి ఆరోపణ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని  తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల

title
వికసిత భారత్‌లో యువత పాత్ర కీలకం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఆదివారం)తన రేడియో కార్యక్రమం ‘మన్‌క

NRI View all
title
అట్లాంటా: పేద రోగులకు భరోసా.. ‘శంకర నేత్రాలయ’ నిధుల సేకరణ కార్యక్రమం

శంకర నేత్రాలయ అమెరికా సంస్థ (SN USA) అట్లాంటాలో ఈ నెల 17న ఒక అద్భుతమైన శాస్త్రీయ నృత్య కార్యక్రమాన్ని పేద రోగుల దృష్టిని

title
బ్రిటిష్‌ కొలంబియా డిప్యూటీ ప్రీమియర్‌గా తొలి ఇండో–కెనడియన్‌

భారత సంతతికి చెందిన నికీ శర్మ బ్రిటిష్‌ కొలంబియా(బీసీ) డిప్యూటీ ప్రీమియర్‌గా నియామకం అయింది.

title
సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్

సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీ లాంఛ్ అయింది.

title
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాది మృతి

కుత్బుల్లాపూర్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుత్బుల్ల

title
అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచే..

గతేడాది భారత్‌ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో

Advertisement
Advertisement