Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu TDP Alliance Govt neglected Super Six promises1
సూపర్‌ సిక్స్‌కు చంద్రబాబు ఎగనామం

తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టేశాం! అసలు పథకాన్నే ఎగరగొడదాం..! రైతు భరోసా రెండుసార్లు ఎగనామం.. ఈసారి కేంద్రం ఇచ్చాక చూద్దాం..! ఆడబిడ్డ నిధి అబ్బే..! మనకు ఇప్పుడు అసలా ఆలోచనే లేదు! ఉద్యోగులు, నిరుద్యోగులు ఆ ఊసే మరిచిపోదాం!! సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలోనూ కేబినెట్‌ సాక్షిగా సూపర్‌ సిక్స్‌ హామీలకు కూటమి సర్కారు ఎగనామం పెట్టింది. తల్లికి వందనం నుంచి అన్నదాతా సుఖీభవ దాకా.. ఆడబిడ్డ నిధి నుంచి ఉద్యోగులకు పీఆర్‌సీ, ఐఆర్‌.. నిరుద్యోగులకు భృతి వరకు ఇదే తీరు!! కొత్త ఏడాది కోటి కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్న తల్లులు, రైతన్నలు, ఉద్యోగులు, నిరుద్యోగులకు మళ్లీ నిరాశ మిగిలింది. ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌.. సెవన్‌ అంటూ ఎడాపెడా హామీలిచ్చిన సీఎం చంద్రబాబు పీఠం ఎక్కిన తరువాత వాటిని పూర్తిగా ఎగ్గొట్టేశారు. సూపర్‌ సిక్స్‌ సహా ఇతర హామీలను అటకెక్కించి తొలి ఏడాది గడిపేశారు. కొత్త సంవత్సరంలోనూ నిర్దిష్టంగా ఏమైనా ప్రకటిస్తారనుకున్న వారికి నిరాశే మిగిలింది. గురువారం జరిగిన మంత్రి­వర్గ సమావేశంలో హామీల అమలుపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేదు. కేబినెట్‌లో చర్చించారని మంత్రి ప్రక­టించడం ప్రజలను మోసగించడమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడంతో 87.42 లక్షల మంది విద్యార్ధులు ఒక్క ఏడాదే రూ.13,112 కోట్ల మేర నష్టపోయారు. 54 లక్షల మంది రైతన్నలు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందకపోవడంతో రూ.10,000 కోట్ల మేర నష్టపోయారు. కోటి మందికిపైగా యువత నిరుద్యోగ భృతి కోసం.. ‘ఆడబిడ్డ నిధి’ కోసం 1.80 కోట్ల మంది మహిళలు పడిగాపులు కాస్తుంటే నూతన ఏడాది నిర్వహించిన తొలి మంత్రివర్గ భేటీలో ఒక్క సానుకూల ప్రకటన కూడా చేయలేదు. వాటిని అమలు చేసే ఉద్దేశం లేకపోవడం వల్లే ప్రభుత్వం సాగదీస్తోందని, ఎన్నికల హామీలను నమ్మి తాము మోస­పో­యా­మని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ ఏ గ్రామంలో చూసినా మహిళల­ు, రైతులు, విద్యా­ర్థులు, యువత అదే జగన్‌ అధికారంలో ఉండి ఉంటే ఈ సమయానికి ఏ పథకాల కింద, ఎంత లబ్ధి చేకూ­రేదో బేరీజు వేసుకుంటున్నారు. గత ఐదేళ్లూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ఇంటి వద్దకే వైఎస్‌ జగన్‌ చేరువ చేశారు. ఏటా ఏప్రిల్‌లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.. మే నెలలో విద్యా దీవెన, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా.. జూన్‌లో అమ్మ ఒడి.. జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు.. ఆగస్టులో విద్యా దీవెన, నేతన్న నేస్తం.. సెప్టెంబర్‌లో చేయూత.. అక్టోబర్‌లో రైతు భరోసా.. నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు సున్నా వడ్డీ రుణాలు.. డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించే కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టారు.అమ్మ ఒడి ఆగిపోయి.. తల్లికి వందనం లేక!పేదరికం చదువులకు అడ్డు కాకూడదని, పేదింటి తలరాతలను మార్చే శక్తి విద్యకే ఉందని దృఢంగా నమ్మిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ‘అమ్మ ఒడి’ పథ­కాన్ని ప్రవేశపెట్టారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు పిల్లలను పాఠశాలలు, కాలేజీలకు పంపిన తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేల చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. విద్యా రంగ సంస్క­రణకు ఐదేళ్లలో దాదాపు రూ.73వేల కోట్లు వ్యయం చేసిన వైఎస్‌ జగన్‌ ఒక్క అమ్మ ఒడి ద్వారానే రూ.26 వేల కోట్లకుపైగా తల్లులకు అందించి పిల్లల చదువులకు భరోసా కల్పించారు. కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. తొలి­సారిగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్‌ రూమ్‌లోనూ ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ)తో డిజిటల్‌ బోధన ప్రారంభించారు. ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లీషు మీడియం చేయడంతో పాటు సీబీఎస్సీతో ఆపకుండా.. ఏకంగా ఐబీ వరకు ప్రయాణం దిశగా అడుగులు వేశారు. రోజుకొక మెనూతో రుచికరంగా గోరుముద్ద అందించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేసిన అన్ని విద్యా సంస్కరణలను రద్దు చేయడమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కారు ఐబీ, సీబీఎస్‌ఈ, టోఫెల్‌ను రద్దు చేసి.. తల్లికి వందనం పథకంపై చేతులెత్తేసింది. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తామన్న హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. తొలి ఏడాది దీన్ని అమలు చేయకుండా పిల్లల చదువులను నీరుగార్చిన కూటమి సర్కారు అసలు పూర్తిగా పథకాన్నే ఎత్తివేసే దిశగా వ్యూహం రచిస్తోంది. అన్నదాతలకూ ఎగనామమేకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని రెండు వ్యవసాయ సీజన్లు గడుస్తున్నా అందించలేదు. రైతు భరోసా పేరును అన్నదాతా సుఖీభవగా మార్చడం మినహా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అమలు చేయలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ కింద ఇప్పటికే రైతులకు రెండు విడతలు ఆర్థిక సాయం అందించడం గమనార్హం. చంద్రబాబు సర్కారు ఆ రెండు విడతలూ అన్నదాతలకు సాయం అందించకుండా ఎగనామం పెట్టింది. కేంద్రం తదుపరి ఇచ్చే వాటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాపై ఆలోచన చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. అన్నదాతా సుఖీభవ కోసం 54 లక్షల మంది అన్నదాతలకు రూ.10వేల కోట్లకుపైగా అవసరం కాగా, బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు మాత్రమే విదిలించడం గమనార్హం. ఇంతవరకు పథకం విధివిధానాలే ఖరారు చేయలేదు. ఇక ఖరీఫ్‌ 2023 సీజన్‌కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. సున్నా వడ్డీ రాయితీ ఊసే లేదు. రబీ సీజన్‌లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనా­మం పెట్టారు. ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు సేవా కేంద్రాలను (ఆర్బీకేలు) చంద్రబాబు నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆర్బీకేల ద్వారా నాన్‌ సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేశారు. కాగా రైతులకు రైతు భరోసా పథకాన్ని మరుసటి ఏడాది నుంచి అమలు చేస్తామని వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ తొలి కేబినెట్‌లోనే నిర్ణయం తీసుకుని తొలి ఏడాది నుంచే వైఎస్‌ జగన్‌ అమలు చేశారు.జాడలేని ఆడబిడ్డ నిధి..19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలందరికీ ఏటా రూ.18 వేలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సహాయం అందచేస్తామని సూపర్‌ సిక్స్‌లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ పథకాన్ని నెరవేర్చే ఉద్దేశం కానరాకపోవడం, మంత్రివర్గ సమావేశాల్లో కనీసం చర్చించకపోవడంతో 1.80 కోట్ల మంది మహిళలు మోసపోయినట్లు గ్రహిస్తున్నారు.ఉచిత గ్యాస్‌లోనూ మాయఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు జిమ్మిక్కులతో మహిళలను మోసం చేశారు. ఈ ఏడాది రెండు సిలిండర్లకు కోత పెట్టారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దీంతో కేవలం కోటి మందికి మాత్రమే ఒక్క సిలిండర్‌ ఇచ్చే పరిస్థితి ఉంది.మత్స్యకారులనూ ముంచారు..గత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయా­నికి చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. దీంతో 1.30 లక్షల మత్స్యకారులు ఇప్పటికే రూ.260 కోట్లు నష్టపోయారు. ఇప్పుడు ఏప్రిల్‌లో సాయం అందించడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు చెబుతోంది. అయితే పథకం అమలుపై కచ్చితమైన ప్రతిపాదనలు, నిర్ణయాలు మాత్రం జరగలేదు. విధివిధానాలు ఖరారు చేయలేదు. కేవలం చర్చలు, ఆలోచనలతోనే సరిపుచ్చారు. వైఎస్‌ జగన్‌ చెప్పిన మాట మేరకు అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచే మత్స్యకార భరోసాను అమలు చేశారు.ఉద్యోగుల ప్రయోజనాలపై చర్చలేదుఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచినా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యను పట్టించుకోవడం లేదని ఆంధ్రప్ర­దేశ్‌ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్య­దర్శులు ఎస్‌.బాలాజీ జీవీ సత్యనారా­యణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి నెలా మంత్రివర్గం సమావేశాలను నిర్వహి­స్తున్నా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై ఎలాంటి చర్చలు లేవన్నారు. పీఆర్సీ అమలుకు కమిటీని నియమించాలిఏపీటీఎఫ్‌ అమరావతి 12వ పీఆర్సీ అమలు కోసం కమిటీని నియమించాలని ఏపీటీఎఫ్‌ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నూతన సంవత్సరంలోనైనా డీఏ ప్రకటిస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. తల్లులకు మోసం వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘం తల్లికి వందనం పథకం ద్వారా ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ రూ.15వేల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై కూట­మి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర ధ్వజమెత్తారు. తల్లికి వందనం పథకం ఈ ఏడాది ఇవ్వడం లేదని మంత్రివర్గ సమావే­శంలో ప్రకటించి తల్లులను దగా చేసిందన్నారు. అమలు చేయకుంటే ఆందోళనఎస్‌ఎఫ్‌ఐ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయ­కుండా కూటమి ప్రభుత్వం ప్రజలను వంచి­ంచడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యద­ర్శు­లు కె.ప్రసన్నకుమార్, ఎ.అశోక్‌ గురు­వా­రం ఓ ప్రకటనలో ఖండించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం అమలు చేయకపోతే ఆందోళన చేస్తామన్నారు.ఉద్యోగులకు మొండిచెయ్యిచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుపై దృష్టి సారించలేదు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ, కూటమి ప్రభుత్వం రాగానే వెంటనే ఐఆర్‌ ప్రకటిస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చింది. సీపీఎస్‌/జీపీఎస్‌ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని వాగ్దానం చేసింది. ఇంతవరకూ ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొత్త పీఆర్సీ ఏర్పాటుతోపాటు కమిషనర్‌ను నియమించింది. అయితే చంద్రబాబు సర్కారు కమిషనర్‌తో రాజీనామా చేయించింది. ఇక పీఆర్సీ కమిషన్‌ గురించి అసలు పట్టించుకోవడమే లేదు. ఉద్యోగుల సమస్యల్లో ఒక్కటి కూడా పరిష్కరించలేదు. ఇందుకు భిన్నంగా వైఎస్‌ జగన్‌ తొలి కేబినెట్‌ సమావేశంలోనే ఉద్యోగులకు 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్‌ ఇచ్చారు. ఇప్పుడు 7 నెలలైనా ఐఆర్‌ గురించి చంద్రబాబు అసలు పట్టించుకోవడమే లేదు. గత సర్కారు ఉద్యోగుల సమస్యలపై సీఎస్‌ నేతృత్వంలో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పరిష్కరించగా, చంద్రబాబు ప్రభుత్వం ఆ ఊసే మరిచింది.నిరుద్యోగికి నయవంచన..యువతకు ఉద్యోగాలు, లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉండగా, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నెలకు రూ.4,800 కోట్లు అవసరం. అంటే ఏడాదికి రూ.57,600 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్‌లో ఇందుకు పైసా ఇవ్వలేదు. క్యాబినెట్‌లో కనీసం చర్చించలేదు. దీంతో నిరుద్యోగ భృతి హామీకి నీళ్లు వదిలినట్టయ్యింది.కొత్తవి లేవు.. అన్నీ రద్దులేతాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతోపాటు గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతానంటూ ఉగాది సందర్భంగా ఇచ్చిన హామీని చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పలికి 2.66 లక్షల మందిని రోడ్డున పడేశారు. ఇక 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న హామీ బూటకంగా మారింది.ఉద్యోగుల ఆశలపై నీళ్లు..కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా ఉద్యోగుల గురించి ఆలోచించడం లేదని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యో­గు­లకు సంబంధించి ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని గురువారం మీడియాతో పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక్క డీఏ కూడా ఇవ్వలేదన్నారు. ఐఆర్‌ ఇవ్వలేదని, డీఏ, జీపీఎస్‌ బకాయిలు, ఈఎల్స్‌ సరెండర్‌ బకాయిలు చెల్లించలేదన్నారు. రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్‌ స్థానంలో కొత్త కమిషనర్‌ను ఇంతవరకు నియ­మించలేదన్నారు. కొత్త ప్రభుత్వం కుదురుకోవ­డానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో తాము ఒత్తిడి చేయకుండా వేచి చూశామని, కానీ నెలలు గడుస్తున్నా ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. 2019లో గత ప్రభుత్వం జూలై 1 నుంచే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చిందని వెంకట రామిరెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు కూడా అలాగే ఇస్తారని ఉద్యోగులు నమ్మారన్నారు. ప్రతి కేబినెట్‌ సమావేశంలోనూ ఐఆర్‌ ఇస్తారని ఎదురు చూస్తూ వస్తుంటే ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లార­న్నారు. గత ప్రభుత్వం రెండు మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించిందన్నారు. సాధ్యం కాకుంటే కనీసం తమకు చెప్పేదన్నారు. పెండింగ్‌ బకాయిలు దశలవారీగా ఎప్పుడు ఎంత చెల్లిస్తారో పారదర్శకంగా చెప్పేవారన్నారు. ఇప్పుడు అది కూడా లేదన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా ఇంతవరకు ఉద్యోగ సంఘాలతో అధికారికంగా ఒక జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ కానీ, ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఉద్యోగులను పిలిచి మాట్లాడడం గానీ జరగలేదన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఉద్యోగు­లకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా వేధించడం మొదలు పెట్టిందన్నారు. సచివాలయంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్‌ అధికారులు ఆరుగురిని ఎలాంటి కారణాలు లేకుండా బదిలీ చేసి ముగ్గురికి ఇంతవరకు పోస్టింగ్‌ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నట్లు చెప్పారు. ఒక డీఏ ఇవ్వాలని, వెంటనే పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలని కోరారు.

India vs Aus 5th test day 1 live updates and highlights2
భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా ఐదో టెస్టు లైవ్‌ అప్‌డేట్స్‌..

India vs Aus 5th test day 1 live updates and highlights: సిడ్నీ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.నిలకడగా ఆడుతున్న రిషబ్‌ పంత్‌..విరాట్‌ కోహ్లి ఔటయ్యాక టీమిండియా బ్యాటర్లు రిషబ్‌ పంత్‌(19 నాటౌట్‌), రవీంద్ర జడేజా(4 నాటౌట్‌) ఆచితూచి ఆడుతున్నారు. 44 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 87/4టీమిండియా నాలుగో వికెట్‌ డౌన్‌..విరాట్‌ కోహ్లి రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో వెబ్‌స్టర్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లి(17) ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు. 35 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 76/4నిలకడగా ఆడుతున్న కోహ్లి, పంత్‌లంచ్‌ అనంతరం తొలి రోజు ఆట ప్రారంభమైంది. క్రీజులోకి రిషబ్‌ పంత్‌ వచ్చాడు. 30 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 67/3. క్రీజులో పంత్‌(7)తో పాటు విరాట్‌ కోహ్లి(14) పరుగులతో ఉన్నారు.మూడో వికెట్‌ ‍డౌన్‌.. గిల్‌ ఔట్‌శుబ్‌మన్‌ గిల్‌ రూపంలో టీమిండియా మూడో వికెట్‌​ కోల్పోయింది. లంచ్‌ విరామానికి ముందు లియోన్‌ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి గిల్‌ ఔటయ్యాడు. లంచ్‌ బ్రేక్‌కు భారత్‌ స్కోర్‌: 57/3నిలకడగా ఆడుతున్న కోహ్లి, గిల్‌..శుబ్‌మన్‌ గిల్‌​, కోహ్లి నిలకడగా ఆడుతున్నారు. ఆసీస్‌ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. 19 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 50/2జైశ్వాల్‌ ఔట్‌..టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. అద్బుతమైన ఫామ్‌లో ఉన్న జైశ్వాల్‌ ఈ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్‌ కోహ్లి వచ్చాడు.రాహుల్‌ ఔట్‌..కేఎల్‌ రాహుల్‌ రూపంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రాహుల్‌.. స్టార్క్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శుబ్‌మన్‌ గిల్‌ వచ్చాడు. 7 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 14/1రోహిత్‌ ఔట్‌.. గిల్‌ ఇన్సిడ్నీ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు భారత జట్టు రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. ఆఖరి టెస్టులో టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్‌ బుమ్రా వ్యవహరిస్తున్నాడు.రోహిత్‌తో పాటు గాయం కారణంగా ఆకాష్‌ దీప్‌ కూడా ఈ ‍మ్యాచ్‌కు అందుబాటులో లేడు. రోహిత్‌​ స్ధానంలో శుబ్‌మన్‌ గిల్‌ తుది జట్టులోకి రాగా.. ఆకాష్‌ స్ధానంలో ప్రసిద్ద్‌ కృష్ణ ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. మిచెల్‌ మార్ష్‌ స్ధానంలో వెబ్‌స్టర్‌కు చోటు దక్కింది.తుది జట్లుఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్‌, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీప‌ర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా(కెప్టెన్‌), ప్ర‌సిద్ద్‌ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

Fbi Key Progress In New Orleans Investigation3
USA:ట్రక్కు దాడి.. ఎఫ్‌బీఐ కీలక ప్రకటన

వాషింగ్టన్‌:న్యూ ఆర్లియన్స్‌ దాడిలో విదేశీ శక్తుల కుట్ర లేదని అమెరికా అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ ఫెడరల్‌ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) తేల్చింది. దాడికి పాల్పడ్డ జబ్బార్‌ ఒంటరిగానే ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడని తెలిపింది. దాడికి ముందు జబ్బార్‌ ఫేస్‌బుక్‌లో ఐదు వీడియోలు పోస్ట్‌ చేసినట్లు పేర్కొంది.దాడి దర్యాప్తు పురోగతిని అధ్యక్షుడు బైడెన్‌కు ఎఫ్‌బీఐ వివరించింది.సుమారు గంట సేపు అధికారులతో చర్చించి దర్యాప్తు వివరాలను బైడెన్‌ తెలుసుకున్నారు. దాడిపై స్వదేశీ,విదేశీ కుట్ర కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని వైట్‌హౌజ్‌ వర్గాలు తెలిపాయి. ఈ దాడి కోసం జబ్బార్‌ విదేశీ సంస్థలతో కలిసి పనిచేయలేదు. అయితే అతను ఐసిస్‌ నుంచి స్ఫూర్తి పొందాడు. ఇది వంద శాతం ఉగ్రవాద చర్యనే’అని ఎఫ్‌బీఐ కౌంటర్‌ టెర్రరిజం విభాగానికి చెందిన అధికారి క్రిస్టఫర్‌ తెలిపారు. ఐసిస్‌ మళ్లీ పుంజుకోకుండా సిరియాలోని అమెరికా బలగాలు ఉగ్రవాద సంస్థ నేతలపై వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. నూతన ఏడాది వేడుకల వేళ అమెరికా ఆర్మీ మాజీ ఉద్యోగి జబ్బార్‌ పికప్‌ ట్రక్కుతో జనంపైకి దూసుకొచ్చిన ఘటనలో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసుల కాల్పుల్లో జబ్బర్‌ మృతి చెందాడు.

E Formula Car Race Big Twist In ED investigation4
ఫార్ములా కారు రేసు కేసులో బిగ్‌ ట్విస్ట్‌..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసులో పలు ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి మరింత సమయం కోరారు. దీంతో, ఈనెల 8, 9 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు.ఫార్ములా ఈ-కారు రేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిన్న బీఎల్‌ఎన్‌ రెడ్డి, నేడు అరవింద్‌ కుమార్‌ను ఈడీ విచారించాల్సి ఉండగా.. హాజరయ్యేందుకు సమయం కావాలని వీరిద్దరూ కోరారు. మూడు వారాల సమయం కావాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. దీంతో, స్పందించిన ఈడీ.. రెండు వారాల సమయం కుదరదని చెప్పింది. ఈనెల 8వ తేదీన విచారణకు రావాలని బీఎల్‌ఎన్‌ రెడ్డికి మరోసారి ఈడీ.. నోటీసులు జారీ చేసింది. అలాగే, ఈనెల 9న అరవింద్‌ కుమార్‌ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో, వీరిద్దరూ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తకరంగా మారింది.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈనెల 7వ తేదీన ఈడీ అధికారులు విచారించనున్నారు. అయితే, కేటీఆర్‌.. ఈడీ వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక, కారు రేసులో విదేశీ కంపెనీకి నిధులు మళ్ళించడంపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ స్టేట్‌మెంట్‌ను కూడా ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. ఈ స్టేట్‌మెంట్‌ ఆధారంగానే కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు.ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ కంటే ముందే ఏ2, ఏ3 అయిన అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. కానీ, అనూహ్యంగా వారిద్దరూ తమకు సమయం కావాలని కోరారు. దీంతో, ఈడీ అధికారులు ముందుగా కేటీఆర్‌నే విచారించాల్సి వస్తోంది.

Gaza police chief And Israel strikes full Details5
ఇజ్రాయెల్‌ ప్లాన్‌ సక్సెస్‌.. హమాస్‌కు కోలుకులేని ఎదురుదెబ్బ

జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్‌ నేతల ఏరివేత లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. తాజాగా పోలీస్‌ చీఫ్‌ టార్గెట్‌గా జరిగిన దాడుల్లో కీలక నేత సహ 68 మంది మృతి చెందారు. ఈ మేరకు వైమానిక దాడులను ఇజ్రాయెల్‌ సైతం ధృవీకరించింది.గాజా సిటీపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 68 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో హమాస్‌ పోలీస్‌ చీఫ్‌ హసామ్‌ షాహ్వాన్‌తో పాటు.. మరో కీలక హమాస్‌ నేత మహమ్మద్‌ సలాహ్‌ కూడా ఉన్నారు. షాహ్వాన్‌ లక్ష్యంగా తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ ధ్రువీకరించింది. పోలీస్‌ చీఫ్‌ హసామ్‌ మృతి కారణంగా హమాస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కీలక నేతగా ఉన్నారు. తాజా దాడిలో మరణించిన వారిలో పౌరులే ఎక్కువ మంది ఉన్నారు.అయితే, ఇజ్రాయెల్‌ పౌరులు ఆశ్రయం ఉంటున్న అల్-మవాసి జిల్లాను మానవతా జోన్‌గా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్‌ దళాలు దాడులు చేశాయి. ఈ కారణంగానే భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక, కొత్త ఏడాదిలో రెండు రోజులు ముగిసిన వెంటనే ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడింది.ఇదిలా ఉండగా.. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ యుద్ధంలో 45,500 మందికి పైగా పాలస్తీనియన్లను మరణించారు. గాజాలోని 2.3 మిలియన్ల మంది ప్రజలు సిటీని విడిచివెళ్లిపోయారు. ఇదే సమయంలో హమాస్ అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. ఇందులో భాగంగా 1,200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మరణించారు. మరో 251 మంది ఇజ్రాయెల్‌ పౌరులను గాజా వద్ద బంధీలుగా ఉన్నారు.

Hyderabad Devotees Bus Accident At Sabarimala6
శబరిమలలో హైదరాబాద్‌ స్వాముల బస్సు బోల్తా.. ఒకరు మృతి

తిరువనంతపురం: హైదరాబాద్‌ నుండి కేరళ వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి గురైంది. శబరిమల ఘాట్‌ రోడ్డులో అదుపు తప్పి బస్సు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. స్వాములు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి శబరిమల వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. పంబా వెళ్తున్న క్రమంలో ఘాట్‌ రోడ్డులో బస్సు బోల్తా పడిపోవడంతో ప్రమాదం జరిగింది. పంపా నదికి 15 కిలోమీటర్ల దూరంలో బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నారు.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. స్వాములు గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది స్వాములు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను కొట్టాయం మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయ్యప్ప స్వాములను ఉప్పర్‌గూడకు చెందిన వారిగా గుర్తించారు.

Top Actor And EX MLA SV Sekar Comments On Social Media7
సోషల్‌మీడియాలో వివాదస్పద పోస్టు.. నటుడికి జైలు శిక్ష

సినీ నటుడు, రాజకీయ ప్రముఖుడు ఎస్వీ శేఖర్‌కు నెల రోజులు జైలు శిక్షను ఖరారు చేస్తూ మద్రాసు హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. 2018లో ఎస్వీ శేఖర్‌ సామాజిక మాధ్యమాలలో పెట్టిన ఓ పోస్టు వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి ఆయన ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు విచారణలో తేలింది. చైన్నె మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగానే ఆయన నోరు జారినట్టు విచారణలో వెలుగు చూసింది. అదే సమయంలో పశ్చాత్తాపం వ్యక్తంచేస్తూ ఎస్వీ శేఖర్‌ క్షమాపణ చెప్పుకున్నా, కేసు మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఈ కేసును రద్దు చేయాలని హైకోర్టును సైతం శేఖర్‌ ఆశ్రయించారు. విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు సైతం స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు చైన్నె కలెక్టరేట్‌ ఆవరణలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయ వేల్‌ విచారించారు. విచారణను ముగించిన ప్రత్యేక కోర్టు గత ఏడాది ప్రారంభంలో తీర్పు వెలువరించింది. ఎస్వీశేఖర్‌కు నెల రోజులు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమాన విధించారు. అదే సమయంలో అప్పీల్‌కు అవకాశం కల్పించాలని ఎస్వీశేఖర్‌ తరపున న్యాయమూర్తికి న్యాయవాదులు విజ్ఞప్తి చేయడంతో సమయం కేటాయించారు. అప్పీలు పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించడంతో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు. ఈ పిటిషన్‌ విచారణ ప్రస్తుతం ముగిసింది. తీర్పును న్యాయమూర్తి వేల్‌ మురుగన్‌ వెలువరించారు. ప్రత్యేక కోర్టు విధించిన నెల రోజుల జైలు శిక్షను ఖరారు చేశారు. అప్పీల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఎస్వీ శేఖర్‌ తెలుగు వారికి కూడా పరిచయమే.. ఆకలి రాజ్యం,అందమైన అనుభవం,వల్లభ,ఒకే ఒక్కడు వంటి చిత్రాలలో ఆయన నటించారు. 100కు పైగా తమిళ సినిమాలలో మెప్పించారు. 2006లో ఏఐఏడీఎంకే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు.మహిళా జర్నలిస్ట్‌పై నీచమైన కామెంట్‌తమిళనాడులో చదువుకోని, ఇంగితజ్ఞానం లేని అమ్మాయిలే ఎక్కువగా మీడియాలో పనిచేస్తున్నారని ఒక మహిళా జర్నలిస్ట్‌ను ఉద్దేశిస్తూ.. 2018లో ఆయన ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. 'విశ్వవిద్యాలయాల కంటే, మీడియాలో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. వారు తమ బాస్‌లతో సన్నిహితంగా ఉంటూ అందుకు ఫలితంగా రిపోర్టర్‌లు, న్యూస్ యాంకర్‌లుగా ఉద్యోగాలు పొందుతున్నారు. సాధారణంగా, తమిళనాడులోని మీడియా మొత్తం నేరస్థులు, కిరాతకులు, దోపిడీదారుల చేతుల్లో చిక్కుకుంది.' అని పేర్కొన్నాడు.

SEBI issue a fresh show cause notice to Zee Entertainment8
‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్‌ నోటీసులు

న్యూఢిల్లీ: లిస్టింగ్‌ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ZEEL) వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర, ఆయన కుమారుడు పునీత్‌ గోయెంకాలతో పాటు కంపెనీపై విచారణ కొనసాగుతుందని సెబీ స్పష్టం చేసింది. వారికి కొత్తగా షోకాజ్‌ నోటీసు (ఎస్‌సీఎన్‌) జారీ చేయనున్నట్లు పేర్కొంది. గత నోటీసులో పొందుపర్చిన అంశాలన్నీ తాజా ఎస​్‌సీఎన్‌లో కూడా ఉంటాయని తెలిపింది. కీలక వివరాల వెల్లడి నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణల కింద జీల్‌తో పాటు సంస్థ టాప్‌ మేనేజ్‌మెంట్‌పై సెబీ(SEBI) విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో 2022 జులైలో తొలుత షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. దీంతో జీల్, పునీత్‌ గోయెంకా వివాద సెటిల్మెంట్‌ కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ సెబీ హోల్‌–టైమ్‌ సభ్యుల కమిటీ దాన్ని తిరస్కరించి, తదుపరి విచారణకు సిఫార్సు చేశారు. ఇదీ చదవండి: 10 నిమిషాల్లో అంబులెన్స్‌రిలయన్స్‌ నేవల్‌ పేరు మార్పున్యూఢిల్లీ: రిలయన్స్‌(Reliance) నేవల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సంస్థ పేరు స్వాన్‌ డిఫెన్స్‌ అండ్‌ హెవీ ఇండస్ట్రీస్‌గా మారింది. జనవరి 2 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని స్టాక్‌ ఎక్స్చేంజీలకు సంస్థ సమాచారమిచ్చింది. దివాలా పరిష్కార ప్రక్రియ కింద రిలయన్స్‌ నేవల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ను స్వాన్‌ ఎనర్జీ దక్కించుకుంది.

Jasprit Bumrah opens up on Rohit Sharmas exclusion from IND vs AUS Test9
రోహిత్‌ను కావాలనే పక్కన పెట్టారా?.. కెప్టెన్‌ బుమ్రా ఏమన్నాడంటే?

అంతా ఊహించిందే జ‌రిగింది. సిడ్నీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న ఐదో టెస్టుకు టీమిండియా రెగ్యూల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit sharma) దూర‌మ‌య్యాడు. అత‌డి స్దానంలో స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా మ‌రోసారి భార‌త జ‌ట్టు ప‌గ్గాలు చేప‌ట్టాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న రోహిత్‌ విశ్రాంతి తీసుకున్నాడ‌ని టాస్ స‌మ‌యంలో బుమ్రా తెలిపాడు."ఈ మ్యాచ్‌కు రోహిత్ శ‌ర్మ త‌నంత‌ట‌తానే విశ్రాంతి తీసుకుని తన గొప్పతానాన్ని చాటుకున్నాడు. ఈ పరిణామం జట్టులో చాలా ఐక్యత ఉందని చూపిస్తుంది. టీమిండియాలో స్వార్దం అనే పదానికి తావు లేదు. అందరూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.రోహిత్ విశ్రాంతి తీసుకోగా, ఆకాష్ దీప్ గాయం కారణంగా దూరమయ్యాడు. రోహిత్ స్ధానంలో గిల్ జట్టులోకి రాగా.. ఆకాష్ స్ధానంలో ప్రసిద్ద్ కృష్ణ ఎంట్రీ ఇచ్చాడని" బుమ్రా పేర్కొన్నాడు. కాగా సిడ్నీ టెస్టుకు రోహిత్ దూరం కానున్నాడనే వార్తలు ముందు నుంచే వినిపించాయి.దానికితోడు రోహిత్ ప్రాక్టీస్ సెషన్‌లో కన్పించకపోవడం, చీఫ్ సెలక్టర్‌​ అజిత్ అగార్కర్, కోచ్ గంభీర్ బుమ్రాతో సుదీర్ఘమైన చర్చలు జరపడంతో హిట్‌మ్యాన్ బెం‍చ్‌కే పరిమితం కానున్నడన్న విషయం అ‍ర్దం అయిపోయింది. అంతా అనుకున్నట్లే ఆఖరి టెస్టుకు ఈ ముంబైకర్ దూరమయ్యాడు.కాగా ఈ సిరీస్‌లో రోహిత్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. తన ట్రేడ్‌మార్క్ ఫ్రంట్ పుల్ షాట్ ఆడటంలో కూడా రోహిత్ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌​ అనంతరం రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.తుది జట్లుఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్‌, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీప‌ర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా(కెప్టెన్‌), ప్ర‌సిద్ద్‌ కృష్ణ, మహమ్మద్ సిరాజ్చదవండి:లంక పర్యటనకు కమిన్స్‌ దూరం

Daily Horoscope On 03 January 2025 In Telugu10
ఈ రాశి వారికి నూతన ఉద్యోగయోగం. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: శు.చవితి రా.1.00 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: ధనిష్ఠ రా.12.01 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.48 నుండి 9.36 వరకు, తదుపరి ప.12.30 నుండి 1.18 వరకు, అమృత ఘడియలు: ప.1.55 నుండి 3.29 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.36, సూర్యాస్తమయం: 5.34. మేషం...నూతన ఉద్యోగయోగం. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.వృషభం..వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.మిథునం...కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.కర్కాటకం....పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. అప్రయత్నకార్యసిద్ధి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.సింహం.....గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి.కన్య.....బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. తొందరపాటు నిర్ణయాలు వద్దు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.తుల...ముఖ్యమైన పనులలో ఆటంకాలు. « ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది.. ఆలోచనలు నిలకడగా ఉండవు. మిత్రులతో అకారణ వైరం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు గందరగోళం.వృశ్చికం.....శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. ఆస్తిలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.ధనుస్సు..కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. వృథా ఖర్చులు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.మకరం......కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. సోదరులు, సోదరీలతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు.కుంభం... వ్యవహారాలు ముందుకు సాగవు. దైవదర్శనాలు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.మీనం...కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
అమెరికాలోనూ ‘చాయ్‌.. సమోసా’

‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేం

title
న్యూ ఇయర్‌ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్,  రాస్ అల్ ఖైమాలో  జరిగిన చిన్న ప్రైవేట్  విమాన ప్రమ

title
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్‌ఆర్‌ఐకు జైలు, జరిమానా

మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన  27 ఏళ్ల వ్యక్తికి  సింగపూర్‌  కోర్టు జైలు

title
సుచీర్‌ బాలాజీ కేసులో షాకింగ్ ‌ట్విస్ట్‌!

ఓపెన్‌ఏఐ విజిల్‌బ్లోయర్‌

title
యూకే స్టూడెంట్ వీసా.. మ‌రింత భారం!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడంతో భారత విద్యార్థులకు యూఎస్‌ వీసాలు కష్టమేనన్న ప్రచారం జోరందుకుంది.

Advertisement
Advertisement