బాలీవుడ్‌లో బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ షోకు హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. జనవరి 19న ఫైనల్ కూడా జరగనుంది. ఈ క్రమంలో అన్ని సీజన్స్ మాదిరే అక్కడ కూడా ఫ్యామిలీ వీక్ ఇప్పుడు జరుగుతుంది. టైటిల్ రేసులో ఉన్న వివియన్ డిసేనా అనే కంటెస్టెంట్ చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా తన సతీమణి వహ్బిజ్ దొరాబ్జీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, తన సతీమణితో ఆయన వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
వివియన్ డిసేనా బాలీవుడ్ సీరియల్స్‌లలో ఆయనకు చాలా పాపులారిటీ ఉంది. పలు రియాలిటీ షోలలో కూడా సత్తా చాటాడు. ఇప్పుడు కూడా బిగ్‌బాస్ 18 టైటిల్ రేసులో ఉన్నాడు. అయితే, ఫ్యామిలీ వీక్‌లో భాగంగా చాలా రోజుల తర్వాత తనను కలవడానికి వచ్చిన భార్యతో ఆయన రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. దానిని చూసిన నెటిజన్లు వివియన్‌ను ట్రోల్ చేస్తున్నారు. బిగ్‌బాస్‌లో అన్ని కెమెరాల ముందు వివియన్, నూరాన్ ఇద్దరూ బెడ్‌పై చాలా సన్నిహితంగా ఉన్న దృశ్యాలను టెలికాస్ట్ చేశారు. వివియన్ సతీమణి నూరాన్ కూడా పలు సీరియల్స్‌లలో నటించింది. ఆమె మోడల్‌గా కూడా రానించింది.
పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతున్న ఇలాంటి షోలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో బిగ్‌బాస్ నిర్వాహుకుల మీద కూడా వారు ఫైర్ అవుతున్నారు. హిందీ బిగ్ బాస్ హౌస్‌లో ఇలాంటివి కొత్త కాదు. గత సీజన్స్‌లలో కూడా ఇలాంటి సీనే వైరల్ అయింది. హౌస్‌లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు ఇంటిమేట్ సీన్ అంటూ ట్రెండ్ అయింది. దీంతో షో నిర్వాహకులు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అదంతా ఫేక్ అంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ, తాజాగా బిగ్ బాస్ 18 నుంచి బయటకు వచ్చిన ఈ వీడియో మాత్రం నిజమైనదేనని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment