Hussain Sagar
-
అలలపై అలా..
సాక్షి, హైదరాబాద్: పోటెత్తే అలలను వీక్షిస్తూ హుస్సేన్ సాగర్‌లో ఇటు నుంచి అటు నడుచుకుంటూ వెళితే ఎలా ఉంటుంది? నీటిపై తేలే బాక్సుల్లో చేరి ఏదో ఒక ఆట ఆడితే ఆ థ్రిల్ ఎలా ఉంటుంది? అర్ధరాత్రి దాటిన తర్వాత స్ట్రీట్ ఫర్నిచర్ వద్ద నింగిని తాకే ఫౌంటేన్ వెల్లువను చూస్తూ గడపడం చక్కటి అనుభూతినిస్తుంది కదా. అంతేకాదు, సాగర్ చుట్టూ సైకిల్ తొక్కవచ్చు. హాయిగా నడుచుకుంటూ ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు. అందమైన పార్కుల్లో సేదతీరొచ్చు. పార్టీలు, ఫంక్షన్లు, విందులు, వినోదాలు, ఆటా పాటలు వెరసీ.. ఒక అద్భుతమైన నైట్‌లైఫ్. నగరవాసులకే కాదు. దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను సైతం ఆకట్టుకొనేలా హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కైవాక్, సైకిలింగ్, ఎంటర్టైన్మెంట్, నైట్‌లైఫ్ షాపింగ్ వంటి సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అనుబంధ హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (హుమ్టా) ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, బాబాసాహెచ్ అంబేడ్కర్ భారీ విగ్రహం, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, సంజీవయ్య పార్కు, లేక్‌వ్యూ పార్కులతో ఆకట్టుకుంటున్న ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు ప్రాంతాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు హుమ్టా దృష్టి సారించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక ఎంటర్టైన్మెంట్ డిజైన్లను రూపొందించింది. స్కైవాక్, సైక్లింగ్.. హుస్సేన్‌సాగర్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో స్కైవాక్, సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు. ఈ ట్రాక్ అటు ట్యాంక్‌బండ్, సంజీవయ్య పార్కు నుంచి ఇటు ఐమాక్స్ థియేటర్ వరకు, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌కు కనెక్టివిటీని కలిగి ఉంటుంది. పర్యాటకులు ట్యాంక్‌బండ్ మీ దుగా ఇందిరా పార్కుకు వెళ్లేందుకు అనుగుణంగా నిర్మి స్తారు. ఇలా నలువైపులా కనెక్టివిటీ ఉండడంతో పర్యాటకులు అన్ని వైపులా రాకపోకలు సాగిస్తారు. సైకిలింగ్ పట్ల అభిరుచి ఉన్నవాళ్లకు ప్రత్యేకంగా పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేసి సైకిళ్లను అందుబాటులో ఉంచుతారు. సొంత సైకిళ్లను తెచ్చుకోవచ్చు. గంటల చొప్పున అద్దెకు తీసుకోవచ్చు. మొత్తం 5.5 మీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేయనున్న స్కైవాక్‌లో 3.3 మీటర్లు సైకిలింగ్ కోసం కేటాయిస్తారు. అలాగే 10 కిలోమీటర్ల మార్గంలో అక్కడక్కడా రెస్టరెంట్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు ఉంటాయి. సాగర్‌లోంచి రాకపోకలు సాగించేవిధంగా స్కైవాక్, సైక్లింగ్ సదుపాయాలు ఉంటాయి. నైట్‌లైఫ్ ప్లాజాలు.. నెక్లెస్‌రోడ్డు, పీపుల్స్‌ప్లాజా ప్రాంతంలో నైట్‌లైఫ్ షాపింగ్‌లో భాగంగా ప్రత్యేకమైన ఎంటర్టైన్మెంట్ ప్లాజాలను ఏర్పాటు చేయాలని హుమ్టా ప్రతిపాదించింది. పర్యాటకులు రాత్రి వేళల్లో హాయిగా కాలక్షేపం చేసేందుకు వీలుగా స్ట్రీట్ ఫర్నిచర్ ఉంటుంది. రెస్టరెంట్లు, హోటళ్లు రాత్రిపూట అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఉన్న పార్కులతో పాటు అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో మరిన్ని పార్కులను ఏర్పాటు చేయనున్నారు. స్పోర్ట్స్ బాక్సులు.. సింగపూర్‌లోని ఫ్లోటెడ్ ఫుట్‌బాల్ తరహాలో హుస్సేన్‌సాగర్‌లో చిన్న గ్రౌండ్లో ఒక క్రికెట్బాక్సు లేదా ఇతర ఆటలకు అనుగుణమైన బాక్సులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. నీటిపై తేలియాడే వేదికలపై క్రీడాకారులు ఆటలాడుకోవచ్చు. మరోవైపు ఫ్లోటెడ్ ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు ప్రశాంతంగా ఫౌంటెన్ చుట్టూ కూర్చొని గడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. ఈ భారీ ప్రాజెక్టుకు సుమారు రూ.500 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. పబ్లిక్ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించాలని హుమ్టా ప్రతిపాదించింది. సందర్శకుల నుంచి కొంత మొత్తం రుసుము వసూలు చేస్తారు.చదవండి : భుజంగరావు, రాధాకిషన్‌రావుకు బెయిల్ -
‘హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదం.. రిపోర్ట్ ఎందుకివ్వలేదు?’
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన నెక్లెస్ రోడ్డులో జరిగిన మహా హారతి కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, హుస్సేన్ సాగర్‌లోని బోటులో క్రాకర్స్ ఎవరి అనుమతితో కాల్చారంటూ ప్రశ్నించిన మంత్రి.. ప్రమాదంపై తనకు ఇప్పటి వరకు ఎందుకు నివేదిక ఇవ్వలేదంటూ అధికారులను నిలదీశారు.తక్షణమే ప్రమాద బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. టూరిజం బోటులో బాణాసంచా ఎలా అనుమతి ఇస్తారంటూ మండిపడ్డ మంత్రి.. సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఫోన్లో సంప్రదించేందుకు జూపల్లి కృష్ణారావు ప్రయత్నించగా, జూపల్లి ఫోన్‌కు కిషన్‌రెడ్డి స్పందించలేదు. బోటు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించిన విషయాన్ని జూపల్లికి తెలియకుండా అధికారులు గోప్యంగా ఉంచారు.కాగా, సాధారణంగా బాణసంచా కాల్చేందుకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. కానీ హుస్సేన్‌సాగర్‌లో మహా హారతి కార్యక్రమంలో బాణసంచా కాల్చేందుకు పోలీసుల అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. లుంబినీ పార్కు మేనేజర్, బోటింగ్ ఇన్చార్జి, ఇతర అధికారుల అనుమతితో బోటులో బాణసంచా కాల్చేందుకు వెళ్లినట్లు సమాచారం.ఇదీ చదవండి: బోటు ప్రమాదం.. కన్నతల్లి కన్నీటి వ్యథ -
కన్నతల్లి కన్నీటి వ్యథ
హైదరాబాద్: పీపుల్స్ ప్లాజా వేదికగా గత ఆదివారం భారతమాత ఫౌండేషన్ (Bharat Mata Foundation) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత మాత మహా హారతి’ కార్యక్రమంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం (Fire Accident) ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో హుస్సేన్‌సాగర్‌లో గల్లంతైన అజయ్ మృతదేహం మంగళవారం లభించగా.. ఇదే ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న గణపతి అనే యువకుడు కూడా మంగళవారం మృతిచెందాడు. రెండు రోజులుగా గాలింపు..నాగారంకు చెందిన అజయ్ మిస్సింగ్ అయ్యాడని కుటుంబ సభ్యులు సోమవారం (Monday) తెల్లవారుజామున లేక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం నుంచి బోటు ప్రమాదం జరిగిన ప్రదేశం, ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు, లేక్ పోలీసులు, లుంబీపార్క్ బోటింగ్ సిబ్బంది మరోసారి గాలింపు చేపట్టగా మంగళవారం సాయంత్రం సంజీవయ్య పార్కు వద్ద ఉన్న భారీ జాతీయ జెండా సమీపంలో మృతదేహం లభ్యమైంది. అజయ్ కుటుంబంలో విషాదంకన్నబిడ్డ క్షేమంగా ఉంటాడని గంపెడాశతో ఎదురు చూసిన అజయ్ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. రెండు రోజులుగా హుస్సేన్ సాగర్ వద్దే పడిగాపులు కాస్తున్న ఆ కుటుంబ సభ్యులకు మంగళవారం సాయంత్రం మృతదేహం దొరికిందని తెలియగానే.. తల్లిదండ్రులు జానకిరాం, నాగలక్ష్మి దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. తూ.గో జిల్లా నుంచి వచ్చిన..టాటా ఏస్ డ్రైవర్ గణపతి (22) తూర్పు గోదావరి జిల్లా నుంచి బాణసంచా కాల్చే టీంతో కలిసి వచ్చాడు. ఆ సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలపాలై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. అనుమతి తీసుకున్నారా?కాగా సాధారణంగా బాణసంచా కాల్చేందుకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. కానీ ఆదివారం రాత్రి హుస్సేన్‌సాగర్‌లో మహా హారతి కార్యక్రమంలో బాణసంచా కాల్చేందుకు పోలీసుల అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. లుంబినీ పార్కు మేనేజర్, బోటింగ్ ఇన్చార్జి, ఇతర అధికారుల అనుమతితో బోటులో బాణసంచా కాల్చేందుకు వెళ్లినట్లు తెలిసింది.బాణసంచా కాలుస్తుండగా..మహా హారతి ఇచ్చే క్రమంలో హుస్సేన్ సాగర్‌లో బోటులోంచి బాణసంచా కాలుస్తుండగా మంటలు అంటుకున్నాయి. దీంతో బోట్లో ఉన్న వారంతా నీటిలోకి దూకేశారు. ఈ క్రమంలో నీటిలోకి దూకిన వారిలో నాగారంకు చెందిన సిల్వేరు అజయ్(21) గల్లంతయ్యాడు. అదే బోటులో మంటల తాకిడికి తీవ్ర గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతూ గణపతి (22) మంగళవారం ఉదయం మృతిచెందాడు. దీంతో ఈ సంఘటనలో ఇద్దరు మృత్యువాత పడటం విషాదాంతంగా మారింది. చదవండి: ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్యరెండు రోజులుగా బోటింగ్ నిలిపివేతసాగర్లో బోటింగ్‌లో మంటలు చెలరేగి యువకుడు గల్లంతైన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో సాగర్‌లో బోటింగ్ నిలిపివేశారు. బోటింగ్ సిబ్బంది మొత్తం అజయ్ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. -
హుస్సేన్ సాగర్‌లో బోటు ప్రమాదం
-
ట్యాంక్ బండ్ ఘటనలో ఒకరి మృతి
హైదరాబాద్, సాక్షి: హుస్సేన్ సాగర్ లో జరిగిన బోటు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గణపతి చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. రిపబ్లిక్ డే నాడు భరతమాత మహాహారతి కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుని బోట్లు దగ్ధం కావడం తెలిసిందే. అయితే ప్రమాదంలో గణపతి తీవ్ర గాయాలతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. ఈ రోజు ఉదయం అతను కన్నుమూసినట్లు అధికారులు తెలిపారు. గణపతి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా అని, దాదాపు 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మరోవైపు కార్యక్రమానికి వెళ్లి కనిపించకుండా పోయిన అజయ్(21) కోసం హస్సేన్ సాగర్ ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఇంకోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
హుస్సేన్ సాగర్ బోటులో అగ్ని ప్రమాదం
-
అజయ్ కోసం హుస్సేన్ సాగర్‌లో గాలింపు
హైదరాబాద్, సాక్షి: ట్యాంక్ బండ్ బోట్ల దగ్ధం ఘటన తర్వాత అజయ్ అనే యువకుడు కనిపించకుండా పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో హుస్సేన్ సాగర్‌లో రెండు బృందాలతో ఈ ఉదయం నుంచి అధికారులు గాలింపు చేపట్టారు. మరోవైపు.. యువకుడి తల్లిదండ్రుల రోదనలతో ఈ ప్రాంతం మారుమోగుతోంది. కనిపించకుండా పోయిన యువకుడు నాగారం ప్రాంతానికి చెందిన అజయ్(21)గా నిర్ధారణ అయ్యింది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి భరతమాత మహా హారతి కార్యక్రమం కోసం అజయ్ ట్యాంక్ బండ్‌కు వచ్చాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. మరోవైపు.. అతని ఆచూకీ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. అజయ్‌కు ఈత రాదని కుటుంబ సభ్యులు చెప్పడంతో.. హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఉదయం నుంచి గజఈతగాళ్లతో సాగర్‌లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.ఘటనపై కేసు నమోదుహుస్సేన్ సాగర్‌లో భారతమాత హారతి అపశ్రుతి ఘటనపై కేసు నమోదయ్యింది. బోటు టూరిజం ఇన్‌ఛార్జి ప్రభుదాస్ ఫిర్యాదుతో లేక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆదివారం భరతమాతకు మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా రాత్రి 9 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌లో బోట్ల నుంచి బాణసంచా పేల్చుతున్న క్రమంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బోటులో ఉన్న ఐదుగురూ నీళ్లలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల ధాటికి రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనికి కొద్దిక్షణాల ముందే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు అక్కడి నుంచి వెళ్లారు. అనంతరం ఒక జెట్టీలో బాణసంచాను ఉంచి వాటిని పేల్చేందుకు ఐదుగురు సహాయకులు అందులోకి ఎక్కారు. ఈ జెట్టీని మరో బోటుకు కట్టి సాగర్‌లోకి తీసుకెళ్లి బాణసంచా పేల్చడం మొదలుపెట్టారు. రాకెట్ పైకి విసిరే క్రమంలో అది అక్కడే బాణసంచాపై పడి పేలడంతో మంటలు చెలరేగాయి. గణపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారకస్థితిలో ఉండగా... సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలవ్వగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి తెలిసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. -
హుస్సేన్ సాగర్ తీరంలో ఘనంగా భారతమాతకు మహా హారతి (ఫొటోలు)
-
‘మహా హారతి’లో అపశ్రుతి.. హుస్సేన్‌సాగర్‌లో బోట్లకు మంటలు (చిత్రాలు)
-
హుస్సేన్‌సాగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి బోట్లు చెలరేగి అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. పలువురికి గాయాలయ్యాయి. అయితే.. సకాలంలో సిబ్బంది స్పందించడంతో ప్రాణాపాయం జరగలేదు. మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా రాత్రి 9 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌లో బోట్ల నుంచి బాణసంచా పేల్చుతున్న క్రమంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బోటులో ఉన్న ఐదుగురూ నీళ్లలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల ధాటికి రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనికి కొద్దిక్షణాల ముందే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు అక్కడి నుంచి వెళ్లారు. ఒక జెట్టీలో బాణసంచాను ఉంచి వాటిని పేల్చేందుకు ఐదుగురు సహాయకులు అందులోకి ఎక్కారు. ఈ జెట్టీని మరో బోటుకు కట్టి సాగర్‌లోకి తీసుకెళ్లి బాణసంచా పేల్చడం మొదలుపెట్టారు. రాకెట్ పైకి విసిరే క్రమంలో అది అక్కడే బాణసంచాపై పడి పేలడంతో మంటలు చెలరేగాయి. గణపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారకస్థితిలో ఉండగా... సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలవ్వగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. -
కొత్త సంవత్సరం...హుసేన్ సాగర్ వద్ద సందడే సందడి (ఫొటోలు)
-
హుస్సేన్ సాగర్ చుట్టూ నో ఎంట్రీ... హద్దు మీరితే..
సాక్షి, హైదరాబాద్: ‘డిసెంబర్ 31’ని జీరో ఇన్సిడెంట్, యాక్సిడెంట్ నైట్‌గా చేయడానికి నగర పోలీసు విభాగం కసరత్తు పూర్తి చేసింది. న్యూ ఇయర్ పార్టీల విషయంలో సభ్యత, భద్రత మరవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వేడుకలు నిర్వహించుకోవాలని చెబుతున్నారు. బౌన్సర్లు, నిర్వాహకులు సహా ఎవరు హద్దు మీరినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయం తర్వాత ఏ కార్యక్రమం కొనసాగకూడదని స్పష్టం చేస్తున్నారు.డిసెంబర్ 31 రాత్రి పార్టీలకు సంబంధించి పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం...కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నిబంధనలున్నాయి. వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించకూడదు. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పార్టీల నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించకూడదు. యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పారీ్టలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు. నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడంతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శబ్ధతీవ్రతనూ కొలుస్తారు. ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ... మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మించి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పోలీసులు పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ట్యాంక్‌బండ్‌పైన ఇతర కీలక ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్Œ సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్, డబీర్‌పుర ఫ్లైఓవర్లు మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను మంగళవారం రాత్రి మూసి ఉంచుతారు.వెస్ట్‌జోన్‌లో స్పెషల్ యాక్షన్స్... నగరంలోని మిగతా నాలుగింటితో పోలిస్తే పశ్చిమ మండలం పూర్తి విభిన్నమైంది. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం సైతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వివిధ సందర్భాలు, సమయాల్లో సిటీలోని పబ్స్ కపుల్ ఎంట్రీలను మాత్రమే అనుమతిస్తుంటాయి. జంటగా వచ్చేవారు మినహా మిగతా వారిని పబ్స్‌లోకి రానివ్వరు. దీనిపై పలు సందర్భాల్లో కొందరు యువకులు గుంపులుగా వచ్చి పబ్స్ వద్ద హల్చల్ చేస్తుంటారు. స్టాగ్ గ్యాంగ్స్‌గా పిలిచే వీరు గతంలో చేసిన హంగామాలను బట్టి పోలీసులు ఓ బ్లాక్‌లిస్ట్ తయారు చేస్తున్నారు. ఇలాంటి వారి కదలికలు, వ్యవహారాలపై డేగకన్ను వేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు కానున్నాయి. నగర వ్యాప్తంగా ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (క్యూఆర్టీ), ఈవ్‌టీజింగ్ కంట్రోలింగ్‌కు ప్రత్యేక షీ–టీమ్స్ బృందాలు మోహరిస్తున్నారు. ఆయా కార్యక్రమాలు, వెన్యూల వద్ద ఉండే బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ‘డ్రింక్సే’ కాదు డ్రగ్సూ పట్టేస్తారు... కేవలం డ్రంక్ డ్రైవింగే కాకుండా ‘డ్రగ్ డ్రైవింగ్’కు చెక్ చెప్పాలని అధికారులు నిర్ణయించారు. డ్రగ్స్ తీసుకుని వాహనాలు నడిపే వారితో పాటు కొన్ని సందర్భాల్లో ఇతర అనుమానితులకు గుర్తించడానికి డ్రగ్ డిటెక్టర్స్ సమీకరించుకున్నారు. జర్మనీ నుంచి ఖరీదు చేసిన ఈ అత్యా«ధునిక పరికరాల్లో 75 పరికరాలను తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (టీఎస్ ఏఎన్‌బీ) అధికారులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలకు అందించారు. వీటి ఆధారంగా అధికారులు రహదారులపైనే కాకుండా పబ్స్, ఫామ్‌హౌస్‌లతో పాటు మరికొన్ని సున్నిత ప్రాంతాల్లోనూ తనిఖీలు చేయనున్నారు. స్నిఫర్ డాగ్స్తోనూ తనిఖీలు చేపడతారు.అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు పొడిగింపున్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైల్ సేవలు పొడిగించారు. ఈ రోజు అర్ధరాత్రి 1:15 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం అర్ధరాత్రి 12.30కి చివరి రైలు స్టేషన్ నుండి బయలుదేరి 1.15 వరకు డెస్టినేషన్ స్టేషన్‌కు చేరుకోనున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. నగరంలో రాత్రి 11 నుంచి రేపు(మంగళవారం) ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓఆర్ఆర్ మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. -
హుస్సేన్ సాగర్‌లో సెయిలింగ్ ఛాంపియన్షిప్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా మరోసారి సెయిలింగ్ సందడి మొదలైంది. సాగర్ వేదికగా గురువారం తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ ఎనిమిదో ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ పోటీల్లో ఆరు విభాగాల్లో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రతికూల వాతావరణంలోనూ సాగర్ జలాల్లో సెయిలర్లు రంగు రంగుల బోట్లలో ప్రాక్టీస్‌తో అలరించారు. తెలంగాణ సెయిలింగ్ సంఘం, యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహిస్తున్న ఈ టోర్నీ దేశంలోనే అతిపెద్ద ఛాంపియన్íÙప్లో ఒకటి కావడం విశేషం. యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ సుహేమ్ షేక్ మాట్లాడుతూ.. ఈ సారి 29 ఈఆర్ స్కిఫ్, 420 డబుల్ హ్యాండర్స్ విభాగాలను జోడించడంతో అన్ని కేటగిరీల్లో రికార్డు ఎంట్రీలు నమోదయ్యాయని తెలిపారు. తెలంగాణలో ప్రతిభావంతులను గుర్తించి తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం, ముఖ్యంగా చైనాలో జరిగే 2026 ఆసియా క్రీడలు, లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌పై దృష్టి సారించామని తెలిపారు. -
హైదరాబాద్ : సాగర తీరంలో ఎయిర్ షో..అదరహో..(ఫొటోలు)
-
హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్ ప్రారంభం (ఫొటోలు)
-
Ganesh Immersion: ఆ అనుభవాల నుంచి పాఠాలు!
సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: నగరంలో గణేశ్ సామూహిక నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా గత ఏడాది ఎదురైన అనుభవాలను పాఠాలుగా తీసుకొని ఈసారి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా కసరత్తు చేస్తున్నారు. బందోబస్తు కోణంలో సామూహిక నిమజ్జనం నగర పోలీసులకు ఫైనల్స్ వంటివి. గత కొన్నేళ్లతో పోలిస్తే గత ఏడాది ఈ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. 2023 సెప్టెంబర్ 28 తెల్లవారుజాము నుంచి 29 రాత్రి 10 గంటల వరకు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరిగింది. ఈ ఆలస్యానికి కారణాలను ఉన్నతాధికారులు విశ్లేషించి ఈసారి ఏ ఒక్కటీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఈ లోపాలను ప్రస్తావించారు. వీటిని జీహెచ్ఎంసీ సహా ఇతర విభాగాల దృష్టికీ తీసుకువెళ్లారు. రెండు క్రేన్ల మధ్య వంద అడుగుల దూరం... కొన్ని క్రేన్లలో ఇనుపతాళ్లకు బదులుగా బెల్ట్‌లు వాడారు. నిమజ్జనం సందర్భంలో ఇవి ఊడిపోవడంతో మరింత ఆలస్యమైంది. అత్యవసర పరిస్థితుల్లో ఆఖరి నిమిషంలో ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు ఏర్పాటు చేయాల్సి వస్తే... ప్రతి రెండు క్రేన్ల మధ్య కనీసం 100 నుంచి 150 అడుగుల దూరం ఉండాలి. అలా చేస్తేనే నిమజ్జనానికి విగ్రహాలను తెచ్చిన లారీలు, ఖాళీ అయినవి తేలిగ్గా ముందుకు వెళ్తాయి. అయితే సరైన పర్యవేక్షణ లేని కారణంగా గత ఏడాది ప్రతి క్రేన్ మధ్య 30 నుంచి 40 అడుగుల దూరమే ఉంచారు. దీంతో విగ్రహాలను తీసుకొచ్చిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఫలితంగా నిమజ్జనానికి వచ్చే విగ్రహాల కోసం క్రేన్లు ఖాళీగా వేచి ఉండాల్సి వచ్చింది. అదేవిధంగా ట్యాంక్‌బండ్‌పై బయటి ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులకు ఎక్కువగా డ్యూటీలు వేశారు. సరైన అవగాహన లేని వీళ్ళు సక్రమంగా తమ విధులను నిర్వర్తించలేకపోయారు. ఇదీ చదవండి: కీలక ఘట్టానికి వేళాయేపటిష్టంగా బారికేడింగ్ నిమజ్జనం చూడటానికి వచ్చే సందర్భకులు లారీల మధ్యలోకి, రోడ్డుపైకి రాకుండా ఇరువైపులా పటిష్ట బారికేడింగ్ ప్రతి ఏడాదీ ఏర్పాటు చేస్తుంటారు. ఇది గత ఏడాది సక్రమంగా జరగలేదు. దీంతో అనేకమంది లారీల మధ్యకు వస్తుండటంతో అవి చాలా ఆలస్యంగా కదిలాయి. మరోపక్క బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి లిబర్టీ వైపు వాహనాలను అనుమతించడం మరో ఇబ్బందికి కారణమైంది. విగ్రహాలు తీసుకువచ్చే లారీల వెనుక వచ్చే ద్విచక్ర వాహనాలు, ఇతరాలను గత ఏడాది పూర్తిస్థాయిలో అడ్డుకోలేదు. ఇది కూడా నిమజ్జనం ఆలస్యానికి కారణంగా మారింది. ఇవన్నీ విశ్లేషిస్తున్న ఉన్నతాధికారులు ఈసారి అవి పునరావృతం కాకుండా, గతం కంటే మెరుగైన ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇవీ లోపాలు... ముందుగా వచ్చే విగ్రహాలు నిమజ్జనం కాగానే బండ్ నుంచి 20 అడుగుల దూరం మేర నీటిలో పేరుకుపోయే వ్యర్థాలు, వస్తువులను వెంట వెంటనే తొలగించాలి. అలా జరగకపోవడంతో ఆ వెంటనే నిమజ్జనం చేసే విగ్రహాలు మునగడానికి చాలా సమయం పట్టింది. నిమజ్జనం సందర్భంగా సాగర్‌లో కనీసం నాలుగు, ఐదు ఫ్లోటింగ్ జేసీబీలను ఏర్పాటు చేయాలి. ఓ పక్క విగ్రహాలు నీటిలో పడుతుంటే, మరోపక్క వాటి వ్యర్థాలను తొలగించాలి. అయితే జీహెచ్ఎంసీ అధికారులు గత ఏడాది కేవలం ఒక్క ఫ్లోటింగ్ జేసీబీ మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ కారణాల వల్ల నిమజ్జనం ప్రక్రియ వేగంగా జరగడానికి తీసుకువచ్చిన అత్యాధునిక క్యూఆర్డీ హుక్స్ సరిగ్గా పనిచేయలేదు. క్రేన్ ప్లాట్‌ఫామ్‌కు ఉన్న నాలుగు మూలలు సమానంగా నీటిలోకి దిగితేనే ఇవి సక్రమంగా పని చేస్తాయి. అయితే సాగర్‌లో ఉన్న వ్యర్థాలు, విగ్రహాలు, ఇనుప సీకులకు తట్టుకుని నాలుగు వైపులా నీటిలో దిగక హుక్స్ వెంటనే రిలీజ్ కాలేదు. దీంతో కొన్ని విగ్రహాల నిమజ్జనానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టింది. -
#GaneshNimajjanam2024 : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందడి (ఫొటోలు)
-
ట్రాఫిక్ వలయంలో సాగర్ పరిసర ప్రాంతాలు.. వాహనదారులకు అలర్ట్
హైదరాబాద్, సాక్షి: గణేష్ నిమజ్జనం తో హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. నిమజ్జనానికి గణపయ్యలు క్యూ కట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్యాంక్ బండ్‌వైపు రావొద్దని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు నగర పోలీసులు సూచిస్తున్నారు.రేపు ‘మహా’ నిమజ్జనం ఉండడం, నిన్న ఆదివారం కావడంతో నగరంలోని చాలా విగ్రహాలు ట్యాంక్‌బంక్‌కు చేరుకున్నాయి. అయితే విగ్రహాలను తరలిస్తున్న వాహనాలను నిన్న రాత్రి నుంచి నియంత్రించేందుకు సిబ్బంది లేకపోవడం, పైగా వాటిల్లో భారీ వాహనాలు ఉండడంతో.. నిమజ్జనానికి గంటల తరబడి టైం పడుతోంది. ఇక.. సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు లేరన్న మీడియా కథనాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వాహనాలను త్వరగతిన పంపించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. ఈలోపు వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఖైరతాబాద్, టెలిఫోన్ భవన్, నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్యాంక్ బండ్ వైపుగా వెళ్లకపోవడం మంచిదని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్న వాళ్లకు సైతం నరకం కనిపిస్తోంది.రేపు ఖైరతాబాద్ మహా గణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కొనసాగనుంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. శోభాయాత్ర భద్రత కోసం పాతికవేల మంది సిబ్బందిని మోహరించినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఇక.. ఖైరతాబాద్ గణేషుడికి ఇవాళ పూజలు నిర్వహించి.. షెడ్డు తొలగింపు పనులు చేపట్టారు. రేపు ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర మొదలుపెడతారు. మధ్యాహ్నాం లోపు నిమజ్జనం చేస్తారు. ఎల్లుండి సాయంత్రంకల్లా నగరంలోని అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. క్లిక్ చేయండి: భారీ గణపయ్య దగ్గర కోలాహలం చూశారా? -
సిటీలో 17నే నిమజ్జనం.. ఆరోజే కాంగ్రెస్, బీజేపీ కార్యక్రమాలు: సీపీ
సాక్షి, హైదరాబాద్: ఈనెల 17వ తేదీన తెలంగాణలో గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ జరుగనుంది. ఈనేపథ్యంలో నిమజ్జనాలకు సంబంధించి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటన్నరలోపే నిమజ్జనం జరుగుతుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. ఇదే సమయంలో నిమజ్జనాల కోసం హైదరాబాద్‌లో రూట్స్ పరిశీలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.కాగా, సీపీ సీవీ ఆనంద్ శనివారం నిమజ్జన ఏర్పాట్ల సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ..విగ్రహాల కోసం అన్ని శాఖల అధికారులు, హై లెవెల్ కమిటీ అంత కలిసి నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. బాలాపూర్ గణేషుడి కోసం రూట్ పరిశీలిస్తున్నాం. చిన్న విగ్రహాలు కూడా నిమజ్జనానికి వెళ్లేలా జోనల్ కమిషనర్లు అన్నీ పరిశీలిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లు, వైర్లను తొలగించారు.నిమజ్జనాల కోసం మండప నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నాం. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నాం. పెండింగ్ పనులు అన్ని ఈరోజు పూర్తవుతాయి. నిమజ్జనం రోజు 25వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు. 15వేల సిటీ పోలీసులు, 10వేల మంది డీజీపీ, జిల్లాల నుండి పోలీసులు వస్తున్నారు. హుస్సేన్ సాగర్ వైపు వస్తున్న ట్రై కమిషనరేట్ పరిధిలోని విగ్రహాలు ప్రశాంతంగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ వద్ద ఘనంగా నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేశాం. రోజురోజుకు నిమజ్జనాల రద్దీ పెరుగుతోంది. రద్దీకి అనుగుణంగా క్రెయిన్, వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది.ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం మంగళవారం మధ్యాహ్నం 1.30లోపు అవుతుంది. మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకే పూజలు అన్నీ పూర్తి చేసుకుని విగ్రహాన్ని తరలిస్తాం. విగ్రహా నిమజ్జనం కోసం క్రెయిన్‌ను తరలించనున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం త్వరగా పూర్తి అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు.అలాగే, సెప్టెంబర్ 17వ తేదీన ప్రభుత్వపరంగా పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతుంది. బీజేపీ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో మరో కార్యక్రమం జరుగుతుంది. ఇక, ఎంఐఎం ఆధ్వర్యంలో సౌత్ జోన్లో ర్యాలీ కొనసాగనుంది. పలు కార్యక్రమాలు, ర్యాలీలు, నిమజ్జనాల కోసం బందోబస్తు ఏర్పాటు చేశాం. అన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా ముగుస్తాయని భావిస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఉచిత ఆహారం: అమ్రపాలి -
HYD: ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం లేదు: సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో ఈసారి ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనం లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ విషయమై శుక్రవారం(సెప్టెంబర్13) ఆయన మీడియాతో మాట్లాడారు. నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. నిమజ్జన విధుల్లో మొత్తం 18వేల మంది పోలీసులు పాల్గొంటారని చెప్పారు. ఈ ఏడాది నుంచి హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ) విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీలులేదని హైకోర్టు గతేడాదే ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల అమలు కోసం ఎన్డీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్డులో విగ్రహాల నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో నిమజ్జనోత్సవం జరగనుంది. ఇదీ చదవండి.. కఠినంగా వ్యవహరించండి: డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు -
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
#Hyderabadసాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్.. ప్రతివాదిగా చేర్చాలని కూడా కోరారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. మొదట హైడ్రాను ప్రతివాదిగా చేర్చడాన్ని కోర్టు తిరస్కరించింది. అనంతరం, పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ట్యాంక్ బండ్లో నిమజ్జనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్బంగా కోర్టు ధిక్కరణపై పిటిషనర్ ఆధారాలు చూపించలేకపోయారు అంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. నిమజ్జనం జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. 2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలి. గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు. అలాంటప్పుడు ఇప్పుడెలా హైడ్రాను పార్టీ చేస్తాం. ఈ సందర్భంగా అధికారుల చర్యలను హైకోర్టు సమర్థించింది. 2022లో అధికారుల చర్యలపై తృప్తి చెంది రికార్డ్ చేసాము. పీఓపీతో విగ్రహాలు తయారు చేయడంపై నిషేధం ఇవ్వలేం. కానీ, పీఓపీ విగ్రహాలు తాత్కాలిక పాండ్స్‌లో నిమజ్జనం చేసుకోవచ్చు. పిటిషనర్ ప్రత్యేక ఆదేశాల కోసం రిట్ పిటిషన్ వేయవచ్చు అని ధర్మాసనం చెప్పింది. #Tankbundఇదిలా ఉండగా.. కోర్టులో పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతులు లేవంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గణేష్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. మరోవైపు హుస్సేన్ సాగర్‌లో వినాయకుని నిమజ్జనాలకు అనుమతులు ఇవ్వకపోతే ఎక్కడ నిమజ్జనం చేయాలనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. No idol immersion on Tank bund ✅ pic.twitter.com/ZwQBdao8LQ— Sreekanth B+ ve (@sreekanth324) September 10, 2024 #RajaSingh Comments..ఈ సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో గందరగోళం కనిపిస్తోంది. సీఎం రేవంత్, జీహెచ్ఎంసీ కమిషనర్ దీనిపై వివరణ ఇవ్వాలి. నగరం నలుమూలల నుంచి ట్యాంక్ బండ్‌కు నిమజ్జనానికి విగ్రహాలు వస్తాయి. నిజంగా హైకోర్టు ఆర్డర్ అమలు చేస్తే ఈ విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయిస్తారు. ఇప్పటికే ప్రజలు ఎన్నో సందేహాలతో ఉన్నారు. వారికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ట్యాంక్ బండ్లో విగ్రహాలు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అసలు ఎవరు వ్యతిరేకిస్తున్నారో జీహెచ్ఎంసీ కమిషనర్ బయటకు తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. There seems to be some confusion regarding the immersion of Ganesh idols at Vinayaka Sagar (Tankbund). I kindly request Telangana CM @revanth_anumula garu and the @GHMCOnline Commissioner to provide clarity on this matter as a priority.Ensuring clear guidelines will help in… pic.twitter.com/JmWthMZyze— Raja Singh (@TigerRajaSingh) September 10, 2024ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలు.. వివరాలివే -
HYD: సాగర్‌లో నిమజ్జనం.. కాసేపట్లో హైకోర్టులో విచారణ
సాక్షి,హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం(సెప్టెంబర్10) మధ్యాహ్నం విచారణ జరగనుంది. సాగర్‌లో ప్లాస్టర్‌ఆఫ్‌పారిస్(పీవోపీ) విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఇప్పటికే ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ కేసులో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.హుస్సేన్ సాగర్ పరిరక్షణ బాధ్యత హైడ్రాదే అయినందున ప్రతివాది ఆ సంస్థేనని పిటిషనర్ తెలిపారు. నిమజ్జనం పిటిషన్‌ను ఇవాళ లంచ్ విరామం తర్వాత మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది. సాగర్‌లో పీవోపీ వినాయక ప్రతిమల నిమజ్జనంపై హైకోర్టు ఏం నిర్ణయం వెలువరిస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదీ చదవండి: కిల్లర్ డాగ్స్..! -
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం.. ‘హైడ్రా’ ప్రతివాదిగా కోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వినాయకచవితి నవ రాత్రుల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై రేపు(మంగళవారం) విచారణ జరుగనుంది.కాగా, హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్.. ప్రతివాదిగా చేర్చాలన్నారు. హుస్సేన్‌సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని కోర్టును పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై వాదనలను రేపు(మంగళవారం) వింటామని న్యాయస్థానం తెలిపింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌లో రేపు వాదనలు జరుగనున్నాయి. -
హుస్సేన్ సాగర్ ఫుల్.. జీహెచ్ఎంసీ అలర్ట్
-
హుస్సేన్ సాగర్ కు పోటెత్తుతున్న వరద
-
హుస్సేన్ సాగర్ ఫుల్.. జీహెచ్ఎంసీ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో.. నదులు, చెరువుల్లోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది.హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం కారణంగా బంజారా హిల్స్, పికెట్, కూకట్పల్లి ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు హుస్సేన్ సాగర్‌లోకి చేరుతోంది. దీంతో, సాగర్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో తూముల ద్వారా వరద నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌లోని నీటిమట్టం 513.70 మీటర్లకు చేరుకుంది, అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ 515 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ఇన్‌ఫ్లో 10270 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 9622 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.మరోవైపు.. ఎడతెరపి లేని వర్షాలతో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మూసీ నదికి వరద పోటెత్తింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసారంబాగ్ బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ, అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి. నగరంలో వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలి. ఏదైనా సహాయం కావాలంటే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040-21111111 ను సంప్రదించాలి. మ్యానువల్ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలి. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ అందరూ అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశించారు. -
హుస్సేన్ సాగర్ లో వెయ్యి ఎకరాలు మింగేసి అక్రమ కట్టడాలు
-
వాటర్ స్పోర్ట్.. కయాకింగ్..
తక్కువ వెడల్పు కాస్త ఎక్కువ పొడవు ఉండే కయాక్ లేదా పడవను రెండు వైపుల ప్యాడ్స్ ఉన్న ఒక తెడ్డును ఉపయోగించి నీటిపై కదిలించడమే కయాకింగ్. సాధారణంగా ఈ పడవపై ఒకేసారి ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు కలిసి పడవను నడిపించడమే ఈ క్రీడలోని ప్రత్యేకత. ముఖ్యంగా ఇది పర్యాటక క్రీడగా దేశంలో గుర్తింపు పొందింది. సాహస ప్రేమికులు, అడ్వెంచర్ టూరిజాన్ని ఇష్టపడేవారు ఈ కయాకింగ్కు ఆకర్షితులవుతుంటారు. సరస్సులు లేదా పెద్ద చెరువుల్లో వినోదించడానికి ఇదో చక్కని మార్గంగా చెప్పొచ్చు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ కయాకింగ్ అందుబాటులో ఉంది. దీంతో ఈ జలక్రీడను నగర వాసులు ఆస్వాదిస్తున్నారు. ఇది చాలా కాలంగా నీటి క్రీడగా ఉంటూ వస్తున్నప్పటికీ గత దశాబ్ద కాలంగా ప్రధాన పర్యాటక క్రీడగా కూడా దేశంలో ప్రసిద్ధి చెందింది. సాహస ప్రేమికులైన పర్యాటకుల్లో చాలా మంది ఈ కయాకింగ్‌ను అనేక సార్లు ఎంజాయ్ చేసి ఉంటారు. అయితే నిన్నా మొన్నటి వరకూ దేశంలోనే ప్రధాన పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రమే వారికి ఈ అవకాశం దక్కేది. ఇటీవల నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా కొన్ని çచోట్ల కయాకింగ్ అందుబాటులోకి వచి్చంది. ఆయా చోట్ల ఇప్పటికే నగరవాసులు ఈ జలక్రీడను ఆస్వాదిస్తున్నారు.కోట్‌పల్లి అటవీ ప్రాంతంలో..తెడ్డు చేతపట్టి జలాశయంలో నీటిని వెనక్కి నెట్టుకుంటూ ముందుకు సాగిపోతుంటే.. కయాకింగ్స్ ఈ అనుభూతి పొందాలంటే మాత్రం వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి ప్రాజెక్టుకు పోవాల్సిందే. అటవీ ప్రాంతం మధ్యలో కనుచూపు మేరలో నీటి అలలపై తేలియాడే పడవలు కనువిందు చేస్తాయి. నిత్యం 300 నుంచి 400 మంది పర్యాటకులు ఇక్కడ బోటింగ్ చేస్తుంటారు. వారాంతాలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. గత పదేళ్లుగా ఇక్కడ బోటింగ్ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. సుమారు 20 మంది లైఫ్ గార్డ్స్ అందుబాటులో ఉంటారు. లైఫ్ జాకెట్స్, ఇతర ప్రమాణాలు పాటిస్తుంటారు. ఒక్కరు ప్రయాణించే బోటుకు గంటకు రూ.250 ఫీజు వసూలు చేస్తారు. ఇద్దరు ప్రయాణించే బోటుకు రూ.400 వరకూ వసూలు చేస్తారు. ఈ రిజర్వాయర్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తెరిచి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ బుకింగ్ చేసుకోవడానికి వివరాలు అందుబాటులో ఉంటాయి. వికారాబాద్ పర్యాటక రంగంలో కోట్‌పల్లి బోటింగ్ పాత్ర కీలకమనే చెప్పాలి. ప్రయాణం ఇలా..నగరం నుంచి సుమారు 80 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంటుంది. హైదరాబాద్ నుంచి వికారాబాద్, తాండూరుకు ఆర్టీసీ బస్సు సరీ్వసులు ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి నుంచి రైలు సదుపాయం కూడా ఉంది. సొంత వాహనాల్లో వచ్చేవారు హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి చేవెళ్ల మీదుగా రావచ్చు. దీంతోపాటు శంకర్పల్లి మీదుగానూ రావచ్చు. ఇక్కడకు వచ్చే వారు అనంతగిరి కొండల్లో కొలువైన శ్రీ అనంత పధ్మనాభస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతగిరుల అందాలను ఆస్వాదిస్తారు.నగరంలోనూ పలు చోట్ల.. ఈ వాటర్ స్పోర్ట్స్‌కు సంబంధించి నగరంలోని దుర్గం చెరువు కేంద్ర బింధువుగా మారింది. ఇక్కడ సూర్యాస్తమయ సమయాల్లో హుషారుగా సాగే కయాకింగ్ ఈవెంట్లో ఔత్సాహికులు పాల్గొనవచ్చు. పడవలను తిప్పుతూ సరదాగా కాసేపు గడపాలనుకునే వారికి రూ.700 రుసుముతో ఆ అవకాశం అందుబాటులో ఉంది. అలా కాకుండా ప్రొఫెషన్‌గా తీసుకుని సీరియస్‌గా కయాకింగ్ నేర్చుకోవాలనుకుంటే కూడా ఇక్కడి వాటర్ స్కూల్లో ప్రత్యేక కోర్సు అందుబాటులో ఉంది. ఒక్క సోమవారం మినహా వారంలోని అన్ని రోజుల్లో ఈ క్రీడ అందుబాటులో ఉంటుంది.మరిన్ని ప్రాంతాల్లో... అదే విధంగా నగరంలోని హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న యాచ్ క్లబ్ కూడా కయాకింగ్ ప్రియుల కోసం పడవలను అందుబాటులో ఉంచుతోంది. లక్నవరం సరస్సులో కాయక్ని అద్దెకు తీసుకుని, చుట్టూ నిర్మలమైన కొండలు ఉన్న సరస్సులో విహరించే అవకాశం ఉంది. అక్కడ కొన్ని క్యాంపింగ్ గ్రూపులు, స్థానికులు గంటల ప్రాతిపదికన కయాక్‌లను అద్దెకు ఇస్తారు. సాధారణంగా ఉదయం వేళలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.కయాకింగ్కు ఆదరణ పెరిగింది.. నాకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. గత 30 ఏళ్లుగా ట్రెక్కింగ్, బోటింగ్ చేస్తున్నాను. మన దగ్గర ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కువగా సినిమాల వరకే ఉంటాయి. అయితే ఎంతో మంచి వినోదాన్ని అందించే పర్యావరణ వింతలు, ట్రెక్కింగ్, బోటింగ్ వంటివి చాలా ఉన్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు ప్రొగ్రసివ్ తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో కోట్‌పల్లిలో బోటింగ్ ఏర్పాటు చేశాం. దీని కోసం నా సొంత ఖర్చుతో బోట్లను కొనుగోలు చేసి ఇచ్చాను. దీని ద్వారా ఇప్పుడు కొంత మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయి. అంతే కాకుండా పరోక్షంగా వందలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఇప్పుడు ఇక్కడకు నిత్యం వేలాది మంది బోటింగ్‌కు వస్తున్నారు. – విశ్వేశ్వరరెడ్డి, చేవెళ్ల బీజేపీ ఎంపీఆరోగ్యలాభాలెన్నో.. కయాకింగ్ వల్ల అనేక రకాల ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రీడ మజిల్ స్ట్రెంగ్త్ పెంచుతుంది. ముఖ్యంగా అప్పర్ బ్యాక్, చేతులు, భుజాలు, ఛాతీ భాగంలో కండరాలు బలోపేతం అవుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుస్తుంది. -
Heavy Rains: హుసేన్ సాగర్ కు పోటెత్తిన వరద..
-
రెగట్టాలో మనోళ్ల హవా
సాక్షి, హైదరాబాద్: నగరం వేదికగా కొనసాగుతున్న సెయిలింగ్ మాన్సూన్ రెగట్టా పోటీల్లో మరోసారి తెలంగాణ సెయిలర్లు రాణిస్తున్నారు. సాగర్‌లో జరుగుతున్న 15వ మాన్సూన్ రెగట్టాలో బుధవారం అండర్–16 ఆప్టిమిస్ట్ ఫ్లీట్‌లో ఉద్బవ్ స్కూల్ నుంచి గోవర్ధన్పల్లార, లాహిరి కొమరవెల్లి, దీక్షిత కొమరవెల్లి విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. గోవర్ధన్ తన విజయాలతో రెండవ స్థానం కన్నా ముందే ఉన్నప్పటికీ అగ్రస్థానం కోసం మరో 4 రేసులతో నైపుణ్యాలను ప్రదర్శించాలి. సెయిలింగ్ స్టార్ లాహిరికి ఓ ప్రమాదంలో ఎడమ చేయి విరగడంతో మొదటి రెండు రేసులకు అనుమతించలేదు. చివరకు వైద్యుడి పర్యవేక్షణలో అనుమతించడంతో లాహిరి ఒక రేసులో మొదటి స్థానంలో నిలిచింది. అయినప్పటికీ 39 సెయిలర్ ఫ్లీట్‌లో ప్రశంసనీయంగా 19వ స్థానంలో నిలిచింది. ఐఎల్సీఏ 4 బాలుర విభాగంలో టీఎస్సీ మైసూర్‌కు చెందిన కృష్ణ దివాకర్ మధ్యప్రదేశ్‌కు చెందిన ఏకలవ్య బాథమ్ (3వ స్థానం)ను బీట్ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. శశాంక్ బాథమ్ రెండవ స్థానంలో ఉన్నాడు. బాలికల విభాగంలో సోమ్యా సింగ్, అలియా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంటర్నేషనల్ 420 మిక్స్డ్ లోకల్స్‌లో తనుజా కామేశ్వర్, వైష్ణవి అగ్రస్థానంలో నిలిచారు. బాలికల హాఫ్ రిగ్ ఫ్లీట్‌లో అఖిల కొప్పుల (13) స్వర్ణం, రెయిన్బో హోమ్స్ ముషీరాబాద్‌కు చెందిన నికిత జీరు (12) రజతం సాధించారు. -
హుస్సేన్ సాగర్ లో బోట్ పోటీలు
-
హైదరాబాద్ : సాగర జలాల్లో ‘సెయిలింగ్’ విన్యాసాలు (ఫొటోలు)
-
హుస్సేన్ సాగర్‌లోని బుద్ధ విగ్రహం వద్ద ఘనంగా బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు (ఫొటోలు)
-
నెక్లెస్‌రోడ్డులో లైట్ అండ్ సౌండ్ లేజర్‌షో ప్రారంభం (ఫొటోలు)
-
పీపుల్స్ ప్లాజా : జాతీయ సంస్కృతి మహోత్సవాలు–2024 (ఫొటోలు)
-
Ganesh Nimajjanam Photos: హుస్సేన్ సాగర్ లో గణేషుడి నిమజ్జనం (ఫొటోలు)
-
గణేష్ నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలను హుస్సేన్ సాగర్, చెరువుల్లో నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాలన్నింటిని జీహెచ్ఎంసి ఏర్పాటు చేసిన కృత్రిమ తాత్కాలిక నీటి కుంటలలో నిమజ్జనం చెయ్యాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులను యధాతథంగా అమలు చేయాలని నగర సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. గత వాదనల సమయంలోనే(సెప్టెంబర్ 8).. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ)తో తయారు చేసిన గణేశ్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయరాదని .. ఈ విషయమై గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొంది హైకోర్టు. ఎవరెవరి వాదనలు ఎలాగంటే.. ఇదిలా ఉంటే.. పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం ఎత్తేయాలని.. సీపీసీబీ నిబంధనలను కొట్టేయాలని పేర్కొంటూ గణేశ్‌మూర్తి కళాకారుల సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది.. ధూల్‌పేట్ వాసులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపకుండా ప్రస్తుత ఉపాధిపై దెబ్బకొట్టడం సరికాదని పేర్కొన్నారు. మరో న్యాయవాది వేణుమాధవ్ వాదనలు వినిపిస్తూ గత ఏడాది హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయలేదని.. తాత్కాలిక కొలనుల్లో నిమజ్జనం చేశామని పేర్కొన్నారు. -
Ganesh Nimajjanam 2023 Photos: ఘనంగా వినాయక నిమజ్జనాలు.. భక్తుల సందడి (ఫోటోలు)
-
హైదారాబాద్‌లో వినాయకుని నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: హైదారాబాద్‌లో వినాయకుని నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని తెలిపింది. పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనంపై గతేడాది ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా పీవోపీ విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని గతేడాది హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. పీవోపీ విగ్రహాలు ప్రత్యేక కృత్తిమ కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. అయితే గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని హైకోర్టు తెలిపింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలన్న తయారీదారుల పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. కేంద్ర పీసీబీ నిబంధనలు కొట్టివేయాలని వినాయక విగ్రహ తయారీదారులు తమ పిటిషన్లో కోరారు. గతేడాది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారని న్యాయవాది వేణుమాధవ్ తెలిపారు. అయితే ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 25కి వాయిదా వేసింది. చదవండి: కేయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతం -
మూసీలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం?
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో గల్లంతైన మహిళ మృతి చెందిది. మూసీలో లక్ష్మి మృతదేహం కొట్టుకొచ్చింది. మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని లక్ష్మీ కూతురు గుర్తించినట్లు తెలుస్తోంది. కవాడిగూడ డివిజన్ పరిధిలోని దామోదర సంజీవయ్య బస్తీలో లక్ష్మి (55) అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.. అయితే, ఇంటి దగ్గరే ఉన్న నాలాలో పడిందేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి గాంధీనగర్ పోలీసులు, జీహెచ్ఎంసీ, డిజాస్టర్ సిబ్బంది నాలాలో వెతికినా ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దామోదర సంజీవయ్యనగర్‌లో నివాసం ఉండే లక్ష్మి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా..భర్త గతంలోనే చనిపోయాడు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి ఇంటి గోడ కూలిపోవడంతో ప్రమాదభరితంగా మారింది. హుస్సేన్‌సాగర్ నాలాకు రిటర్నింగ్ వాల్ పూర్తయితే తమ ఇంటికి టాయిలెట్ నిర్మించుకోవాలని అనుకున్నామని ఆమె కూతుళ్లు కన్నీటి పర్యంతరం అయ్యారు. Lakshmi's body, found during JCB-assisted garbage removal at #MoosarambaghBridge, is now taken for a postmortem. @NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE @shibasahu2012 #hyderabad #HyderabadRains pic.twitter.com/D5FumD59Cj — Sri Loganathan Velmurugan (@sriloganathan6) September 6, 2023 చదవండి: ఇంకెన్నాళ్లు నాలా మరణాలు? మొహం కడుక్కోవడానికి ప్రయత్నించిన లక్ష్మి ప్రమాదవశాత్తు హుస్సేన్‌సాగర్ నాలాలో పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లక్ష్మి కూతురు సుజాత తన తల్లి దగ్గరికి రాగా..ఆమె కనిపించకపోవడంతో ఆందోళన చెంది పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించారు. కాగా, మూసీలో మహిళ మృతదేహం కొట్టుకురావడంతో.. గల్లంతైన లక్ష్మిగా గుర్తించారు. -
ఎన్టీఆర్ మార్గ్ పై కారు బీభత్సం
-
ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్గ్‌లో ట్యాంక్ బండ్‌పై కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. ట్యాంక్ బండ్‌పై ఉన్న ఎన్టీఆర్ మార్గ్‌లో ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంలో ఉన్న కారు అదుపుతప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ మీదకి దూసుకెళ్లి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కొద్దిలో కారు హుస్సేన్ సాగర్‌లో పడిపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇక, ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, ప్రమాదం తర్వాత వారిద్దరూ కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో కారులో ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, మద్యం మత్తులో కారు నడిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. రాజేంద్రనగర్‌లోని అరాంఘర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు, బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి మృతిచెందగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. కారులో ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో అతడికి ప్రమాదం తప్పింది. ఇది కూడా చదవండి: నా కొడుకు, భర్తను చంపేశారు..కనీసం వారి శవాలనైనా ఇప్పించండి.. -
Hyderabad: వదలని వాన
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరాన్ని వాన వీడటంలేదు. ఆదివారం చిరుజల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లు దెబ్బతిని ఛిద్రమవుతుండగా, వర్షానికి తడిసి పాత ఇళ్ల గోడలు కూలుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు తొలగినప్పటికీ బురదతో వాహదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. మరో వైపు జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. వాటిని దిగువ ప్రాంతాలకు వదులుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి. అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటికే జలమయమైన ప్రధాన రహదారుల దగ్గర వాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు వంటి చర్యలు చేపట్టింది. హుస్సేన్ సాగర్‌కు వరద.. హుస్సేన్‌సాగర్‌కు వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. 3 తూముల ద్వారా దిగువ ప్రాంతాలకు నీళ్లను వదులుతున్నారు. మరోవైపు జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో హమాయత్ సాగర్ తెరిచిన ఆరుగేట్లలో నాలుగింటిని మూసి వేసి కేవలం రెండు గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని వదులుతున్నారు. హిమాయత్ సాగర్ మొత్తం నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, ఆదివారం నాటికి నీటి మట్టం 1762.00 అడుగులకు చేరింది ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు 1000 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా రెండు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి దిగువ భాగానికి 1340 క్యూసెక్కులను వదులుతున్నారు. మరో జలాశయం ఉస్మాన్ సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వంద క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మొత్తం నీటి మట్టం 1790.00 అడుగులు కాగా ప్రస్తుతం 1785.85 అడుగులకు చేరింది. వరద కాల్వలోని శునకాన్ని కాపాడిన డీఆర్ఎఫ్ బృందాలు కాప్రా సర్కిల్ పరిధిలోని మాథ్యరి ఎన్‌క్లేవ్‌లో ప్రమాదవశాత్తు వరద కాల్వలో పడిన వీధి శునకాన్ని డీఆర్ఎప్ బృందాలు రక్షించాయి. వరదలో కొట్టుకుపోకుండా పైకి లాగి దానిని ఒడ్డుకు చేర్చారు. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు డీఆర్ఎఫ్కు మొత్తం 30 ఫిర్యాదులందాయి. అన్నింటినీ పరిష్కరించినట్లు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. వీటిలో కూలిన చెట్లు 25, నీటి నిల్వ ప్రాంతాలు 4, ఒక కూలిన గోడ ఉన్నాయి. -
దంచికొడుతున్న వానలు.. భయపెడుతున్న హుస్సేన్ సాగర్!
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజులుగా తెలంగాణలో వానలు దండికొడుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, హైదరాబాద్‌లో కూడా భారీ కురుస్తున్న కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ► కొద్ది గంటల విరామం తర్వాత శుక్రవారం మళ్లీ వర్షం మొదలైంది. అటు, జంట జలాశయాలతో పాటుగా హుస్సేన్ సాగర్‌లో కూడా భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ► కాగా, తాజాగా హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టం 513 మీటర్లకు చేరుకుంది. ఇక, హుస్సేన్ సాగర్ పూర్తి సామర్థ్యం 515 మీటర్లు. Secretariat road inundated after heavy rains batter #Hyderabad. Waterlogging was reported in most parts of the city even as the downpour continues. Video: Gandhi #DeccanChronicle.#HyderabadRains#HyderabadRoads pic.twitter.com/QSwHLnEfLT — Deccan Chronicle (@DeccanChronicle) July 20, 2023 ► వరదల కారణంగా రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ► గాజుల రామారంలో కాలనీలు జలమయమయ్యాయి. అపార్ట్మెంట్ల వద్ద కాలనీలు నదులను తలపిస్తున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రాలేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. Near live. #Hyderabad #Rains #HyderabadRains please be careful, avoid travel as much as possible @DeccanChronicle pic.twitter.com/iQbYRL8f1T — Sriram Karri (@oratorgreat) July 20, 2023 ► భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. క్షేత్రస్థాయిలో 157 మొబైల్ బృందాలు, 242 స్టాటిస్టికల్ బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేయనున్నారు. 339 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవసరమైన చోట యంత్రాలతో నీటి తొలగింపునకు చర్యలు తీసుకున్నారు. #HyderabadRains Welcome to Pragathi Nagar Lake. pic.twitter.com/UxxShiTCdw — Vudatha Nagaraju (@Pnagaraj77) July 20, 2023 Terrible traffic across #Hyderabad city including at Madhapur & Hi-tech city after incessant rains. #HyderabadRains pic.twitter.com/AvHzqMhi2U — Sowmith Yakkati (@sowmith7) July 20, 2023 ► మరోవైపు.. ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్‌కు 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రస్తుత నీటి మట్టం 1784.20 అడుగులకు చేరుకుంది. పూర్తి స్తాయి నీటి మట్టం 1790 అడుగులు. Present Situation Of Serilingampally(Lingampally railway bridge).. NO MLA ,No Corporator Inspecting Besides.. 8000 thousand Crores Of Funds Used For the Development of Serilingampally ..but There is No Basic Infrastructure To Move a Rain Water.. #HyderabadRains pic.twitter.com/M7kXj7wrYQ — Ravi Kumar Yadav 🇮🇳 (@Raviyadav_bjp) July 20, 2023 ► ఇక, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్లో ఉంది. కడెం ప్రాజెక్ట్ ఆరు గేట్లు మొరాయిస్తున్నాయి. కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి 11 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 693.4 అడుగులుగా ఉంది. ఇది కూడా చదవండి: దంచికొట్టిన వాన.. జనం హైరానా -
హుస్సేన్ సాగర్ తీరాన సెయిలింగ్ వీక్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, లేసర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో 37వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఎంసీఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ జే ఎస్ సిధాన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరచిన సెయిలర్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. ఈ పోటీలను ఏషియన్ గేమ్స్ ట్రయల్స్‌గా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌ను నిర్వహిస్తున్న సికింద్రాబాద్ ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్‌ను అభినందించారు. అంతే కాకుండా క్రీడా రంగంలో యువతను విశేషంగా ప్రోత్సహిస్తున్న తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్ అభినందించారు. లేజర్ స్టాండర్డ్, లేజర్ 4.7 తదితర విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీల్లో మంగళవారం వరకు 11 క్లబ్స్ నుంచి 89 మంది సెయిలర్స్ రిజిష్టర్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇందులో దేశ వ్యాప్తంగా 11 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సెయిలింగ్ వీక్ లో రాష్ట్రం నుంచి 17 మంది పాల్గొంటున్నారు. ఈ ఏడాది పోటీల్లో తన ప్రతిభను కనబరుస్తున్న 72 ఏళ్ల మురళి కానూరి అతి పెద్ద వయసు్కడిగా అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఈ పోటీలు 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్ రఘురామ్ రెడ్డి, తదితర ఆర్మీ అధికారులు హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Hyderabad: హుస్సేన్ సాగర్‌లో యువతి మృతదేహం
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో తేలియాడుతున్న ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని రాంగోపాల్‌పేట్ పోలీసులు వెలికితీశారు. సోమవారం పెట్రోలింగ్లోఉ న్న లేక్ పోలీసులకు సాగర్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం తేలియాడుతున్నట్లు సమాచారం రావడంతో డీఆర్ఎఫ్ బృందాల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలికి 25నుంచి 30 ఏళ్ల వయస్సు ఉంటుందని ఒంటిపై క్రీం కలర్ టాప్, ఎరుపు రంగు ప్యాంటు ధరించి ఉందని పోలీసులు తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 040-27853595 9948031574 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. చదవండి: HYD: జలమండలి వద్ద ఉద్రిక్తత.. -
తెలంగాణ వైట్ హౌస్
-
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ లోపలి లుక్ చూసేయండి (ఫొటోలు)
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ లోపలి లుక్ చూసేయండి (ఫొటోలు) ] -
సాగర తీరాన ధగధగల సౌధం
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ తీరాన ఓ భారీ భవన సముదాయం.. ఇండో–పర్షియన్ నిర్మాణ శైలి.. నిలువెల్లా సాంకేతికత.. గుమ్మటాలతో సంప్రదాయ రూపు..ఆధునిక హంగులతో కూడిన అద్భుత కట్టడం. చూడగానే తాజ్‌మహల్, మైసూర్ ప్యాలెస్‌ను తలపించే శ్వేతసౌధం..635 గదులు.. 30 సమావేశ మందిరాలు..34 గుమ్మటాలు.. అదే తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని ప్రారంభించనున్నారు. మొత్తం 28 ఎకరాల్లో.. ► సచివాలయ ప్రధాన భవనం ఆరు అంతస్తుల్లో ఉంటుంది. ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులతో 11 అంతస్తుల నిర్మాణంగా ఉంటుంది. ► సచివాలయ ప్రాంగణం 28 ఎకరాల్లో ఉంటుంది. ఇందులో భవనాల విసీర్ణం రెండున్నర ఎకరాలు. ముందువైపు 10 ఎకరాల్లో పచ్చిక మైదానం ఉండగా, కోర్ట్యార్డులో 2 ఎకరాల్లో లాన్ ఏర్పాటు చేశారు. వెరసి 90 శాతం స్థలం ఖాళీగా ఉంటే, పది శాతం మాత్రమే భవనాలున్నాయి. ► ప్రాంగణంలో మొత్తం నిర్మిత స్థలం దాదాపు 10 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుంది. దేశంలోని అతిపెద్ద సచివాలయాల్లో ఇదీ ఒకటి. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా కూడా దాదాపు ఇంతే విస్తీర్ణంలో ఉంది. ► ఈ భవనాన్ని 26 నెలల్లో పూర్తి చేశారు. మధ్యలో కోవిడ్ కారణంగా ఆరు నెల లు వృథా అయింది. అంటే 20 నెల ల్లోనే భవనాన్ని సిద్ధం చేసినట్టయింది. ► నిర్మాణ పనుల్లో 3 వేల మంది కార్మికులు పాల్గొన్నారు. చివరలో రాత్రింబవళ్లు 4 వేల మంది వరకు పనిచేశారు. కుతుబ్‌మినార్ కన్నా ఎత్తు ► సచివాలయ భవనం ఎత్తు 265 అడుగులు, ఇది కుతుబ్‌మినార్ (239 అడుగులు) కంటే ఎత్తు. భవనంపైన ప్రధాన రెండు గుమ్మటాల మీద ఏర్పాటు చేసిన అశోక చిహ్నాల్లో ఒక్కోదాని ఎత్తు 14 అడుగులు ► భవన నిర్మాణానికి రూ.617 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చారు. అప్పట్లో 6 శాతంగా ఉన్న జీఎస్టీ తర్వాత 18 శాతానికి పెరిగింది. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయి. ఇతరత్రా కారణాలతో నిర్మాణ వ్యయం దాదాపు 30 శాతానికి పైగా పెరిగింది. ► ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకునేందుకు ప్రత్యేకంగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఆ స్థాయి వారి కోసం 24 చాంబర్లను రూపొందించారు. మంత్రి, కార్యదర్శి, ఆ శాఖ అధికారులంతా ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేశారు. ఇలాంటి వ్యవస్థ ఉన్న సచివాలయం దేశంలో ఇదొక్కటే. ►గుమ్మటాల్లో రెండు పెద్దవి. ఒక్కోటి 50 అడుగుల డయాతో 48 అడుగుల ఎత్తున్నాయి. కొన్ని డోమ్‌లపై ఉన్న శూలాల్లాంటి శిఖర భాగం 9 అడుగుల ఎత్తు, ఐదు అడుగుల వెడల్పుతో ఉంది. 360 డిగ్రీల కోణంలో నగర అందాలు ► పెద్ద గుమ్మటాల్లో ఉన్న స్థలాన్ని ప్రత్యేక ప్రాంతంగా రూపొందించారు. విదేశీ ప్రతినిధులు, ఇతర అతి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు హై టీ, రాయల్ డిన్నర్లకు వినియోగిస్తారు. అక్కడి నుంచి నగర అందాలు 360 డిగ్రీల కోణంలో వీక్షించొచ్చు.ఈ ప్రాంతాన్ని స్కై లాంజ్‌గా పేర్కొంటున్నారు. ► పార్లమెంటు భవనానికి వినియోగించిన ధోల్పూర్ ఎర్రరాయిని సచివాలయం కోసం 3.500 క్యూ.మీ. పరిమాణంలో వాడారు. ఇందుకు రాజస్థాన్‌లోని ధోల్పూర్లో ఏకంగా ఓ గని మొత్తాన్ని వినియోగించారు. అక్కడి నుంచి వేయి లారీల్లో రాయిని హైదరాబాద్‌కు తరలించారు. బేస్మెంట్ మొత్తానికి ఎర్ర రాయిని వాడగా, ప్రధాన గుమ్మటం నుంచి పోర్టికో వరకు లేత గోధుమ రంగు రాయిని వాడారు. ► స్తంభాలు ఇతర భాగాల్లో ప్రత్యేక నగిషీ ఆకృతుల కోసం గల్వనైజ్డ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ (జీఆర్సీ) పద్ధతిలో ప్రీఫ్యాబ్రికేటెడ్ డెకొరేషన్ చేయించారు. తద్వారా దేశంలో ఈ స్థాయిలో జీఆర్సీ చేసిన తొలి భవనంగా సచివాలయం నిచిలింది. 42 అడుగుల పోర్టికో.. ► ప్రధాన పోర్టికో ఎత్తు ఏకంగా 42 అడుగులు. అంత ఎత్తుతో భారీ స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భవనంలో ప్రతి అంతస్తు 14 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ► భవనంలో మొత్తం 24 లిఫ్టులు ఏర్పాటు చేశారు. స్కై లాంజ్ వరకు వెళ్లేందుకు రెండు వైపులా 4 లిఫ్టుల చొప్పున 8 లిఫ్టులున్నాయి. ► సచివాలయానికి తూర్పువైపు ప్రధాన ద్వారం ఉంటుంది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రజా ప్రతినిధులకు అనుమతి ఉంటుంది. పశ్చిమం వైపు అత్యవసర ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈశాన్యం వైపు ఉద్యోగుల ద్వారం, దక్షిణం వైపు సందర్శకుల ద్వారం ఏర్పాటు చేశారు. సందర్శకుల వాహనాలు ప్రధాన ప్రహరీ బయటే నిలపాల్సి ఉంటుంది. అధికారులు, సిబ్బందికి లోపల ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. ► భవనానికి దక్షిణం వైపు సందర్శకుల రిసెప్షన్, ఎన్ఆర్ఐ రిసెప్షన్, పబ్లిసిటీ సెల్, రెండు బ్యాంకులు, రెండు ఏటీఎం కేంద్రాలు, పోస్టాఫీసు, బస్, రైల్వే కౌంటర్లు, క్యాంటీన్, మీడియా కేంద్రాలను విడిగా నిర్మించారు. వెనుక వైపు సెక్యూరిటీ కార్యాలయం, ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, ఉద్యోగుల పిల్లల క్రెచ్, ఆరోగ్య కేంద్రం, ఇండోర్ గేమ్స్ ప్రాంగణం, సహకార పొదుపు సంఘ కార్యాలయం, తదితరాలతో కూడిన భవన సముదాయాన్ని నిర్మించారు. నైరుతి వైపు దేవాలయం, వెనక వైపు చర్చి, మసీదు నిర్మించారు. ప్రత్యేక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ► తాగు నీటి కోసం 1.20 లక్షల లీటర్ల సామర్ధ్యంతో ట్యాంకు నిర్మించారు. ఇతర అవసరాలకు 1.80 లక్షల లీటర్ల సామర్థ్యంతో, అగ్నిమాపక అవసరం కోసం 2.80 లక్షల లీటర్ల సామర్థ్యంతో, వర్షపు నీరు స్టోరేజీ కోసం 2.40 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భంలో ట్యాంకులు నిర్మించారు. ► వెనుకవైపు ఏడో అంతస్తులో ప్రత్యేకంగా సచివాలయ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆధునిక సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేశారు. నిత్యం తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగానికి చెందిన 300 మంది రెండు షిఫ్టుల్లో పని చేస్తారు. అన్ని కలెక్టరేట్లు, ప్రధాన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో సచివాలయం అనుసంధానమై ఉంటుంది. ► సహజ సిద్ధమైన వెలుతురు ధారాళంగా వచ్చేలా కిటికీలు, పోర్టికోలు డిజైన్ చేశారు. నీళ్లు, కరెంటు పొదుపునకు వీలుగా నిర్మించినందున ‘ది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’ ఈ భవనానికి గోల్డ్ రేటింగ్ జారీ చేసింది. ఈ రేటింగ్ ఉన్న సచివాలయ భవనం దేశంలో ఇదొక్కటే. ► త్వరలో సచివాలయ పార్కింగ్ కేంద్రాల రూఫ్‌టాప్‌పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు. -
125 అడుగుల అంబెడ్కర్ విగ్రహంపై ప్రజా స్పందన
-
‘ఎవడో డిమాండ్ చేస్తే విగ్రహం ఏర్పాటు చేయలేదు’
సాక్షి, హైదరాబాద్: ఎవడో డిమాండ్ చేస్తే విగ్రహం ఏర్పాటు చేయలేదని, అంబేద్కర్ విశ్వ మానవుడని.. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభాస్థలి నుంచి ఆయన ప్రసంగించారు. ఎవడో డిమాండ్ చేస్తే విగ్రహం ఏర్పాటు చేయలేదు. ఈ విగ్రహ ఏర్పాటులో ఒక బలమైన సందేశం ఉంది. అంబేద్కర్ విశ్వమానవుడు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వనీయమైనది. అణగారిన వర్గాల ఆశాదీపం అంబేద్కర్. అంబేద్కర్ చెప్పింది ఆచరించేది ఉందా? లేదా? అని ఈ సందర్భంగా ఆయన అక్కడున్నవాళ్లను ప్రశ్నించారు.. అందరూ అంబేద్కర్ చెప్పిన మాటలు ఆచరించాలి. ఆయన ఆశయాల సాధన దిశగా ముందుకెళ్లాలి. ఇది కేవలం విగ్రహం కాదు.. ఒక విప్లవం. అంబేద్కర్‌ను చూడగానే అందరి మనసూ ప్రభావితం కావాలి. ఆయన సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. విగ్రహ ఏర్పాటునకు కృషి చేసిన వాళ్లందరికీ కృతజ్ఞతలు అని సీఎం కేసీఆర్ తెలిపారు. సెక్రటేరియెట్‌కు అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. అలాగే అంబేద్కర్‌పేరిట శాశ్వత అవార్డు ఇవ్వాలని నిర్ణయించాం. ఏటా అంబేద్కర్ జయంతి రోజు అవార్డుల ప్రదానం చేస్తాం. ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందిస్తాం. ఇందుకోసం దాదాపు రూ. 50 కోట్లతో అంబేద్కర్ అవార్డు నిధి ఏర్పాటు చేస్తాం అని సీఎం కేసీఆర్ సభాస్థలి నుంచి ప్రకటించారు. పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలి. దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. దళితుల ఆర్థికాభావిృద్ధికి దళిత బంధు పథకం తీసుకొచ్చాం. కేసీఆర్ జాతీయ నేతగా ఎదగాలని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు. దేశంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయే రాజ్యం మనదే. మహారాష్ట్రలో ఊహించని ఆదరణ వస్తుంది. యూపీ, బీహార్, బెంగాల్లో కూడా ఆదరణ వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేస్తాం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. -
ఈ చారిత్రాత్మక ఘట్టంలో నేను కూడా భాగమయ్యను..
-
ప్రకాష్ అంబేడ్కర్‌తో కలిసి మహా విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
-
అంబేడ్కర్ విగ్రహానికి హెలికాఫ్టర్ పైనుంచి పూలాభిషేకం
-
Hyderabad: భారత్‌లోనే అంబేడ్కర్ భారీ విగ్రహాం.. రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి (ఫొటోలు)
-
HYD: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏడు గంటల పాటు ఆ రూట్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ జి.సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. నేటి మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. వీవీ స్టాచ్యూ, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ మార్గంలో రాకపోకలను అనుమతించరు. వీవీ స్టాచ్యూ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలను నిరంకారి, ట్యాంక్‌బండ్ నుంచి పీవీ మార్గ్‌కు వచ్చే వాహనాలను రాణిగంజ్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మీనార్ వైపు నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా మళ్లిస్తారు. ట్యాంక్‌బండ్ నుంచి తెలుగుతల్లి జంక్షన్ వైపు వచ్చే వాటిని ఇక్బాల్ మీనార్ మీదుగా పంపిస్తారు. శుక్రవారం ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, పీవీ నరసింహారావు మార్గ్, లుంబినీ పార్క్ మూసి ఉంటాయి. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపుల ప్రభావం ఖైరతాబాద్, ఓల్డ్ సైఫాబాద్ పోలీసుస్టేషన్, రవీంద్రభారతి, మింట్ కాంపౌండ్, తెలుగుతల్లి, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట, కట్టమైసమ్మ, ట్యాంక్‌బండ్, లిబర్టీ జంక్షన్లపై ఉండనుంది. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా 90102 03626 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. చదవండి: దార్శనికుడి విశ్వరూపం.. 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహాం -
దార్శనికుడి విశ్వరూపం.. 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహాం
‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు..జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’.. – అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణ సమాజం అర్పిస్తున్న ఘన నివాళి ఇది – సీఎం కేసీఆర్ ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’.. అవును.. అలా చెప్పడమేకాదు.. జనం కోసమే జీవించి జనంలో నిలిచిపోయిన మహా మనిషి బాబాసాహెబ్ అంబేడ్కర్. ‘నేను, నా దేశం అని చెప్పాల్సి వస్తే.. నా దేశమే నాకు అత్యంత ముఖ్యమైన’దని చాటిన ఆయనను దేశమంతా స్మరించుకునే రోజు ఏప్రిల్ 14. ఆ మహనీయుడి జయంతి. ఈ రోజునే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాల్లో కెల్లా ఇదే అతిపెద్దది కావడం విశేషం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో హుస్సేన్ సాగర్ తీరాన సగర్వంగా కొలువైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం భారీ విగ్రహంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించనున్నారు. తర్వాత బౌద్ధ గురువుల ప్రార్థనలను నిర్వహిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. దాదాపు 50వేల మంది దీనికి హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. విగ్రహావిష్కరణ, సభ, ఇతర కార్యక్రమాల కోసం రూ.10 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సభకు హాజరైనవారికి మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, స్వీటు ప్యాకె ట్లను పంపిణీ చేయనున్నారు. విగ్రహావిష్కరణ, సభ కార్యక్రమాల్లో ప్రత్యేక అతిథిగా అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అంబేడ్కర్‌వాదులు, అభిమానులు పాల్గొననున్నారు. రూ.146.50 కోట్ల ఖర్చుతో.. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ భారీ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విగ్రహం, ఇతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.146.50 కోట్లను మంజూరు చేసింది. ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో 11.7 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. విగ్రహ నిర్మాణం, డిజైన్, పనులు తదితర అంశాలపై అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పలు దేశాలు, రాష్ట్రాల్లోని భారీ విగ్రహాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దాని ప్రకారం ఏడేళ్ల పాటు శ్రమించిన శిల్పులు, ఇంజనీర్లు భారీ విగ్రహాన్ని ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మించారు. పీఠంపైకి ఎక్కి విగ్రహం వద్దకు చేరుకునేందుకు మెట్లదారి, ర్యాంప్ ఉంటాయి. విగ్రహంలో గ్రంథాలయం, హాల్స్ విగ్రహం దిగువన పీఠంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అందులో అంబేడ్కర్ రచనలు, ఆయన చరిత్రకు సంబంధించిన అంశాలు, కీలక సందర్భాలను తెలిపే పుస్తకాలు, చిత్రాలు ఉంటాయి. భవనంలోపల ఆడియో విజువల్ రూమ్ ఉంటుంది. అందులో అంబేడ్కర్ జీవన విశేషాలను ప్రదర్శిస్తారు. 36 ఎకరాల్లో స్మృతివనం: అంబేడ్కర్ స్మృతివనం కోసం విగ్రహం పక్కనే 36 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అందులో రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, వాటర్ ఫౌంటేన్స్, శాండ్‌స్టోన్ వర్క్ ఉంటాయి. దాదాపు 450 కార్లు పాకింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. జీవం పోసిన వంజి సుతార్ హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహానికి జీవం పోసిన శిల్పి రామ్ వంజి సుతార్. మహారాష్ట్రకు చెందిన ఆయన వయసు 98 ఏళ్లు. దేశంలోని అతిపెద్ద విగ్రహాలన్నీ సుతార్ రూపొందించినవే. పార్లమెంట్ భవనం వద్ద కూర్చున్న స్థితిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి.. గుజరాత్‌లోని నర్మదా నది తీరాన కొలువైన ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్)’కు రూపమిచ్చి నదీ ఆయనే కావడం విశేషం. భారత ప్రభుత్వం సుతార్‌ను 1999లో పద్మశ్రీతో, 2016లో పద్మభూషణ్‌తో సత్కరించింది కూడా. -
Hyderabad: తటాక తీరాన.. మణి మకుటాలు..
అటు చూస్తే తుది దశకు చేరిన నూతన సచివాలయ నిర్మాణం.. ఇటు చూస్తే పూర్తి కావస్తున్న అమర వీరుల స్మారకం. ఆ వంక రూపుదిద్దుకుంటున్న అంబేడ్కర్ విగ్రహం. భాగ్యనగరి కీర్తి కిరీటంలో మణిమకుటాలుగా విరాజిల్లనున్నాయి. హుస్సేన్‌సాగర్ తీరానికి సరికొత్త సొబగులను అద్దనున్నాయి. నగరవాసులకు, పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. -
Hyderabad: సమ్మోహన తీరం.. సరికొత్తగా హుస్సేన్ సాగర్
సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ తీరం సమ్మోహన రాగం ఆలపించనుంది. సరికొత్త అందాలను సంతరించుకోనుంది. ఒకవైపు అలలపై వెల్లువెత్తే సంగీత ఝరి.. మహోన్నతమైన హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ వైభవాన్ని ప్రదర్శించే లేజర్ షో.. నగరవాసులను, సందర్శకులను, పర్యాటకులను సమ్మోనంగా ఆకట్టుకోనుంది. మరోవైపు అమరుల త్యాగాలను సమున్నతంగా ఆవిష్కరించేలా ఎంతో అద్భుతంగా రూపొందించిన అమరుల స్మారక చిహ్నం కూడా ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. అలనాటి వైభవాన్ని మరోసారి గుర్తుకు తెచ్చేవిధంగా ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు సైతం అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు హుస్సేన్ సాగర్ జలాలపై నడిచిన అనుభూతిని కలిగించే వేలాడే వంతెన సైతం ప్రారంభానికి సిద్ధమవుతోంది. మొత్తంగా నెక్లెస్‌రోడ్డులో ఫిబ్రవరి మొదటి వారం నుంచి సందడి నెలకోనుంది. ఫార్ములా– ఈ పనులు శరవేగం.. ► ఫార్ములా– ఈ అంతర్జాతీయ పోటీలకు నెక్లెస్‌రోడ్డు సన్నద్ధమవుతోంది. స్వల్ప మార్పులు, చేర్పులతో 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌ను పునరుద్ధరించారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఈ పోటీల్లో 11 ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు పాల్గొననున్న సంగతి తెలిసిందే. 22 మంది రేజర్లు ఈ పోటీల్లో తమ సత్తా చాటనున్నారు. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ఈ వాహనాలు పరుగులు తీయనున్నాయి. ► సందర్శకులకు ఇదో సరికొత్త అనుభూతి కానుంది. మరోవైపు ఈ అంతర్జాతీయ పోటీల నాటికే నెక్లెస్‌రోడ్డు పరిసరాలను మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు దూసుకెళ్లే ట్రాక్‌ను నీలిరంగు డివైడర్లతో ఆకర్షణీయంగా రూపొందించారు. ప్రదర్శనను తిలకించేందుకు వచ్చే మోటార్‌స్పోర్ట్స్ ప్రియులకు ఫార్ములా–ఈ పోటీలకు చక్కటి అనుభూతినిచ్చేవిధంగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 25 వేల మందికి పైగా వీక్షించేందుకు అనుగుణంగా ఇవి అందుబాటులోకి రానున్నాయి. అలలపై సంగీత సవ్వడులు.. హుస్సేన్‌సాగర్‌లో సుమారు రూ.18 కోట్లతో హెచ్ఎండీఏ చేపట్టిన మ్యూజికల్ ఫౌంటెన్ కూడా ఫార్ములా– ఈ పోటీల నాటికి ప్రారంభం కానుంది. మిరుమిట్లుగొలిపే రంగు రంగుల వెలుగు జిలుగుల నడుమ ఉవ్వెత్తున ఎగిసిపడే జలాలు.. నేపథ్యంగా వినిపించే ఆహ్లాదభరితమైన సంగీతం సందర్శకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. దీంతో పాటు లేజర్ షోను కూడా ప్రదర్శించనున్నారు. నాలుగువందల ఏళ్ల హైదరాబాద్ చరిత్ర, సాంస్కృతిక విశేషాలు, వారసత్వ కట్టడాల ప్రత్యేకతలను ఈ ప్రదర్శన ద్వారా ఆవిష్కరిస్తారు. పర్యాటకులు, సందర్శకులే కాకుండా నెక్లెస్‌రోడ్డు మీదుగా రాక పోకలు సాగించే వారు కూడా ఈ ప్రదర్శనను వీక్షించవచ్చు.మరోవైపు సంజీవయ్య పార్కుకు సమీపంలో చేపట్టిన వేలాడే వంతెన నిర్మాణం కూడా తుది దశకు చేరుకుంది. దీనిపై నడుస్తున్నప్పుడు నీటిపైనే నడుస్తున్న భావన కలుగుతుంది. పారిస్‌లోని ఓ నదిపై ఏర్పాటు చేసిన వంతెనకు నమూనాగా హెచ్ఎండీఏ ప్రాజెక్టును చేపట్టింది. త్యాగాలను ఎత్తిపట్టేలా... తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎంతోమంది అసువులు బాశారు. ప్రాణాలను బలిదానం చేశారు. వారి త్యాగాలను నిరంతరం స్మరించుకొనేవిధంగా లుంబిని పార్కు వద్ద సుమారు రూ.60 కోట్లతో చేపట్టిన అమరుల స్మృతి చిహ్నం ప్రపంచంలోనే ఒక అరుదైన చారిత్రక కట్టడంగా ఆవిష్కృతం కానుంది. స్టీల్‌తో నిర్మించిన ఈ స్మారక చిహ్నం అమరులకు నివాళులరి్పస్తూ జ్యోతిని వెలిగించినట్లుగా రూపొందించారు. అద్దంలా మెరిసే ఈ అపురూపమైన కట్టడం కూడా ఫార్ములా–ఈ పోటీల నాటికి ప్రారంభం కానుంది. త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు... ఒకప్పటి డబుల్ డెక్కర్ బస్సులను తలపించేలా హెచ్ఎండీఏ విద్యుత్ ఆధారిత డబుల్ డెక్కర్ బస్సులను నగరంలో ప్రవేశపెట్టనుంది. ఈ బస్సులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలోని పర్యాటక,చారిత్రక ప్రాంతాలను సందర్శించేందుకు అనుగుణంగా వీటిని నడుపనున్నారు. చదవండి: ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ -
హుస్సేన్‌సాగర్.. వేలాడే వంతెన ఏది?
సాక్షి, హైదరాబాద్: వేలాడే వంతెన పనులు వెక్కిరిస్తున్నాయి. మూడేళ్ల క్రితం హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో తీవ్ర జాప్యం నెలకొంది. రష్యా రాజధాని మాస్కోలోని మోస్క్వా నదిపై ‘యు’ ఆకారంలో నిర్మించిన తరహాలో పర్యాటకులను ఆకట్టుకొనేవిధంగా హుస్సేన్‌సాగర్‌లో వేలాడే వంతెనను నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించారు. మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. కానీ ఇప్పటికీ ఇది ఓ కొలిక్కి రాలేదు. మొదట్లో కొత్త సంవత్సరంలో ఈ వంతెనను అందుబాటులోకి తేవాలని భావించారు. కానీ మరో ఏడాది గడిచినా ఈ వంతెన నిర్మాణం పూర్తి కాకపోవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పనులు నత్తనడకన సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలలపై నడక.. - పీవీ ఘాట్‌కు, పీపుల్స్ ప్లాజాకు మధ్యలో ఉన్న స్థలంలో ఎకో పార్కు (లేక్‌వ్యూ)ను అభివృద్ధి చేసి ఇందులోంచి వంతెన మీదుగా సాగర్‌లోకి నడిచే విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. పారదర్శకమైన గాజు ఫలకలతో దీన్ని రూపొందించడం వల్ల హుస్సేన్‌సాగర్ అలలపై నడు స్తున్న అనుభూతి కలుగుతుంది. ఒకవైపు లుంబినీ పార్కు, మరోవైపు ఎన్టీఆర్ గార్డెన్తో పాటు హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారు కోసం ప్రతి రోజు వేలాది మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. శని, ఆదివారాలు, సెలవు దినాల్లో సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. - ఇలా వచ్చేవారు ఎకో పార్కుతో పాటు, వేలాడే వంతెనను కూడా సందర్శిస్తారనే ఉద్దేశంతో దీన్ని చేపట్టారు. ఈ వంతెన పర్యాటకులకు ఒక అద్భుతమైన అనుభూతిని కలుగజేస్తుంది. మరోవైపు ఇటీవల ఇండియన్ రేసింగ్ లీగ్‌తో నెక్లెస్ రోడ్డు ప్రాధాన్యం మరింత పెరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఫార్ములా– ఈ రేస్ దృష్ట్యా అప్పటి వరకు పూర్తి చేసే విధంగా అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారక స్తూపం, సెక్రటేరియట్ నిర్మాణ పనులు చకచకా కొనసాగుతుండగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా వంతెన పనుల్లో జాప్యం నెలకొనడం గమనార్హం. రూ.25 కోట్లకు చేరిన భారం.. ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు రూ.10 కోట్లతో అంచనాలు రూపొందించారు. కానీ నిర్మాణంలో తీవ్రమైన ఆలస్యం కారణంగా ఇప్పుడు ఏకంగా రూ.25 కోట్లకు చేరినట్లు తెలిసింది. ఇంత పెద్ద మొత్తంలో వెచి్చంచినా పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయనే విషయంలో మాత్రం స్పష్టత లేకపోవడం గమనార్హం. -
నిలిచిపోయిన ఇండియన్ రేసింగ్ లీగ్
-
కార్ రేసింగ్ లో వరుస ప్రమాదాలు
-
హుస్సేన్ సాగర్ తీరాన తొలిరోజు ముగిసిన కార్ రేసింగ్..
-
హుస్సేన్ సాగర్ తీరాన ప్రధాన కారు రేస్ ..
-
రెడీ టూ రైడ్.. ఇండియన్ రేసింగ్ లీగ్‌కు సర్వం సిద్దం
సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ తీరం ఉత్కంఠభరితమైన పోటీలకు సిద్ధమైంది. ఆహ్లాదభరితమైన సాగరతీరంలో కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్ మంటూ దూసుకుపోయే ఇండియన్ రేసింగ్ లీగ్ కార్ల పోటీలు మరి కొద్ది గంటల్లో కనువిందు చేయనున్నాయి. ఈ పోటీల నిర్వహణ కోసం హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పటిష్టమైన ట్రాక్‌ను సిద్ధం చేశారు. పోటీల్లో పాల్గొననున్న కార్లు నగరానికి చేరుకున్నాయి. పోటీలను వీక్షించేందుకు అనుగుణంగా నెక్లెస్‌రోడ్డులో గ్యాలరీలను ఏర్పాటు చేశారు. కొద్ది రోజులుగా బుక్ మై షో ద్వారా పాస్‌ల అమ్మకాలను చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన జరుగనున్న ఫార్ములా–ఈ ఎలక్ట్రిక్ కార్ల పోటీలను దృష్టిలో ఉంచుకొని ట్రయల్ రన్‌గా ఇండియన్ రేసింగ్ లీగ్ ఈ పోటీలకు సన్నద్ధమైంది. ఈ నెల 19, 20 తేదీలతో పాటు, డిసెంబర్ 10, 11 తేదీల్లో ఈ పోటీలు జరుగనున్నాయి. శని, ఆదివారం నాటి పోటీల్లో పాల్గొనేందుకు 12 రేసింగ్ కార్లు నగరానికి చేరుకున్నాయి. అత్యంత పటిష్టంగా స్ట్రీట్ సర్క్యూట్ ట్రాక్ శని, ఆదివారాలు రెండు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీల్లో 17 చోట్ల మలుపులతో కూడిన 2.8 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ట్రాక్‌పైన కార్లు పరుగులు తీయనున్నాయి. గంటకు సుమారు 250 కిలోమీటర్ల వేగంతో కార్లు పరుగులు తీసేవిధంగా స్ట్రీట్ సర్క్యూట్ ట్రాక్‌ను అత్యంత పటిష్టంగా రూపొందించారు. శనివారం ఈ పోటీలు ప్రారంభం కానున్న దృష్ట్యా నిపుణులు గురువారం మరోసారి ట్రాక్‌ను పరిశీలించారు. ఇతరులు నెక్లెస్‌రోడ్డులోకి ప్రవేశించకుండా పోలీసులు ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టారు. నెక్లెస్‌రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను వివిధ మార్గాల్లోకి మళ్లించారు. ఏమిటీ రేసు... 2019లో తొలిసారి ఎక్స్1 రేసింగ్ లీగ్ పేరుతో పోటీలు జరిగాయి. దీనిని స్వల్ప మార్పులతో ఇప్పుడు ఇండియన్ రేసింగ్ లీగ్‌గా మార్చారు. ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ (ఎఫ్ఐఏ) గుర్తింపు పొందిన ఫార్ములా రీజినల్ ఇండియన్ చాంపియన్‌షిప్, ఎఫ్4 ఇండియన్ చాంపియన్‌షిప్‌తో పాటు ఇది జరగాల్సి ఉంది. అయితే ఈ రెండు ఈవెంట్లు వాయిదా పడగా, ఇండియన్ రేసింగ్ లీగ్‌ను మాత్రం నవంబర్ – డిసెంబర్లలో హైదరాబాద్, చెన్నై వేదికలుగా నిర్వహిస్తున్నారు. కారు ఎలా ఉంటుంది... సింగిల్ డ్రైవర్ ఎఫ్3 డిజైన్ కార్లు ఉంటాయి. ఇటలీకి చెందిన ‘వుల్ఫ్’ కంపెనీ వీటిని తయారు చేసింది. పురుషులు, మహిళల మధ్య రేసింగ్‌లో తేడా రాకుండా ఎఫ్3 డిజైన్ కారు నిర్మాణం ఉంటుంది. రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్పీపీఎల్) ఈ పోటీలను నిర్వహిస్తోంది. భారత్‌లో భవిష్యత్తుల్లో కార్ రేసింగ్ స్థాయి పెంచేందుకు ఈ ఈవెంట్ ఉపయోగపడుతుందని ఆర్పీపీఎల్ చైర్మన్ అఖిలేశ్ రెడ్డి వెల్లడించారు. ఎన్ని రేస్‌లు... ఇండియన్ రేసింగ్ లీగ్‌లో భాగంగా మొత్తం నాలుగు రేస్‌లు జరుగుతాయి. తొలి, చివరి రేస్‌లకు హైదరాబాద్ వేదిక కాగా, మధ్యలో రెండు రేస్‌లు చెన్నైలో జరుగుతాయి. నాలుగు రేస్‌లలో వచ్చిన ఫలితాలను బట్టి తుది విజేతను నిర్ణయిస్తారు. హైదరాబాద్‌లో డిసెంబర్ 10–11 తేదీల్లో చివరి రేస్ నిర్వహిస్తారు. బరిలో 22 కార్లు.. గరిష్ట వేగం 250 కి.మీ హైదరాబాద్ అంచెలో భాగంగా శని, ఆదివారాల్లో రేస్‌లు జరుగుతాయి. మధ్యాహ్నం 3 గంటనుంచి 5 గంటల వరకు రేస్ జరుగుతుంది. తొలి రోజు రెండు క్వాలిఫయింగ్ రేసులతో పాటు ఒక ప్రధాన రేసు జరుగుతుంది. ఆదివారం మరో రెండు ప్రధాన రేస్‌లు జరుగుతాయి. గరిష్టంగా 40 నిమిషాల పాటు రేస్ ఉంటుంది. మొత్తం 22 కార్లు బరిలో ఉంటాయి. కార్ల గరిష్ట వేగం 250 కిలో మీటర్ల వరకు ఉంటుంది. మొత్తం 17 మలుపులతో రేస్ ఆసక్తికరంగా సాగనుంది. ఎలా చూడవచ్చు... స్టార్ స్పోర్ట్స్‌లో పోటీల ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది...అయితే నేరుగా చూడాలనుకునేవారి కోసం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక రోజుకైతే రూ.749, రెండు రోజులకైతే రూ. 1,249 చొప్పున టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయి. జట్ల వివరాలు... హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్, గోవా ఏసెస్, చెన్నై టర్బో రైడర్స్, బెంగళూరు స్పీడ్‌స్టర్స్, స్పీడ్ డెమాన్స్ ఢిల్లీ పేరుతో 5 టీమ్‌లో ఉన్నాయి. హైదరాబాద్ టీమ్‌లో రేసింగ్‌లో ఏడేళ్ల అనుభవం ఉన్న అనిందిత్ రెడ్డి ప్రధాన ఆకర్షణ. మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడే అనిందిత్. నీల్ జానీ, ఒలివర్ జేమ్స్, రౌల్ హైమెన్వంటి గుర్తింపు ఉన్న రేసర్లతో పాటు మహిళల విభాగంలో ప్రముఖ రేస ర్ నికోల్ హవ్దా చెన్నై తరఫున బరిలోకి దిగుతోంది. భవిష్యత్తు... పూర్తి స్థాయి సర్క్యూట్ లేనందున ప్రస్తుతానికి హైదరాబాద్‌లో ఉన్నది ‘స్ట్రీట్ సర్క్యూట్’ మాత్రమే. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న నగరంలో ప్రతిష్టాత్మక ఫార్ములా ‘ఇ’ రేస్ జరగనుంది. ఇండియన్ రేసింగ్ లీగ్‌తో పోలిస్తే దానిస్థాయి చాలా పెద్దది. ఆ రేసు కూడా ఇదే ట్రాక్‌పై జరగనుంది కాబట్టి దానికి ముందు సన్నాహకంగా ఈ రేసింగ్ లీగ్‌ను చూడవచ్చు. ట్రాక్ ఎలా ఉంటుంది... లీగ్‌లో చెన్నైలో జరిగే పోటీలను అసలైన ‘రేసింగ్ సర్క్యూట్’లోనే జరుగుతుంది. హైదరాబాద్‌లో మాత్రం ఇది భిన్నం. దీనిని ‘స్ట్రీట్ సర్క్యూట్’గా వ్యవహరిస్తున్నారు. అంటే రేస్ ముగిసిన తర్వాత మళ్లీ అదే ట్రాక్ సాధారణ రోడ్డుగా వాడకంలోకి వస్తుంది. కొత్త రేస్ కోసం మళ్లీ అవసరమైతే ట్రాక్‌ను సిద్ధం చేస్తారు. ఎన్టీఆర్ మార్గ్‌ను విస్తరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌ను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌లో స్ట్రీట్ రేసింగ్ జరగడం కూడా ఇదే మొదటిసారి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: FIFA WC 2022: ఆరో టైటిల్ వేటలో బ్రెజిల్ -
అలర్ట్: మూసీ గ్రాస్‌లో లెడ్ ఆనవాళ్లు.. పాలు, మాంసం, పశుగ్రాసంలో..
సాక్షి, హైదరాబాద్: చారిత్రక మూసీ పరివాహక ప్రాంతంలో విరివిగా సాగవుతున్న గడ్డిలోనూ మానవ ఆరోగ్యానికి హానికారకంగా పరిణమించే లెడ్ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు నేషనల్ రీసెర్చి సెంటర్ ఫర్ మీట్ (ఎన్ఆర్సీఎం) తాజా పరిశోధనలో తేలింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చి పర్యవేక్షణలో ఎన్ఆర్సీఎం ఆధ్వర్యంలో పాలు, మాంసం, పశుగ్రాసంలో లెడ్ ఆనవాళ్లను పరిశీలించగా ఈ విషయం తేలింది. మూసీలో హుస్సేన్‌సాగర్ జలాలు అధికంగా చేరే నాగోల్– ఉప్పల్ మార్గంలో ఈ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. గండిపేట్ నుంచి ఘట్కేసర్ వరకు 21 ప్రాంతాల్లో మూసీ నీటి నమూనాలను పరీక్షించగా.. ప్రతి లీటరు నీటిలో లెడ్ మోతాదు 61 పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎం)గా నమోదైనట్లు ఈ సంస్థ తాజా నివేదిక తెలిపింది. పీసీబీ నిబంధనల ప్రకారం ఈ మోతాదు 20 పీపీఎంకు మించరాదు. ఫార్మా కంపెనీల వ్యర్థాలు అధికంగా చేరడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని నివేదిక స్పష్టం చేసింది. లెడ్ మోతాదు అధికమైతే మానవ, పాడి పశువుల ఆరోగ్యంపై దుష్ప్రభావం తప్పదని నివేదిక వెల్లడించింది. కాలుష్యానికి కారణాలివీ.. నగరంలో రోజువారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా నిత్యం 1800 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో సుమారు 900 మిలియన్ లీటర్ల మురుగు నీటిని జలమండలి 23 ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మిగతా నీరు శుద్ది ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తోంది. ఈ మురుగు నీటిలో కూకట్పల్లి నాలా నుంచి హుస్సేన్ సాగర్‌లోకి అటు నుంచి వచ్చి మూసీలోకి చేరుతున్న సుమారు 400 మిలియన్ లీటర్ల మేర ఫార్మా, బల్క్‌డ్రగ్ వ్యర్థ జలాలు కూడా ఉన్నాయి. ఈ జలాల చేరికతోనే లెడ్ తదిర హానికారక భారలోహ అవశేషాలు మూసీలోకి చేరుతున్నాయి. కలుషిత జలాలతో దుష్ఫలితాలు.. ►ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో నదిలో చేపలు, వృక్ష, జంతు ఫ్లవకాలు చనిపోతున్నాయి. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. జీవావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. పశువులు దాహార్తి తీర్చుకునే పరిస్థితి ఉండదు. ►పరీవాహక ప్రాంతాల్లో సాగు చేస్తున్న గడ్డి తిన్న పశువుల పాలల్లో కాలుష్య కారకాలు చేరడంతో ఇవి మానవ దేహంలోకి ప్రవేశిస్తున్నాయి. ►ఈ నీరు తాగిన వారు న్యుమోనియా, టైఫాయిడ్, కామెర్లు, విరేచనాలు, కోరింత దగ్గు, పోలియో వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నగరంలోకి ప్రవేశించగానే కాలుష్య కాటు.. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలు మూసీ జన్మస్థానం. 90 కి.మీ ప్రవహించి బాపూఘాట్ వద్ద నగరంలోకి ప్రవేశిస్తోంది. నగరంలో ఫార్మా, వాణిజ్య, గృహ వ్యర్థ జలాలు చేరుతుండడంతోనే మూసీ కాలుష్య కాసారమవుతోంది. -
హుస్సేన్ సాగర్ లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు
-
గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టం.. హుస్సేన్‌సాగర్ వద్ద భారీ ఏర్పాట్లు (ఫొటోలు)
-
ఇక కీలక ఘట్టమే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షల వివరాలివే!
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం శుక్రవారం హుస్సేన్‌సాగర్‌లో జరగనుంది. దీనికి భారీ ఊరేగింపు సైతం ఉంటుంది. ఈ నేపథ్యంలో నగర శివార్లతో పాటు సిటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సిటీలోని మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో చేస్తారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఇవి అమలులో ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పొడిగించే అవకాశం ఉంది. నిమజ్జనం పూర్తయిన తర్వాత విగ్రహాలను తెచ్చిన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వీలున్నంత వరకు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌లను ఆశ్రయించాలని పోలీసులు సూచించారు. నగరంలోని దాదాపు 30 గంటల పాటు ప్రైవేట్ బస్సులు, లారీలు (గణేషులని తెచ్చేవి మినహా), ఇతర భారీ వాహనాలకు అనుమతి ఉండదు. ఆంక్షలు, మళ్లింపులు నేపథ్యంలో అత్యవసర వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ వాహనాలు ఆంక్షలు మార్గంలో ఇటు–అటు మారడానికి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వద్ద అవకాశం కల్పిస్తున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గం ►కేశవగిరి–నాగుల్చింత–ఫలక్‌నుమా–చార్మినార్–మదీనా–అఫ్జల్‌గంజ్–ఎంజే మార్కెట్–అబిడ్స్–బషీర్‌బాగ్–లిబర్టీ–ఎన్టీఆర్ (పీవీఎన్ఆర్) మార్గ్ సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చేది.. ►ఆర్పీ రోడ్–ఎంజీ రోడ్–కర్బాలామైదాన్–ముషీరాబాద్ చౌరస్తా–ఆర్టీసీ క్రాస్‌రోడ్స్– నారాయణగూడ ‘ఎక్స్’ రోడ్–హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది. చదవండి: (Hyderabad: సెప్టెంబర్ గండం.. గ్రేటర్ వాసుల వెన్నులో వణుకు) ఈస్ట్‌జోన్ నుంచి వచ్చేది.. ►ఉప్పల్–రామాంతపూర్–అంబర్పేట్–ఓయూ ఎన్సీసీ–డీడీ హాస్పిటల్ల మీదుగా ప్రయాణించి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద సికింద్రాబాద్ రూట్ దాంతో కలుస్తుంది. ►వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి. ►నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించడానికి కేవలం బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్‌రోడ్, బేగంపేట్ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం. ►వెస్ట్–ఈస్ట్ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్‌బాగ్ వద్దే అవకాశం ఉంటుంది. ►వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్ రింగ్ రోడ్, బేగంపేట్ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. కి.మీ పరిధిలో సందర్శకులకు పార్కింగ్.. హుస్సేన్‌సాగర్‌లో జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం కి.మీ పరిధిలో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు. అవి.. ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధ భవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, లోయర్ ట్యాంక్‌బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్‌బండ్ పరిసరాలకు చేరుకోవాలి. హెల్ప్లైన్ల ఏర్పాటు: ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్స్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 040–27852482, 94905 98985, 90102 03626లను సంప్రదించవచ్చు. ఇంత రాద్ధాంతమా: తలసాని కవాడిగూడ: వినాయక నిమజ్జనంపై కొన్ని శక్తులు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ర్యాలీలు, దీక్షలు చేయాల్సిన అవసరం ఏముందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. బుధవారం ట్యాంక్‌బండ్‌పై నిమజ్జన ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో వినాయక చవితి ఏర్పాట్లు జరగలేదన్నారు. ప్రజలను కొందరు గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు మండపాల నిర్వాహకులు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. ట్యాంక్‌బండ్‌పై క్రేన్ల ఏర్పాటు ఎట్టకేలకు ఈసారి సైతం హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలు జరగనున్నాయని తెలుస్తోంది. నిమజ్జనానికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేసింది. దాదాపు వారం రోజులుగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, బీజేపీ నిమజ్జనాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం లేదని, ఓ దశలో తామే చేస్తామని చెప్పడంతో ప్రభుత్వం తరపునే అన్నీ నిర్వహిస్తామని మంత్రి తలసాని పేర్కొనడం తెలిసిందే. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి సైతం ఎన్టీఆర్ మార్గ్‌వైపు 9 క్రేన్లు, ట్యాంక్‌బండ్‌పై 16 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. వీటితోపాటు పీపుల్స్‌ప్లాజా దగ్గర రెండు బేబిపాండ్లు, ట్యాంక్‌బండ్ చిల్డ్రన్స్పార్కువద్ద 3 బేబిపాండ్లలో నిమజ్జనాలు జరగనున్నాయి. ఫ్లైఓవర్లు బంద్ వినాయక నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఫ్లైఓవర్లన్నింటినీ మూసివేస్తారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు నిమజ్జనం పూర్తయ్యే వరకూ నిమజ్జనం జరిగే చెరువులు, ట్యాంక్‌లు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు. పలుచోట్ల ట్రాఫిక్, మళ్లింపులు ఉంటాయన్నారు. అత్యవసర సహాయం కోసం 040–23002424, 85004 11111లను సంప్రదించవచ్చు. ఏర్పాట్లు ముమ్మరం రేపటి గణేశ్ విగ్రహాల నిమజ్జనాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్‌తో పాటు 74 కోనేర్లలో నిమజ్జనాలు జరగనున్నాయి. బాలాపూర్ నుంచి శోభాయాత్ర పొడవునా 303 కి.మీ మేర ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా జీహెచ్ఎంసీతోపాటు వివిధ విభాగాలు ఏర్పాట్లు చేశాయి. 303.30 కి.మీ మేర శోభాయాత్ర సాగనుంది. -
ట్యాంక్ బండ్ పై మళ్లీ సన్డే ఫన్డే సంబరాలు (ఫోటోలు)
-
హైదరాబాద్: నిండుకుండలా హుస్సేన్ సాగర్
-
Hyderabad: హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు
-
గణేష్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తాం
-
హైదరాబాద్: నిండుకుండలా మారిన హుస్సేన్‌సాగర్
-
నిండుకుండలా మారిన హుస్సేన్‌సాగర్
-
హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు.. జీహెచ్ఎంసీ అలర్ట్
సాక్షి, సిటీబ్యూరో: వరుస వర్షాలతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్ దిగువ ప్రాంతంలోని బస్తీలు, మూసీ పరిసర ప్రాంతాల బస్తీలు, కాలనీల్లోని ప్రజలు ఏ క్షణం ఎలాంటి సంఘటన జరగనుందోననే ఆందోళనతో వణికిపోతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో హుస్సేన్‌సాగర్ జలాశయం నిండిపోయింది. చదవండి: హైదరాబాద్ పరిధిలో 68% అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ? జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్టీఎల్)513.41 మీటర్లుకాగా, సోమవారానికి ఎఫ్టీఎల్ను మించి 513.45 మీటర్లకు చేరుకుంది. మంగళవారం 513.46మీటర్లకు, బుధవారం మధ్యాహ్నానికి 513.49 మీటర్లకు చేరుకోవడంతో తూములద్వారా నీరును దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.ట్యాంక్‌బండ్ కింద ఉన్న తూములు పూడికతో మూసుకుపోవడంతో నీరు సాఫీగా వెళ్లేందుకు వాటిని తొలగించడం సర్ప్లస్ వెయిర్ (అలుగు)నుంచి సైతం నీరు వెళ్లేలా చెత్తాచెదారాల తొలగింపు వంటి చర్యలు చేపట్టారు. భయం.. భయంగా.. ♦ఒకేసారి భారీ మొత్తంలో వరదనీరు కిందకు చేరితే దిగువ ప్రాంతాల్లోని కవాడిగూడ, అశోక్‌నగర్, నాగమయ్యకుంట, సబర్మతీనగర్ తదితర బస్తీల్లోకి నీరు చేరే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు ఆందోళన చేరుతున్నారు. వదలని ముసురుతో సాగర్‌లో నీటిమట్టం ఏమాత్రం తగ్గలేదు. ఈ బస్తీలే కాక నగరంలోని వివిధ లోతట్టు ప్రాంతాల్లోనూ, మూసీ పరిసర ప్రాంతాల్లోనూ నీరు నిలిచిపోయే పరిస్థితి ఉండటంతో దాదాపు 150 బస్తీల ప్రజలు ఎప్పుడేం జరుగుతుందోనని వణికిపోతున్నారు. ♦ఓవైపు నానిన గోడలు కూలే ప్రమాదాలు పొంచిఉన్నాయి. లోతట్టు బస్తీలైన అంబర్‌పేట నియోజకవర్గంలోని పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్, నరసింహబస్తీ, సంజయ్‌గాంధీనగర్, విజ్ఞాన్‌పురి, బతుకమ్మకుంట, మలక్‌పేట పరిసరాల్లోని న్యూశంకర్‌నగర్, గంగానగర్, అన్నపూర్ణనగర్, పూల్‌బాగ్, కాలాడేరా, కమలానగర్, మూసానగర్, మూసారాంబాగ్, ఇందిరానగర్, శంకేశ్వరబజార్, ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ♦ఎప్పుడు వర్షాలొచ్చినా తీవ్రప్రభావం చూపించే పాతబస్తీలోని సిద్దిఖీనగర్, అమన్‌నగర్, భవానీనగర్, రహ్మత్‌నగర్, మౌలాకాచిల్లా, ముర్తుజానగర్, ఫరత్నగర్లతోపాటు గోల్కొండ పరిసరాల్లోని తాఖత్‌బౌలి, సజ్జద్ కాలనీ, నయీం కాలనీ, సాలేహ్‌నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్‌మక్తా, సికింద్రాబాద్‌లోని బ్రాహ్మణవాడి, రసూల్‌పురా , తదితర ప్రాంతాల్లోని బస్తీల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలా వివిధ బస్తీల్లోని దినసరి కూలీలు తదితరులు ఓవైపువర్షాల వల్ల కూలి పనుల్లేక, మరోవైపు ముంపు ముప్పుతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తూముల ద్వారా నీరు విడుదల.. హుస్సేన్‌సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రత్యేకంగా గేట్లు అంటూ లేవని హుస్సేన్‌సాగర్‌పై తగిన అవగాహన ఉన్న ఇంజినీర్లు తెలిపారు. వారి సమాచారం మేరకు, హుస్సేన్‌సాగర్‌కు నాలుగు ప్రధాన తూములు, రెండు అలుగులు ఎప్పటినుంచో ఉన్నాయి. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో పూడుకుపోయాయి. మ్యారియట్ హోటల్ దగ్గర, బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ దగ్గర అలుగులున్నాయి. ట్యాంక్‌బండ్ మధ్యన తూములున్నాయి. మరమ్మతులు లేక సవ్యంగా నీరు పారడం లేదు. మ్యారియట్ హోటల్‌వైపు ఉన్న తూము నుంచి అవసరమైన సమయాల్లో ఎక్కువ నీటిని దిగువకు విడుదల చేసేందుకు ప్రస్తుత సీఎస్ సోమేశ్‌కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటునే చాలామంది గేట్లు తెరిచారంటున్నారు. -
ట్యాంక్‘బంద్’!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ట్యాంక్‌బండ్.. ఒకప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కే పరిమితమైన ఉల్లాస ప్రాంతం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి హుస్సేన్ సాగర్ తీరాన ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే స్థలం. అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలకు సమీపంలో ఉన్న చెరువులు, ఆనకట్టలు, నీటి వనరులున్న ప్రాంతాలను మినీ ట్యాంక్బండ్లుగా అభివృద్ధి చేయాలని ఐదేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దాలని భావించింది. ఈ మేరకు 2016–17 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక పథకాన్ని చేపట్టి నిధులు కూడా మంజూరు చేసింది. కానీ చాలాచోట్ల పూర్తిస్థాయిలో పనులు చేపట్టకపోవడంతో ప్రయోజనం లేకుండా పోతోంది. కొన్ని చెరువుల వద్ద అసలు పనులే మొదలుపెట్టని పరిస్థితి ఉండగా.. సిద్దిపేట, సిరిసిల్ల వంటి ఒకట్రెండు చోట్ల మాత్రం మినీ ట్యాంక్బండ్లు కళకళలాడుతున్నాయి. ప్రణాళిక ఘనంగా ఉన్నా.. రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల పరిధిలో మినీ ట్యాంక్‌బండ్‌లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో 98చోట్ల నిర్మాణం కోసం రూ.570.58 కోట్ల వ్యయ అంచనాతో ప్రతిపాదనలకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. వీటిలో 90 మినీ ట్యాంక్బండ్ల నిర్మాణానికి 2017–18లో టెండర్లు పూర్తయ్యాయి. మినీ ట్యాంక్‌బండ్ కింద మార్చేందుకు.. చెరువు కట్టలను పునరుద్ధరించి, బలోపేతం చేయడం, ఇరువైపులా పచ్చని చెట్లు, నడక కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌లు, చెరువు పరిసరాలను పచ్చదనంతో నింపడం, చిన్నారులు ఆడుకునేలా పార్కులు, బోటింగ్, ప్రజలు సేద తీరేందుకు ఏర్పాట్లు చేయాలి. రాత్రివేళల్లో ఆహ్లాదంగా కనిపించేందుకు విద్యుద్దీపాలతో అలంకరించాలి. ఇప్పటివరకు సిద్దిపేట, మహబూబ్‌నగర్, ఖమ్మం, దుబ్బాక, భువనగిరి, సూర్యాపేట, ఆలేరు, నల్లగొండ, ధర్మపురి, మానకొండూరు, సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల, జనగామ, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, డోర్నకల్‌లలో మినీ ట్యాంక్బండ్ల ఏర్పాటు పూర్తయింది. మిగతా వాటిలో చాలాచోట్ల సగం పనులు కూడా కాలేదు. చాలాచోట్ల సుందరీకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మినీ ట్యాంక్బండ్ల కోసం ఇప్పటివరకు రూ.291.89 కోట్లు ఖర్చు చేసి నట్లు జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. నిర్మాణాల పరిస్థితి ఇదీ.. ఉమ్మడి వరంగల్‌లో 13 మినీ ట్యాంక్బండ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. 9 మాత్రమే మంజూరయ్యాయి. వీటికి రూ.25.06 కోట్లతో టెండర్లు పిలిచారు. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల పరిధిలో నాలుగుచోట్ల పనులు పూర్తయ్యాయి. జనగామ బతుకమ్మకుంటలో గ్రీనరీ, ఇతర పనులు చేయాల్సి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో.. రూ.74.62 కోట్లతో 15 మినీ ట్యాంక్బండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.60.21 కోట్లు ఖర్చు కాగా.. ఐదుచోట్ల మాత్రమే పూర్తయ్యాయి. సిరిసిల్ల కొత్త చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా రూ.11 కోట్ల ఖర్చుతో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు. ఇక్కడ పర్యాటక క్షేత్రంగా కళ వచ్చిందని స్థానికులు అంటున్నారు. రూ.37.87 కోట్ల వ్యయంతో ఉమ్మడి పాలమూరులో 11 చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా తీర్చిదిద్దాలని లక్ష్యం పెట్టుకున్నారు. రూ.18.08కోట్లు ఖర్చుకాగా.. మూడుచోట్ల మాత్రమే పూర్తయ్యాయి. మిగతాచోట్ల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రధానంగా సుందరీకరణ పనులు ఆగాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 మినీ ట్యాంక్‌బండ్‌లను ప్రతిపాదించగా.. 11 మంజూరయ్యాయి. ఇందులో నాలుగు మాత్రమే పూర్తయ్యాయి. సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు పనులను 2016లో రూ.22 కోట్ల అంచనాతో ప్రారంభించారు. సుమారు ఆరు కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఈ చెరువు పూడిక తీయించి మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చారు. చుట్టూ రెయిలింగ్, సోలార్ లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండో మినీట్యాంక్ బండ్ ఏర్పాటుకు రూ.17 కోట్లు మంజూరు చేశారు. అది వచ్చే ఏడాది మార్చికి పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 మినీ ట్యాంక్బండ్ల నిర్మాణాలు మొదలుపెట్టగా.. నిజామాబాద్, బాన్సువాడ, కామారెడ్డిలో పూర్తయ్యాయి. మిగతాచోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 12 మినీట్యాంక్‌బండ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ పట్టణంలోని చెరువు, బోథ్ మండలంలోని కరత్వాడ, మంచిర్యాలలో తిలక్‌నగర్ చెరువు, లక్సెట్టిపేట ఇటిక్యాల చెరువు, చెన్నూరులో పెద్ద చెరువు, కుమ్మరికుంట చెరువు, బెల్లంపల్లిలో చెరువు, సిర్పూర్ (టీ)లో నాగమ్మచెరువు, సిర్పూర్(యూ) మండలం రాఘవపూర్ హైమన్ డార్ఫ్ చెరువు, నిర్మల్‌లో ధర్మసాగర్ చెరువు, భైంసాలో సుద్దవాగు చెరువుల వద్ద పనులు చేస్తున్నారు. కానీ ఎక్కడా పూర్తికాలేదు. త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు ప్రజలకు ఆహ్లాదం, ఆనందాన్ని కలిగించే విధంగా మినీ ట్యాంక్బండ్ల ఏర్పాటు జరుగుతోంది. ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జనగామ బతుకమ్మకుంటలో గ్రీనరీతోపాటు వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేయాల్సి ఉంది. డ్రైనేజీ, గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, జిమ్, పార్కు, మెటల్ రోడ్డు పనులు పూర్తి చేస్తాం. – రవి, డీఈ, ఇరిగేషన్, జనగామ జిల్లా -
లాస్ వెగాస్ తరహాలో సాగర్‌లో ఫౌంటెయిన్ షో
సాక్షి, హైదరాబాద్: వందల మీటర్ల ఎత్తున విరజిమ్మే నీటిధారలు.. లయబద్ధంగా వినిపించే సంగీతం.. దానికి తగ్గట్టుగా జలవిన్యాసాలు.. ఆ జుగల్బందీని మరింత నేత్రపర్వం చేసే విద్యుత్తు వెలుగుజిలుగులు.. నీటిధారలనే తెరగా చేసుకుని దృశ్యమయం చేసే లేజర్ కాంతులు.. ఇది వాటర్ ఫౌంటెయిన్ షోలో కనువిందు చేయనున్న దృశ్యాలు. లాస్ వేగాస్ రిసార్ట్స్, దుబయ్ బుర్జు ఖలీఫా ఎదుట ఈ తరహా షోలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఈ తరహాలో భాగ్యనగర పర్యాటకులకు కనువిందు చేసేలా కేంద్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(ఐటీడీసీ) ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్‌సాగర్ జలాల్లో దాదాపు అర ఎకరం విస్తీర్ణంలో భారీ ఫౌంటెయిన్ షోను ఏర్పాటు చేయబోతోంది. సంజీవయ్య పార్కులో ఉన్న భారీ జాతీయపతాకం వెనక సాగర్ నీటిలో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి కేంద్ర పర్యాటకాభివృద్ధి సంస్థ రూ.47 కోట్లను వ్యయం చేయనుంది. ఇప్పటికే ప్రాజెక్టు డిజిటల్ నమూనాను ఓ సంస్థ సిద్ధం చేసింది. నెల రోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్టు తెలిసింది. ఏమేముంటాయంటే.. సాగర్ జలాల్లో ఫ్లోటింగ్ జెట్స్‌పై ఈ భారీ ఫౌంటెయిన్ వ్యవస్థ ఏర్పాటవుతుంది. వేలసంఖ్యలో వాటర్ నాజిల్స్ ఏర్పాటు చేసి దాదాపు 500 అడుగుల ఎత్తు వరకు నీటిని విరజిమ్మేలా మోటార్లతో అనుసంధానిస్తారు. నీళ్లు విన్యాసాలు చేసేలా డిజైన్ చేస్తారు. దాంతోపాటు సంగీతం, లైటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. నీళ్లు పైకి విరజిమ్మినప్పుడు ఏర్పడే తుంపర్లనే తెరగా చేసుకుని లేజర్ కిరణాలు రకరకాల ఆకృతులతో దృశ్యమయం చేస్తాయి. ఆర్ట్స్ కాలేజీ భవనమే తెరగా ప్రొజెక్షన్ మ్యాపింగ్ సౌండ్ అండ్ లైట్ షో ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలోనే గొప్ప యూనివర్సిటీల్లో ఒకటి. ఇక ఆర్ట్స్ కళాశాల భవనం ఓ గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీ భవనం యావత్తును తెరగా చేసుకుని ఆధునిక ప్రొజెక్షన్ మ్యాపింగ్ సౌండ్ అండ్ లైట్ షో ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. వాటర్ ఫౌంటెయిన్ షో ప్రాజెక్టుతో సంయుక్తంగా ఐటీడీసీ దీన్ని రూ.12 కోట్లతో చేపడుతోంది. దీనికి ఇతివృత్తాన్ని ఇంకా ఎంపిక చేయనప్పటికీ, స్వాతంత్య్ర ఉద్యమం, ఉస్మానియా విశ్వవిద్యాలయం పాత్ర అన్నకోణంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆర్ట్స్ కాలేజీ ముందు వృథాగా ఉన్న ఫౌంటెయిన్ వ్యవస్థకు కూడా మెరుగులద్ది ప్రారంభించి ఈ ప్రాజెక్టుతో అనుసంధానించనున్నారు. 15 నిమిషాలపాటు తెలుగు, ఇంగ్లిష్, హిందీల్లో విడివిడిగా షోలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశం మేరకు ఐటీడీసీ అధికారులు చకచకా ప్లాన్ చేసి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరానికి వచ్చే పర్యాటకులకు మధురానుభూతులు పంచేలా ఈ రెండు ప్రాజెక్టులను తీర్చిదిద్దబోతున్నారు. -
జలవిహార్ లో పర్యాటకుల సందడి
-
Hyderabad: అసంపూర్తిగా మిషన్ హుస్సేన్ సాగర్ ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్ : ఏళ్లు గడిచినా మిషన్ హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు అసంపూర్తిగానే మిగిలాయి. స్వచ్ఛమైన జలాలతో చారిత్రక హుస్సే న్‌సాగర్‌ను నింపాలన్న సర్కారు సంకల్పం అటకెక్కింది. సాగర మథనంతో ప్రక్షాళన చేపట్టేందుకు ఆర్భాటంగా ప్రారంభించిన మిషన్ గాడి తప్పింది. సాగర ప్రక్షాళనకు 2006 నుంచి 2021 వరకు దాదాపు రూ.326 కోట్లు ఖర్చుచేసినా ఫలితం శూన్యంగానే మారింది. సాగర ప్రక్షాళన పనుల్లో ఇప్పటివరకు పూర్తయ్యింది గోరంతే. మిగిలిన పనుల పూర్తి అడుగుకో తడబాటులా మారింది. కూకట్పల్లి నాలా మళ్లింపు పనులను పూర్తిచేసినట్లు ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ఈ నాలా నుంచి పారిశ్రామిక వ్యర్థా లు జలాశయంలోకి ఇప్పటికీ చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దశాబ్దాలు గా బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు వెదజల్లిన గరళాన్ని తన గర్భంలో దాచుకుని.. జలాశయం అట్టడుగున గడ్డకట్టుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపు పనులను నిలిపివేయడంతో ప్రక్షాళనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చేపట్టిన పనులివే.. ప్రధానంగా కలుస్తున్న నాలాలు: కూకట్పల్లి, పికెట్, బుల్కాపూర్, బంజారా నాలాలు. ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు: ► 2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు ► 2014: రూ.56 కోట్లతో కూకట్పల్లి నాలా డైవర్షన్ పనులు ► 2015: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిది కాళ్ల ఎక్స్‌కవేటర్‌తో వ్యర్థాలు తొలగింపు. ► 2017, 2018, 2019, 2021: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్ కంపెనీ శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ వినియోగం. ► హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు ఇప్పటివరకు చేసిన వ్యయం: దాదాపు రూ.326 కోట్లు చేపట్టాల్సిన పనులివే.. ► జలాశయం నీటి నాణ్యత మెరుగుపరచడం, జలాశయంలోకి ఘనవ్యర్థాలు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ► దశాబ్దాలుగా జలాశయం అడుగున బెడ్‌లా ఏర్పడిన టన్నుల కొద్దీ ఘన వ్యర్థాలను డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా తొలగించడం. ► నాలుగు నాలాల నుంచి చేరుతున్న మురుగునీటిని పూర్తిగా దారి మళ్లించడం. ► జలాశయం, దాని పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం ► జలాశయం నీటిని ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్ అవసరాలకు వాడుకునే స్థాయిలో నీటి నాణ్యతను మెరుగుపరచాలి. ► హుస్సేన్‌సాగర్ చుట్టూ రింగ్‌సీవర్ మెయిన్స్ నిర్మించి జలాశయంలోకి మురుగు నీరు చేరకుండా చూడడం. శుద్ధిచేసిన నీరు మాత్రమే జలాశయంలోకి ప్రవేశించే ఏర్పాటు. జలాశయంలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు ఏరియేషన్ వ్యవస్థ ఏర్పాటు. -
ట్యాంక్‌బండ్‌పై సరోజినీ నాయుడి జ్ఞాపకాలు
సాక్షి, హైదరాబాద్: నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత కోకిల, ప్రముఖ కవయిత్రి, వక్త, స్వాతంత్య్ర సమరయోధురాలు, మహిళా సాధికారతకు అలుపెరగని పోరాటం చేసిన సరోజినీ నాయుడు 143వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్ ఆమెకు ఘనమైన నివాళి అర్పించింది. నగరంతో ఆమెకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ హుస్సేన్‌సాగర్‌పై ఆమె రాసిన గేయాన్ని స్మరించుకుంది. ట్యాంక్‌బండ్‌పై ఆమె రాసిన కవితతో కూడిన పుస్తకాన్ని ఏర్పాటు చేశారు. ఇది శాశ్వత స్ట్రక్చర్‌గా నిర్మించారు. ఒక స్టాండ్‌పై పుస్తకం, అందులో హుస్సేన్‌సాగర్‌పై ఆమె రాసిన గేయాన్ని పొందుపర్చారు. హైదరాబాద్ అంటే సరోజినీ నాయుడికి ఎంతో ఇష్టమనే విషయం పలు సందర్భాల్లో ఆమె రచనల ద్వారా వెల్లడించారు. హుస్సేన్ సాగర్‌పై హృద్యమైన గేయాన్ని రాశారు. ఆమె జయంతి సందర్భంగా ఈ అపురూప కానుకను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఈ మేరకు ట్వీట్ చేశారు. (క్లిక్: వైన్‌షాప్ ఉండాలా.. వద్దా అంటూ ఓటింగ్.. ఫలితం ఏంటంటే!) -
Hyderabad: స్వచ్ఛ సాగర్‌గా హుస్సేన్‌సాగర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్‌ను స్వచ్ఛ సాగర్‌గా మార్చేందుకు మార్చి నెల నుంచి మహానగరాభివృద్ధి సంస్థ, పీసీబీ సూచనలతో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించనుంది. ఏటా వేసవిలో ప్రధానంగా నాచు, నైట్రోజన్, పాస్పరస్‌లు భారీగా పెరిగి జలాల నుంచి దుర్గంధం పెద్ద ఎత్తున వెలువడుతుండడంతో స్థానికులు, వాహనదారులు, పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధాన కారణమైన నాచు (ఆల్గే) ఉద్ధృతిని తగ్గించేందుకు జలాల్లో పర్యావరణహిత ఏరోబిక్ బ్యాక్టీరియాను ప్రవేశపెట్టడం ద్వారా బయోరెమిడియేషన్ ప్రక్రియను నిర్వహించనుంది. ఇందుకోసం ఇటీవలే అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచింది. గతంలో కెనడాకు చెందిన ఓ సంస్థ ఈ ప్రక్రియ చేపట్టడంతో సత్ఫలితాలు సాధించిన నేపథ్యంలో తాజాగా మరోసారి బయో రెమిడియేషన్‌కు సిద్ధమవుతుండడం గమనార్హం. మార్చి నుంచి జూన్ వరకు.. ►వచ్చే నెల నుంచి వర్షాలు కురిసే జూన్ వరకు ఈ ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధానంగా 4.7 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన హుస్సేన్‌సాగర్ క్యాచ్మెంట్ పరిధి సుమారు 240 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఈ జలాశయంలోకి నాలుగు నాలాల నుంచి నీరు వచ్చి చేరుతోంది. ►ప్రధానంగా కూకట్పల్లి నాలాలో ప్రవహించే 400 మిలియన్ లీటర్ల రసాయనిక వ్యర్థ జలాలు సాగర్‌కు శాపంగా పరిణమించాయి. ఈ నీరు సాగర్‌లోకి చేరకుండా గతంలో డైవర్షన్ మెయిన్ ఏర్పాటు చేసినప్పటికీ.. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ బల్క్‌డ్రగ్, ఫార్మా, రసాయనిక పరిశ్రమలకు సంబంధించిన వ్యర్థజలాలు కూకట్పల్లి నాలా ద్వారా సింహభాగం సాగర్‌లో చేరుతున్నాయి. ►దీంతో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ల మోతాదు అనూహ్యంగా పెరుగుతోంది. ఈ పరిస్థితి కారణంగా ఏటా వేసవిలో నీరు ఆకుపచ్చగా మారి దుర్గంధం వెలువడుతోంది. బయో రెమిడియేషన్‌తో సాగర జలాల్లో కరిగిన ఆక్సిజన్ మోతాదును ప్రతి లీటరుకు 4 మిల్లీ గ్రాములు, బీఓడీని 36 మిల్లీగ్రాముల మోతాదు ఉండేలా చూడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో జలాల్లో వృక్ష, జంతు ఫ్లవకాల మనుగడ సాధ్యపడుతుందని చెబుతున్నారు. చదవండి: (ప్రయోగాత్మకంగా డీజిల్ బస్సు ఎలక్ట్రిక్‌గా మార్పు! ఇక నుంచి) అడుగున ఉన్న వ్యర్థాల శుద్ది ఎప్పుడో? సుమారు నాలుగు దశాబ్దాల పాటు పారిశ్రామిక వ్యర్థ జలాల చేరికతో సాగర గర్భంలో రసాయనిక వ్యర్థాలు టన్నుల మేర అట్టడుగున పేరుకుపోయాయి. ఈ వ్యర్థాలను ఇజ్రాయెల్,జర్మనీ దేశాల్లో ఉన్న సాంకేతికత ఆధారంగా తొలగించి.. ఈ వ్యర్థాలను మందమైన హెచ్డీపీఈ పైపుల్లో నింపి సాగరం చుట్టూ ఆనకట్టలా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా మిషన్ హుస్సేన్‌సాగర్‌కు రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ స్వచ్ఛ సాగర్ ఇప్పటికీ సాకారం కాలేదనే ఆరోపణలు వస్తుండటం గమనార్హం. -
హుస్సేన్ సాగర్ పై వేలాడే వంతెనలు
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్ మరింత అందమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. సాగర్ ను మరింత కనువిందుగా తీర్చి దిద్దేందుకు వేలాడే వంతెన లు నిర్మించేందుకు ప్రతి పాదనలు, రూపొందించారు. రష్యాలోని జీయాడు పార్క్ నుంచి రెడ్ స్క్వర్ వైపు ఉతరం వైపు ఉన్న మాస్కో నదిలోకి నిర్మించిన వేలాడే వంతెనల తరహాలోనే నెక్లెస్ రోడ్ నుంచి హుస్సేన్ సాగర్ లోకి వంతెనలను నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ కార్యధర్సి అరవింద్ కుమార్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. మాస్కో నదిలోకి నిర్మించిన పై వంతెన ఫోటో దృశ్యాల్ని ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికల్లా హుస్సేన్ సాగర్ లేక్ వ్యూ ను మాస్కో నది తరహాలో అభివృధి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
హుస్సేన్‌సాగర్ సర్ ప్లస్ నాలా రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన
-
ఆరు నెలలైనా కౌంటర్ వేయరా?
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ అనంతగిరి హిల్స్ నుంచి హిమాయత్‌సాగర్ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు వర్షపునీరు ప్రవహించే కాలువలన్నీ కూల్చిన భవనాల వ్యర్థాలు, అక్రమ కట్టడాలతో నిండిపోయాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని లేకపోతే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వర్షం నీరు ప్రవహించే కాలువలన్నీ వ్యర్థపదార్థాలతో పూడుకుపోవడంతో పాటు, అక్రమ నిర్మాణాల వల్ల నీరు ప్రవహించే అవకాశం లేకుండా పోయిందని, కాల్వల్లో నీరు ప్రవహించేలా చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.ఇంద్ర ప్రకాష్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. -
ఎన్టీఆర్ పార్కు ముందు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ పార్క్ ముందు ఆదివారం ఉదయం ఓ కారు భీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి అదుపు తప్పి పార్క్ ఎదురుగా ఉన్న హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో ఆ కారులో ఉన్న ముగ్గురు యువకుల స్వల్ప గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న సైఫాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని చికిత్స నిమిత్తం గాయపడ్డ ముగ్గురిని సోమజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. యువకులు ఖైరతాబాద్‌కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్ గుర్తించారు. నాలుగు రోజుల క్రితమే కారు కొన్నారని, ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్‌లో టిఫిన్ చేయడానికి వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే: పసిప్రాయంలో తల్లి.. తర్వాత తండ్రి.. ఇప్పుడు అన్న.. -
మూసీ నదిని చూసి మురుగునీటి కాలువ అనుకున్నా: హైకోర్టు చీఫ్ జస్టిస్
నాంపల్లి (హైదరాబాద్): పర్యావరణాన్ని రక్షించేందుకు కేవలం ప్రభుత్వంపైనే బాధ్యత వేయకుండా ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లి గగన్‌విహార్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ నూతన కార్యాలయాన్ని ఆయన అథారిటీ చైర్మన్ జస్టిస్ ప్రకాశ్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ సతీష్ చంద్ర సభనుద్దేశించి మాట్లాడారు. ‘నేను మధ్యప్రదేశ్‌లో ఉన్నప్పుడు హుస్సేన్‌సాగర్ గురించి ఎంతో గొప్పగా విన్నా. మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు హుస్సేన్‌సాగర్‌ను చూడటానికి వెళ్లాను. అయితే, అక్కడ ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయా. అలాగే హైకోర్టు దగ్గర ఉన్న మూసీ నదిని చూసి తొలుత మురుగునీటి కాలువని అనుకున్నా. కానీ, నా డ్రైవర్ అది నది అని చెప్పడంతో నేను ఆశ్చర్యపోయా’అని జస్టిస్ సతీష్ చంద్ర చెప్పారు. తానొకరోజు విమానాశ్రయం వెళ్తోంటే కొందరు వ్యక్తులు సంచుల్లో చెత్తను తీసుకొచ్చి రోడ్డు పక్కనే వేశారని, తన కుమారుడు కారు ఆపి ఆ చెత్తను చెత్తకుండీలో వేశారని గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీకి ఐదుసార్లు క్లీన్ సిటీ అవార్డు వచ్చిందని, అక్కడి కలెక్టర్‌తోపాటు పలువురు అధికారులు మరుగుదొడ్ల పక్కనే పుట్‌ఫాత్‌పై భోజనం చేశారని చెప్పారు. నదులు, సరస్సులు, పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తున్న వారిపై ఈ అథారిటీతోపాటు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా ఉండి కాలుష్య నియంత్రణకు పాటుపడాలని చీఫ్ జస్టిస్ చేతులు జోడించి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అథారిటీ మెంబర్ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘హుస్సేన్‌సాగర్’ ప్రియులకు శుభవార్త.. తగ్గిన కాలుష్యం,పెరిగిన ఆక్సిజన్
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌లో ఆక్సిజన్ మోతాదు గణనీయంగా పెరిగింది. పలు రకాల చేపలు, వృక్ష, జంతు ఫ్లవకాల మనుగడకు అత్యావశ్యకమైన కరిగిన ఆక్సిజన్ మోతాదు పెరగడంతో సాగర్‌ను సందర్శించే సిటీజనులు సైతం స్వచ్ఛ ఊపిరి పీల్చుకుంటున్నట్లు కాలుష్యనియంత్రణ మండలి(పీసీబీ) తాజా అధ్యయనంలో తేలింది. పర్యావరణహిత బయోరెమిడియేషన్ విధానం, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సాగర జలాలు స్వచ్ఛంగా మారడంతోపాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల మేరకు ఇతక కాలుష్యకాలుండడం ఊరటనిచ్చే అంశం. ప్రధానంగా కరిగిన ప్రాణవాయువు మోతాదు ప్రతి లీటర్ సాగర జలాల్లో 4 మిల్లీ గ్రాములుగా నమోదైనట్లు స్పష్టమైంది. సాగర్‌లో కాలుష్య మోతాదు తగ్గడంతోనే ఆక్సిజన్ శాతం పెరిగినట్లు ఈ అధ్యయనం పేర్కొంది. చదవండి: ఫిట్‌గా ఉన్నా..జిమ్ చేస్తున్నా.. గుండెపోటు ఎందుకు? బయో రెమిడియేషన్‌తో సత్ఫలితాలు సాగర జలాల స్వచ్ఛతను మెరుగుపరిచేందుకు చేపట్టిన పర్యావరణ హిత బయోరెమిడియేషన్ విధానం క్రమంగా సత్ఫలితాన్నిస్తోంది. ఈ విధానంలో బ్యాక్టీరియా నీటిని శుద్ధి చేస్తుంది. ఏడాదిగా ఈ విధానం అమలుతో హుస్సేన్‌సాగర్ నలుమూలల్లోనూ ఆక్సిజన్ మోతాదు గణనీయంగా పెరిగినట్లు ఈ అధ్యయనం తెలిపింది. సుమారు 70 శాతం ఈ విధానం విజయవంతమైందని స్పష్టంచేసింది. గతంలో జలాల్లో ఆక్సీజన్ మోతాదు గణనీయంగా తగ్గుముఖం పట్టిన కారణంగానే ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం అమల్లో ఉన్నట్లు పీసీబీ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. మన దేశంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇటీవలికాలంలో ఈవిధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యధిక లేదా అత్యల్ప కరిగిన ఆక్సిజన్ మోతాదు ఉన్న జలాల్లో చేపలు, వృక్ష, జంతు ఫ్లవకాల మనుగడ కష్టాసాధ్యమౌతుందని స్పష్టంచేశారు. చదవండి: కుట్లు వేశారు.. కడుపులో సూది మరిచారు! బీఓడీ అధికంగానే.. సాగర జలాల్లో ఆక్సిజన్ మోతాదు పెరగడం ఊరటనిచ్చినా.. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ మోతాదు ప్రతి లీటర్ సాగర జలాల్లో 22 మిల్లీగ్రాములుగా నమోదైనట్లు పీసీబీ నివేదిక తెలిపింది. పీసీబీ ప్రమాణాల మేరకు బీఓడీ 3 మిల్లీగ్రాములుగా ఉండాలి. కాగా ఇటీవలి వర్షాలకు కూకట్పల్లి నాలా నుంచి వచ్చి సాగర్‌లో చేరిన జలాల్లో పారిశ్రామిక కాలుష్య ఆనవాళ్లుండడంతో బీఓడీ మోతాదు పెరిగినట్లు పీసీబీ నిపుణులు చెబుతున్నారు. స్వచ్ఛ సాగర్‌ను సాకారం చేయాలి నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ను స్వచ్ఛమైన వర్షపునీరు చేరేలా చర్యలు తీసుకోవాలి. సాగర గర్భంలో దశాబ్దాలుగా పేరుకుపోయి గడ్డకట్టిన వ్యర్థాలను తొలగించాలి. ఆస్ట్రియాలోని డాన్యుబ్ నది తరహాలో సాగర్‌ను ప్రక్షాళన చేయాలి. సాగర్ చుట్టూ వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించరాదు. – సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త హుస్సేన్‌సాగర్ జలాల నాణ్యత, పలు కాలుష్యకాల మోతాదు ఇలా ఉంది ప్రతి లీటరు నీటిలో మిల్లీగ్రాముల్లో.. ప్రాంతం గాఢత కరిగిన ఆక్సిజన్ బీఓడీ ఎన్‌టీఆర్‌పార్క్ 7.3 4 మి.గ్రా 22 మి.గ్రా లుంబినీపార్క్ 7.4 4 22 బుద్ధవిగ్రహం 7.4 4.2 27 -
లవ్ ఫెయిల్యూర్: రన్నింగ్ బస్సు దిగి.. హస్సేన్సాగర్లో దూకి..
సాక్షి, రాంగోపాల్‌పేట్: ప్రేమ విఫలమైందని ఓ యువకుడు హుటాహుటిన రన్నింగ్ బస్సు నుంచి దిగి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి వివరాల ప్రకారం.. కలకత్తాకు చెందిన 23 సంవత్సరాల ఓ యువకుడు మౌలాలిలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ప్రేమ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆ యువకుడిని మందలించారు. చదవండి: మన కుటుంబ పరిస్థితి ఎందుకు ఇలా ఉందంటూ.. దీంతో తీవ్ర భయాందోళనకు గురై గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో వెళుతూ రన్నింగ్ బస్సులో నుంచి కిందకు దిగాడు. వెంటనే అంతే వేగంగా వెళ్లి హుస్సేన్‌సాగర్‌లోకి దూకాడు. వెంటనే అక్కడే గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి నీళ్లలోకి దూకి అతడిని ఒడ్డుకు చేర్చారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులను పిలిపించిన ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం వారికి అప్పగించారు .ఆ యువకుడిని కాపాడిన లేక్ కానిస్టేబుళ్లు అభిలాష్, రాజులను ఇన్స్పెక్టర్ అభినందించారు. చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్: అదే కిరణ్ ప్రత్యేకత -
హుస్సేన్‌సాగర్‌కు భారీగా పోటెత్తిన వరద
-
‘క్లీన్’ సాగర్
-
Ganesh: జజ్జనకరి జనారే.. నిమజ్జన హుషారే
సాగరం సన్నద్ధమైంది. గణనాథుడికి ఘనమైన స్వాగతం చెప్పేందుకు అలలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మహా ‘గణ’ ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా విస్తరించుకున్నాయి. గతేడాది కోవిడ్ కారణంగా దేవదేవుడికి సాదాసీదాగా పూజలు చేసిన భక్తజనం ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించింది. నగరమంతటా వేలాది విగ్రహాలను ప్రతిష్టించారు. ఇష్టదైవాన్ని ఆనందోత్సాహాలతో కొలిచి మొక్కారు. ‘కరోనా వంటి మహమ్మారులు మరోసారి ప్రబలకుండా మమ్మల్ని కాపాడవయ్యా బొజ్జ గణపయ్యా’ అంటూ భక్తులు వేడుకున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రతో భక్తజన సాగరం కనువిందు చేయనుంది. మహాగణపతి క్రేన్ నంబర్–4 ► ఖైరతాబాద్ శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి నిమజ్జనం క్రేన్ నంబర్–4 వద్ద జరిగేలా ఏర్పాట్లు చేశారు. ► 2.5 కి.మీ. మేర సాగే ఖైరతాబాద్ వినాయక నిమజ్జన ప్రక్రియ మొత్తం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోగా పూర్తి చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ► బెంగళూరు నుంచి ప్రత్యేక భారీ వాహనాన్ని తీసుకొచ్చారు. ► ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ► 11 గంటల మధ్య ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం.4 వద్దకు చేరుకోగానే 12 గంటల నుంచి 1 గంట మధ్య నిమజ్జనం పూర్తి చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. రూట్ మ్యాప్ ఇలా... మహాగణపతి మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమై సెన్షేషన్ థియేటర్, రాజ్ దూత్ చౌరస్తా మీదుగా టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్, తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మార్గ్ గుండా క్రేన్ నెం.4 వద్దకు చేరుకుంటుంది. బాలాపూర్ గణేష్ ఎటు వైపు నుంచి? బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 17 కి.మీ. గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మార్గంలోని ఫలక్‌నుమా బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. శనివారం రాత్రి వరకు కొంత పూర్తయ్యే అవకాశం ఉందని..రాత్రి సమయంలో ట్రయల్ రన్ వేసి..సజావుగా సాగితే బాలాపూర్ గణేష్‌తో పాటు 15 అడుగులకు మించిన మూడు నాలుగు విగ్రహాలను కూడా ఇదే బ్రిడ్జి మీదుగా అనుమతిస్తామని సీపీ తెలిపారు. ట్రయల్ రన్లో విఫలమైతే కందికల్ గేట్ నుంచి లాల్‌దర్వాజా మీదుగా సాగర్ వైపు మళ్లిస్తామని చెప్పారు. ► కేశవగిరి నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు విగ్రహాలు పాత చాంద్రాయణగుట్ట పీఎస్– చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్– నల్లవాగు–కందికల్‌గేట్ ఫ్లైఓవర్– ఓపీ ఛత్రినాక– లాల్దర్వాజాగుడి–నాగుల్చింత–చార్మినార్–మదీనా–అఫ్జల్‌గంజ్– ఎస్బజార్–ఎంజేమార్కెట్– అబిడ్స్–బషీర్‌బాగ్–లిబర్టీ–అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, (నెక్లెస్ రోడ్) లేదా ఎగువ ట్యాంక్‌బండ్ వెళ్తాయి. ► సికింద్రాబాద్ మీదుగా వచ్చే ఊరేగింపు విగ్రహాలు ఆర్పీ రోడ్ నుంచి ఎంజీ రోడ్–కర్బాలా మైదాన్– కవాడిగూడ– ముషీరాబాద్ క్రాస్ రోడ్– ఆర్టీసీ క్రాస్‌రోడ్– నారాయణగూడ క్రాస్ రోడ్– హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీలో ప్రధాన మార్గంలో కలవాలి. ► చిలకలగూడ క్రాస్‌రోడ్ నుంచి వచ్చే వాహనాలు గాంధీ ఆసుపత్రి మీదుగా ముషీరాబాద్ క్రాస్ రోడ్లో కలవాలి. ► ఉప్పల్ నుంచి వాహనాలు రామంతాపూర్– 6 నంబర్ జంక్షన్ అంబర్‌పేట– శివంరోడ్– ఎన్సీసీ– దుర్గాభాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రి– హింది మహావిద్యాలయ్ క్రాస్‌రోడ్– ఫీవర్ ఆసుపత్రి– బర్కత్‌పుర క్రాస్ రోడ్– నారాయణగూడ క్రాస్‌రోడ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి వచ్చే మార్గంలో కలవాలి. ► దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాలు ఐఎస్ సదన్– సైదాబాద్– చంచల్‌గూడ నుంచి ముసారాంబాగ్ మీదుగా అంబర్‌పేట మార్గంలో కలవాలి. ► తార్నాక నుంచి వచ్చే విగ్రహాలు ఓయూ దూరవిద్యా కేంద్ర రోడ్ నుంచి అడిక్‌మెట్ నుంచి విద్యానగర్ మీదుగా ఫీవర్ ఆసుపత్రి మార్గంలో కలవాలి. ► టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు మాసబ్‌ట్యాంక్ మీదుగా అయోధ్య జంక్షన్– నిరంకారీ భవన్– పాత సైఫాబాద్ పీఎస్– ఇక్బాల్ మినార్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లాలి. ► ఎర్రగడ్డ నుంచి వచ్చే వాహనాలు ఎస్ఆర్నగర్– అమీర్‌పేట–పంజగుట్ట–వీవీ విగ్రహం నుంచి మెహదీపట్నం మీదుగా నిరంకారీ భవన్ వైపు మళ్లాలి. ► టపాచబుత్ర, ఆసిఫ్‌నగర్ మీదుగా వచ్చే వాహనాలు సీతారాంబాగ్– బోయిగూడ కమాన్– వౌల్గా హోటల్– గోషామహల్ బారాదరి– అలాస్కా మీదుగా ఎంజే మార్కెట్ ప్రధాన మార్గంలో కలవాలి. ఇక్కడ్నుంచి అబిడ్స్ మీదుగా బషీరాబాగ్–లిబర్టీ– అంబేద్కర్ విగ్రహం– ఎన్టీఆర్ మార్గ్– పీవీఎన్ఆర్ మార్గ్ మీదుగా ఎగువ ట్యాంక్‌బండ్‌కు చేరుకోవాలి ► సుమారు 27 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. హోంగార్డ్లు, స్పెషల్ ఆఫీసర్స్, ఫారెస్ట్, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు ఉన్నారు. ► సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు, జంక్షన్లలో వజ్ర వాహనాలను, గ్యాస్ ఎస్కార్ట్, వాటర్ వెహికిల్స్, అగ్నిమాపక వాహనాలను సిద్ధం చేశారు. 19 సైబర్ ట్యాచ్ టీమ్, బాంబ్ డిస్పోజ్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. 24 స్నిపర్ డాగ్స్ కూడా బందోబస్త్‌లో పాల్గొంటున్నాయి. ► రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లు, సాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వేగవంతమైన కమ్యూనికేషన్ కోసం ఇప్పటికే పోలీసులు వద్ద ఉన్న 2,700 వైర్లెస్ సెట్స్‌తో పాటు అదనంగా 475 సెట్లను అందించారు. ► హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఇరిగేషన్, మెట్రో, ట్రాన్స్పోర్ట్ విభాగాలలతో కూడిన జాయింట్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు అన్ని శాఖల అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ► సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తి కనుగుణంగా చెరువులు, కొలనులు కలుషితంకాకుండా విగ్రహాలు వేసిన వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు. ► హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో కోవిడ్ నిరోధక ఉచిత వ్యాక్సినేషన్ శిబిరం. సోమవారం ఉదయం లోపే పూర్తి.. గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అవసరమైన మేర పోలీసు బలగాలు విధుల్లో ఉంటాయి. మూడు కమిషనరేట్లతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి విగ్రహాలు తరలివస్తాయి. సుమా రు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నాం. సోమ వారం ఉదయం 5:30 వరకు నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ కోవిడ్ నిబంధనలు పాటించాలి వినాయక నిమజ్జనం చూసేందుకు తరలివచ్చే భక్తులు, నిర్వాహకులు అందరూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. నిమజ్జనానికి వచ్చే మార్గాలలో ఎలాంటి వాహనాలు, నిర్మాణ సామగ్రి వంటివి నిలిపి ట్రాఫిక్ జామ్‌లకు గురిచేయకూడదు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ప్రజలు సహకరించాలి. – మహేశ్ ఎం. భగవత్, సీపీ, రాచకొండ వదంతుల్ని ఫార్వర్డ్ చేయొద్దు భక్తులు తమ పిల్లల్ని, వెంట తెచ్చుకునే వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి వదంతుల్ని నమ్మొద్దు. వాట్సాప్ గ్రూప్‌లకు అనవసర మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయొద్దు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే డయల్ 100కు గానీ 94906 17444 వాట్సాప్‌లో గానీ ఫిర్యాదు చేయాలి. మహిళలపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 94936 22395 నంబరులో ఫిర్యాదు చేయాలి. – స్టీఫెన్ రవీంద్ర, సీపీ, సైబరాబాద్ -
గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్ ముస్తాబు
-
నేడే ‘గణ’ వేడుక
సాక్షి, హైదరాబాద్: సాగరం సన్నద్ధమైంది. గణనాథుడికి ఘనమైన స్వాగతం చెప్పేందుకు అలలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మహా ‘గణ’ ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా విస్తరించుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బొజ్జగణపయ్యకు భక్తజనం ఘనంగా వేడుకలు నిర్వహిస్తూనే ఉన్నారు. చదవండి: గణేష్ నిమజ్జనం: హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండువగా సాగే ఉత్సవాలు వైవిధ్యభరితమైన హైదరాబాద్ మహానగర చరిత్రకు ఒక సమున్నతమైన ఆధ్యాత్మిక ఆవిష్కరణ. చిన్న చిన్న గల్లీలు, బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు మొదలుకొని ప్రధాన రహదారుల వరకు అడుగడుగునా కొలువుదీరిన విభిన్న మూర్తుల గణనాథుడి ఉత్సవంతో నగరం సరికొత్త కాంతులను సంతరించుకుంటుంది. గతేడాది కోవిడ్ కారణంగా దేవదేవుడికి సాదాసీదాగా పూజలు చేసిన భక్తజనం ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించింది. నగరమంతటా వేలాది విగ్రహాలను ప్రతిష్టించారు. ఇష్టదైవాన్ని ఆనందో త్సాహాలతో కొలిచి మొక్కారు. ‘ కరోనా వంటి మహమ్మారులు మరోసారి ప్రబలకుండా మమ్మల్ని కాపాడవయ్యా బొజ్జ గణపయ్యా’ అంటూ భక్తులు వేడుకున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రతో భక్తజన సాగరం కనువిందు చేయనుంది. శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం వివిధ శాఖల సమన్వ యంతో సకల ఏర్పాట్లు చేసింది. బాలాపూర్ నుంచి మొదలయ్యే నిమజ్జన శోభాయాత్ర సాఫీగా సాగేందుకు తగిన చర్యలు తీసుకుంది. ►వివిధప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు శోభాయాత్ర మార్గాలు: 320 కి.మీ. ►ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించి పరిశుభ్రం చేసేందుకు యాక్షన్ టీమ్స్ : 162 ►గణేశ్ యాక్షన్ టీమ్స్ సిబ్బంది : 8,116 ►నిమజ్జనం జరిగే ప్రాంతాలు : 33 చెరువులు, 25 కొలనులు. ►విగ్రహాల నిమజ్జనానికి అందుబాటులో ఉన్న క్రేన్లు: 316 ►ట్యాంక్‌బండ్ పరిసరాల్లో క్రేన్లు: 40 ►అంచనా వ్యర్థాలు: 3,910 మెట్రిక్ టన్నులు ►చెత్తను తరలించేందుకు పెద్ద వాహనాలు: 44, మినీ టిప్పర్లు: 39, జేసీబీలు:21 ►ఫైర్ వాహనాలు : 38 ►బారికేడింగ్స్ : 12 కి.మీ. ►వాటర్‌ప్రూఫ్ టెంట్లు : 15 ►తాగునీటి పంపిణీ శిబిరాలు: 101 ►అందుబాటులో వాటర్ప్యాకెట్లు: 30 లక్షలు ►హుస్సేన్‌సాగర్ వద్ద ట్రాన్స్ఫార్మర్లు: 48 ►అన్ని నిమజ్జనప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు: 101 ►తాత్కాలిక వీధి దీపాలు: 41,284 ►ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఎల్ఈడీ లైట్లు: 2600 ►హుస్సేన్‌సాగర్ వద్ద బోట్లు : 9 ►ట్యాంక్‌బండ్ వద్ద స్విమ్మర్లు: 32 ►పంపిణీకి అందుబాటులో మాస్కులు: 5 లక్షలు ►శోభాయాత్ర మార్గంలో, చెరువుల వద్ద శానిటైజర్లు ►విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది: 19000 ►ట్యాంక్‌బండ్‌పై అంబులెన్సులు: 2 పోలీస్ కంట్రోల్‌రూమ్స్: 2 ►ఆయా ప్రాంతాల్లో వాచ్ టవర్లు ►ఎన్టీఆర్ మార్గ్‌లో వాటర్‌బోర్డు, టీఎస్ఎస్ పీడీసీఎల్, జీహెచ్ఎంసీల కంట్రోల్‌రూమ్స్. ►సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తికనుగుణంగా చెరు వులు, కొలనులు కలుషితంకాకుండా విగ్రహాలు వేసిన వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు. ►హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో కోవిడ్ నిరోధక వ్యాక్సినేషన్ శిబిరం శనివారం రాత్రి హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహ నిమజ్జనం హెలికాప్టర్ నుంచి పర్యవేక్షణ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహ మూద్‌అలీలతోపాటు డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌లు మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర, నిమజ్జనాలను హెలికాప్టర్లో ఏరియల్‌వ్యూ ద్వారా పరిశీలిస్తారు. వాటర్ బోర్డు మంచి నీటిసరఫరా గణేష్ నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు జలమండలి వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసింది. 119 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసి, 30.72 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. శోభయాత్ర జరిగే అన్ని ప్రాంతాల్లో జలమండలి వాటర్ క్యాంపులు ఏర్పాటు చేశారు.అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో కూడా తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్(క్యూఏటీ)లు ఎప్పటికప్పుడు వాటర్ క్యాంపుల్లో మంచినీటి నాణ్యతను పరీక్షించడంతో పాటు క్లోరిన్ లెవల్స్ తగిన మోతాదులో ఉండేలా చూస్తాయన్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో ►నిమజ్జనానికి తరలి వచ్చే భక్తుల కోసం ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల (సోమవారం తెల్లవారు జాము)వరకు అన్ని రూట్లలో మెట్రో రైళ్లు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ►నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్‌బండ్ హుస్సేన్‌సాగర్‌కు చేరుకునేం దుకు వీలుగా ఆర్టీసీ 565 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు, ఉప్పల్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల నుంచి ఇందిరాపార్కు వరకు, మెహదీపట్నం, పటాన్చెరు, బీహెచ్ఈఎల్, తదితర ప్రాంతాల నుంచి ఖైరతాబాద్, లక్డీకాపూల్ వరకు ఈ బస్సులు నడుస్తాయి. ►ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమ వారం ఉదయం 4 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా 8 ఎంఎం టీఎస్ స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు దక్షిణమ ధ్య రైల్వే చర్యలు చేపట్టింది. లింగంపల్లి– సికింద్రాబాద్, నాంపల్లి– లింగపల్లి, ఫలక్‌నుమా– సికింద్రాబాద్, నాంపల్లి– ఫలక్‌నుమా రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయి. -
హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జన కోలాహలం
-
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి లైన్‌క్లియర్
-
నాడు 15 రోజులపాటు వాహనంపైనే ఖైరతాబాద్ గణేషుడు.. కారణం ఇదే!
సాక్షి, ఖైరతాబాద్: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌తోపాటు చెరువుల్లో నిమజ్జనం చేయనివ్వొద్దని హైకోర్టు సూచనలు చేసిన నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా వినాయకుడు కొలువుదీరాడు. ప్రతి ఏటా మహాగణపతిని అత్యంత వైభవంగా..హంగూ ఆర్భాటాలతో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్‌బండ్‌కు తరలించి అక్కడే నిమజ్జనం చేస్తున్నారు. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన క్రేన్లు వేలాది మంది భక్తులు పాల్గొనే నిమజ్జన శోభార్యాలీ మొత్తం గణేష్ ఉత్సవాల్లోనే హైలెట్‌గా నిలుస్తుంది. ఇందుకోసం నిర్వాహకులతోపాటు అధికారులు, పోలీసు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపడుతుంది. అయితే..ఈసారి నిమజ్జనంపై కోర్టు సూచనల నేపథ్యంలో అధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో అసలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారా..లేకుంటే ప్రత్యామ్నాయంగా ఎక్కడ ఏర్పాట్లు చేస్తారనేదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సాగర్‌లోనే నిమజ్జనం: ఉత్సవ కమిటీ ఈసారి కూడా మహాగణపతి నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లోనే జరగాలని, 66 సంవత్సరాలుగా ఇది సంప్రదాయంగా కొనసాగుతోందని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఒక వేళ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతివ్వకుంటే, ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు మహాగణపతి విగ్రహాన్ని ఇక్కడే ఉంచుతామని పేర్కొన్నారు. 1986లో ఇలా... 1986లో 20 అడుగుల ఎత్తులో తయారుచేసిన వినాయకుడిని సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లగా అక్కడ తగిన సౌకర్యాలు కల్పించ లేదు. దీంతో 15 రోజుల పాటు వినాయకుడ్ని అక్కడే వాహనంపైనే ఉంచారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేక క్రేన్ ఏర్పాటు చేయడంతో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. తలసానికి విన్నపం అఫ్జల్‌గంజ్: హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు విధించిన ఆంక్షల నేపథ్యంలో మంగళవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి చర్చించారు. గణేష్ విగ్రహాల సామూహిక నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లో జరిపేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు జి. రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్‌రావు, ఉపాధ్యక్షులు కరోడీమాల్, కోశాధికారి శ్రీరామ్‌వ్యాస్, రామరాజు, కార్యదర్శులు మహేందర్, శశి, ఆలె భాస్కర్, రూప్‌రాజ్ తదితరులు ఉన్నారు. అంబారీపై ఊరేగింపు.. వచ్చేసారి 70 అడుగుల మట్టి వినాయకుడు వచ్చే సంవత్సరం..2022లో ఖైరతాబాద్ మహాగణపతిని మట్టితో 70 అడుగుల ఎత్తులో తయారుచేస్తాం. ఈ భారీ వినాయకుడిని ఉన్నచోటే నిమజ్జనం చేస్తాం. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని..ఖైరతాబాద్ మహాగణపతిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – సింగరి సుదర్శన్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ 1954 : ఒక అడుగు వేరేచోట కష్టమే... 40 అడుగుల ఎత్తులో ఉన్న భారీ వినాయకుడిని హుస్సేన్‌సాగర్‌లో కాకుండా వేరేచోట నిమజ్జనం చేయడం కష్టమేనని నిపుణులు, ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. మహాగణపతిని నిమజ్జనం చేసేంత విశాలమైన, లోతైన కొలనులు సమీపంలో ఎక్కడా లేవు. ఒకవేళ అంతపెద్ద పాండ్‌ను రూపొందించాలన్నా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. అంత సమయమూ లేదు. మరోవైపు మహాగణపతి విగ్రహం మరో ప్రాంతానికి తీసుకెళ్లాలంటే రహదారిలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి. ఫ్లై ఓవర్లు, మెట్రో మార్గంలో పిల్లర్లు, విద్యుత్ కేబుళ్లు దాటుకుంటూ తరలించడం అసాధ్యం. ఇది చాలా ఇబ్బందులతో కూడుకున్న పనిగా చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మహాగణపతి నిమజ్జనం ఎక్కడ, ఎలా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో నెలకొంది. గణేష్ మండపాల డిమాండ్ మేరకు వాహనాలు సాక్షి, సిటీబ్యూరో: వినాయక నిమజ్జన ఉత్సవాలపై రవాణాశాఖ దృష్టి సారించింది. ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న నిమజ్జనం కోసం ప్రస్తుతం వెయ్యి భారీ వాహనాలను సిద్ధం చేసినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు. గణేష్ మండపాల డిమాండ్ మేరకు అవసరమైన వివిధ రకాల వాహనాలను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సూచన మేరకు నగరంలోని ప్రధాన మండపాల నుంచి వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించేందుకు భారీ ట్రాలీ వాహనాలు మొదలుకొని టాటాఏస్ వంటి చిన్న వాహనాల వరకు అందజేయనున్నారు. నిమజ్జన వాహనాల కోసం వచ్చే మండపాల నిర్వాహకులకు నగరంలోని 12 చోట్ల వాహనాలను సిద్ధంగా ఉంచుతారు. ► నెక్లెస్‌రోడ్డు. మేడ్చల్, టోలీచౌకి, జూపార్కు, మలక్‌పేట్, కర్మన్‌ఘాట్, నాగోల్, గచ్చిబౌలి, మన్నెగూడ, పటాన్చెరు, ఆటోనగర్ నుంచి వాహనాలను తీసుకోవచ్చు. ► 19వ తేదీన నిమజ్జనంజరుగనున్న దృష్ట్యా మండపాల నిర్వాహకులు 18వ తేదీనే వాహనాలను తీసుకెళ్లవచ్చు. ► మరోవైపు వాహనాలను అందజేసేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాంతీయ రవాణా అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జేటీసీ వెల్లడించారు. వాహనాల అద్దె.. ► నిమజ్జనానికి తరలి వచ్చే వాహనాల అద్దెలను సైతం అధికారులు ఖరారు చేశారు. ► భారీ ట్రాలీ లేదా టస్కర్‌లకు రూ.20 వేలు. (డీజిల్ ఖర్చు, డ్రైవర్ బత్తాతో కలిపి) ► 10 నుంచి 12 టైర్ల సామర్ధ్యం ఉన్న హెవీగూడ్స్ వెహికల్స్‌కు రూ. రూ.4000. డీజిల్ ఖర్చు, డ్రైవర్‌కు రూ.500 బత్తా అదనం. ► 6 టైర్ల సామర్ధ్యం కలిగిన లారీలకు రూ.2500, ► మిడిల్ గూడ్స్ వెహికల్స్‌కు రూ.1600, ► డీసీఎం వంటి లైట్‌గూడ్స్ వెహికల్స్‌కు రూ.1300, ► టాటాఏసీలకు రూ.1000 చొప్పున అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది. ► వీటితో పాటు ప్రతి వాహనం డ్రైవర్‌కు బత్తా తప్పనిసరిగా ఇవ్వాలి. -
వినాయక నిమజ్జనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
-
వేయలేక.. వదల్లేక.. భక్తులకు నిమజ్జనం టెన్షన్!
ఓ వైపు చెరువుల్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ నిబంధనలు...మరోవైపు తెచ్చిన విగ్రహాన్ని ఎలాగైనా నిమజ్జనం చేయాలనే ఆరాటం మధ్య భక్తులు ఒత్తిడికి గురవుతున్నారు. పోలీసుల కంటపడకుండా నానా ఇబ్బందులు పడుతూ దొడ్డిదారిలో వెళ్లి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఇలా ప్రమాదపుటంచున నిమజ్జనం చేయడం కనిపించింది. సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనాలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పష్టమైన సూచనలు లేకపోవడం..హైకోర్టు ఆదేశాల గురించి ప్రజలకు తెలియకపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో చేసిన, కెమికల్స్‌తో కూడిన రంగుల విగ్రహాలను నిమజ్జనం చేయరాదనే హైకోర్టు ఆదేశాలు తెలియని ప్రజలు ప్రతి సంవత్సరం మాదిరిగానే తాము ఎప్పుడూ నిమజ్జనం చేసే ప్రాంతాలకు విగ్రహాలతో వెళ్తున్నారు. కానీ ఆయా విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆ విగ్రహాలను నీళ్లలో వేయలేక.. అక్కడే వదిలి వెళ్లలేక వారంతా అయోమయానికి గురవుతున్నారు. వందలాది మంది దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో విగ్రహాలను తీసుకువచ్చి...తీరా నిమజ్జనానికి అనుమతి లేదని తెలిసి అవాక్కవుతున్నారు. చదవండి: హుస్సేన్‌సాగర్‌లో ‘నిమజ్జనం’పై సుప్రీంకు.. పోలీసులకు తలనొప్పులు సరూర్‌నగర్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లోని చెరువుల వద్దకు బ్యాండు మేళాలతో డ్యాన్సులు చేస్తూ వెళ్తున్న భక్త జనం విగ్రహాలను నిమజ్జనం చేయకుండా అక్కడే వదిలేస్తున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. సాధారణంగా నాలుగు రోజుల వరకు చిన్న విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయడం, ఐదో రోజునుంచే మూడు నాలుగు అడుగులు, అంతకంటే ఎక్కువ ఎత్తు విగ్రహాలను నిమజ్జనం చేయడం తెలిసిందే. దీంతో ఐదోరోజైన మంగళవారం పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. కొన్ని చెరువుల వద్ద మాత్రం ఎలాంటి ప్రతికూలత లేకపోవడంతో నిమజ్జనాలు చేసి వెళ్తున్నారు. చదవండి: హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఎక్కడ? అధికారుల మల్లగుల్లాలు విగ్రహాల నిమజ్జనాలకు సోమవారం హైకోర్టు నుంచి సానుకూల స్పందన వస్తుందని అధికారులు ఆశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేయడంతో వివిధ శాఖల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. కోర్టు అనుమతించిన బేబీ పాండ్స్ (ప్రత్యేక నిమజ్జన కొలను)లోనే నిమజ్జనాలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసే ప్రయత్నాల్లో మునిగారు. భారీ గణపతులు సైతం బేబీ పాండ్స్‌లోనే... ► ఖైరతాబాద్, బాలాపూర్ వంటి పెద్ద వినాయక విగ్రహాలను సైతం బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. సంజీవయ్యపార్కు, నెక్లెస్‌రోడ్ వద్ద హుస్సేన్సా గర్ నీటిలోనే రెండు బేబీపాండ్స్ ఉన్నాయి. పెద్ద విగ్రహాలను కూడా వాటిల్లో నిమజ్జనం చేసేందుకు అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. ► మరోవైపు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు కూడా తెలుస్తోంది. ఏదేమైనా , తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ, తదితర అధికారులు బిజీబిజీగా ఉన్నారు. ఏం చేస్తున్నారన్నది మాత్రం స్పష్టంగా వెల్లడించడం లేరు. ► బేబీపాండ్స్లోనే అన్నివిగ్రహాల నిమజ్జనం జరగాలంటే ఎక్కువ రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. జాప్యం జరగకుండా ఉండేందుకు బేబీపాండ్స్ను పూర్తిగా నీటితో నింపి, వాటిల్లో విగ్రహాలను తడిచేలా ముంచి వెంటనే తొలగించే చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తద్వారా వేగంగా జరగడంతోపాటు పెద్ద విగ్రహాలవి కూడా పూర్తిచేయాలని భావిస్తున్నారు. బేబీ పాండ్లు నిర్మించారిలా.. జీహెచ్ఎంసీ నిరి్మంచిన బేబీ పాండ్లు 26 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పు, 12– 15 అడుగుల లోతు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటికి పవర్ బోర్లతో నీరు నింపే సదుపాయం ఉంది. లేనివాటికి ట్యాంకర్లతో నీటిని నిండుగా నింపే యోచనలో ఉన్నారు. దిగువ ప్రాంతాల్లోనే.. అంబీర్‌చెరువు (కూకట్పల్లి), రంగధాముని చెరువు (కూకట్పల్లి), బోయిన్‌చెరువు (హస్మత్‌పేట్), ఊరచెరువు (కాప్రా), చెర్లపల్లిచెరువు, పెద్దచెరువు(గంగారం), వెన్నెల చెరువు(జీడిమెట్ల), మల్కచెరువు(రాయదుర్గం), నల్లగండ్ల చెరువు, పెద్దచెరువు(మన్సూరాబాద్),పెద్దచెరువు(నెక్నాంపూర్),లింగంచెరువు(సూరారం), ముండ్లకత్వ (మూసాపేట), నాగోల్ చెరువు, కొత్తచెరువు(అల్వాల్),నల్లచెరువు(ఉప్పల్), పత్తికుంట(రాజేంద్రనగర్), గురునాథ్‌చెరువు(మియాపూర్), గోపిచెరువు(లింగంపల్లి), రాయసముద్రం(ఆర్సీపురం), కైదమ్మ కుంట (హఫీజ్‌పేట), దుర్గంచెరువు, బండచెరువు (మల్కాజిగిరి), హుస్సేన్‌సాగర్‌లో రెండు పాండ్లు ఉన్నాయి. -
గణేష్ నిమజ్జనంపై గందరగోళం
-
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనంపై నెలకొన్న గందరగోళం....
హైదరాబాద్: భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిమజ్జనంపై సమాలోచనలు చేస్తోంది. కాగా, గణేష్ నిమజ్జనంపై పోలీసుశాఖలో అయోమయం నెలకొంది. గణేష్ నిమజ్జనంపై నిన్న(సోమవారం) సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. నిమజ్జనంపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు తీర్పుపై అధికారులతో చర్చించారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నిమజ్జనానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రతి ఏడాది మాదిరిగానే.. ట్యాంక్బండ్లోనే గణేష్ నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇది వరకే ప్రకటించారు. ఇప్పటికే ట్యాంక్ బండ్లో నిమజ్జనం ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు. పోలీసులు నిమజ్జనంకు వచ్చే విగ్రహాలను అడ్డుకుంటే రోడ్డు మీదనే నిరసన వ్యక్తం చేస్తామని ఉత్సవ సమితి హెచ్చరించింది. చదవండి: హుస్సేన్‌సాగర్‌లో ‘నిమజ్జనం’పై సుప్రీంకు.. చదవండి: TS High Court:హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలని పురాణాల్లో చెప్పారా? -
వినాయక నిమజ్జనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
న్యూఢిల్లీ: వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: వేయలేక.. వదల్లేక.. భక్తులకు నిమజ్జనం టెన్షన్ ఇదిలా ఉండగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారైన వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సోమవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులను సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సీఎం కేసీఆర్ వారిని ఆదేశించారు. చదవండి: TS High Court:హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలని పురాణాల్లో చెప్పారా? -
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలని పురాణాల్లో చెప్పారా?
దేవుడు పెట్టమన్నాడా... తనకు భారీ విగ్రహాలు పెట్టాలని, అవి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినవే ఉండాలని వినాయకుడు కోరుకోడు. దేవుడి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేయాలని పురాణాల్లో ఎక్కడా పేర్కొనలేదు. జీహెచ్ఎంసీ చట్టంలోనే జల కాలుష్యం జరగకుండా చూడాలని ఉంది. ఈ చట్టం వచ్చి 66 ఏళ్లు అయ్యింది. అయినా ఇప్పటికీ విగ్రహాల నిమజ్జనం పేరుతో కాలుష్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం ట్యాంక్ బండ్ వైపు చేపట్టరాదని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ ఉత్త ర్వులను సవరించాలంటూ జీహెచ్ఎంసీ వేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టేసింది. నిమజ్జనంపై ఆదేశా లను సవరించాలని జీహెచ్ఎంసీ తరఫున రివ్యూ పిటిషన్ వేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్ నివేదించారు. ఇప్ప టికే ట్యాంక్‌బండ్‌పై భారీ క్రేన్ లను ఏర్పాటు చేశామని, బేబీ పాండ్స్‌లో భారీ విగ్రహాలను నిమజ్జనం చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఈ ఏడాదికి ట్యాంక్‌బండ్ వైపు నిమజ్జనానికి, అలాగే పీవోపీ విగ్రహాల నిమజ్జనం చేసేందుకు అనుమతించాలని కోరారు. నిమజ్జనం పూర్తయిన 24 గంటల్లో వ్యర్థపదార్థాలను తొలగిస్తామని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై అనుమతించకపోతే వేలాది విగ్రహాల నిమజ్జనానికి ఆరు రోజుల సమయం పడుతుందని, అలాగే నెక్లెస్‌రోడ్, ఇతర మార్గాల్లో ఇప్పటికిప్పుడు రబ్బర్ డ్యాం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని అభ్యర్థించారు. గతంలో జీహెచ్ఎంసీ దాఖలు చేసిన మూడు కౌంటర్లలో ఎక్కడా బేబీ పాండ్స్‌లో నిమజ్జనానికి ఇబ్బందులు ఉన్నాయని పేర్కొనలేదని ధర్మాసనం అభ్యంతరం వ్యక్తంచేసింది. తాము ఆదేశాలు జారీచేసిన తర్వాత ఇప్పుడు పొంతన లేని కారణాలు చెబుతున్నారని మండిపడింది. 2001లోనే స్పష్టమైన తీర్పు... ‘2001లో హైకోర్టు కాలుష్యాన్ని నియంత్రించాలని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. తర్వాత మరో ధర్మాసనం కూడా అదే తరహాలో తీర్పులో పేర్కొంది. 2020 జూన్‌లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పీవోపీ విగ్రహాలను నిషేధించాలని.. జల, శబ్ధ కాలుష్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ మార్గదర్శకాలు జారీచేసింది. దాదాపు ఏడాది ముందే సీపీసీబీ మార్గదర్శకాలు జారీచేసినా అమలు చేయకుండా ఇప్పుడు మినహాయింపులు కోరడం సరికాదు. జలాశయాలను కలుషితం చేస్తామంటే అనుమతించాలా? మేం చట్టాలను, హైకోర్టు తీర్పులను మాత్రమే అమలు చేయాలంటున్నాం. చట్టాలను ఉల్లంఘిస్తారా? అమలు చేస్తారా? అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ డబ్బు వృథాకు ఎవరు బాధ్యులు.. ‘ట్యాంక్‌బండ్ వైపు ఇటీవల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు నిమజ్జనానికి అనుమతిస్తే కొత్తగా వేసిన రెయిలింగ్, గార్డెన్స్, ఇతర లైటింగ్ దెబ్బతినే అవకాశం ఉంది. నిమజ్జనం ఉంటుందని తెలిసినా ఎందుకు అక్కడ అభివృద్ధి పనులు చేపట్టారు? ఇప్పుడు నిమజ్జనానికి అనుమతిస్తే అవన్నీ దెబ్బతిని తిరిగి నిర్మించాలి. మనం చెల్లించే పన్నుల ద్వారా ప్రభుత్వం ఈ పనులు చేపట్టింది. ఈ డబ్బు వృథాకు ఎవరు బాధ్యులు’అని ధర్మాసనం జీహెచ్ఎంసీ తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది. తమ ఆదేశాలను సవరించమని, అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేస్తూ జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్‌ను కొట్టేసింది. హుస్సేన్‌సాగర్‌లో ‘నిమజ్జనం’పై సుప్రీంకు.. సాక్షి, హైదరాబాద్: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారైన వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సోమవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులను సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సీఎం కేసీఆర్ వారిని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
Ganesh Idol Immersion: జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: గణేష్ నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. గతేడాది కూడా నిమజ్జనంపై ఇచ్చిన ఉత్తర్వులను పాటించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ వేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన జీహెచ్ఎంసీ.. అనుమతి కోరడం ఏంటని ప్రశ్నించింది. గణేష్ నిమ్మజ్జనంపై ఏ ఒక్క మినహాయింపు కూడా ఇవ్వలేమని, నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో జీహెచ్ఎంసీ సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తమ తీర్పును పునః పరిశీలించాలని జీహెచ్ఎంసీ కోరింది. హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తేయాలని పిటిషన్లో జీహెచ్ఎంసీ పేర్కొంది. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరింది. హుస్సేన్‌సాగర్‌లో రబ్బర్ డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులను సవరించాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని జీహెచ్ఎంసీ పేర్కొంది. చదవండి: హైదరాబాద్: వినాయక విగ్రహాల నిమజ్జనం ఎక్కడ? -
హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనం ఎక్కడ అనే అంశంపై గందరగోళం నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు హుస్సేన్‌సాగర్‌లో వద్దంటూ మండప నిర్వాహకులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు హఠాత్తుగా ఆ ప్రక్రియను ఆపేశారు. మరోపక్క ఈ అంశంపై హైకోర్టులో ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింహైకోర్టు తమ తీర్పును పునః పరిశీలించాలని జీహెచ్ఎంసీ కోరింది.. ► వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనం ఏళ్లుగా హుస్సేన్‌సాగర్‌లో నిర్వహిస్తున్నారు. ఆ రోజు నగరంతో పాటు చుట్టు పక్కల కమిషనరేట్లు, జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విగ్రహాలు వస్తాయి. పోలీసు శాఖ గత వారం ట్రయల్ రన్ సైతం నిర్వహించింది. ►నేపథ్యంలో హుసేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పునరాలోచనలో పడ్డ పోలీసు విభాగం శనివారం రాత్రి 11 గంటలకు అన్ని పోలీసుస్టేషన్లకు దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ► హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో పోలీసుస్టేషన్లకు చెందిన సిబ్బంది తక్షణం రంగంలోకి దిగారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి వీలులేదంటూ నోటీసులు రూపొందించింది. వీటికి హైకోర్టు ఆదేశాల కాపీలను జత చేస్తూ మండపాల నిర్వాహకులు జారీ చేయడం ప్రారంభించింది. ► శనివారం రాత్రి కొన్ని మండపాల నిర్వాహకులకు అందించారు. అయితే ఆదివారం ఉదయం నోటీసుల జారీ ఆపాలంటూ ఆదేశాలు వచ్చాయి. ► హైకోర్టు ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్ వేయాలంటూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నోటీసులు జారీ ఆపేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆదివారం వరకు అవసరమైన సంఖ్యలో క్రేన్లను కూడా ఏర్పాటు చేయలేదు. ► గణేష్ నవరాత్రుల్లో మూడో రోజు నిమజ్జనాలు ప్రారంభమవుతాయి. ఆదివారం కొన్ని విగ్రహాలను నెక్లెస్ రోడ్లో ఉన్న బేబీ పాండ్‌లో చేపట్టారు. సోమవారం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసు విభాగం నిర్ణయించింది. ఈలోపు ప్రత్యామ్నాయంగా అవకాశం ఉన్న చెరువుల జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. -
నిమజ్జనంపై నియంత్రణ ఉండాలి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రానున్న వినాయకచవితిని పురస్కరించుకొని గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది. గణేశ్ మండపాల ఏర్పాటు మొదలు నిమజ్జనం వరకు నియంత్రణ చర్యలుండాలని, ఈ మేరకు ఆంక్షలు విధించాలని సూచించింది. మండపాలలో ఏర్పాటు చేసే లౌడ్‌స్పీకర్లతో శబ్దకాలుష్యం, విగ్రహాల నిమజ్జనం కారణంగా ఏర్పడే జలకాలుష్యంతో ఇతరులు ఇబ్బందిపడతారని, ఒకరి మతవిశ్వాసాల కోసం ఇంకొకరిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని తేల్చిచెప్పింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, మండపాల దగ్గర, నిమజ్జనం సమయంలో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్‌లో విగ్రహాల నిమజ్జనం ఎక్కడికక్కడ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదంటూ న్యాయవాది ఎం.వేణుమాధవ్ దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ‘భక్తులను నియంత్రించడం అంత సులభమేమీ కాదని మాకు కూడా తెలుసు, అయినా కోర్టు ఆదేశాలను చూపించి నియంత్రణ చర్యలు చేపట్టాలి’అని సూచించింది. మండపాల ఏర్పాటు మొదలు నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), పీసీబీ, గణేశ్ ఉత్సవ సమితి, పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది. 50 వేల విగ్రహాలు ఎలా సరిపోతాయి ? జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 50 వేల ఉచిత గణేశ్ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్ హైకోర్టుకు నివేదించారు. ఎవరికి వారు ఇంట్లోనే మట్టి వినాయకులను నిమజ్జనం చేసుకోవాలని సూచిస్తున్నామని తెలిపారు. ‘జంటనగరాల జనాభా ఎంత, మీరిచ్చే 50 వేల ఉచిత విగ్రహాలు ఎలా సరిపోతాయి, విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశాం, మన బాధ్యత అయిపోయిందని అనుకుంటే ఎలా’అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో భారీ విగ్రహాలు ఏర్పాటు చేయకుండా, మట్టివిగ్రహాలను ఏర్పాటు చేసేలా చూడాలని, సహజ రంగులనే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. అన్ని విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 16 ప్రత్యేక నీటికొలనులను నిర్మించారని, అయినా వాటిని వినియోగించుకోకుండా మెజారిటీ విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తున్నారని తెలిపారు. పీసీబీ ఏం చేస్తోంది ? ‘హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అనేక సూచనలు చేసింది. వాటి అమలు తీరును పర్యవేక్షించడం మరిచింది. పీసీబీ సూచనలను ఇతర విభాగాల అధికారులు పాటించకపోతే వారిపైనా చర్యలు తీసుకోవచ్చు. అయినా ఎందుకు మౌనంగా ఉంటోంది’’అని పీసీబీ తరఫున హాజరైన న్యాయవాది శివకుమార్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. హుస్సేన్‌సాగర్ ఒకప్పుడు కాలుష్య రహితంగా ఉండేదని, నిమజ్జనంతో కాలుష్య కాసారంగా మారిందని పేర్కొన్నారు. మండపాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చే సమయంలోనే సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేసేలా నిర్వాహకులకు తెలియజేయాలని సూచించింది. చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం అన్న చోరీ -
హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు విచారణ
-
హుస్సేన్‌సాగర్‌ని డంపింగ్ సాగర్‌గా మార్చారు..
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను స్వచ్ఛమైన జలాలతో నింపాలన్న సర్కారు సంకల్పం కాగితాలకే పరిమితమవుతోంది. తాజాగా బహుళ అంతస్తుల సెక్రటేరియేట్ భవనాల కూల్చివేత ద్వారా వచ్చిన సుమారు రెండు లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాలను సాగర్‌లో డంపింగ్ చేశారంటూ పలువురు పర్యావరణ వేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో సాగరమథనంపై అందరి దృష్టి మళ్లింది. కాగా స్వచ్ఛ సాగర్‌గా మార్చేందుకు గత దశాబ్దకాలంగా చేసిన వరుస ప్రయోగాలు ఆశించిన మేర సత్ఫలితాలివ్వకపోవడంతో మిషన్ గాడి తప్పిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దశాబ్దకాలంగా సాగర ప్రక్షాళనకు సుమారు రూ.326 కోట్లు ఖర్చుచేసినా ఫలితం శూన్యమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. వ్యర్థాల డంపింగ్‌పై ఎన్జీటీలో పిటీషన్.. పాత సచివాలయం భవనాల కూల్చివేత ద్వారా వచ్చిన రెండు లక్షల టన్నుల ఘన వ్యర్థాలను అధికారులు వేరొక చోటుకు తరలించినట్లు చెబుతున్నా..అవన్నీ హుస్సేన్‌సాగర్‌లో కలిపేశారని, దీంతో సాగర్ 35 మీటర్ల మేర కుంచించుకుపోయిందని ఆరోపిస్తూ సేవ్ అవర్ అర్బన్ లేక్స్ సంస్థ కన్వీనర్, పర్యావరణ వేత్త లుబ్నాసర్వత్ జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో పిటీషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. దీనిపై సెప్టెంబరు 7న సమగ్ర విచారణ జరగనున్నట్లు ఆమె తెలిపారు. డంపింగ్‌పై వాస్తవాలు బయటపెట్టాలి: లుబ్నా సర్వత్ సచివాలయ కూల్చివేత వ్యర్థాలను హుస్సేన్ సాగర్‌లో కలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఎన్జీటీకి సమర్పించాం. ప్రభుత్వం ఈ విషయంలో వాస్తవాలు బయటపెట్టాలి. అందమైన హుస్సేన్ సాగర్‌ను ఇలా డంపింగ్ లేక్‌గా మార్చడం ఏమాత్రం సబబు కాదు. ఆస్ట్రియాలోని డాన్యుబ్ నది తరహాలో ప్రక్షాళన అవసరం సుమారు 900 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన హుస్సేన్‌సాగర గర్భంలో దశాబ్దాలుగా సుమారు 40 లక్షల టన్నుల ఘనవ్యర్థాలు పోగుపడినట్లు అంచనా. ప్రభుత్వం గత దశాబ్దకాలంగా సుమారు 5 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించినట్లు సమాచారం. మిగిలిన 35 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు సాగర గర్భంలోనే మిగిలిపోయాయి. ఈ ఘన వ్యర్థాలను కూడా డాన్యుబ్ నది తరహాలో ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో తొలగించి మందమైన హెచ్డీపీఈ పైపుల్లో నింపి సాగరం చుట్టూ కట్టలా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆస్ట్రియా నిపుణుల సహకారం, సాంకేతికతతో మాత్రమే ఈ పనులు చేయగలుగుతారని..ప్రస్తుతం మన వద్ద అందుబాటులో ఉన్న విధానాలతో అట్టడుగున ఉన్న ఘన వ్యర్థాలను తొలగించడం సాధ్యపడదని స్పష్టంచేస్తుండడం గమనార్హం. సాగర మథనం సాగుతోందిలా.. ► ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు: 2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు ► 2014: రూ.56 కోట్లతో కూకట్పల్లి నాలా డైవర్షన్ పనులు ► 2015: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిది కాళ్ల ఎక్స్కావేటర్తో వ్యర్థాలు తొలగింపు. ► 2017: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్ కంపెనీ శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ వినియోగం. (ఈ ప్రయోగాన్ని ఉచితంగానే చేశారు) ► హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు దశాబ్దకాలంలో చేసిన వ్యయం: సుమారు రూ.326 కోట్లు చదవండి: ఇదేం రూల్ సారూ.. టులెట్ బోర్డుకు రూ.2 వేల జరిమానా! -
ట్యాంక్‌బండ్‌పై కలకలం: ఒకే రోజు ఐదుగురు మహిళలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ సందర్శకులను ఆకర్షిస్తుండగా ఇప్పుడు బలవన్మరణాలకు అడ్డాగా మారుతోంది. తాజాగా ఒకేరోజు ఐదుగురు హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే విధుల్లో ఉన్న లేక్ పోలీసులు వెంటనే స్పందించి వారిని కాపాడారు. భర్త వేధింపులు తాళలేక డిప్రెషన్‌తో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. మరో మహిళ ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి ప్రయత్నించగా, ప్రేమ విఫలమైందని ఓ యువతి సాగర్‌లో దూకేందుకు ప్రయత్నించింది. ఇక మద్యానికి బానిసైన ఓ మహిళ కుటుంబ సమస్యలతో కూడా బాధపడుతుండడంతో హుస్సేన్‌సాగర్‌లో దూకింది. ఆత్మహత్యలు నివారించేందుకు అక్కడే గస్తీ కాస్తున్న లేక్ పోలీసులు వారిని వెంటనే కాపాడారు. గజ ఈతగాళ్ల సాయంతో సాగర్‌లో వారిని గాలించి బయటకు తీసుకున్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారిని లేక్ పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒకే రోజు ఐదుగురు మహిళలు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం హైదరాబాద్‌లో కలకలం రేపింది. -
Photo Feature: క్లీన్ హుస్సేన్ సాగర్.. స్పీడ్ వ్యాక్సినేషన్
ప్రాణహిత నీటిని ఎత్తిపోస్తుండటంతో సరస్వతీ బ్యారేజీకి జలకళ సంతరించుకుంది. సీజన్ మొదలు కావడంతో వ్యవసాయం పనుల్లో రైతులు బిజీ అయిపోయారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌ను పరిశుభ్రం చేసేందుకు.. సాగర్ పరిసరాల్లో పచ్చదనం పెంచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా స్పీడ్‌గా కొనసాగుతోంది. మరిన్ని ‘చిత్ర’ విశేషాల కోసం ఇక్కడ చూడండి. -
Hussain Sagar: హుస్సేన్‌సాగర్‌లో కరోనా కలకలం..!
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ జలాల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. నాచారం పెద్ద చెరువు, కూకట్పల్లి ప్రగతినగర్‌లోని తుర్క చెరువు జలాల్లోనూ వైరస్ ఉనికి ఉన్నట్లు తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ జలాశయాలు మినహా నగర శివార్లు, గ్రేటర్‌కు వెలుపల ఉన్న పలు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో వైరస్ ఆనవాళ్లు లేకపోవడం విశేషం. అయితే కరోనా వైరస్ నీటి ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ (గజియాబాద్)కు చెందిన పరిశోధకుల ఆధ్వర్యంలో ఈ అధ్యయనం సాగింది. నివాస సముదాయాల నుంచి వెలువడుతున్న మురుగు నీరు చేరుతున్న చెరువులపై పరిశోధన చేశారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువులపై దృష్టి సారించారు. అయితే హుస్సేన్‌సాగర్, నాచారం పెద్ద చెరువు, తుర్క చెరువుల్లో చేరుతున్న మురుగు నీటిలోనే సార్స్ సీవోవీ–2 (కోవిడ్) ఉనికి బయటపడింది. ప్రధానంగా మానవ విసర్జితాల చేరికతోనే ఈ వైరస్ ఉనికి ఉన్నట్లు తేల్చారు. అయితే నగరానికి వెలుపల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని చెరువుల్లో వైరస్ లేదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. కాగా, మురుగు నీరు కలిసిన చెరువుల్లో కోవిడ్ వైరస్ ఆర్ఎన్ఏ బాగా వృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు. ఈ జలాశయాల్లో తొలి, సెకండ్ వేవ్ సమయంలో వైరస్ లోడ్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. హుస్సేన్‌సాగర్‌లో ఇలా.. హుస్సేన్‌సాగర్ జలాశయంలోకి కూకట్పల్లి, ఫాక్స్‌సాగర్ తదితర నాలాల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థజలాలే అధికంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ జలాల్లో కోవిడ్ వైరస్ ఉనికి బయటపడింది. మరోవైపు తుర్క చెరువు, నాచారం పెద్ద చెరువుల్లోనూ సమీప గృహ, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థ జలాలు శుద్ధి లేకుండానే చేరుతున్నాయి. దీంతో వైరస్ భారీగా ఉన్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. నేరుగా తాకితేనే వైరస్ హుస్సేన్‌సాగర్, నాచారం పెద్ద చెరువు, తుర్క చెరువుల్లో కోవిడ్ వైరస్ ఉనికి బయటపడినా.. ఈ నీటిని నేరుగా తాకడం, బట్టలు ఉతకడం వల్ల వైరస్ బారిన పడే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. సాధ్యమైనంత మేరకు ఈ జలాశయాల నీటిని చేతితో తాకకూడదని హెచ్చరిస్తున్నారు. మా దృష్టికి రాలేదు: హెచ్ఎండీఏ హుస్సేన్‌సాగర్ నీటిలో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని పేరు చెప్పేందుకు ఇష్టపడని హెచ్ఎండీకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. సీసీఎంబీ, ఐఐసీటీ పరిశోధకుల బృందం విడుదల చేసిన అధ్యయన వివరాలను హెచ్ఎండీఏకు సమర్పించలేదని పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్ సంరక్షణ, నీటిలో ఆక్సిజన్ మోతాదు పెంచేందుకు హెచ్ఎండీఏ విశేషంగా కృషి చేస్తోందని చెప్పారు. -
సాగర్ తీరం.. ఆనందవిహారం
-
ప్రమాదకరంగా హుస్సేన్‌సాగర్ నాలా..
ముషీరాబాద్: హుస్సేన్‌సాగర్ నాలాకు వరద పోటెత్తుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు పైనుంచి వరదనీరు వచ్చిచేరడంతో హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. దీంతో ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ నీటిమట్టం 513 అడుగులకు చేరుకుంది. ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా ఉన్న మారియెట్ హోటల్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి నీరు దిగువకు గతంలో కంటే అధికంగా హుస్సేన్‌సాగర్ నాలాకు వచ్చిచేరుతోంది. దీంతో ప్రవాహ ఉధృతి పెరిగింది. సోమవారం కూడా ఇలాగే వర్షం కురిస్తే ప్రవాహ ఉధృతి మరింత పెరిగి ఇళ్లల్లోకి వరదనీరు వచ్చి చేరుతుందని హుస్సేన్‌సాగర్ నాలా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (సిటీ పోలీసు హై అలర్ట్!) ముఖ్యంగా ఎరుకల బస్తీ, బీఎస్ నగర్, మారుతీనగర్, అరుంధతీ నగర్, సబర్మతినగర్, బాపూనగర్, అశోక్‌నగర్, లంకబస్తీ, మున్సిపల్ క్వార్టర్స్, దోభీగల్లీ తదితర ప్రాంతాలలో నివసించే పేద ప్రజలకు వరద పొంచి ముప్పు ఉంది. కాగా హుస్సేన్‌సాగర్ నాలాకు ఇరువైపులా రిటైనింగ్‌వాల్ నిర్మిస్తామని ప్రతి ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు హామీలు ఇస్తున్నారే కానీ గెలిచిన తరువాత దాని ఊసే ఎత్తడంలేదు. ఇక గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తంగా ఉండాలని, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించినా ముషీరాబాద్ మండలాధికారులు మాత్రం స్పందించిన దాఖలాలులేవు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్ హుస్సేన్‌సాగర్ నాలా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆదివారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ నాలా పరివాహక ప్రాంతాలు గోశాల, అరుంధతినగర్, లింక్బ్రిడ్జ్, వైశ్రాయ్‌హోటల్ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాలా పరివాహక ప్రాంత బస్తీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని పరిశీలించి ప్రజలకు తగు సూచనలు అందించాలని ఆదేశించారు. -
మూసీ నదిని శుద్ధి చేస్తామని ప్రగల్భాలు
సాక్షి, హైదరాబాద్: మూసీనదిని ప్రక్షాళన చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ సైతం.. మూసీ నదిని సబర్మతి నదిలా శుద్ధి చేస్తామని ప్రగల్భాలు పలుకుతారే తప్ప, ఆచరణలో కార్యరూపం దాల్చడానికి ప్రయత్నించరని ఎద్దేవా చేశారు. హైద్రాబాద్‌కు మంచి నీరందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను కబ్జాలను అడ్డుకోవటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇక హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు రూ. 3వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం 3రూపాయలు కూడా ఖర్చు చేయలేదంటూ ఆరోపించారు. 2001లో అప్పటి వాజపేయి ప్రభుత్వం నదుల ప్రక్షాళనకు నిధులను కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు పక్కదారి పట్టించాయని పేర్కొన్నారు. బాపు ఘాట్ దగ్గర కూడా మూసీ దుర్గంధంగా మారటం బాధాకరమన్నారు. తాగు, సాగునీరు అందించే మూసీ దుర్గంధంగా మారడంతో పాటు నది పరివాహక ప్రాంతంలో పండిన కూరగాయలు సైతం విషతుల్యం అవుతున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. హైద్రాబాద్‌ను విశ్వనగరంగా మార్చుతామని.. చివరకు విషాద నగరంగా మార్చారంటూ దుయ్యబట్టారు. ముడుపులు తీసుకుని పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను హుస్సేన్ సాగర్‌లో వదలడంతో డ్రైనేజీ నీరు కలిసి కంపుగా మారిందని తెలిపారు. హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీరుగా మారుస్తామన్న కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయని, సీఎం కేసీఆర్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పారు. చదవండి: (మూసీపై ప్రభుత్వం ప్రగల్భాలు) -
అదృశ్యమైన యువతి ట్యాంక్‌బండ్‌లో శవమై..
సాక్షి, అడ్డగుట్ట : తుకారాంగేట్‌లో అదృశ్యమైన యువతి హుస్సేన్ సాగర్‌లో శవమై తేలింది. గాంధీ మార్చురీలో భద్రపరిచిన యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఆలస్యంగా గుర్తించడంతో వారికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే బుద్ధానగర్‌కు చెందిన అంజయ్య కుమార్తె రాణి(18) వెస్ట్‌మారేడ్‌పల్లిలోని వెస్లీ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. గత నెల 21న కాలేజీకి వెళ్లిన రాణి తిరిగి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో గత నెల 22న తుకారాంగేట్ పోలీస్‌స్టేసన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 23న హుస్సేన్ సాగర్‌లో మృతదేహం.... హుస్సేన్ సాగర్‌లో 23న గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం రాంగోపాల్‌పేట్ పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీలో భద్రపరిచారు. మరుసటిరోజు పేపర్లో వార్త చూసిన తుకారాంగేట్ పోలీసులు ఆమె కుటుంబసభ్యులను మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాన్ని చూపించారు. అయితే మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండడంతో వారు గుర్తు పట్టలేకపోయారు. అయితే, రోజులు గడుస్తున్నా మృతురాలి ఆచూకీ తెలియకపోవడంతో మరోసారి మృతదేహాన్ని పరిశీలించాలని పోలీసులు అంజయ్య కుటుంబ సభ్యులకు సూచించారు. సోమవారం గాంధీ మార్చురీకి వచి్చన వారు పుట్టు మచ్చలు, పట్టీల ఆధారంగా మృతురాలు రాణిగా గుర్తించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. రాణి మృతదేహం.. రాణి(ఫైల్) -
హైదరాబాద్ : కన్నుల పండుగ నిమజ్జనోత్సవం
-
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ వినాయకుడు
-
హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనం సందడి
-
హుస్సేన్‌సాగర్ కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: గణేష్ విగ్రహాల నిమజ్జనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అంజనీకుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11 వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి వరకు ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ♦ కర్బాలామైదాన్ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ మీదికి అనుమతించరు. వీటిని కవాడిగూడ చౌరస్తా వైపు పంపిస్తారు. లిబర్టీ వైపు వెళ్ళాల్సిన వారు కవాడిగూడ చౌరస్తా, గాంధీనగర్ టి జంక్షన్, డీబీఆర్ మిల్స్, ఇందిరాపార్క్, దోమలగూడ మీదుగా వెళ్ళాలి. ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్ళాల్సిన వారు రాణిగంజ్, నల్లగుట్ట, సంజీవయ్యపార్క్, నెక్లెస్‌రోడ్, ఖైరతాబాద్ ఫ్లైవర్ మార్గాన్ని అనుసరించాలి. ♦ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను ఎన్టీఆర్ మార్గ్‌లోకి అనుమతించరు. వీటిని నెక్లెస్‌రోడ్ లేదా మింట్ కాంపౌండ్ వైపు పంపిస్తారు. ♦ తెలుగుతల్లి విగ్రహం జంక్షన్ నుంచి సాధారణ వాహనాలను ఎన్టీఆర్ మార్గ్‌లోకి అనుమతించరు. వీటిని ఇక్బాల్ మీనార్ వైపు పంపిస్తారు. సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ దేవాలయం, డీబీఆర్ మిల్స్, చిల్డ్రన్స్ పార్క్, సెయిలింగ్ క్లబ్, కర్బాలా మైదాన్ మీదుగా మళ్లిస్తారు. ♦ గోశాల వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే వాహనాలను డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా పంపిస్తారు. -
నిఘా సాగర్
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ పర్యాటక ప్రాంతంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న హుస్సేన్ సాగర్‌ను సందర్శించనిదే దేశీ, విదేశీ పర్యాటకులు తిరిగి వెళ్లరు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఈ ప్రాంతాన్ని సకుటుంబ సమేతంగా సందర్శించడంతో పాటు సాగర్‌లో బోటింగ్ చేసి, బుద్ధ విగ్రహన్ని దర్శించుకుంటుంటారు. దేశంలోనే అత్యధిక మంది సందర్శకులు వస్తున్న ప్రాంతాల్లో ఒకటిగా పేరొందిన ‘హుస్సేన్‌సాగర్’ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఆథారిటీ(బీపీపీఏ) అధికారులు చర్యలు చేట్టారు. ఇటీవల బీపీపీఏ ఓఎస్డీగా అదనపు బాధ్యతలు చేపట్టిన హెచ్ఎండీఏ కార్యదర్శి రాంకిషన్ ఆధ్వర్యంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఆథారిటీ కింద ఉండే ప్రాంతాల్లో సరికొత్త మార్పును తీసుకొచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే హెర్బల్ పార్కు, బటర్‌ఫ్లై పార్కు, రోజ్ గార్డెన్, జాతీయ జెండా తదితర ప్రాంతాలన్నింటిని కలిపి సంజీవయ్య పార్కును పిల్లల ఉద్యానవనంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే పర్యాటకులు, ప్రజల భద్రతను పరిగణనలోకి తీసుకున్న రాంకిషన్.. సాగర్ చుట్టూ రూ.3 కోట్ల వ్యయంతో 250 సీసీటీవీ కెమెరాలు బిగించాలని నిర్ణయించారు. ఏ ప్రాంతంలో ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోయేలా ఈ నిఘానేత్రాలు ఉపయోగపడనున్నాయి. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ సిబ్బంది కూడా ఏయే ప్రాంతాల్లో కెమెరాలు బిగించాలనే దానిపై బీపీపీఏ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గణేశ్ నిమజ్జనం తర్వాత కెమెరాల బిగింపు పనులను వేగవంతం చేయనున్నారు. అందరి భద్రత కోసం ఏర్పాట్లు సాగర్.. దాని చుట్టు పక్కల ప్రాంతాలఅభివృద్ధి కోసం 2000 డిసెంబర్ 12నబుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఆథారిటీ(బీపీపీఏ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హెచ్ఎండీఏలో ప్రత్యేక విభాగమైన బీపీపీఏ 902 హెక్టార్లలో విస్తరించి ఉంది. దీనికింద లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, పీవీ జ్ఞాన్ భూమితో పాటు హుస్సేన్ సాగర్ కూడా ఉంది. ఈ ప్రాంతాలను వారంలో తక్కువలో తక్కువగా లక్ష మంది సందర్శిస్తుంటారు. అయితే సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉన్న హుస్సేన్ సాగర్‌లో అడపదడపా అపశ్రుతులు చోటుచేసుకోవడం సర్వసాధారణమైంది. ప్రేమజంటలు కూడా రెచ్చిపోయి అశ్లీలంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. దీనికితోడు కుటుంబ సమస్యలున్నవారు, జీవితంపై విరక్తి చెందిన వారు ఆత్మహత్యలు చేసుకునేందుకు సాగర్‌నే ఎంచుకుంటున్నారు. దీంతో ప్రజల భద్రతే ప్రామాణికంగా తీసుకొని 250 సీసీటీవీ కెమెరాలను బీపీపీఏ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో లంబినీపార్కులో బాంబు పేలుళ్లు జరిగిన ఉందంతం కూడా ఇప్పుడు సాగర్ చుట్టూ నిఘానేత్రాలు ఏర్పాటు చేయడానికి మరో కారణమని అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా వీఐపీ కదలికలు ఎక్కువగా ఉండటంతో పాటు వాహన రాకపోకలు కూడా అంతే స్థాయిలో ఉండే సాగర్ చుట్టూ కెమెరాలు త్వరితగతిన బిగించే దిశగా చర్యలు చేపట్టారు. లేక్ పోలీసులు కూడా సాగర్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించేవారిని దూకి మరీ రక్షిస్తున్న కొన్ని సందర్భాల్లో కొందరి ప్రాణాలు పోయిన ఘటనలున్నాయి. ఈ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు లేక్ పోలీసుల పనిని తగ్గిస్తుందని బీపీపీఏ అధికారులు చెబుతున్నారు. ఈ 250 సీసీటీవీ కెమెరాలను బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు లేక్ పోలీస్ స్టేషన్‌కు కూడా అనుసంధానించనున్నట్టు చెబుతున్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్టుకు ఇది దోహదపడుతుందని అంటున్నారు. -
ఈ పార్కులో వారికి నో ఎంట్రీ
సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్ సాగర్ తీరాన 92 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సంజీవయ్య పార్కు ఇక నుంచి సంజీవయ్య చిల్డ్రన్ పార్కుగా మారనుంది. ఇన్నాళ్లు ప్రేమపక్షుల సందడితో ఉన్న ఈ పార్కులో వారికి ప్రవేశమే లేకుండా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరానికి వచ్చిన ఇతర రాష్ట్రాలు, దేశాల సందర్శకులు సాగర్ తీరాన ఉన్న ఈ పార్కును సందర్శిస్తుండటం, అలాగే పిల్లలతో కలిసి వచ్చిన కుటుంబ సభ్యులకు ఇక్కడ ప్రేమ జంటలు చేసే చేష్టలపై బీపీపీఏ అధికారులకు ఫిర్యాదులు పోటెత్తడంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే ఈ పార్కులోకి రోజూ వస్తున్న జంటలు వందల సంఖ్యలో ఉంటున్నాయి. వీరి ప్రవర్తన శృతిమించి తార స్థాయికి వెళ్లడమే కాదు పోలీసు స్టేషన్ల వరకు వెళ్లిన ఫిర్యాదులు అధికారుల్లో మార్పు తీసుకొచ్చింది. ఇన్నాళ్లూ కేవలం ఆదాయం కోసమే ఈ పార్కులో ఏం జరిగినా చూసీచూడనట్టు వ్యవహరించిన అధికారులు ఇటీవల బీపీపీఏ ఓఎస్డీగా రాంకిషన్ బాధ్యతలు చేపట్టడంతో అనివార్యంగా మార్పు కనిపించింది. సంజీవయ్య పార్కుతో పాటుగా హెర్బల్ పార్క్, బటర్ ఫ్లై పార్కు, రోజ్ గార్డెన్, జాతీయ జెండా తదితర ప్రాంతాలన్నింటిని కలిపి సంజీవయ్య పిల్లల ఉద్యానవనంగా మారిస్తే బాగుంటుందన్న ఆయన ప్రతిపాదనను హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ ముందుంచడంతో పచ్చజెండా ఊపారు. పిల్లల్లో సైన్స్‌పై ప్రాక్టికల్‌గా అవగాహన కలిగించేందుకు ఇది ఎంతో దోహదం కానుంది. ఇక ఎడ్యుకేషనల్ హబ్‌గా పార్క్... న్యూఢిల్లీలో ఇండియాగేట్ వే దగ్గర ఉన్న చిల్డ్రన్ పార్క్ తరహాలోనే సంజీవయ్య పార్కును చిల్డ్రన్ పార్కుగా మార్చి విద్యార్థుల్లో పర్యావరణంపై మెళకువలు పెంచేవిధంగా బీపీపీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సంÜజీవయ్య పార్కుతో పాటుగా హెర్బల్ పార్క్, బటర్ ప్లై పార్కు, రోజ్ గార్డెన్, జాతీయ జెండా తదితర ప్రాంతాలన్నింటిని కలిపి సంజీవయ్య పిల్లల ఉద్యానవనంగా మార్చారు. కేవలం 14 ఏళ్లలోపు ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రులు లేదంటే సంరక్షకులతో వస్తేనే ఎంట్రీ ఉంటుందని, 14 ఏళ్లలోపు దాటినవారికి ప్రవేశం ఉండదని హెచ్ఎండీఏ కార్యదర్శి, బీపీపీఏ ఓఎస్డీ రాంకిషన్ బుధవారం తెలిపారు. గురువారం నుంచే ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10 ఎంట్రీ ఫీజును వసూలుచేస్తున్నామని, ఇక నుంచి పిల్లలతో వచ్చే వారికి కూడా రూ.10 ఎంట్రీ ఫీజు ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బృందంగా వస్తే ప్రవేశం ఉచితంగా కల్పిస్తాం. విద్యార్థుల్లో మరింత విజ్ఞానాన్ని పెంచేందుకు లాభాపేక్షలేకుండా ఈ పార్కును నిర్వహిస్తాం. సైన్సు పట్ల పిల్లల్లో మరింత జిజ్ఞాస పెంచే విధంగా ఈ పార్కును తీర్చిదిద్ది ముఖ్యంగా విద్యార్ధులు, అధ్యాపకులను ఆకర్శించేందుకు చర్యలు చేపట్టాం. అలాగే ఈ ఉద్యానవనంలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం నిషేధించడంతో పాటు, పచ్చదనం–పరిశుభ్రత పట్ల విద్యార్ధుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు ఉంటాయి. బయటి తినుబండారాలను లోనికి అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నామ’ని రాంకిషన్ తెలిపారు. అయితే ప్రస్తుతం రోజుకు 1500 మంది సందర్శకులు వస్తున్నారని గురువారం నుంచి ఈపార్కును పిల్లల కేంద్రంగా మార్చడం వల్ల కొంత ఆదాయంతగ్గినా ఫర్వాలేదని, విద్యార్థుల్లో సైన్స్‌పెంచడమే తమ ప్రాధాన్యత అనిరాంకిషన్ అన్నారు. -
షికారు.. సరికొత్తగా..
సాక్షి, హైదరాబాద్: సాగర్ అలలపై సరికొత్త పయనం.సాయం సంధ్య వేళల్లో చల్లగాలుల నడుమ ఆహ్లాదకరమైన అనుభూతి. ఇంటిల్లిపాదీ కలిసి చేసుకొనే వేడుకలు, విందు, వినోదాలకు అనువైన బోటు షికార్లు హుస్సేన్‌సాగర్‌లో అందుబాటులో కి వచ్చాయి. ఒకేసారి పది మంది నుంచి 35 మంది వరకు కలిసి పయనించే రెండు అందమైన డీలక్స్ ఫ్యామిలీ స్పీడ్ బోట్లను తెలంగాణ పర్యాటకాభివృద్ధి తాజాగా ప్రవేశపెట్టింది. త్వరలో వీటిని ప్రారంభించనున్నారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలు, స్నేహితులతో కలిసి చేసుకొనే పార్టీలకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి. కొద్ది రోజుల క్రితమే వీటిని పుణే నుంచి తెప్పించారు. ఒకటి, రెండు రోజుల్లో డీలక్స్ స్పీడ్ బోట్ల సేవలు అందుబాటులోకి వస్తాయని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ఈ రెండు డీలక్స్ బోట్లతో పాటు ఒకేసారి 80 మందితో ప్రయాణించేందుకు అనువైన మరో ‘ క్యాటమెరిన్ పాంటమ్’ బోట్‌ను కూడా పుణే నుంచి తెప్పించారు. అన్ని హంగులతో సిద్ధమవుతున్న ఈ ఓపెన్‌టాప్ బోట్ సాగర్ అలలపై పరుగులు పెడుతూ పర్యాటకలకు చక్కటి అనుభూతిని అందించనుంది. 90 హార్స్పవర్ విద్యుత్ సామర్థ్యంతో నడిచే ఇంజిన్లను ఈ బోట్‌కు అమర్చారు. దీంతో అది చాలా వేగంగా పరుగెడుతుందని హుస్సేన్‌సాగర్ బోట్స్ యూనిట్ మేనేజర్ సంపత్ తెలిపారు. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్‌రావు ప్రత్యేక శ్రద్ధ, చొరవతో ఈ అత్యాధునిక బోటింగ్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. 2 డీలక్స్ ఫ్యామిలీ బోట్లు, క్యాటమెరిన్ పాంటమ్ బోట్లతో పాటు, కొత్తగా 150 మంది ప్రయాణించే సదుపాయం ఉన్న ఫ్లోటింగ్ జెట్టీలు కూడా సాగర్‌లో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రద్దీకి అనుగుణంగా బోట్లు... ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌లో ఒకేసారి 60 మందితో ప్రయాణించ గలిగే గౌతమి, లుంబిని, కోహినూర్,తదితర బోట్లతో పాటు 100 మందిని తీసుకు వెళ్లే భగీరథ, భాగమతి క్రూయిజ్ బోట్లు ఉన్నాయి. మరో 6 స్పీడ్ బోట్లు సైతం పరుగులు తీస్తున్నాయి. కొత్తగా ప్రారంభం కానున్న డీలక్స్ ఫ్యామిలీ బోట్లతో స్పీడ్ బోట్ల సంఖ్య పెరగనుంది. చుట్టూ అద్దాలతో, పసుపు, తెలుపు రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా రూపొందించిన డీలక్స్ బోట్లు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. నగరానికి వచ్చే సందర్శకులు బుద్ధ విగ్రహాన్ని సందర్శించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు... ప్రతి రోజు సగటున 5000 మంది పర్యాటకులు లుంబిని పార్కును సందర్శించి బోట్ షికారుకెళ్తున్నారు. శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఈ సంఖ్య 8,000 నుంచి 10,000 వరకు ఉంటుంది.గత ఏడాది మే చివరి నాటికి 1.67 లక్షల మంది బుద్ధ విగ్రహాన్ని సందర్శించగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 1.53 లక్షల మంది సందర్శించుకున్నారు. గతేడాది రూ.97.64 లక్షల ఆదాయం లభించింది. ఈ ఏడాది రూ.93.49 లక్షలు లభించింది. గతేడాదితో పోల్చితే పర్యాటకుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. మరోవైపు పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సుమారు 600 లైఫ్జాకెట్లను అందుబాటులో ఉంచారు. 10 మంది గజఈతగాళ్లు ప్రతి క్షణం విధి నిర్వహణలో ఉంటారు. ఎలాంటి విపత్కరపరిస్థితినైనా సమర్ధంగా ఎదుర్కొనేందుకు తమ బృందం సిద్ధంగా ఉంటుందని యూనిట్ మేనేజర్ సంపత్ ధీమాను వ్యక్తం చేశారు. -
సాగరళ మథనం
రాష్ట్ర రాజధానిలో ప్రధాన పర్యాటక కేంద్రమైన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన సత్ఫలితాలనిస్తోంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పది నెలల క్రితం మొదలుపెట్టిన ‘బయో రెమిడేషన్’ ప్రక్రియతో సా‘గరళం’ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. డ్రైనేజీ, రసాయన వ్యర్థాలు నిండటంతో సాగర్‌లోంచి వెలువడుతున్న దుర్వాసనను బెంగళూరుకు చెందిన నాకాఫ్ సంస్థ కొంతమేర నియంత్రించగలిగింది. అడపాదడపా హుస్సేన్‌సాగర్ నుంచి దుర్వాసన వస్తున్నా పూర్తిస్థాయిలో నియంత్రణలోనే ఉండటంతోపాటు నీటిలో ఆక్సిజన్ శాతం పెరగడమే కాకుండా వ్యర్థ బ్యాక్టీరియాలు నశించడం సానుకూల సంకేతాలను ఇస్తోంది. హెచ్ఎండీఏ అధికారుల మార్గదర్శనంలో మరో ఆరు నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగితే పర్యాటకులు, నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దుర్వాసన పూర్తిస్థాయిలో దూరం కానుంది. 2దశల్లో..2పనులు హుస్సేన్‌సాగర్ విస్తరిత ప్రాంతంతోపాటు దుర్గంధం అధికంగా వచ్చే ప్రాంతాలపై నాకాఫ్ సంస్థ దృష్టి సారించింది. మొదటి దశలో ఐఎం సొల్యూషన్స్‌ను ట్యాంకర్ల ద్వారా హుస్సేన్‌సాగర్‌లో చల్లుతున్నారు. దీనివల్ల జలాశయంలోని వ్యర్థ బ్యాక్టీరియాలు నశించి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతోంది. రెండో దశలో బొకాషి బాల్స్‌ను జలాశయంలోకి వదలుతున్నారు. దీనివల్ల ఆ రసాయనాలు సాగర్ అడుగున ఉన్న బ్యాక్టీరియాలను తినేస్తున్నాయి. ఈ ప్రక్రియ కోసం పర్యాటకశాఖ నుంచి బోటును అద్దెకు తీసుకొని ‘బొకాషి బాల్స్’ను జలాల్లో వేస్తున్నారు. దీంతో చెడు బ్యాక్టీరియా తగ్గి నీటి నాణ్యతను పెంచే బ్యాక్టీరియా అభివృద్ధి చెందడమే కాకుండా ఆక్సిజన్ శాతం పెరుగుతోంది. తాజా పీసీబీ గణాంకాల ప్రకారం గతంలో శూన్య శాతంలో ఉన్న డిసాల్వ్డ్ ఆక్సిజన్ ఇప్పుడు 7.6 శాతం దాకా చేరుకుంది. ఈ ఏడాది సాగర్ పరిసరాల్లో దుర్గంధం అంతగా లేదని పర్యాటకులు చెబుతున్నారు. హెచ్ఎండీఏ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి అమెరికా పర్యటన ఉండటంతో ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ హుస్సేన్ సాగర్‌లో శనివారం పర్యటించి నాకాఫ్ సంస్థ పనితీరును మెచ్చుకున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు
ఖైరతాబాద్: వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూసారాంబాగ్ ప్రాంతానికి చెందిన మణికంఠ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం తన పుట్టిన రోజు కావడంతో స్నేహితులు వెంకట రమణయ్యశెట్టి, పవన్‌కుమార్, వత్సల్‌తో కలిసి ఐ–10 కారులో అర్ధరాత్రి ఎన్టీఆర్మార్గ్కు వచ్చి ఫొటోలు దిగారు. అనంతరం లుంబినీ పార్క్ వైపునకు వెళ్తుండగా ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో కారు అదుపు తప్పి హుస్సేన్‌సాగర్ వైపు దూసుకెళ్ళి ఇనుప గ్రిల్‌ను ఢీ కొని సాగర్‌లో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాహదారుల సమాచారంతో సైఫాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. -
వ్యర్థం..అనర్థం..
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో వినాయక నిమజ్జనం ముగిసింది. ఈ సారి హుస్సేన్‌సాగర్‌లో సుమారు 50 వేలు, శివార్లలో ఏర్పాటు చేసిన 40 నిమజ్జన కొలనులు, చెరువుల్లో మరో 35 వేల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్ఎంసీ, పీసీబీ విభాగాల అంచనా. దీంతో ఆయా జలాశయాలు కాలుష్యకాసారంగా మారుతున్నాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ సహా ఇతర జలాశయాల కాలుష్యం వల్ల కలిగే అనర్థాలపై ఆందోళన చెందుతున్నారు. హుస్సేన్‌సాగర్‌లో ఇలా.. గణేష్ నిమజ్జనంతో ఈ ఏడాది హుస్సేన్ సాగర్‌లోకి సుమారు 20 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 400 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ చేరినట్లు అంచనా. అయితే ఇందులో ఇనుము, కలప, తదితర ఘన వ్యర్థాలను బల్దియా ఎప్పటికప్పుడు తొలగించినప్పటికీ పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీటిలో కలిసిపోవడంతో సాగర్ మరింత గరళసాగరంగా మారనుంది. దీంతో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయలాజికల్ ఆక్సీజన్ డిమాండ్(బీఓడి) ప్రతి లీటరు నీటికి 100 పీపీఎంగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ రోజుల్లో ఇది 35 నుంచి 40 పీపీఎం మించదు. ఇక కెమికల్ అక్సీజన్ డిమాండ్ లీటరు నీటికి (సీఓడి) 200 పీపీఎంను మించే ప్రమాదం ఉంది. సాధారణ రోజుల్లో ఇది 80–100 పీపీఎం మించదు. దీనికితోడు జలాశయం నీటిలో ఆక్సీజన్ స్థాయి దారుణంగా పడిపోనుంది. ఇది ప్రతి లీటరు నీటిలో ‘సున్న’గా నమోదయ్యే ఆస్కారం ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారుచేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడంతో అందులోని హానికారక రసాయనాలు ఆయా జలాశయాల్లో చేరి పర్యావరణ హననం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హానికారక రసాయనాలు, మూలకాలివే.. రసాయన రంగుల అవశేషాలివే: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆౖMð్సడ్,రెడ్ లెడ్,క్రోమ్ గ్రీన్,పైన్ ఆయిల్,లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టర్పీన్ ,ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్నిష్. హానికారక మూలకాలు:కోబాల్ట్, మ్యాంగనీస్, డయాక్సైడ్, మ్యాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్,రెడ్ ఆర్సినిక్, జిక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా. జలాశయాల కాలుష్యంతో తలెత్తే అనర్థాలు.. ♦ ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతువుల మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. ♦ పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి,నీరు కలుషిత మౌతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ♦ ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను తిన్న వారి శరీరంలోకి హానికారక మూలకాలుచేరుతున్నాయి. ♦ మలేరియా,డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ♦ సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. ప్రత్యేక కొలనుల్లో నిమజ్జనం ఇలా.. నగరంలో చెరువులు కాలుష్యానికి గురికాకుండా ఉండేందుకు గణేష్ నిమజ్జనానికి ప్రత్యేకంగా నిర్మించిన 23 ప్రత్యేక నిమజ్జన కొలనులు మరో 17 చెరువుల్లో సుమారు 35 వేల విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు బల్దియా అధికారులు తెలిపారు. నెక్నాంపూర్ చెరువు కొలనులో 3,659, దుర్గం చెరువులో 3,608, మల్కం చెరువులో 2,584, రాజేంద్రనగర్ పత్తికుంట కొలనులో 2,667, కూకట్పల్లి రంగదామునిచెరువులో 3,214, కుత్బుల్లాపూర్ లింగంచెరువు పాండ్‌లో 2,012, అల్వాల్ కొత్త చెరువులో 2,234 విగ్రహాలను నిమజ్జనం జరిగినట్లు వారు వివరించారు. త్వరలో పీసీబీ కాలుష్య నివేదిక.. హుస్సేన్‌సాగర్ సహా నగరంలోని 17 ప్రధాన చెరువుల్లో గణేష్ నిమజ్జనానికి ముందు, నిమజ్జనం జరిగిన రోజులు, నిమజ్జనం పూర్తయిన తరవాత మూడు దఫాలుగా కాలుష్య నియంత్రణమండలి నీటి నమూనాలను సేకరించింది. వీటిని పీసీబీ ప్రయోగశాలలో పరీక్షించి త్వరలో నిమజ్జన కాలుష్యంపై నివేదిక విడుదల చేయనున్నట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. -
గంగమ్మ ఒడి చేరిన మహాగణపతి
-
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి
-
గంగమ్మ ఒడి చేరిన మహాగణపతి
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్యాహ్నం ఒంటిగంటలోపే గణపతి నిమజ్జనం పూర్తయింది. తొమ్మిది రోజుల పాటు అశేష భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా మహాగణపతి నిమజ్జనం కోనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరో నంబర్ క్రేన్ వద్ద శోభాయాత్ర చేరుకుంది. నగరంలో వైభవంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జనం అప్డేట్స్ ఇవి. టాంక్ బండ్‌కు చేరుకున్న బాలాపూర్ గణనాథుడు హుస్సేన్ సాగర్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు బారులు తీరిన గణనాధుల శోభాయాత్ర రథాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు 51,500 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగాయి. ఒక్క ట్యాంక్బండ్లోనే 16 వేల విగ్రహాల నిమజ్జనం కానున్నాయి. ట్యాంక్‌బండ్‌పై 29 క్రేన్లు, నెక్లెస్ రోడ్ మార్గంలో 9క్రేన్లు.. మొత్తం 38 క్రేన్ల ఏర్పాటు చేశాం. - దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలిస్తున్న వినాయకుడి విగ్రహాలతో ట్యాంక్ వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. ఎన్టీఆర్ మార్గ్‌లో వినాయకుడి విగ్రహాలు బారులు తీరాయి. నిర్విరామంగా కొనసాగుతున్న ఖైరతాబాద్ సప్త ముఖ కాలసర్ప మహాగణపతి శోభాయాత్ర.. ఇప్పటికే సెన్సేషన్ థియేటర్ దాటి వాసవీ అతిధిగృహం వరకు చేరుకున్న శోభా యాత్ర.. ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభం కావటం.. పెద్దగా భక్తులు రాకపోవటంతో నిమజ్జనం ఘాట్‌కు ప్రశాంతంగా సాగుతున్న శోభాయాత్ర.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మధ్యాహ్నం 12 గంటలలోపే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యే అవకాశం. నగరంలో వినాయక నిమజ్జనానికి ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సాయం అందిస్తోంది. నిమజ్జన ఊరేగింపు, ట్రాఫిక్ స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది. నగరంలో సాగుతున్న వినాయక శోభాయాత్ర వీఆర్ డీవోటీ యాప్ తిలకించవచ్చు. ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జనం కార్యక్రమాన్ని వీక్షించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉప రాష్ట్రపతి హోదాలో తొలిసారి నిమజ్జనం కార్యక్రమాన్ని వీక్షించనున్న వెంకయ్యనాయుడు. ఆయన రాక సందర్భంగా అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి హుస్సెన్‌సాగర్‌కు పెద్ద ఎత్తున గణనాథులు తరలివస్తున్నాయి. మొత్తం 200 క్రేన్లను ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో క్రేన్ వద్ద గంటకు 25 విగ్రహాలు నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో సాధారణ వాహనాలకు ప్రవేశం లేదని పోలీసులు తెలిపారు. నిమజ్జన రూట్లలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. -
వినాయక వీడ్కోలు!
-
జీహెచ్ఎంసీ అధికారులు వినూత్న ప్రచారం
-
వినూత్న ప్రచారం సరే.. ఇదేమీ నిర్లక్ష్యం?
సాక్షి, హైదరాబాద్ : ఓటర్లకు అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు వినూత్న ప్రచారం నిర్వమించారు. హుస్సేన్ సాగర్‌లో బోటు మీద ప్రయాణించి.. బుద్ధ విగ్రహం వద్దకు చేరుకున్న అధికారులు.. ఈ నెల 25వ తేదీ వరకు కొత్తవారు ఓటర్లుగా నమోదుచేసుకోవాలని, ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రచారం నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ వినూత్న ప్రచారంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సెఫ్టీ జాకెట్లు వేసుకోకుండానే ఓ ఐఏఎస్ అధికారితోపాటు 50 మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులు బోటులో ప్రయాణించారు. బోటులో సెఫ్టీ జాకెట్లు ఉన్నా.. వారు ధరించలేదు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రాణాల మీదకు చేటు తెచ్చే ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండి తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవాలని నిత్యం చెప్పే అధికారులే.. తమదాకా వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. -
షికారు.. మరింత హుషారు!
సాక్షి, హైదరాబాద్: అసలే వర్షాకాలం.. ఒకింత చలి.. ఒక్కోసారి ఉక్కపోత... కాంక్రీట్ జంగిల్లో ప్రజలు ఉండలేక రాజధాని నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ తీరానికి బారులు తీరుతున్నారు. పర్యాటకుల సరదాకు తగినట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ)అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న స్పీడు బోట్లు , సాంస్కృతికానందాన్ని పంచే ఖైరున్నీసా, భాగమతి బోట్లే కాక మరి కొన్నింటిని తీసుకువస్తున్నారు. బోటు షికారుకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ‘ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లు’తీసుకురానుండటంతో షికారుకే కొత్త హుషారు రానుంది. లుంబినీ పార్కు బోటింగ్ పాయింట్లో అంతర్జాతీయ ప్రమాణాలు సమకూరుతున్నాయి. ఆసక్తిగా ఎదురుచూస్తున్న పర్యాటకులు హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారు అంటే ఎవరికైనా హుషారు వస్తుంది. అందులో కొత్తగా వచ్చే ‘ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్ల’కు మరింత గిరాకీ రానున్నది. చూడటానికి బంగారు వర్ణంలో హుందాగా కన్పిస్తుండటంతో అందులో షికారుకు అందరూ మక్కువ చూపే అవకాశం ఉంది. శుక్ర, శని, ఆదివారాలు, ప్రత్యేక సెలవుదినాల్లో పర్యాటకులు ఇక్కడి బోట్లలో జలవిహారానికి ముచ్చటపడతారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ టైపు బోట్లు రెండు త్వరలో సాగర్‌లోకి ప్రవేశం చేయగానే వాటికి పేరు పెట్టాల్సి ఉంది. వేడుకలు... ఆనందమే... పుట్టిన రోజు, పెళ్లిరోజు వేడుకలు వంటి చిన్న కార్యక్రమాలు ఇందులో చేసుకునే వెసులుబాటు ఉంది. పార్టీల కోసం వీటిని అద్దెకు ఇస్తామని టీఎస్‌టీడీసీ అధికారులు చెబుతున్నారు. ఇవి హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. గతంలో ఉన్న ఖైరున్నీసా హోటల్ టైపులో ఉంటుంది. కానీ, ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లకు చుట్టూ గ్లాస్(అద్దం), పైన టాప్ కూడా గ్లాస్ అమర్చబడి ఉంటుంది. అంటే కింది భాగం తప్పా బోట్ అంతా అద్దంతో తయారు చేసి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా బస్సు టైపు బోట్లు దర్శనమిస్తాయి. విభిన్నంగా ప్రపంచంలో ఎక్కడా లేనట్లు సరికొత్తగా ఉండాలని టీఎస్‌టీడీసీ అధికారులు ప్రత్యేకంగా వీటిని తయారు చేయిస్తున్నారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోటు నమూనా రెండు విభిన్న రకాలు... విభిన్న రేట్లు.. సాగర్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లు మల్టీపర్పస్‌గా యూజ్ అవుతాయి. కుర్చీలు ఎటువైపు అయినా అమర్చుకొనే వెసులుబాటు ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఫిక్స్డ్ సీట్ల బోట్లు ఉంటాయి. ఇందులో పర్యాటకులు ఇంట్లో ఉన్నట్లు అనుభూతి పొందుతారు. నచ్చిన చోట, నచ్చిన వైపు సీట్లు వేసుకొని కూర్చొనే వెసులుబాటు ఉంటుంది. దీనికి పెద్ద ఇంజన్లు ఉండవు. అవుట్ బోర్డు మోటార్స్ –2 అమర్చి ఉంచుతారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లు రెండు రకాలున్నాయి. ఒకదానిలో 32 నుంచి 50 సీట్లు, రెండోది 80 నుంచి 100 సీట్లు ఉంటాయి. ఇందులో నదిలో విహరిస్తున్నట్లు ఉంటుంది. వీటి విలువ రూ.కోటి నుంచి రెండు కోట్ల వరకు ఉంటుంది. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. అందుబాటులో ఉన్న బోట్లు ఇవే... హుస్సేన్‌సాగర్‌లో చిన్నవి, పెద్దవి మొత్తం 17 బోట్లు ఉన్నాయి. మరో ఐదు రిపేరులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరో రెండు రాబోతున్నాయి. మూలన పడిన ఫ్యారా సెయిలింగ్, జెడ్ స్కీ బోట్లను సైతం మరమ్మతులు చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. - విందులు వినోదాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించే వీలున్న ఖైరున్నీసా, భాగమతి బోట్లల్లో 40 నిమిషాలపాటు సాగరంలో విహరించవచ్చు. భగీరథిలో 200 మంది వరకూ విహరించవచ్చు. - 5 మెకనైజ్డ్ బోట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి బుద్ధుడి వద్దకు తీసుకెళ్లి తీసుకొస్తాయి. 2 డీలక్స్బోట్లు అందుబాటులో ఉన్నాయి. - రాజహంస పడవలో హుందాగా అలలపై 15 నిమిషాలపాటు తేలియాడి రావొచ్చు. వీటికితోడు స్పీడుబోటులో సాగర్‌లో దూసుకుపోవాలంటే నడిపే వ్యక్తితో పాటు ఒక్కరే ప్రయాణించవచ్చు. ఆకర్షించేందుకు ప్రణాళికలు పర్యాటకంగా సాగర్‌ను అభివృద్ధి చేసేందుకు అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వీకెండ్లో ఒక్కొక్క రోజు వేలమంది పర్యాటకులు బోటింగ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే క్రమక్రమంగా లుంబినీ పార్కు బోటింగ్ యూనిట్లో అంతర్జాతీయ ప్రమాణాలు ప్రవేశ పెట్టబోతున్నాం. హైదరాబాద్‌కు వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు లుంబినీ పార్కు సందర్శించి బోటింగ్ చేయాలనే ఆలోచనకు తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. – టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్ -
బోటింగ్ టెర్రర్!
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న పర్యాటకాభివృద్ధి తిరోగమనంలో సాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్టులను పట్టాలెక్కించడంలో విఫలమవుతోంది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు సందర్శించే భాగ్యనగరంలోని సందర్శనీయ స్థలాల వద్ద సరైన రక్షణ చర్యలు లేక ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకు ఉదాహరణ హుస్సేన్ సాగర్‌లో విహారమే. లుంబినీ పార్కులో ఉన్న బోటింగ్ పాయింట్ తెలంగాణ రాష్ట్రపర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) ఆధ్వర్యంలో నడుస్తోంది. సాగర్ జలాల్లో విహారానికి ఇక్కడి నుంచే బోట్లు తిప్పుతున్నారు. ఇక్కడ తిరిగే బోట్లను అధికారులు ఆర్భాటంగా అందుబాటులోకి తెస్తున్నా.. ఆ తర్వాత వాటి బాగోగులు పట్టించుకోవడం లేదు. అన్ని బోట్లదీ అదే తీరు.. సాగర్‌లో ఒకే ఇంజిన్‌తో ఉండే ఐదు మెకనైజ్డ్ బోట్లను తిప్పుతున్నారు. ఇవి తరచూ సాంకేతిక లోపంతో హుసేన్సాగర్ మధ్యలోనే అగిపోతున్నాయి. దీంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. వీటికి మరమ్మతులు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నా పూర్తి స్థాయిలో మాత్రం పనిచేయడం లేదు. ఫాంటన్ బోట్లు.. సుమారు 70 మంది ప్రయాణించే ఈ బోటుకు రెండు ఇంజిన్లు ఉండాలి. కానీ ఒక్క ఇంజిన్‌తోనే తిప్పుతున్నారు. ఏడాది కిత్రం ఒక ఇంజిన్ పాడైంది. దాని గురించి మాత్రం పట్టించుకోలేదు. ప్రయాణికులు సాగర్‌లో షికారు చేస్తున్నప్పుడు ఉన్నఫళంగా ఆగిపోవడం పరిపాటిగా మారింది. సాగర్‌లో ఆగిపోయిన ప్రతిసారి మరో బోటును పంపి టూరిస్టులను ఒడ్డుకు తీసుకవస్తున్నారు. దీనికి ప్రతి మూడు నెలలకు ఓసారి ఇంజిన్, గేర్ ఆయిల్ మార్చాలి. కానీ ఆరు నెలలుగా ఆ పనులు చేపట్టలేదు. రిపేరులో మూడు స్పీడు బోట్లు టీఎస్‌టీడీసీ నడిపే ఐదు స్పీడ్ బోట్లలో మూడు రిపేర్‌లో ఉన్నాయి. ప్రస్తుతం తిరిగే రెండు బోట్లు కూడా టూరిస్టులతో సాగర్‌లో తరచుగా ఆగిపోతున్నాయి. ఈ బోటులో షికారుకు వెళ్లినవారు సాగర్‌లోను.. టికెట్ తీసుకున్నవారు ఒడ్డున గంటల తరబడి ఎదురుచూడ్డం పరిపాటిగా మారింది. పెద్ద బోట్లపైనా నిర్లక్ష్యం సాగర్‌లో భగీరథి, ఖైరున్నీసా, భాగమతి పెద్ద బోట్లు తిరుగుతున్నాయి. వినోద కార్యక్రమాలు సైతం ఉండే వీటిలో 80 నుంచి 100 మందికి పైగా పర్యాటకులు షికారు చేయవచ్చు. ఏప్రిల్‌లో రిపేరుకు వెళ్లింది. ఒక్కొక్క బోటుకు ఇద్దరు డ్రైవర్లు, ఒక హెల్పర్, ఒక స్విమ్మర్ ఉండాలి. కానీ మూడు నెలలుగా ఒక హెల్పర్, ఒక సెక్యూరిటీ మాత్రమే వెళ్తున్నారు. డీలక్స్ బోట్లు డల్.. పది మంది ప్రయాణించే డీలక్స్ బోటు తరచూ ఇంజిన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తి ఆగిపోతోంది. వీటికి వచ్చే సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు, రిపేర్ చేసేందుకు ప్రత్యేకంగా మెకానిక్‌ను నియమించినా పట్టించుకున్న దాఖలా లేదు. రాజహంస బోటు సైతం సాంకేతిక లోపంతో ఆడపాదడపా నడుస్తోంది. పర్యాటకుల్లోనూ భద్రతపై నిర్లక్ష్యం టీఎస్‌టీడీసీ అధికారులు పర్యాటకుల భద్రత కోసం లైఫ్ జాకెట్లను ఆయా బోట్లలో ఉంచారు. బోటింగ్ సిబ్బంది లైఫ్‌జాకెట్లు ధరించాలని చెప్పినా పర్యాటకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరగకముందే అధికారులు మేల్కొని చర్యలు చేట్టాలి. జాగ్రత్తలుతీసుకుంటున్నాం.. లుంబినీ పార్కులోని బోటింగ్ పాయింట్ అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. బోటింగ్ డ్రైవర్లకు జీతాలు పెంచాం. మరిన్ని కొత్త బోట్లు తీసుకురాబోతున్నాయి. పర్యాటకులు లైఫ్ జాకెట్స్ ధరించేలా చూడాలని సిబ్బందికి ముందే చెప్పాం. మరోసారి ప్రత్యేకంగా తనిఖీలు చేస్తా. టూరిస్టుల భద్రతపై జాగ్రత్తలు తీసుకుంటాం. – మనోహర్, టీఎస్‌టీడీసీ ఎండీ -
సాగర్‌లో విమానాల హోరు!
నాగార్జునసాగర్: రాబోయే రోజుల్లో నాగార్జునసాగర్ జలాశయంలో విమానాల హోరు వినిపించనుంది. చిన్న పట్టణాలను రవాణాపరంగా అనుసంధానించేందుకు జల విమానాలను వాణిజ్య సేవలకు వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో పోర్టుకు అనువుగా ఉన్న నాగార్జునసాగర్‌ను ఎంపిక చేశారు. ఏప్రిల్ తొలి వారంలో పౌర విమానయాన శాఖ అధికారి కెప్టెన్ ఇల్షాద్ అహ్మద్ నేతృత్వంలో నిపుణుల బృందం హెడ్రోపోర్టు ఏర్పాటుకు సాగర్ జలాశయాన్ని పరిశీలించింది. రవాణాపరంగా జలాశయాలను వినియోగించేందుకు సాధ్యమేనని, త్వరలోనే ఇది కార్యరూపం దాల్చేందుకు డీజీసీఏ నిబంధనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ, ఏపీలో రిజర్వాయర్ కనెక్టింగ్ సర్వీస్ 9, 12, 20 సీట్ల సామర్థ్యం కలిగిన విమాన సర్వీసులను నడపనున్నారు. సాగర్‌తోపాటు శ్రీశైలం, హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ అనుకూలమేనని సర్వేలో తేలింది. కేంద్ర ప్రభుత్వ ‘ఉడాన్’పథకం విమాన సర్వీసులను సామాన్యులకు చేరువ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. విమాన సర్వీసులు ప్రారంభమైతే నాగార్జునసాగర్‌కు పలు దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. జలాశయంలో ఏర్పాటు చేసే హైడ్రో పోర్టును తెలంగాణ వైపు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
గ్రేట్‌వాల్ ఆఫ్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్ : వర్షాకాలపు ముంపు సమస్యల పరిష్కారంలో భాగంగా నాలాల విస్తరణలకు సిద్ధమైన జీహెచ్ఎంసీ యంత్రాంగం.. మారియట్ హోటల్ నుంచి అంబర్‌పేట వరకు హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలా విస్తరణ స్థానే గ్రేట్ వాల్ నిర్మాణానికి సిద్ధమైంది. భారీ వర్షాలు కురిసినా నాలాకు రెండు వైపులా ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు జలమయం కాకుండా ఉండేందుకు భారీ వాల్ నిర్మాణ పనులు త్వరలో చేపట్టనుంది. నగరంలో 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు సర్ప్లస్ నాలా వెంబడి బస్తీలు నీట మునగడంతో నాలాను విస్తరించి ఆధునీకరించాలనుకున్నారు. కిర్లోస్కర్ కమిటీ నివేదిక మేరకు నాలాను ఎక్కువ వెడల్పునకు విస్తరించాలంటే ఎన్నో ఆస్తులు సేకరించాల్సి ఉండటంతో ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో పనులు చేపట్టలేదు. గత సంవత్సరం భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో నాలా విస్తరణకు అధికారులు సిద్ధంకాగా, ప్రజల నుంచి మళ్లీ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో నాలా పరిధి వరకే విస్తరణ తదితర చర్యలు చేపట్టాలనుకున్నారు. అందులో భాగంగా నాలా పొడవునా వాల్ నిర్మించాలని, అందుకు రూ. 68.40 కోట్లు ఖర్చు కానుందని ప్రతిపాదించారు. తప్పని సరైతే తప్ప ఆస్తులను తొలగించకుండానే వాల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 2000 సంవత్సరం వరదల తర్వాత కొన్ని ప్రాంతాల్లో నాలా వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించారు. దాన్ని కూడా కలుపుతూ నాలా మొత్తానికి భారీ వాల్ నిర్మాణానికి ఇప్పుడు సిద్ధమయ్యారు. ఈ పనులు పూర్తయితే కవాడిగూడ, గాంధీనగర్, అశోక్‌నగర్, నల్లకుంట, అంబర్‌పేట ప్రాంతాల్లోని నాలా వెంబడి లోతట్టు ప్రాంతాలకు ముంపు సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. ముందుకు సాగని నాలాల విస్తరణ.. జీహెచ్ఎంసీలో 390 కిలోమీటర్ల పొడవున్న ప్రధాన నాలాల వెంబడి 12,432 ఆస్తులున్నట్లు సర్వే ద్వారా గుర్తించారు. ఈ మొత్తం ఆస్తులను తొలగించేందుకు భారీ వ్యయం కావడమే కాక, ఆస్తుల తొలగింపు సంక్లిష్టంగా మారడంతో, తొలిదశలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న బాటిల్‌నెక్స్‌లో మాత్రమే నాలాల విస్తరణ పనులు చేయాలని నిర్ణయించారు. ఈ పనులు చేసేందుకు 1,002 ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని గుర్తించారు. తొలిదశలో నాలాల విస్తరణ పనులకు అవసరమైన రూ. 230 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం జీహెచ్ఎంసీకి పరిపాలన అనుమతులిచ్చింది. అలాగే నగరంలో వరద ముంపు సమస్యల పరిష్కారానికి నాలాల్ని విస్తరించాలని తొలుత భావించారు. ఆయా ప్రాంతాల ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు నాలాలను విస్తరించే బదులు ఎక్కువ లోతు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. హుస్సేన్‌సాగర్ సర్ప్లస్ నాలాకు సంబంధించి కిర్లోస్కర్ సిఫార్సులకు షార్ట్‌కట్ పరిష్కారాన్ని అమలు చేయబోతున్నారు. -
గౌతమ బుద్ధుడిని సందర్శించనున్న రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ నడిబొడ్డున ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఉదయం 10.20కు సందర్శించనున్నారు. సాగరం మధ్యన రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ మీద ప్రతిష్టించిన అభయముద్రలో ఉన్న గౌత ముని ఏకశిలా విగ్రహాన్ని ఆయన దర్శించుకోనున్నా రు. రాష్ట్రపతి సందర్శన దృష్ట్యా కేంద్ర భద్రతా బలగాలు లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ పరిసరాలను స్వాధీనం చేసుకున్నాయి. పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. బుద్ధ విగ్రహం ప్రత్యేకతలివే బుద్ధుని విగ్రహానికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. నాటి సీఎం ఎన్టీఆర్ ఆదేశాలతో భువనగిరి సమీపంలోని రాయిగిరి కొండ నుంచి సేకరించిన వైట్ గ్రానైట్ స్టోన్పై చెక్కిన అతి పెద్ద ఏకశిలా విగ్రహం ఇదే. ప్రముఖ శిల్పి గణపతి స్థపతి నేతృత్వంలోని బృందం ఐదేళ్ల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దింది. దీనిని ప్రతిష్టించే క్రమంలో 1990 మార్చి 10న ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. విగ్రహాన్ని తరలిస్తున్న వాహనం నీట మునగడంతో 10 మంది కార్మికులు మృత్యువాతపడ్డారు. తిరిగి 1992 డిసెంబర్ 1న విగ్రహాన్ని నీటిలో నుంచి వెలికితీసి రాక్ ఆఫ్ జిబ్రాల్టర్‌పై ప్రతిష్టించారు. 2006లో ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామా నేతృత్వంలో ఈ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
బోటు మునిగిందా.. ‘లైఫ్’ గోవిందా!
సాక్షి, హైదరాబాద్ : ‘సోమవారం సాయంత్రం నాలుగు గంటలు.. హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్ చేసేందుకు యువత, పిల్లలతో వచ్చిన కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతలోనే 50 సీట్ల సామర్థ్యం కలిగిన మెకనైజ్డ్ బోట్ వచ్చింది. జెట్టీ వద్ద బోట్‌ను ఆపడంతో అందరూ ఎక్కేశారు. దీంతో పడవ కాస్తా అటూ ఇటూ కదిలింది. బుద్ధ విగ్రహాన్ని చూసేసి తిరిగి లుంబినీ పార్కు జెట్టీ వద్ద చేరుకున్నారు. ప్రయాణం అంతా సాఫీగా సాగడంతో అందరూ ఖుషీగా తిరిగి వెళ్లిపోయారు’ ..ఇంతవరకు బాగానే ఉంది కానీ.. అనుకోని ఘటన ఏదైనా జరిగితే. ఎంత ప్రమాదం. ప్రాణాలకు ఎంత ముప్పు. ఎందుకంటే ఆ బోట్లో ప్రయాణిస్తున్న ఒక్కరు కూడా లైఫ్ జాకెట్ ధరించలేదు. లైఫ్ జాకెట్లను తెలంగాణ పర్యాటక శాఖ సమకూర్చకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆదివారం విజయవాడ వద్ద కృష్ణానదిలో ఘోర పడవ ప్రమాదం సంభవించిన నేపథ్యంలో నగరంలోని హుస్సేన్‌సాగర్ పడవ షికారులో భద్రత ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు ‘సాక్షి బృందం’ పరిశీలించింది. బోట్లో భద్రతాపరమైన లోపాలను కనిపెట్టింది. బోటులో ప్రయాణిస్తున్న పర్యాటకలు ఒక్కరు కూడా తమకు లైఫ్ జాకెట్ ఇవ్వండి, ధరిస్తామని అడగకపోవడం గమనార్హం, నిబంధనల్లో పొందుపరిచిన విధంగా బోటింగ్ అధికారులు ఎవరూ లైఫ్ జాకెట్ ధరించండి అని ప్రయాణికులతో చెప్పిన దాఖలాలు కనిపించలేదు. వీకెండ్లో ఐదువేల మంది.. హుస్సేన్ సాగర్ తీరంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ దాదాపు 2000 నుంచి 2,500 మంది పర్యాటకులు బోట్లలో షికారు చేస్తుంటారు. శని, ఆదివారాల్లో వీరి సంఖ్య సుమారు 5000 ఉంటుంది. తెలంగాణ పర్యాటక శాఖకు రోజుకు సుమారు లక్ష రూపాయలకుపైగానే ఆదాయం వస్తుంది. అంటే నెలకు రూ.30 లక్షలు. ఆదాయం భారీగా వస్తున్నా బోటు ప్రయాణికులకు సరిపడా లైఫ్ జాక్లెట్లు, లైఫ్ రింగులు కూడా అందుబాటులో ఉండకపోవడం భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ అలలు వచ్చే అవకాశం లేకపోవడంతో ఎటువంటి పడవ ప్రమాదం జరగకపోవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి.? పడవ నిర్వాహకులు భద్రతాపరంగా లైఫ్‌జాకెట్లు, లైఫ్ రింగులు అందుబాటులో ఉంచాలి. ఇవి ఒక్కో పడవకు ఐదు నుంచి పది మధ్యలో, రింగులు రెండు వరకు మాత్రమే ఉన్నాయి. పర్యాటకుల సంఖ్య అనుగుణంగా దాదాపు 742 మందికి, దాదాపు 65 మంది సిబ్బందికి మొత్తం 807 లైఫ్ జాకెట్లు అవసరం. కానీ వీటి సంఖ్య 100 కూడా లేదని తెలుస్తోంది. ఒక్కో లైఫ్ జాకెట్ ధర మార్కెట్లో రూ.1,000 ఉంది. లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్న తెలంగాణ పర్యాటక శాఖ లైఫ్ జాకెట్లకు రూ.70 లక్షలు కూడా ఖర్చుపెట్టడం లేదు. సరిపడా లైఫ్ జాకెట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నా వాస్తవానికి అవి ఎక్కడా కానరావడం లేదు. సోమవారం ‘సాక్షి’ బృందం పర్యటించిన నేపథ్యంలో జూపార్క్‌లోని బోటింగ్ సిబ్బంది నుంచి దాదాపు 30 లైఫ్ జాకెట్లు తెప్పించుకోవడం కనిపించింది. బోట్స్సంఖ్య సీట్లసామర్థ్యం మెకనైజ్డ్ బోట్స్ 4 300 డీలక్స్ బోట్ 3 8 స్పీడ్ బోట్ 4 4 ఫాంటన్ బోట్ 1 80 భగీరథి బోట్ 1 150 ఖైర్–ఉన్–నిస్సా 1 100 భాగ్మతి 1 100 లైఫ్ జాకెట్ ఇవ్వాలన్నా పట్టించుకోలేదు.. భార్య, కుమారుడితో కలిసి బోటింగ్ చేసేందుకు ఈసీఐఎల్ నుంచి వచ్చా. పడవ ఎక్కిన సమయంలో లైఫ్ జాకెట్ కావాలని అడిగా. కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదం గురించి కూడా వివరించా. అయినా నన్నెవరూ పట్టించుకోలేదు. – వెంకట్, పర్యాటకుడు భద్రతా నిబంధనలు బోట్లో ప్రదర్శించాలి.. బోటింగ్ టికెట్ కౌంటర్ వద్ద ఏర్పాటుచేసిన భద్రతా నిబంధనలు పొందుపరిచారు. బోట్లో ప్రయాణికులు వ్యవహరించాల్సిన తీరుపై జాగ్రత్తలు సూచించారు. ఈ నిబంధనలు బోట్లలో కూడా ఓ మూలన ప్రదర్శిస్తే బాగుంటుంది. – సుచీర, పర్యాటకురాలు ఆ ప్రభావం పర్యాటకులపై లేదు.. ఒక్కో పడవకు ఆరు నుంచి పది వరకు లైఫ్ జాకెట్లు, రెండు లైఫ్ రింగ్‌లు కూడా అందుబాటులో ఉంచుతున్నాం. కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదం ఇక్కడ పర్యాటకులపై ప్రభావం ఏమాత్రం లేదు. ఎప్పటిలాగే పర్యాటకులు బోటింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. – రాజలింగం, హుస్సేన్‌సాగర్ బోటింగ్ యూనిట్ మేనేజర్ డ్రైవింగ్‌లో ఇబ్బందులు లేవు.. హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్ డ్రైవ్ ఏడాదిగా చేస్తున్నా. నాతోటి 20 మంది డ్రైవర్లంతా లైసెన్స్డ్ డ్రైవర్లే. ప్రయాణ సమయంలో పర్యాటకులు లేచి నిల్చుంటే సముదాయించేందుకు సిబ్బంది ఉన్నారు. సురక్షితంగా గమ్యస్థానం చేరేలా అనుక్షణం అప్రమత్తంగా ఉంటాం. – సుమన్, బోట్ డ్రైవర్ -
హుస్సేన్ సాగర్ లో ఆర్మీ అద్భుత విన్యాసాలు
-
హుస్సేన్‌సాగర్‌లో మాక్‌డ్రిల్
-
హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ వివరాలివ్వండి
సాగర్ చుట్టూ నిర్మాణాలపై వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల నిర్మాణాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏమిటో స్పష్టంగా చెప్పాలని హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాగర్ గరిష్ట నీటి మట్టం (ఎఫ్టీఎల్)కు సంబంధించిన వివరాలను కూడా తమ ముందుంచాలంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ రజనీల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. సుప్రీంకోర్టుఆదేశాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్‌సాగర్ చుట్టూ భారీ నిర్మాణాలను చేపడుతుందని.. వీటిని నిలుపుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి వేసిన పిల్‌పై ధర్మాసంన విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సాగర్ ఒడ్డున ఉన్న అంబేడ్కర్ నగర్ మురికివాడలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వు లకు విరుద్ధమని తెలిపారు. ఏజీ కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుంటే పిటిషనర్‌కు ఉన్న అభ్యంతరం ఏమిటో తెలియడం లేదన్నారు. సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో గానీ, బఫర్ జోన్లో గానీ నిర్మాణాలు చేపట్టడం లేదని వివరించారు. -
హుస్సేన్‌సాగర్ చుట్టూ రేపు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ సిటీ: తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆదివారం 10కే, 5కే, 2కే రన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉదయం 6 నుంచి 8 వరకు హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ♦ వీవీ విగ్రహం (ఖైరతాబాద్ చౌరస్తా) వైపు నుంచి ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను షాదన్ కాలేజ్, నిరంకారి భవన్ వైపు మళ్లిస్తారు. ♦ తెలుగుతల్లి చౌరస్తా వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను హెలీప్యాడ్ లైన్ నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా పంపిస్తారు. ♦ ఇక్బాల్ మీనార్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సచివాలయం ఓల్డ్ గేట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదికి పంపిస్తారు. ♦ లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే ట్రాఫిక్‌ను జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్కేఆర్ భవన్, తెలుగుతల్లి చౌరస్తా, ఇక్బాల్ మీనార్ (యూ టర్న్) మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ పైకి పంపిస్తారు. ♦ కర్బాలా వైపు నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా అంబేడ్కర్ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్‌ను చిల్ట్రన్స్ పార్క్ నుంచి డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా మళ్లిస్తారు. ♦ నల్లగుట్ట నుంచి సంజీవయ్యపార్క్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కర్బాలా మీదుగా పంపిస్తారు. ♦ డీబీఆర్ మిల్స్ నుంచి ట్రాఫిక్‌ను అప్పర్ ట్యాంక్‌బండ్ మీదికి అనుమతించరు. -
బాలుడిని ట్యాంక్ బండ్లో తోసేసిన బాబాయి
హైదరాబాద్ (రాంగోపాల్‌పేట్): ఓ చిన్నారిని బాబాయే హుస్సేన్ సాగర్ నీళ్లలో తోసి వేయగా, లేక్ పోలీసులు, స్థానికుల సహాయంతో ఆ చిన్నారి ప్రాణాలతో భయటపడ్డారు. ఈ ఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం శనివారం సాయంత్రం ట్యాంక్ బండ్‌పై ఉన్న లేపాక్షి భవనం వద్దకు ఆర్య విద్యాలయ హైస్కూ్ల్లో చదువుకుంటున్న మహేష్, సుభద్రల కుమారుడు ధనుష్ (5)ను అతని బాబాయ్ తీసుకుని వచ్చాడు. బాలుడిని నీళ్లలో తోసి అక్కడి నుంచి పరారయ్యాడు. నీటిలో మునిగిపోతున్న ధనుష్‌ను గుర్తించిన స్థానికులు లేక్ పోలీసులకు సమాచారం అందించడం వారు స్థానికుల సహాయంతో అతడిని రక్షించారు. అయితే ఆ బాలుడు తల్లిదండ్రులు పేర్లు, పాఠశాల పేరు మాత్రమే చెబుతుండగా, ఏ ప్రాంతమనేది చెప్పడం లేదు. దీంతో అతని తల్లిదండ్రుల కోసం రాంగోపాల్‌పేట్ పోలీసులు విచారణ చేపట్టారు. తనను సంతు అనే తన బాబాయ్ ట్యాంక్‌బండ్‌కు తీసుకువచ్చి నీటిలో తోసివేసినట్లు తెలిపారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి ఆచూకీ కోసం నగరంతో పాటు తెలంగాణాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించినట్లు తెలిపారు. -
అంబరమంటిన సద్దుల సంబరం
-
‘హుస్సేన్ సాగర్’ను పరిశీలించిన కేటీఆర్
హైదరాబాద్: ప్రమాదస్థాయికి చేరిన హుస్సేన్ సాగర్‌ను మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ శుక్రవారం పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు నగరం నడిబొడ్డులో ఉన్న హుస్సేన్ సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ఆయన అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం(513 అడుగులు) కొనసాగుతుందని గుర్తించిన మంత్రి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కేటీఆర్ సూచించారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 5,700 క్యూసెక్కులుగా ఉండగా.. కాలువల ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా గత మూడు రోజులుగా నగరాన్ని వాన ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. -
ఉ‘ప్పొంగు’ సాగరం!
సాక్షి, హైదరాబాద్: వర్షంతో హుస్సేన్ సాగర్‌లోకి భారీగా చేరిన నీటిని దిగువకు వదులుతున్న దృశ్యం. సాగర్ నీటిలో కాలుష్యం ఉ‘ప్పొంగు’తున్న తీరిదీ. -
పూర్తిగా నిండిన హుస్సేన్‌సాగర్ జలాశయం
హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ నిండుకుండను తలపిస్తోంది. ఎడతెరిపి లేని వానలతో బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి జలాశయం నీటి మట్టం 513.88 అడుగులకు చేరుకుంది. కాగా, పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు.. దీంతో అధికారులు 4,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 4,000 క్యూసెక్కులుగా ఉంది. -
'లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
హైదరాబాద్: నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆయన నగరవాసులకు సూచించారు. నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షంతో హుస్సేన్‌సాగర్‌లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. సాగర్‌లో ఇన్‌ఫ్లో 5 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2500 క్యూసెక్కులు నీరు ఉంది. -
ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్..
-
ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్
హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తూ ప్రమాదస్థాయికి చేరుకుంది. నీటిని వదిలేసేందుకు నీటిపారుదల ఏఈ వెంకటేష్ బుధవారం ఉదయం హుస్సేన్ సాగర్‌కు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలను హెచ్చరించడమేకాక, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన మీడియాతో చెప్పారు. హుస్సేన్ సాగర్‌కు బుధవారం ఉదయం వరకూ నాలుగు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇది ఇంకాస్త పెరిగితే నీటిని వదిలేయకతప్పదని ఆయన చెప్పారు. ఈ రోజు కూడా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర శివారులోని నిజాంపేట చెరువుకు గండి పడడంతో నీరు కాలనీలను ముంచెత్తింది. అలాగే ఆల్వాల్ చెరువు పొంగి పొర్లడంతో పరిసరాల్లోని కాలనీలు నీట మునిగాయి. అపార్ట్మెంట్ల సెల్లార్లు నీటితో నిండిపోయాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడడంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందువల్ల నిన్నటి నుంచి తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, మరో 24 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ డైరెక్టర్ వైకే రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణలోని 294 ప్రాంతాల్లో వర్షం పడగా, 22 ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసిందని ఆయన వివరించారు. నగరంలో 12 గంటల పాటు రాత్రంతా భారీ వర్షం పడిందని, ఈరోజు కూడా నగరంలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు రాత్రి కురిసిన వర్షాలకు మరింతగా దెబ్బతిన్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. మూసాపేట వద్ద రోడ్డు చెరువును తలపిస్తుండడంతో వాహనాలు అటూ ఇటూ నిలిచిపోయాయి. కూకట్పల్లి, మియాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో రోడ్లుపై ఏర్పడిన గోతులు వాహనచోదకులకు నరకం చూపిస్తున్నాయి. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అలాగే కోఠి, ఆబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, పంజగుట్ట, బంజారాహిల్స్, ఎస్.ఆర్.నగర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, సూరారం కాలనీ, జీడిమెట్ల, ఆల్విన్ కాలనీ, కర్మన్ ఘాట్ తదితర ప్రాంతాల్లో వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. -
బై..బై.. గణేషా..