అంతరిక్షం..అబ్బా చూడ్డానికి ఎంత బాగుంటుందో.. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అయితే తెల్లటి సూటులేసుకుని. డింగుడింగుమంటూ ఎగురుతూ తిరుగుతూ ఉంటే..భలే మజా వస్తుంది కదూ..నిజంగానే.. అక్కడ అంత బాగుంటుందా? లేదా మన కళ్లకు కనిపిస్తున్నదంతా నాణేనికి ఒక వైపేనా.. రండి.. రెండో వైపు చూసి వద్దాం..
నిజానికి సుదీర్ఘకాల స్పేస్‌మిషన్‌ల వల్ల చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లే వ్యోమగాములకు అక్కడ గురుత్వాకర్షణ తక్కువగా ఉండటం, రేడియోధార్మికత కారణంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. 2022 కల్లా అంతరిక్షంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపేందుకు ఉద్దేశించిన ‘గగన్‌యాన్’ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో అంతరిక్షంలో ఆరోగ్యపరంగా వ్యోమగాములు ఎదుర్కొనే ఇబ్బందులపై ఓ లుక్కేస్తే..
1 దృష్టి సమస్యలు
శరీరంలోని ద్రవాలు ప్రసరించి తలవైపు వస్తున్నప్పుడు కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది
2 గుండె
మెల్లిగా బలహీనమవుతుంది.ఆకారంలో మార్పులొస్తాయి.గుండె బరువు తగ్గుతుంది. గుండెకొట్టుకునే విధానంలో చాలా మార్పులొస్తాయి.
3 మూత్రపిండాలు
క్యాల్షియం ఎక్కువ మొత్తంలో రక్తంలో కలవడం కారణంగా.. కిడ్నీలో రాళ్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
4 కండరాలు
5–11రోజుల అంతరిక్ష ప్రయాణంలో 20%వరకు కండరాలు బలహీన పడతాయి.
5 వెన్నెముక
వెన్నెపూస దాదాపు 5 సెంటీమీటర్లు సాగేందుకు అవకాశం ఉంటుంది.
6 ఎముకలు
భూమిపై వృద్ధుల్లో ఏడాదికి ఎముకల బలహీనత 1.5% వరకు ఉంటుంది. అదే అంతరిక్షంలో నెలకు ఇది 1–1.5% ఉంటుంది.
- మిషన్ అనంతరం భూమిపైకి తిరిగొచ్చాక ఈ సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావం నుంచి వ్యోమగాములు బయటపడతారు.
Comments
Please login to add a commentAdd a comment