వైరల్‌ వీడియో : రోడ్డుపై వ్యోమగామి నడక | Artist Dressed Up As Astronaut And Walk On Bengaluru Road | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో : రోడ్డుపై వ్యోమగామి నడక

Published Mon, Sep 2 2019 5:17 PM | Last Updated on Mon, Sep 2 2019 5:29 PM

Artist Dressed Up As Astronaut And Walk On Bengaluru Road - Sakshi

సాక్షి, బెంగళూరు : గుంతల రోడ్లతో ప్రజలు పడుతున్న బాధలను వెలుగెత్తేందుకు ఓ కాళాకారుడు వినూత్న ప్రయత్నం చేశారు. వ్యోమగామి దుస్తులతో గుంతల రోడ్డుపై నడుస్తూ వినూత్నమైన పద్దతిలో తన నిరసనను తెలిపారు. బాదల్ నంజుందస్వామి అనే కళాకారుడికి  ఈ ఆలోచన వచ్చింది. వ్యోమగామి దుస్తులు ధరించి అంతరిక్షంలో వేరే గ్రహంపై నడిచినట్లుగా నటిస్తూ వీడియోను చిత్రీకరించారు. రోడ్డుపై ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ అంతరిక్షంలోనే ఉన్నట్లు రూపొందించాడు. వీడియో చూస్తున్నంతసేపు అంతరిక్షంలోనే ఉన్నాడేమో అనే భావన కలిగేల వీడియో తయారు చేశాడు. బెంగళూరులోని రహదారుల అధ్వాన్నపరిస్థితి చాటిచెప్పే ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement