హైదరాబాద్: నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆయన నగరవాసులకు సూచించారు. నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షంతో హుస్సేన్సాగర్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. సాగర్లో ఇన్ఫ్లో 5 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2500 క్యూసెక్కులు నీరు ఉంది.