తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: తిరుపతి నగరంలో మంగళవారం టాస్క్‌ఫోర్స్ అధికారులు సుడిగాలి పర్యటన చేశారు. తిరుపతికి నిత్యం వేలాది మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో సమస్యాత్మకమైన రోడ్డు మార్గాలు, కూడళ్లను క్రమబద్ధీకరించేందుకు టాస్క్‌ఫోర్స్ అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా టీటీడీ జేఈవో భాస్కర్, ఎస్‌ఈ సుధాకర్, ఎస్టేట్ ఆఫీసర్ దేవేంద్రరెడ్డి, అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు, మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ శ్రీదేవి, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్‌కుమార్, డీఎఫ్‌వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో వివిధ విభాగాల అధికారులు నగరం లో విస్తృతంగా పర్యటించారు. నగరాభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆర్టీసీ ప్రవేశద్వారం నుంచి అంబేద్కర్ విగ్రహం, ప్రస్తుతం మూసివేసిన రైల్వేగేటు మీదుగా పాత తిరుచానూరు మార్గం వైపు అండర్ బ్రిడ్జి లేదా సబ్‌వే నిర్మాణం.
అంబేద్కర్ విగ్రహం సర్కిల్‌ను తగ్గించి మూసివేసిన రైల్వేగేటు మీదుగా ఫ్రీ లెఫ్ట్ అండర్ బ్రిడ్జి ఏర్పాటు.గాంధీ విగ్రహం సర్కిల్ తగ్గింపు.
టీటీడీ 2, 3 సత్రాల వద్ద మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతకు పెద్దపీట.
రైల్వేస్టేషన్‌కు దక్షిణ వైపు ఉన్న రైల్వే బుకింగ్ కార్యాలయాన్ని యాత్రికులు, స్థానికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు.
ఆర్‌సీ రోడ్డులోని రైల్వే గేట్ మార్గంలో అండర్ బ్రిడ్జి, ఫ్లైఓవర్‌ల నిర్మాణ ప్రతిపాదనను విరమించుకున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆర్‌సీ రోడ్డులోని రైల్వే గేటు నుంచి రైల్వే బుకింగ్, టీటీడీ 2, 3 సత్రాల మీదుగా డీఆర్ మహాల్ మార్గంలోని అండర్ బ్రిడ్జి వరకు 80 అడుగుల రోడ్డు ఏర్పాటు చేస్తారు.
ఆర్‌సీ రోడ్డులోని రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా ట్రాక్‌కు దక్షిణం వైపు రోడ్డును బుగ్గమఠం మీదుగా వెస్టు చర్చి వరకు విస్తరిస్తారు.
అన్నమయ్య సర్కిల్‌కు నాలుగు వైపులా ఫ్రీ లెఫ్ట్ అమలు.
తిరుచానూరు నుంచి వచ్చే వాహనాలు శంకరంబాడి సర్కిల్ వద్ద ఉన్న వినాయకుడి గుడి వెనుక నుంచి ఫ్రీ లెఫ్ట్‌గా పాస్‌పోర్టు కార్యాలయం మార్గం మీదుగా వెళ్లేలా రోడ్డు విస్తరణ.
లీలామహాల్ సర్కిల్లో ఫ్లై ఓవర్‌ను నిర్మిం చేందుకు చర్యలు వేగవంతం.
కపిలతీర్థం సర్కిల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉంది. దీని నివారణకు కపిలతీర్థం నుంచి అటవీ శాఖ కార్యాలయం మీదుగా అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న మార్గాన్ని క్రాంతి నగర్, జీవకోన, గ్రాండ్ వరల్డ్ మీదుగా కరకంబాడి రోడ్డులోకి వాహన రాకపోకలు సాగేలా నిర్ణయించారు. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను టాస్క్‌ఫోర్స్ అధికారులు తెప్పించుకుని చూశారు.
దీనిపై సాధ్యాసాధ్యాలను కలెక్టర్, టీటీడీ ఈ వోతో కూడిన టాస్క్ ఫోర్సు సమావేశంలో చర్చించి ప్రతిపాదనలు అమలు చేసేందుకు కృషి చేస్తామని జేఈవో భాస్కర్, అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు, కార్పొరేషన్ అదనపు కమిషనర్ శ్రీదేవి మీడియాకు తెలిపారు.
ట్రాఫిక్‌పై టాస్క్‘ఫోర్స్’
Published Wed, Jan 22 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement