ఏ మాత్రం కష్టపడకుండానే డబ్బులొచ్చే పని కావాలా? హాయిగా బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటూనే డబ్బు సంపాదించే మార్గం కావాలా? అయితే, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వాళ్లను సంప్రదించండి.
వాషింగ్టన్: ఏ మాత్రం కష్టపడకుండానే డబ్బులొచ్చే పని కావాలా? హాయిగా బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటూనే డబ్బు సంపాదించే మార్గం కావాలా? అయితే, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వాళ్లను సంప్రదించండి. బెడ్‌పై లేవకుండా పడుకుంటే చాలు.. నెలకు రూ.3 లక్షలు ఇస్తానని నాసా ప్రకటించింది. అంతరిక్షంలోని భార రహిత స్థితిలో వ్యోమగాముల శరీరంలో జరిగే మార్పులపై నాసా ఓ పరిశోధన చేయతలపెట్టింది. అందుకోసం ‘బెడ్ రెస్ట్ స్టడీ’ పేరిట 70 రోజుల పాటు బెడ్‌పై నుంచి లేవకుండా ఉండేందుకు వలంటీర్లు కావాలని ఒక ప్రకటన జారీ చేసింది. మొత్తం 97 రోజుల పాటు జరిగే ఈ పరిశోధనలో 13 రోజులు మామూలుగా బెడ్‌పై పడుకుని అటూ ఇటూ కదలొచ్చు. అప్పుడప్పు డూ కిందికి దిగొచ్చు. తర్వాత 70 రోజులు బెడ్‌పైనే ఉండాలి, ఎక్కువగా కదల కూడదు. ఈ పరిశోధన సమయంలో.. ఎముకలు, కండరాలు, గుండె, ప్రసరణ వ్యవస్థల పనితీరు, మార్పులను శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు.