భారీ వర్షాలపై కేటీఆర్ సమీక్ష
Published Wed, Aug 31 2016 2:10 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
హైదరాబాద్: నగరంలోని భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. సహాయక చర్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులతో కేటీఆర్ భేటీ కానున్నారు. బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న కుండుపోతతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరో వైపు విద్యుత్ అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అవాంతరాలు నిరోధించాలన్నారు.
Advertisement
Advertisement