![Trump nominates Scott Bessent as treasury secretary](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/11/24/SCOTT-BESSENT.jpg.webp?itok=Eqa4YEwU)
వాషింగ్టన్: ప్రముఖ ఇన్వెస్టర్ స్కాట్ బెసెంట్‌ను అమెరికా తదుపరి ఆర్థికమంత్రిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. పన్నులు తగ్గించి, దిగుమతి సుంకాలను పెంచుతానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కీ స్క్వేర్ గ్రూపు వ్యవస్థాపకుడైన బెసెంట్‌పై ఉంటుంది.
‘అంతర్జాతీయ ఇన్వెస్టర్‌గా, ఆర్థిక వ్యూహకర్తగా స్కాట్ బెసెంట్ పేరు ప్రతిష్టలు గడించారు’అని ఆయన నియామకాన్ని ప్రకటిస్తూ ట్రంప్ అన్నారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ కమిషనర్‌గా మార్టీ మాకరీని నియమించారు. అలాగే పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా స్కాట్ టర్నర్‌ను ట్రంప్ ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment