న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్ యోజన, డిజీ ధన్ వ్యాపార్ యోజన పథకాల ద్వారా 14 లక్షల మంది వినియోగదారులకు రూ.226 కోట్ల బహుమతులను అందించినట్లు నీతిఆయోగ్ తెలిపింది. బహుమతులు అందుకున్నవారిలో 70వేల మంది వ్యాపారులున్నారని పేర్కొంది.
గతేడాది డిసెంబర్ 25న ప్రారంభమైన ఈ రెండు పథకాలు ఏప్రిల్ 14 వరకూ కొనసాగనున్నాయి. ఆన్ లైన్ నగదు లావాదేవీలు ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ 100 నగరాల్లో వందకుపైగా డీజీధన్ మేళాలు నిర్వహించింది. ప్రతిరోజు 5 వేల మంది వినియోగదారులను లాటరీ ద్వారా ప్రోత్సహకాలకు ఎంపిక చేస్తున్నారు.
‘ఆన్‌లైన్’కి 226 కోట్ల బహుమతులు
Published Fri, Mar 31 2017 2:41 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM
Advertisement
Advertisement