లాస్ ఏంజెలెస్: విమానంలో తాను అడిగిన డ్రింక్ ఇవ్వలేదన్న కోపంతో ఇండియన్-అమెరికన్ మహిళ ఒకరు పైలట్పై దాడి చేసింది. దీంతో కుటుంబ సభ్యులతో క్రిస్మస్ పండుగ జరుపుకోవాల్సిన ఆమె జైల్లో గడపాల్సివచ్చింది. లాస్ ఏంజెలెస్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుందని మియామికి చెందిన వార్తా చానల్ వెల్లడించింది. లాస్ఏంజెలెస్- ఫోర్ట్ లాడర్డేల్ ఫ్లోరిడాకు విమానంలో నిందితురాలు త్రిషా సేన్ ఈ దాడికి పాల్పడింది.
ఎయిర్లైన్స్ ఉద్యోగిగా చెప్పుకుంటూ తనకు అదనంగా మరో డ్రింక్ కావాలని, కిటికీ పక్క సీటు ఇవ్వాలని అడిగింది. అందుకు విమాన సిబ్బంది ఒప్పుకోకపోవడంతో గొడవకు దిగింది. పైలట్ మధ్యలో కలగజేసుకోవడంతో అతడిని గోళ్లతో గీరేసింది. ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టాడు. దీంతో త్రిషా సేన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని క్రిస్మస్ రోజున కోర్టులో ప్రవేశపెట్టారు.
డ్రింక్ ఇవ్వలేదని పైలట్ పై ఎన్నారై మహిళ దాడి
Published Mon, Dec 30 2013 4:49 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement