traffic issues
-
శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్.. 20 నిమిషాల్లో పంజాగుట్ట నుంచి ఓఆర్ఆర్కు
సాక్షి, గచ్చిబౌలి: శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి గచచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుకు రయ్.. రయ్‌మని వెళ్లవచ్చు. శిల్పా లేవుట్‌లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్‌తో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తక్కువ సమయం పడుతుంది. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను నెలకొల్పడంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లైఓవర్లతో వాహనదారులకు ఎంతో ఊరట లభిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఆర్డీపీ నిర్మించిన 17వ ఫ్లైఓవర్‌గా శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఏర్పాట్లు ఇలా.. ♦ మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ దిగగానే, ఐకియా వెనుక రోడ్డులో శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్‌కు చేరుకోవాలి. ♦ ఫ్లై ఓవర్ ఎక్కిన వాహనాలు ఓల్డ్ ముంబై జాతీయ రహదారిపై దిగొచ్చు. దిగువ ర్యాంప్ ద్వారా ఔటర్‌పై కూడా దిగవచ్చు. ♦ ఔటర్ నుంచి వచ్చే వాహనాలు ఎగువ ర్యాంప్ ద్వారా నేరుగా ఫ్లై ఓవర్ పైకి వెళతాయి. గచ్చిబౌలి జంక్షన్‌లోనూ ఫ్లై ఓవర్ పైకి వాహనాలు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేశారు. ♦ ఫ్లై ఓవర్ ముగియగానే, లెఫ్ట్ తీసుకొని డెలాయిట్ రోడ్డులో మైండ్ స్పేస్ ఫ్లైఓవర్‌పైకి చేరుకోవచ్చు. సాఫీగా ప్రయాణం.. సికింద్రాబాద్, కూకట్పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల నుంచి వాహనాలు పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి ప్రసాద్ ఐ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 45కు వెళతాయి. ♦ అక్కడ కేబుల్ బ్రిడ్జి నుంచి నేరుగా కోహినూర్ హోటల్ , మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ దిగిన వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. ఐకియా వెనుక నుంచి వెళ్లి రైట్ టర్న్ తీసుకుంటే శిల్ప లేఅవుట్లోని ఫ్లై ఓవర్ పై నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకోవచ్చు. ♦ జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనదారులు శంషాబాద్ విమానాశ్రయం, బెంగళూర్ జాతీయ రహదారితో పాటు నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, కోకాపేట్, శంకర్పల్లి, తెల్లాపూర్, కొల్లూరు, పటాన్చెరు వైపు వెళ్లవచ్చు. ♦ ఫ్లైఓవర్ నుంచి ఓల్డ్ ముంబయ్ జాతీయ రహదారికి దిగే వెసులుబాటు కల్పించారు. దీంతో రాయదుర్గం, మెహిదీపట్నం వైపు వెళ్లేందుకు వీలుంటుంది. ♦ శంషాబాద్ విమానాశ్రయం, పటాన్చెరు, కోకాపేట్, ఫ్లైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లింగంపల్లి, గచ్చిబౌలి నుంచి వాహనదారులు నేరుగా శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ ద్వారా ఇట్టే జూబ్లీహిల్స్ చేరుకోవచ్చు. జంక్షన్లపై తగ్గనున్న ఒత్తిడి ♦ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలు గచి్చ»ౌలి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, మైండ్ స్పేస్ జంక్షన్‌కు వెళుతుంటాయి. లేదా గచి్చ»ౌలి జంక్షన్ నుంచి అంజయ్యనగర్‌లో రైట్ టర్న్ తీసుకొని రాంకీ రోడ్డులో వెళ్లి మైండ్ స్పేస్ ప్లై ఓవర్‌కు చేరుకునేవి. ♦ శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో అటు బయోడైవర్సిటీ, ఇటు అంజయ్యనగర్ వైపు వెళ్లాల్సిన పని లేదు. ♦ దీంతో గచ్చిబౌలి జంక్షన్లో వాహనాల తాకిడి తగ్గనుంది. అంతే కాకుండా బయోడైవర్సిటీ జంక్షన్‌లోనూ తగ్గే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ వ్యయం రూ.466 కోట్లు ►పొడవు 2,810 మీటర్లు (2.81 కిలోమీటర్లు) ►లైన్లు నాలుగు లేన్ల బై డైవర్షనల్ ఫ్లై ఓవర్ ►మెయిన్ ఫ్లైఓవర్ 956 మీటర్లు ►ఎగువ ర్యాంప్ 456.64 మీటర్లు ►దిగువ ర్యాంప్ 399.95 మీటర్లు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
ముషీరాబాద్: నాలాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)తో వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీఎస్టీ రోడ్డులోని నాగమయ్యకుంట వద్ద, నల్లకుంట కూరగాయల మార్కెట్ రోడ్డులో హెరిటేజ్ బిల్డింగ్ వద్ద రూ.12 కోట్ల వ్యయంతో బ్రిడ్జిల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా రెండు బ్రిడ్జిల నిర్మాణ పనులను హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొరేటర్ సి.సునిత ప్రకాష్‌గౌడ్‌లతో కలిసి మంత్రి తలసాని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఏటా వర్షాకాలంలో నాగమయ్యకుంట, సాయిచరణ్ కాలనీ, పద్మాకాలనీ, అచ్చయ్యనగర్ తదితర కాలనీలు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. సమస్యకు ప్రధాన కారణమైన ఇరుకు బ్రిడ్జిలను తొలగించి ఆ స్థానంలో విశాలమైన బ్రిడ్జిలు నిరి్మస్తున్నట్లు తెలిపారు. పనులు పూర్తయితే ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 8వేల కుటుంబాలకు ఉపశమనం లభిస్తుందన్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో రూ.6వేల 700 కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. స్టీల్ బ్రిడ్జితో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. హుస్సేన్‌సాగర్ నుంచి అంబర్‌పేట మీదుగా మూసీ వరకు ఉన్న హుస్సేన్‌సాగర్ నాలాకు 2020లో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని మంత్రి తలసాని వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిరి్మంచడానికి పూనుకున్నట్లు తెలిపారు. ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు రూ.426 కోట్లతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సీఈ కిషన్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్, డీఎంసీ హరికృష్ణ, వాటర్ వర్క్స్ జీఎం సుబ్బారాయుడు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెన్ శ్రీనివాస్‌రావు, ముఠా జైసింహా, మాజీ కార్పొరేటర్ బి.హేమలత, బి.శ్రీనివాస్‌రెడ్డి, కె.మాధవ్ తదితరులు పాల్గొన్నారు. బ్రిడ్జి పనులను ప్రారంభిస్తున్న మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ సునీత తదితరులు -
వరద వదలదు.. ట్రాఫిక్ కదలదు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వానొస్తే రోడ్డు చెరువులవుతున్నాయి. ఎక్కడికక్కడే నిలిచిపోయిన నీటితో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఏళ్ల తరబడి ఈ సమస్యలున్నా ఇప్పటి వరకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోలేకపోయారు. ఈ సీజన్లో కురిసిన తొలి వర్షాలతోనే తీవ్ర ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడటంతో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు పరిష్కార చర్యలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు జేఎన్టీయూ నిపుణులతో అధ్యయనం చేయించి పరిష్కారాలు కోరారు. ప్రస్తుతం నగరంలో 123 మేజర్ లాగింగ్ ఏరియాలున్నాయి. వీటిల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా 82 ఉండగా, వాటికి కారణాలేమిటో తెలియాల్సి ఉంది. మిగతా రెండు కార్పొరేషన్ల పరిధిలో ఫ్లై ఓవర్లు తదితర నిర్మాణ పనులతో రోడ్డు ఇరుగ్గామారి, రోడ్డు లోలెవెల్ ఉండి, వరదపోయే మార్గాల్లేక ముంపు సమస్యలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఇవి కాక ఇతరత్రా కారణలతోనూ రోడ్లపై నీరు నిల్వ ఉంటోంది. -
ట్రాఫిక్ చిక్కులూ లెక్కేస్తారు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో బహుళ అంతస్తులు, వాణిజ్య భవనాల నిర్మాణాలకు ఇక ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్టిఫికెట్ తప్పనిసరి. నిర్మాణాలకు అనుమతులు జారీ చేసే ముందే ఆ భవనాల వల్ల అక్కడ కలిగే ట్రాఫిక్ ఇబ్బందులను జీహెచ్ఎంసీ అధికారులు అంచనా వేయనున్నారు. ఆ భవనాల్లో ఏర్పాటయ్యే సంస్థల ద్వారా ఎంత రద్దీ పెరుగుతుంది.. ఎన్ని వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉంది.. అక్కడి రహదారిపై ఏర్పడే ట్రాఫిక్ చిక్కులు వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటారు. ఆ మేరకు ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్టిఫికెట్‌ను జత పరిస్తేనే ఆ నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. భవనం వినియోగాన్ని బట్టి సర్టిఫికెట్ జారీకి సంబంధించిన మార్గదర్శకాల్ని జీహెచ్ఎంసీ త్వరలో విడుదల చేయనుంది. ఉదాహరణకు ఒక మల్టీప్లెక్స్ భవనం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటే బిల్టప్ ఏరియా ఎంత.. అందులోని సినిమాస్క్రీన్లు, షాపులు, సదరు ప్రాంతంలో పెరిగే రద్దీ, సినిమా ప్రదర్శనలకు ముందు, అనంతరం కలిగే ప్రభావం తదితర వాటిని బేరీజు వేస్తారు. ప్రస్తుతం అక్కడున్న రహదారి పెరిగే జనాభాకు సరిపోతుందా.. లేనట్లయితే దానిని విస్తరించేందుకు అవకాశం ఉందా.. సమీపంలో ఉన్న జంక్షన్లేమిటి.. ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. రద్దీ సమస్య పరిష్కారానికి బిల్డర్ ఎక్కువ సెట్బ్యాక్లు వదిలేందుకు ముందుకు వచ్చినా, ప్రత్యామ్నాయంగా లింక్ మార్గం వంటివి ఉంటే ఏర్పాటు చేస్తే అనుమతిస్తారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలకు కారణాల గురించి అధ్యయనం చేసే బాధ్యతల్ని జీహెచ్ఎంసీ ‘లీ అసోసియేట్స్’కు అప్పగించింది. త్వరలో అది నివేదికను అందజేయనుంది. ఆ నివేదికలోని సూచనల మేరకు ట్రాఫిక్ ఇంపాక్ట్ స్టడీ సర్టిఫికెట్‌కు మార్గదర్శకాలు జారీ కానున్నాయి. ... అయినా తప్పని చిక్కులు నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రూ.25 వేల కోట్లతో ఎస్సార్డీపీ కింద పలు ఫ్లైఓవర్లు కడుతున్నా, మెట్రోరైలు అందుబాటులోకొచ్చినా ట్రాఫిక్ చిక్కులు తప్పడంలేవు. వర్షం వచ్చిన సమయాల్లో ఇవి మరింత తీవ్రమవుతున్నాయి. ఐటీ కంపెనీలు, బహుళ అంతస్తుల భవనాలున్న మాదాపూర్, హైటెక్‌సిటీ వంటి ప్రాంతాల్లో ఈ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే బహుళ అంతస్తుల భవనాల దరఖాస్తుదారులు సమర్పించాల్సిన మిగతా పత్రాలతోపాటు ఈ ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయనున్నారు. అభివృద్ధి చెందిన పలు దేశాల్లో ఈ విధానం అమల్లో ఉన్నా, మన దేశంలో మాత్రం ఇదే ప్రథమం కానుంది. బిల్డర్ నుంచి ఫీజు వసూలుకు యోచన బహుళ అంతస్తుల భవనాలు 44 శాతం స్థలాన్ని పార్కింగ్‌కు వదులుతున్నా, రద్దీకి అది సరిపోవడం లేదు. ఉదాహరణకు ఒక మల్టీప్లెక్స్‌లో 750 వాహనాల పార్కింగ్‌కు అనుమతి ఉన్నా 2 వేల వరకు సీట్లుంటే అక్కడ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది సదరు రహదారి ట్రాఫిక్‌పై ప్రభావం చూపుతోంది. సినిమాలు, షాపింగ్, విండోషాపింగ్ కు వచ్చేవారితోపాటు గేమింగ్ జోన్స్ తదితరమైన వాటితో ఈ సమస్య పెరుగుతోంది. వారాంతాలు, సెలవుల్లో ఇది తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే బహుళ అంతస్తుల భవనంతో పెరిగే ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సదరు కారిడార్‌ను అభివృద్ధి పరిచేందుకు జీహెచ్ఎంసీకి అయ్యే వ్యయంలో కొంత శాతాన్ని ఇంపాక్ట్ ఫీజుగా బిల్డర్ నుంచి వసూలు చేయాలని యోచిస్తోంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలాంటి ప్రత్యామ్నాయ పరిష్కారాల్లేని పక్షంలో అనుమతులిచ్చే అవకాశం కూడా లేదని సంబంధిత అధికారి పేర్కొన్నారు. -
54 సార్లు సమావేశమైన పరిష్కారం లేదు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ సమస్య వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమాధానం చెప్పాలని ఢిల్లీ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, ఢిల్లీలో 77 రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించామని, ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై 55 సార్లు సమావేశాలు నిర్వహించినట్టు ఢిల్లీ పోలీసులు సుప్రీం కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను సోమవారం కోర్టుకు అందజేశారు. అధికారులు సమర్పించిన నివేదికను పరిశీలించిన న్యాయస్థానం ఈ విషయంలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తరచు గడువు కొరుతూ ఉంటారని.. తేదీలు మారుతున్నా కానీ సమస్య మాత్రం అలానే ఉందని అధికారుల తీరును తప్పుబట్టింది. 54 సమావేశాల నిర్వహించిన తర్వాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ.. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తొలుత 8 పనులను తక్షణమే పూర్తిచేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. అందులో ఇప్పటికే మూడింటిని పూర్తి చేశామన్నారు. పలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ట్రాఫిక్ సమస్యకు ఒక కారణంగా తెలుస్తోంది. -
ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్..
-
ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్
హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తూ ప్రమాదస్థాయికి చేరుకుంది. నీటిని వదిలేసేందుకు నీటిపారుదల ఏఈ వెంకటేష్ బుధవారం ఉదయం హుస్సేన్ సాగర్‌కు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలను హెచ్చరించడమేకాక, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన మీడియాతో చెప్పారు. హుస్సేన్ సాగర్‌కు బుధవారం ఉదయం వరకూ నాలుగు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇది ఇంకాస్త పెరిగితే నీటిని వదిలేయకతప్పదని ఆయన చెప్పారు. ఈ రోజు కూడా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర శివారులోని నిజాంపేట చెరువుకు గండి పడడంతో నీరు కాలనీలను ముంచెత్తింది. అలాగే ఆల్వాల్ చెరువు పొంగి పొర్లడంతో పరిసరాల్లోని కాలనీలు నీట మునిగాయి. అపార్ట్మెంట్ల సెల్లార్లు నీటితో నిండిపోయాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడడంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందువల్ల నిన్నటి నుంచి తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, మరో 24 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ డైరెక్టర్ వైకే రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణలోని 294 ప్రాంతాల్లో వర్షం పడగా, 22 ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసిందని ఆయన వివరించారు. నగరంలో 12 గంటల పాటు రాత్రంతా భారీ వర్షం పడిందని, ఈరోజు కూడా నగరంలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు రాత్రి కురిసిన వర్షాలకు మరింతగా దెబ్బతిన్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. మూసాపేట వద్ద రోడ్డు చెరువును తలపిస్తుండడంతో వాహనాలు అటూ ఇటూ నిలిచిపోయాయి. కూకట్పల్లి, మియాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో రోడ్లుపై ఏర్పడిన గోతులు వాహనచోదకులకు నరకం చూపిస్తున్నాయి. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అలాగే కోఠి, ఆబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, పంజగుట్ట, బంజారాహిల్స్, ఎస్.ఆర్.నగర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, సూరారం కాలనీ, జీడిమెట్ల, ఆల్విన్ కాలనీ, కర్మన్ ఘాట్ తదితర ప్రాంతాల్లో వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. -
నిజామాబాద్‌పై నిఘానేత్రం
నగరవ్యాప్తంగా 40 సీసీ కె మెరాల ఏర్పాటు ఎస్పీ కార్యాలయానికి అనుసంధానం చీమ చిటుకుమన్నా సమాచారం చేరవేత నిజామాబాద్ క్రైం,న్యూస్‌లైన్ : జిల్లాకేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలను అధిగమించడం, శాంతిభద్రతల రక్షణకు అడుగడుగున నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇకపై రోడ్డు మీద ఎలాంటి ప్రమాదాలు, నేరాలు జరిగినా వెంటనే ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందనుంది. ఎస్పీ నిర్ణయంతో... జిల్లాకేంద్రంలో నేరాలు,రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఎస్పీ తరుణ్‌జోషి మూలనపడ్డ సీసీ కెమెరాలను వాడుకలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకేంద్రంలో నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదం, గుర్తుతెలియని వాహనాలు ఢీకొని ద్విచక్ర వాహనాదారులు, పాదచారులు మృత్యువాత పడటం షరా మామూలుగా మారింది. వీటికి తోడు తరుచూ ట్రాఫిక్ కష్టాలు తలెత్తడం జరుగుతోంది. వీటన్నింటిని దూరం చేసేందుకు స్వయంగా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. ఎస్పీ ఆదేశాలతో నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో పనులు చకచక జరుగుతున్నాయి. ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు... జిల్లాకేంద్రంలో ఇది వరకు ఎప్పుడు లేని విధంగా నగరవ్యాప్తంగా మొత్తం 40 సీసీ కెమెరాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద 17 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మిగిలిన కెమెరాలను నగరంలోని సమస్యత్మాక ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాల పనితీరును ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ కంట్రోల్ రూమ్‌తోపాటు,జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి వీక్షించవచ్చు. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎల్ఈడీ టీవీల ద్వారా నగరంలోని రోడ్లపై జరిగే తతంగాన్ని ఒకేసారి వీక్షించవచ్చు. గతంలో 2011లో నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ట్ర యల్ కూడా చేశారు. ఇక సీసీ కెమెరాలు ప్రారంభకానున్న తరుణంలో మున్సిపల్‌తో ఒప్పందం సరిగ్గా కుదరలేదన్న కారణంతో పనులు నిలిచిపోయాయి. దీంతో సదరు కంపనీ మళ్లీ ఇటువైపు రాకపోవటంతో ఈ పనులు మూలన పడ్డాయి. కొత్తగా ఏర్పాటు కానున్న సీసీ కెమెరాల పనులు నిలిచిపోకుండా అధికారులు చర్యలు చేపడితే నగరంలో నిఘా చేకూరే అవకాశం ఉంది. ట్రాఫిక్ నియంత్రణ ఇలా ... జిల్లాకేంద్రంలో ఏదైనా ప్రమాదాలు జరిగిన సందర్భాలతోపాటు రాస్తారోకోలు, ధర్నాలు,ర్యాలీలతో ట్రాఫిక్ జామైన సందర్భంలో కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే మొబైల్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారాన్ని చేరవేస్తారు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటన ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారు. దీని ద్వారా రాస్తారోకోలు, దర్నా, ర్యాలీల కారణంగా జామైన ట్రాఫిక్‌ను దారిమళ్లించే అవకాశం ఉంటుంది. అలాగే రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిని, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారిని గుర్తించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.కార్యాలయం నుంచే సీసీ కెమెరాల ద్వారా ఎస్పీ ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తుంటారు. నగరంలో ఎక్కడ ధర్నాలు, ర్యాలీలు జరిగినా సిబ్బందిని ఎస్పీ అలర్టు చేసే అవకాశం ఉంటుంది. ఈ చలాన్ల జారీకి యత్నాలు ... సీసీ కెమెరాల ఏర్పాటుతో ఈ చలాన్ పద్ధతి నగరంలో అందుబాటులోకి తెచ్చేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం సీసీ కెమెరాల్లోనే అదనంగా ఆటోమేటిక్ ఫ్లాష్ కెమెరాలు అమర్చాల్సి ఉంటుంది. ఇవి జీబ్రాలైన్ దాటగానే ఫ్లాష్ వచ్చి వాహనం నంబరు రికార్డు అవుతుంది. దీని ఆధారంగా వాహనదారుడి ఇంటికి నేరుగా ఈ చలానాలు పంపిస్తారు. తొలిదశలో 17 కెమెరాలు నగరంలోని ప్రధాన కూడళ్లలో మొదటి దశలో 17 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో రెండు ప్లేట్ టిల్డ్ జామ్(పీటీజేడ్) కెమెరాలను 360 డిగ్రీల కోణంలో నాలుగు వైపులా రోడ్డు కవర్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం బోధన్ బస్టాండ్ వద్ద రెండు కెమెరాలు,ఎన్టీఆర్ చౌరాస్తాలో మూడు,పూలాంగ్ చౌరస్తాలో మూడు,పాత ఎల్ఐసీ చౌరస్తాలో మూడు, దేవిరోడ్డు చౌరస్తాలో రెండు, ఖలీల్‌వాడీ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్ ముందు,రైల్వేస్టేషన్, కంఠేశ్వర్ చౌరస్తాలలో ఒకటి చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ముంబ యికి చెందిన ఁస్టాన్ పవర్ అనే కంపనీ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం, సీసీ కెమెరాల ఏర్పాటుకు మున్సిపల్ కార్పొరేషన్‌తో ఒప్పందం పూర్తయింది. కేబుల్ లైన్ ఇటీవలే పూర్తియింది. కంట్రోల్ రూమ్‌లో స్టాన్ పవర్ కంపనీకి చెందిన సిబ్బంది మానిటరింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. సీసీ కెమెరాలో 90 రోజులకు సంబంధించి సమాచారం అందుబాటులో ఉంటుంది - అనిల్‌కుమార్, నగర డీఎస్పీ -
ట్రాఫిక్‌పై టాస్క్‘ఫోర్స్’
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: తిరుపతి నగరంలో మంగళవారం టాస్క్‌ఫోర్స్ అధికారులు సుడిగాలి పర్యటన చేశారు. తిరుపతికి నిత్యం వేలాది మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో సమస్యాత్మకమైన రోడ్డు మార్గాలు, కూడళ్లను క్రమబద్ధీకరించేందుకు టాస్క్‌ఫోర్స్ అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా టీటీడీ జేఈవో భాస్కర్, ఎస్ఈ సుధాకర్, ఎస్టేట్ ఆఫీసర్ దేవేంద్రరెడ్డి, అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు, మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ శ్రీదేవి, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్‌కుమార్, డీఎఫ్‌వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో వివిధ విభాగాల అధికారులు నగరం లో విస్తృతంగా పర్యటించారు. నగరాభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీ ప్రవేశద్వారం నుంచి అంబేద్కర్ విగ్రహం, ప్రస్తుతం మూసివేసిన రైల్వేగేటు మీదుగా పాత తిరుచానూరు మార్గం వైపు అండర్ బ్రిడ్జి లేదా సబ్వే నిర్మాణం. అంబేద్కర్ విగ్రహం సర్కిల్‌ను తగ్గించి మూసివేసిన రైల్వేగేటు మీదుగా ఫ్రీ లెఫ్ట్ అండర్ బ్రిడ్జి ఏర్పాటు.గాంధీ విగ్రహం సర్కిల్ తగ్గింపు. టీటీడీ 2, 3 సత్రాల వద్ద మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతకు పెద్దపీట. రైల్వేస్టేషన్‌కు దక్షిణ వైపు ఉన్న రైల్వే బుకింగ్ కార్యాలయాన్ని యాత్రికులు, స్థానికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు. ఆర్సీ రోడ్డులోని రైల్వే గేట్ మార్గంలో అండర్ బ్రిడ్జి, ఫ్లైఓవర్ల నిర్మాణ ప్రతిపాదనను విరమించుకున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆర్సీ రోడ్డులోని రైల్వే గేటు నుంచి రైల్వే బుకింగ్, టీటీడీ 2, 3 సత్రాల మీదుగా డీఆర్ మహాల్ మార్గంలోని అండర్ బ్రిడ్జి వరకు 80 అడుగుల రోడ్డు ఏర్పాటు చేస్తారు. ఆర్సీ రోడ్డులోని రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా ట్రాక్‌కు దక్షిణం వైపు రోడ్డును బుగ్గమఠం మీదుగా వెస్టు చర్చి వరకు విస్తరిస్తారు. అన్నమయ్య సర్కిల్‌కు నాలుగు వైపులా ఫ్రీ లెఫ్ట్ అమలు. తిరుచానూరు నుంచి వచ్చే వాహనాలు శంకరంబాడి సర్కిల్ వద్ద ఉన్న వినాయకుడి గుడి వెనుక నుంచి ఫ్రీ లెఫ్ట్‌గా పాస్‌పోర్టు కార్యాలయం మార్గం మీదుగా వెళ్లేలా రోడ్డు విస్తరణ. లీలామహాల్ సర్కిల్లో ఫ్లై ఓవర్‌ను నిర్మిం చేందుకు చర్యలు వేగవంతం. కపిలతీర్థం సర్కిల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉంది. దీని నివారణకు కపిలతీర్థం నుంచి అటవీ శాఖ కార్యాలయం మీదుగా అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న మార్గాన్ని క్రాంతి నగర్, జీవకోన, గ్రాండ్ వరల్డ్ మీదుగా కరకంబాడి రోడ్డులోకి వాహన రాకపోకలు సాగేలా నిర్ణయించారు. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను టాస్క్‌ఫోర్స్ అధికారులు తెప్పించుకుని చూశారు. దీనిపై సాధ్యాసాధ్యాలను కలెక్టర్, టీటీడీ ఈ వోతో కూడిన టాస్క్ ఫోర్సు సమావేశంలో చర్చించి ప్రతిపాదనలు అమలు చేసేందుకు కృషి చేస్తామని జేఈవో భాస్కర్, అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు, కార్పొరేషన్ అదనపు కమిషనర్ శ్రీదేవి మీడియాకు తెలిపారు.