
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi).. అమెరికా పర్యటన ఖరారైంది. ఈనెల 12, 13వ తేదీల్లో నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ శాఇ అధికారికంగా వెల్లడించింది. మోదీ అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నట్లు భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.
‘ప్రధాని మోదీ ఫిబ్రవరి 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. ట్రంప్ పరిపాలన అధికారంలోకి వచ్చిన కొన్ని వారాలలోపు ద్వైపాక్షిక పర్యటన కోసం వాషింగ్టన్ డీసీని సందర్శించనున్న కొద్దిమంది విదేశీ నేతలలో మోదీ కూడా ఉన్నారు’ అని పేర్కొన్నారు.
ట్రంప్‌తో మాట్లాడిన మోదీ,,
జనవరి 27వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ ఫోన్‌లోసంభాషించారు. వీరిద్దరూ ప్రపంచ శాంతి, రక్షణ, టెక్నాలజీ, భద్రత, వ్యాపార సంబంధాలతో పాటు తదితర అంశాలపై సుదీర్ఘంగా ట్రంప్‌తో మోదీ ఫోన్‌ోలో మాట్లాడారు. తామిద్దరం పరస్పర సహకారం, నమ్మకమైన భాగస్వామ్యం, సంక్షేమం, మన దేశ ప్రజలు, ప్రపంచ శాంతి తదితర అంశాల గురించి ట్రంప్‌తో చర్చించినట్లు మోదీ పేర్కొన్నారు.
కాగా, 2024 నవంబర్‌లో అమెరికాలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ట్రంప్ 2025, జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ పరిపాలన అధికారంలోకి వచ్చిన కొన్ని వారాలలోపు ద్వైపాక్షిక పర్యటన కోసం పలువురు నేతలు అమెరికాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగానే మోదీ అమెరికా పర్యటించనున్నారు.
ఈ నెల 10 నుంచి12 వరకూ ఫ్రాన్స్‌లో మోదీ
నరేంద్ర మోదీ.. అమెరికా పర్యటనకు ముందు ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. ఈనెల 10 నుంచి 12 వరకూ మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్నారు. A! యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు మోదీ. థర్మో న్యూక్లియర్ రియాక్టర్ సందర్బించనున్నారు మోదీ. అనంతరం ఫ్రాన్స్ పర్యటన ముగించుకని అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు మోదీ.
Comments
Please login to add a commentAdd a comment