ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్.. | water levels exceeds in hussain sagar | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 21 2016 9:24 AM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM

ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్‌ నిండుకుండను తలపిస్తూ ప్రమాదస్థాయికి చేరుకుంది. నీటిని వదిలేసేందుకు నీటిపారుదల ఏఈ వెంకటేష్ బుధవారం ఉదయం హుస్సేన్ సాగర్‌కు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలను హెచ్చరించడమేకాక, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన మీడియాతో చెప్పారు. హుస్సేన్ సాగర్‌కు బుధవారం ఉదయం వరకూ నాలుగు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇది ఇంకాస్త పెరిగితే నీటిని వదిలేయకతప్పదని ఆయన చెప్పారు. ఈ రోజు కూడా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement