అంతరిక్షంలో పండించిన పాలకూరతో విందు | Astronauts ate space salad grown on International Space Station | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో పండించిన పాలకూరతో విందు

Published Tue, Aug 11 2015 9:23 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

అంతరిక్షంలో పండించిన పాలకూరతో విందు

అంతరిక్షంలో పండించిన పాలకూరతో విందు

వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఉన్న వ్యోమగాములు తొలిసారిగా అక్కడ పండించిన పాలకూర రుచిచూశారు. నాసా వ్యోమగామి స్కాట్ కెల్లీతో పాటు ఎక్స్‌పెడిషన్ 44 వ్యోమగాముల బృందం వెజ్జీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్ ద్వారా పండించిన ఈ పాలకూరను తిన్నారని నాసా వెల్లడించింది. సగం పాలకూరను వారుతినగా, మిగతా సగాన్ని శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం భూమికి తిరిగి వచ్చేంతవరకూ అలాగే భద్రపరుస్తారని తెలిపింది. భవిష్యత్తులో సుదీర్ఘ అంతరిక్ష యాత్రలు చేపట్టనున్న దృష్ట్యా వ్యోమగాములకు ఆహార  అవసరాల కోసం నాసా వెజ్జీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్‌ని అభివృద్ధి చేస్తోంది.

వ్యామగామి స్కాట్ కెల్లీ తన సహచరులతో కలిసి అంతరిక్షంలో పండించిన పాలకూరని ఆరగిస్తున్న వీడియోని ట్విట్టర్లో పోస్టు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement