చర్మం ఒలిచి అవయవాలు తినేస్తాడు! | Equatorial Guinea President Teodoro Obiang Nguema Mbasogo allegedly skins enemies alive and eats their organs | Sakshi
Sakshi News home page

చర్మం ఒలిచి అవయవాలు తినేస్తాడు!

Published Mon, Sep 12 2016 4:01 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

చర్మం ఒలిచి అవయవాలు తినేస్తాడు!

చర్మం ఒలిచి అవయవాలు తినేస్తాడు!

మలాబో: 'నేను మనిషి మాంసం తిన్నాను.. అంత రుచికరంగా లేదు' అని ప్రకటించి ప్రపంచాన్ని నెవ్వెరపోయేలా చేశాడు ఉగాండా మాజీ నియంత ఇడీ అమీన్. ఇప్పుడు అతన్ని మించిన మరో 'హ్యూమన్ ఈటర్' డిక్టేటర్ ను గురించి నిగూఢవిషయాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోనే అత్యధిక కాలం నియంతగా కొనసాగుతున్న రికార్డు అతనిది. సైన్యమేకాదు చర్చి ఫాదర్లు సైతం ఆయన కనుసన్నల్లోనే నడుచుకోవాలి. కాదూ కూడదు అని ఎవరైనా ఎదురుతిరిగారో.. బతికుండగానే చర్మం ఒలిపించి, శత్రువుల అవయవాలు తినేస్తాడు!

సబ్- సహారా దేశమైన ఈక్వెటోరియల్ గునియాను 37 ఏళ్లుగా పాలిస్తోన్న నియంత నేత థియోడరో ఓబియాంగ్ ఎన్గ్యుమా ఎంబసోగో(74) తన శత్రువుల చర్మాలు ఒలిపించి, అవయవాలు తినేస్తాడని.. గతంలో అతనితో సంబంధాలున్న సెవెరో మోటో అనే వ్యక్తి శుక్రవారం ఓ రేడియో చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎంబసోగో తనను తాను దైవంగా భావిస్తాడని, అడ్డుతగిలేవాళ్లను కర్కశంగా అంతంచేసే హక్కు తనకుందనుకుంటాడని సెవెరో పేర్కొన్నాడు.

సబ్ సహారా ప్రాంతంలోని ఇతరదేశాల్లాగే ఈక్వెటోరియల్ గునియాలోనూ అపారమైన చమురు నిక్షేపాలున్నాయి. అక్కడ విదేశీ సంస్థలు భారీ ఎత్తున ఆయిల్ ను వెలికితీస్తున్నాయి. అయితే పన్నుల రూపంలో లభించే డబ్బంతా ఎంబసోగో కుటుంబం అకౌంట్ లోకే వెళుతోందేతప్ప ప్రజల బాగుకోసం ఉపయోగపడటంలేదనే విమర్శలు ఉన్నాయి. కాగా,  చర్మం ఒలిపించి, అవయవాలు తినడం, అవినీతికి పాల్పడటం అదితర ఆరోపణల్లో నిజం లేదని, ఎంబసోగోను పగడొట్టి, ఆయిల్ ను కొల్లగొట్టేందుకు విదేశీ శక్తులు సాగిస్తోన్న దుష్ర్పచారమని ఆయన అనుచరులు అంటున్నారు.

Advertisement

పోల్

Advertisement