కథల పుస్తకాలైనా, శాస్త్ర విజ్ఞాన పుస్తకాలైనా ఎవరికి వారు చదువుకోవడం కన్నా ఎవరైనా చదివి వినిపిస్తే ముఖ్యంగా పిల్లల మెదడుకు బాగా ఎక్కుతుంది. కఠినమైన పదాలు తగిలినప్పుడు అర్థం వివరిస్తూ చదివితే మరింత సులువుగా మెదడులోకి ఎక్కుతుంది. కొంత సమయం అయ్యాక కొందరికి నిద్రకూడా వస్తుంది. వినేవాళ్ల హావభావాలను గమనించకుండా చదివేవాళ్లు వాళ్ల మానాన వాళ్లు పాఠం చెబుతున్నట్లుగా చదువుకుంటూ పోతే కాసేపటికి వినేవాళ్ల గురక వినిపించి చదివే వాళ్ల సమయం వృధా అవుతుంది.