ప్రేమకన్నా లక్ష్యమే మిన్న | Tholi Choopulone Premincha Movie Opening | Sakshi
Sakshi News home page

ప్రేమకన్నా లక్ష్యమే మిన్న

Published Mon, Apr 28 2014 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM

ప్రేమకన్నా లక్ష్యమే మిన్న

ప్రేమకన్నా లక్ష్యమే మిన్న

అతను ఓ కంపెనీలో పని చేస్తుంటాడు. అతనితో పాటు పని చేసే అమ్మాయితో పాటు, ఆ కంపెనీకి చెందిన లేడీ బాస్ కూడా అతన్ని ప్రేమిస్తారు. ప్రేమకన్నా తన లక్ష్యాన్ని సాధించుకోవడమే మిన్న అని భావిస్తాడు ఆ యువకుడు. తన లక్ష్యాన్ని సాధించుకోగలిగాడా? ఆ ఇద్దరి యువతుల్లో ఎవరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘తొలిచూపులోనే ప్రేమించా’. విజయ్, వాసు, సిరివెన్నెల, వృశాలి ముఖ్య తారలుగా ఎ.వి. రావ్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మదర్ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్, కామెడీ మూవీ ఇదని, ఇందులో కీలక పాత్ర చేస్తున్నానని దర్శక, నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కిషన్, నిర్మాణ నిర్వహణ: హిమ సాయికిరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మురారి కృష్ణ, సమర్పణ: ఎ. బేబీరావ్.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement