2024 ఏడాదికిగానూ జాతీయ క్రీడా అవార్డులను యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ప్యారిస్ ఒలింపిక్ విజేత మను భాకర్, చెస్ ప్రపంచ ఛాంపియన్ డి గుకేశ్, హాకీ లెజెండ్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వరించింది.
అదే విధంగా గతేడాది క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మరో 32 మందిని అర్జున అవార్డుతో కేంద్రం సత్కరించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి చోటు దక్కింది. అయిదుగురు కోచ్ లకు ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు.
సుభాష్ రాణా(పారా షూటింగ్), దీపాలి దేశ్‌పాండే (షూటింగ్), సందీప్ సాంగ్వాన్(హాకీ), ఎస్ మురళీధరన్ (బ్యాడ్మింటన్),అర్మాండో ఆగ్నెలో కొలాకో(ఫుట్‌బాల్)లకు ద్రోణాచార్య అవార్డు వరించింది. ఈ విజేతలకు జనవరి 17 వ తేదిన రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలు
1. దొమ్మరాజు గుకేశ్- చెస్- పద్దెమినిదేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్
2. హర్మన్‌ప్రీత్ సింగ్- హాకీ- ఒలింపిక్స్‌లో భారత్‌కు వరుసగా రెండో కాంస్యం రావడంలో ప్రధాన పాత్ర
3. ప్రవీణ్ కుమార్- పారా అథ్లెటిక్స్- పారిస్ పారాలింపిక్స్‌లో హై జంప్ టీ64 విభాగంలో స్వర్ణం
4. మనూ భాకర్- షూటింగ్- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్యాలు- ఒకే ఒలింపిక్స్ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన ప్లేయర్‌గా అరుదైన ఘనత
అర్జున అవార్డు విజేతలు వీరే..
👉జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్)
👉అన్ను రాణి (అథ్లెటిక్స్)
👉నీతు (బాక్సింగ్)
👉సావీతీ (బాక్సింగ్)
👉వంతిక అగర్వాల్ (చెస్)
👉సలీమా (హాకీ)
👉అభిషేక్ (హాకీ)
👉సంజయ్ (హాకీ)
👉జర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
👉సుఖ్‌జీత్ సింగ్ (హాకీ)
👉స్వప్నిల్ సురేష్ కుసాలే (షూటింగ్)
👉సరబ్‌జోత్ సింగ్ (షూటింగ్)
👉అభయ్ సింగ్ (స్క్వాష్)
👉సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్)
👉అమన్ (రెజ్లింగ్)
👉రాకేశ్ కుమార్ (పారా ఆర్చర్)
👉ప్రీతి పాల్ (పారా అథ్లెటిక్స్)
👉జీవాంజి దీప్పతి ((పారా అథ్లెటిక్స్)
👉అజీత్‌సింగ్ ((పారా అథ్లెటిక్స్)
👉సచిన్ సర్జేరావు ఖిలారి (పారా అథ్లెటిక్స్)
👉ప్రణవ్ సూర్మ (పారా అథ్లెటిక్స్)
👉హెచ్. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్)
👉సిమ్రాన్ (పారా అథ్లెటిక్స్)
👉నవ్‌దీప్ (పారా అథ్లెటిక్స్)
👉నితీశ్ కుమార్ (పారా బ్యాడ్మింటన్)
👉తులసీమతి మురుగేశన్ (పారా బ్యాడ్మింటన్)
👉నిత్య శ్రీ సుమతి శివన్ (పారా బ్యాడ్మింటన్)
👉మనీశా రాం దాస్ (పారా బ్యాడ్మింటన్)
👉కపిల్ పర్మార్ (పారా జుడో)
👉మోనా అగర్వాల్ (పారా షూటింగ్)
👉రుబినా ఫ్రాన్సిస్ (పారా షూటింగ్)
👉అర్జున అవార్డ్స్ (లైఫ్‌టైమ్)
👉సుచా సింగ్ (అథ్లెటిక్స్)
👉మురళీకాంత్ రాజారాం పెట్కర్ (పారా స్విమ్మింగ్)
Comments
Please login to add a commentAdd a comment