సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ జాతీయ జోనల్ టి20 టోర్నమెంట్‌లో పాల్గొనే సౌత్ జోన్ జట్టును ప్రకటించారు. ఇటీవలే జరిగిన సౌత్ జోన్ టి20 టోర్నీలో ఆరు జట్లు పాల్గొనగా... మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను ఈ జట్టులోకి ఎంపిక చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓపెనర్ తన్మయ్ అగర్వాల్, మీడియం పేసర్ సీవీ మిలింద్... ఆంధ్ర నుంచి జి.హనుమ విహారి, రికీ భుయ్, స్పిన్నర్ దాసరి స్వరూప్ కుమార్‌లకు సౌత్ జోన్ జట్టులో స్థానం లభించింది. 16 మంది సభ్యులతో కూడిన సౌత్ జోన్ జట్టుకు కర్ణాటక ప్లేయర్ వినయ్ కుమార్ సారథ్యం వహిస్తాడు. ముంబైలో ఈనెల 12 నుంచి 18 వరకు జరిగే ఈ టోర్నీలో సౌత్ జోన్‌తోపాటు నార్త్ జోన్, సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ జట్లు బరిలోకి దిగుతున్నాయి.
సౌత్ జోన్ టి20 జట్టు: వినయ్ కుమార్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పవన్ దేశ్‌పాండే, అరవింద్ శ్రీనాథ్ (కర్ణాటక), విజయ్ శంకర్ (వైస్ కెప్టెన్), దినేశ్ కార్తీక్, మురుగన్ అశ్విన్, రాహిల్ షా (తమిళనాడు), తన్మయ్ అగర్వాల్, సీవీ మిలింద్ (హైదరాబాద్), హనుమ విహారి, రికీ భుయ్, స్వరూప్ కుమార్ (ఆంధ్ర), విష్ణు వినోద్, బాసిల్ థంపి, సందీప్ వారియర్ (కేరళ).
సౌత్ జోన్ టి20 జట్టులో మనోళ్లు ఐదుగురు
Published Sun, Feb 5 2017 1:38 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM
Advertisement
Advertisement