పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. భారత్ ప్రస్తుతం తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది.
దీంతో టీమిండియా 421 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. జైశ్వాల్ 297 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 161 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ కూడా 77 పరుగులతో రాణించాడు.
రాహుల్-జైశ్వాల్ జోడీ తొలి వికెట్‌కు 202 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి ఔటయ్యాక ఆ బాధ్యతను స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తీసుకున్నాడు. కోహ్లి (50 నాటౌట్) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.
అయ్యో సెక్యూరిటీ గార్డ్... !
అయితే ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లి కొట్టిన ఓ సిక్సర్ బౌండరీ లైన్ బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ తలకు తాకింది. భారత ఇన్నింగ్స్ 111వ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ .. ఐదో బంతిని కోహ్లికి షార్ట్ అండ్ వైడ్ డెలివరీగా సంధించాడు. దీంతో కోహ్లి అద్బుతమైన అప్పర్ కట్ షాట్ ఆడాడు.
అయితే ఎవరూ ఊహించని విధంగా బంతి బౌండరీ లైన్ బయటపడి బౌన్స్ అయ్యి పక్కన కూర్చోని ఉన్న సెక్యూరిటీ గార్డు తలకు తాకింది. వెంటనే ఆస్ట్రేలియన్ ఫిజియో సదరు సెక్యూరిటీ గార్డ్ వద్దకు వెళ్లి కంకషన్ టెస్టును నిర్వహించాడు.
అయితే అతడికి ఎటువంటి సమస్యలేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కోహ్లి కూడా కాస్త ఆందోళన చెందాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైన్ సైతం సెక్యూరిటీ గార్డ్ వద్దకు వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నాడు. దీంతో కాసేపు ఆట నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
What a shot by kohli its a six
And hits a security guard pic.twitter.com/eiv9RDjKo2— Royal Challenger (@rcb__fc) November 24, 2024
Comments
Please login to add a commentAdd a comment