భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో వ్యోమగాములు...
వాషింగ్టన్: భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో వ్యోమగాములు 2015 నూతన సంవత్సర వేడుకలను 16 సార్లు జరుపుకొన్నారు! ఎలాగంటే.. 400 కి.మీ. ఎత్తులో, గంటకు 28,163 కి.మీ. వేగంతో చకచకా తిరుగుతున్న ఐఎస్‌ఎస్ ప్రతి 92.74 నిమిషాల కోసారి చొప్పున ఒకేరోజు 16 సార్లు భూమిని చుట్టి వచ్చింది మరి. దీంతో ఐఎస్‌ఎస్‌లోని వ్యోమగాములు బుధవారం 16 సార్లు రాత్రి, పగళ్లను చూశారు. ప్రతిసారీ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ పండ్ల రసాలు, టోస్టులతో వేడుకలు చేసుకున్నారు.