ఆస్ట్రేలియా గడ్డపై తనకు తిరుగులేదని టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
ఆసీస్ బౌలర్లను అలవోకగా ఆడుతూ 143 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. టెస్టుల్లో కోహ్లికి ఇది 30వ శతకం. అదేవిధంగా ఆస్ట్రేలియా గడ్డపై విరాట్‌కు 7వ సెంచరీ కావడం గమనార్హం. ఇక ఈ సెంచరీతో కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..
👉ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (6 సెంచరీలు) పేరిట ఉండేంది. ఈ సెంచరీతో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ఈ పర్యాటక బ్యాటర్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.
👉అదేవిధంగా టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్(29)ను కోహ్లి అధిగమించాడు.
👉అదే విధంగా విదేశాల్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును విరాట్ సమం చేశాడు. కోహ్లి ఆస్ట్రేలియాలో 7 సెంచరీలు చేయగా.. గవాస్కర్ కూడా వెస్టిండీస్‌లో సరిగ్గా 7 సెంచరీలు నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment