astronauts
-
స్పేస్ ఫుడ్ టేస్ట్‌ని ఇలా పరీక్షిస్తారా..? వీడియో వైరల్
అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు భోజనం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలనే కుతుహలం అందరికి ఉంటుంది. అయితే ఇటీవల సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల పుణ్యమా అని అంతరిక్షంలో వ్యోమగాముల కష్టాలు, భోజనం ఎలా ఉంటుదనేది తెలిసింది. ఎందుకంటే ఎనిమిది రోజుల యాత్రకని బయలుదేరి ఏకంగా తొమ్మిదినెలలు అంతరిక్షంలోనే చిక్కుకుపోవడంతో వాళ్ల ఆర్యోగపరిస్థితి..వాళ్ల భోజనం ఎలా.. అనే వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటించడంతో ప్రజలకు తెలిసింది. అదీగాక భారరహిత స్థితిలో ఉండే వాళ్లకు ఎలాంటి ఫుడ్ బెటర్ అనేది ప్రముఖ నిపుణులు పలు దఫాలుగా కేర్ తీసుకుని మరీ ప్యాక్ చేస్తారని విన్నాం. మరీ వాటి టేస్ట్ ఎలా ఉంటయనేది మనం వినలేదు కదా..అదెలా ఉంటుంది, ఎవరు దాన్ని పరీక్ష ఇస్తారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.వ్యోమగాములకు అందించే భోజనాలను ఎలా టెస్ట్ చేస్తారో Axiom స్పేస్ షేర్ చేసింది. వచ్చే నెల మేలో ప్రారంభం కానున్న ఆక్సియం మిషన్ 4 (Ax-4) కోసం సన్నాహాలు వేగవంతం కావడంతో వ్యోమగాములకు అందించే ఆహారం టేస్ట్ సెషన్ ఎలా ఉంటుందో వివరించింది. ఈ రుచి సెషన్ ట్రయల్‌లో భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా పాల్గొన్నారు. ఈ ఏడాది మేలో ఈ ఆక్సియం మిషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఆక్స్-4 సిబ్బందికి ఇచ్చే స్పేస్ ఫుడ్ టెస్ట టెస్ట్ ఎలా ఉంటుందో కళ్లకటినట్లుగా చూపించింది Axiom స్పేస్. ఈ ట్రయల్ సెషన్ మైసూరులో డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (DFRL)లో నిర్వహించారు. ముందుగా వ్యోమగాములకు అందించే ఫుడ్ నమునాలను ఆ సెషన్లో పాల్గొన్న వాళ్లు రుచి చూసి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఫుడ్‌ని వ్యోమగాములు 14 రోజుల మిషన్ సమయంలో తినేందుకు పంపడం జరుగుతుంది. ఇక్కడ తాము టేస్ట్ చేసి..నచ్చినా నచ్చకపోయినా వాటికి స్కోర్లు ఇవ్వక తప్పదని అన్నారు శుక్లా. ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఐఎస్ఎస్కి పంపుతారని అన్నారు.ట్రయల్‌లో ఏం వంటకాలు ఉంటాయంటే..ట్రయల్ సమయంలో వడ్డించే ఆహారంలో దాల్ చావల్, రాజ్మా, కిచ్డి మరియు వెజిటబుల్ బిర్యానీ వంటి ప్రసిద్ధ కంఫర్ట్ వంటకాలు సుమారు 50 ఉన్నాయి. శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా ప్రాసెస్ చేస్తూనే భారతీయ వంటకాల ప్రామాణిక రుచిని పోకుండా కేర్ తీసుకుంటారట.ఇదిలా ఉండగా..ఈ మిషన్ కారణంగా శుభాన్షు శుక్లా ISSకి ప్రయాణించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏఎక్స్4 మిషన్‌లో పోలాండ్‌కు చెందిన సావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు తదితరులు ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉండాల్సినా ఆ సమయంలో తమకు ఆహారం చాలా ముఖ్యమని, అది తమకు ఓదార్పునిస్తుందన్నారు శుక్లా.కాగా, భారత వైమానిక దళ పైలట్, గగన్‌యాన్ మిషన్‌కు వ్యోమగామి అయిన శుభాన్షు శుక్లా స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో పైలట్‌గా వ్యవహరించనున్నారు. అలాగే ఈ మిషన్ ఆక్స్-4లో శాస్త్రీయ ప్రయోగాలు, ఔట్రీచ్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయట. We're counting down to the #Ax4 crew launch, expected no earlier than May this year. In our new astronaut training video series, you'll learn what it takes to prepare for a mission, from the crew's arrival in Houston all the way to launch day.Ever wondered what it takes to… pic.twitter.com/wqzcspiMuV— Axiom Space (@Axiom_Space) April 15, 2025 (చదవండి: ఆవేశం అదే క్షణం.. ఆవేదన జీవితాంతం..) -
Sunita Williams: మళ్లీ స్టార్ లైనర్‌లో ఐఎస్ఎస్కు వెళ్తారా?
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఆరోగ్యంగానే ఉన్నారు. దాదాపు 9 నెలల అనంతరం మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమ్మీదకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇన్నాళ్లపాటు పరిశీలనలో ఉన్న వీళ్లు తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఐఎస్ఎస్ అనుభవాలతో పాటు.. వాళ్లు అక్కడ ఉన్న సమయంలో భూమ్మీద జరిగిన చర్చలు, ఆందోళనలు, విమర్శలు తదితర అంశాలపైనా స్పందించారు. అవకాశం వస్తే మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్( Boeing Starliner) స్పేస్‌క్రాఫ్ట్‌లో ఐఎస్ఎస్కు వెళ్తారా? అని ఫాక్స్ న్యూస్ జరిపిన ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు. అది చాలా సామర్థ్యం గల వాహకనౌక అని భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(Sunita Williams) అన్నారు. అయితే స్టార్ లైనర్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో స్టార్‌లైనర్‌లో ఏర్పడ్డ సమస్యలను పరిష్కస్తామని పేర్కొన్నారు.నిర్లక్ష్యం వల్లే ఇరుక్కుపోయారనే విమర్శలకూ ఇద్దరూ స్పందించారు. తామెప్పుడు అలా భావించలేదని అన్నారు. ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టే ఉద్దేశమూ తమకు లేదని అన్నారు. అనుకున్న ప్రకారం తాము భూమ్మీదకు రాలేకపోయామని.. ఒకరకంగా ఇరుక్కుపోయామనే భావించాల్సి ఉంటుందని, మరోరకంగా అక్కడ ఉండాల్సి వచ్చిందని.. అయినప్పటికీ తాము తీసుకున్న కఠోర శిక్షణ ఆ పరిస్థితులను తట్టుకోగలిగే సామర్థ్యం ఇచ్చిందని ఇద్దరూ అన్నారు. తమ మిషన్ విజయవంతం కావడంలో నాసా కృషిని, తాను సాధారణ స్థితికి రావడానికి సాయం చేసిన శిక్షకులకు సునీత ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్(Elon Musk)లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో తీసుకున్న శిక్షణ వల్లే.. ఐఎస్ఎస్కు తీసుకెళ్లడం, అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా గడపడం, తిరిగి భూమిపైకి రావడంలో, అలాగే పునరావాసం, కొత్త సవాళ్లకు సిద్ధకావడానికి ఎంతో సహాయం చేశాయన్నారు. భూమిపైకి వచ్చాక ఇప్పటికే తాను మూడు మైళ్లు పరుగెత్తానని సునీత అన్నారు. ఐఎస్ఎస్లో ఉన్న సమయంలో తమ టాస్క్‌ల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని, శిక్షణ పొందామని విల్మోర్ పేర్కొన్నారు.ఇక ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు తన ఆరోగ్యం గురించి చాలా మంది ఆందోళనకు గురైన విషయం తనకు తెలుసని సునీతా విలియమ్స్ అన్నారు. అయితే తాము ఒక పెద్ద టీమ్ ప్రయత్నంలో భాగమై ఉన్నట్లు తెలిపారు. విల్మోర్ మాట్లాడుతూ.. మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక్కతాటిపైకి తెస్తుందని అన్నారు. ఇక స్టార్‌లైనర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, హీలియం లీకేజీల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్న నాసా, బోయింగ్ టీమ్స్ నిబద్ధతను ఆయన కొనియాడారు. తమకు నాసాపై ఎంతో నమ్మకముందన్నారు. తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబద్ధతకు సంబంధించి ఇదొక మైలురాయిగా వారు అభివర్ణించారు.Astronauts Butch Wilmore & Sunita Williams express their views, carefully, with deliberate wording. Positive rather than negative or unhelpful.#ButchWilmore #SunitaWilliams #Trump https://t.co/qTYEdAbUMN— I can see Ireland from here. Gerry (@gtp_58) March 31, 2025సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు ఇదే ప్రెస్మీట్లో పాల్గొన్న మరో వ్యోమగామి, క్రూ-9 కమాండర్ నిక్ హేగ్ మాట్లాడుతూ.. మిషన్ చుట్టూ రాజకీయం నడిచిందన్న వాదనను తోసిపుచ్చారు. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం.. వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయారు. ఇక వ్యోమగాములు లేకుండానే స్టార్‌లైనర్ కొన్నిరోజులకు భూమిపైకి తిరిగొచ్చింది. నాటినుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. అనేక ప్రయత్నాల అనంతరం.. ఈ ఏడాది మార్చిలో స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్‌లో వారు ఐఎస్ఎస్ నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు సైతం వాహకనౌకలో వచ్చారు. దీంతో హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు వీళ్లను తరలించి పరిశీలనలో ఉంచారు. అనంతరం.. 12 రోజుల అనంతరం తొలిసారి ఇప్పుడు బయటి ప్రపంచం ముందుకు వచ్చారు. -
నిరీక్షణ ఫలించిన క్షణం...
మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు ‘రాశి చక్రగతులలో/రాత్రిందివాల పరిణామాలలో/ బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో/ కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన/ పరమాణువు సంకల్పంలో...’ ప్రభ వించిన మానవుడు మరోసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. కేవలం ఎనిమిది రోజులని భావించింది కాస్తా 286 రోజులపాటు అంతరిక్షంలో ఉండిపోక తప్పని వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, వారిని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళిన మరో ఇద్దరూ నిర్దేశించిన సమయానికల్లా క్షేమంగా, సురక్షితంగా భూమ్మీదకు చేరుకోవడం సంక్లిష్టమైన సవాళ్లపై విజ్ఞాన శాస్త్రం సాధించిన అపూర్వ విజయం. మెక్సికో జలసంధి కెరటాల్లో వారిని తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ కాప్సూ్యల్ తేలియాడుతుండగా డాల్ఫిన్ల గుంపు దాని చుట్టూ వలయాకారంలో స్వాగతిస్తున్నట్టు తిరుగాడటం ఆహ్లాదాన్ని పంచింది. మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)ను వీడి దాదాపు 16 గంటలు ప్రయాణించి భారత కాలమానం ప్రకారం తెల్లారు జామున 3.30కి చేరు కున్నారు. అంతరిక్షానికి రాకపోకలు సాగించటం, అక్కడున్నన్నాళ్లూ నిరంతర పరిశోధనల్లో నిమ గ్నులు కావటం ఒక అనుపమానమైన, అసాధారణమైన విన్యాసం. ఎంతో ఏకాగ్రత, మరెంతో ఆత్మ విశ్వాసమూ, ఓరిమి ఉంటే తప్ప ఆ పరిశోధనలు పరిపూర్తి చేయటం కష్టం. ఎంతో ఇరుకైన ఒక చిన్న స్థలాన్ని మిగిలిన వారితో పంచుకోక తప్పక పోవటం సామాన్య విషయం కాదు. నిరుడు జూన్ 5న అంతరిక్షయానం ప్రారంభం కాగా, ఆ మరునాడు అక్కడికి చేరుకుని ఐఎస్ఎస్లో ఈ వ్యోమ గాములు పని ప్రారంభించారు. సునీత ఇప్పటికే మూడుసార్లు అంతరిక్షయానం చేయటంతో పాటు ఒక దఫా ఐఎస్ఎస్ కమాండర్గానూ వ్యవహరించారు. సునీత, బుచ్ అంతరిక్షంలో చిక్కుకుపోయా రనటాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగీకరించటం లేదు. వారిని సురక్షితంగా దించేందుకు అనువైన సమయం కోసం ఎదురుచూశామంటున్నది. వారికున్నంత ఆత్మవిశ్వాసం సాధారణ ప్రజలకుండదు. అందుకే సునీత రాక కోసం మానవాళి మొత్తం ఆదుర్దా ప్రదర్శించింది. అంతరిక్షయానం ఎనిమిది రోజులే అనుకుని వెళ్లి తొమ్మిది నెలలు ఉండక తప్పక పోవటమంటే అది వారి మానసిక స్థితిని మాత్రమే కాదు... శారీరక స్థితిగతులనూ ప్రభావితం చేస్తుంది. కేవలం ఎనిమిది రోజులకోసమైతే వారు సాధారణ వ్యాయామంతో సరిపెట్టుకోవచ్చు. అసలు చేయక పోయినా ఫరవాలేదంటారు. కానీ ఇంత సుదీర్ఘకాలం అక్కడ కొనసాగాలంటే మాత్రం శరీ రాన్ని బాగా కష్టపెట్టాలి. సుదీర్ఘ వ్యాయామం తప్పదు. గుండె, రక్తనాళాలూ సక్రమంగా పని చేయ టానికి అవి అవసరం. ఈ వ్యాయామాలు సహజంగానే కష్టంతో కూడుకున్నవి గనుక అందుకు వారిని మానసికంగా సంసిద్ధుల్ని చేయటంతోపాటు వారి దినచర్యలో అవసరమైన మార్పులు చేయాల్సి వస్తుంది. వారికి అందాల్సిన ప్యాకేజ్డ్ ఆహారం వివిధ రకాల రుచులతో సిద్ధంగానే ఉన్నా నచ్చింది తినడానికి లేదు. నిర్ణీత కొలతలో వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్నిటిని తట్టుకుంటూ, నిర్దిష్టమైన సమయాల్లో వ్యాయామాలు చేస్తూ పరిశోధనలు సాగించటం, అందులో వెల్లడైన అంశా లపై పరస్పరం చర్చించుకుని నిర్ధారణలకు రావటం అంతరిక్ష యాత్రికులకు తప్పనిసరి. ఇంతవరకూ మూడు దఫాలు అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీత మొత్తం 62 గంటల 6 నిమి షాలు స్పేస్ వాక్ చేశారంటే... ఆ రకంగా ఆమె మహిళా అంతరిక్ష యాత్రికుల్లో అగ్రస్థానాన్నీ, మొత్తం వ్యోమగాముల్లో నాలుగో స్థానాన్నీ పొందారంటే... అది సునీత దృఢసంకల్పానికి అద్దం పడుతుంది. ఈ అంతరిక్ష యానంలో భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో 900 గంటలపాటు ఆమె వివిధ రకాలైన 150 పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. ఈ తొమ్మిది నెలల్లో ఆమె పరిశోధనలు సాగించిన ఐఎస్ఎస్... భూకక్ష్యలో 4,576 సార్లు తిరగ్గా ఆ నిడివి 19 కోట్ల 40 లక్షల కిలోమీటర్లు! అబ్బురపరిచే విషయమిది. అవకాశం లభిస్తే స్త్రీలు అందరినీ మించుతారనడానికి సునీత ప్రతీక.ఈ అంతరిక్ష యాత్రలైనా, అంతరిక్ష నౌకల అన్వేషణలైనా... వాటి అంతిమ సారాంశం ఏక గ్రహజీవిగా ఉన్న మనిషిని బహు గ్రహజీవిగా మార్చటం. అంతరిక్షంలో సాగించే పరిశోధనలు భవి ష్యత్తులో మనుషులందరూ సునాయాసంగా గ్రహాంతర యానాలు చేయటానికి, అక్కడి పరిస్థితు లకు తట్టుకోవటానికీ తోడ్పడతాయి. ఈ యాత్రలు మున్ముందు మనుషుల్ని పోలిన గ్రహాంతర జీవులతో మనల్ని అనుసంధానించవచ్చు. 1906లో హెచ్‌జీ వెల్స్ రచించిన ‘వార్ ఆఫ్ ది వర్ల్›్డ్స’ నవల ఊహించినట్టు ఆ గ్రహాంతర జీవులు మనపైకి దండయాత్రకొచ్చే ప్రమాదమూ లేకపోలేదు.విశ్వం గురించిన మన జ్ఞానం పరిధి రోజురోజుకూ విస్తరిస్తోంది. కోట్లాది కాంతి సంవత్సరాల దూరంలో సైతం లెక్కలేనన్ని పాలపుంతలున్నాయని, భూమిని పోలిన గ్రహాల ఆచూకీ తెలిసిందని శాస్త్రవేత్తలు చెబుతుంటే ఎంతో విస్మయం కలుగుతుంది. రెక్కలు కట్టుకుని పైపైకి వెళ్లేకొద్దీ మన భూమి సూది మొన మోపినంత పరిమాణంలో కనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తే మనం కృత్రిమంగా ఏర్పర్చుకున్న సరిహద్దులు, ఆర్థిక సామాజిక తారతమ్యాలు కనబడవు. విషాదమేమంటే... ఎదిగినకొద్దీ విశాలం కావాల్సిన చూపు కాస్తా మూఢ విశ్వాసాల్లో, మూర్ఖత్వపు మలుపుల్లో సంకు చితమవుతోంది. నలుగురు వ్యోమగాములు సగర్వంగా భూమ్మీదకు తిరుగు పయనమైన రోజే 400 మంది అమాయక పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ బాంబుదాడుల్లో కన్నుమూశారంటే అది మనుషుల్లోని రాక్షసత్వాన్ని చాటుతుంది. ఇలాంటి విషాదాలకు తావులేని కాలం ఆగమిస్తే తప్ప ఈ విజయాలు మనకు పరిపూర్ణమైన సంతోషాన్ని కలగజేయలేవు. -
భూమి మీదకు రాగానే.. స్విమ్మింగ్ పూల్‌లోనే ఎక్కువ సమయం ఎందుకు?
స్పేస్ ట్రావెల్ టాస్క్ ముందు పురుషులకే పరిమితమై దాన్ని ‘మ్యాన్ మిషన్’గా వ్యవహరించేవాళ్లు. కానీ ఆస్ట్రనాట్స్కిచ్చే ట్రైనింగ్‌లో ఆడ, మగ అనే తేడా ఉండదు. ఇద్దరూ ఒకేరకమైన శక్తితో ఉంటారు. ఇంకా చెప్పాలంటే శారీరకంగా, మానసికంగా పురుషుల కన్నా స్త్రీలే బెటర్. అందుకే ఇప్పుడు దాన్ని ‘హ్యుమన్ మిషన్’ పేరుతో జెండర్ న్యూట్రల్ (Gender Neutral) చేశారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్లనే స్పేస్‌కి సెలెక్ట్ చేసుకుంటారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ దగ్గర్నుంచి అక్కడ పరిస్థితి, అనుకోని అవాంతరాలను ఎదుర్కోవడం వరకు ట్రైనింగ్ చాలా టఫ్‌గా ఉంటుంది.ఆస్ట్రనాట్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. అందుకే ఒకవేళ మిషన్ ఫెయిలైతే స్పేస్ షిప్ (Space Ship) నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా శిక్షణ ఇస్తారు. ఇదీ వాళ్ల మానసిక, శారీరక దారుఢ్యం మీదే ఆధారపడి ఉంటుంది. వీటన్నిటిలో సునీతా విలియమ్స్ (Sunita Williams) పర్ఫెక్ట్. కాబట్టే స్పేస్ స్టేషన్‌కి వెళ్లారు. అయితే ఎనిమిది రోజులు మాత్రమే ఉంటామనే మైండ్‌సెట్‌తో వెళ్లిన వాళ్లు తొమ్మిది నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. అలా స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్‌ను నాసా వాళ్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తునే ఉన్నారు.ఆహారం దగ్గర్నుంచి వాళ్ల అవసరాలన్నీ కనిపెట్టుకున్నారు. ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందుకే వాళ్లక్కడ క్రమం తప్పకుండా ఎక్సర్సైజెస్ చేశారు. వాళ్లు తమ హెల్త్ కండిషన్స్‌ను చెక్ చేసుకునేందుకు కావల్సిన సౌకర్యాలన్నీ స్పేస్ స్టేషన్లో ఉన్నాయి. నాసా డాక్టర్స్ సలహాలు, సూచనల మేరకు వాళ్లు తమ హెల్త్ కండిషన్స్‌ను చెక్ చేసుకుంటూ ఉన్నారు. మూడు నెలలకోసారి ఫుడ్, మెడిసిన్స్‌ను స్పేస్ స్టేషన్‌కి పంపారు. వాళ్ల మానసిక స్థితిని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మనోస్థైర్యం కోల్పోకుండా చూసుకున్నారు.స్విమ్మింగ్ పూల్... లిక్విడ్ ఫుడ్తొమ్మిది నెలలు భారరహిత స్థితికి అలవాటు పడిన వాళ్లు ఇప్పుడు ఒక్కసారిగా భూమి మీది వాతావరణంలో ఇమడ లేరు. ఎముకలు, కండరాలు బలహీనమైపోతాయి. ఫ్యాట్ కనీస స్థాయికి తగ్గిపోయుంటుంది. భూమి మీదకు రాగానే ముందు వాళ్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎముకలు, కండరాల పటుత్వానికి మెడిసిన్స్ ఇస్తారు. ఇన్నాళ్లూ భారరహిత స్థితిలో ఉండటం వల్ల వాళ్లు నిలబడలేరు.. కూర్చోలేరు.. పడుకోలేరు. అలా ఫ్లోటింగ్ స్థితిలోనే ఉండిపోతారు.అందుకే వాళ్లకు బెల్ట్ లాంటిది పెట్టి.. కూర్చోబెడతారు. దాని సాయంతోనే పడుకోబెడతారు. నిలబడ్డానికీ అలాంటి సపోర్ట్‌నే ఏర్పాటు చేస్తారు. ఈ వాతావరణానికి వీలైనంత త్వరగా అలవాటుపడేందుకు ఎక్కువ సమయం వాళ్లను స్విమ్మింగ్ పూల్‌లో ఉంచుతారు. నీళ్లలో తేలుతూ స్పేస్‌లో ఉన్నట్టే ఉంటుంది కాబట్టి.. వాళ్లను వాళ్లు సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దాదాపు మూడు నెలల వరకు ఇలాంటి ప్రాసెసే ఉంటుంది. దాన్నుంచి వాళ్లు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తారు. ఆహారం విషయంలోనూ అంతే! కొన్నాళ్లపాటు స్పేస్‌లో తీసుకున్నట్టే సెమీ లిక్విడ్ ఫామ్‌లోనే ఫుడ్ ఇస్తారు. – డాక్టర్ ఎస్వీ సుబ్బారావు, సీనియర్ సైంటిస్ట్, అసోసియేట్ డైరెక్టర్, రేంజ్ ఆపరేషన్, ఇస్రోభూమికి తిరిగి వచ్చిన తరువాత... రివర్స్!సునీతా విలియమ్స్‌కు ఇష్టమైన సినిమా... టామ్ క్రూజ్ ‘టాప్ గన్’. ‘టాప్ గన్’ కిక్‌తో జెట్లు నడపాలనుకుంది. హెలికాప్టర్ నడపాలనుకుంది. ‘టెస్ట్ పైలట్ స్కూల్’కు హాజరై, ఆస్ట్రోనాట్స్‌తో మాట్లాడిన తరువాత తన మీద తనకు నమ్మకం వచ్చింది. చదవండి: గురుత్వాకర్షణ లేని కురుల అందంఒకానొక సందర్భంలో అంతరిక్ష వాతావరణంలో ఉన్నవారిపై చోటు చేసుకునే ఆశ్చర్యాల గురించి ఇలా చెప్పింది... ‘అంతరిక్షంలో శారీరక మార్పులు ఆసక్తికరంగా ఉంటాయి. నా జుట్టు, గోర్లు వేగంగా పెరగడాన్ని గమనించాను. ముఖంపై కొన్ని మడతలు తాత్కాలికంగా తొలగిపోతాయి. వెన్నెముకకు సంబంధించి కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే భూమికి తిరిగి వచ్చిన తరువాత ఈ మార్పులు రివర్స్ అవుతాయి. వెన్ను కొద్దిగా నొప్పిగా ఉంటుంది’ అని పేర్కొంది. -
Sunita Williams: సునీతా విలియమ్స్‌ను స్వాగతించిన డాల్ఫిన్లు
వాషింగ్టన్: అమెరికన్ వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్మోర్లను సముద్రంలోని డాల్ఫిన్లు స్వాగతించాయి. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుండి భూమికి తిరిగి వచ్చిన ఈ వ్యోమగాములను చూసి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి డాల్ఫిన్ల ఆనందం కూడా తోడయ్యింది. పలు ఇబ్బందుల అనంతరం అంతరిక్ష నౌక చివరకు వ్యోమగాములతో పాటు ఫ్లోరిడా బీచ్‌లో దిగింది. There are a bunch of dolphins swimming around SpaceX's Dragon capsule. They want to say hi to the Astronauts too! lol pic.twitter.com/sE9bVhgIi1— Sawyer Merritt (@SawyerMerritt) March 18, 2025భారత కాలమానం ప్రకారం ఈ ల్యాండింగ్(Landing) బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ సమయంలో నాసా బృందం వ్యోమగాములను స్వాగతించడానికి చిన్నపాటి షిప్‌లతో సిద్ధమయ్యింది. ఈ సమయంలో సముద్రంలో అరుదైన దృశ్యం కనిపించింది. సునీతా విలియమ్స్ ఉన్న క్యాప్స్యూల్‌ను పలు డాల్ఫిన్లు చుట్టుముట్టాయి. డాల్ఫిన్ల గుంపు అంతరిక్ష నౌక చుట్టూ ఈదుతూ కనిపించింది. సునీతా విలియమ్స్‌తో పాటు ఆమె సహచరులను క్యాప్సూల్ నుండి బయటకు తీసుకువస్తున్నప్పుడు పలు డాల్ఫిన్లు క్యాప్సూల్ చుట్టూ గుమిగూడాయి.దీనికి సంబంధించిన వీడియోను నాసా సిబ్బంది సాయర్ మెరిట్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ చుట్టూ డాల్ఫిన్లు ఈదుతున్నాయి’ అని రాశారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాగా రికవరీ నౌక వ్యోమగాములను క్యాప్సూల్ నుండి బయటకు తీసుకువచ్చాక, వారిని 45 రోజుల పునరావాస కార్యక్రమం కోసం హ్యూస్టన్‌లోని ఒక కేంద్రానికి తరలించారు. -
మానవ సంకల్ప విజయానికి ప్రతీక!
సైన్స్ చరిత్రను తిరగేస్తే యాదృచ్ఛికంగా జరిగిన ఆవిష్కరణలు కోకొల్లలు కనిపిస్తాయి. ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలం అక్కడే గడపడమూ ఈ కోవకే చెందుతుంది. ఎందుకంటే... మనిషి యుగాలుగా ఆశిస్తున్న, ఆకాంక్షిస్తున్న గ్రహాంతరయానమనే స్వప్నాన్ని ఈ యాత్ర మరికొంత దగ్గర చేసింది మరి!సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు తిరిగి భూమిని చేరిన రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. అంత రిక్ష ప్రయోగాల్లో ఇదో చరిత్రాత్మక ఘట్టంగానే చూడాలి. బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు రావడం, సకాలంలో వాటిని సరిదిద్దే అవకాశం లేకపోవడంతో ఈ ఇద్దరు వ్యోమగా ములు మునుపెవ్వరూ గడపనంత అత్యధిక సమయాన్ని ఐఎస్ఎస్లో గడపాల్సి వచ్చింది. భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూండే ఐఎస్ఎస్లో ఉండటం అంత ఆషా మాషీ వ్యవహారం కానేకాదు. అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటుందిక్కడ. దీనివల్ల శరీరంలోని ద్రవాలన్నీ ఉండాల్సిన చోట కాకుండా... శరీరం పైభాగంలోకి చేరుతూంటాయి. ఇరవై నాలుగు గంటలకు ఒకసారి సూర్యోదయ, సుర్యాస్తమయాలను చూసే మనిషి... ఐఎస్ఎస్లో వీటిని పదహారు సార్లు చూడాల్సి వస్తుంది. ఇది కాస్తా వ్యోమగాముల నిద్రపై ప్రభావం చూపుతుంది. కంటినిండా కునుకు లేక... కుటుంబానికి దూరంగా... ఇరుకైన చిన్న గదిలో నెలలపాటు గడపడం ఎంత కష్టమో మనం ఊహించనైనా ఊహించ లేము. ఊపిరి తీసుకోవడం మొదలుకొని కాలకృత్యాలు తీర్చుకోవడం వరకూ ప్రతి ఒక్కటి మానసికంగానూ, భౌతికంగానూ సవాలే! ఇంతటి శ్రమకోర్చి మరీ వీరు భూమికి తిరిగి వస్తూండటమే ఈ అంతరిక్ష ప్రయో గాన్ని మిగిలిన వాటికంటే ప్రత్యేకమైందిగా మారుస్తోంది.తొమ్మిది నెలలు చేసిందేమిటి?గత ఏడాది జూన్‌లో సునీత, విల్మోర్లు ఇద్దరూ ఐఎస్ఎస్కు ప్రయాణమైనప్పుడు వారి వద్ద ఎనిమిది రోజు లకు సరిపడా ప్రణాళికలైతే సిద్ధంగానే ఉన్నాయి. ఏ ఏ ప్రయోగాలు చేపట్టాలి. ఐఎస్ఎస్ నిర్వహణ తాలూకూ పనులు ఏమిటి? అన్నది వీరికి తెలుసు. కానీ అనూహ్యంగా వారి తిరుగు ప్రయాణం నిరవధికంగా వాయిదా పడింది. దీంతో వారికి ఎదురైన సరికొత్త సవాలు అంతకాలం ఏం చేయాలి? అన్నది. నాసా పరిశోధకుల సలహా సూచనల మేరకు వీరు ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు 150 వరకూ పరిశోధనలు చేపట్టారు. జీవ వ్యవస్థలపై సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం, అంతరిక్షంలో మొక్కల పెంపకం, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు అంతరిక్షంలో ఎలా ప్రవర్తిస్తాయి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు... భవిష్యత్తులో మనిషి సుదీర్ఘకాలం పాటు అంతరిక్ష ప్రయాణాలు చేపట్టాల్సి వస్తే... అంతరిక్ష నౌకల్లో అగ్ని ప్రమాదాల్లాంటివి జరక్కుండా ఉండేందుకు... మంటలు ఎలా వ్యాపిస్తాయి? అన్న విషయంపై పరిశోధనలు నిర్వహించారు కూడా! దీంతో పాటే గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల శరీరంలోని కండరాలకు జరిగే నష్టాన్ని నివారించేందుకు యూరో పియన్ ఎన్ హాన్్సడ్ ఎక్స్‌ప్లోరేషన్ ఎక్సర్సైజ్ డివైజ్(ఈ4డీ)ని పరీక్షించారు. ఈ పరికరం సైక్లింగ్, రోయింగ్లతోపాటు రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ల ద్వారా వ్యోమగాముల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. అలాగే గ్రహాంతర ప్రయాణాలకు కీలకమైన నీటి పునర్వినియోగం, ప్రత్యేకమైన సూక్ష్మజీవుల ద్వారా మనిషికి అవసరమైన పోషకాల ఉత్పత్తి వంటి అంశాలపై కూడా ప్రయోగాలు చేశారు. సౌర కుటుంబం మొత్తమ్మీద మనిషి జీవించేందుకు జాబిల్లి తరువాత కొద్దోగొప్పో అనుకూలతలున్న గ్రహం అంగారకుడు. స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఇంకొన్నేళ్లలోనే మనిషిని అంగారకుడిపైకి చేరుస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్లో సునీతా, విల్మోర్లు గత తొమ్మిది నెలలుగా చేసిన ప్రయోగాలకు, పరిశోధనలకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. సుదీర్ఘకాలం పాటు అంతరిక్షంలో ఉండటం భౌతికంగా, మానసికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఈ తొమ్మిది నెలల ప్రయాణం తరువాత శాస్త్రవేత్తలకు కొంత స్పష్టత ఏర్పడి ఉంటుంది. దీని ఆధారంగా భవిష్యత్తులో అంగారక ప్రయాణం జరిగే అవకాశాలు లేకపోలేదు. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మన ఎముకలు పెళుసుబారుతాయి. కండరాలు, దృష్టి బలహీనపడతాయి. అలాంటప్పుడు ఏ రకమైన వ్యాయామాల ద్వారా నష్టాన్ని పరిమితం చేయవచ్చునన్నది సునీత, విల్మోర్ల పరిశోధనల ద్వారా తెలిసింది. అంతరిక్షంలో ఉండే విపరీతమైన రేడియోధార్మికత నుంచి వ్యోమ గాములను రక్షించుకునేందుకు కూడా వీరి ప్రయోగాలు సాయపడతాయి.వ్యోమగాముల త్యాగాల గురుతులు...ఎట్టకేలకు సునీత, విల్మోర్లు భూమిని చేరనున్నార న్నది అందరికీ సంతోషం కలిగించే వార్తే. కాకపోతే ఆ ఇద్దరు వ్యోమగాములు ఇప్పటివరకూ ఉన్న సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి వాతావరణం నుంచి సాధారణ పరిస్థితులకు ఎలా అడ్జెస్ట్ అవుతారన్నది ఒక ప్రశ్న. ఇది మరోసారి వారి సహనాన్ని, దృఢ చిత్తాన్ని పరీక్షించనుంది. వ్యోమగాముల శ్రమ, వేదన లను గమనిస్తే మానవ కల్యాణం కోసం వారు ఇంత త్యాగం చేస్తున్నారా? అనిపించకమానదు. సునీత, విల్మోర్లు ఇద్దరూ 300కుపైగా రోజులు అంతరిక్షంలో గడపడం ఒక రికార్డే. అయితే ఇది వారి వ్యక్తిగత మైంది కాదు. మానవ సంకల్పానికి లభించిన విజయమని చెప్పాలి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా), స్పేస్–ఎక్స్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భాగస్వా ములైన సుమారు 15 దేశాల శాస్త్రవేత్తలు అందరి ఉమ్మడి విజయం. ‘చందమామ రావే... జాబిల్లి రావే’ అంటూ పాట లకే పరిమితమైన ఒక తరం మాదిరిగా కాకుండా... ‘గ్రహ రాశులను అధిగమించి, ఘనతారల పథము నుంచి... గగ నాంతర రోదసిలో గంధర్వ గోళగతులు దాటి’ అంటూ సాగే నవతరానికి స్ఫూర్తి కూడా!– గిళియార్ గోపాలకృష్ణ మయ్యా, సీనియర్ జర్నలిస్ట్ -
గుడ్‌బై ఐఎస్ఎస్
కేప్ కెనవెరాల్: తొమ్మిది నెలలకు పైచిలుకు అంతరిక్షవాసానికి తెర పడింది. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో పాటు నాసాకు చెందిన మరో వ్యోమగామి బచ్ విల్మోర్ మంగళవారం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి భూమికి బయల్దేరారు. గత సెప్టెంబర్‌లో ఐఎస్ఎస్కు వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు నిక్ హ్యూస్, అలెగ్జాండర్ గోర్బనోవ్ కూడా వారితో పాటు తిరిగొస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.30 తర్వాత వ్యోమనౌక ఐఎస్ఎస్ నుంచి విడివడింది. కాసేపటికి భూమివైపు 17 గంటల ప్రయాణం ప్రారంభించింది.వాతావరణం అనుకూలిస్తే బుధవారం తెల్లవారుజామున 2.41కి అది భూ కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఆ క్రమంలో వాతావరణంతో రాపిడి వల్ల పుట్టుకొచ్చే విపరీతమైన వేడికి క్యాప్సూల్ మండిపోకుండా అందులోని హీట్‌షీల్డ్ రక్షణ కవచంగా నిలుస్తుంది. కాసేపటికి వ్యోమనౌకలోని నాలుగు ప్యారాచూట్లు తెరుచుకుని దాని వేగాన్ని బాగా తగ్గిస్తాయి. చివరికి క్యాప్సూల్ గంటకు కేవలం 5 కి.మీ. వేగంతో తెల్లవారుజాము 3.27 గంటలకు అమెరికాలో ఫ్లోరిడా తీరానికి సమీపంలో సముద్రంలో దిగుతుంది. ఆ వెంటనే నలుగురు వ్యోమగాములను ఒక్కొక్కరుగా అందులోంచి బయటికి తీసుకొస్తారు. అనంతరం తదుపరి పరీక్షల నిమిత్తం నేరుగా నాసా కేంద్రానికి తీసుకెళ్తారు.సునీత బృందం తిరుగు ప్రయాణం సందర్భంగా ఐఎస్ఎస్లో భావోద్వేగపూరిత సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. తిరుగు ప్రయాణంలో ఎదురయ్యే విపరీతమైన పీడనం, ఒత్తిళ్లను తట్టుకునేందుకు అనువైన స్పేస్ సూట్, హెల్మట్, బూట్లు తదితరాలు ధరించి వారంతా చివరిసారిగా ఐఎస్ఎస్లో కలియదిరిగారు. స్పేస్ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలో ఆదివారం ఐఎస్ఎస్కు చేరుకున్న వ్యోమగాములతో ఫొటోలు, సెల్పిలు దిగుతూ సందడి చేశారు. వారిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.అనంతరం సునీత బృందానికి వారు వీడ్కోలు పలికారు. ‘‘మిమ్మల్ని ఎంతగానో మిస్సవుతాం. మీ ప్రయాణం అద్భుతంగా సాగాలి’’ అని నాసా ఆస్ట్రోనాట్ అన్నే మెక్‌క్లెయిన్ ఆకాంక్షించారు. సునీత తదితరులు తమ వస్తువులతో వ్యోమనౌకలోకి చేరుకోగానే దాని ద్వారాన్ని మూసేశారు. రెండు గంటలపాటు పూర్తిస్థాయి పరీక్షలు చేసి అంతా సరిగానే ఉందని నిర్ధారించారు. అనంతరం డ్రాగన్ భూమికేసి బయల్దేరింది. 2024 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ తొలి మానవసహిత ప్రయోగంలో భాగంగా సునీత, విల్మోర్ ఐఎస్ఎస్కు వెళ్లారు. ఎనిమిది రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉండగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వీలుపడలేదు.మా హృదయాల్లో ఉన్నారు: మోదీ భారత్ రావాలంటూ సునీతకు లేఖసునీతా విలియమ్స్ సాధించిన విజయాల పట్ల 140 కోట్ల పై చిలుకు భారతీయులు ఎంతగానో గర్విస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2016లో అమెరికా పర్యటన సందర్భంగా సునీతను, ఆమె తండ్రి దివంగత దీపక్ పాండ్యాను కలిశానని గుర్తు చేసుకున్నారు. అనంతరం అమెరికా అధ్యక్షులు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్‌లతో భేటీ అయినప్పుడు కూడా ఆమె క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు.‘‘మీరు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా మా అందరి హృదయాలకు ఎప్పుడూ అత్యంత సన్నిహితంగానే ఉంటారు. అతి త్వరలో మిమ్మల్ని భారత్‌లో చూసేందుకు ఆత్రుతగా ఉన్నాం. తిరిగి రాగానే భారత్‌కు రండి. అది్వతీయ విజయాలు సాధించిన మీవంటి ఆత్మియ పుత్రికకు ఆతిథ్యమిచ్చేందుకు దేశం ఎదురు చూస్తోంది’’ అంటూ సునీతకు లేఖ రాశారు. దీనిపై ఆమె సంతోషం వెలిబుచ్చారు. మోదీకి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.పూర్వీకుల గ్రామంలో ప్రార్థనలుమెహసానా: సునీత క్షేమంగా భూమికి తిరిగి రావాలంటూ గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఉన్న ఆమె గ్రామం ఝులాసన్లో అంతా ప్రార్థనలు చేశారు. పలువురు గ్రామస్తులు ఒక రోజు ముందునుంచి అఖండ జ్యోతులు వెలిగించారు. బుధవారం సునీత క్షేమంగా దిగేదాకా అవి వెలుగుతూనే ఉంటాయని ఆమెకు సోదరుని వరసయ్యే నవీన్ పాండ్యా వివరించారు. ‘‘ఆ తర్వాత భారీ ఎత్తున వేడుకలకు కూడా సర్వం సిద్ధమైంది.సునీత ఫొటోలు పట్టుకుని స్కూలు నుంచి ఆలయం దాకా ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. స్థానిక స్కూలు విద్యార్థులైతే 15 రోజులుగా ప్రార్థనలు చేస్తున్నారని ప్రిన్సిపల్ చెప్పారు. సునీత తండ్రి దీపక్ పాండ్యా 1957లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. 2006, 2013ల్లో సునీత ఝులాసన్ వచి్చవెళ్లినట్టు ఆమె బంధువులు గుర్తు చేసుకున్నారు. తనను మరోసారి ఆహా్వనిస్తామని చెప్పారు. -
గురుత్వాకర్షణ లేని కురుల అందం!
కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ‘మీ జుట్టు బాగుంది. అందంగా, దృఢంగా ఉంది. నేనేమీ జోక్ చేయడం లేదు. ఇది నిజం’ అని సునీతా విలియమ్స్ (Sunita Williams) జుట్టు గురించి ప్రశంసలతో ముంచెత్తాడు. జుట్టు అందం గురించి ప్రశంసలు వినడం సాధారణ విషయమే అయినా... అంతరిక్షంలో జుట్టును అందంగా, శుభ్రంగా కాపాడుకోవడం ఆషామాషీ విషయం కాదు! భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల తల స్నానం (Head Bath) చేయడం అనేది మనకసలు సమస్య కాదు. తలకు కాస్తంత షాంపు రుద్దుకొని షవర్ కింద నిలబడితే సరిపోతుంది.కాని అంతరిక్షంలో అలా కాదు. జుట్టు శుభ్రం చేసుకోవడం వ్యోమగాములకు కష్టమైన పని, దీనికి కారణం స్పేస్‌స్టేషన్‌లో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం.నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ కరెన్ నైబర్గ్ అంతరిక్షంలో జుట్టు ఎలా శుభ్రం చేసుకుంటారో ఒక వీడియోలో చూపించింది. ఈ జీరో గ్రావిటీ హెయిర్ వాషింగ్ ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంది. ‘హెయిర్ వాష్ (Hair Wash) చేసుకోవడానికి నేను వీటిని ఉపయోగిస్తాను’ అంటూ గోరు వెచ్చని నీటి పాకెట్, షాంపూ బాటిల్, దువ్వెన, అద్దం, వైట్ టవల్ చూపించింది.మొదట నీళ్లను తలపై స్ప్రే చేసుకుంది. దువ్వెనతో తల వెంట్రుకలను పైకి దువ్వడం మొదలుపెట్టింది. వెంట్రుకలు కుదురుగా ఉండకుండా వివిధ దిశలలో ఎగురుతూనే ఉన్నాయి. ఆ తరువాత షాంపూ రాసుకుంది. మళ్లీ తల వెంట్రుకలను పైకి దువ్వింది. తరువాత టవల్‌తో తల క్లీన్ చేసుకుంది. మళ్లీ తలపై వాటర్ స్ప్రే చేసి దువ్వెనతో పైకి దువ్వింది, టవల్‌తో తుడుచుకుంది. ‘శుభ్రం చేసుకునేటప్పుడు జుట్టును సరిగ్గా పట్టుకోవడం కష్టమవుతుంది’ అంటుంది నైబర్గ్.నైబర్గ్ తన జుట్టును స్థిరమైన స్థితిలో ఉంచడానికి పడుతున్న కష్టం మనకు వీడియోలో కనిపిస్తుంది. దువ్వుతున్నప్పుడు ఆమె జుట్టు వివిధ దిశలలో ఎగురుతుంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) లోపల ఎయిర్ ఫ్లో తలపై తేమను ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లో డ్రైయర్ల అవసరం ఉండదు. చాలాసార్లు వ్యోమగాములు హెల్మెట్ (Helmet) లేదా హెడ్గేర్లను ధరిస్తారు. ఇది నెత్తిమీద గాలి ప్రసరణ (ఎయిర్ సర్క్యులేషన్)ను బ్లాక్ చేస్తుంది. జుట్టును ఫ్రీగా వదిలేయడం వల్ల చల్లగా, సౌకర్యవంతంగా ఉంటుంది.చదవండి: సునీత రాక.. బైడెన్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలునిరంతరం బ్రష్ చేయడం వల్ల కూడా జుట్టును ముడి వేయాల్సిన అవసరం ఉండదు. భూమిమీద తల వెంట్రుకలు బుద్ధిగా మన మాట వింటాయి. అంతరిక్షంలో మాత్రం ‘నా ఇష్టం’ అన్నట్లుగా ఉంటాయి. అయితే వాటి ఇష్టం వ్యోమగాములకు కష్టం కాదు. చాలామంది మహిళా వ్యోమగాములు తమ జుట్టును ఫ్రీగా వదిలేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. భూమిపై మాదిరిగా తల వెంట్రుకలు (Hair) ముఖంపై పడవు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యమూ ఉండదు. -
Sunita Williams అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?
ఋతుక్రమం లేదా పీరియడ్స్‌ను భరించడం, ఆ మూడు రోజులు జాగ్రత్తగా ఉండటం సాధారణ మహిళలు లేదా అమ్మాయిలకే చాలా కష్టం. ముఖ్యంగా ఉద్యోగినులు, విద్యార్థినులకు ఇది ఇంకా కష్టం. మూడు రోజుల శారీరక బాధలతోపాటు, డ్రెస్‌కు ఏదైనా మరకలు ఉన్నాయా చూడవే బాబూ.. అని తోటి ఫ్రెండ్స్‌ను అడగడం మొదలు, ప్యాడ్ మార్చుకోవడానికి రిమైండర్లను సెట్ చేసుకోవడం, పగలు వినియోగానికి ఒక రకం, రాత్రి వినియోగానికి మరో రకం ప్యాడ్స్‌ను ఎంచుకోవడం, మంచంపైన దుప్పటికి మరకలైతే, అమ్మ తిడుతుందేమోనన్న భయం వరకు ఇలా చాలానే ఉంటాయి. ఆకాశమే హద్దు అంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు అంతరిక్షంలో కూడా అడుగు పెట్టారు. మరి అంతరిక్షంలో మహిళా వ్యోమగాములకు పీరియడ్స్ వస్తాయా? వస్తే ఎలా మేనేజ్ చేస్తారు?అంతరిక్షంలో చిక్కుకున్న నాసా( NASA) వ్యోమగామి సునీతా విలియం (Sunita Williams) బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. కేవలం ఎనిమిది రోజులు అనుకున్న ఈ ప్రయాణం తొమ్మిది నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరి సునీతా విలియమ్స్ లాంటి మహిళలు అంతరిక్షంలో ఉన్నప్పుడు పీరియడ్స్‌ను ఎలా మేనేజ్ చేశారు అనేది సందేహం కలుగక మానదు. గ్లాస్ సీలింగ్స్‌ను బ్రేక్ చేస్తూ మహిళలు అంతరిక్షం వెళ్లాలనుకున్నపుడు వచ్చిన మొదటి సవాల్ ఇదే.హార్మోన్ల మార్పులు, సూక్ష్మ గురుత్వాకర్షణ (Microgravity) ప్రభావాలు చర్చకు వచ్చాయి. మార్గదర్శక మహిళా వ్యోమగాములలో ఒకరైన రియా సెడాన్, అసలు ఇది సమస్యే కాదని వాదించారు. అలా మహిళలు సాహసయాత్రకు పూనుకున్నారు.Astronaut Periods: అలా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళ వాలెంటినా తెరేష్కోవా. ఇది 1963లో జరిగింది. అప్పటి నుండి మరో 99 మంది ఆమె అడుగుజాడలనుఅనుసరించి అతరిక్షంలోకి ప్రయాణించారు. అయితే పీరియడ్స్ విషయంలో రేకెత్తిన అన్ని ఆందోళనలకు, ఊహాగానాలకు విరుద్ధంగా మహిళా వ్యోమగాములకు అంతరిక్షంలో కూడా సాధారణంగానే పీరియడ్స్ వస్తాయి. ఋతుస్రావం భూమిపై ఉన్నట్లే సాధారణంగా పనిచేస్తుంది. వారు భూమిపై ఉన్న మాదిరిగానే ప్రామాణిక శానిటరీ, పరిశుభ్రత ఉత్పత్తులను ఉపయోగిస్తారు , అవి అంతరిక్షంలో ప్రభావవంతంగా ఉంటాయి కూడా.చదవండి : ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టుమహిళల అంతరిక్ష యాత్రలో ఉన్నపుడు పీరియడ్స్ సమస్యలొస్తాయని రక్తం గాల్లో తేలుతుందని, హార్మోన్ల సమస్య వస్తుందని భయపడ్డారు. స్త్రీలు ఋతుస్రావం కావాలని ఆపితే తప్ప, ఈ ప్రక్రియ అంతరిక్షంలో సాధారణంగా జరుగుతుందని వాస్తవ అనుభవాల ద్వారా తేలింది. అయితే పీరియడ్స్ వాయిదా వేసుకోవాలా? వద్దా? అనే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనది. మహిళా వ్యోమగాములు తమ అంతరిక్ష యాత్ర కొనసాగినన్నాళ్లూ నెలసరిని వాయిదా వేసుకుంటారు. పీరియడ్స్ రాకుండా హార్మోన్ల మాత్రలు(Birth control pills) వంటి గర్భనిరోధకాల (Hormonal contraceptives)ను ఎంచుకుంటారు. అయితే ఈ తరహా మాత్రల వల్ల మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని సైంటిస్టుల మాట. పైగా అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు స్త్రీపురుషుల్లో కండరాల సామర్థ్యం తగ్గిపోతుందని, ఇలాంటప్పుడు గర్భనిరోధక మాత్రల్లోని ఈస్ట్రోజెన్ కండర సామర్థ్యాన్ని కోల్పోకుండా కాపాడుతుందని అంటున్నారు. అంతేకాదు ఎక్కువ కాలం అంతరిక్ష ప్రయాణాలకు వీటిని రికమెండ్ చేస్తున్నారు. తద్వారా శానిటరీ ప్యాడ్స్ వాడకం, నీరు ఆదా అవుతాయి. శుభ్రత కూడా సులభవుతుంది. అలా కాని పక్షంలో నెలసరిని ఆపకూడదు అనుకుంటే, భూమిపై ఎలా మేనేజ్ చేస్తారో, అంతరిక్షంలోనూ అలాగే మేనేజ్ చేసుకోవచ్చు. అయితే పరిమితంగా లభించే నీరు, తక్కువ స్టోరేజీ స్పేస్ కారణంగా వ్యోమగాములు వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సలాం మీకు!అయితే పీరియడ్స్ నిర్వహణలో మహిళా వ్యోమగాముల సమస్యలు అన్నీ ఇన్నీ కావు. శ్యానిటరీ ఉత్పత్తుల అదనపు భారం, అలాగే భార రహిత స్థితిలో శ్యానిటరీ ఉత్పత్తులు మార్చుకోవడం అతి పెద్ద సవాలు అనడంలో ఎలాంటి సందేహంలేదు. దీనికి తోడు మూత్రాన్నే రీసైకిల్ చేసుకొని తాగే పరిస్థితులున్న రోదసిలో నీటి కొరత ఎంత సమస్యో ఊహించుకోవచ్చు. ఇలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించి అంతరిక్షంలోకి అడుగుపెట్టి, ఎన్నో విజయవంతమైన ప్రయోగాలకు, పరిశోధనలకు మూలమవుతున్న మహిళా వ్యోమగాములకు సలాం! ఇదీ చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ -
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. తిరిగొస్తున్న సునీత
వాషింగ్టన్: భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తున. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో. ఏడెనిమిది రోజులనుకుంటే ఏకంగా వారాలూ, నెలలూ గడిచిపోతున్నాయి. ఉన్నది భారరహిత స్థితిలోనే. అయినా అటు కార్యభారం. ఇటు ఎడతెగని ఆలోచనల భారం. క్షణమొక యుగంగా సమయం కూడా భారంగానే గడుస్తున్న పరిస్థితి. ఎడతెగని ఆ ఎదురుచూపులకు ఎట్టకేలకు శుభంకార్డు పడనుంది. 9 నెలల అంతరిక్షవాసం ముగించుకుని నాసా వ్యోమగాములు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (59), బచ్ బారీ విల్మోర్ (62) భూమికి తిరిగి రానున్నారు. వాతావరణం అనుకూలించి, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27కు) అమెరికాలో ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగనున్నారు. ఆదివారం నాసా ఈ మేరకు ప్రకటించింది. అనుకూల వాతావరణం నేపథ్యంలో తిరుగు ప్రయాణాన్ని నిరీ్ణత సమయం కంటే ఒక రోజు ముందుకు జరిపినట్టు పేర్కొంది. గత సెపె్టంబర్లో ఐఎస్ఎస్కు వెళ్లిన మరో ఇద్దరు వ్యోమగాములు నిక్ హేగ్ (అమెరికా), అలెగ్జాండర్ గుర్బనోవ్ (రష్యా) కూడా స్పేస్ ఎక్స్ డ్రాగన్–10 స్పేస్‌క్రాఫ్ట్‌లో సునీత, విల్మోర్తో పాటే తిరిగి వస్తున్నారు. వారి రాక కోసం ప్రపంచమంతా అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తోందిప్పుడు. బాధ్యతల అప్పగింత బోయింగ్ సంస్థ తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా 2024 జూన్ 5న ప్రయోగించిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్కు చేరుకున్నారు. షెడ్యూల్ మేరకు వారు ఎనిమిది రోజుల్లోనే తిరిగి రావాలి. కానీ స్టార్‌లైనర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అది వీలు పడలేదు. దాని మరమ్మతుకు చేసిన ప్రయత్నాలు కూడా పూర్తిగా ఫలించలేదు. దాంతో రిస్కు తీసుకోరాదని నాసా నిర్ణయించింది. ఫలితంగా సెపె్టంబర్ 7న స్టార్‌లైనర్ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు మధ్యలో చేసిన ఒకట్రెండు ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అలా 9 నెలలుగా సునీత ఐఎస్ఎస్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు ఆమెను, విల్మోర్ను వెనక్కు తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ ప్రయోగించిన డ్రాగన్–9 వ్యోమనౌక ఆదివారం విజయవంతంగా ఐఎస్ఎస్ను చేరింది. అందులో వచ్చిన నలుగురు వ్యోమగాములు సునీత బృందం నుంచి లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. కమాండర్ బాధ్యతలను రష్యాకు చెందిన అలెక్సీ ఒచినిన్‌కు సునీత అప్పగించారు. వచ్చే ఆర్నెల్ల పాటు ఐఎస్ఎస్ కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లో జరుగుతాయి. అయినా స్థైర్యమే... అనూహ్యంగా ఐఎస్ఎస్లో 9 నెలల పాటు గడపాల్సి వచ్చినా సునీత ఎక్కడా డీలాపడలేదు. మొక్కవోని ఆత్మస్థైర్యం ప్రదర్శించారు. తన పరిస్థితిపై కూడా తరచూ జోకులు పేల్చారు! నడవటమెలాగో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నానంటూ గత జనవరిలో నాసా సెంటర్‌తో మాట్లాడుతూ చమత్కరించారు. ఐఎస్ఎస్లో ఉన్నన్ని రోజులూ ఊపిరి సలపని బాధ్యతల నడుమే గడిపారు. అలాగని చిన్నచిన్న సరదాలకూ లోటులేకుండా చూసుకున్నారు. సహచరులతో కలిసి సునీత, విల్మోర్ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. వీడియో కాల్స్ ద్వారా తమ కుటుంబీకులతో టచ్‌లో ఉంటూ వచ్చారు. → ఐఎస్ఎస్ కమాండర్‌గా కీలక ప్రయోగాలకు సునీత సారథ్యం వహించారు. → అంతరిక్షంలో భారరహిత స్థితిలో మొక్కల్ని పెంచిన నాసా ప్రయోగాన్ని స్వయంగా పర్యవేక్షించారు. → మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేశారు. ఎందరికో స్ఫూర్తి వ్యోమగామిగా గ‘ఘన’ విజయాలు సాధించిన సునీతవి భారత మూలాలు. ఆమె పూర్తి పేరు సునీతా లిన్ విలియమ్స్. 1965లో అమెరికాలోని ఒహాయోలో జని్మంచారు. తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కాగా తల్లి బోనీ జలోకర్‌ది స్లొవేనియా. వారి ముగ్గురు సంతానంలో సునీత అందరికన్నా చిన్న. అమెరికా నావల్ అకాడెమీ నుంచి ఫిజిక్స్‌లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు. తండ్రి సూచనతో...తండ్రి సూచన మేరకు నావికా దళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్‌గా చేరారు సునీత.→ నేవల్ ఏవియేటర్‌గా యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ పొందారు. కంబాట్ హెలికాప్టర్ స్క్వాడ్రన్‌లో పని చేశారు. → 30 ఏళ్ల వృత్తిగత జీవితంలో పైలట్‌గా 30 పై చిలుకు రకాల విమానాలను 3,000 గంటలకు పైగా నడిపిన అపార అనుభవం ఆమె సొంతం. → నేవీ నుంచి రిటైరయ్యాక సునీత 1998 జూన్ లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. → 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర చేశారు. ఐఎస్ఎస్లో ఆర్నెల్లకు పైగా గడిపి దాని నిర్వహణ, మరమ్మతులు తదితరాలపై అనుభవం గడించారు. → 2012లో రెండోసారి ఐఎస్ఎస్కు వెళ్లి నాలుగు నెలలకు పైగా ఉన్నారు. → సునీత భర్త మైకేల్ జె.విలియమ్స్ రిటైర్డ్ ఫెడరల్ మార్షల్. వారికి సంతానం లేరు. పెట్ డాగ్స్ అంటే ఈ జంటకు ప్రాణం. వాటినే తమ సంతానంగా భావిస్తుంటారు. → సునీత హిందూ మతావలంబి. నిత్యం భగవద్గీత చదువుతానని చెబుతారు.పరిహారమేమీ ఉండదు సునీత, విల్మోర్ ఏకంగా 9 నెలలకు పైగా ఐఎస్ఎస్లో చిక్కుబడిపోయారు కదా. మరి వారికి పరిహారం రూపంలో అదనపు మొత్తం ఏమన్నా లభిస్తుందా? అలాంటిదేమీ ఉండదు. తమకు ప్రత్యేకంగా ఓవర్‌టైం వేతనమంటూ ఏమీ ఉండదని నాసా వ్యోమగామి కాడీ కోల్మన్ చెప్పారు. ‘‘అంతరిక్ష యాత్రలను అధికార పర్యటనల్లో ఇతర కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే పరిగణించడమే ఇందుకు కారణం. ఇలాంటప్పుడు ఖర్చుల నిమిత్తమని మాకు అదనంగా రోజుకు కేవలం 4 డాలర్లు (రూ.347) అందుతాయంతే’’ అని వివరించారు. ఆ లెక్కన సునీత, విల్మోర్ అదనంగా 1,148 డాలర్లు (దాదాపు రూ.లక్ష) అందుకోనున్నారు. వారు అమెరికా ప్రభుత్వోద్యోగుల్లో అత్యున్నతమైన జీఎస్–15 వేతన గ్రేడ్‌లో ఉన్నారు. ఆ లెక్కన వాళ్లకు ఏటా 1.25 లక్షల నుంచి 1.62 లక్షల డాలర్ల (కోటి నుంచి 1.41 కోట్ల రూపాయల) వేతనం లభిస్తుంది.తిరుగు ప్రయాణం ఇలా... → సునీత బృందం తిరుగు ప్రయాణానికి భారత కాలమానం ప్రకారం మంగళవారం కౌంట్‌డౌన్ మొదలవుతుంది. → క్రూ డ్రాగన్–10 వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ మంగళవారం ఉదయం 8.15కు మొదలవుతుంది. → ఐఎస్ఎస్ నుంచి వ్యోమనౌక విడివడే ప్రక్రియ మంగళవారం ఉదయం 10.35కు మొదలవుతుంది. ఆ తర్వాత నాసా ప్రత్యక్ష ప్రసారం ఆడియోకు పరిమితమవుతుంది. అంతా అనుకూలిస్తే బుధవారం (మంగళవారం అర్ధరాత్రి దాటాక) తెల్లవారుజాము 2.15 గంటలకు తిరిగి ప్రత్యక్ష ప్రసారం మొదలవుతుంది. → బుధవారం తెల్లవారుజాము 2.41 గంటలకు వ్యోమనౌక భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. → బుధవారం తెల్లవారుజామున సుమారు 3.27కు ఫ్లోరిడా తీరానికి సమీపంలో సముద్ర జలాల్లో క్యాప్సూల్ దిగుతుంది. → ఆ వెంటనే నలుగురు వ్యోమగాములనూ నాసా సిబ్బంది ఒక్కొక్కరిగా బయటికి తీసుకొస్తారు. అన్నీ అనుకూలించాలి అయితే ప్రయాణ సమయం నిర్ణయమైనా చివరి నిమిషం దాకా అన్నీ అనుకూలించాల్సి ఉంటుంది. వాతావరణంతో పాటు ఇతర పరిస్థితులన్నీ సజావుగా ఉంటేనే తిరుగు ప్రయాణం షెడ్యూల్ ప్రకారం సాగుతుంది. ప్రత్యక్షప్రసారం సునీత బృందంతో స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ–9 స్పేస్‌క్రాఫ్ట్ తిరుగు ప్రయాణాన్ని భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 నుంచి నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. రికార్డు మాత్రం కాదు సునీత, విల్మోర్ వరుసగా 9 నెలల పాటు (287 రోజులు) ఐఎస్ఎస్లో గడిపినా ప్రపంచ రికార్డుకు మాత్రం దూరంగానే ఉండిపోయారు. రష్యా వ్యోమగామి వలేరీ పొల్యకోవ్ తమ దేశానికి చెందిన మిర్ అంతరిక్ష కేంద్రంలో ఏకబిగిన 437 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. నాసా ఆస్ట్రోనాట్ 371 రోజులతో ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. మూడు అంతరిక్ష యాత్రల్లో కలిపి సునీత 583 రోజులు ఐఎస్ఎస్లో గడిపారు. క్రమశిక్షణ విషయంలో సునీత చాలా పట్టుదలగా ఉంటారు. ఐఎస్ఎస్లో ఉన్నన్నాళ్లూ ఒక్క రోజు కూడా వ్యాయామం మానలేదట!టైమ్‌లైన్ 2024 జూన్ 5: సునీత, విల్మోర్లతో ఐఎస్ఎస్కు బయల్దేరిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక జూన్ 6: ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైన స్టార్‌లైనర్. కానీ ఆ క్రమంలో స్టార్‌లైనర్‌లో థ్రస్టర్లు పని చేయకపోవడం, ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీకేజీ వంటి సాంకేతిక లోపాలు తెరపైకొచ్చాయి. దాంతో వ్యోమగాములు క్షేమంగా తిరిగిరావడంపై ఉత్కంఠ నెలకొంది. జూన్ 12: స్టార్‌లైనర్ ప్రయాణానికి సిద్ధంగా లేనందున సునీత, విల్మోర్ తిరుగు ప్రయాణం నిరవధికంగా వాయిదా పడ్డట్టు నాసా ప్రకటన. జూలై–ఆగస్టు: తిరుగు ప్రయాణంపై మరింత పెరిగిన అనిశ్చితి. దాంతో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్ సిబ్బందితో కలిసిపోయి దాని నిర్వహణ బాధ్యతలు, పరిశోధనలు తదితరాను పూర్తిగా తలకెత్తుకున్నారు. ఆ క్రమంలో సునీత ఆరోగ్యం కాస్త క్షీణించింది. ఎముకల సాంద్రత తగ్గడం వంటి పలు సమస్యలు తలెత్తాయి. సెపె్టంబర్: ఐఎస్ఎస్ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించిన సునీత నవంబర్: సహోద్యోగులతో కలిసి ఐఎస్ఎస్లోనే దీపావళి, థాంక్స్ గివింగ్ వేడుకలు జరుపుకున్న సునీత. ఈ సందర్భంగా వారికోసం ప్రత్యేకంగా స్మోక్డ్ చికెన్ తదితర వంటకాలను పంపిన నాసా. డిసెంబర్: విద్యార్థులతో చిట్‌చాట్ చేసి తన అనుభవాలు పంచుకున్న సునీత. అంతరిక్షంలో జీవితం చాలా ఫన్నీగా ఉందని వ్యాఖ్య. 2025 జనవరి 30: తొలి స్పేస్ వాక్ చేపట్టిన సునీత. అందులో భాగంగా ఐఎస్ఎస్ బయట కీలక మరమ్మతుల్లో భాగస్వామ్యం. ఫిబ్రవరి: తిరుగు ప్రయాణంపై సర్వత్రా అనిశ్చితి పెరుగుతుండటంతో, తాము బాగున్నామని సందేశం పంపిన సునీత, విల్మోర్. మార్చి 12: స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కు తీసుకొస్తున్నట్టు ప్రకటించిన నాసా, ఎక్స్. మార్చి 16: విజయవంతంగా ఐఎస్ఎస్ను చేరిన డ్రాగన్ క్రూ–10 వ్యోమనౌక మార్చి 17: సునీత, విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములతో డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ మార్చి 18న భూమికి తిరిగొస్తుందంటూ నాసా ప్రకటన – సాక్షి, నేషనల్ డెస్క్ -
సునీత,విల్మోర్లకు ‘గ్రావిటీ’ భయం..!
వాషింగ్టన్: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్లు అంతరిక్షం నుంచి మార్చి 19న భూమి మీదకు బయలుదేరనున్నారు. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ స్పేస్‌స్టేషన్(ఐఎస్ఎస్)కు వెళ్లిన వారిద్దరు అనుకోని పరిస్థితుల్లో ఎనిమిది నెలలపాటు అక్కడే ఉండిపోయారు. అయితే వ్యోమగాములిద్దరు భూమి మీదకు వచ్చిన తర్వాత పలు రకాల సమస్యలను ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది. జీరో గ్రావిటీ నుంచి భారీ గురుత్వాకర్షణ కలిగిన భూమి వాతావరణంలోకి 8 నెలల తర్వాత వారు రానుండడమే ఇందుకు కారణం. తాము భూమి మీదకు వచ్చిన తర్వాత చిన్న పెన్సిల్‌ను లేపినా పెద్ద బరువులు ఎత్తి వ్యాయామం చేసిన ఫీలింగే ఉంటుందని విల్మోర్ మీడియాకు తెలిపారు.‘ఇక్కడి నుంచి భూమి మీదకు వచ్చిన తర్వాత గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. భూమిపై పరిస్థితులకు అలవాటుపడే దాకా ఇబ్బందిగానే ఉంటుంది.శరీరం బరువెక్కిన ఫీలింగ్ కలుగుతుంది’ అని విల్మోర్ వెల్లడించారు. స్పేస్‌లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు..భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ ప్రత్యేక అనుభూతికి దూరమవుతారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది.ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లాక వారి శరీరం ఎర్రరక్తకణాలను నాశనం చేయడం ప్రారంభిస్తుంది.ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గించుకోవడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది.గుండె పనితీరుపైనా అంతరిక్షం ప్రభావం చూపిస్తుంది.బోయింగ్ వ్యోమనౌకలో భాగంగా నాసా గత జూన్‌లో సునీత,విల్మోర్లను ఐఎస్ఎస్కు పంపించింది. వ్యోమనౌకలో లోపాలు తలెత్తడంతో వారం రోజుల కోసం వెళ్లిన ఇద్దరు ఏకంగా 8 నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. -
Sunita Williams: అంతరిక్షంలోనే ఏడు నెలలు..నడక మర్చిపోయా..!
గతేడాది జూన్ 14వ తేదీన అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. కేవలం పది రోజులు ఉండడానికి మాత్రమే వారిద్దరు అంతరిక్షానికి వెళ్లారు. అయితే వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దాంతో వారు ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. వాళ్లు భూమ్మీదకి ఎప్పుడు అడుగుపెడతారనే దానిపై స్పష్టత లేదు. అయితే అంతకాలం అంతరిక్షంలోనే జీరో గ్రావిటీ వద్ద తేలియాడుతుండటంతో వ్యోమగాములకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో..? అనే సందేహాలు సర్వత్రా లేవనెత్తాయి. అయితే వాటన్నింటికీ చెక్‌పెడుతూ గతంలో సునీతా తాను బాగానే ఉన్నానంటూ రిప్లై ఇచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం విలియమ్స్ తాజాగా తాను ఆ సమస్యలు ఎదుర్కొంటున్నా అంటూ.. బాంబు పేల్చింది. దీంతో ఆరోగ్య నిపుణుల అనుమానాలే నిజమవుతున్నాయా..? అనే సందేహం అందిరిలోనూ రేకెత్తింది. ఇంతకీ విలియమ్స్ ఏం చెప్పారు..? భవిష్యత్ మిషన్ల పరిస్థితి ఏంటీ అంటే..సునీతా విలియమస్స్(Sunita Williams) ఏడు నెలలుగా అంతరిక్షంలోనే(space) ఉండిపోవడంతో నడక(Walk) ఎలా ఉంటుందో మర్చిపోయానని అన్నారు. నిత్యం జీరో గ్రావిటీ వద్ద తేలియాడుతూ ఉండటంతో దేన్నైనా ఆధారం చేసుకుని నిలబడితే ఎలా ఉంటుంది అనే ఫీల్ వస్తోందట. ఇలా అన్నేళ్లు ఉండిపోతే ఎముకలు పటుత్వం కోల్పోతాయని, పలు అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్యనిపుణులు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడూ అదే నిజమైంది అన్నట్లుగా ఉన్నాయి విలియమ్స్ మాటలు చూస్తే. నెలల తరబడి గురత్వాకర్షణ శక్తిలో తేలుతూ ఉండటం వల్ల నడవడం ఎలా ఉంటుందో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారామె. ఆమె అక్కడ కూర్చోలేదు, పడుకోలేదు, అందువల్ల నేలపై నడిచే అనుభూతిని తిరిగి పొందడానికి కష్టపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అంతరిక్ష నౌకలో స్వల్పకాలిక మిషన్‌గా భావించిన సునీతాకు అదికాస్తా ఓపికకు పరీక్ష పెట్టే నిరుత్సాహకరమైన అనుభవంగా మారిపోయింది. ఇంతకాలం కుటుంబానికి భౌతికంగా దూరమైనా.. వారితో టచ్‌లో ఉండేలో ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిరోజు తన అమ్మతో మాట్లాడతున్నట్లు తెలిపారు. ఈ మిషన్ తన శారీరక బలానికి మాత్రమే కాకుండా భావోద్వేగ స్థితిస్థాపకతకు కూడా పరీక్షగా మారింది. ఈ సుదీర్ఘ అంతరిక్ష పరిశోధన వ్యోమగాముల(Astronauts) కుటుంబ జీవితాన్నే గాకుండా భవిష్యత్తులో ఇలాంటి మిషన్ పరిశోధనల కోసం వ్యోమగాములకు త్యాగాలు తప్పవనే విషయాన్ని నొక్కి చెబుతోంది. అలాగే అంతరిక్ష ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉంటుందో ఈ ఉదంతమే చెబుతోంది. కాగా, మార్చి చివరలో లేదా ఏప్పిల్‌లో స్పేస్ఎక్స్ క్రూ-10 ప్రయోగించి ఆ వ్యోమగాములిద్దరిని తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. అలాగే ట్రంప్ కూడా వారిని సురక్షితంగా తీసుకురావాలని మస్క్‌ని కోరినట్లు సమాచారం. (చదవండి: ఆ ఇద్దరి కోసం ట్రంప్ సాయం అడిగారు: మస్క్) -
అంతరిక్షంలో ఉన్నా మాకూ సెలవు కావాలి
‘సెలవు కావాలి’. పండుగలు, పెళ్లిళ్లు, ముఖ్యమైన సందర్భాల్లో ఉద్యోగి నోట వినిపించే మొట్టమొదటి మాట ఇది. ప్రపంచదేశాలు అన్ని చోట్లా ఇదే వినతి. ఇప్పుడు ఈ విన్నపం భూమిని దాటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికీ చేరింది. క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల కోసం తాము కూడా విధులకు గైర్హాజరై సెలవు పెడతామని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లోని ఆస్ట్రోనాట్స్, కాస్మోనాట్స్ తెగేసి చెప్పారు. వీళ్ల సెలవు అభ్యర్థనకు ఇప్పటికే ఆమోదముద్ర పడిందోఏమో క్రిస్మస్, కొత్త ఏడాది సంబరాలకు వ్యోమగాములంతా సిద్ధమైపోయారు. ప్రత్యేకంగా క్రిస్మస్, న్యూ ఇయర్ విందు కోసం ఇప్పటికే ప్యాక్ చేసి పంపించిన ఆహారపదార్థాలు తినేందుకు నోరూరుతోందని అక్కడి భారతీయమూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ చెప్పారు. ఐఎస్ఎస్లోని ఏడుగురు వ్యోమగాముల బృందం క్రిస్మస్, జనవరి ఒకటిన తమ రోజువారీ శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగాలను కాసేపు పక్కనబెట్టి సంబరాల్లో తేలిపోతారని తెలుస్తోంది. తాజాగా ఐఎస్ఎస్కు వచి్చన స్పేస్ఎక్స్ డ్రాగన్ 2,700 కేజీల కార్గోలో వ్యోమగాముల కోసం విడి విడిగా వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల నుంచి గిఫ్ట్‌లు వచ్చాయి. స్పెషల్ మీల్స్ తింటూ కుటుంబంతో వీడియోకాల్స్ మాట్లాడుతూ వ్యోమగాములు సరదాగా గడపనున్నారు. ఇప్పటికే హాలిడే మూడ్‌ను తెస్తూ సునీత, డాన్ పెటిట్లు శాంటా టోపీలు ధరించిన ఫొటో ఒకటి తాజాగా షేర్చేశారు. బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఐఎస్ఎస్కు వచి్చన సునీతా విలియమ్స్ తాము వచ్చిన వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా తిరిగి భూమికి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. నెలల తరబడి అక్కడే ఉండిపోయిన సునీతకు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కాస్తంత ఆటవిడుపుగా ఉండబోతున్నాయి. – వాషింగ్టన్ -
అంతరిక్షంలో చేపలు పెంచారు!
చైనా వ్యోమగాములు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతరిక్షంలో ఏకంగా చేపలను పెంచి చూపించారు. నవంబర్ 4న ముగిసన షెన్ఝౌ–18 స్పేస్ మిషన్‌లో భాగంగా వాళ్లు ఈ ఘనత సాధించారు. చైనా అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదికైంది. ఈ ప్రయోగం కోసం శరవేగంగా పెరిగే జీబ్రా చేపలను ఎంచుకున్నారు. వాటిని పెంచేందుకు అంతరిక్ష కేంద్రం లోపల అన్ని వసతులతో కూడిన క్లోజ్డ్ ఎకో సిస్టంను ఏర్పాటు చేశారు. చేపలు అందులోనే పెరిగి పెద్దవై పునరుత్పత్తి కూడా జరిపాయి. 43 రోజుల జీవనచక్రాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. తద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో ఇది సరికొత్త రికార్డుగా నిలిచింది. అంతరిక్షంలో అత్యంత సవాళ్లతో కూడిన వాతావరణంలో జలచరాలు ఏ మేరకు మనుగడ సాగించగలవన్న దానిపై ఈ ప్రయోగం ద్వారా చాలా స్పష్టత వచి్చందని సైంటిస్టులు అంటున్నారు. అంతేగాక అంతరిక్ష రంగంలో కొంతకాలంగా చైనా సాధిస్తున్న పైచేయికి ఇది తాజా నిదర్శనమని కూడా చెబుతున్నారు. జీబ్రా చేపలకు జన్యుపరంగా మానవులతో చాలా దగ్గరి పోలికలుంటాయి. అంతరిక్షంలో వీటితో చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడాన్ని కీలక మైలురాయిగా చెబుతున్నారు. భూమికి ఆవల శాశ్వత మానవ ఆవాసాల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు ఇకపై మరింతగా ఊపందుకుంటాయని భావిస్తున్నారు. ‘‘దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్లు విజయవంతం కావాలంటే ఏం చేయాలన్న దానిపై ఈ ప్రయోగం మరింత స్పష్టతనిచి్చంది. అంతరిక్షంలో స్వయంపోషక జీవ వ్యవస్థల అభివృద్ధికి బాటలు పరిచింది’’ అని చైనా పేర్కొంది. -
‘డ్రీమ్’ మిషన్‌ను లాంచ్ చేసిన చైనా
బీజింగ్: చైనా తన డ్రీమ్ మిషన్ అయిన షెంజౌ-19ను విజయవంతంగా ప్రయోగించింది. చైనాలోని జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఈరోజు (బుధవారం)తెల్లవారు జామున 4.27 గంటలకు (చైనా కాలమానం ప్రకారం) ఈ మిషన్ ఆకాశంలోకి దూసుకెళ్లింది.ఈ మిషన్‌లో భాగంగా ఒక మహిళా స్పేస్ ప్లైట్ ఇంజనీర్‌తో సహా ముగ్గురు వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు బయలుదేరారు. షెంజౌ-19 నింగిలోకి దూసుకెళ్లిన పది నిమిషాల అనంతరం ఆ వ్యోమగాములతో కూడిన అంతరిక్ష నౌక రాకెట్ నుండి విడిపోయి దాని కక్ష్యలోకి ప్రవేశించింది. వ్యోమగాములంతా క్షేమంగా ఉన్నారని, ప్రయోగం విజయవంతమైందని చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ వెల్లడించింది. Congratulations to the successful launch of #Shenzhou19 crewed spaceship🚀 and wish the 3 astronauts all the best! #SpaceChina pic.twitter.com/v26V0pAExK— CAI Run 蔡润 (@AmbCaiRun) October 29, 2024ఈ షెంజౌ-19లో మిషన్ కమాండర్ కై జుబేతో పాటు వ్యోమగాములు సాంగ్ లింగ్ డాంగ్, వాంగ్ హవోజ్ ఉన్నారు. కై జుబే ఎంతో అనుభవజ్ఞుడైన వ్యోమగామి. దీనికి ముందు ఆయన 2022లో షెంజౌ-14 మిషన్‌లో పాల్గొని అంతరిక్షంలో ప్రయాణించారు. వాంగ్ ప్రస్తుతం చైనాలో ఏకైక మహిళా అంతరిక్ష ఇంజనీర్‌గా పేరొందారు. ఆమె అంతరిక్ష యాత్రకు వెళ్లిన మూడో చైనా మహిళ అని స్పేస్ ఏజెన్సీ మీడియాకు తెలిపింది. ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
ఐఎస్ఎస్ చేరిన డ్రాగన్
వాషింగ్టన్: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు బయల్దేరిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. సోమవారం ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. కాసేపటికే అందులోని వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బనోవ్ ఐఎస్ఎస్లో ప్రవేశించారు. సునీత, విల్మోర్ తదితరులతో కలిసి ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. స్పేస్ ఎక్స్ క్రూ–9 మిషన్‌ను అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్‌కెనవెరల్ నుంచి శనివారం ప్రయోగించడం తెలిసిందే. జూన్‌లో బోయింగ్ తొలిసారి ప్రయోగాత్మకంగా పంపిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్ చేరుకున్నారు. 8 రోజుల్లో వారు తిరిగి రావాల్సి ఉండగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుబడిపోయారు. చివరికి స్టార్‌లైనర్ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. సునీత, విల్మోర్ డ్రాగన్ క్యాప్సూల్‌లో ఫిబ్రవరిలో తిరిగి రానున్నారు. వారికి చోటు కలి్పంచేందుకు వీలుగా నాలుగు సీట్ల సామర్థ్యమున్న డ్రాగన్ క్యాప్సూల్‌లో హేగ్, గోర్బనోవ్లను మాత్రమే పంపడం తెలిసిందే. -
జాబిల్లిపై కారులో!
టోక్యో: సంప్రదాయకంగా అపోలో మిషన్ మొదలు తాజా ప్రయోగాల దాకా జాబిల్లిపై జరిగిన అన్ని ప్రయోగాల్లో ల్యాండర్, రోవర్‌లనే అధికంగా వాడారు. మానవరహితంగా కదిలే రోవర్ కొద్దిపాటి దూరాలకు వెళ్లగలవు. అక్కడి ఉపరితల మట్టిని తవ్వి చిన్నపాటి ప్రయోగాలు చేయగలవు. అయితే వీటికి చెల్లుచీటి పాడేస్తూ చంద్రుడిపై ఏకంగా కారులో వ్యోమగాములు ప్రయాణించేలా ఒక అధునాతన స్పెషల్ కారును తయారుచేస్తామని జపాన్ ప్రకటించింది. ఆటోమోటివ్ దిగ్గజం టొయోటాతో కలిసి తాము తయారుచేయబోయే భారీ వాహనం వివరాలను జపాన్‌లోని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) తాజాగా వెల్లడించింది. భూమి లాంటి వాతావరణం అక్కడ లేని కారణంగా చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ చాలా తక్కువ. దీంతో సాధారణ కారు అక్కడ చకచకా ముందు కదలడం చాలా కష్టం. అందుకే ఒత్తిడితో నడిచే ప్రత్యేక వాహనాన్ని రూపొందిస్తామని టొయోటా సంస్థ తెలిపింది. ఈ కారు కథాకమామిషు ఓసారి చూద్దాం.. అమెరికా నాసా వారి ప్రతిష్టాత్మక ఆరి్టమిస్–8 మిషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా కారులా ఉండే అత్యాధునిక రోవర్ వాహనాన్ని సిద్ధంచేయనున్నారు. ఈ వాహనంలో వ్యోమగాములు ఎక్కువ కాలం గడపొచ్చు. సంప్రదాయ రోవర్ మాదిరిగా స్వల్ప దూరాలకుకాకుండా చాలా దూరాలకు ఈ వాహనం వెళ్లగలదు. వ్యోమగాములు చేపట్టబోయే అన్ని ప్రయోగాలకు సంబంధించిన ఉపకరణాలు ఇందులో ఉంటాయి. గతంలో ఎన్నడూ వెళ్లని ప్రాంతాలకు వెళ్తూ కారు లోపల, వెలుపల ప్రయోగాలు చేయొచ్చు. చందమామపై వేర్వేరు ప్రదేశాల వాతావరణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తూ వ్యోమగాములు అక్కడి నేల స్వభావాన్ని అంచనావేయొచ్చు. వ్యోమగాముల రక్షణ కోసం లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్, వాహనం దిగి ఎక్కువసేపు బయట గడిపితే రేడియేషన్ ప్రభా వానికి లోనుకాకుండా ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు, దిగి సులభంగా ఆ ప్రాంతంలో కలియతిరిగేందుకు ‘ఎయిర్‌లాక్’వ్యవస్థ ఇలా పలు ఏర్పాట్లతో వాహనాన్ని తీర్చిదిద్దుతామని జాక్సా తెలిపింది. ఆటోమొబైల్ సాంకేతికతలో జపాన్‌ది అందెవేసిన చేయి. దీంతో జ పాన్ టెక్నాలజీ, అంతరిక్ష అనుభవం చంద్రుడి ఉపరితలంపై కొత్త తరహా ప్రయోగాలకు బాటలు వేస్తాయని నాసా తెలిపింది. -
అంతరిక్షంలో 370 రోజులకు పైగా!
మాస్కో: రష్యా వ్యోమగాములు ఒలెగ్ కొనొకెంకో, నికోలాయ్ చుబ్ శుక్రవారం సరికొత్త రికార్డు సృష్టించారు. వారిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో 370 రోజుల 21 గంటల 22 నిమిషాలకుపైగా ఉన్నారు. పాత రికార్డును తిరగరాశారు. ప్రస్తుతం వారిద్దరూ అక్కడే పరిశోధనల్లో భాగస్వాములవుతున్నారు. వ్యోమగాములు నిరాటంకంగా ఇన్ని రోజులో ఐఎస్ఎస్లో ఉండడం ఇదే మొదటిసారి. ఇప్పటిదాకా ఎక్కువ కాలం ఐఎస్ఎస్లో ఉన్న రికార్డు రష్యా అస్ట్రోనాట్స్ సెర్గీ ప్రొకోపివ్, దిమిత్రి పెటెలిన్, అమెరికా అస్ట్రోనాట్ ఫ్రాన్సిస్కో రుబియా పేరిట ఉంది. వారు 370 రోజుల 21 గంటల 22 నిమిషాలు ఐఎస్ఎస్లో గడిపారు. ఈ రికార్డును ఒలెగ్ కొనొకెంకో, నికోలాయ్ చుబ్ బద్ధలు కొట్టారు. వారు సోమవారం భూమిపైకి తిరిగి రాబోతున్నారు. 59 ఏళ్ల కొనొకెంకో మరో రికార్డు కూడా సృష్టించబోతున్నారు. సోమవారం నాటికి ఆయన ఐఎస్ఎస్లో ఏకంగా 1,110 రోజులు గడిపినట్లు అవుతుంది. ఇప్పటిదాకా ఇన్ని రోజులు అక్కడ ఉన్నవారెవరూ లేరు. -
Butch Wilmore and Sunita Williams: ఐఎస్ఎస్లో ఇబ్బందేమీ లేదు
వాషింగ్టన్: భూమికి వందల కిలోమీటర్ల ఎగువన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో సుదీర్ఘకాలం సభ్యులుగా కొనసాగడానికి తాము పూర్తిస్థాయిలో సిద్ధమయ్యామని అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చెప్పారు. మానసికంగా, శారీరకంగా తమను తాము సిద్ధం చేసుకున్నామని, పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోవడానికి ప్రయతి్నస్తున్నామని తెలిపారు. బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన సీఎస్టీ–100 స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఈ ఏడాది జూన్‌లో ఐఎస్ఎస్కు వెళ్లిన సునీతా విలియమ్స్, విల్మోర్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంలో అది సాధ్యపడలేదు. స్టార్‌లైనర్ ఒంటరిగానే భూమిపైకి తిరిగివచి్చంది. ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా ఐఎస్ఎస్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సునీతా విలిమమ్స్, విల్మోర్ శుక్రవారం ఐఎస్ఎస్ నుంచి ఫోన్లో మీడియాతో మాట్లాడారు. మనం నియంత్రించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆందోళన చెందడం అనవసరమని విల్మోర్ అన్నారు. ఐఎస్ఎస్లో ఎక్కువ రోజులు కంటే ఉండడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇక్కడి పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడ్డామని వివరించారు. తాము ప్రొఫెషనల్ వ్యోమగాములం కాబట్టి అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త పనులు చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడం ఎల్లప్పుడు ఆసక్తికరంగానే ఉంటుందని సునీతా విలియమ్స్ వ్యాఖ్యానించారు. స్టార్‌లైనర్‌లో వెనక్కి వెళ్లలేకపోవడం పట్ల తమకు ఎలాంటి విచారం లేదన్నారు. అంతరిక్షం నుంచే సునీతా విలియమ్స్, విల్మోర్ ఓటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అక్కడి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పౌరులుగా ఎన్నికల్లో ఓటు వేయడం ముఖ్యమైన బాధ్యత అని సునీతా విలియమ్స్ చెప్పారు. ఓటు వేసే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము ఓటు వేయడానికి ‘నాసా’ తగిన ఏర్పాట్లు చేస్తోందని విల్మోర్ వెల్లడించారు. -
స్టార్ లైనర్ నుంచి వింత శబ్దాలు
హూస్టన్: సెపె్టంబర్ 6వ తేదీన వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి రానున్న బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకకు సంబంధించిన మరో పరిణామం. వివిధ సమస్యలతో ఇప్పటికే మూడు నెలలుగా ఐఎస్ఎస్తోపాటే ఉండిపోయిన స్టార్‌లైనర్ నుంచి వింతశబ్ధాలు వస్తున్నాయని వ్యోమగామి బచ్ విల్మోర్ చెప్పారు. ఆయన తాజాగా హూస్టన్‌లోని నాసా మిషన్ కంట్రోల్‌తో టచ్‌లోకి వచ్చారు. వ్యోమనౌకను బయటి నుంచి ఎవరో తడుతున్నట్లుగా, జలాంతర్గామిలోని సోనార్ వంటి శబ్దాలు పదేపదే వస్తున్నాయని చెప్పారు. స్టార్ లైనర్ అంతర్గత స్పీకర్‌ను తన మైక్రోఫోన్‌కు దగ్గరగా పెట్టి ఈ శబ్దాలను నాసా నిపుణులకు సైతం ఆయన వినిపించారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి, ఎందుకు వస్తున్నాయో అంతుపట్టడం లేదని, తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నామని నాసా తెలిపింది. విద్యుదయస్కాంత తరంగాల ప్రభావం లేక ఆడియో సిస్టమ్ వల్ల ఈ వింత శబ్దాలు వచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో కలిసి బచ్ విల్మోర్ బోయింగ్ జూన్ 5వ తేదీన చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత ప్రయోగం ద్వారా స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)నకు చేరుకోవడం తెలిసిందే. వారు 8 రోజులపాటు అక్కడే ఉండి పలు ప్రయోగాలు చేపట్టిన అనంతరం భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, స్టార్ లైనర్‌లో థ్రస్టర్ వైఫల్యం, హీలియం లీకేజీ వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నం కావడంతో ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఆ ఇద్దరినీ మరో అంతరిక్ష నౌకలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని ఇటీవలే నాసా నిర్ణయం తీసుకుంది. స్టార్‌లైనర్‌ను మాత్రం వ్యోమగాములు లేకుండానే ఖాళీగా ఈ నెల 6న తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. స్టార్‌లైనర్ పునరాగమనంపై దీని ప్రభావం ఉండకపోవచ్చని నాసా తెలిపింది. -
అంతరిక్ష కేంద్రంలోకి శుభాన్షు శుక్లా
న్యూఢిల్లీ: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సారథ్యంలో భారతీయ వ్యోమగామి త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టబోతున్నాడు. ఇందుకోసం భారతవాయుసేన గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లాను ఎంపికచేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మానవసహిత అంతరిక్ష వ్యోమనౌక కేంద్రం (హెచ్ఎస్ఎఫ్సీ), నాసా, అమెరికాకు చెందిన ఆక్సియమ్ స్పేస్ సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా గగనయాత్రికులను నాసా ఐఎస్ఎస్కు తీసుకెళ్లనుంది. మిషన్ పైలట్‌గా గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా వ్యవహరిస్తారు. అనుకోని పరిస్థితుల్లో ఆయన వెళ్లలేకపోతే బ్యాకప్ మిషన్ పైలట్‌గా మరో గ్రూప్ కెపె్టన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను ఐఎస్ఎస్కు పంపిస్తారు. వీరికి ఈ వారంలోనే శిక్షణ మొదలవుతుంది. యాక్సియమ్–4 మిషన్ ద్వారా అక్కడకు వెళ్లే శుక్లా ఐఎస్ఎస్లో తోటి వ్యోమగాములతో కలిసి శాస్త్ర పరిశోధనలుచేయడంతోపాటు పలు సాంకేతికతలను పరీక్షించనున్నారు. తర్వాత ఐఎస్ఎస్ ఆవల అంతరిక్షంలోనూ గడిపే అవకాశముంది. శుక్లాతోపాటు ఐఎస్ఎస్కు అమెరికా, పోలండ్, హంగేరీల నుంచి ఒకరు చొప్పున వ్యోమగామి రానున్నారు. భారత తన సొంత మానవసహిత అంతరిక్ష ప్రయోగాల కోసం నలుగురిని గత ఏడాదే ఎంపికచేసిన విషయం తెల్సిందే. గగన్‌యాన్ మిషన్ కోసం బెంగళూరులోని ఇస్రో వ్యోమగామి శిక్షణా కేంద్రంలో వీరి శిక్షణ కూడా గతంలో మొదలైంది. ఇటీవల రష్యాలోనూ ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకున్నారు. గగన్‌యాన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి తీసుకెళ్లి తిరిగి సురక్షితంగా సముద్రజలాల్లో దింపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. -
Yoga Day: తొలిసారి వ్యోమగాముల యోగాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21) నాడు తొలిసారిగా వ్యోమగాములు కూడా యోగాసనాలు వేయనున్నారు. ఇందుకోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ‘యోగా ఫర్ స్పేస్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొననున్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారీ కార్యక్రమం జరగనుంది. దీనిలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఆరోజు వేలాది మంది యోగాభ్యాసకులతో పాటు ప్రధాని మోదీ కూడా యోగాసనాలు వేయనున్నారు. ఈ సందర్భంగా యూనియన్ ఆయుష్ సెక్రటరీ రాజేష్ కోటేచా మాట్లాడుతూ గత 10 ఏళ్లలో యోగా దినోత్సవం నాలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పిందని తెలిపారు. 2015లో 35,985 మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి రాజ్‌పథ్‌లో యోగా చేశారు. ఈ యోగా సెషన్లో మొత్తం 84 దేశాలు పాల్గొన్నాయి.2015లో రాజస్థాన్‌లోని కోటాలో 1.05 లక్షల మంది ఒకేసారి యోగా సాధన చేశారు. 2023లో మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రపంచంలోని 23.4 కోట్ల మంది పాల్గొన్నారు. దృష్టిలోపం కలిగినవారు యోగాను సులభంగా నేర్చుకోవడానికి ఇటీవల బ్రెయిలీ స్క్రిప్ట్‌ను రూపొందించారు. అలాగే ‘ప్రొఫెసర్ ఆయుష్మాన్’ పేరుతో పిల్లలు యోగాసనాలు నేర్చుకునేందుకు కామిక్ పుస్తకాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. -
ఐఎస్ఎస్లోకి సునీత
హూస్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి గమ్యస్థానం చేరుకున్నారు. బోయింగ్ కంపెనీ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో బుధవారం అంతరిక్ష ప్రయాణం ప్రారంభించిన ఇద్దరు సాహసికులు గురువారం మధ్యాహ్నం 1.34 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి(ఐఎస్ఎస్) విజయవంతంగా అడుగుపెట్టారు. అవాంతరాలను అధిగమించి స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. ఐఎస్ఎస్లో ఇప్పటికే ఏడుగురు వ్యోమగాములుండగా, సునీత, బుచ్ విల్మోర్తో తొమ్మిదికి చేరారు. కొత్తగా తమ వద్దకు చేరిన సునీతా, విల్మోర్కు ఏడుగురు అస్ట్రోనాట్స్ ఘన స్వాగతం పలికారు. ఆలింగనం చేసుకున్నారు. సునీత ఆనందంతో నృత్యం చేశారు. వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘ఐఎస్ఎస్ వ్యోమగాములంతా నా కుటుంబ సభ్యులే. వారిని కలుసుకున్నందుకు వేడుక చేసుకున్నా. ఇదో లిటిల్ డ్యాన్స్ పార్టీ’’ అన్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వారం తర్వాత స్టార్‌లైనర్‌లో భూమిపైకి తిరిగి రానున్నారు. -
మళ్లీ వాయిదా పడిన బోయింగ్ రోదసీ యాత్ర
కేప్ కనావెరల్: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర మరోసారి ఆగింది. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో రోదసీలోకి వ్యోమగాములు వెళ్లేందుకు ఉద్దేశించిన ప్రయోగం శనివారం చివరినిమిషంలో వాయిదాపడింది. అమెరికాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అట్లాస్ 5 రాకెట్ కౌంట్‌డౌన్‌ను ఇంకా మూడు నిమిషాల 50 సెకన్లు ఉందనగా కంప్యూటర్ ఆపేసింది. ప్రయోగం ఆపేయడానికి కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లాల్సి ఉంది. ఆదివారంలోగా మరోసారి ప్రయోగానికి ప్రయతి్నస్తామని యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఇంజనీర్ డిలియన్ రైస్ చెప్పారు. ప్రయోగం ఆగిపోవడంతో క్యాప్సూల్‌లోని సునీత, విల్మోర్లను టెక్నీíÙయన్లు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. -
గగన్ యాన్ మిషన్..స్పేస్ హీరోస్
-
భారత ‘సూపర్ ఫోర్’
తిరువనంతపురం: భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణాధ్యాయానికి తెర లేచింది. మన అంతరిక్ష సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మిషన్‌లో పాల్గొని రోదసిలోకి వెళ్లున్న నలుగురు భారత వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతికి పరిచయం చేశారు. ఇందుకోసం ఎంపికైన గ్రూప్ కెపె్టన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా పేర్లను ఆయన స్వయంగా ప్రకటించారు. వీరు నలుగురూ భారత వాయుసేనకు చెందిన ఫైటర్ పైలట్లే. కేరళలోని తుంబలో ఉన్న విక్రమ్ సారాబాయ్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వారికి ప్రతిష్టాత్మకమైన ‘ఆస్ట్రోనాట్ వింగ్స్’ను మోదీ ప్రదానం చేశారు. అనంతరం భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. దేశ అమృత తరానికి వారు అత్యుత్తమ ప్రతినిధులంటూ ప్రశంసించారు. ‘‘ఈ నలుగురు వ్యోమగాముల పేర్లు భారత విజయగాథలో శాశ్వతంగా నిలిచిపోతాయి. నాలుగు దశాబ్దాలుగా దేశం కంటున్న కలను వారు నిజం చేయనున్నారు’’ అంటూ కొనియాడారు. ‘‘వీళ్లు కేవలం నలుగురు వ్యక్తులో, నాలుగు పేర్లో కాదు. 140 కోట్ల మంది భారతీయుల కలలకు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలవనున్న నాలుగు ప్రబల శక్తులు!’’ అన్నారు. గగన్‌యాన్ మిషన్ పూర్తిగా దేశీయంగా రూపుదిద్దుకుని మేకిన్ ఇండియాకు తార్కాణంగా నిలిచిందంటూ హర్షం వెలిబుచ్చారు. ఏ విధంగా చూసినా ఇది చరిత్రాత్మక మిషన్ అని చెప్పారు. ‘‘గతంలో భారతీయ వ్యోమగామి వేరే దేశం నుంచి విదేశీ రాకెట్లో రోదసీలోకి వెళ్లొచ్చారు. మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత భారత్ అంతరిక్షంలో అడుగు పెట్టబోతోంది. ఈసారి టైమింగ్, కౌంట్‌డౌన్, రాకెట్‌తో సహా అన్నీ మనం స్వయంగా రూపొందించుకున్నవే. గగన్‌యాన్ మిషన్‌లో వినియోగిస్తున్న ఉపకరణాల్లో అత్యధికం భారత్‌లో తయారైనవే. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న స్వావలంబనకు తార్కాణమిది’’ అన్నారు. ఈ అమృత కాలంలో భారత వ్యోమగామి దేశీయ రాకెట్లో చంద్రునిపై దిగడం ఖాయమని జోస్యం చెప్పారు. అంతరిక్ష శక్తిగా భారత్ భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న ప్రగతి యువతలో శాస్త్రీయ జిజ్ఞాసను ఎంతగానో పెంపొందిస్తోందని, 21వ శతాబ్దిలో మనం ప్రపంచశక్తిగా ఎదిగేందుకు బాటలు పరుస్తోందని మోదీ హర్షం వెలిబుచ్చారు. ఇస్రో సాధించిన పలు ఘన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘తొలి ప్రయత్నంలోనే అరుణగ్రహం చేరి అతి కొద్ది దేశాలకే పరిమితమైన అరుదైన ఘనత సాధించాం. ఒకే మిషన్‌లో 100కు పైగా ఉపగ్రహాలనూ రోదసిలోకి పంపాం. చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా రికార్డు సృష్టించాం. ఆదిత్య ఎల్1ను భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టాం. ఇలాంటి విజయాలతో భావి అవకాశాలకు ఇస్రో సైంటిస్టుల బృందం నూతన ద్వారాలు తెరుస్తోంది. ఫలితంగా అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచ వాణిజ్య హబ్‌గా మారనుంది. మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ రానున్న పదేళ్లలో ఐదింతలు పెరిగి 44 బిలియన్ డాలర్లకు చేరనుంది’’ అని చెప్పారు. ఇస్రో అంతరిక్ష మిషన్లలో మహిళా సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని మోదీ అన్నారు. చంద్రయాన్ మొదలు గగన్‌యాన్ దాకా ఏ ప్రాజెక్టునూ మహిళా శక్తి లేకుండా ఊహించుకోలేని పరిస్థితి ఉందన్నారు. 500 మందికి పైగా మహిళలు ఇస్రోలో నాయకత్వ స్థానాల్లో ఉన్నారంటూ హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్, సీఎం పినరాయి విజయన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్, సైంటిస్టులు తదితరులు పాల్గొన్నారు. వారిది మొక్కవోని దీక్ష గగన్‌యాన్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో నలుగురు వ్యోమగాములూ అత్యంత కఠోరమైన శ్రమకోర్చారంటూ మోదీ ప్రశంసించారు. ‘‘అత్యంత కఠినమైన శారీరక, మానసిక పరిశ్రమతో పాటు యోగాభ్యాసం కూడా చేశారు. ఆ క్రమంలో ఎదురైన ఎన్నో సవాళ్లను మొక్కవోని పట్టుదలతో అధిగమించారు. రోదసి మిషన్ కోసం తమను తాము పరిపూర్ణంగా సన్నద్ధం చేసుకున్నారు’’ అన్నారు. వారు దేశంలోని పలు ప్రాంతాలతో పాటు 13 నెలలు రష్యాలోనూ శిక్షణ పొందారు. మానవసహిత గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా 2025లో ముగ్గురు వ్యోమగాములను రోదసిలో ని 400 కిలోమీటర్ల ఎత్తులోని భూ దిగువ కక్ష్యలోకి పంపి 3 రోజుల తర్వాత సురక్షితంగా వెనక్కు తీసుకురావాలన్నది ఇస్రో లక్ష్యం. ఇది విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. గగన్‌యాన్ మిషన్‌కు రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. హాయ్ వ్యోమమిత్రా గగన్‌యాన్ మిషన్ ప్రగతిని విక్రం సారబాయి స్పేస్ సెంటర్లో మోదీ సమీక్షించారు. మిషన్‌కు సంబంధించిన పలు అంశాలను సోమనాథ్‌తో పాటు ఇస్రో సైంటిస్టులను అడిగి తెలుసుకున్నారు. మానవసహిత యాత్రకు ముందు గగన్‌యాన్‌లో భాగంగా రోదసిలోకి వెళ్లనున్న హ్యూమనాయిడ్ రోబో వ్యోమమిత్రతో సరదాగా సంభాషించారు. మహిళ ఎందుకు లేదంటే... గగనయాన్ మిషన్‌కు ఎంపికైన నలుగురిలో ఒక్క మహిళ కూడా లేకపోవడం ఆసక్తికరంగా మారింది. అంతరిక్ష యాత్రకు వ్యోమగాముల ఎంపిక ప్రక్రియే అందుకు కారణమని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మిషన్లకు టెస్ట్ పైలట్ల పూల్ నుంచి మాత్రమే వ్యోమగాముల ఎంపిక జరుగుతుంది. అత్యున్నత వైమానిక నైపుణ్యంతో పాటు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ నిబ్బరంగా వ్యవహరించగల సామర్థ్యం టెస్ట్ పైలట్ల సొంతం. గగన్‌యాన్ మిషన్‌కు ఎంపిక జరిపిన సమయంలో భారత టెస్ట్ పైలట్ల పూల్‌లో ఒక్క మహిళ కూడా లేరు. దాంతో గగన్‌యాన్ మిషన్‌లో మహిళా ప్రాతినిధ్యం లేకుండాపోయింది. భావి మిషన్లలో మహిళా వ్యోమగాములకు స్థానం దక్కుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. 3 ప్రాజెక్టులు జాతికి అంకితం సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సమీప భవిష్యత్తులో చేపట్టనున్న భారీ రాకెట్ ప్రయోగాల నిమిత్తం సుమారు రూ.1,800 కోట్లతో నిర్మించిన మూడు ఇస్రో సెంటర్లను మోదీ తుంబా నుంచి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లో పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ భవనం, ఇస్రో ప్రపొల్షన్ కాంప్లెక్స్‌లో సెమీ క్రయోజనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ భవనం, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ట్రైనోసిక్ విండ్ టన్నెల్ భవనాలను అందుబాటులోకి తెచ్చారు. వీటిద్వారా ఏటా 8 నుంచి 15 పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలతో పాటు మొదటి ప్రయోగ వేదికపై ఒకేసారి రెండు రాకెట్లను అనుసంధానం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది -
Isro: గగన్‌యాన్..ఇస్రో కీలక అప్డేట్
బెంగళూరు: భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. అంతరిక్షంలోకి మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్‌ను ఇస్రో సిద్ధం చేసింది. ఈ విషయమై ఇస్రో తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో అప్డేట్ ఇచ్చింది. క్రయోజెనిక్ ఇంజిన్ తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. నింగిలోకి వ్యోమగాములను పంపేందుకు వినియోగించే ఎల్వీఎం3 లాంచ్ వెహికల్లో దీనిని వాడనున్నారు. ‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్ గగన్‌యాన్‌లో మానవ ప్రయాణానికి అనువైనదిగా రుజువైంది. ఇది కఠిన పరీక్షలను ఎదుర్కొంది. ఇక మానవ రహిత యాత్రకు వినియోగించే ఎల్వీఎం3 జీ1 లాంచ్ వెహికిల్‌లో వాడేందుకు పరీక్షలు పూర్తయ్యాయి’ఇస్రో అని పేర్కొంది. కాగా, గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములను నింగిలో 400 కిలోమీటర్ల ఎత్తున్న కక్ష్యలోకి పంపి మళ్లీ వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు. ఈప్రయోగం ఇస్రో 2030లో చేపట్టనుంది. Mission Gaganyaan: ISRO's CE20 cryogenic engine is now human-rated for Gaganyaan missions. Rigorous testing demonstrates the engine’s mettle. The CE20 engine identified for the first uncrewed flight LVM3 G1 also went through acceptance tests.https://t.co/qx4GGBgZPv pic.twitter.com/UHwEwMsLJK — ISRO (@isro) February 21, 2024 ఇదీ చదవండి.. భావి భారతం గురించి నీకేం తెలుసు -
24 గంటల్లో 16 న్యూ ఇయర్స్
కేవలం 24 గంటల వ్యవధిలో 16 సార్లు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం సాధ్యమేనా? భూమిపై ఉన్న మనకు సాధ్యం కాకపోవచ్చు గానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములకు ముమ్మాటికీ సాధ్యమే! వారు ఒక్కరోజులో 16 సార్లు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష కేంద్రం భూమిచుట్టూ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో కక్ష్యలో తిరుగుతుండడం వల్లే ఇది సాధ్యమవుతోంది. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తారు. వేర్వేరు టైమ్‌జోన్లలో వేగంగా ప్రయాణిస్తారు. మనకు ఒకరోజులో ఒకటే సూర్యోదయం, ఒకటే సూర్యాస్తమయం ఉంటే వ్యోమగాములు మాత్రం 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తారు. మనకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటే, వ్యోమగాములకు 45 నిమిషాలు పగలు, 45 నిమిషాలు రాత్రి ఉంటాయి. ఈ చక్రం నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది. మరోమాట.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూగోళం స్పష్టంగా కనిపిస్తుంది. భూమిపై విద్యుత్ వెలుగులను వ్యోమగాములు వీక్షిస్తుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా 24 గంటల్లో 16 సార్లు వారు ఈ వేడుకలను తిలకిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రోదసీలో టూల్బ్యాగ్ చక్కర్లు
న్యూయార్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) బయటివైపు మరమ్మతుల కోసం తీసుకెళ్లిన టూల్బ్యాగ్ ఒకటి కనిపించకుండా పోయింది. అది ఎక్కడ పడిపోయిందా అని అంతటా వెతికితే అది అంతరిక్షంలో చక్కర్లు కొడుతోందని తేలింది. అది తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ మళ్లీ అంతరిక్ష కేంద్రాన్నే ఢీకొడుతుందనే భయం మధ్యే అసలు విషయాన్ని బయటిపెట్టింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా). నవంబర్ ఒకటో తేదీన జరిగిన ఈ ఘటనను తాజాగా బహిర్గతంచేసింది. అసలేం జరిగిందంటే? ఆరోజు వ్యోమగాములు మేజర్ జాస్మిన్ మోగ్బెలీ, లోరల్ ఓహారాలు ఐఎస్ఎస్ బయటివైపు ఉన్న హ్యాండ్లింగ్ బార్ ఫిక్చర్, బేరింగ్లను తొలగించి కొత్తవి అమర్చేందుకు స్పేస్‌వాక్ చేశారు. బయటే వారు ఆరు గంటల 42 నిమిషాలసేపు గడిపారు. తర్వాత స్పేస్స్టేషన్లోకొచ్చి మిగతా పనుల్లో పడిపోయారు. ‘‘వెంట తీసుకెళ్లిన వస్తువుల జాబితాను సరిచూసుకోగా ఈ బ్యాగ్ మిస్సయింది. టూల్ బ్యాగ్ దొరకలేదు. స్పేస్‌వాక్ చేసిన ప్రతిసారీ ఆ బ్యాగ్‌తో పనిపడదు. అందుకే దానిని తిరిగి వెంటతేవడం వాళ్లు మర్చిపోయారు. అంతరిక్షంలో ఆ బ్యాగ్ పథమార్గాన్ని బట్టిచూస్తే అది ఒకవేళ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొన్నా ఐఎస్ఎస్కు పెద్దగా ముప్పు వాటిల్లకపోవచ్చు’’ అని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ ఒక వెలుగులా కనిపించే టూల్బ్యాగ్ జాడను ఎర్త్స్కై అనే వెబ్సైట్ కనిపెట్టింది. ‘ టూల్బ్యాగ్ భూమికి ఏకంగా 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. మేఘాలు లేకుండా ఆకాశం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్నపుడు బైనాక్యులర్ సాయంతో నేరుగా మనం దానిని చూడొచ్చు. ఐఎస్ఎస్ చుట్టుపక్కల చక్కర్లు కొడుతూ కనబడుతుంది. అయితే ఇది అలా కొన్ని నెలలపాటు తిరిగాక సవ్యమైన మార్గాన్ని కోల్పోయి విచి్చన్నమవుతుంది’’ అని వెబ్సైట్ విశ్లేషించింది. ఆ టూల్బ్యాగ్లో ఏమేం వస్తువులు ఉన్నాయనే వివరాలను నాసా బహిర్గతంచేయలేదు. టూల్బ్యాగ్లాగా పాత కృత్రిమ ఉపగ్రహాల సూక్ష్మ శకలాలు వేలాదిగా అంతరిక్షంలో తిరుగుతూ నూతన శాటిలైట్లకు ముప్పుగా పరిణమించాయని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సెపె్టంబర్ నెలలో ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి 35,000 శిథిలాల ముక్కలు అక్కడి పాత శాటిలైట్ల కక్ష్యల్లో తిరుగుతున్నాయి. -
సుదీర్ఘ అంతరిక్షయాత్ర చేసి సురక్షితంగా భూమికి
మాస్కో: నాసాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు, రోస్కోస్మొస్‌కు చెందిన మరో శాస్త్రవేత్త సుదీర్ఘ అంతరిక్ష యాత్రను ముగించుకుని క్షేమంగా భూమికి చేరారు. వీరు ప్రయాణించిన స్పేస్‌క్రాఫ్ట్ సోయుజ్ ఎంఎస్-23 కజకిస్తాన్‌లోని జెజ్‌కజ్‌గాన్ నగరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. రోస్కోస్మొస్ వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ నాసా వ్యోమగామి ఫ్రాన్సిస్ రూబియో సెప్టెంబర్ 21, 2022లో సోయుజ్ ఎంఎస్-23 స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యారు. వ్యోమగాములు క్షేమంగా భూమి మీదకు చేరిన విషయాన్ని రోస్కోస్మొస్, నాసా సంస్థలు ధృవీకరించాయి. రష్యా వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 370 రోజుల 21 గంటల 22 నిముషాలు గడిపినట్లు ప్రకటించగా నాసా తమ వ్యోమగామి ఫ్రాన్సిస్కో రూబియో 371 రోజుల పాటు అంతరిక్షంలో గడిపినట్లు ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించింది. వాస్తవానికి వీరు ఆరు నెలల క్రితమే భూమికి చేరుకోవాల్సి ఉండగా చిన్న ఉల్క తాకిడికి స్పేస్‌క్రాఫ్ట్‌లో లీక్ చోటుచేసుకోవడంతో అది సాధ్యపడలేదు. సిబ్బంది లేకుండా మాస్కో మరో రాకెట్ పంపడంతో దానిలో ముగ్గురు వ్యోమగాములు తిరుగుప్రయాణమయ్యారు. సెప్టెంబర్ 27, 2023కి భూమికి చేరుకొని కజకిస్తాన్‌లో క్షేమంగా ల్యాండ్ అయ్యారు. #SoyuzMS23Landing@roscosmos cosmonauts and commander of the Soyuz-MS23 spaceship 👨🏻🚀Sergey Prokopyev is out from the spacecraft. pic.twitter.com/vHbeOpSBr4 — The Space Pirate🥷🏻👨🏻🚀 💫🪐🚀 (@TheSpacePirateX) September 27, 2023 🇺🇸🇸🇻 | El astronauta Frank Rubio, estadounidense de origen salvadoreño, se vio obligado a quedarse en órbita debido a una falla en su nave. Ahora, tras 371 días y 5.963 vueltas alrededor de la Tierra, su nave ha aterrizado y reunirá con su familia. pic.twitter.com/VezH1FHdV4 — El Salvador Avanza (@SvAvanza) September 27, 2023 ఇది కూడా చదవండి: USA : ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు -
చంద్రుడి మీదకు మనుషులు.. నాసా కీలక ప్రకటన!
చంద్రుని వద్దకు మనుషుల్ని పంపేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్న నాసా కీలక విషయాన్ని వెల్లడించింది. జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి రానున్న నలుగురు ఆస్ట్రోనాట్లకు ట్రైనింగ్ ప్రారంభించింది. ఈ శిక్షణ 18 నెలల పాటు కొనసాగనుందని నాసా తెలిపింది. 51 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపైకి మనుషులను పంపిస్తున్న నాసా ఆర్టెమిస్ 2పై పనిచేస్తుంది. ఇందులో భాగంగా జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి రానున్నారు. నలుగురు ఆస్ట్రోనాట్లును సురక్షితంగా తీసుకెళ్లే ఓరియన్ క్యాప్య్సూల్, స్పేస్ లాంచ్ సిస్టం గురించి ఈ 18 నెలల కఠిన శిక్షణలో వివరించనుంది. వీటితో పాటు సిస్టమ్‌లను ఆపరేట్ చేయడం, పర్యవేక్షించడం కూడా నేర్చుకుంటారు. ఆరోహణ, కక్ష్య, తీరం, ఎంట్రీ ఫేజ్‌లతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి’ అనే అంశం గురించి ఆస్ట్రోనాట్స్ వీరికి వివరించనుంది. View this post on Instagram A post shared by NASA (@nasa) -
వ్యోమగాముల మెదడుకు ముప్పు!
అంతరిక్ష ప్రయోగాలంటే అందరికీ ఆసక్తే. అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్), నాసా స్పేస్ షటిల్స్‌లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి. భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాముల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ప్రధానంగా మెదడులో జరిగే మార్పులేమిటి? దీనిపై అమెరికా సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. ఈ వివరాలను ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురించారు. ► అధ్యయనంలో భాగంగా 30 మంది అస్ట్రోనాట్స్ బ్రెయిన్ స్కానింగ్‌లను క్షుణ్నంగా పరిశీలించారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి ముందు, వెళ్లివచ్చిన తర్వాత బ్రెయిన్ స్కానింగ్‌లను సేకరించి, పరిశీలించారు. ► 30 మందిలో 8 మంది రెండు వారాలపాటు అంతరిక్షంలో ఉన్నారు. 18 మంది ఆరు నెలలు, నలుగురు దాదాపు సంవత్సరంపాటు అంతరిక్షంలో ఉండి వచ్చారు. ► ఆరు నెలలకుపైగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల మెదడులోని జఠరికలు(వెట్రికల్స్) కొంత వెడల్పుగా విస్తరించినట్లు గుర్తించారు. ఈ మార్పు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందంటున్నారు. ► మెదడులోని ఖాళీ భాగాలనే జఠరికలు అంటారు. ఇందులో సెరిబ్రోస్పైనల్ ద్రవం ఉంటుంది. వర్ణ రహితమైన ఈ ద్రవం మెదడుచుట్టూ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మెదడుకు రక్షణ కల్పిస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది. ► జఠరికల విస్తరణ వల్ల మెదడులోని కణజాలం ఒత్తిడికి గురవుతున్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని చెబుతున్నారు. జఠరికల్లో మార్పుల కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న దానిపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ► అంతరిక్షంలో ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఎక్కువగా జఠరికల్లో మార్పులు సంభవిస్తాయని, తద్వారా మెదడు పరిమాణం పెరిగి, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని గమనించినట్లు సైంటిస్టు రేచల్ సీడ్లర్ చెప్పారు. ఆరు నెలలకుపైగా ఉన్నవారికే ముప్పు ఉన్నట్లు తేలిందని అన్నారు. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక మెదడు ఎప్పటిలాగే సాధారణ స్థితికి చేరుకోవడానికి 3 సంవత్సరాలు పడుతున్నట్లు వివరించారు. ► భూమిపై మనిషి శరీరంలో రక్తప్రసరణ ఒక క్రమపద్ధతిలో సాగుతుంది. నరాల్లో కవాటాలు(వాల్వులు) ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తితో రక్తం పైనుంచి పాదాల్లోకి ప్రవహించి, అక్కడే స్థిరపడకుండా ఈ కవాటాలు అడ్డుకుంటాయి. గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో ఇందుకు వ్యతిరేక దిశలో జరుగుతుంది. రక్తం, ఇతర ద్రవాలు నరాల గుండా తలలోకి చేరుకుంటాయి. తలపై ఒత్తిడిని కలుగజేస్తాయి. దీనివల్ల మెదడులో జఠరికలు విస్తరిస్తున్నట్లు, కపాలంలో మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ► ఆరు నెలల్లోగా అంతరిక్షం నుంచి తిరిగివచ్చేవారికి ప్రమాదం ఏమీ లేదని, వారి మెదడులో చెప్పుకోదగ్గ మార్పులేవీ కనిపించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తొలిసారిగా అంతరిక్షంలోకి సాధారణ పౌరుడు!
చైనా తొలిసారిగా తమ దేశ సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనుంది. ఈ మేరకు టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్‌లో భాగంగా మంగళవారమే తన దేశ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనుందని ఆ దేశ మానవ సహిత అంతరిక్ష సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని బీచింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ప్రోఫెసర్, పేలోడ్ నిపుణుడు గుయ్ హైచావో, మానవ సహిత అంతరిక్ష సంస్థ ప్రతినిధి లిన్ జియాంగ్ వెల్లడించారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు వాయువ్య చైనాలోని జియక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి టేకాఫ్ కాబోతున్నాయని మానవ సహిత అంతరిక్ష సంస్థ తెలిపింది. అయితే ఈ మిషన్‌లో గుయ్ అంతరిక్ష శాస్త్ర ప్రయోగాత్మక పేలోడ్ల ఆన్-ఆర్బిట్ ఆపరేషన్‌కు ప్రధానంగా బాధ్యత వహించగా, మిషన్ కమాండర్ జింగ్ హైపెంగ్, క్రూ సిబ్బంది ఝు యాంగ్జు ఈ యాత్రని పర్యవేక్షిస్తారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆధ్వర్యంలో అంతరిక్ష యాత్ర కల కోసం ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేసింది. అంతేగాదు ప్రపంచంలో రెండోవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా తన మిలటరీ రన్ స్పేస్ ప్రోగ్రామ్‌లో బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఎప్పటికైనా మానవులను చంద్రునిపైకి పంపాలనే లక్ష్యంతో ఉంది. ఈ విషయమై రష్యా, యూఎస్‌లో పోటీ పడేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగానే చైనా కూడా చంద్రునిపై స్థావరాన్ని నిర్మించాలని భావింస్తుంది. అంతేగాక 2029 నాటికి సిబ్బందితో కూడిన చంద్ర మిషన్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ దేశ నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. (చదవండి: మహిళా కార్యకర్తలపై జరుగుతున్న అకృత్యాలపై దర్యాప్తు చేయాలి!: అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించిన ఇమ్రాన్ ఖాన్) -
చంద్రుడి మీదకు మనుషులు.. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు జాక్ పాట్!
యాబై ఏళ్ల తర్వాత చంద్రుడి మీదకు మనుషులను పంపించే అర్టెమిస్ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ భారీ నాసా కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకున్నారు. 2000 సంవత్సరంలో బెజోస్ ఏరో స్పెస్ కంపెనీ బ్లూ ఆరిజన్ని స్థాపించిన విషయం తెలిసింది. తాజాగా నాసా ‘ఆర్టెమిస్ వి’ ప్రాజెక్ట్‌లో భాగంగా బ్లూ ఆరిజన్ సంస్థ ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుని మీదికి (మూన్ సర్ఫేస్) పంపే స్పేస్‌క్రాఫ్ట్‌ల తయారీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఇదే విషయాన్ని నాసా చీఫ్ అధికారికంగా ప్రకటించారు. నాసా నిర్ణయంతో రెండో ప్రాజెక్ట్‌పై బ్లూ ఆరిజన్ పనిచేయనుంది. ఇప్పటికే అర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఆస్ట్రోనాట్స్ లూనార్ సర్ఫేస్‌లోకి అడుగు పెట్టేలా స్టార్‌షిప్ స్పేస్ క్రాఫ్ట్‌లను తయారు చేసింది. 2021లో అదే స్టార్‌షిప్ స్పేస్ క్రాప్ట్ సాయంతో లూనార్ సర్ఫేస్‌లోకి ఆస్ట్రోనాట్స్ విజయ వంతంగా కాలు మోపారు. దాదాపూ పదేళ్ల తర్వాత చేపట్టిన ప్రాజెక్ట్ విజయవంతంమైంది. దీని విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 24,850 కోట్లు. బ్లూ ఆరిజన్ ప్రాజెక్ట్ విలువ రూ.28,150 కోట్లు ఇక తాజాగా జెఫ్ బెజోస్ సంస్థ బ్లూ ఆరిజన్ నాసా నుంచి దక్కించుకున్న కాంట్రాక్ట్ విలువ అక్షరాల 3.4 బిలియన్ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో రూ.28,150 కోట్లని నాసా ఎక్స్‌ప్లోరేషన్ చీఫ్ జిఫ్ ఫ్రీ తెలిపారు. సంతోషంగా ఉంది. నాసా ప్రాజెక్ట్ దక్కించుకోవడంపై బెజోస్ ట్వీట్ చేశారు. ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుడి మీదకు అడుగు పెట్టే నాసా ప్రయత్నాల్లో తాను ఒక భాగమైనందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. Honored to be on this journey with @NASA to land astronauts on the Moon — this time to stay. Together, we’ll be solving the boil-off problem and making LOX-LH2 a storable propellant combination, pushing forward the state of the art for all deep space missions. #Artemis… pic.twitter.com/Y0zDhnp1qX — Jeff Bezos (@JeffBezos) May 19, 2023 2029లో ప్రారంభం కానున్న ప్రయోగం నాసా కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకున్న బెజోస్ కంపెనీ బ్లూ ఆరిజన్ 50 అడుగుల పొడవైన ‘బ్లూమూన్’ అనే స్పేస్ క్ట్రాఫ్ట్ను తయారు చేయనుంది. తయారీ అనంతరం ఈ స్పేస్ క్రాప్ట్‌లో నలుగురు ఆస్ట్రోనాట్స్ ప్రయాణించి మూన్ సర్ఫేస్‌లో అడుగు పెట్టనున్నారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది! -
అమెరికా, రష్యా, యూఏఈల వ్యోమగాములతో..
కేప్ కెనవెరాల్: అరబ్ దేశాల నుంచి మొట్టమొదటి వ్యోమగామి సహా మూడు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పేస్ఎక్స్ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేరుకుంది. ఆరు నెలల ఈ మిషన్‌లో యూఏఈ రెండో వ్యోమగామి సుల్తాన్ అల్–నెయాడీ పాలుపంచుకుంటున్నారు. నెయాడీతోపాటు అమెరికాకు చెందిన స్టీఫెన్ బోవెన్, వారెన్ హొబర్గ్, రష్యాకు చెందిన అండ్రీ ఫెడ్యాయెవ్ ఉన్నారు. వీరు అక్కడికి చేరుకున్నాక ఐఎస్ఎస్లో గత ఏడాది అక్టోబర్ నుంచి ఉంటున్న అమెరికా, రష్యా, జపాన్ వ్యోమగాములు భూమిపైకి చేరుకోవాల్సి ఉంది. -
‘రక్షణ కవచం’ సక్సెస్.. గంటకు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి..
మానవ సహిత గ్రహాంతర ప్రయోగాల్లో వ్యోమనౌకలు సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ‘లోఫ్టిడ్ (లోఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ యాన్ ఇన్‌ఫ్లాటబుల్ డీసెలరేటర్)’ ప్రయోగం విజయవంతమైంది. అమెరికాలోని కాలిఫోరి్నయా నుంచి యునైటెడ్ లాంచ్ అలయన్స్‌కు చెందిన ‘అట్లాస్ వి’ రాకెట్ ద్వారా గురువారం తెల్లవారుజామున 4.49 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3.19 గంటలకు) ఓ వాతావరణ ఉపగ్రహంతో కలిపి లోఫ్టిడ్ను ప్రయోగించారు. Photo credit: NASA గంటకు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి. అట్లాస్ వి రాకెట్ మొదట వాతావరణ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టి.. కాసేపటికి ‘లోఫ్టిడ్’ను భూమివైపు వదిలేసింది. వెంటనే ‘లోఫ్టిడ్’ తిరగేసిన గొడుగులా విచ్చుకుని.. గంటకు 20 వేలకుపైగా కిలోమీటర్ల వేగంతో భూమివైపు ప్రయాణం మొదలుపెట్టింది. వాతావరణ ఘర్షణతో దాని వేగం తగ్గుతూ వచ్చింది. భూఉపరితలానికి కొద్దివేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు అందు లోని పారాచూట్ విచ్చుకుని.. హవాయి లోని హొనొలులు దీవులకు తూర్పున పసి ఫిక్ మహా సముద్రంలో ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం.. గురు వారం సాయంత్రం 5.04 గంటలకు భూమివైపు ప్రయాణం ప్రారంభించిన హీట్ షీల్డ్.. 5.38 గంటలకు ల్యాండ్ అయింది. ఆ స్థలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ‘లోఫ్టిడ్’ను రికవరీ చేసేందుకు కహనా–2 అనే నౌకను పంపారు. ఈ నౌక ‘లోఫ్టిడ్’ను తీసుకుని తిరిగి కాలిఫోరి్నయా తీరానికి చేరేందుకు రెండు రోజులు పడుతుందని అంచనా. తర్వాత శాస్త్రవేత్తలు ‘లోఫ్టిడ్’లోని సెన్సర్లు రికార్డు చేసిన డేటాను అధ్యయనం చేసి.. ఎంత వేగంతో దిగింది? ఎంత ఉష్ణోగ్రత పుట్టింది? వాతావరణ పరిస్థితులను ఎంతమేర తట్టుకోగలిగిందన్న వివరాలను పరిశీలించనున్నారు. అంగారక వాతావరణానికి తగినట్టుగా మార్చేందుకు.. భూమితో పోలిస్తే అంగారకుడిపై వాతావరణం పలుచగా ఉంటుంది. అందువల్ల అక్కడి వాతావరణం ఘర్షణ కూడా తక్కువ. అందువల్ల వ్యోమనౌకలను ఏ వేగంతో, ఎలాంటి పరిస్థితుల్లో ల్యాండ్ చేయాలి, వేగం తగ్గించేందుకు ఏం చేయాలి, ‘లోఫ్టిడ్’లో అందుకు తగినట్టుగా ఎలాంటి మార్పు చేర్పులు అవసరమన్నది శాస్త్రవేత్తలు నిర్ధారించనున్నారు. ఈ మొత్తం డేటా ఆధారంగా ఇన్‌ఫ్లాటబుల్ హీట్ షీల్డ్‌కు తుదిరూపు ఇచ్చి భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించనున్నారు. -
అంతరిక్షంలో వరి మొక్కలను పెంచిన చైనా!... వీడియో వైరల్
Taikonauts conducting life science experiment in space: చైనా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్నినిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ స్పేస్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి అవుతున్న తరుణంలోనే చైనా పలు సైన్స్ ప్రయోగాలు ప్రారంభించింది. అందులో భాగంగా జీరో గ్రావిటీ ల్యాబ్‌లో వరి మొక్కలను విజయవంతంగా పెంచేసింది కూడా. ఈ విషయాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్(సీఏఎస్) తన లైప్ సైన్సు పరిశోధనల్లో వెల్లడించింది. ఈ ఏడాది జులైలో ఈ ప్రయోగాన్నిప్రారంభించినట్లు పేర్కొంది. ఈ మేరకు తాము రెండు రకాలైన విత్తానాలు...థాలేక్రెస్ అనే క్యాబేజ్ జాతికి చెందిన విత్తనం తోపాటు వరికి సంబంధించిన విత్తనాలతో స్పేస్ స్టేషన్‌లోని వెంటియన్ ల్యాబ్‌లో ఈ ప్రయోగాలు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకుక చైనా వ్యోమోగాములు అంతరిక్షంలోని కృత్రిమ వాతావరణంలో ఈ విత్తనాల నుంచి మొక్కలను విజయవంతగా పెంచింది. ఐతే థాల్స్క్రేస్ నాలుగు ఆకులు ఉత్పత్తి చేయగా, పొడవాటి కాండంతో వరి మొక్కలు సుమారు 30 సెం. మీటర్ల వరకు పెరిగాయి. రేడియోషన్ స్థాయిలు అధికంగా ఉండే అంతరిక్షంలో మొక్కలు ఏవిధంగా ఉంటాయి అనేది తెలుసుకునేందుకే చైనా టైకోనాట్స్(వ్యోమోగాములు) ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు చైనీస్ సెన్స్ అకాడమీకి చెందిన పరిశోధకుడు జెంగ్ హుక్వింగ్ మాట్లాడుతూ..."ఈ రెండు ప్రయోగాలు అంతరిక్షంలోని ప్రతి మొక్క జీవిత కాలాన్ని అధ్యయనం చేసేందుకు ఉపకరిస్తుందన్నారు. అలాగే మొక్కలను పెంచేందుకే కాకుండా మైక్రోగ్రావిటీలో మొక్కల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎలా పెంచాలో పరిశోధనల్లో తెలుస్తుందని చెప్పారు. అంతేకాదు పంటలను భూమి లాంటి వాతావరణంలోనే కృత్రిమంగా పెంచగలమని అన్నారు. మొక్కలు పుష్పించడం జరిగితే అంతరిక్షంలో మరిన్ని పంటలను పండించేందుకు దోహదపడుతుందని జెంగ్ అన్నారు." అయినా చైనా ఏమీ తొలిసారిగా అంతరిక్షంలో మొక్కలు పెంచలేదు. గతేడాది జూలైలో చాంగ్ 5 అనే మిషన్‌తో ఒక వ్యొమోగామి బృందం వరి మొక్కను పెంచింది. ఈ మేరకు చైనా అంతరిక్షంలో తాము మొక్కలను ఏవిధంగా పెంచామో వివరించేలా ఒక వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీక్షించండి. (చదవండి: రష్యా సుమారు 50 వేల బలగాలతో సైనిక విన్యాసాలు... టెన్షన్లో యూఎస్) -
సొంతంగా స్పేస్ స్టేషన్‌ని నిర్మించనున్న రష్యా...యూఎస్‌తో మరో ఆరేళ్లు...
వాషింగ్టన్: రష్యా అంతరిక్ష కేంద్రం చీఫ్ బోరిసోవ్ సంచలన ప్రకటన చేశారు. 2024 నాటికల్లా రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఐతే ఇరు దేశాల మాజీ ప్రచ్ఛన యుద్ధ వ్యతిరేకులు రెండు వారాల కిందటే క్రూ ఎక్స్ఛేంజ్ ఒప్పందంపై సంతకాలు చేసిన తరుణంలో ఆయన ఈ అనుహ్య ప్రకటన వెల్లడించారు. ఇది భవిష్యత్తులో యూఎస్ వ్యోమోగాములు, రష్యన్ వ్యోమోగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విమానాలు పంచుకునేలా వీలు కల్పించే ఒప్పందం. అదీగాక నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్నెల్సన్ రష్యా ఐఎస్ఎస్ భాగస్వామ్యాన్ని 2030 వరకు పొడిగించేలా నాసా, రోస్కోస్మోస్ చర్చలు జరుపుతున్నాయని అన్నారు. పైగా ఈ చర్చలు సఫలం అయ్యేవరకు కూడా రష్యా కొనసాగేలా నాసా ప్రణాళికను అమెరికా శ్వేతసౌధం అమోదించిందని చెప్పారు. అంతేకాదు రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తమ సొంత అంతరిక్ష ఔట్‌పోస్ట్‌ను నిర్మించి, పనిచేసేంత వరకు తమతో కలిసి పనిచేయాలని నాసా అధికారులు కోరినట్లు తెలిపారు. పైగా రష్యా కూడా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నట్లు స్పష్టం చేసింది కూడా. దీంతో అమెరికాతో రష్యా తన భాగస్వామ్యాన్ని మరో ఆరేళ్లు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. 1998లో ప్రారంభించబడిన ఐఎస్ఎస్ యూఎస్-రష్యన్ నేతృత్వంలోని భాగస్వామ్యం నవంబర్ 2020 నుంచి నిరంతరంగా కొనసాగింది. దీనిలో కెనడా, జపాన్‌తో సహా సుమారు 11 యూరోపియన్ దేశాల భాగస్వామ్యాం కూడా ఉంది. ఐతే రష్యా తమ భాగస్వామ్యంలో భాద్యతలన్నింటిని నెరవేర్చి 2024 తర్వాత నుంచి వైదోగాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు బోరిసోవ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అన్నారు. కానీ ఐఎస్ఎస్ డైరెక్టర్ రాబిన్ గాటెన్స్ ఈ విషయం గురించి రష్యన్ సహచరులు తనకు తెలియజేయలేదని ఆమె అన్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు వైట్ హౌస్ ప్రతినిధి కరీన్ జీన్-పీటర్స్ కూడా మాస్కో ఐఎస్ఎస్ నుంచి వైదొలగాలనే ఉద్దేశాన్ని అమెరికాకు అధికారికంగా తెలియజేయలేదని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగడంతోనే యూఎస్, రష్యా దేశాల మధ్య సంబంధాలు కొంత మేర దెబ్బతిన్నాయి. అదీగాక యుద్ధాన్ని విరమించుకోమని యూఎస్ పదేపదే హెచ్చరించడమే కాకండా ఆంక్షలు విధించేందుకు కూడా యత్నించింది. దీంతో ఇరు దేశాల మధ్య కాస్త విభేదాలు తలెత్తాయి. ఐతే అమెరికాలోని నాసా అధికారులు మాత్రం ఇరు దేశాల మధ్య అంతరిక్ష కేంద్రంలో ద్వైపాక్షిక సహకారం అలాగే ఉంటుందని చెప్పడం గమనార్హం. అంతేకాదు అమెరికా కాలిఫోర్నియా విశ్యవిద్యాలయం ప్రస్తుత వ్యోమోగామీ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గారెట్ రీస్మాన్, రిటైర్డ్ వ్యోమగామీ తాము కలిసే ఉన్నామని, తమ భాగస్వామ్య సహకారం అలాగే కొనసాగుతుందని చెప్పడం విశేషం. (చదవండి: యుద్ధానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా... యూఎస్‌కి స్ట్రాంగ్ వార్నింగ్) -
అంతరిక్షంలో చెత్తకు కొత్త విరుగుడు.. అక్కడే మండించేందుకు పరికరం
హూస్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో తయారయ్యే వ్యర్థాలను భూమిపైకి తేకుండా అంతరిక్షంలోనే మండించే కొత్త పరికరాన్ని హూస్టన్‌కు చెందిన నానో ర్యాక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థ తయారు చేసింది. బిషప్స్ ఎయిర్‌లాక్ అనే ఈ పరికరంలో ఒకేసారి 600 పౌండ్లు, సుమారు 272 కిలోల చెత్తను ఉంచి కాల్చవచ్చు. ఐఎస్ఎస్లో ఆస్ట్రోనాట్ల వల్ల ఏడాదికి 2,500 కిలోల వ్యర్థాలు తయారవుతున్నాయి. ఈ వ్యర్థాలను ఐఎస్ఎస్కు అవసరమైన సామగ్రి రవాణాకు ఉపయోగించే సిగ్నస్ కార్గో వెహికల్ ద్వారా భూమిపైకి పంపిస్తున్నారు. ఇందుకు సమయం పడుతోంది. కానీ, బిషప్స్ ఎయిర్ లాక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వెలుపలి అంతరిక్షంలోనే మండించి, తిరిగి ఐఎస్ఎస్కు చేరుకుంటుంది. దీనిని విజయవంతంగా పరీక్షించినట్లు నానోర్యాక్స్ తెలిపింది. -
Nasa: చంద్రుడిపైకి మళ్లీ.. ఈసారి ఏకంగా..!
వాషింగ్టన్: అంతరిక్ష పరిశోధనలో భాగంగా నాసా శాస్త్రవేత్తలు మళ్లీ చంద్రునిపై కాలుపెట్టనున్నారు. ఈసారి.. చంద్రుడిపై ప్రయోగాల సందర్భంగా వ్యోమగాములు తరచూ వినియోగించుకునేందుకు వీలుగా చందమామ సమీప కక్ష్యలో కొత్త అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఏ కక్ష్య అనువుగా ఉంటుందో విషయాన్ని నిర్ధారించేందుకు మంగళవారం క్యాప్‌స్టోన్ అనే ఒక బుల్లి ఉపగ్రహాన్ని పంపారు. ఒక మైక్రోవేవ్ పరిమాణముండే 25 కేజీల ఈ కృత్రిమ శాటిలైట్‌ను మోసుకెళ్లే రాకెట్‌ను న్యూజిలాండ్ నుంచి ప్రయోగించారు. క్యాప్‌స్టోన్ చందమామ సమీపానికి చేరుకుని దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఆ క్రమంలో చంద్రుడికి దగ్గరగా వచ్చినపుడు 2,200 మైళ్లదూరంలో, దూరం జరిగినపుడు 44 వేల మైళ్ల దూరంలో ఉంటుంది. ఇలాంటి కక్ష్యలో పరిభ్రమించనున్న తొలి కృత్రిమ ఉపగ్రహంగా చరిత్ర సృష్టించనుంది. ఆర్నెల్ల పాటు శోధించి అక్కడి స్పేస్‌స్టేషన్ నిర్మాణ అనుకూల కక్ష్యల సమాచారాన్ని నాసాకు చేరవేస్తుంది. భవిష్యత్‌లో ఈ స్పేస్ స్టేషన్ నుంచే వ్యోమగాములు చందమామపై వేర్వేరు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. Liftoff! #CAPSTONE launched aboard a @RocketLab Electron rocket to pave the way for future @NASAArtemis missions to the Moon and beyond. What’s next for the microwave oven-sized satellite? Check out https://t.co/dMVnvEQcfC for updates. pic.twitter.com/VVoAOjSYbD — NASA (@NASA) June 28, 2022 -
చైనా అంతరిక్ష కేంద్రానికి మరో ముగ్గురు
బీజింగ్: చైనా తన సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనుల్లో భాగస్వాములను చేసేందుకు మరో ముగ్గురు వ్యోమగాములను ఆదివారం నింగిలోకి పంపనుంది. తియాంగాంగ్ స్పేష్ స్టేషన్‌కు వ్యోమగాములు చెన్ డాంగ్, లీయాంగ్, కాయ్ క్సుజీలను షెంజూ–14 వ్యోమనౌక ద్వారా నింగిలోకి పంపుతున్నట్లు చైనా మానవసహిత స్పేస్ ఏజెన్సీ(సీఎంఎస్ఏ) శనివారం పేర్కొంది. గన్సులోని జిక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి జరిగే ఈ ప్రయోగం ద్వారా రెండు ల్యాబ్ మాడ్యుల్స్ వెంటియాన్, మెంగ్టియాన్లను నింగిలోకి పంపుతారు. అక్కడికి వీటిని తీసుకెళ్లాక వాటిలో డజనుకుపైగా శాస్త్రీయ ప్రయోగ క్యాబినెట్లను అమర్చుతారు. వచ్చే ఆరు నెలలపాటు వారు చైనా స్పేస్‌స్టేషన్(సీఎస్ఎస్)లోనే గడుపుతారు. ఇప్పటికే ముగ్గురు వ్యోమగాములు అక్కడికి వెళ్లగా ఏప్రిల్‌లో ఒక మహిళా వ్యోమగామి తిరిగి భూమిని చేరుకుంది. ఈ ఏడాది చివరికల్లా మొత్తం అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తిచేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా వెళ్లిన ఆ ముగ్గురు అక్కడ కీలక స్పేస్ టెక్నాలజీల పనితీరును పునఃపరీక్షించారు. రష్యా సాయంతో నిర్మితమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) భవిష్యత్‌లో నిర్వీర్యమైతే చైనా స్పేస్ స్టేషన్(సీఎస్ఎస్) ఒక్కటే మానవనిర్మిత కేంద్రంగా రికార్డులకెక్కనుంది. ఈ ఏడాది మొత్తంగా సీఎస్ఎస్కు 140 ఉపకరణాలు పంపేందుకు 50 అంతరిక్ష ప్రయోగాలు చైనా చేపట్టనుంది. -
ఓరి మీ దుంపదెగ..అంతరిక్షంలోనూ టిక్ టాక్ వీడియోలు!
టిక్‌టాక్ ప్రపంచ దేశాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ భూమ్మీదే కాదండోయ్...అంతరిక్షంలోనూ ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇటలీకి చెందిన 45ఏళ్ల యురేపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఆస్ట్రోనాట్ సమంత క్రిస్టోఫోరెట్టి టిక్‌టాక్ వీడియోలతో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న అంతరిక్షంలో ఉన్న ఈఎస్ఏకి చెందిన ఆర్బిటింగ్ ల్యాబ్‌కు చేరుకున్నారు. 6నెలల పాటు అక్కడ ఉండనున్నారు. అనంతరం భూమ్మీదకు చేరుకోనున్నారు. Back on the International @Space_Station (and TikTok) pic.twitter.com/oCgJSdWKcu — Samantha Cristoforetti (@AstroSamantha) May 6, 2022 అయితే ఈ నేపథ్యంలో ఈఎస్ఏ నుంచి 88 సెకన్ల టిక్ టాక్ వీడియో చేశారు. ఈ వీడియోలో స్పేస్ఎక్స్ఎస్ క్రూ-4 మెషిన్లో భాగంగా టూ 'జీరో - జీ ఇండికేటర్స్' తో పాటు ఎట్టా అనే మంకీ బొమ్మ గురించి వీడియోలో పేర్కొన్నారు. సమంతా తీసిన టిక్ టాక్ వీడియోను 2లక్షల మందికి పైగా వీక్షించగా..8వేల లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన టిక్‌టాక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చదవండి👉ఆడుతూ..పాడుతూ కోట్లు సంపాదిస్తుంది..ఎలా అంటే? -
వారం రోజుల అంతరిక్ష టూర్.. ఒక్కొక్కరు ఎన్ని కోట్లు చెల్లించారంటే?
కేప్ కార్న్‌వాల్: వారం రోజులు అంతరిక్షంలో నివసించేందుకు ముగ్గురు బడా వ్యాపారవేత్తలను, వారి రక్షక ఆస్ట్రోనాట్‌ను శుక్రవారం స్పేస్ఎక్స్ కంపెనీ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు పంపింది. ఐఎస్ఎస్కు స్పేస్ఎక్స్ తొలి ప్రైవేట్ ప్రయాణం ఇదే కావడం విశేషం. శనివారం ఈ ముగ్గురూ ఐఎస్ఎస్లోకి చేరుకున్నారు. రాకెట్ ప్రయాణానికి, అంతరిక్షంలో విడిదికి వీరు ఒక్కొక్కరు దాదాపు 5.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 418 కోట్లు) చెల్లించారు. వీరు ఐఎస్ఎస్లో రష్యా సొంతమైన ప్రాంతం తప్ప ఇతర ప్రాంతాలన్నీ చూడవచ్చు. అమెరికాకు చెందిన లారీ కానర్, కెనెడాకు చెందిన మార్క్ పాతీ, ఇజ్రాయిల్‌కు చెందిన ఈటాన్ స్టిబ్బె ఈ టికెట్లను కొనుగోలు చేశారు. వీరికి రక్షణగా సీనియర్ ఆస్ట్రోనాట్ మైకెల్ లోపెజ్ వెళ్లారు. ఇప్పటికే రష్యా, అమెరికా దేశాల స్పేస్ ఏజెన్సీలు అంతరిక్ష టూర్లను నిర్వహిస్తున్నాయి. తాజా ప్రయాణంతో వీటి సరసకు స్పేస్ఎక్స్ చేరింది. జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూఆరిజిన్ కంపెనీ అంతరిక్షం అంచులకు ప్రైవేట్ యాత్రలు నిర్వహిస్తోంది.త్వరలో వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ సైతం ఈ యాత్రలు నిర్వహించనుంది. చదవండి: (కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి) -
గరం గరం మిర్చి ... స్పేస్‌లో పండించారు మరి!
వీరంతా ‘నాసా’ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోని వ్యోమగాములు. ఇలా మిరపకాయలు చూపుతున్నారేంటి అంటుకుంటున్నారా? మరి ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. భూమికి సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్లో మైక్రో గ్రావిటీ స్థితిలో వారు పండించినవి!! వాటిని రుచి చూసే ముందు ఇలా కోతకోసిన ‘పంట’ను చూపి తెగ సంబరపడ్డారన్నమాట. ఆపై ఈ మిరపకాయల్లో కొన్నింటిని ఫజీతా బీఫ్తోపాటు కాయగూరల్లోకి చేర్చుకొని తిన్నారు. అంతరిక్షంలో మిరపకాయలు పండించడం ఇది రెండోసారి అయినప్పటికీ వాటిని వ్యోమగాములు ఆహారంలో ఉపయోగించడం మాత్రం ఇదే తొలిసారి. నెల రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. కాస్త ఆలస్యంగా కాపు... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో పండించిన మిరపకాయలు భూమ్మీది కంటే కాస్త ఆలస్యంగా కాపుకు వచ్చాయని, 120 రోజులకు బదులు 137 రోజుల తరువాత కాయలు కోతకు సిద్ధమయ్యాయని పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త మాట్ రోమీన్ వివరించారు. ప్లాంట్ హ్యాబిటాట్–04లో అక్టోబర్‌లో కాయల్ని కోశామని.. అదే సమయంలో వ్యోమగాములు మారుతుండటంతో వచ్చిన వారితోపాటు మళ్లీ భూమ్మీదకు వెళుతున్న వారికీ కొన్ని మిరపకాయలను పంపామని (ల్యాబ్‌లో ప్రయోగాలకు) తెలిపారు. ఇలా 137 రోజులపాటు పంట పండించడం ఐఎస్ఎస్లో రికార్డన్నారు. ప్రయోగం విజయవంతమైనం దున త్వరలోనే చిన్నసైజు టొమాటోలు, ఆకుకూరలు పండించే ప్రయత్నం చేస్తామని రోమీన్ తెలిపారు. -
NASA: నాసా కొత్త టీంలో అనిల్ మీనన్
నాసా.. అమెరికా స్పేస్ ఏజెన్సీ. కానీ, ప్రపంచం దృష్టిలో అత్యున్నతమైన అంతరిక్ష ప్రయోగాలకు ఇది నెలవనే అభిప్రాయం ఉంది. అందుకే నాసాలో పని చేయడానికి దేశాలకతీతకంగా సైంటిస్టులు, రీసెర్చర్లు ఉవ్విళ్లూరుతుంటారు. అదే టైంలో టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో నాసా ఎప్పుడూ ముందుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తన కొత్త ఆస్ట్రోనాట్ టీంను ప్రకటించింది. సోమవారం కొత్తగా పది మందితో కూడిన ఆస్ట్రోనాట్ బృందాన్ని ప్రకటించింది నాసా. మొత్తం 12,000 అప్లికేషన్లు రాగా, అందులోంచి ఈ పది మందిని మాత్రమే ఎంపిక చేశారు. వీళ్లంతా నాసా భవిష్యత్తులో చేపట్టబోయే మిషన్లలో పాల్గొననున్నారు. ఇక ఈ టీంలో భారత మూలాలున్న అనిల్ మీనన్ ఇందులో ఒకరు. We're honored to announce the 2021 class of NASA Astronaut Candidates! Get to know them: https://t.co/NbU6BlaTQK. All 10 of these individuals are taking YOUR #askNASA questions, right here on this thread. What do you want to ask them about becoming a NASA Astronaut? pic.twitter.com/byeGl8yphh — NASA Astronauts (@NASA_Astronauts) December 6, 2021 ►45 ఏళ్ల అనిల్ మీనన్.. నాసా ఫ్లయిట్ సర్జన్‌గా 2014 నుంచి సేవలు అందిస్తున్నారు. ►ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో డిప్యూటీ క్రూ సర్జన్‌గా వ్యవహరించారు కూడా. ►డాక్టర్ అనిల్ మీనన్ భారత మూలాలున్న వ్యక్తే. ►నాసాలోని బయోడేటా ప్రకారం.. అనిల్ మీనన్.. ఉక్రెయిన్-భారత సంతతికి చెందిన పేరెంట్స్‌కి జన్మించారు. ఆయన పుట్టి పెరిగింది మిన్నియాపొలిస్(మిన్నెసోటా)లో. ►1999లో హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి న్యూరోబయాలజీలో డిగ్రీ అందిపుచ్చుకున్నారు. ►2004లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ►2009 స్టాన్‌ఫర్డ్ మెడికల్ స్కూల్ నుంచి మెడిసిన్‌లో డాక్టరేట్ పూర్తి చేశారాయన ►యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో కొంతకాలం విధులు నిర్వహించారు ►2018లో స్పేస్ఎక్స్లో చేరిన అనిల్.. కంపెనీ ఫస్ట్ హ్యూమన్ ఫ్లైట్ ప్రిపరేషన్లో పాలుపంచుకున్నాడు. ►స్పేస్ఎక్స్ ఐదు లాంఛ్లకు సంబంధించి.. ఫ్లైట్ సర్జన్‌గా విధులు నిర్వహించారు. ►కాలిఫోర్నియా ఎయిర్ నేషనల్ గార్డ్‌లో చేరిన మీనన్, అడవుల్లో సంచరించేవాళ్లు హఠాత్తుగా గాయపడ్డ వాళ్లకు చికిత్స అందించడంలో నేర్పరి కూడా. ►ఎమర్జెన్సీ మెడిసిన్, స్పేస్ మెడిసిన్ మీద ఎన్నో సైంటిఫిక్ పేపర్స్ ప్రచురించారాయన. ►ప్రస్తుతం ఆయన ఫ్లయిట్ సర్జన్‌గా నాసాలో పని చేస్తూ.. హోస్టన్‌లో ఉంటున్నారు. భార్య అన్నా మీనన్‌తో అనిల్ ►నాసా ప్రొఫైల్ ప్రకారం.. అనిల్ మీనన్ 2010 హైతీ భూకంప సమయంలో, 2015 నేపాల్ భూకంప సమయంలో, 2011 రెనో ఎయిర్‌షో ప్రమాద సమయంలో ముందుగా స్పందించారు. ►భార్య అన్నా మీనన్‌తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ►నాసా అడ్మినిస్ట్రేటర్ బిల నెల్సన్.. ఆస్ట్రోనాట్ బృందాన్ని స్వయంగా ప్రకటించారు. వీళ్లను ఐదు కేటగిరీల శిక్షణ ఇప్పిస్తారు. అందులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సంక్లిష్ట సమస్యల పరిష్కారం, స్పేస్‌వాక్ శిక్షణ, సంక్షిష్టమైన రొబోటిక్ స్కిల్స్‌ను డెవలప్ చేసుకోవడం, టీ-38 ట్రైనింగ్ జెట్‌ను సురక్షితంగా ఆపరేట్ చేయడం, చివరగా.. రష్యన్ లాంగ్వేజ్ స్కిల్స్ శిక్షణ. ► 2022 జనవరిలో అనిల్ మీనన్ నాసా ఆస్ట్రోనాట్ టీంలో చేరి.. శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు. చదవండి: ఐఎంఎఫ్‌లో నెంబర్ 2 మన ఆడపడుచు -
అద్భుత చిత్రం సౌర మంట! అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం
సౌర మంట అనేది సూర్యునిపై అకస్మాత్తుగా పెరిగిన ప్రకాశం, సాధారణంగా ఇది సూర్యని ఉపరితలం వద్ద లేదా సూర్యరశ్మి సమూహానికి దగ్గరగా ఉంటుంది. ఈ మంటల నుంచి రేడియో తరంగాల నుండి గామా కిరణాల వరకు అన్ని రకాల తరంగ దైర్ఘ్యాలు విద్యుదయస్కాంత వర్ణపటం అంతటా వ్యాపించి విద్యుదయస్కాంత వికిరణాన్ని ఉత్పత్తి చేస్తాయి. చాలా దృశ్య శక్తి పరిధి వెలుపల ఉన్న పౌనఃపున్యాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. వేగవంతమైన చార్జ్డ్ కణాలు ప్రధానంగా ఎలక్ట్రాన్లు, ప్లాస్మా మాధ్యమంతో సంకర్షణ చెందుతున్నప్పుడు ఈ మంటలు సంభవిస్తాయి. (చదవండి: అపార్ట్మెంట్లో మంటలు ...కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికి!!) అరోరా అనేది ఒక సహజ విద్యుత్ దృగ్విషయం. ఇది ఆకాశంలో.. ముఖ్యంగా ఉత్తర లేదా దక్షిణ అయస్కాంత ధ్రువం దగ్గర ఎరుపు లేదా ఆకుపచ్చని కాంతికి సంబంధించిన స్ట్రీమర్ల రూపాన్ని కలిగి ఉంటుంది. ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో దీనిని వరుసగా అరోరా బొరియాలిస్ లేదా నార్తర్న్ లైట్స్ అరోరా ఆస్ట్రాలిస్ లేదా సదరన్ లైట్స్ అని పిలుస్తారు. అయితే జీవిత కాలంలో ఎప్పుడో అరుదుగా లభించే చిత్రాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి థామస్ పెస్క్వెట్ తీశారు. We were treated to the strongest auroras of the entire mission, over north America and Canada. Amazing spikes higher than our orbit🤩, and we flew right above the centre of the ring, rapid waves and pulses all over. #MissionAlpha https://t.co/5rdb08ljhx pic.twitter.com/0liCkGvRCh — Thomas Pesquet (@Thom_astro) November 6, 2021 అంతేకాదు ఆయన గ్రహం ఉత్తర భాగంలో మిరుమిట్లు గొలిపే అరోరాస్ (ఎర్రటి లేదా ఆకుపచ్చ)తో బలమైన సౌర మంట వెలుగుతున్న క్షణాన్ని ఫోటో తీశాడు.పైగా ఈ మండుతున్న సూర్యుని కాంతి భూమి వైపు దూసుకుపోతున్న అద్భుతమైన సమయంలో తీశారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫోటోతోపాటు "మా మిషన్ మొత్తం ఉత్తర అమెరికా నుంచి కెనడా మీదుగా ప్రసరిస్తున్న సౌర కాంతిని చూశాం. అయితే మా కక్ష్య కంటే అద్భుతమైన ఎత్తులో ఆ కాంతి ప్రసరిస్తుంది. మేము తరంగ ధైర్ఘ్యాల మధ్యలో ఉన్నాం" అని పెస్క్వెట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్‌కి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి మీరు చూడండి. (చదవండి: రెండు రోజులుగా గుహలోనే... పైగా 240 మంది రెస్య్కూ టీం..చివరికి!!) -
ఆస్ట్రోనాట్స్..ఇంకేం చేస్తాం..డైపర్లు ధరిస్తాం..!
భూమి నుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో స్పేస్ స్టేషన్. 197 రోజులుగా అక్కడే గడుపుతున్న అస్ట్రోనాట్స్. మరికొద్ది సేపట్లో భూమికి తిరుగు ప్రయాణానికి షెడ్యూల్ ఖరారయ్యింది. కానీ ఆఖరి నిమిషంలో వారికి ఊహించని సమస్య ఎదురైంది. ఓవైపు షెడ్యూల్ మరోవైపు సాంకేతిక సమస్య. ఏ మాత్రం అటు ఇటు అయినా సరే అస్ట్రోనాట్స్ ప్రాణాలకు ప్రమాదంతో పాటు ఎంతో విలువైన స్పేస్ ఎక్వీప్‌మెంట్‌ను సైతం నష్టపోవాల్సి ఉంటుంది. అయితే అస్ట్రోనాట్స్ చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి నష్టం లేకుండా ఆ స్పేస్ క్యాప్యూల్స్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతకీ వారికి వచ్చిన సమస్య ఏంటీ ? దాన్ని ఎలా పరిష్కరించారు. ఎప్పుడు ఇక్కడికి చేరుకుంటున్నారు తెలుసుకోవాలంటే... ఏప్రిల్ నెలలో అంతరిక్ష కేంద్రానికి పయనం ప్రయోగాల్లో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 23న స్పేస్ఎక్స్ చెందిన క్యాప్యూల్స్ ద్వారా నాసాకు చెందిన ఆస్ట్రోనాట్స్ షేన్ కింబ్రో,ఫ్రాన్స్‌కు చెందిన థామస్ పెస్కెట్, జపాన్‌కు చెందిన అకిహికో హోషిడే, మహిళా వ్యోమగామి మెక్ ఆర్థర్లు స్పేస్‌లో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లారు. అలా స్పేస్‌లోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్ గరిష్టంగా 210 రోజుల పాటు స్పేస్‌లో ప్రయోగాలు చేయాల్సి ఉండగా శుక్రవారంతో 197 రోజులు పూర్తి చేసుకొని తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది. అయితే ప్రయోగాలు పూర్తి చేసుకొని కిందికి వచ్చే సమయంలో క్యాప్యూల్స్‌లో ఉన్న యురినల్ మూత ఊడిపోవడంతో ఆ యూరిన్ క్యాప్యూల్స్ అడుగుకు చేరింది. దీంతో స్పేస్ స్టేషన్ నుంచి సుమారు 20 గంటల సమయం పట్టనుంది. అయితే సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేసినా..ఆలస్యం అయితే అబ్జారెంట్ అండర్‌గార్మెంట్స్ (డైపర్లు) ధరించి భూమి మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహిళా వ్యోమగామి మెక్ ఆర్థర్ వర్చువల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. భయపడేది లేదు క్యూప్యూల్స్ అంతరాయంపై మహిళా ఆస్ట్రోనాట్స్ మెక్ ఆర్థర్ స్పందించారు. క్యాప్యూల్స్‌లోని యురినల్ విభాగంలో అంతరాయం ఏర్పడిందని మెక్ ఆర్థర్ తెలిపింది. స్పేస్ ప్రయాణం అనేక సవాళ్లతో కూడుకుందని, అన్నింటిని అధిగమించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ యురినల్ విభాగంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. టాయిలెట్ విభాగంలోని సమస్యతో అంతరిక్షం నుంచి భూమి మీదకు 20గంటల ప్రయాణం చేయడం అంత సులభం కాదు. ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ నెలలోనే క్యూప్యూల్లో యురినల్ విభాగంలో టాయిలెట్ లీకైంది. ఆ విషయాన్ని సెప్టెంబర్‌లోనే గుర్తించినట్లు తెలుస్తోంది. స్పేస్ఎక్స్ క్యాప్సూల్‌లోని ప్యానెల్లను పైకి లాగడం వల్ల లీకేజీ జరుగుతున్నట్లు ఆస్ట్రోనాట్స్ గుర్తించి, ఆ సమస్యను పరిష్కరించారు. తాజాగా ఆ తరహా సమస్య మరోసారి పునరావృతం కావడంతో భూమి మీదకు వచ్చేందుకు ఆస్ట్రోనాట్స్ అబ్జారెంట్ అండర్ గార్మెంట్స్‌ను ధరించి ఆదివారం ఉదయం 10గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి భయలు దేరి సోమవారం ఉదయం 4గంటలకు ఫ్లోరిడాలో దిగనున్నారు. చదవండి: చంద్రుడిపై వైఫై నెట్ వర్క్ నేరుగా భూమిపైకే...! -
మీకు ఎడమచేతివాటం ఉందా?.. ఇవి తప్పక తెలుసుకోండి.!
మీకు ఎడమచేతివాటం అలవాటా? లేదా మీకు తెలిసిన వారిలో ఎవరైన ఉన్నారా? వీరి గురించి శాస్త్రవేత్తలు తెలియజేసే ఆసక్తికర విషయాలు ఏమిటో తెలుసుకోండి.. ►భూమిపై ఉన్న మొత్తం జనాభాలో 5 నుంచి 10 శాతం మాత్రమే ఎడమచేతివాటం వ్యక్తులు ఉన్నారు. ►కుడిచేతివాటం వ్యక్తులతోపాల్చితే వీరికి ఆల్కహాల్ తీసుకునే అలవాటు మూడు రెట్లు ఎక్కువట. ►మెదడులో కుడి భాగాన్ని వీరు ఎక్కువగా వినియోగిస్తారు. ►యుక్తవయసులోకి 4 నుంచి 5 నెలలు ఆలస్యంగా అడుగుపెడతారు. ►ప్రముఖ టెన్నిస్ ఆటగాళ్లలో 40శాతం ఎడమచేతివాటం ఉన్నవారే ఉంటారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? ఎడమచేయి అలవాటు ఉన్నవాళ్లు బేస్‌బాల్ ఆటల్లో నిష్ణాతులట. టెన్నీస్, స్విమ్మింగ్, బాక్సింగ్ ఆటలు బాగా ఆడతారట. ►మొత్తం 26 అమెరికా అధ్యక్షుల్లో 8 మంది ఎడమచేతి వాటం ఉన్నవాళ్లే. జేమ్స్ ఎ గార్ఫీల్డ్, హెర్బర్ట్ హూవర్, హ్యారీ ఎస్ ట్రూమాన్, గెరాల్డ్ ఫోర్డ్, రోనాల్డ్ రీగన్, జార్జ్ హెచ్‌డబ్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా. ►గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లెఫ్ట్ హ్యండ్ వ్యక్తుల్లో 26 శాతం మంది ధనవంతులౌతారు. ►చరిత్రలో మంచికి కానీ చెడుకి కానీ పేరుగాంచిన వారిలో ఎడమచేతివాటం ఉన్నవాళ్లే ఎక్కువగా మంది కనిపిస్తారు. వీరిలో సృజనాత్మకత, సంగీత సామర్ధ్య లక్షణాలు కూడా ఎక్కువేనట. బోస్టన్ స్ట్రాంగ్లర్, ఒసామా బిన్ లాడెన్, జాక్ ది రిప్పర్ అందరూ ఎడమచేతి వాటం గలవారే. ►left అనే ఇంగ్లీష్ పదం ఆంగ్లో సక్సాన్ పదమైన lyft నుంచి వచ్చింది. దీనికి విరిగిన లేదా బలహీణం అని అర్థం. ►20 యేళ్ల మహిళలతో పోల్చితే 40 యేళ్లు దాటిన స్త్రీలు 128 శాతం ఎడమచేతివాటం ఉన్న శిశువులకు జన్మనిస్తున్నారట. ►ఎడమచేతివాటం వ్యక్తులు గణితం, భవన నిర్మాణ (ఆర్కిటెక్చర్), అంతరిక్ష రంగాల్లో మరింత ప్రతిభావంతులని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కుడిచేతి వారు మాటలు చెప్పడంలో నిష్ణాతుని కూడా పేర్కొన్నాయి. ►ప్రతి నలుగురు అంతరిక్ష వ్యోమగాముల్లో ఒకరు ఎడమచేతివాటం వారే! ►అమెరికా జనాభాలో 30 లక్షల మంది ఎడమచేతివాటం పౌరులున్నారు. ►వీరికి ఆస్థమా, అలర్జీల సమస్యలు అధికంగా ఉంటాయి. ►ఎడమచేతికి గాయమైతే, కుడిచేత్తో పనులు చేయడం త్వరగానే నేర్చుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ►బ్రిటీష్ రాజ కుటుంబంలో క్వీన్ మదర్, క్వీన్ ఎలిజబెత్ 2, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ విలియం వీళ్లంగా ఎడమచేతివాటం వారే. కుటుంబాన్ని ముందుకు నడిపే నైపుణ్యం వీళ్లకి ఎక్కువే. ►వీరు ఇన్సోమ్నియా అనే నిద్రలేమి వ్యధికి ఎక్కువగా గురౌతారు. ►ఆగస్ట్ 13ను ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డేగా జరుపుకుంటారు. ►వీరు పొడవైన పదాలను స్పీడ్‌గా టైప్ చేయగలరట. ►ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తులు కుడిచేతి వాటం వారి కంటే నీటి అడుగున ఉన్నవాటిని స్పష్టంగా చూడగలుగుతారు. ►కుడి చేతివాళ్ల కంటే వీరిలో కొంచెం కోపం ఎక్కువని జర్నల్ ఆఫ్ నెర్వస్ అండ్ మెంటల్ డిసీజ్ నిర్వహించిన అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రముఖ టెన్నీస్ ఆటగాడు జాన్ మెక్ఎన్రో చాలా కోపిష్టి. ఇతను ఎడమచేతి వాటం ఆటగాడే. ఇవన్నీ పరిశోధనల్లో తేలిన విషయాలు. ఐతే అందరిలో ఇక్కడ ఇచ్చిన అన్ని లక్షణాలు ఉండక పోవచ్చు. సాధారణంగా కనిపించే లక్షణాలను మాత్రమే పేర్కొనడం జరిగింది. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. -
భూమ్మిదే మనుషులు సృష్టించిన మార్స్.. ఎక్కడంటే..
అవును.. భూమ్మీదే మార్స్.. మనుషులే దాన్ని సృష్టించేశారు.. ఎక్కడ అంటే.. ఇజ్రాయెల్‌లోని నెగేవ్ ఎడారిలో.. ఇంతకీ ఎందుకిలా చేశారు.. అక్కడ స్పేస్ సూట్స్ వేసుకుని వీళ్లంతా ఏం చేస్తున్నారు? వంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే.. చలో ఇజ్రాయెల్... భవిష్యత్ సంక్షోభాల దృష్ట్యా ప్లానెట్ ‘బి’ సృష్టించడం కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. అంగారకుడి మీద కొంత అనుకూల వాతావరణం కనిపిస్తున్నా... ఇప్పటి దాకా జీవం ఉన్న దాఖలాలు లేవు. రెడ్‌ప్లానెట్ మీద మానవులు జీవించడానికి ఏ మాత్రం అవకా శం ఉందనే పరిశోధనలకోసం నాసా 2030లో మార్స్ మీదకు వ్యోమగాములను పంపనుంది. ఆ ప్రయోగం కోసమే అంగారక గ్రహం భౌగోళిక స్థితులను పోలిన ఇజ్రాయిల్‌లోని ‘నెగేవ్’ ఎడారిలో రెడ్‌ప్లానెట్ నమూనాను తయారు చేసింది. ఇక్కడ ఆరుగురు వ్యోమగాములు, నాలుగు వారాలపాటు నివసించనున్నారు. ఏఎమ్ఏడి ఈఈ–20గా పిలుచుకునే ఈ బృందంలో ఐదుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. ఆ నమూనా ఎలా ఉంటుంది? మార్స్ బేస్ లోపలి వాతావరణాన్ని పోలిన ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ఉండటం కోసం ఏర్పాటు చేసినట్లుగానే ఈ ఆవాసం ఉంటుంది. అంగార కుడి మీద ప్రయోగాలకోసం ఉన్న సానుకూలత లను, పరిమితులను కూడా అర్థం చేసుకునే విధంగా ఈ ఆవాసాన్ని తయారు చేశారు. బయటికి వచ్చినప్పుడు స్పేస్‌సూట్స్ అంతే కాదు... రోవర్లు, డ్రోన్లతోపాటు ఇతర పరిక రాలన్నింటినీ ఈ అంగారకుడిమీద పరీక్షించనున్నారు ఆస్ట్రోనాట్స్. జీవం ఉండేందుకు ఉన్న అవ కాశాలు, వ్యోమగాముల ఆరోగ్యపరిస్థితులు, వాళ్ల మానసిక స్థితిగతులు, మార్స్ మీద పరిస్థితులు, ఇంజనీరింగ్ విభాగాల్లో 20కిపైగా ప్రయోగాలను 4 వారాలపాటు నిర్వహించనున్నారు. మార్స్ మీద బయటకు వెళ్లినప్పుడు ధరించినట్టుగా నే ఇక్కడా ఆ ఆవాసం నుంచి బయటికి వచ్చిన ప్పు డు, రోవర్స్, డ్రోన్స్ నిర్వహించేప్పుడు వ్యోమ గా ములు తప్పనిసరిగా స్పేస్ సూట్స్‌ను ధరిస్తారు. తీసుకునే ఆహారం, పీల్చేగాలి... వ్యోమగాములు తీసుకునే ఆహారం, పీల్చేగాలి పూర్తిగా మార్స్పైన బేస్‌లో ఉన్నట్టుగానే ఉంటాయి. వ్యర్థాల రీసైక్లింగ్, నీటిబుడగలకు అనువైన ఉన్నట్టుగానే అసాధారణ పరిస్థితులను సృష్టించి ఒంటరిగానూ, ఇద్దరు ముగ్గురు కలిసి సహకరించుకుంటూ ప్రయోగాలు చేస్తారు. ఇతర గ్రహాల మీద ఉన్న దుమ్ము, ధూళి వ్యోమగాములకు శ్వాస సంబంధిత ఇబ్బందులను కలిగించడమే కాదు... యంత్రాలను పనిచేయకుండా చేసే అవకాశం ఉంది. అందుకే దుమ్ము, ధూళిని శుభ్రం చేసే టెక్నాలజీని సైతం ఇక్కడ పరీక్షించనున్నారు. నాలుగువారాలపాటు ఐసోలేషన్... మార్స్ మిషన్ కోసం ఏరోస్పేస్ ఇంజనీర్లు, ఔత్సాహికుల నెట్‌వర్క్‌తో ఏర్పాటైన ఆస్ట్రియన్ స్పేస్ ఫోరమ్ నిర్వహిస్తున్న 13వ అనలాగ్ ఆస్ట్రోనాట్ మిషన్ ఇది. ఇందుకు అవసరమైన క్రూ, పరికరాలు, సౌకర్యాలను ఇజ్రాయేల్ స్పేస్ ఏజెన్సీ సమకూర్చింది. సోమవారం ప్రారంభమైన ఈ ఐసోలేషన్ దశ అక్టోబర్ 31తో ముగియనుంది. అప్పటివరకు మిషన్ కంట్రోల్‌తో మాత్రమే వ్యోమగాములు మాట్లాడతారు. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ నిధులు అందిస్తున్న అతి పెద్ద ప్రయోగం ఇది. ఈ మిషన్‌లో 25 దేశాల నుంచి 200 మంది పరిశోధకులు పాలుపంచుకున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
వైరల్: గాల్లో ఎగురుతున్న పిజ్జాలు.. తినేందుకు పడరాని పాట్లు
వ్యోమగామిగా ఉండటం కష్టమైన ఉద్యోగాలలో ఒకటిని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే వారు భూమికి దూరంగా వేలాది మైళ్లు ప్రయాణించి తమకిచ్చిన పనిని పూర్తి చేస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే రిస్క్‌తో కూడుకున్న జాబ్ అనే చెప్పాలి. టెక్నాలజీ పుణ్యమా అని స్పేస్ ప్రయాణం కూడా ముందున్నంత కష్టంగా లేవనే చెప్తున్నారు వ్యోమగామలు. తాజాగా ఓ వ్యోమగాముల బృందం అంతరిక్షంలో పార్టీ చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది. అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్లలో రోజులు కాదు నెలల కొద్దీ గడిపేలా శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో ఉన్న కొందరు వ్యోమగాములు అక్కడ సరదాగా పిజ్జా పార్టీ చేసుకున్నారు. ఈ వీడియోను ఫ్రెంచ్ ఆస్ట్రోనాట్.. థామస్ పెస్క్వెట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. స్నేహితులతో కలిసి ఓ తేలియాడే పిజ్జా నైట్, మరోలా చెప్పాలంటే మాకిది భూమిపై శనివారం జరుపుకునే పార్టీలా అనిపిస్తుందని క్యాప్షన్‌గా పెట్టాడు. ఆ వీడియోలో.. స్పేస్ షిప్లో ఉన్న కొందరు వ్యోమగాములు పిజ్జాలు గాలిలో ఎగురుతుంటే.. తమ నోటితో పట్టుకొని తింటున్నారు. అక్కడ ఏ వస్తువు అయినా అలా ఎగురుతూనే ఉంటాయి. స్పేస్‌లో గ్రావిటీ ఉండదనే సంగతి తెలిసిందే. ఏదైనా సరే గాల్లో గింగిరాలు కొట్టాల్సిందే. అంతెందుకు స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు మనుషులు కూడా గాలిలో ఎగురుతూనే ఉంటారు. అందుకే.. స్పేస్‌లో ఉండటం చాలా కష్టం. మొత్తానికి.. వ్యోమగాములు పిజ్జా పార్టీ.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరచడంతో పాటు ఆకట్టుకుంది. View this post on Instagram A post shared by Thomas Pesquet (@thom_astro) చదవండి: Italy Fire Accident: ఎత్తైన బిల్డింగ్.. అగ్నికీలలతో సుందర భవనం ఎలా మారిందంటే.. -
అంతరిక్షంలో ఒలింపిక్స్ ఎలా ఆడతారో తెలుసా..?
భూమ్మీద అతిపెద్ద క్రీడా పోటీల సంబరం ఏదంటై ఠక్కున గుర్తొచ్చేది ఒలింపిక్స్. అలాంటి ఒలిపింక్స్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020 పోటీలు 2021లో సాదాసీదాగా జరిగాయి. సత్తా చాటిన క్రీడాకారులు పతకాలు సొంతం చేసుకున్న విజయానందంతో తమ స్వదేశాలకు చేరుకున్నారు. ఆదివారంతో క్రీడా పోటీలు ముగిశాయి. అయితే ఇప్పుడు మరో ఒలింపిక్స్ వార్త వైరల్‌గా మారింది. ఇన్నాళ్లు భూమ్మీద ఒలింపిక్స్ చూశారు ఇప్పుడు అంతరిక్షంలో కూడా పోటీలు జరిగాయి. వ్యోమగాములు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో పలు పోటీలు సరదాగా ఆడుతున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వారి ఆటలు చూస్తుంటే తెగ నవ్వులు తెప్పిస్తున్నాయి. జిమ్నాస్టిక్స్, ఈత, నో హ్యాండ్‌బాల్, వెయిట్‌లెస్ షార్ప్ వంటి ఆటలు ఆడేందుకు తెగ పాట్లు పడుతున్నారు. వారి పాట్లు మనకు హాస్యం పంచుతున్నారు. జీవో గ్రావిటీలో నాలుగు రకాల ఆటలు ఆడారు. బాల్‌ను పట్టుకునేందుకు.. జంప్స్ చేసేందుకు పడుతున్న కష్టాలు సరదాగా ఉన్నాయి. ఆస్ట్రోనాట్స్ కూడా సరదాగా నవ్వుతూ ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫ్రెంచ్ ఆస్ట్రోనాట్ థామస్ పెక్క్వెట్ తెలిపారు. అచ్చం భూలోకంలో జరిగినట్టు ఈ ఒలింపిక్స్ వేడుకల ముగింపు కార్యక్రమం కూడా నిర్వహించడం విశేషం. -
ఐఎస్ఎస్కు తప్పిన పెనుముప్పు
మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పెనుముప్పు తప్పింది. రష్యా ప్రయోగించిన ఓ మాడ్యూల్లో ఏర్పడిన మంటల కారణంగా ఐఎస్ఎస్ దిశ మారింది. నిమిషానికి అర డిగ్రీ చొప్పున మొత్తం 45 డిగ్రీల కోణంలోకి వెళ్లింది. భూమిపై ఏర్పాటు చేసిన సెన్సర్లు దీన్ని గుర్తించడంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అప్రమత్తమమై దాన్ని సరిచేసింది. అసలేం జరిగింది: గురువారం రష్యాకు చెందిన నౌకా అనే మాడ్యూల్ ఐఎస్ఎస్ వద్దకు ప్రయాణ మైంది. ఐఎస్ఎస్కు అది చేరుకున్న తర్వాత ఆటోమేటిగ్గా దానికి అనుసంధానం కావాల్సి ఉంది. అయితే, అలా జరగలేదు. దీంతో మాన్యువల్‌గా మాడ్యూల్‌ను ఐఎస్ఎస్కు అనుసంధానం చేశారు. అంతలోనే మరో సమస్య ఏర్పడింది. నౌకా మాడ్యూల్ లోని థ్రస్టర్లు ఉన్నట్టుండి మండటంతో ఐఎస్ఎస్ దిశ మారడం ప్రారంభమైంది. దీన్ని భూమ్మీద ఉన్న సెన్సర్లు గుర్తించడంతో నాసా శాస్త్రవేత్తలు అప్రమత్త మయ్యారు. నాసాకు చెందిన థ్రస్టర్లను, ఇంజిన్లను పూర్తిగా ఆపేశారు. దానికి వ్యతిరేక దిశలో ఉన్న మరో మాడ్యూల్ నుంచి థ్రస్టర్లను మండించి సరైన దిశకు మళ్లించారు. ఈ ప్రక్రియ 45 నిమిషాల పాటు సాగింది. ప్రారంభంలో మాడ్యూల్ దిశ మారుతుండగా మొదటి 15 నిమిషాల్లో కోల్పోయిన సిగ్నల్స్.. ఐఎస్ఎస్ తిరిగి సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ అందాయి. ప్రమాదం జరిగి ఉంటే.. నాసా శాస్త్రవేత్తలు తక్షణం స్పందించ డంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే ఐఎస్ఎస్లో ఉన్న ఏడుగురు ఆస్ట్రోనాట్లు ప్రమాదంలో పడి ఉండేవారు. అలా జరిగితే ఆకాశంలోకి తప్పించుకోవడానికి వేరే సదుపాయాలు ఉన్నాయని నాసా పేర్కొంది. తప్పించుకోవడానికే ఏర్పాటు చేసిన స్పేస్ ఎక్స్ క్రూ కాప్సూ్యల్ వారి ప్రాణాలను రక్షించేదని తెలిపింది. -
చైనా అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములు
బీజింగ్/జియుక్వాన్: అగ్రరాజ్యాలకు దీటుగా అంతరిక్షంలో పాగా వేయడమే లక్ష్యంగా చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చైనా ముగ్గురు వ్యోమగాములను నిర్మాణంలో ఉన్న తమ స్పేస్ స్టేషన్‌లోని కోర్ మాడ్యూల్ ‘తియాన్హే’లోకి విజయవంతంగా పంపించింది. గోబీ ఎడారిలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9.22 గంటలకు షెన్‌జౌ–12 అంతరిక్ష నౌక ముగ్గురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది. 6.50 గంటల పాటు నిరాటంకంగా ప్రయాణించి, మధ్యాహ్నం 3.54 గంటలకు కోర్ మాడ్యూల్‌ను చేరుకుంది. ముగ్గురు వ్యోమగాములు మూడు నెలలపాటు అక్కడే ఉంటారు. స్పేస్‌స్టేషన్ నిర్మాణంలో పాలుపంచుకుంటారు. భూగోళంపై తమ నిఘా నేత్రంగా భావిస్తున్న సొంత స్పేస్‌స్టేషన్‌ను వచ్చే ఏడాదికల్లా సిద్ధం చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. కోర్ మాడ్యూల్ తియాన్హేను ఈ ఏడాది ఏప్రిల్ 29న చైనా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చైనాలో ఆర్బిట్ స్పేస్‌స్టేషన్‌ను నిర్మిస్తోంది. -
వ్యోమగాములకు తప్పని క్వారంటైన్
వాషింగ్టన్: కోవిడ్ -19 దెబ్బతో ప్రపంచం అతలాకుతలమైంది. మానవ జీవితాలను పూర్తిగా స్తంభింపజేసింది. కోవిడ్ -19 పుణ్యమా ... క్వారంటైన్, సోషల్ డిస్టన్స్, లాక్డౌన్, వంటి పదాలు మన జీవితంతో భాగమయ్యాయి. ఇతర దేశాల నుంచి వచ్చేవారిని కచ్చితంగా క్వారంటైన్ చేయాల్సి వచ్చేది. కేవలం ఇతర దేశాల నుంచి వచ్చిన వారినే క్వారంటైన్ చేశారనుకుంటే మీరు పొరపడినట్లే..! చంద్రునిపై 1969లో మొదటిసారిగా కాలుమోపిన ఆస్ట్రోనాట్స్ కూడా క్వారంటైన్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖగోళయాత్ర చేసి తిరిగి భూమి పైకి వచ్చిన ఆస్ట్రోనాట్స్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మైఖేల్ కొలిన్స్, ఎడ్విన్ బజ్ అల్ర్ర్డిన్ వ్యోమగాములను 21 రోజులపాటు క్యారంటైన్లో ఉంచారు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తన ముప్పైతొమ్మిదో పుట్టినరోజు వేడుకలను కుటుంబానికి దూరంగా ఉండి జరుపుకున్నాడు. క్వారంటైన్ మనకు కొత్తగా ఉన్న , వ్యోమగాములకు మాత్రం సాధారణమే. క్వారంటైన్ ఎందుకు ఉండాల్సివచ్చిందంటే... అపోలో-11 మిషన్ వ్యోమగాములు చంద్రునిపై ఉన్న వాతావరణం, లూనార్ పదార్థాలతో మొదటిసారిగా గడిపారు.వ్యోమగాములను చంద్రునిపై ఉన్న హానికరమైన పదార్ధాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఒకవేళ వారు అక్కడి వాతావరణానికి బహిర్గతమైతే అది భూమిపై ఉన్న మానవాళికి విపత్తుగా మారుతుంది.దీంతో ఖగోళయాత్ర అనంతరం ముగ్గురు వ్యోమగాములను క్వారంటైన్లో ఉంచారు. వారిని వైద్యులు నిశితంగా పరిశీలించారు.మరొక బృందం అపోలో-11 మిషన్ తీసుకొచ్చిన రాళ్లు, ధూళిని పరీక్షించి అధ్యయనం చేశారు. చంద్రునిపై తెలియని అంశాలు , హానికరమైన బ్యాక్టీరియాను పక్కన పెడితే, వ్యోమగాములు చంద్ర నమూనాలను సేకరించినప్పుడు వారికి తెలియకుండానే తీసుకువచ్చే అంశాలు వారి జీవితాన్ని భంగం కలిగించవచ్చునని పరిశోధకులు తెలిపారు. అపోలో -12 , అపోలో -14 మిషన్లకు మూన్ ల్యాండింగ్ తరువాత తిరిగివచ్చే వ్యోమగాములకు క్వారంటైన్ కొనసాగింది. కొన్నిరోజుల తరువాత అపోలో ప్రోగ్రాం తదుపరి మిషన్ల వ్యోమగాములకు క్వారంటైన్ కొనసాగలేదు ఎందుకంటే అంతరిక్షంలో ప్రమాదకరమైన అంశాలు లేవని పరిశోధకులు భరోసా ఇచ్చిన వెంటనే క్వారంటైన్‌ను నిలిపివేశారు.‘అపోలో 11: క్వారంటైన్’ అనే డాక్యుమెంటరీ మార్చి 6 న ప్రముఖ ఆంగ్ల చానల్లో ప్రసారమయ్యింది. -
అంతరిక్షానికి తీసుకెళ్లే వంటకాలు ఇవే!
మైసూరు: మనలో చాలా మందికి అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు అక్కడ ఏమి తింటారు అనే ప్రశ్నలు సాధారణంగా వస్తుంటాయి. అయితే వారికోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ఆహార పదార్దాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా గగన్‌యాన్ వ్యోమగాముల కోసం ఇస్రో ప్రత్యేకంగా వంటకాలను తయారు చేస్తుంది. ఈ వంటకాలను మైసూరుకు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (డిఎఫ్ఆర్ఎల్) మీల్స్ రెడీ టు ఈట్ ప్యాకింగ్ ఫుడ్‌ను సిద్ధం చేసింది.(చదవండి: లీకైన ఎంఐ11 స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ ధరలు) ఆవకాయ పచ్చడి, చికెన్ బిర్యానీ, మూంగ్‌దాల్ హల్వా, దాల్ మక్ని, షాహి పన్నీర్, చికెన్ కోర్మా వంటి 40 ప్రత్యేక వంటకాలను సిద్ధం చేసినట్లు ఒక డిఎఫ్ఆర్ఎల్ అధికారి తెలిపారు. అధికారి మాట్లాడుతూ... వ్యోమగాముల రుచి లేదా ఆహార ప్రాధాన్యతలు గురుంచి మాకు తెలియదు. ఎందుకంటే వారి ఇష్టానికి అనుగుణంగా కాకుండా ఇస్రో తెలిపిన మేరకు వీటిని సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. గగన్‌యాన్ కోసం ఎంపికైన 6గురు ఇచ్చిన జాబితాలో నుంచి ఆహార పదార్థాలను ఎంచుకోనున్నట్లు తెలిపారు. తర్వాత వారి అభిప్రాయం ఆధారంగా ఆహారం సర్దుబాటు చేయబడుతుంది అని అతను పేర్కొన్నారు. డిఎఫ్ఆర్ఎల్ శాస్త్రవేత్తలు ఈ ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలను సిద్ద చేసి ప్యాక్ చేయడానికి ఒక సంవత్సరం పట్టింది. అలాగే ఈ వంటకాలు తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం వరకు పాడవ్వకుండా ఉంటాయి. వండాల్సిన అవసరం లేని పౌచ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. రోజూ సుమారు 2,500 కిలోల కేలరీలు శరీరానికి అందేలా మొత్తం డైట్ ప్లాన్ చేశారు. అలాగే ఆహారాన్ని వేడి చేయడం కోసం అంతరిక్షంలో ఉపయోగించగల ప్రత్యేక హీటర్ సిద్ధం చేసారు. వాటర్ బాటిళ్లను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ప్యాకెట్లు కూడా సిద్ధం చేసారు. -
నాసా, స్పేస్ ఎక్స్ మరో అద్భుత విజయం
ఫ్లోరిడా: అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికాకు చెందిన నాసా, స్పేస్ ఎక్స్ మరో అద్భుత విజయం సాధించాయి. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా అమెరికా వ్యోమగాములు డగ్ హార్లీ, బాబ్ బెంకెన్ అంతరిక్షం నుంచి క్షేమంగా భూమికి చేరుకున్నారు. భారత కాలమనం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 12.18కి ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో డ్రాగన్ క్యాప్సుల్ సురక్షితంగా దిగింది. వీరు సురక్షితంగా భూమికి చేరడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అపోలో కమాండ్ మాడ్యుల్ అమెరికాలో దిగిన 45ఏళ్ల తర్వాత ఇదే తొలి స్పాష్ డౌన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆనందం వ్యక్తం చేశారు. 'అంతరిక్షయానం కూడా సాధారణ విమాన ప్రయాణంలాగా మారిపోయినప్పుడు భవిష్యత్‌లో మానవాళి మనుగడకు భద్రత దొరికనట్లే' అంటూ ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. (ట్రంప్‌కి ఎన్ని కల్లలేనా?) "Thanks for flying @SpaceX." 📍 Current Location: Planet Earth A 2:48pm ET, @AstroBehnken and @Astro_Doug splashed down, marking the first splashdown of an American crew spacecraft in 45 years. #LaunchAmerica pic.twitter.com/zO3KlNwxU3 — NASA (@NASA) August 2, 2020 -
టాయిలెట్ పోటీ.. గెలిస్తే 26.5 లక్షలు
వాషింగ్టన్ డీసీ : చంద్రుడిపై శాశ్వతంగా తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నఅమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఆ దిశగా అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఆర్టెమిస్ మిషన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 2024లొ చంద్రుడిపై శాశ్వత నివాస స్థావరాన్ని ఏర్పాటు చేయాలన్నదే ఈ మిషన్ లక్ష్య. శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలంటే అందులో టాయిలెట్ తప్పనిసరిగా ఉండాలి. భూమిపై ఉపయోగించే టాయిలెట్‌ను అక్క ఉపయోగించలేము. కారణం, గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటమే. దీంతొ టాయిలెట్ నిర్మాణం నాసా వినూత్న పోటీని పెట్టింది. చంద్రునిపై టాయిలెట్ రూపకల్పన చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను సవాలు చేసింది. మంచి డిజైన్ తయారుచేసి ఇచ్చిన వారికి నగదు బహుమతి కూడా ఇవ్వనుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా టాయిలెట్ ను డిజైన్ చేసిన వాళ్లకు 35వేల డాలర్ల(దాదాపు 26.5 లక్షల రూపాయలు) ప్రైజ్ మనీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆసక్తిగల వ్యక్తులు ఆగష్టు 17నాటికి డిజైన్లను పంపించాలని నాసా పేర్కొన్నది. 18 ఏళ్లు దాటిన వారు జట్టుగా లేదా వ్యక్తిగా ఈ డిజైన్ చేయవచ్చు. 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు ఈ పోటీలో పాల్గొనాలంటే వారి డిజైన్లలను సమర్పించడానికి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేర్లు నమోదు చేసుకోవాలి. (జాబిల్లి యాత్రకు మహిళ సారథ్యం) భూమిపై మాదిరిగా గురుత్వాకర్షణ శక్తి చంద్రునిపై లేదు. అందువలన ప్రతిదీ అంతరిక్షంలో తిరుగుతుంది. అందుకే ఈ పని నాసాకు సవాలుగా మిగిలిపోయింది. అందుకే ఈ పోటీని పెట్టింది. భారీ నగదు బహుమతి ఉండడంతో కచ్చితంగా వేలకొద్ది డిజైన్లు నాసా దగ్గరకు వస్తాయి. అంతరిక్షంపై అవగాహన ఉండే వాళ్లకు ఇదో సువర్ణావకాశం. నాసా కోసం టాయిలెట్ డిజైన్ చేసి లక్షల్లో బహుమతి పొందొచ్చు. -
ఐఎస్ఎస్ చేరుకున్న స్పేస్ఎక్స్ క్రూడ్రాగన్ వ్యోమనౌక
-
అంతరిక్షయానంలో సరికొత్త అధ్యాయం
-
స్పేస్ ఎక్స్.. నింగిలోకి వ్యోమగాములు
ఫ్లోరిడా : అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఓ ప్రైవేటు సంస్థకు చెందిన రాకెట్.. ఇద్దరు నాసా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) తీసుకెళ్లింది. తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ ప్రయోగంపై అందరిలోను ఆసక్తి నెలకొంది. నాసా ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో కెన్నడీ స్పేస్ స్టేషన్ నుంచి శనివారం ఈ ప్రయోగాన్ని చేపట్టారు. స్పేస్ ఎక్స్ రూపొందించిన ఈ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డగ్లస్ హర్లీ మరియు రాబర్ట్ బెంకెన్ అంతరిక్షంలోకి ప్రయాణమయ్యారు. దాదాపు 19 గంటల ప్రయాణం తర్వాత వీరు ఐఎస్ఎస్కు చేరుకోనున్నారు. అక్కడ ఉన్న రష్యా వ్యోమగాములు అనాటోలీ ఇవానిషిన్, ఇవాన్ వాగ్నెర్, అమెరికా వ్యోమగామి క్రిస్ కాసిడీలను కలుసుకోనున్నారు. ఈ ప్రయోగంపై స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనతోపాటు స్పేస్ ఎక్స్‌లో ఉన్న ప్రతి ఒక్కరి కల అని తెలిపారు. మరోవైపు ఈ ప్రయోగాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలువురు అధికారులతో కలిసి వీక్షించారు. ‘ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు మేము అమెరికా గడ్డపై నుంచి, అమెరికన్ రాకెట్లలో, అమెరికా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. వాస్తవానికి బుధవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నప్పటికీ.. వాతావరణం అనుకూలించకపోవడంతో చివరి నిమిషాల్లో వాయిదా పడిన సంగతి తెలిసిందే. Liftoff! pic.twitter.com/DRBfdUM7JA — SpaceX (@SpaceX) May 30, 2020 -
చివరి నిమిషాల్లో స్పేస్ ఎక్స్ ప్రయోగం వాయిదా
ఫ్లోరిడా : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన స్పేస్ ఎక్స్ ప్రయోగం వాయిదా పడింది. తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) తీసుకెళ్లడానికి ఉద్దేశించిన ఈ మిషన్ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు వాయిదా పడినట్టు నాసా వెల్లడించింది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాసా తెలిపింది. అన్ని అనుకూలిస్తే స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.22 గంటలకు గానీ, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్పేస్ ఎక్స్‌ను నింగిలోకి పంపనున్నారు. ఓ వైపు 2011 తర్వాత యూఎస్ నుంచి వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లడం, మరోవైపు తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ(స్పేస్ ఎక్స్) అభివృద్ధి చేసిన రాకెట్ కావడంతో ఈ ప్రయోగం నాసాకు ప్రతిష్టాత్మకంగా మారింది. కాగా, స్పేస్ ఎక్స్ రూపొందించిన ఈ ఫాల్కన్ రాకెట్ ద్వారా డగ్లస్ హర్లీ, రాబర్ట్ బెంకెన్ అంతరిక్షంలోకి వెళ్లేందుకు అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం సాయంత్రం 4.33 గంటలకు రాకెట్ నింగిలోకి వెళ్లడానికి కౌంట్‌డౌన్ స్టార్ అయింది. ప్రయోగ సమయానికి రెండు గంటల ముందే హర్లీ, బెంకెన్‌లు తమ సీట్లలో కూర్చున్నారు. అయితే ప్రయోగానికి సరిగ్గా 16 నిమిషాల ముందు వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు స్పేస్ ఎక్స్ లాంచ్ డైరెక్టర్ మైక్ టేలర్ వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి ఫ్లోరిడా స్పేస్ కోర్డు వద్దకు భారీగా జనాలు చేరుకున్నారు. అయితే ప్రయోగం వాయిదా పడటంతో వారు కాసింత నిరాశ చెందారు. -
హలో.. నా పేరు వ్యోమమిత్ర
సాక్షి, బెంగళూరు: మానవులకంటే ముందుగా అంతరిక్షంలోకి మహిళా రోబో ‘వ్యోమమిత్ర’ను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ‘మానవసహిత అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలు, సవాళ్లు’ అన్న అంశంపై బుధవారం బెంగళూరులో జరిగిన సదస్సులో ‘వ్యోమమిత్ర’ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘హలో.. నా పేరు వ్యోమమిత్ర,. నేను గగన్‌యాన్ ప్రయోగం కోసం తయారైన నమూనా హ్యూమనాయిడ్ రోబోను’ అంటూ అందరినీ పలకరించింది. గగన్‌యాన్‌లో తన పాత్ర గురించి మాట్లాడుతూ ‘మాడ్యూల్ పారామీటర్ల ద్వారా నేను పరిశీలనలు జరపగలను. మానవులను హెచ్చరించగలను. స్విచ్ ప్యానెల్ వంటి పనులు చేయగలను’ అని తెలిపింది. వ్యోమగాములకు స్నేహితురాలిగా ఉంటూ వారితో మాట్లాడగలనని ఆ రోబో తెలిపింది. వ్యోమగాముల ముఖాలను గుర్తించడంతోపాటు వారి ప్రశ్నలకు సమాధానమూ ఇవ్వగలనని చెప్పింది. ఇస్రో చైర్మన్ కె.శివన్ మాట్లాడుతూ వ్యోమమిత్ర అంతరిక్షంలో మనుషులు చేసే పనులను అనుకరించలగదని, లైఫ్ కంట్రోల్ సపోర్ట్ సిస్టమ్స్‌ను నియంత్రించగలదని తెలిపారు. చురుగ్గా సన్నాహాలు.. మానవ సహిత ప్రయోగం కోసం నాసా, ఇతర అంతరిక్ష సంస్థల సహకారం, సూచనలు కూడా తీసుకుంటున్నట్లు శివన్ తెలిపారు. గగన్‌యాన్ ప్రయోగం ఇస్రో దీర్ఘకాల లక్ష్యమైన ఇంటర్ ప్లానెటరీ మిషన్‌కు ఉపయోగపడుతుందని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటికే గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా 10 టన్నుల పేలోడ్ సామర్థ్యం ఉన్న లాంఛర్, కీలక సాంకేతిక అంశాలను, అంతరిక్షంలో మనిషి మనుగడకు సంబంధించిన అంశాలను అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే దేశంలో వ్యోమగాములకు సాధారణ అంతరిక్ష ప్రయాణ శిక్షణ ఇస్తాం. చంద్రయాన్–3 పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చంద్రయాన్–3 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. చంద్రునిపైకి మానవుణ్ని పంపే ప్రాజెక్టు తప్పకుండా ఉంటుంది, కానీ అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. దీని కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసి, శిక్షణ నిమిత్తం ఈ నెలాఖరుకు వారిని రష్యాకు పంపనున్నాం. 1984లో రష్యా మాడ్యూల్లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు, కానీ ఈసారి భారత మాడ్యూల్లో భారతీయులు అంతరిక్షంలోకి వెళతారు’ అని చెప్పారు. 3 దశల్లో గగన్‌యాన్.. మానవ సహిత గగన్‌యాన్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. 2021 డిసెంబర్లో మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌ను చేపట్టబోతున్నట్లు తెలిపారు. దానికంటే ముందు రెండు సార్లు (2020 డిసెంబర్, 2021 జూన్) మానవ రహిత మిషన్లను చేపట్టబోతున్నట్లు చెప్పారు. ‘గగన్‌యాన్‌లో భాగంగా సుమారు ఏడు రోజుల పాటు వ్యోమగాములను ఆర్బిటర్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నాం. ఈ మిషన్ కేవలం భారత తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగమే కాదు, మానవుడు అంతరిక్షంలో నిరంతరంగా నివసించేలా కొత్త స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో సాగుతున్న ప్రాజెక్టు. ఇది భారత్ ఘనతను చాటుతుంది’ అని చెప్పారు. -
వాళ్ల వివరాలు రహస్యంగా ఉంచిన ఇస్రో
ఆస్ట్రోనాట్స్.. అంతరిక్ష యాత్రికులు, వీరిని వ్యోమగాములని కూడా పిలుస్తాం. మన గగన్‌యాన్ మిషన్ కోసం రష్యాలో శిక్షణ తీసుకునే వ్యోమగాముల్ని గగన్‌నాట్స్ అని ముద్దుగా పిలుస్తున్నారు. వీరిని అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లి తిరిగి భూమికి సురక్షితంగా తీసుకొచ్చే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అడుగులు వేస్తోంది. ఈ మిషన్ కోసం తొలుత 12 మంది ఎంపిక చేసింది. భారత్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరో స్పేస్ మెడిసిన్ (ఐఏఎం)లో వారికి కొన్ని పరీక్షలు నిర్వహించి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న నలుగురిని తుది జాబితాలోకి చేర్చింది. ఈ నలుగురిలో మహిళలెవరికీ చోటు దక్కలేదు. ప్రస్తుతానికి వీరి వివరాలను ఇస్రో రహస్యంగా ఉంచింది. అయితే వీరంతా భారత వైమానిక దళానికి చెందిన పైలట్లని ఇస్రో చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. మానవ లక్షణాలు కలిగిన ఒక రోబోని కూడా వ్యోమగాముల వెంట పంపించనున్నారు. ►గగన్‌యాన్ ఎప్పుడు: భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2022లో అంతరిక్షంలోకి అడుగు పెట్టాలని లక్ష్యం ►తుది జాబితాలో వ్యోమగాములు: నలుగురు ►రష్యాలో శిక్షణ ఎంతకాలం: 11 నెలలు ►వ్యయం: రూ.10 వేల కోట్లు ►అంతరిక్ష కేంద్రానికి వెళ్లే వ్యోమగాములు: ఇద్దరు లేదా ముగ్గురు ►గడిపే కాలం: వారం రోజులు ►వ్యోమగాముల్ని తీసుకువెళ్లే వాహకనౌక: బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్–త్రీ -
క్యాట్ వాక్ కాదు స్పేస్ వాక్
వాషింగ్టన్: ఆకాశంలో సగంగా కాదు. ఆకాశమంతటా తామేనని నిరూపించారు మహిళా వ్యోమగాములు క్రిస్టీనా కోచ్, జెస్సికా మియెర్‌లు. మునుపెన్నడూ ఎరుగని ఈ అనుభవాన్ని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం శుక్రవారం ఈ అనంతకోటి ప్రపంచానికి కనువిందు చేసింది. మొత్తంగా ఏడు గంటల 17 నిమిషాలపాటు అంతరిక్షంలో గడిపి వీరిద్దరూ స్పేస్‌వాక్ విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్‌లో నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌కాల్ చేశారు. మహిళా వ్యోమగాములిద్దరినీ అభినందించారు. మీరిద్దరినీ చూసి అమెరికా గర్విస్తోందని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. క్రిస్టీనా కోచ్, జెస్సికా మియెర్ 54 ఏళ్లలో తొలిసారి అచ్చంగా మహిళా వ్యోమగాములు పురుషులతోకలసి కాకుండా మహిళా వ్యోమగాములు మాత్రమే స్పేస్ వాక్ చేసిన తొలి సందర్భం ఇదే కావడం విశేషం. అర్ధశతాబ్దకాలానికిపైగా వ్యోమగాములు 420 సార్లు స్పేస్ వాక్ చేశారు. 421వ స్పేస్ వాక్ ఆసాంతం మహిళల సొంతం. ఇప్పటి వరకు మొత్తం 227 మంది వ్యోమగాములు స్పేస్ వాక్ చేస్తే, అందులో మహిళలు కేవలం 14 మందే. గతంలో స్పేస్ వాక్ చేసిన స్త్రీలంతా ఇతర పురుషులతో కలిసి చేసినవారే తప్ప ప్రత్యేకించి స్త్రీలే స్పేస్‌వాక్ చేసిన సందర్భం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. క్రిస్టినా కోచ్, జెస్సికా మియెర్ వ్యోమగాములు క్రిస్టినా కోచ్, జెస్సికా మియెర్‌లు ఈ చారిత్రక ఘటనలో పాలుపంచుకున్నారు. మార్చి నుంచి క్రిస్టినా కోచ్, ఫిబ్రవరి నుంచి జెస్సికా మియెర్ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో ఉన్నారు. అంతరిక్షంలో తేలుతూ ఈ ఇద్దరు మహిళలు గత వారాంతంలో స్పేస్ స్టేషన్ వెలుపల నిరుపయోగంగా మారిన బ్యాటరీ చార్జర్‌ను మార్చారు. దీంతోపాటు ఇతరత్రా రిపేర్ల కోసం స్పేస్ స్టేషన్ వెలుపల ఏడుగంటల 17 నిమిషాలపాటు అంతరిక్షంలో గడిపారు. ఇప్పటి వరకు స్పేస్ వాక్‌లు జరిపిన వారిలో జెస్సికా 228 వ వారు. ప్రత్యేకించి మహిళా వ్యోమగాల స్పేస్ వాక్ నిజానికి ఆరు నెలల క్రితమే జరగాల్సి ఉంది. అయితే వ్యోమగాములకు సరిపోయే స్పేస్ సూట్ లేకపోవడం వల్ల స్సేస్ వాక్ ఆర్నెల్లు వాయిదాపడింది. ఇద్దరికి స్పేస్ సూట్ కావాల్సి ఉండగా ఒకే ఒక్క మధ్యతరహా కొలతలతో కూడిన స్పేస్ సూట్ అందుబాటులో ఉండడంతో ఇంతకాలం ఆగాల్సి వచ్చింది. వీరికోచ్ మెక్ క్లెయిన్ తిరిగి భూమిపైకి రావడంతో రెండో స్పేస్ సూట్ అంతరిక్ష పరి శోధనా కేంద్రానికి తీసుకెళ్ళడం సాధ్యమైంది. -
గుంతల రోడ్డుపై వ్యోమగామి నడక
-
వైరల్ వీడియో : రోడ్డుపై వ్యోమగామి నడక
సాక్షి, బెంగళూరు : గుంతల రోడ్లతో ప్రజలు పడుతున్న బాధలను వెలుగెత్తేందుకు ఓ కాళాకారుడు వినూత్న ప్రయత్నం చేశారు. వ్యోమగామి దుస్తులతో గుంతల రోడ్డుపై నడుస్తూ వినూత్నమైన పద్దతిలో తన నిరసనను తెలిపారు. బాదల్ నంజుందస్వామి అనే కళాకారుడికి ఈ ఆలోచన వచ్చింది. వ్యోమగామి దుస్తులు ధరించి అంతరిక్షంలో వేరే గ్రహంపై నడిచినట్లుగా నటిస్తూ వీడియోను చిత్రీకరించారు. రోడ్డుపై ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ అంతరిక్షంలోనే ఉన్నట్లు రూపొందించాడు. వీడియో చూస్తున్నంతసేపు అంతరిక్షంలోనే ఉన్నాడేమో అనే భావన కలిగేల వీడియో తయారు చేశాడు. బెంగళూరులోని రహదారుల అధ్వాన్నపరిస్థితి చాటిచెప్పే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ఒకరు అంతరిక్షంలో.. ఒకరు అవనిపై..
వాషింగ్టన్: స్కాట్ కెల్లీ, మార్క్‌లు ఇద్దరూ కవలలు.. ఇద్దరి శరీర తీరు, ఆకారం, జన్యువులు దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. ఒకవ్యక్తి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లాడు. 340 రోజుల పాటు అక్కడే గడిపాడు. మరొకరేమో భూమిపైనే ఉన్నాడు. సాధారణంగా మనలాగే ఇక్కడ గడిపాడు. ఈ ఏడాది పాటు వారిద్దరి శరీరంలో, జన్యు క్రమంలో జరిగిన మార్పులేంటి.. కెల్లీ భూమిపైకి వచ్చాక తిరిగి యథాస్థితికి వచ్చారా అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ ఇద్దరు కవలలపై పరిశోధనలు చేసిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. యూరీ గెగారిన్ అంతరిక్షంలోకి వెళ్లి 58 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ పరిశోధన వివరాలను శుక్రవారం నాసా తెలిపింది. ఏడాది పాటు మానవుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనుగడ సాగించగలడని చివరికి శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 2015–16 మధ్య స్కాట్ కెల్లీ అంతరిక్షంలో 340 రోజుల పాటు జీవనం సాగించారు. అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఉండకపోవడం, గంటకు దాదాపు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల మన శరీరంలో కొన్ని మార్పులు జరిగి ఆ వాతావరణానికి అనుగుణంగా పనిచేస్తుంటుందని నాసాకు చెందిన స్టీవెన్ ప్లాట్స్ వివరించారు. శరీర బరువు, సూక్ష్మజీవులు, రక్తప్రసరణ, కొల్లాజెన్‌లో మార్పులు, ముఖ్యంగా జన్యువుల్లో అస్థిరత, రోగ నిరోధక శక్తి తదితర మార్పులు స్కాట్ కెల్లీలో సంభవించినట్లు తెలిపారు. అయితే భూమి మీదకు వచ్చాక కెల్లీ శరీరంలో సంభవించిన మార్పులన్నీ యథాస్థితికి వచ్చి, కవల సోదరుడి మాదిరిగానే మారిపోయినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 12 యూనివర్సిటీలకు చెందిన 84 మంది శాస్త్రవేత్తలు 10 బృందాలుగా విడిపోయి అంతరిక్షంలో మానవ శరీరంలో జరిగే మార్పులను చాలా క్షుణ్నంగా అధ్యయనం చేశారు. అంతరిక్షంలో ఉన్న స్కాట్ కెల్లీ, భూమిపై ఉన్న మార్క్‌ల శారీరక, మానసిక మార్పులను తెలుసుకునేందుకు 27 నెలల పాటు వారి ప్లాస్మా, రక్తం, మల, మూత్రాల నమూనాలను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ద్వారా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములకు∙చికిత్స అందించేందుకు వీలు కలగనుంది. కెల్లీలో మార్పులివీ.. ► అంతరిక్షంలోకి చేరుకోగానే దాదాపు వెయ్యి జన్యువుల్లో మార్పులు ► కెరోటిడ్ ధమని దళసరిగా మారింది ► డీఎన్ఏకు నష్టం వాటిల్లింది ► జన్యువుల్లో మార్పులు సంభవించాయి ► కంటి రెటీనా మందంగా మారింది ► కడుపులోని బ్యాక్టీరియా స్థానాన్ని మార్చుకున్నాయి ► మేధస్సులో మార్పులు ► టీలోమర్లలో నిర్మాణాత్మక మార్పులు ► డీఎన్ఏలో జన్యుపరివర్తనం జరగలేదు ► ఫ్లూ వ్యాక్సిన్ భూమిపైలాగే పనిచేసింది ► వ్యాయామంతో బరువు తగ్గాడు ► ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడే ఫోలిక్ యాసిడ్ పెరిగింది ► చురుగ్గా రోగ నిరోధక శక్తి -
అంతరిక్షానికి నిచ్చెన వేద్దాం..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గగన్‌యాన్‌కు రంగం సిద్ధమవుతోంది. రూ.10 వేల కోట్ల ఖర్చుతో వ్యోమగాములు వారం రోజుల పాటు అంతరిక్షంలో ఉండేందుకు ఉద్దేశించిన ఈ భారీ ప్రయోగానికి అవసరమైన అన్ని సాంకేతికతలు, వసతులను ఇస్రో ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుంటోంది. డిజైన్ రూపకల్పన, పారాచూట్స్, స్పేస్ సూట్ల తయారీకి సంబంధించి ఇస్రో చేస్తున్న ప్రయత్నాలు క్లుప్తంగా.. ముందుగా రోబోలు గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ముందుగా రోబోలతో కొన్ని ప్రయోగాలు నిర్వహించాలని ఇస్రో ప్రణాళిక సిద్ధం చేసింది. 2022లో మనుషులను అంతరిక్షంలోకి పంపేందుకు ముందుగా మనుషులను పోలిన రోబోల (హ్యుమనాయిడ్స్)తో ప్రయోగాలు నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ కె.శివన్ అంటున్నారు. హ్యూమనాయిడ్ రోబో సిద్ధమైపోయిందని వివరించారు. మానవులను అంతరిక్షంలోకి పంపే సత్తా భారత్‌కు ఉందని నిరూపించడంతో పాటు సురక్షితంగా వెనక్కి తీసుకురావడం కూడా సాధ్యమని చాటి చెప్పాలన్నది తమ లక్ష్యమంటున్నారు. ‘ఇస్రో సిద్ధం చేసిన హ్యూమనాయిడ్ రోబో మనిషి చేయగల అన్ని పనులు చేయగలదు. గగన్‌యాన్ సన్నాహక ప్రయోగాల్లో భాగంగా చేసే తొలి ప్రయోగం లోనే దీన్ని వాడతాం. బయో ఫిల్టర్లు, సెన్సర్లు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ప్రయోగాలు చేపడతాం’అని చెప్పారు. దేశంలోని పరిశోధన సంస్థలు కూడా తమ ప్రతిపాదనలు ముందుకు తెచ్చాయని నిపుణుల కమిటీ వాటిని విశ్లేషించి కొన్నింటినీ చేపట్టే అవకాశం ఉందని అంచనా. గగన్‌యాన్ డిజైన్‌కు సంబంధించిన పనులు వచ్చే వారానికల్లా పూర్తవుతాయని శివన్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 11 కమిటీలను ఏర్పాటు చేశామని ఇవి ఒక్కో ఉపవ్యవస్థ డిజైన్‌ను పరిశీలించి ఓకే చేస్తుందన్నారు. డిజైన్ ఖరారు తర్వాత అవసరమైన సామగ్రిని సమకూర్చుకోవడం మొదలవుతుందని, పరిశోధన శాలలో నమూనా వ్యవస్థలను తయారు చేస్తామని చెప్పారు. త్వరలో ‘మాడ్యూల్స్’డిజైన్లు ఖరారు గగన్‌యాన్‌కు అవసరమైన క్రూ మాడ్యూల్ (వ్యోమగాములు ఉండే గది), క్రూ సర్వీస్ మాడ్యూల్ డిజైన్ల కరారు ప్రక్రియ తుదిదశకు చేరుకుందని, త్వరలో డిజైన్లు ఖరారు చేస్తామని శివన్ చెప్పారు. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ పేరుతో కొత్తగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, గగన్‌యాన్‌కు సంబంధించిన పనులన్నీ అక్కడే జరుగుతున్నాయని తెలిపారు. క్రూ మాడ్యూల్, క్రూ సర్వీస్ మాడ్యూళ్లను ఇప్పుడే మొదటిసారిగా రూపొందించట్లేదని, వీటికి అవసరమైన మౌలికవసతులు ఇప్పటికే తమకు ఉన్నాయని చెప్పారు. ఇస్రో కొన్ని సంవత్సరాల కిందటే క్రూ మాడ్యూల్‌ను ప్రయోగాత్మకంగా అంతరిక్షంలోకి పంపి మళ్లీ వెనక్కి తీసుకొచ్చింది. గతేడాది క్రూ ఎస్కేప్ సిస్టం (రాకెట్లో వెళ్తుండగా ఏదైనా ప్రమాదం జరిగితే వ్యోమగాములు తప్పించుకునే వ్యవస్థ)ను కూడా పరీక్షించింది. 259 సెకన్ల పాటు జరిగిన ఈ ప్రయోగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థ, క్రూ మాడ్యూల్ సహా రాకెట్ నుంచి విడిపోయింది. అది బంగాళాఖాతంపై ఉండగా, దానికి అమర్చిన పారాచూట్లు విచ్చుకున్నాయి. వాటి సహాయంతో శ్రీహరికోటకు 2.9 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై దిగింది. అక్కడ నుంచి దాన్ని భూమి మీదకు తెచ్చారు. క్రూ మాడ్యూల్‌కు అమర్చిన ప్రత్యేకంగా రూపొందించిన 7 మోటార్లు క్రూ మాడ్యూల్‌ను అతివేగంతో రాకెట్ నుంచి ప్రమాదం జరగనంత దూరానికి తీసుకెళ్లాయి. 2022లో మానవులను పంపిస్తామని చెప్పారు. వడోదరా స్పేస్ సూట్ అంతరిక్ష యాత్రలో వ్యోమగాములు ధరించే స్పేస్ సూట్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దీన్ని గుజరాత్‌లోని వడోదరాలో రూపొందించారు. విదేశాలు రూపొందిస్తున్న స్పేస్ సూట్లతో పోలిస్తే ఇది 20% తక్కువ బరువుంటుంది. ఇతర దేశాలు స్పేస్ సూట్ తయారీకి చేసిన వ్యయం కంటే వందో వంతు తక్కువ ఖర్చుతో రూపొందించారు. 4 పొరల ఈ స్పేస్‌సూట్‌ను ప్రత్యేకమైన పోగులతో అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు. అంతరిక్షంలో ఉండే అధిక పీడన పరిస్థితులను తట్టుకునేలా రూపొందింది. శరీర ఉష్ణోగ్రతల్ని కొలిచే బయో సెన్సర్లు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్లు, చేతులకు వేసుకోవడానికి మృదువైన తొడుగులు, తేలిగ్గా ఉండే షూస్ అన్నీ ఇందులోనే ఉంటాయి. వీటిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించారు. ఈ స్పేస్ సూట్ మైనస్ 40 డిగ్రీల అతిశీతల పరిస్థితుల నుంచి 80 డిగ్రీల సెల్సియస్ వేడి వరకు ఉష్ణోగ్రతలను తట్టుకునేలా రూపకల్పన చేశారు. ఆగ్రా పారాచూట్... అంతరిక్షంలో వారం రోజులు గడిపి తిరిగి పయనమయ్యే ముగ్గురు భారతీయ వ్యోమగాములు భూమికి చేరుకునేటప్పుడు అవసరమయ్యే పారాచూట్లను ఆగ్రాలో తయారు చేశారు. డీఆర్డీవోకి చెందిన ఏరియల్ డెలివరీ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వీటిని రూపొందించింది. తిరుగుప్రయాణంలో భూమికి 120 కి.మీ. ఎత్తులో క్రూ మాడ్యూల్, సర్వీసు మాడ్యూల్ వేరవుతాయి. అప్పట్నుంచి వ్యోమగాములు భూమి మీదకి చేరుకోవడానికి 36 నిమిషాలు పడుతుంది. గుజరాత్లో అరేబియా సముద్ర తీర ప్రాంతంలో క్రూ మాడ్యూల్ దిగడానికి ముందు ఈ పారాచూట్లు తెరుచుకుంటాయి. పారాచూట్లు క్రూ మాడ్యూల్ వేగాన్ని సెకనుకు 216 మీటర్ల నుంచి 11 మీటర్లకి తగ్గిస్తాయి. చాలా గొప్ప విషయం... భారత్ అంతరిక్షానికి మనుషుల్ని పంపడానికి సిద్ధమవడం చాలా గొప్ప విషయం. రెక్కలు కట్టుకొని అంతరిక్షంలోకి వాలితే మనుషుల ఆలోచనల్లోనూ మార్పులు వస్తాయి. గగన్‌యాన్‌తో భారత్ తన సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంతో అంతరిక్ష రంగంలో విద్యార్థులకు ఆసక్తి పెరిగి స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది. ఇదంతా దేశ ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. జెర్రీ రోజ్, నాసాకు చెందిన మాజీ వ్యోమగామి, ఏడుసార్లు అంతరిక్షానికి వెళ్లి రికార్డు సృష్టించిన వ్యోమగామి – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
2021 డిసెంబర్లో ‘గగన్‌యాన్’!
సాక్షి, బెంగళూరు: దేశ అంతరిక్ష చరిత్రలో మైలురాయిగా నిలవనున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్‌యాన్’ ప్రాజెక్టును డిసెంబర్ 2021లోగా చేపట్టే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ వెల్లడించారు. గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా పంపే ముగ్గురు వ్యోమగాముల్లో భారతీయులే ఉండే అవకాశం ఉందని, వీరిలో ఒక మహిళా వ్యోమగామిని కూడా పంపనున్నట్లు తెలిపారు. వీరిలోనే భారత వాయుసేనకు చెందిన వ్యక్తి కూడా ఉండనున్నట్లు చెప్పారు. శుక్రవారం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో మీడియాతో శివన్ మాట్లాడారు. 2021లో చేపట్టే మానవసహిత అంతరిక్ష ప్రయోగాని కంటే ముందే డిసెంబర్ 2020–జూలై 2021 మధ్య మానవ రహిత మిషన్లను ప్రయోగించనున్నట్లు పేర్కొన్నారు. మానవసహిత అంతరిక్ష ప్రయోగం కోసం ఇస్రోకు రూ.9,023 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం లభించినట్లు చెప్పారు. గగన్‌యాన్‌కు సంబంధించి వ్యోమగాములకు భారత్‌లోనే శిక్షణ ఇస్తామని చెప్పారు. ముఖ్య శిక్షణ రష్యా లేదా ఇతర దేశాల్లో ఇప్పించాలని యోచిస్తున్నారు. ఏప్రిల్‌లో చంద్రయాన్–2 ప్రతిష్టాత్మక చంద్రయాన్–2 ప్రయోగాన్ని ఏప్రిల్ నెలలో చేపట్టేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నట్లు శివన్ శుక్రవారం తెలిపారు. ముందుగా చంద్రుడిపైకి చంద్రయాన్–2ను ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 16 తేదీల మధ్యలో పంపుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పలు పరీక్షలు పూర్తికాకపోవడం వల్ల ప్రయోగ తేదీని వాయిదా వేసినట్లు తెలిపారు. 10 ఏళ్ల కిందట చేపట్టిన చంద్రయాన్–1కు ఆధునిక రూపమైన చంద్రయాన్–2ను రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టారు. చంద్రయాన్–2 రోవర్ ద్వారా చంద్రుడిపై వాతావరణాన్ని పరీక్షిస్తామని శివన్ తెలిపారు. చంద్రయాన్–2 నౌక చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగేలా తొలిసారి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మరో 3 నెలల్లో ఇస్రో టీవీని తీసుకొస్తామని తెలిపారు. ఇస్రో టీవీ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయం తదితర అంశాలను ప్రసారం చేస్తామని చెప్పారు. 2020 జనవరిలో అంతర గ్రహ గగనయానానికి సంబంధించిన ఆదిత్య ఎల్–1 ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జీశ్యాట్–20 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తామని చెప్పారు. -
అంతరిక్షం.. ఆరోగ్యం జాగ్రత్త!
అంతరిక్షం..అబ్బా చూడ్డానికి ఎంత బాగుంటుందో.. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అయితే తెల్లటి సూటులేసుకుని. డింగుడింగుమంటూ ఎగురుతూ తిరుగుతూ ఉంటే..భలే మజా వస్తుంది కదూ..నిజంగానే.. అక్కడ అంత బాగుంటుందా? లేదా మన కళ్లకు కనిపిస్తున్నదంతా నాణేనికి ఒక వైపేనా.. రండి.. రెండో వైపు చూసి వద్దాం.. నిజానికి సుదీర్ఘకాల స్పేస్‌మిషన్‌ల వల్ల చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లే వ్యోమగాములకు అక్కడ గురుత్వాకర్షణ తక్కువగా ఉండటం, రేడియోధార్మికత కారణంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. 2022 కల్లా అంతరిక్షంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపేందుకు ఉద్దేశించిన ‘గగన్‌యాన్’ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో అంతరిక్షంలో ఆరోగ్యపరంగా వ్యోమగాములు ఎదుర్కొనే ఇబ్బందులపై ఓ లుక్కేస్తే.. 1 దృష్టి సమస్యలు శరీరంలోని ద్రవాలు ప్రసరించి తలవైపు వస్తున్నప్పుడు కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది 2 గుండె మెల్లిగా బలహీనమవుతుంది.ఆకారంలో మార్పులొస్తాయి.గుండె బరువు తగ్గుతుంది. గుండెకొట్టుకునే విధానంలో చాలా మార్పులొస్తాయి. 3 మూత్రపిండాలు క్యాల్షియం ఎక్కువ మొత్తంలో రక్తంలో కలవడం కారణంగా.. కిడ్నీలో రాళ్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4 కండరాలు 5–11రోజుల అంతరిక్ష ప్రయాణంలో 20%వరకు కండరాలు బలహీన పడతాయి. 5 వెన్నెముక వెన్నెపూస దాదాపు 5 సెంటీమీటర్లు సాగేందుకు అవకాశం ఉంటుంది. 6 ఎముకలు భూమిపై వృద్ధుల్లో ఏడాదికి ఎముకల బలహీనత 1.5% వరకు ఉంటుంది. అదే అంతరిక్షంలో నెలకు ఇది 1–1.5% ఉంటుంది. - మిషన్ అనంతరం భూమిపైకి తిరిగొచ్చాక ఈ సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావం నుంచి వ్యోమగాములు బయటపడతారు. -
రాకెట్ ప్రమాదం.. వ్యోమగాములు సేఫ్
న్యూయార్క్: ఇద్దరు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) తీసుకెళ్తున్న రష్యాకు చెందిన సూయజ్ రాకెట్ సాంకేతిక కారణాల వల్ల కజకిస్థాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా బయటపడ్డారని నాసా ఉన్నతాధికారి జిమ్ బ్రిడెన్స్టైన్ తెలిపారు. సూయజ్ రాకెట్లో రష్యాకు చెందిన వ్యోమగామి అలెక్సీ ఓవ్చినిన్, అమెరికా వ్యోమగామి నిక్ హగ్‌లు ప్రయాణిస్తుండగా రాకెట్ బూస్టర్‌లో సమస్య తలెత్తింది. దీంతో ఆ ఇద్దరు వ్యోమగాములు బాలిస్టిక్ డీసెంట్ మోడ్‌లో తిరిగి భూమిపైకి వచ్చినట్లు నాసా పేర్కొంది. సాధారణ ల్యాండింగ్ కంటే ఇది కాస్త వేగంగా జరిగే ల్యాండింగ్ అని నాసా తెలిపింది. సూయజ్ రాకెట్లో ఆరు గంటల పాటు ప్రయాణించి ఐఎస్ఎస్కు చేరాల్సి ఉంది. వీళ్లు ఆరు నెలల పాటు స్పేస్ స్టేషన్లో ఉండాల్సి ఉంది. ప్రస్తుతం వాళ్లు ల్యాండైన ప్రదేశానికి రెస్క్యూ టీమ్స్ వెళ్తున్నాయి. నాసా ట్విట్ చేసిన వీడియోలో రాకెట్ తన మార్గాన్ని మరల్చుకుని తిరిగి భూమివైపు రావడం కనిపిస్తోంది. LIFTOFF! Shooting into the sky at 4:40am ET, the Soyuz rocket carrying @AstroHague and Alexey Ovchinin leaves Earth on a four-orbit, six-hour journey to the @Space_Station. Watch: https://t.co/BjMDNrNorR pic.twitter.com/0Cfm0Uu2Jx — NASA (@NASA) October 11, 2018 .@NASA astronaut Nick Hague and Russian cosmonaut Alexey Ovchinin are in good condition following today's aborted launch. I’m grateful that everyone is safe. A thorough investigation into the cause of the incident will be conducted. Full statement below: pic.twitter.com/M76yisHaKF — Jim Bridenstine (@JimBridenstine) October 11, 2018 -
2021 డిసెంబర్లో గగన్‌యాన్
సాక్షి బెంగళూరు: భారతీయులను సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపే ‘గగన్‌యాన్’ ప్రయోగాన్ని 2021, డిసెంబర్లో నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. ఈ ప్రయోగాన్ని చేపట్టేముందు పలు పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా 2020లో ఓసారి, 2021లో మరోసారి మానవరహిత పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే క్రూ సపోర్ట్ సిస్టమ్స్, సర్వీస్ మాడ్యూల్, ఆర్బిటాల్ మాడ్యూల్ వంటి పలు సాంకేతికతలను ఇంకా అభివృద్ధి చేయాల్సిఉందని శివన్ పేర్కొన్నారు. 2022 నాటికి భారతీయులను సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపుతామని ప్రధాని మోదీ ఈఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివన్ మాట్లాడుతూ.. అంతరిక్ష యాత్రకు ఎంతమందిని పంపాలి? అక్కడ ఎన్నిరోజులు ఉండాలి? అన్న విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. గగన్‌యాన్‌లో పాల్గొనేందుకు వ్యోమగాములను ఇంకా ఎంపిక చేయలేదని వెల్లడించారు. వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ భారత వాయుసేన(ఐఏఎఫ్)స్వీకరించిందనీ, ఓసారి ఎంపిక పూర్తయితే 2 నుంచి 3 సంవత్సరాల పాటు వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు వ్యోమగాములను ఏడు రోజులపాటు అంతరిక్షంలోకి పంపే సామర్ధ్యం తమకుందని శివన్ చెప్పారు. ఈ ప్రయోగం చేపట్టేందుకు మిషన్ కంట్రోల్, ట్రాకింగ్, లాంచ్‌ప్యాడ్ నిర్మాణం వంటి పనుల్లో ప్రైవేటు రంగ సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. మానవసహిత యాత్రలో పాల్గొనే వ్యోమగాములకు శిక్షణ కోసం ఇతర దేశాల సాయం కూడా తీసుకుంటామని మరో ప్రశ్నకు శివన్ సమాధానమిచ్చారు. -
‘గగన్‌యాన్’ సాధ్యమే!
చెన్నై: 2022 నాటికి అంతరిక్షంలోకి భారత వ్యోమగామిని పంపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) చైర్మన్ కె. శివన్ వెల్లడించారు. జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా చేపట్టబోయే ఈ ప్రయోగం ద్వారా వారం రోజుల పాటు మానవుడిని అంతరిక్షంలో ఉంచుతామని చెప్పారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టుకు రూ.10వేల కోట్లకంటే తక్కువ వ్యయమే అవుతుందని తెలిపారు. ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ మానవ సహిత యాత్ర ‘గగన్‌యాన్’ గురించి ప్రకటన చేసిన నేపథ్యంలో శివన్ మీడియాతో మాట్లాడారు. ‘‘జీఎస్ఎల్వి మార్క్–3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. భూమి నుంచి 300– 400 కిలోమీటర్ల ఎత్తు వరకు రాకెట్ ప్రయాణిస్తుంది. ఈ ప్రయోగానికి ముందు రెండు మానవ రహిత స్పేస్ క్రాప్ట్‌లను పంపుతాం. రూ.10వేల కోట్ల కన్నా తక్కువ వ్యయంతోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ప్రమాద సమయంలో వ్యోమగాములను సురక్షితంగా నేలకు దించే క్రూ మోడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌లను ఇది వరకే పరీక్షించాం. వ్యోమగామికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్, స్పేస్ సూట్ లాంటి వాటిని తయారుచేసే దశలో ఉన్నాం. అంతరిక్షంలోకి పంపే వ్యోమగామిని వాయుసేన ఎంపిక చేస్తుంది’ అని అన్నారు. -
నాసా టీమ్‌లో సునీతా విలియమ్స్
హూస్టన్: అగ్రరాజ్యం అమెరికా దాదాపు ఏడేళ్ల తర్వాత 2019లో మానవ సహిత అంతరిక్ష యాత్రలను చేపట్టనుంది. ఇందులో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సహా 9 మంది ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ప్రైవేటు కంపెనీ బోయింగ్ రూపొందించిన సీఎస్టీ–100 స్టార్ లైనర్, స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా వీరిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి వచ్చే ఏడాది ఆరంభంలో చేర్చనున్నారు. ఈ రెండు కంపెనీలు నాసా సహకారంతో ఈ అంతరిక్ష నౌకల్ని అభివృద్ధి చేశాయి. ఈ వివరాలను శుక్రవారం నాడిక్కడ నిర్వహించిన ఓ సమావేశంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్ఎస్కు వ్యోమగాముల్ని, ఆహారపదార్థాలను చేరవేయనున్నారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టేముందు బోయింగ్, స్పేస్ ఎక్స్ సంస్థలు తమ నౌకల్ని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నాయి. అలాగే ప్రమాద సమయంలో వ్యోమగాములు రాకెట్ నుంచి సురక్షితంగా బయటపడేసే అబార్ట్ వ్యవస్థ సమర్థతను కూడా ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు పరీక్షిస్తారు. 1972, జనవరి 5న మొదలైన స్పేస్ షటిల్ కార్యక్రమం 2011 నాటికి ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాసా సరికొత్త అంతరిక్ష వాహక నౌకల అభివృద్ధిపై దృష్టి సారించింది. -
అంగారక యాత్రకు 17 ఏళ్ల అమ్మాయి!
-
ఆకాశం నుంచి పుస్తక పఠనం
సాక్షి, న్యూఢిల్లీ : కథల పుస్తకాలైనా, శాస్త్ర విజ్ఞాన పుస్తకాలైనా ఎవరికి వారు చదువుకోవడం కన్నా ఎవరైనా చదివి వినిపిస్తే ముఖ్యంగా పిల్లల మెదడుకు బాగా ఎక్కుతుంది. కఠినమైన పదాలు తగిలినప్పుడు అర్థం వివరిస్తూ చదివితే మరింత సులువుగా మెదడులోకి ఎక్కుతుంది. కొంత సమయం అయ్యాక కొందరికి నిద్రకూడా వస్తుంది. వినేవాళ్ల హావభావాలను గమనించకుండా చదివేవాళ్లు వాళ్ల మానాన వాళ్లు పాఠం చెబుతున్నట్లుగా చదువుకుంటూ పోతే కాసేపటికి వినేవాళ్ల గురక వినిపించి చదివే వాళ్ల సమయం వృధా అవుతుంది. అదే వినేవాళ్లు ఆకాశంలోని రంగులను, చుక్కలను చూస్తూ వింటుంటే మరింత సులువుగా మెదడుకు ఎక్కుతుందంటారు. అందుకు చదవడానికి, వినడానికి ఆరుబయట ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో చదివే పుస్తకం సీడీ రూపంలోనే, ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో కూడా అలా చదువుతూ పోవడం కన్నా చదువుతున్న వ్యక్తుల చుట్టూ ఓ కదులుతున్న ప్రపంచం ఉంటే... అదే ఆకాశమో, నక్షత్రాలో ఉంటే మరింతగా వినేవాళ్లను లేదా పాఠకులను ఆకట్టుకుంటుందని భావించిన ‘గ్లోబల్‌స్పేస్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ సంస్థ ఏకంగా ఆకాశంలోని అంతర్జాతీయ ప్రయోగశాలలో వ్యోమగాముల చేతనే పుస్తక పఠన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆకాశంలోని అంతర్జాతీయ ప్రయోగశాలలో భూమ్యాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వ్యోమగాములతో సహా ఏ వస్తువైన చలనంలో ఉంటుందని తెల్సిందే. శూన్యంలో తేలియాడుతున్న పుస్తకాన్ని పట్టుకొని వ్యోమగాములు శూన్యంలో తాము తిరుగుతూ చదివి వినిపిస్తుంటారు. వినేవాళ్లకు వ్యోమగామి చుట్టున్న ప్రపంచం, అంటే ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలు, గ్రహశకలాలు కనిపిస్తుంటాయి. ఇలా ప్రవేశపెట్టిన పుస్తక పఠనం కార్యక్రమానికి ‘స్టోరీ టైమ్ ఫ్రమ్ స్పేస్’ అని పేరు పెట్టారు. కథలు, శాస్త్రవిజ్ఞాన పుస్తకాలు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని ఫౌండేషన్ తెలిపింది. ఇలా పుస్తక పఠనం వినాలనుకునేవాళ్లు ‘స్టోరీ టైమ్ ఫ్రమ్ స్పేస్. కామ్’ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే చాలు. -
ఆకాశంలోని రంగులను, చుక్కలను చూస్తూ వింటుంటే...
-
ఒక్క రోజులో 16 న్యూ ఇయర్స్
వాషింగ్టన్: మనంకొత్త ఏడాది వేడుకలు జరుపుకోవాలంటే 365 రోజులు నిరీక్షిస్తాం. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తాం. కానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్ – ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో ఆరుగురు వ్యోమగాములు మాత్రం 2018 కొత్త ఏడాదిని ఒకేరోజులో 16 సార్లు జరుపుకోనున్నారు. భూమికి 402 కి.మీ. ఎత్తులో ప్రతి 90 నిమిషాలకోసారి భూమిని చుట్టేస్తూ 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను చూడటం ద్వారా వారు దీనిని సుసాధ్యం చేయనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) వెల్లడించింది. -
వ్యోమగాములకు కొత్త సూట్
న్యూయార్క్ : అంతరిక్షంలో ప్రయాణించే వ్యోమగాములకు కొత్త స్పేస్‌సూట్‌ను రూపొందించిపట్లు తయారీ సంస్థ స్పేస్ ఎక్స్ ప్రకటించింది. కొత్తగా రూపొందించిన స్పేస్ సూట్‌ను సోమవారం సంస్థ సీఈఓ ఎలెన్ ముస్క్ ఆవిష్కరించారు. ఇప్పటివరకూ వ్యోమగాములు ఎక్స్ట్రావెహిక్యులర్ మొబిలిటీ యూనిట్స్ (ఈఎంయూ)లను వాడుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నవారూ.. వీటినే ఉపయోగిస్తున్నారు. ఈఎంయూలను సుమారు 40 ఏళ్ల కిందట రూపొందించారు. ఈ సూట్ల వల్ల వ్యోమగాములకు స్పేస్‌వాక్‌లో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా నవీకరించిన సూట్‌ను తయారు చేశామని చెప్పారు. కొత్త సూట్లో గ్లౌవుజులు, వార్మర్స్, హెల్మెట్‌లో అభివృద్ధి పరిచని కెమెరాలు జోడించారు. -
చంద్రుడిపైకి భారత వ్యోమగాములు
న్యూఢిల్లీ: భారత వ్యోమగాములు కూడా చంద్రమండలంపై అడుగుపెట్టారట. జాతీయ స్ఫూర్తితో దేశ స్వాతంత్య్రం కోసం ఆరెస్సెస్ స్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డేవర్, భారతీయ జనసంఘ్ స్థాపకుడు శ్యామప్రసాద ముఖర్జీ, జనసంఘ్ ముఖ్య నాయకుడు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్లు పోరాటం జరిపారట. జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్య్ర యోధుల్లో ఒకరట. ఆయనకంటే స్వాతంత్య్ర పోరాటంలో సర్దార్ పటేల్ నిర్వహించిన పాత్ర పెద్దదట. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఎవరో చెప్పలేదుగాని, ఆయనకు వ్యతిరేకంగా సర్దార్ పటేల్ బర్దోలి సత్యాగ్రహం నిర్వహించిన విషయాన్ని చెప్పారు. ఇక దేశ తొలి ప్రధాన మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గురించి పూర్తిగా విస్మరించారు. భారతీయ చరిత్ర, సంస్కతిలో 1526 సంవత్సరం నుంచి 1857 వరకు దాదాపు 331 ఏళ్లపాటు సాగిన మొగల్ రాజుల చరిత్ర కాగితాలను పూర్తిగా చింపేశారు. అయితే ముస్లిం దురాక్రమణదారుల తలలను మహారాజా సుహల్దేవ్ క్యారెట్ ముక్కల్లాగా తెగనరికేశారని ఉంది. జాతీయవాదంతోగానీ, స్వాతంత్య్ర పోరాటంతోగాని ముస్లింలకు ఎలాంటి పాత్రలేదు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ శతజయంతి ఉత్సవాల కమిటీ ప్రచురించిన పుస్తకంలో ఉన్నవి, లేనివి అంశాలివి. ఆయన శత జయంతి సందర్భంగా ఆగస్టు 20వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పుస్తకంలో నుంచే ప్రశ్నలు ఇస్తారట. సరైన జవాబులు, అంటే పుస్తకంలో ఇచ్చిన జవాబులు రాస్తే మంచి బహుమతులు ఇస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని కనీసం వంద స్కూళ్ల నుంచి 15 లక్షల మంది విద్యార్థిని, విద్యార్థులకు ఈ పుస్తకంలోని అంశాలపై క్విజ్ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పుస్తకంలో తొలి రాష్ట్రపతి ఎవరు ? లాంటి ప్రశ్నలు ఉన్నాయిగానీ తొలి ప్రధాన మంత్రి ఎవరన్న ప్రశ్న లేదు. అంటే జవహర్ లాల్ నెహ్రూ ప్రస్థావనే లేదు. హిందూ మతం గురించి ఎక్కువే చెప్పారుగానీ, స్వాతంత్య్ర యోధుడిగానో, దళిత నాయకుడిగానో అంబేడ్కర్ ప్రస్థావన లేదు. ఇక దళితుల అణచివేతకు వ్యతిరేకంగా బౌద్ధం తీసుకున్న విషయ ప్రస్థావన ఉంటుందని ఊహించాల్సిన అవసరమే లేదు. హిందూత్వ నాయకులు వీడీ సావర్కర్, నానాజీ దేశ్‌ముఖ్‌ల గురించి ఎక్కువగానే ఉంది. శ్యామ ప్రసాద్ ముఖర్జీ కషి కారణంగా నేడు భారత్‌తో కశ్మీర్ కలిసి ఉందట. బీహార్‌కు చెందిన దళిత స్వాతంత్య్ర యోధుడు బిర్సా ముండా, సిక్కు గురువు గోవిం«ద్ సింగ్, వారణాసికి చెందిన మదన్ మోహన్ మాలవ్య గురించి కొన్ని వివరాలు ఉన్నాయి. సుభాస్ చంద్రబోస్, లాల్ బహుదూర్ శాస్త్రీల గురించి ఏకవాక్య ప్రస్థావనలు ఉన్నాయి. ఇక భారత ఆర్థిక వ్యవస్థ గురించి 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాత్రమే రాశారు. ఆరెస్సెస్‌కు అనుబంధమైన భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలోకెల్లా అతిపెద్ద కార్మిక సంఘమట. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా, జీఎస్టీల గురించి ఉంది. స్వచ్ఛ భారత్ ప్రస్థావన అక్కర్లేదనుకున్నారు. బీజేపీ పేర్కొన్న దేశ హీరోల్లో గాంధీ, నెహ్రూల గురించి లేకపోయినా ఫర్వాలేదని, వారి గురించి విద్యార్థులకు నేడు కొత్తగా చెప్పాల్సిన అవసరమేమీ లేదని కాంగ్రెస్ నాయకుడు ఆర్పీఎన్ సింగ్ ఈ పుస్తకంపై వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం బీజేపీ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తుందని, దీన్ దయాళ్ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు, బీజేపీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ వ్యాఖ్యానించారు. -
సురక్షితంగా భూమిని చేరిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక
వాషింగ్టన్: అంతరిక్షంలోని వ్యోమగాములకు అవసరమయ్యే వస్తువులు, ఆహారాన్ని మోసుకెళ్లిన స్పేస్ ఎక్స్ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, తిరిగి భూమిని (పసిఫిక్ మహాసముద్రంలోని లాంచ్ ప్యాడ్) చేరింది. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ కంపెనీ సోమవారం వెల్లడించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోని వ్యోమగాముల పరిశోధనకు అవసరమయ్యే ప్రతి చిన్న వస్తువును భూమిపై నుంచే పంపాలి. ఇప్పటిదాకా రాకెట్లు ఈ పనిని నిర్వర్తిస్తుండగా.. అవి తిరిగి భూమిని చేరే అవకాశం లేదు. దీంతో వీటి తయారీ ఖర్చు భారీగా పెరిగి పోతోంది. దీనికి పరిష్కారంగా స్పేస్ ఎక్స్ పునఃవినియోగ సామర్థ్యం కలిగిన రాకెట్లను రూపొం దించింది. గతంలో అంతరిక్షంలోకి పంపిన రాకెట్‌ను భూమిపైకి దింపడంలో పలుమార్లు విఫలమైన స్పేస్ ఎక్స్ కొంతకాలంగా వరుసగా సఫలీ కృతమవుతోంది. ఈ ప్రయత్నంలోభాగంగానే గతనెల 23వ తేదీన అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక అక్కడి వ్యోమగాముల కోసం అవసరమైన వస్తువులు తీసుకెళ్లడమే కాకుండా అంతరిక్షం నుంచి దాదాపు 4,000 పౌండ్ల బరువైన పరిశోధన నమూనాలను, అంతరిక్ష వ్యర్థాలను తీసుకొచ్చింది. -
అంతరిక్షంలో అడుగు పెట్టిన చైనా వ్యోమగాములు
-
శాస్త్రవేత్తలకు ఆ ప్రమాదం తప్పదా?
వాషింగ్టన్: అంగారక గ్రహం మీదకు తరచుగా పరిశోధనలకు వెళ్లే శాస్త్రజ్ఞులకు జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదం ఉందా?. అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. 'స్పేస్ బ్రెయిన్' పేరుతో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు అంగారక గ్రహంపై పరిశోధనల కోసం వెళ్లే శాస్త్రజ్ఞుల మెదళ్ల స్ధితిగతులను పరిశీలించారు. ఫలితాలను చూసిన యూనివర్సిటీ పరిశోధకులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆరు నెలలకు పైగా అంగారక గ్రహం మీద గడిపిన శాస్త్రజ్ఞులకు అక్కడ ఉండే కాస్మిక్ కిరణాలకు వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశోధకులు జర్నల్ సైంటిఫిక్ రిపోర్టుల్లో ప్రచురించారు. స్కానింగ్ లో పరిశోధకుల మెదడు పనితనం మందగిస్తున్నట్లు తెలిసింది. నాడీ కణాలు మెదడుకు సమాచారం అందజేయడంలో విఫలం చెందుతుండటం, మెదడు ఇచ్చే సంకేతాలను నాడీ కణాలు అడ్డుకుంటున్నాయి. వీటి వల్ల భవిష్యత్తులో వారిలో భయాందోళనలు పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే, అంతరిక్ష నౌకలకు షీల్డింగ్ ను పెంచడం వల్ల ఈ సమస్యను కొంతవరకూ నివారించుకోవచ్చని యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. -
చంద్రుడి మీదకు వెళ్లిన వారికి హార్ట్ ఎటాక్!
వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాలలో మానవాళి దూసుకుపోతోంది. భూ ఉపగ్రహం చంద్రుడితో పాటు సౌరకుటుంబంలోని గ్రహాలు, ఇతర నక్షత్ర మండలాలపై సైతం మానవుడి ప్రయోగాలు కొనసాగుతున్నాయి. విశ్వంలో భూమితో పాటు జీవులకు ఇంకేమైనా నివాసయోగ్య స్థలాలు ఉన్నాయా అని శాస్త్రవేత్తలు నిరంతర అన్వేషణ చేస్తున్నారు. అయితే.. అంతరిక్ష యాత్రికులకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. జేమ్స్ ఇర్విన్ అనే అంతరిక్ష యాత్రికుడు చంద్రుడిపై అడుగుపెట్టిన రెండేళ్ల తరువాత మొదటిసారి హార్ట్ ఎటాక్ బారిన పడ్డాడు. అయితే అప్పుడు నాసా డాక్టర్లు అతడి అంతరిక్ష యాత్రకు, హార్ట్ ఎటాక్‌కు ఎలాంటి సంబంధం లేదని.. ప్రీ ఫ్లైట్ టెస్టింగ్‌లో సైతం ఇర్విన్ హార్ట్ బీట్‌లో చిన్న చిన్న తేడాలు గుర్తించామని కొట్టిపారేశారు. తరువాత 61 ఏళ్ల వయసులో ఇర్విన్ హార్ట్ ఎటాక్తోనే మరణించాడు. అపోలో యాత్రలో ఇర్విన్ సహచరుడు రాన్ ఇవాన్స్ సైతం.. ఇర్విన్ మరణానికి ఏడాది ముందుగా, నిద్రలో హార్ట్ ఎటాక్ వచ్చి తన 56 ఏళ్ల వయసులోనే మృతి చెందాడు. చంద్రుడిపై మొదటిసారి కాలు మోపిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ సైతం 2012లో హార్ట్ ఎటాక్తోనే మరణించాడు. అమెరికాలో ప్రతియేటా సుమారు 6 లక్షల మంది హృదయ సంబంధిత వ్యాధులతో మృతి చెందుతున్నారు. ఆస్ట్రోనాట్లు సైతం గుండె, రక్తనాళాల సంబంధిత సమస్యలకు అతీతులు కారు. అయినప్పటికీ సాధారణ పౌరులలో గుండె జబ్బులతో మరణించే వారితో పోల్చినప్పుడు ఆస్ల్రోనాట్లలో ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ విషయంపై పరిశోధన జరిపిన ఫ్లోరిడా స్టేట్ యూనిర్సిటీ డాక్టర్ మైఖెల్ డెల్ప్ మాట్లాడుతూ.. శాంపిల్ పరిమాణం చిన్నదిగా ఉన్నందున దీనిని ఇప్పుడే నిర్ధారించలేమని, అయితే ఆస్ట్రోనాట్లకు.. గుండె సంబంధ వ్యాధులకు ఉన్న సంబంధాన్ని కొట్టిపారేయలేమని వెల్లడించారు. -
అంతరిక్ష యాత్రికుల కోసం 'స్పేస్ బూట్'
న్యూయార్క్: అంతరిక్ష యాత్రికుల కోసం మసాచూసెట్స్ యూనివర్సిటీ పరిశోధకులు కొత్త రకం బూట్లను(స్పేస్ బూట్) తయారుచేశారు. ప్రత్యేకమైన సెన్సార్లు, హ్యాప్టిక్ మోటార్లతో రూపొందించిన ఈ బూట్లు వైబ్రేషన్స్ కలిగిస్తాయి. ఈ వైబ్రేషన్ల మూలంగా ఆస్ట్రోనాట్లు అంతరిక్షంలో చిన్నచిన్న ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చని పరిశోధకులు వెల్లడించారు. అంతరిక్ష యాత్రికులకు వారి బరువైన స్పేస్ సూట్ మూలంగా ఉన్నటువంటి అసౌకర్యాన్ని ఈ స్పేస్ బూట్ తొలగిస్తుందని పరిశోధకురాలు లియా స్టిర్లింగ్ తెలిపారు. 'భారీ వ్యయంతో కూడిన అంతరిక్ష యాత్రల్లో ఆస్ట్రోనాట్లు కొన్నిసార్లు నియంత్రణ కోల్పోయి కింద పడటం మూలంగా వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లడంతో పాటు.. ప్రాజెక్ట్ మొత్తం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ బూట్ల ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు' అని ఆమె వెల్లడించారు. -
నేలను తాకి ఎన్నాళ్లయింది..!
డెకాగన్: అంగారక గ్రహాంపైకి మానవుణ్ని పంపేందుకు నాసా ఆధ్వర్యంలో పలు దేశాలు సంయుక్తంగా తలపెట్టిన మిషన్ టు మార్స్ ప్రయోగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్స్ యాత్రకు వెళ్లలాంటే వ్యోమగాలు సుదీర్ఘకాలంపాటు అంతరీక్షంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అసలు మనిషి స్పేస్ లో అంతకాలం ఉండగలడా? అందుకు వాతావరణం, శరీరం సహకరిస్తుందా? అనే కోణంలో చేపట్టిన ప్రయోగాలు.. స్కాట్ కెల్లీ, మిఖాయెల్ కొర్నియాంకోల రాకతో సఫలమైనట్లు తేటతెల్లమైంది. మిషన్ టు మార్స్ లో భాంగా ఏడాది పాటు అంతరీక్షంలో గడిపిన అమెరికన్, రష్యన్ వ్యోమగాములు స్కాట్ కెల్లీ, మిఖాయెల్ కొర్నియోంకోలు బుధవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమిని చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి స్పేస్ షటిట్ లో బయలుదేరిన ఆ ఇద్దరూ కజకిస్థాన్ లోని డెకాగన్ శాటిలైట్ సెంటర్ వద్ద విజయవంతంగా భూమిపై పాదం మోపారు. అత్యధికా కాలం ఐఎస్ఎస్ లో గడిపిన రికార్డు వీరిద్దరే కావటం గమనార్హం. స్కాట్, మిఖాయెల్ ల రాకతో నాసా సహా మిషన్ టు మార్స్ లో భాగస్వామ్యదేశాల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. 345 రోజులపాటు అంతరీక్షంలో గడిపిన స్కాట్.. అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సోషల్ నెట్ వర్క్ లో పోస్టులు పెట్టేవారు. వాటిని నెటిజన్లు కూడా అద్భుతంగా ఆదరించారు. ఇటీవలే గొరిల్లా సూట్ లో ఐఎస్ఎస్ లో సందడి చేస్తూ స్కాట్ పెట్టిన పోస్టుకు విపరీతమైన స్సదన వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చి 27న స్కాట్, మిఖాయెల్ లు అంతరీక్ష కేంద్రానికి వెళ్లారు. -
అంగారక గ్రహానికి మహిళా ఆస్ట్రోనాట్స్
హూస్టన్: విశ్వంలో సుదూరతీరానున్న అంగారక గ్రహాన్ని అందుకోవాలని, దానిపై అడుగు పెట్టాలన్నది ప్రస్తుతం ఓ అందమైన కల. ఈ కలను సాకారం చేసేందుకు నాసాతోపాటు స్పేస్ ఎక్స్ లాంటి ప్రై వేటు అంతరిక్ష సంస్థలు, రష్యా, చైనా, యూరప్‌లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే అంగారక గ్రహంపై వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రోబోటిక్ యంత్రాలను అక్కడికి పంపించిన నాసా, అక్కడికి హ్యోమగాములను పంపించాలనే ప్రయత్నాల్లో అందరికన్నా ముందుంది. అందుకోసం మగ హ్యోమగాములతోపాటు నలుగురు మెరికల్లాంటి మహిళా హ్యోమగాములకు కఠోర శిక్షణ ఇస్తోంది. ధూళి దుమారాలను, గడ్డకట్టుకుపోయే చలివాతావరణాన్ని, క్యాన్సర్‌కు దారితీసే రేడియోషన్‌ను తట్టుకోవడానికి వీలుగా నికోల్ ఔనపు మన్, అన్నే మ్యాక్లేన్ (36), జెస్సికా మియర్ (38), క్రిస్టినా హమ్మాక్ కోక్ (37)లు శిక్షణ పొందుతున్నారు. మొదటిసారి వారి శిక్షణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు, వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు నాసా అధికారులు మీడియాను అనుమతించింది. ర్యాకెట్లో అంగారక గ్రహానికి వెళ్లే హ్యోమగాముల్లో యాభై శాతం మహిళలు ఉంటారని తెలుస్తోంది. అందుకు తామెంతా ఎంపికవుతామన్న ధీమాతో ఉన్నారు ఈ నలుగురు మహిళలు. ‘నేను హ్యోమగామి శిక్షణకు ఎంపికైనట్లు ఫోన్ రావడం నాకిప్పటికీ గుర్తుంది. అప్పుడు ఉద్రేకంతో శ్వాసకూడా సరిగ్గా తీసుకోలేకపోయాను. నోటి నుంచి మాటరాలేదు. ఉద్వేగంతో ఏడ్చాను’ ఇరాక్‌లో 15 నెలలపాటు హెలికాప్టర్లను నడిపిన మ్యాక్లెయిన్ తన గురించి చెప్పారు. ఓ లక్ష్యం కోసమే సైన్యంలో చేరినా తాను వ్యోమగామి అవడమే తన గమ్యం అనుకున్నానని అన్నారు. ఈ సంఘర్షణల ప్రపంచంలో అంతరిక్ష పరిశోధనలు ఓ కొత్త ఆశను కల్పిస్తాయన్నది తన ఉద్దేశమన కూడా ఆమె చెప్పారు. మారుమూల మెయినే పట్టణంలో పుట్టి పెరిగిన జెస్సికా మెయిర్ సుదూర ప్రాంతాల్లో పర్యటించడమంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.ఇక క్రిస్టినా మాట్లాడుతూ తాను హ్యోమగామి కావాలన్నది తన లక్ష్యమని, అందుకే యుక్త వయస్సులోనే నాసాలో చేరానని చెప్పారు. నికోల్ మాట్లాడుతూ జీవితంలో ఏమీ కావాలన్నది స్పష్టంగా ఎరుగని దాన్నని, హ్యోమగామిని అవుతానని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. అయితే కాలిఫోర్నియాకు చెందిన తాను మెరైన్ సైన్యం తరఫున ఇరాక్‌లో యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఉండడంతో నాసాకు దరఖాస్తు చేసుకున్నానని వివరించారు. సాధ్యమైనంత త్వరగా అంగారక యాత్రకు తరలిపోవాలని ఆశిస్తున్నామని ఈ నలుగురు మహిళలు మీడియాకు తెలిపారు. కుటుంబానికి దూరంగా ఉండబోతున్నామన్న అవేదన తప్ప తమకు ఎలాంటి ఆందోళన లేదని వారన్నారు. సుదూరంలో ఉన్న అంగారక గ్రహానికి చేరుకునేందుకు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలం పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. రానున్న 15 ఏళ్లలోగా ఈ అందమైన కలను సాకారం చేయాలన్నది తమ లక్ష్యమని నాసా చెబుతోంది. -
ఐఎస్ఎస్@15
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)... కేవలం ఒక పరిశోధనా స్థానం మాత్రమే కాదు, సువిశాల విశ్వ పరిశోధనలో మనిషి చేరుకున్న ఒక గమ్యస్థానం. భూమ్మీద జనాభా పెరుగుతోంది. వాళ్ల కోసం అదనపు నివాస స్థలాలను వెతకాల్సిందే. మనకు సరిపడే వాతావరణం ఉన్న గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? మన అనుభవాలను పంచుకోగలిగే వాళ్లు ఈ విశాల విశ్వంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? వీటన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఐఎస్ఎస్ ఒక మెట్టులాంటిది. దీని తర్వాత ఈ తరహా పరిశోధనకు చంద్రుడు, ఆ తర్వాత కుజుడు.. ఇంకా వేరే వేరే గ్రహాలున్నాయి. భూమికి సుమారు నాలుగువందల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తూ అంతరిక్ష పరిశోధనలకు ఆధారంగా నిలుస్తున్న ఐఎస్ఎస్ ప్రస్థానంలో తాజాగా పదిహేను సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 2000 సంవత్సరం నవంబర్ ఆరంభం నుంచి వివిధ దేశాల సహకారంతో నాసా ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్పేస్ స్టేషన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు ఇవి. - సాక్షి సెంట్రల్ డెస్క్ మనిషి నిర్మించిన వాటిలో అత్యంత ఖరీదైనది మనిషి తన నాగ రకతలో ఇప్పటి వరకూ నిర్మించిన వాటన్నింటిలోనూ అత్యంత ఎక్కువ ఖర్చు చేసిన నిర్మాణం ఐఎస్ఎస్. 2010 లెక్కల ప్రకారం ఐఎస్ఎస్ దాదాపు 15,000 కోట్ల డాలర్ల విలువ చేస్తుంది. ఇందులో సగం మొత్తాన్ని అమెరికా మాత్రమే భరించగా, మిగిలిన మొత్తాన్ని యూరప్ దేశాలు కొన్ని, జపాన్, రష్యాలు వెచ్చించాయి. 211 మంది సందర్శించారు పదిహేను దేశాలకు చెందిన 211 మంది వ్యోమగాములు ఇప్పటి వరకూ ఐఎస్ఎస్ను సందర్శించారు. వీరిలో భారత సంతతికి చెందిన పలువురు వ్యోమగాములున్నారు. మనిషే ఒక ప్రయోగశాల ఐఎస్ఎస్లో వ్యోమగాముల జీవనశైలి విచిత్రంగా ఉంటుంది. భారరహిత స్థితిలో వారు మనుగడ సాగించాలి. ఆ స్థితిలో ఏం తినాలి? తింటే ఏం జరుగుతుంది? ఎలా జీర్ణమవుతుందనే అంశాలపైనా పరిశోధనలు జరుగుతాయి. చిత్రమైన జీవితం కింద, పైన అనేవి కేవలం భూమ్మీద. భారరహిత స్థితిలో ఉండే ఈ స్టేషన్లో అంతా ఒక్కటే. స్పేస్ స్టేషన్లో వ్యోమగాములు తేలుతూ ఉంటారు. నిద్రపోవడం అనేది మరో చిత్రమైన విన్యాసం. పడక, దిండూ.. అంటూ ఏమీ ఉండవు. తేలుతూ నిద్రపోవాలంతే! తినడం మరో కష్టమైన ఫీట్. పదార్థాలు అన్నీ తేలుతూ ఉంటాయి. పట్టుకొని తినాలి. గంటకు 17,240 మైళ్ల వేగం గంటకు 17,240 మైళ్ల వేగంతో తన కక్ష్యలో భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది ఐఎస్ఎస్. ఈ వేగాన్ని మరో రకంగా వివరించాలంటే ఐఎస్ఎస్ రోజుకు దాదాపు పదిహేను సార్లు భూమిని చుట్టేస్తూ ఉంటుంది. ఒక రోజులో ఐఎస్ఎస్ ప్రయాణించే దూరం భూమి నుంచి చంద్రునికి మూడు సార్లు ప్రయాణం చేయడంతో సమానం. -
అంతరిక్షంలో పండించిన పాలకూరతో విందు
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములు తొలిసారిగా అక్కడ పండించిన పాలకూర రుచిచూశారు. నాసా వ్యోమగామి స్కాట్ కెల్లీతో పాటు ఎక్స్‌పెడిషన్ 44 వ్యోమగాముల బృందం వెజ్జీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్ ద్వారా పండించిన ఈ పాలకూరను తిన్నారని నాసా వెల్లడించింది. సగం పాలకూరను వారుతినగా, మిగతా సగాన్ని శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం భూమికి తిరిగి వచ్చేంతవరకూ అలాగే భద్రపరుస్తారని తెలిపింది. భవిష్యత్తులో సుదీర్ఘ అంతరిక్ష యాత్రలు చేపట్టనున్న దృష్ట్యా వ్యోమగాములకు ఆహార అవసరాల కోసం నాసా వెజ్జీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్‌ని అభివృద్ధి చేస్తోంది. వ్యామగామి స్కాట్ కెల్లీ తన సహచరులతో కలిసి అంతరిక్షంలో పండించిన పాలకూరని ఆరగిస్తున్న వీడియోని ట్విట్టర్లో పోస్టు చేశారు. It was one small bite for man, one giant leap for #NASAVEGGIE and our #JourneytoMars. #YearInSpace https://t.co/B7Gkfm1Vz0 — Scott Kelly (@StationCDRKelly) August 10, 2015 -
వ్యోమగాముల కోసం మరింత స్వచ్ఛమైన గాలి..
వాషింగ్టన్: అంతరిక్షంలో పరిశోధనల కోసం సంచరించే వ్యోమగాములు వారికవసరమైన ఆహారం, గాలి, నీరుని భూమ్మీదనుంచే తీసుకెళతారు. అక్కడ సాధారణంగా వారు కొన్ని నెలలపాటు తమ పరిశోధనలు కొనసాగిస్తారు. ఈ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారు తీసుకెళ్లిన గాలి, నీరు అంత స్వచ్ఛంగా ఉండదు. వారు తీసుకునే గాలి, నీరు స్వచ్ఛమైందో కాదో తెలుసుకోవడం కష్టం. అందుకే వ్యోమగాములకు మరింత స్వచ్ఛమైన గాలి, నీరు అందించడం కోసం జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇప్పటివరకు వ్యోమగాములు తీసుకునే గాలి, నీటి నమూనాల్ని సేకరించి భూమి మీదికి పంపించేవారు. ఇక్కడ ఆ నమూనాల్ని పరీక్షించి అవి కలుషితమయ్యాయా లేదా, వాటిలో సూక్ష్మ జీవులు ఏమైనా ఉన్నాయా అనే విషయం తెలుసుకుంటారు. ఈ పరీక్షలు పూర్తై ఫలితాలు రావడానికి చాలా కాలం పట్టేది. అయితే శాస్త్రవేత్తలు కొత్తగా రూపొందించిన సెన్సిటివ్ మానిటరింగ్ విధానంతో తక్కువ సమయంలోనే ఫలితాలు పొందవచ్చు. ఈ విధానంలో ఎయిర్ క్వాలిటీ మానిటర్ (ఏక్యూఎమ్) లాంటి పరికరాన్ని వ్యోమనౌకలో అమరుస్తారు. ఇది నీటిని సేకరించి ఆవిరిగా మారుస్తుంది. ఆవిరి రూపంలో ఉన్న నీటిని ఏక్యూఎమ్ పరీక్షించి వెంటనే సురక్షితమో కాదో తెలియజేస్తుంది. దీన్నే వ్యోమగాములు గాలిని పరీక్షించేందుకు కూడా వాడవచ్చు. దీన్ని వినియోగించి వ్యోమగాములు శుద్ధమైన గాలి, నీటిని తీసుకుని అంతరిక్షంలో ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ పరికరాన్ని అంతరిక్షంలోనూ, భూమ్మీది మారుమూల ప్రాంతాల్లో కూడా ఉపయోగించవచ్చు. -
ఒకేరోజు16 సార్లు న్యూ ఇయర్
వాషింగ్టన్: భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వ్యోమగాములు 2015 నూతన సంవత్సర వేడుకలను 16 సార్లు జరుపుకొన్నారు! ఎలాగంటే.. 400 కి.మీ. ఎత్తులో, గంటకు 28,163 కి.మీ. వేగంతో చకచకా తిరుగుతున్న ఐఎస్ఎస్ ప్రతి 92.74 నిమిషాల కోసారి చొప్పున ఒకేరోజు 16 సార్లు భూమిని చుట్టి వచ్చింది మరి. దీంతో ఐఎస్ఎస్లోని వ్యోమగాములు బుధవారం 16 సార్లు రాత్రి, పగళ్లను చూశారు. ప్రతిసారీ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ పండ్ల రసాలు, టోస్టులతో వేడుకలు చేసుకున్నారు. -
అంగారకుడికి అడ్డదారి!
వాషింగ్టన్: అరుణగ్రహానికి ఉపగ్రహాలను, వ్యోమగాములను తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో పంపేందుకు నాసా శాస్త్రవేత్తలు ఓ అడ్డదారిని కనుగొన్నారు. ‘బాలిస్టిక్ క్యాప్చర్’ అనే ఈ పద్ధతిలో అంగారకుడు సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యలోకి ముందే వ్యోమనౌకలను పంపించి.. వాటిని మార్స్ కన్నా నెమ్మదిగా ప్రయాణించేలా చేస్తారు. దీంతో కాస్త వేగంగా వచ్చే అంగారకుడు దారిలో ఎదురయ్యే వ్యోమనౌకలను తన చుట్టూ కక్ష్యలోకి లాక్కుంటాడు. ప్రస్తుతం మార్స్‌ను చేరుకునేందుకు వ్యోమనౌకలకు 9 నెలలు పడుతోంది. -
వ్యోమగాములూ గాఢనిద్రలోకి..!
మన మంగళ్యాన్(మామ్) ఉపగ్రహం ఇటీవలే అంగారకుడిని చేరింది. అందుకు 300 రోజులు.. 66 కోట్ల కి.మీ. సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చింది. మరికొన్నేళ్లలోనే మనుషులనూ అక్కడికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నందున.. మానవ సహిత అంగారకయాత్రకూ దాదాపు 9 నెలలు పడుతుంది. అందుకే.. మనుషులను సులభంగా, తక్కువ ఖర్చుతో మార్స్‌పైకి పంపడం ఎలా? అని ఆలోచిస్తున్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు.. జంతువుల మాదిరిగా వ్యోమగాములనూ కొన్ని రోజుల పాటు గాఢనిద్రలోకి పంపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు! శీతాకాలంలో పలు జంతువులు గాఢనిద్రలోకి వెళ్లి స్తబ్దుగా ఉండిపోతాయి. దీంతో వాటి జీవక్రియలు మందగించి గాఢనిద్రలో ఉన్నన్ని రోజులూ బయటి నుంచి ఆహారం, నీరు తీసుకోవాల్సిన అవసరం తప్పిపోతుంది. అలాగే వ్యోమగాములనూ గాఢనిద్రలోకి పంపితే.. ఆహారం, నీటి అవసరాలు మూడు రెట్లు తగ్గడంతో పాటు యాత్రలో వారి ఇతర అవసరాలు, నిర్వహణ వ్యయం కూడా బాగా తగ్గిపోతాయని భావిస్తున్నారు. మెదడుకు గాయాలైన రోగులను వారం రోజుల పాటు గాఢనిద్రలోకి పంపే పద్ధతిని వైద్యరంగంలో ఇదివరకే మొదలుపెట్టేశారు. అన్నట్టూ.. అందరూ నిద్రలోకి జారుకుంటే.. వ్యోమనౌక నియంత్రణ, భూమిపై కంట్రోల్ రూంతో సంప్రదింపులు కష్టం కాబట్టి.. ఎల్లప్పుడూ ఒకరు మేలుకుని ఉండేలా షెడ్యూలు రూపొందిస్తారట. -
అంతరిక్షానికి.. 20 ‘మౌస్ట్రోనాట్లు’!
రోదసికి వెళ్లే మనుషులను ఆస్ట్రోనాట్లు(వ్యోమగాములు) అంటాం గదా.. అలాగే.. అంతరిక్షానికి వెళ్లిన ఎలుకలే ఈ మౌస్ట్రోనాట్లు! అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఆదివారం నింగికి బయలుదేరిన స్పేస్ఎక్స్ రాకెట్లో బయలుదేరిన 20 ఎలుకలు మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నాయి. ఫాల్కన్ రాకెట్ ద్వారా రోదసికి చేరిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌ను ఐఎస్ఎస్కు చెందిన రోబోటిక్ చేయి ద్వారా వ్యోమగాములు అనుసంధానం చేసుకున్నారు. నాసాతో నాలుగో కాంట్రాక్టులో భాగంగా స్పేస్ఎక్స్ కంపెనీ పంపిన ఈ రాకెట్లో 20 ఎలుకలతో పాటు వ్యోమగాములకు అవసరమైన ఫ్రీజ్-డ్రైడ్ మీల్స్, 3డీ ప్రింటర్, ఇతర పరికరాలు మొత్తం 2,200 కిలోల బరువైన సరుకుల్ని పంపారు. అయితే.. మనిషి కాకుండా ఇతర క్షీరదాలను ఐఎస్ఎస్కు పంపడం ఇదే తొలిసారి. రోదసిలో గురుత్వాకర్షణ లేమిలో కండరాల క్షీణతపై ప్రయోగాలు జరిపేందుకు గాను ఈ ఎలుకలను నాసా ఐఎస్ఎస్కు పంపింది. కండరాలు క్షీణించేందుకు కారణమయ్యే ‘మజిల్ రింగ్ ఫింగర్-1’ జన్యువును తొలగించిన ఈ ఎలుకలు ఐఎస్ఎస్లో నెలపాటు ఉంటాయి. వీటిపై రోదసిలో ప్రయోగాల ద్వారా.. భూమిపై మనుషుల్లో కండర క్షీణత సమస్యకు పరిష్కారం, మందులు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. -
అంగారక సూట్!
వ్యోమగాములు అనగానే.. గాలితో బాగా ఉబ్బిపోయిన తెల్లటి సూట్ ధరించి తలకు ఓ పెద్ద హెల్మెట్ పెట్టుకొని రోబోల్లా మెల్లగా అడుగుతీసి అడుగు వేసే మనుషులే మనకు గుర్తొస్తారు. అంతరిక్షంలో శూన్య వాతావరణం, సంక్లిష్టం, బరువైన స్పేస్ సూట్ల వల్లే వ్యోమగాములు మనలా తేలికగా కదలలేరు. అందుకే.. అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వ్యోమగాముల కోసం అతితేలికైన కొత్త తరం ‘స్కిన్‌టైట్’ స్పేస్ సూట్‌ను రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో మానవసహిత అంగారక యాత్రలకు దీనిని ఉపయోగించేందుకు సిద్ధం చేస్తున్నారు. పీడనానికి గురిచేసిన వాయువులతో నిండి ఉండే సంప్రదాయ స్పేస్సూట్ల మాదిరిగా కాకుండా దీనిని స్థితిస్థాపక ధర్మాలు కలిగిన ప్రత్యేక లోహపు పదార్థాన్ని కూర్చి తయారు చేస్తున్నారు. మన శరీరంలోని కండరాల మాదిరిగా సంకోచించే ఈ పదార్థపు పట్టీలు.. వేడి చేసినప్పుడు కుంచించుకుపోయి.. చల్లబర్చినప్పుడు తిరిగి యథా ఆకారంలోకి వస్తాయి. వీటితో తయారు చేసిన స్పేస్ సూట్ కూడా ఒక బటన్ నొక్కగానే వ్యోమగాముల శరీరానికి అతుక్కున్నట్లు కుంచించుకుపోయి స్కిన్ టైట్ అవుతుంది. దీన్ని ధరిస్తే మార్స్‌పై స్వల్ప గురుత్వాకర్షణలోనూ వ్యోమగాములు సులభంగా కదులుతూ అనేక పనులు చేసుకోవచ్చని చెబుతున్నారు. -
సూర్యోదయ వేళ అంతరిక్షం నుంచి...
పుడమిపై చీకట్లను చీల్చుకుంటూ ఉదయభానుడు మెలమెల్లగా పైకి వస్తూ వెలుగులు పంచే మనోహర దృశ్యం అద్భుతం. అదే అంతరిక్షం నుంచి అయితే అది మరింత అద్భుతం. అబ్బురం. సూర్యోదయాన మహా సముద్రం మీదుగా వెలుగు రేఖలు విచ్చుకుంటున్న ఈ సుందర దృశ్యాన్ని తన కెమెరాలో బంధించిన నాసా వ్యోమగామి రీడ్ వీజ్మాన్ మగళవారం ఈ ఫొటోను ట్విట్టర్లో ఉంచారు. భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో 40వ అంతరిక్ష యాత్రలో భాగంగా ఉంటున్న వీజ్మాన్, మరో ముగ్గురు వ్యోమగాములు రెండు వారాల్లో భూమికి తిరిగి రానున్నారు. -
చంద్రుడి బిలాలే ఆవాసాలు..
వాషింగ్టన్: చంద్రుడిపై ఉండే పెద్ద పెద్ద బిలాలే భవిష్యత్తులో అక్కడికి వెళ్లే వ్యోమగాములకు ఆవాసాలు కానున్నాయి. చంద్రుడిపై రేడియేషన్, దుమ్ము, ఉష్ణోగ్రతల్లో తీవ్ర తారతమ్యాల నుంచి వారికి రక్షణకోసం ఆ బిలాలను వినియోగించుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. లూనార్ రీకన్నేస్సన్స్ ఆర్బిటార్ (ఎల్ఆర్వో) తీసిన చిత్రాలను ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ సహాయంతో పరిశీలించి ఈ బిలాలను కనుగొన్నట్లు చెబుతున్నారు. అయితే చంద్రుడి ఉపరితలంపై దాదాపు 200కు పైగా పెద్దపెద్ద బిలాలున్నాయి. ఈ బిలాలు దాదాపు గుహల్లాగా వినియోగించుకోవడానికి వీలుగా ఉన్నాయని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త రాబర్ట్ వాగ్నర్ చెప్పారు. లావా ప్రవహించడం మూలంగా ఖాళీలు ఏర్పడి ఉంటాయని.. ఆ తర్వాత ఆ ఖాళీల పైన ఉండిపోయిన మట్టిపొర కూలిపోవడంతో బిలాలు ఏర్పడి ఉంటాయని పేర్కొన్నారు. చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాములు వీటిల్లో ఆవాసాలను ఏర్పరచుకుంటే.. అక్కడి దుర్భర పరిస్థితుల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. -
పడకే పని.. 3 లక్షలు జీతం
వాషింగ్టన్: ఏ మాత్రం కష్టపడకుండానే డబ్బులొచ్చే పని కావాలా? హాయిగా బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటూనే డబ్బు సంపాదించే మార్గం కావాలా? అయితే, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వాళ్లను సంప్రదించండి. బెడ్‌పై లేవకుండా పడుకుంటే చాలు.. నెలకు రూ.3 లక్షలు ఇస్తానని నాసా ప్రకటించింది. అంతరిక్షంలోని భార రహిత స్థితిలో వ్యోమగాముల శరీరంలో జరిగే మార్పులపై నాసా ఓ పరిశోధన చేయతలపెట్టింది. అందుకోసం ‘బెడ్ రెస్ట్ స్టడీ’ పేరిట 70 రోజుల పాటు బెడ్‌పై నుంచి లేవకుండా ఉండేందుకు వలంటీర్లు కావాలని ఒక ప్రకటన జారీ చేసింది. మొత్తం 97 రోజుల పాటు జరిగే ఈ పరిశోధనలో 13 రోజులు మామూలుగా బెడ్‌పై పడుకుని అటూ ఇటూ కదలొచ్చు. అప్పుడప్పు డూ కిందికి దిగొచ్చు. తర్వాత 70 రోజులు బెడ్‌పైనే ఉండాలి, ఎక్కువగా కదల కూడదు. ఈ పరిశోధన సమయంలో.. ఎముకలు, కండరాలు, గుండె, ప్రసరణ వ్యవస్థల పనితీరు, మార్పులను శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు.