book reading
-
ఎట్టకేలకు తిరిగిచ్చారు.. 84 ఏళ్లకు గ్రంథాలయానికి చేరిన పుస్తకం
లండన్: పుస్తక పఠనంపై ఆసక్తితో గ్రంథాలయం నుంచి అద్దెకు తెచ్చుకున్న ఒక పుస్తకాన్ని ఓ పెద్దాయన తిరిగి ఇవ్వడం మరిచాడు. అలా అది 84 సంవత్సరాలు అల్మారాలో అలాగే ఉండిపోయింది. వారసత్వంగా తాత నుంచి వచ్చిన పాత వస్తువులను సర్దుతున్న మనవడికి లైబ్రరీ పుస్తకంపై దృష్టిపడింది. 1938 అక్టోబర్ 11న ఈ పుస్తకం తిరిగి ఇవ్వాలి అంటూ పుస్తకం ముందుపేజీపై ముద్రించి ఉండటం చూసి అవాక్కయ్యా. వెంటనే ఆ పుస్తకాన్ని లైబ్రరీలో అప్పజెప్పాడు. ఇంగ్లండ్‌లో ఇటీవల ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీ నగరం సమీపంలోని ఎర్లీస్డన్ ప్రాంతంలోని కోవెంట్రీ పబ్లిక్ లైబ్రరీ శాఖ నుంచి కెప్టెన్ విలియం హారిసన్ అనే వ్యక్తి రిచర్డ్ జెఫరీ రచించిన రెడ్ డీర్ అనే పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకున్నాడు. 1938 తొలినాళ్లలో ఈ పుస్తకం విలియం చేతికొచ్చింది. విలియం 1957లో మరణించారు. పుస్తకం విషయం తెలియక ఆయన కుమార్తె సైతం పుస్తకాన్ని గ్రంథాలయానికి పంపలేదు. ఆమె ఇటీవల కన్నుమూశారు. ఆమె కుమారుడు ప్యాడీ రియార్డన్ ఇటీవల తాత వస్తువుల్లో దీనిని కనుగొన్నాడు. వెంటనే లైబ్రరీకి తీసుకెళ్లి ఇచ్చేశాడు. 84 ఏళ్ల తర్వాత పుస్తకం తిరిగి ఇవ్వడం చూసి లైబ్రరీ సిబ్బంది ఒకింత ఆశ్చర్యపడినా చాలా ఆలస్యంగా ఇచ్చారంటూ జరిమానా విధిస్తామన్నారు. అందుకు ప్యాడీ సిద్ధపడ్డాడు. 30,695 రోజుల ఆలస్యానికి లెక్కలు కట్టి, ప్రతి ఏడు రోజుల్లో ఒకరోజుకు జరిమానా విధిస్తూ ఫైన్‌ను 18.27 బ్రిటిష్ పౌండ్లుగా తేల్చారు. అది కట్టేసి ప్యాడీ బాధ్యత తీరిందని సంతోషపడ్డాడు. ఇన్ని రోజుల తర్వాత పుస్తకం తిరిగిఇవ్వడం రికార్డ్ అవుతుందని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేశారు. వాస్తవానికి ఇలాంటి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ ఇంగ్లాండ్‌లోనే నమోదవడం విశేషం. గ్రేట్ బ్రిటన్ తొలి ప్రధానిగా పరిగణించబడే సర్ రాబర్డ్ వాల్పోలే తండ్రి కల్నల్ రాబర్ట్ 1668లో సిడ్నీ ససెక్స్ కాలేజీ నుంచి ఒక పుస్తకం తీసుకున్నారు. అది ఏకంగా 288 సంవత్సరాల తర్వాత తిరిగి కళాశాలకు చేరింది. -
ఇంగితమూ జ్ఞానమే!
విద్యాభ్యాసం, విస్తృత పుస్తక పఠనాల వల్ల పొందే జ్ఞానం ఒకటైతే, మనిషిలో ఉండే సహజమైన గ్రహింపు శక్తి, అవగాహన శక్తి వలన వచ్చే జ్ఞానం మరొకటి. దీనికే ఇంగితం లేదా ఇంగితజ్ఞానం అని పేరు. చదువుకున్న వారిలోనే ఇది ఉండనక్కరలేదు. ఇది ప్రతి మనిషిలో ఉండే ఒక అంతర్లీనమైన ఒక జీవలక్షణం. జీవితంలో మనకు కలిగే అనేక అనుభవాలతో ఈ ఇంగితం మరింతగా పదునెక్కుతుంది. అందుకే ఇది ఎంతో విశిష్టమైంది. చదువుతో నిమిత్తంలేకుండా ప్రతి మనిషి జీవనానికి, జీవితానికి అత్యంత ఆవశ్యకమైనది. ఈ ఇంగితం మనలను అప్రమత్తులను చేసి వ్యవహార దక్షతను పొంచి జీవితం సజావుగా సాగేటట్టు చేస్తుంది. విద్యాధికులలో ఉండే జ్ఞానమనే బంగరు పళ్లెరానికి ఇది ఒక గోడ చేర్పు లాంటిది. అనేక శాస్త్రాలను మధించి దాని జ్ఞానామృతాన్ని గ్రోలిన పండితులైనా, తమ జీవితాన్ని నూతన ఆవిష్కరణల కోసమై ధారపోసే శాస్త్రవేత్తలైనా తమ ఇంగితం ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. అలా కానివేళ, వారి జ్ఞానం వారికే కాక మానవాళికే ముప్పు తెస్తుంది. చరిత్ర పుటలు తిరగవేసినా, మన సమకాలీన చరిత్రను పరిశీలించినా ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఒక గురువు తనవద్ద శ్రద్ధతో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకున్న నలుగురు శిష్యులకు చనిపోయిన వారిని బతికించగల అద్భుత శక్తినిచ్చాడు. అయితే, దానిని అత్యవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించ మని హెచ్చరించి పంపాడు. వారిలో ముగ్గురు మార్గమధ్యంలో ఒక పులి కళేబరాన్ని చూసి వారి అద్భుత శక్తిని ప్రయోగించాలని ఉవ్విళ్ళూరటం, నాలుగవవాడు వారి మూర్ఖత్వానికి వగచి, హితవు పలికి భంగపడి వీరికి దూరంగా వెళ్లి తన ప్రాణాలు దక్కించుకున్న కథ మనకు తెలుసు. ప్రాణాలు కోల్పోయిన ఆ నలుగురు జ్ఞానసంపన్నులే. కాని వారిలో కొరవడిన ఇంగితం ప్రాణం నిలబెట్టుకున్న వాడిలో మెండుగా ఉంది. అలాగే పరస్త్రీని తాకకూడదన్న ధర్మాన్ని మనసులో స్థిరరచుకున్న ఒక శిష్యుడు ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక స్త్రీని రక్షించడానికి ముందుకు రాలేదు. అక్కడ ఆపదలో ఉన్నది ఒక జీవి మాత్రమేనని భావించిన రెండోవాడు ఆమెను కాపాడటానికి కారణం ఇంగితమే. ఇంగితమంటే వివేకమే. ఒకరకమైన యుక్తాయుక్త విచక్షణ. సందర్భోచిత జ్ఞానం. మన చదువుల సారానికి, జీవితానుభవాన్ని విచక్షణాశక్తిని కలిపి చూడగలగటమే ఇంగితం. మన ప్రవర్తనలో, వ్యవహార శైలిలో దానిని చూపగలిగేవారి జీవితం అపార్థాలు, తగాదాలు లేకుండా సాగుతుంది. వందలాది పక్షులకు ఆశ్రయమిచ్చే ఓపెద్ద చెట్టుకింద కూర్చుని ధ్యానముద్రలో ఉన్నాడో పండితుడు. అపుడో పక్షి విడచిన విసర్జనం అతని తల మీద పడింది. విపరీతమైన కోపమొచ్చిన ఆయన దాని వంక తీక్షణంగా చూసాడు. అంతే! ఆ పక్షి కాలి బూడిదై పోయింది. ఆయనకు సంతోషమూ, గర్వమూ కలిగాయి. అన్ని పక్షులున్న చెట్టు కింద కూర్చుంటే ఆ అనుభవం ఎదురవ్వటం నీరు పల్లానికి వెళుతుందన్న నంత సహజం. ఇంత చిన్న విషయం ఆయనకు తట్టకపోవటానికి కారణం తన ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించ లేకపోవటమే. ఇక్కడ ఇంగితమంటే వివేకమని అర్థం. చాల సహజమైన ఈ ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించకపోతే పండితులు, జ్ఞానసంపన్నులు వారి శాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని, సాధన ద్వారా పొందిన జ్ఞానాన్ని ఎలా మట్టిపాలు చేసుకుంటారో చెపుతుందీ ఉదాహరణ. నిస్సందేహంగా జ్ఞానమే ఆధిక్యమైనది, గొప్పది, విలువైనది. ఈ జ్ఞానాన్ని ప్రదర్శించేటప్పుడు ఒక నియంత్రణాశక్తిగా ఈ ఇంగితం పనిచేయాలి. రివాల్వరు ఉపయోగించగలగటం జ్ఞానం. అయితే, దానిని ఆ సందర్భంలో వాడవలసిన అవసరం ఉందా లేదా అనే సంగతిని మనకు బోధపరచే గొప్ప వజ్జ ఈ ఇంగితం. ఇంగితమంటే తార్కికత, విచక్షణ, భావోద్వేగాలపై ఒక పట్టు. ఇంగితమంటే మన శక్తియుక్తుల్ని అవసరమైన చోట, తప్పనిసరైన క్షణాన మాత్రమే ఉపయోగించేటట్టు మనల్ని సమాయత్తం చేసే ఒక నిబద్ధత, ఒక అదుపు. అలా కానివేళలలో అది పిచుక మీద బ్రహ్మాస్త్రమే అవుతుంది. ఒక పండితుడు గణితంలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు. విశేషమైన ప్రజ్ఞతో గణితానికి చెందిన ఏ లెక్కనైనా, సమస్యనైనా పరిష్కరించసాగాడు. తన గ్రామంలోనూ, చుట్టుపక్కల గ్రామాలలోనూ అంతటి మేధావి లేడని ఖ్యాతి పొందాడు. పేరు, డబ్బు వచ్చింది. ప్రజలు, ఇంత గణితశాస్త్ర పండితులు ఆయన ప్రజ్ఞాపాటవాలకు ఆశ్చర్యానుభూతికి లోనై ఆయనకు నీరాజ నాలిచ్చి సత్కారాలు, సన్మానాలు చేసారు. గణితంలో తనకన్నా ప్రజ్ఞావంతుడు లేడనే అహంకారం ప్రవేశించింది అతనిలో. గర్వం తారస్థాయికి చేరుకొని ‘నాతో పోటీపడగలవారెవరైనా ఉన్నారా మీ గ్రామంలో?’ అని సవాలు విసరి, తలపడినవారిని ఓడించి, దూషించి అవమానించసాగాడు. ఒకసారి ఒక సాయంసంధ్య వేళలో ఒక గ్రామంలోకి ప్రవేశిస్తున్న సమయాన ఒక పశువుల కాపరి కలిసాడు. ఆ చదువురానివాడితోనూ తన గొప్పతనాన్ని గురించి అతిగా చెపుతూ వెళుతున్నాడు. ఒకచోట ఆ కాపరి తటాలున కిందకు వంగి ఒక గుప్పెడు ఇసుకను తీసుకుని ‘అయ్యా, కొంచెం ఇదెంతో లెక్కించి చెప్పగలరా?’ అని ఆ గణితశాస్త్ర పండితుణ్ణి అడిగాడు. ఆ ప్రశ్నకాపండితుడి నోటివెంట ఒక క్షణం మాట రాలేదు. ఆలోచన స్తంభించి పోయింది. చివరకు ఆ ఇసుకను లెక్కించలేమన్నాడు. దానికా పశువులు కాపరి ‘సామీ! దీనిని గుప్పెడని కదా అంటారు. ఐదు వేళ్ళు దగ్గరకు చేర్చి తీసుకుంటే చారెడు, రెండు అరచేతులతో తీసుకుంటే దోసెడు, బొటనవేలికి, చూపుడువేలికి మధ్య తీసుకుంటే చిటికెడని కదా అంటారు’ అన్నాడు. అంతే ఆ పండితుడికి తన తప్పు తెలిసింది. మామూలు పద్ధతిలోనే ఆ ఇసుకను లెక్కించే యత్నం చేయటం వల్ల సమాధానం చెప్పలేకపోయానని. సహజసిద్ధమైన ఇంగితజ్ఞానాన్ని తను చూపలేకపోయానని అర్థం చేసుకుని తన అహంకారానికి సిగ్గుపడి అతడికి నమస్కరించి ఇంటిముఖం పట్టాడు. నిజానికి ఆ నిరక్షరాస్యుడు పండితుడికి ఏ విషయంలో పోటీనే కాదు. కాని అతడు పండితుణ్ణి ప్రశ్నించటానికి కారణం అతడి ఇంగితమే. దీనినే మరో కోణం నుండి చూస్తే ఆ పండితుడి గర్వానికి, అనుచిత ప్రవర్తనకు ఆ పశువుల కాపరి ప్రశ్న నిరోధకం. అంతేకాదు. సహజ సిద్ధమైన ఇంగితానికి.. జీవితపరిశీలన, అన్వయం, సందర్భాచిత ఆకళింపు జత కూడితే అది విశేషమైన ప్రజ్ఞ. ఏ పుస్తకాలలో చెప్పని ఏ గురువు నేర్పని విద్య ఇది. ఇంగితమనే పుస్తకంలో జీవితానుభావాలే పుటలు, అధ్యాపకులు. మనలో సహజంగా ఉండే ఏ అద్భుత శక్తి, మన జీవిత మార్గదర్శి. విద్య వల్ల మరింతగా పదునెక్కాలి. అపుడే మరింతగా ప్రకాశిస్తుంది. ఇంగితమంటే లోకజ్ఞానం. ఇది మన నిత్య వ్యవహారాల నిర్వహణలో సహాయపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్య సందర్భాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ ఇంగితం మనకు ఎంతో వెన్నుదన్నుగా ఉంటుంది. ఇంగితం మన ‘వివేచనా నేత్రం’ ఇన్ని ఉదాహరణలవల్ల మనం గ్రహించవలసింది ఏమిటి? ఇంగితమంటే ఒకసహజమైన తెలివిడి, లోతైన పరిశీలన, బుద్ధికి, మనస్సుకి గోచరమయ్యే ఒక అద్భుత అవగాహన. చదువుకున్న వారిలో ఉండేవి, ఉండవలసిన లక్షణాలు ఇవే కదూ! శాస్త్రపరమైన జ్ఞానం అక్షరాస్యులదైతే, నిరక్షరాస్యులది పరిశీలనా గతమైనది. ఇంగితం జ్ఞానమే. అది సహజాతమైనది అన్నారు పెద్దలు. –బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
కట్టె కొట్టె తెచ్చే...మెచ్చే!
ఓటీటీ బడిలో సృజనాత్మక పాఠాలు నేర్చుకుంటున్న యువతరం... దృశ్యలోకంలోనే ఉండిపోవడం లేదు. పుస్తక ప్రపంచం వైపు కూడా తొంగిచూస్తోంది. గంటల కొద్దీ సమయం పుస్తకాలు చదివే ఆసక్తి లేకపోయినా, రకరకాల జానర్స్‌లోని పుస్తక సాహిత్యాన్ని సంక్షిప్త రూపంలో అందిస్తున్న డిజిటల్ వేదికలు యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి... ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు యూత్ మహారాజ పోషకులు అనే సత్యాన్ని రకరకాల సర్వేలు ఎప్పటికప్పుడు బలపరుస్తున్నాయి. కరోనా లాక్డౌన్ తరువాత ఓటీటీ వేదికల వైపు ఆకర్షితులవుతున్న యువతరం శాతం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఈ ధోరణి మంచికా? చెడుకా? అనే చర్చలో ‘ఓటీటీ వల్ల యువత కోల్పోతుందా? నేర్చుకుంటుందా?’ అనే ప్రధాన ప్రశ్న ముందుకు వచ్చింది. ‘నేర్చుకున్నదే ఎక్కువ’ అనేది చాలామంది అభిప్రాయంగా వినబడుతుంది. ‘లాక్డౌన్ టైమ్‌కు ముందు ఓటీటీ గురించి వినడం తప్ప పెద్దగా తెలియదు. అయితే అందులోకి వెళ్లాక మైండ్‌బ్లోయింగ్ అనిపించే ఎన్నో చిత్రాలను చూశాను. మూడు ఫైట్లు, ఆరు పాటలు చూసీచూసీ మొహం మొత్తిన ప్రేక్షకులకు ఓటీటీ కంటెంట్ పెద్ద మార్పు అని చెప్పవచ్చు. ఇలా కూడా సినిమా తీయవచ్చా, ఇలాంటి సబ్జెక్ట్‌తో కూడా తీయవచ్చా! అని ఎన్నోసార్లు అనిపించింది’ అంటుంది కోల్‌కతాకు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ నిఖిల. పుస్తకాలు చదవడం వల్ల సృజనాత్మకత పదును తేరుతుంది. కొత్త సబ్జెక్ట్‌లు రాసుకోవడానికి వీలవుతుంది. కొత్త సబ్జెక్ట్‌లకు ఓటీటీ ఓకే అంటుంది. అయితే ఈ ఎస్ఎంఎస్ల కాలంలో పేజీలకు పేజీలు చదివే ఓపిక యూత్‌కు ఉందా? ఇప్పుడు మనం అనుష్క శెట్టి(బెంగళూరు)ని పరిచయం చేసుకుందాం (హీరోయిన్ కాదు) ఒకప్పుడు అనుష్క శెట్టి పుస్తకాల పురుగు. ఎన్నో పుస్తకాలు చదివింది. అయితే తాను సైతం మొబైల్ ఫస్ట్–జెనరేషన్లో భాగం కావడానికి ఎంతకాలం పట్టలేదు. సోషల్ మీడియా, టెక్ట్సింగ్ యాప్స్ పైనే ఎక్కువ సమయాన్ని కేటాయించేది. ఈ నేపథ్యంలో ‘యూత్–బుక్‌రీడింగ్’ గురించి ఆలోచించగా, ఆలోచించగా ఆమెకు ఒక ఐడియా తట్టింది. అదే..ప్లాప్ స్టోరీస్! ‘ఎడ్యుటెయిన్’ నినాదంతో రంగంలోకి దిగిన ఈ గ్లోబల్ ఇంటరాక్షన్ ఫిక్షన్ ఎంటర్ టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ బైట్–సైజ్డ్ ఫిక్షన్‌ను యూత్‌కు చేరువ చేస్తుంది. ‘యువతరాన్ని ఆకట్టుకోవడానికి పబ్లిషింగ్ ఇండస్ట్రీలో వినూత్న ప్రయత్నాలు జరగడం లేదు. కిండిల్ డిజిటల్ రీడింగ్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, అది పేపర్ డిజిటలైజేషన్ మాత్రమే. ఈ నేపథ్యంలో పుస్తకపఠనాన్ని ప్లాప్ రూపంలో పునరావిష్కరించాం. టెక్ట్స్, వీడియో, ఆడియోల రూపంలో తక్కువ టైమ్‌లో యూత్‌కు సాహిత్యాన్ని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాం’ అంటుంది ప్లాప్ స్టోరీస్ కో–ఫౌండర్ అనుష్క షెట్టి. ‘రీడింగ్ ట్రెండింగ్ అగేన్’ అనుకునే మంచి రోజులు రావాలని ఆశిస్తుంది అనుష్క. క్రియేటర్స్‌గా రాణించడానికి సినిమాలు ఎంత ఉపయోగపడుతాయో, పుస్తక సాహిత్యం కూడా అంతే ఉపయోగపడుతుంది. అయితే పుస్తకాలు చదవడానికి గంటలకొద్దీ సమయాన్ని కేటాయించడానికి యువత సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో తక్కువ టైమ్‌లో పుస్తక సారాంశాన్ని తెలుసుకునే వేదికకు రూపకల్పన చేశాం. ట్రెయిలర్ నచ్చితే ఎలాగైనా సినిమా చూడాలనుకుంటాం. ఒక పుస్తకం లేదా నవల, కథ గురించి క్లుప్తంగా తెలుసుకున్నవారు మూలం చదివే ప్రయత్నం చేస్తారు అనేది మా నమ్మకం. – అనుష్క శెట్టి, ప్లాప్ స్టోరీస్, కో–ఫౌండర్ -
రెండూ అబద్ధాలే ఎందుకు కాకూడదు! అనే ఆలోచన లేకుంటే!
Thinking Fast And Slow Book By Daniel Kahneman: బుట్టబొమ్మ పూజా హెగ్డేకు ఖాళీ సమయాల్లో పుస్తకాలతో గడపడం అంటే ఇష్టం. వాటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటుంది. పూజాకు బాగా నచ్చిన పుస్తకాల్లో ఒకటి...నోబెల్ బహుమతి గ్రహీత, ఇజ్రాయెల్–అమెరికన్ సైకాలజిస్ట్ డేనియల్ కానెమెన్ రాసిన ‘థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో’ అనే పుస్తకం. స్టార్డమ్తో కూడిన లైఫ్, సాధారణ లైఫ్‌కు మధ్య, ప్రశంసలు, విమర్శలకు మధ్య తనను తాను సమన్వయం చేసుకోవడానికి ఇలాంటి పుస్తకాలు ఉపకరిస్తాయి. ఈ పుస్తకం గురించి... రెండు మానసిక ప్రపంచాల మధ్య... తన పుస్తకరచనలో భాగంగా కొద్దిమంది యువకులను ఎంచుకొని ‘ఈ నెలలో మీరు ఎన్నిరోజులు సంతోషంగా ఉన్నారు?’ అనే ప్రశ్న ఇస్తే చాలామంది నుంచి ‘జీరో’ అనే జవాబు వచ్చింది. అలా అని వారిజీవితాల్లో విషాదాలేవీ చోటు చేసుకోలేదు. ఓటమిలాంటివేవీ ఎదురుకాలేదు. రోజులు గడిచాయి...అలా గడిచాయి...అంతే! అసలు సంతోషంగా ఉండడానికి, ఉన్నాము అని చెప్పడానికి కొలమానం ఏమిటి?... ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ‘థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో’ పుస్తకం చదవాల్సిందే.రెండు రకాలైన మానసిక పరిస్థితుల మధ్య వైరుధ్యాలను కేంద్రంగా తీసుకొని డేనియల్ లోతుగా పరిశోధన చేసి ఈ పుస్తకం రాశారు. సిస్టం–1 ఆటోమేటిక్, ఫ్రీక్వెంట్, ఎమోషనల్, స్టీరియోటైప్, అన్కాన్షియస్ సిస్టం–2 ఎఫెక్ట్పుల్, ఇన్‌ఫ్రీక్వెంట్, లాజికల్, క్యాలిక్యులేటింగ్, కాన్షియస్నెస్ కొన్ని సందర్భాలలో సిస్టం–1 చేయలేని పనులను సిస్టం–2 ఎలా చేస్తుందో చెబుతారు రచయిత. ఇదే సందర్బంలో కొన్ని భ్రమల గురించి కూడా చెబుతారు. రెండు అబద్దాలు మనకు చెప్పి ‘ఇందులో ఏది నిజం?’ అని అడిగితే ఏదో ఒకటి చెబుతాం. ‘రెండు అబద్ధాలే ఎందుకు కాకూడదు’ అనే ఆలోచన చాలా అరుదుగా వస్తుంది. ఉదా: హిట్లర్ వాజ్ బార్న్ ఇన్ 1892 హిట్లర్ వాజ్ బార్న్ ఇన్ 1887 ‘ది లేజీ సిస్టమ్–1’ ‘ది లేజీ సిస్టమ్–2’ ‘స్పీకింగ్ ఆఫ్ కంట్రోల్’ ‘స్పీకింగ్ ఆఫ్ జడ్జిమెంట్’ ‘స్ట్రైయిన్ అండ్ ఎఫర్ట్’....మొదలైన విభాగాలలో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ‘మన పనితీరుపై మనం అంచనా వేసుకోవడం కంటే ఇతరుల పనితీరుపై తీర్పులను ప్రకటించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం’ అంటున్న రచయిత స్వీయవిశ్లేషణ ఇచ్చే మంచి ఫలితాల గురించి చెబుతారు. చదవండి👉🏾 Wedding Season Fashion: లెహంగా ఒక్కటే కాదు.. పెళ్లిలో మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే! -
ప్రపంచానికి దిక్సూచి.. పుస్తకం
మానవాళికి ఆలోచించడం నేర్పింది అక్షరమైతే... ప్రపంచ గతిని మార్చేలా చేసింది పుస్తకం. అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే. తరతరాల నుండి పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనా వేయడమంటే ఆకాశాన్ని కొలవడం లాంటిదే. స్పెయిన్ దేశంలోని ప్రజలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న ఒకరిపట్ల ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ఒకరికొకరు గులాబి పుష్పాలను అందించుకోవడం సంప్రదాయం. కానీ 1926లో అక్కడి రచయిత మిగ్యుల్ డి సెర్వాంటెజ్ మరణించడంతో ఆ సంవత్సరం గులాబీలకు బదులు పుస్తకాలను పరస్పరం అందించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు వేర్వేరు తేదీలలో పుస్తక మహోత్సవాలు నిర్వహించినా... 1616లో ఏప్రిల్ 23న విలియం షేక్స్పియర్, సెర్వాంటెజ్ ‘ఒకేరోజున’ మరణించడం; మరి కొందరు ప్రముఖ రచయితలు అదే రోజున జన్మించడాన్ని ప్రామాణికంగా తీసుకొని యునెస్కో 1995లో ప్యారిస్‌లో జరిగిన సమావేశంలో... పుస్తకాలకూ, రచయితలకూ గౌరవాన్ని ఇవ్వడం, యువతరాన్ని పుస్తక పఠనం వైపు ఆకర్షించడం; ప్రచురణ, కాపీ హక్కుల వంటి విషయాలను ప్రోత్సాహించి వాటి గురించి విస్తృత ప్రచారం చేయడం వంటి లక్ష్యాలతో ఏప్రిల్ 23న ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’గా, ప్రపంచ పుస్తక కాపీ హక్కుల దినంగా’ జరుపుకోవాలని పిలుపునిచ్చింది. స్నేహపూర్వకమైన సలహాలను ఇచ్చి మనల్ని మనం గౌరవిం చుకోవడం, పరులను గౌరవించడాన్ని పుస్తకాలు నేర్పుతాయి. మన హృదయాన్నీ, మేధస్సునూ... మనిషి పట్ల, ప్రపంచం పట్ల ప్రేమతో నింపివేస్తాయి. అందుకే పుస్తకం హస్తభూషణం కావాలి. (క్లిక్: దేశమే ఓ ‘సంఘం’.. అది విద్వేష కేంద్రం కాదు!) – నరేందర్ రాచమల్ల, హన్మకొండ (ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం) -
చదవడమే మొదలు...
ఒకరోజు ఆన్ మోర్గాన్ తన బుక్‌షెల్ఫ్ చూసుకుంది. సుమారు ఇరవై ఏళ్ల గొప్ప కలెక్షన్ అది. కానీ ప్రధానంగా అన్నీ ఇంగ్లిష్, నార్త్ అమెరికన్ పుస్తకాలే. ఈ లండన్ నివాసికి ఏమాత్రమూ సంతృప్తి కలగలేదు. ‘ఇరవై ఏళ్లుగా చదువుతున్నానే! కానీ ఒక విదేశీ భాషా పుస్తకాన్ని నేను దాదాపుగా ముట్టుకోనేలేదు’ అనుకుంది. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది, ప్రపంచంలోని దేశాలన్నింటికీ సంబంధించి కనీసం ఒక్క పుస్తకమైనా చదవాలని. ఐక్యరాజ్య సమితి గుర్తింపున్న 193 దేశాల జాబితా చూసుకుని తన యజ్ఞం మొదలుపెట్టింది. దీన్ని యజ్ఞం అనడం ఎందుకంటే, వీటన్నింటినీ ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల! ఇందులో ఉన్న సవాళ్లు ఏమిటంటే– అన్ని దేశాల పుస్తకాలు సంపాదించాలి; డబ్బు, శ్రమ. ఒక దేశానిది ఒకటే అనుకున్నప్పుడు ఏది ఎంపిక చేసుకోవాలనే సమస్య ఉండనే ఉంది. క్లాసిక్స్, జానపదాలు, సమకాలీన సాహిత్యం, నవలలు, కథాసంపుటాలు, ఆత్మకథలు, బెస్ట్ సెల్లర్స్... ఎలా వడపోయాలి? జపాకు ప్రాతినిధ్యం వహించగలిగే పుస్తకం ఏది? ఏది చదివితే కువైట్ సరిగ్గా అర్థమవుతుంది? ఉత్తర కొరియా నుంచి ఎలాంటిది తీసుకోవాలి? ఏది చదివితే తోగో పరిచయం అవుతుంది? ఖతార్‌కు చేరువ కాగలిగే పుస్తకం ఏది? వీటన్నింటినీ మదిలో ఉంచుకుని, స్నేహితులు, తెలిసినవాళ్లు, ఔత్సాహికుల సాయంతో పుస్తకాలు సేకరించడం మొదలుపెట్టింది. అసలైన సమస్య ఇంకోటుంది. రోజువారీ పనులు మన కోసం ఆగవు. మోర్గాన్ వృత్తిరీత్యా పాత్రికేయురాలు. ఏడాదిలో పూర్తి చేయాలన్న లక్ష్యం చేరాలంటే, అటూయిటుగా ఒక్కో పుస్తకం 200–300 పేజీలు ఉంటుందనుకుంటే, 1.85 రోజులో పుస్తకం చదివెయ్యాలి. చదవడంతోపాటు చిన్న సమీక్ష రాయాలనుకుంది. ఆ పుస్తకం ఎలాంటిదో చెబుతూ తన పఠనానుభవాల్ని కూడా జోడిస్తూ బ్లాగ్ రాసుకుంటూ పోయింది. భూటాన్, బెలారస్, మంగోలియా, బురుండి, మొజాంబిక్ లాంటి ఎన్నో దేశాల పుస్తకాలు ఆమె జాబితాలో ఉన్నాయి. ఇంతకీ భారత్ నుంచి ఏం తీసుకుంది? పదేళ్లు చదివినా భారతీయ వైవిధ్యభరిత సారస్వత వైభవపు ఉపరితలాన్ని కూడా చేరలేనని తనకు తెలుసంటుంది మోర్గాన్ . కానీ లెక్క కోసం ఎం.టి.వాసుదేవన్ నాయర్ మలయాళీ నవల ‘కాలం’ తీసుకుంది. అది ఆమెకు గొప్పగా నచ్చింది కూడా! తన పఠనానుభవాలన్నింటినీ కలిపి 2015లో ‘ద వరల్డ్ బిట్వీన్ టు కవర్స్: రీడింగ్ ద గ్లోబ్’ పుస్తకంగా ప్రచురించింది. గతేడాది చైనా మూలాలున్న అమెరికా రచయిత్రి యీయూన్ లీ కూడా ఇలాంటి పనే చేసింది. కాకపోతే ఆమె ప్రయోగం వేరు. కోవిడ్ మహమ్మారి మొదలైన కొత్తలో బయటికి వెళ్లలేని జీవితంతో విసుగెత్తి ఆన్ లైన్ జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంది. దానికిగానూ తనలాంటి వారందరినీ ఆహ్వానిస్తూ, లియో టాల్‌స్టాయ్ మహానవల ‘యుద్ధము–శాంతి’ని సామూహిక పఠనం చేద్దామని పిలుపునిచ్చింది. రోజూ ఒక అరగంట సేపు 12–15 పేజీలు చదవడం, చర్చించుకోవడం, మొత్తంగా 85 రోజుల్లో వెయ్యికి పైగా పేజీల నవల పూర్తయ్యింది. తన పఠనానుభవాలను ‘టాల్‌స్టాయ్ టుగెదర్: 85 డేస్ ఆఫ్ వార్ అండ్ పీస్’ పేరుతో పుస్తకంగా రాసింది లీ. ఇరాకు చెందిన ప్రొఫెసర్ అజర్ నఫీసీ అనుభవం దీనికి భిన్నమైనది. ఆమె ‘రీడింగ్ లోలిటా ఇన్ తెహ్రాన్ ’ పేరుతో 2003లో పుస్తకం ప్రచురించింది. ఛాందస ప్రభుత్వంలో తనలాంటి ఉదారవాది ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజెప్పడమే రచన లక్ష్యం అయినప్పటికీ పుస్తకాల ఊతంగా తన అనుభవాలను చెప్పడం ఇందులోని విశేషం. కొన్ని పాశ్చాత్య రచనలను గురించి తన విద్యార్థులతో చర్చించే నేపథ్యంలో ఈ రచన సాగుతుంది. ఇందులో చర్చకు వచ్చే కొన్ని పుస్తకాలు: మదామ్ బావరీ(ఫ్లాబే), ద గ్రేట్ గాట్స్బీ(ఫిట్జ్‌గెరాల్డ్), ద డైరీ ఆఫ్ ఆన్ ఫ్రాంక్, ద ట్రయల్ (కాఫ్కా), ద అడ్వెంచర్స్ ఆఫ్ హకల్‌బెరీ ఫిన్ (మార్క్ ట్వెయిన్ ). మానవ లైంగికతను ప్రధానంగా చేసుకొన్న నబకోవ్ నవల ‘లోలిటా’ కూడా ఇందులో ఉంది. దాన్నే పుస్తక శీర్షికగా ఎంచుకోవడానికి కారణం – ఇరాన్ లాంటి దేశంలో ఉండే పరిమితులు, పరిధులు, ఆంక్షలను తెలియజెప్పడానికే! పుస్తకాన్ని రాయడం గొప్పనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ దాన్ని చదవడంలో కూడా గొప్పతనం తక్కువా? ఒక వెయ్యి పేజీల మహత్తర గ్రంథరాజాన్ని చదవడం తక్కువ ప్రయత్నంతో కూడినదా? పైగా దాన్ని చదవడం వల్ల కూడా రచయిత అనుభవాన్ని జీవించగలుగుతున్నప్పుడు, ఉత్త పాఠకులుగానే మిగిలిపోతే మాత్రమేం? పైగా రచయిత పడే శ్రమ కూడా తప్పుతుంది. కానీ మోర్గాన్ లాంటి కొందరు పాఠకులు, కేవలం వారి పఠనానుభవం కారణంగా రచయితగా మారగలిగారు. ‘మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ రాసినప్పుడు, పాత్రికేయుడు కల్లూరి భాస్కరం ప్రధాన వనరు–శీర్షిక సూచిస్తున్నట్టుగా మహాభారతమే! ఇందులోని పరిశోధనా పటిమను తక్కువ చేయడం కాదుగానీ ప్రాథమికంగా అది ఒక సీరియస్ పాఠకుడు మాత్రమే చేయగలిగే వ్యాఖ్యానం. అలాగే ‘కన్యాశుల్కం పలుకుబడి’ని వివరిస్తూ మరో జర్నలిస్ట్ మందలపర్తి కిశోర్ గురజాడ పదకోశమే వెలువరించారు. సరిగ్గా చదవడానికి పూనుకోవాలేగానీ ప్రతి పుస్తకంతోనూ ప్రపంచాన్ని దర్శించవచ్చు; అలాగే ప్రతి పుస్తకంతోనూ ప్రపంచానికి పరిచయం కూడా కావొచ్చు. ఏ రచయితైనా పాఠకుడిగానే తన కెరియర్ను మొదలుపెడతాడని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా! ఇప్పుడు మీ చేతిలో ఏ పుస్తకం ఉంది? -
చదువులో ధ్యానం
ఒక సంస్కృతిని నాశనం చేయడానికి పుస్తకాలను కాల్చే పనిలేదు; జనాన్ని చదవకుండా చూడండి చాలు అంటాడు అమెరికన్ రచయిత రే బ్రాడ్బరీ. ఇదే అర్థం ఇచ్చే వాక్యాన్ని రష్యన్ కవి జోసెఫ్ బ్రాడ్స్కీ ఇంకోలా చెబుతాడు. పుస్తకాన్ని కాల్చడానికి మించిన పెద్ద నేరాలు ఉన్నాయి; అందులో ఒకటి వాటిని చదవకపోవడం! చిరిగిన చొక్కానైనా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్న కందుకూరి వీరేశలింగం మనకు ఉండనే ఉన్నారు. చదవడం అనేది ఎంత ప్రాధాన్యత కలిగినదో చెప్పడానికి జార్జ్ ఆర్.ఆర్. మార్టిన్ ఉటంకింపు ఒక్కటి సరిపోతుంది. ప్రపంచాన్ని కుదిపిన ‘ఎ గేమ్ ఆఫ్ థ్రోన్స్’, అది భాగమైన ‘ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్’ సిరీస్ సృష్టికర్త అంటాడు: చనిపోయేలోగా ఒక పాఠకుడు వెయ్యి జీవితాల్ని జీవిస్తాడు. ఎప్పుడూ చదవనివాడు మాత్రం ఒకటే జీవితం గడుపుతాడు. చదవడం అనేది ఒక ఈవెంట్. ఒక పోటీ. స్నేహితుల దగ్గర పుస్తకాలు తెచ్చుకోవడం, దాని గురించి మాట్లాడుకోవడం, లైబ్రరీలు, రీడింగ్ రూములు, అద్దె పుస్తకాల షాపులు, పాత పుస్తకాల షాపులు, అక్కడే నిలబడి పుస్తకంలో ఏ కొన్ని పేజీలనో ఆబగా చదువుకోవడం... అదంతా ఒక పాత కథ. వెయ్యి పేజీల పుస్తకమైనా ఇట్టే ముగిసిపోయేది. దిండు సైజు నవలైనా అసలు బరువయ్యేది కాదు. చదవడం అనేది గొప్ప విషయం అని అర్థమవుతూనే, దానికి దూరమైపోవడం కూడా నిజమని తెలుస్తూనే ఏమీ చేయలేని చిత్రమైన స్థితిలో ఉన్నాం. టెలివిజన్ నన్ను చాలా ఎడ్యుకేట్ చేస్తుంది; ఎవరైనా టీవీ ఆన్ చేసిన ప్రతిసారీ నేను గదిలోకి వెళ్లి పుస్తకం చదువుకుంటాను అన్నాడు వ్యంగ్యంగా గ్రూచో మార్క్స్. దృశ్యం రావడం అనేది చదవడాన్ని దెబ్బకొట్టిందని అందరికీ ఇప్పుడు తెలిసినదాన్నే అందరికీ తెలియకముందే చెప్పాడీ కమెడియన్. వేగవంతమైన రోజువారీ జీవితంలో నెమ్మదిగా సాగే చదువుకు స్థానం లేకుండా పోయింది. ప్రతిదాన్ని కథనంలో పెట్టాలనే సామాజిక మాధ్యమాల ధోరణి పుస్తకం మీద కాసేపు శ్రద్ధగా చూపు నిలపనీయని స్థితికి తెచ్చింది. ఒక అంచనా ప్రకారం, ప్రింటు కాగితాన్ని చదివేవాళ్లు దాన్ని సగం చదివి వదిలేస్తే, అదే అంశాన్ని డిజిటల్లో అయితే ఐదో భాగం చదవడమే ఎక్కువ. అయితే చదవడం అనేది కొంతవరకూ రూపం మార్చుకుంది అని కూడా చెప్పొచ్చు. ఆడియో బుక్ వింటే చదవడం అవుతుందా, అవదా? ఆన్లైన్ క్లాసులు వింటే చదవడం వచ్చినట్టా, కాదా? ఏదైనా పీర్ ప్రెషర్. గొప్ప స్వీడిష్ సినిమా చూసినంత మాత్రాన దాన్ని పంచుకోవడానికి ఎవరూ లేకపోతే మళ్లీ సమూహంలో భాగం కావడానికి బిగ్‌బాస్ గురించి మాట్లాడవలసిందే. అందుకే ప్రతి మార్పునూ భౌతిక పరిస్థితులే శాసిస్తాయి. ఈ పరిస్థితులు చాలావరకూ సాంకేతికమని చెప్పక తప్పదు. చదవడం మీద ఆసక్తి ఉన్నవాళ్లను కూడా అందులో మునగనీయని స్థితి. పాము మందును పాము విషంలోంచే తయారు చేస్తారు. పోయిన చోటే వెతుకు అన్నట్టుగా, పోవడానికి కారణమైనదే ఇప్పుడు కొత్తగా ఊతం అవుతోంది. ఏ డిజిటల్ మాధ్యమాలైతే చదువును చంపేశాయని భావిస్తున్నామో అవే మళ్లీ పెరగడానికి కారణమవుతున్నాయి. క్లబ్ హౌజ్ పుస్తకాలను చర్చించడానికి ఉపకరిస్తోంది. ఫేస్బుక్ గోడల మీద క థలు, వ్యాసాలు అచ్చవుతున్నాయి. చదివిన పుస్తకాల గురించి మాట్లాడే ‘బుక్‌టోక్’ విదేశాల్లో బాగా ఆదరణ పొందుతోంది. దీనివలన పుస్తకాల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయని చెబుతున్నారు. పుస్తకాలు చదవడం ద్వారా కూడా సెలబ్రిటీలు కావొచ్చని ఇది నిరూపిస్తోంది. టిక్టోక్లో భాగమైన దీన్ని ఇండియాలో కూడా తిరిగి ప్రారంభం కావొచ్చన్న ఆశాభావాన్ని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వ్యక్తం చేశారు. దృశ్యం విసుగెత్తి సృజనకు ఉన్న అవధులను గుర్తుతెస్తుంది. స్వీయ ఊహాత్మక ప్రపంచంలోకి వెళ్లాలంటే శబ్దమే దారి. బహుశా, అందువల్లే మళ్లీ ఆడియో బుక్స్ పాపులర్ అవుతున్నాయి. ఇంకొకటి: ఒకప్పుడు లోకానికి మన ముఖాన్ని చూపుకోవడమనే ఉబలాటం ఎక్కువగా ఉంటుంది. అదింక రొటీన్ స్థాయికి వచ్చేశాక, మన ముఖం కనబడటం అనేది ప్రాధా న్యత కోల్పోతుంది. ప్రైవసీ అనేది గొప్ప ప్రివిలేజ్ అవుతుంది. అందుకే ముఖం కనబడకుండా వినగలిగే, మనగలిగే సామాజిక మాధ్యమాలకు ఆదరణ దక్కుతుంది. అప్పుడు చూడటంలో కన్నా చదవడంలోనే ఎక్కువ ఆనందం దొరికే స్థితి వస్తుంది. బహుశా ప్రపంచం ఈ సంధికాలంలో ఉన్నదేమో. ఈ స్థితిని దర్శించే కాబోలు కొందరు చదువరులు అప్పుడే ‘స్లో రీడింగ్’ అనేదాన్ని ప్రచారంలోకి తెస్తున్నారు. ప్రతి అక్షరాన్ని ఆబగా కాకుండా, జీర్ణించుకుంటూ, ఆస్వాదించుకుంటూ చదవమని చెబుతున్నారు. ప్రపంచాన్ని ఒకసారి స్లో మోషన్లో దర్శించండి. ఇంకా స్ఫుటంగా, స్పష్టంగా, దాని అన్ని సూక్ష్మ వివరాలతో, దానిదైన ప్రత్యేకతలతో. మీ చుట్టూ ఉన్నదే మరింత తదేకంగా, ఏకాగ్రతగా చూడటంలో ఎలాంటి ధ్యానస్థితి ఉంటుందో చదవడంలో కూడా అలాంటిదాన్ని అనుభవంలోకి తెచ్చుకొమ్మని సూచిస్తున్నారు. ‘ఆధునిక జీవితంలోని వేగాన్ని తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన ప్రతిక్రియల్లో నెమ్మదిగా చదవడం ఒకటి’ అంటాడు కార్ల్ హోనోరే. ‘ఇన్ ప్రెయిజ్ ఆఫ్ స్లో’ అనే పుస్తకాన్ని కూడా రాశాడీ కెనడా పాత్రికేయుడు. ఏ రిజొల్యూషన్స్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నవాళ్లు ఈ రానున్న కొత్త సంవత్సరంలో ఇదొకటి తీర్మానం చేసుకోవచ్చు. చదవడం అనేది ఎటూ ఉంటుంది. కానీ దాని పూర్ణరూపంతో మనలోకి ఇంకేలా చదవాలని ఒక తీర్మానం చేసుకుందాం. ఒక హైకూను చదివినంత మెత్తగా, నెమ్మదిగా చదవడాన్ని ఆనందిద్దాం. -
చిక్ బుక్ రైలు
దిల్లీకి చెందిన శృతిశర్మ గురించి చెప్పుకునే ముందు బ్రిటీష్ నటి ఎమ్మా వాట్సన్ దగ్గరకు వెళ్లాలి. హారిపోటర్ ఫిల్మ్‌సిరీస్‌తో ఫేమ్ అయిన ఎమ్మా ఉద్యమకార్యకర్త కూడా. స్త్రీల హక్కులకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టభద్రురాలైన ఎమ్మాకు పుస్తక పఠనం అంటే వల్లమాలిన ప్రేమ. మార్కెట్లో ఏ మంచి పుస్తకం వచ్చినా ఆమె చదవాల్సిందే. ఒక మంచి పుస్తకం గురించి ఎక్కడైనా విన్నా చదవాల్సిందే. అలాంటి ఎమ్మా ప్రజల్లో పుస్తకపఠన అలవాటును పెంపొందించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టింది. న్యూయార్క్, లండన్లలో సబ్వే, స్ట్రీట్‌కార్నర్, జనాలు ఎక్కువగా కనిపించే చోట్లలో పుస్తకాలు పెట్టడం మొదలుపెట్టింది. ఈ ప్రయత్నం మంచిఫలితాన్ని ఇచ్చింది. ‘ఒక మంచి పుస్తకం చదివాను... అనే భావన కంటే ఒక మంచి పుస్తకాన్ని చాలామందితో చదివించాను అనే భావన ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది’ అంటుంది ఎమ్మా. మళ్లీ దిల్లీ దగ్గరకు వద్దాం. ఎమ్మా వాట్సన్‌లాగే శృతిశర్మకు కూడా పుసక్తపఠనం అనేది చాలా ఇష్టం. అయితే చిన్నప్పుడు ఆమెకు అదొక ఖరీదైన వ్యవహారం. అయినప్పటికీ ఏదో రకంగా పుస్తకాలు సేకరించి చదివేది. ఇప్పుడు పుస్తకాలు కొనడానికి ఆర్థికసమస్య అంటూ లేకపోయినా తానే కాదు పదిమంది చేత పుస్తకాలు చదివించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయానికి రావడానికి రెండు కారణాలు. 1. ఎమ్మా వాట్సన్ 2. మెట్రో రైలు లో ప్రయాణం. ఒకరోజు తాను మెట్రోలో ప్రయాణం చేస్తోంది. ఎటు చూసినా సెల్‌ఫోన్ లో మాట్లాడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండేది? కొందరు న్యూస్‌పేపర్స్ చదివేవారు. కొందరు వీక్లీ చదువుకునే వారు. కొందరు పుస్తకాలు చదువుతూ కనిపించేవారు. ఈ సమయంలోనే తనకు పుస్తకాల ఆలోచన వచ్చింది. మొదటి ప్రయత్నంగా ప్రముఖ రచయిత్రి జంపా లహిరి పుస్తకాలను మెట్రో స్టేషన్, ట్రైన్లలో పెట్టింది. ఈ విషయంలో భర్త తరుణ్ చౌహాన్ కూడా తనకు సహాయంగా నిలిచాడు. ‘తమ ఎదురుగా పుస్తకం కనిపించగానే ఆబగా చదవకపోవచ్చు. మొదటిసారి పుస్తకాన్ని ఇటూ అటూ తిరగేయవచ్చు. రెండోసారి ఆసక్తిగా కనిపించే భాగాలను చదవాలనిపించవచ్చు. మూడోసారి పుస్తకం మొత్తం చదవాలనిపించవచ్చు. ఆ తరవాత మరిన్ని పుస్తకాలు చదవాలనే ఆలోచన రావచ్చు’ అంటోంది శృతిశర్మ. అయితే ఆమె ప్రయత్నం వృథా పోలేదు. పుస్తకాలు చదివిన వాళ్లు ఆమెకు కృతజ్ఞత పూర్వకంగా ఫోన్లు చేస్తుంటారు. అంతేకాదు, శృతిశర్మను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది తాము కూడా ట్రైన్లో ప్రయాణికులు చదవడానికి బుక్స్ అందుబాటులో పెడుతున్నారు. -
World Book Day 2021: చలో..‘బుక్’అయిపోదాం..
ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమట.. అప్పట్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పారు.. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఈ రోజు (ఏప్రిల్ 23) ప్రపంచపుస్తక దినోత్సవం.. పుస్తకం గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే.. అందుకే ఈసారి వాటికి నిలయమైన గ్రంథాలయాల గురించి తెలుసుకుందాం.. ఇవి ప్రపంచంలోనే డిఫరెంట్ లైబ్రరీలు.. చలో మరి.. దీని వయసు 1,162 ఏళ్లు ప్రపంచంలో ఇప్పటికీ నిలిచిఉన్న పురాతన లైబ్రరీ మొరాకోలోని ‘ది అల్ ఖారవియిన్ లైబ్రరీ’. క్రీస్తుశకం 859లో ఫాతిమా అల్ ఫిహ్రీ అనే సంపన్న మహిళ దీనిని కట్టించారు. ఇందులో ఎన్నో పురాతనమైన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి.. మొరాకో ప్రభుత్వం ఈ మధ్యే ఈ బిల్డింగ్‌ను పునరుద్ధరించి.. ప్రజల కోసం ఓపెన్ చేసింది. 470 భాషలు.. 3.2 కోట్ల పుస్తకాలు అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉండే ‘లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్’ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ ఇదే. 470 భాషలకు చెందిన 3.2 కోట్ల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి . అందమైన నగిషీలు, మార్బుల్ ఫినిషింగ్‌తో అందమైన లైబ్రరీగానూ పేరుపొందింది. ప్రతినిధుల సభకు అనుబంధంగా ఉన్నా అక్కడి పౌరులెవరైనా వెళ్లి పుస్తకాలు చదువుకోవచ్చు. నేచురల్ లైటింగ్.. చూడటానికి డిఫరెంట్‌గా కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ఈజిప్ట్‌లోని బబ్లియోథెకా అలెగ్జాండ్రియా లైబ్రరీ. ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద లైబ్రరీల్లో ఇదీ ఒకటి. ఈ లైబ్రరీకి 2002లో కొత్త బిల్డింగ్ కట్టించారు. పూర్తిగా సౌర కాంతి పడి పుస్తకాలు చదువుకునేలా రూపొందించారు.ఎక్కువ సంఖ్యలో పురాతన గ్రంథాల ఫొటో కాపీలు ఇక్కడ ఉన్నాయి. చదువుతూ.. రిలాక్స్.. లైబ్రరీ అంటే అంతా సైలెంట్, ఓ పక్కన కూర్చుని మీ చదువేదో మీరు చదువుకుంటారు కదా.. కానీ ఫ్రాన్స్‌లో సముద్ర తీరం వెంబడి ఏర్పాటు చేసిన ‘లైర్ అ లా ప్లాగ్ (బీచ్ దగ్గర చదువుకోండి)’ లైబ్రరీలు మాత్రం వెరీ స్పెషల్. నచ్చిన పుస్తకమో, నవలో, మేగజైనో తీసుకుని.. బీచ్ ఇసుకలో అలా రిలాక్స్డ్గా చదువుకోవచ్చు. బీచ్‌ల వెంట ఆరెంజ్ పైకప్పు, ఎరుపు రంగు కుర్చీలను ఏర్పాటు చేశారు. బొమ్మల పుస్తకాలు.. బొమ్మలతో ఉండే కథల పుస్తకాలు.. చిన్నప్పుడు ఇష్టంగా చదివేవాళ్లం.. వాటిని ఇప్పుడు కూడా చదవొచ్చు.. జపాన్‌లోని ఇవాకీ సిటీలో ఉన్న ఈ లైబ్రరీకి వెళ్తే.. ఇక్కడ వెయ్యికి పైగా ఇలాంటి పిక్చర్ బుక్స్ ఉన్నాయి. లోపల సెటప్ సూపర్‌గా ఉంటుంది.. అక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. -
ఐదేళ్ల చిన్నారి.. అరుదైన ప్రపంచ రికార్డు
నేటి సాంకేతిక యుగంలో నెలల వయసున్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఆన్లైన్లో బిజీగా గడిపేస్తున్నారు. వీడియో గేమ్స్‌లో మునిగి తేలుతోన్న పిల్లలకు స్కూల్ బుక్స్ చదివే తీరిక కూడా ఉండడంలేదు. అటువంటిది ఐదేళ్ల చిన్నారి తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు చదివి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇండో అమెరికన్ చిన్నారి కియరా కౌర్‌కు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. ఈ ఇష్టంతో 36 పుస్తకాలను రెండుగంటల్లోపే చదివి అతిచిన్న వయసులో.. లండన్ వరల్డ్ రికార్డ్, ఆసియా వరల్డ్ రికార్డుల జాబితాలో తన పేరును చేర్చింది. చెన్నైకు చెందిన డాక్టర్ రవీంద్రనాథ్ దంపతుల కుమార్తె కియరా. ప్రస్తుతం అబుదాబిలో ఉంటోన్న కియరాకు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. కార్లో వెళ్తున్నా, రెస్ట్‌రూంలోకి వెళ్లినా కియరా చేతిలో బుక్ తప్పనిసరిగా ఉండేంత ఇష్టం తనకి. లాక్డౌన్ సమయం లో స్కూళ్లు మూతపడినప్పుడు కియరా మొత్తం సమయాన్ని బుక్స్ చదవడానికి కేటాయించి, వందల పుస్తకాలను చదివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న 105 నిమిషాల్లో ఏకధాటి గా 36 పుస్తకాలను చదివి.. లండన్ వరల్డ్ రికార్డ్, ఆసియా వరల్డ్ రికార్డులలో స్థానం సంపాదించడంతో.. వరల్డ్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ కియరా ను ‘బాల మేధావి’గా అభివర్ణించింది. ఇంత చిన్నవయసు లో కియరా పుస్తకాల పురుగుగా మారడం విశేషమని కితాబునిచ్చింది. కియరా మాట్లాడుతూ... పుస్తకాలు చదువుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. బుక్‌ను పట్టుకుని చదువుతుంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. ఇంటర్నెట్ లేకపోతే ఆన్లైన్లో బుక్స్ చదవలేము, వీడియోలు కూడ చూడలేము. అందుకే మన చేతిలో పుస్తకం ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఇబ్బంది లేకుండా చదవొచ్చు. రంగురంగుల బొమ్మలు, పెద్ద పెద్ద అక్షరాల్లో టెక్ట్స్ ఉన్న పుస్తకాలు చదవడమంటే నాకెంతో ఇష్టం. నాకు ఇష్టమైన పుస్తకాల జాబితాలో సిండ్రెల్లా, అలీస్ ఇన్ వండర్లాండ్, లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ వంటివి అనేకం ఉన్నాయి. పుస్తకాలు చదవడమేగాక భవిష్యత్తులో మంచి డాక్టర్ని కూడా అవుతాను’’ అని కియరా చెప్పింది. ‘‘కియరాకు వాళ్ల తాతయ్య వాట్సాప్ కాల్లో చెప్పే కథలంటే ఎంతో ఇష్టం. గంటల తరబడి ఆయన చెప్పే కథలు వింటూ ఆమె సమయం గడిపేది. ఆయన ప్రేరణతోనే కియరా ఇలా పుస్తకాలు చదవగలుగుతోంది’’ అని కియరా తల్లి చెప్పారు. కరోనా సమయంలో స్కూళ్లు మూతపడ్డాయి. ఆ సమయంలో కియరా రెండు వందలకు పైగా పుస్తకాలను చదివింది. పుస్తకాలు అయిపోవడంతో కొత్త పుస్తకాలకోసం ఎదురుచూసేది. కొన్ని సందర్భాల్లో చదివిన పుస్తకాలనే మళ్లీమళ్లీ చదువుతూ ఉండేది. ఉద్యోగ రీత్యా మేము ఎంత బిజీగా ఉన్నప్పటికీ షాపింగ్ చేసిన ప్రతిసారి తనకోసం కొన్ని కొత్త పుస్తకాలను కొని తెచ్చిస్తాము’’ అని ఆమె తెలిపారు. విద్యార్థులు ఈ చిన్నారిని చూసైనా కాస్త పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుని మరింత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆశిద్దాం. ఇక్కడ చదవండి: ఒంటరి తల్లులకు భరోసా ఏదీ? పిల్లలు అకస్మాత్తుగా ఎందుకు స్పృహ తప్పుతుంటారు? -
సత్సంగం.. సద్గ్రంథం
ప్రకృతిలో మరే జీవికీ లేని సౌలభ్యం ఒక్క మనుష్యునికే ఉన్నది. పుట్టుకతో ఒకవేళ స్వభావంలో దోషమున్నా, చెడు గుణాలున్నా, వాసనాబలంగా గతజన్మల నుంచి దోషభూయిష్టమైన విషయాలు మనసు పుచ్చుకున్నా రెండు కారణాల చేత అతను బుద్ధిని మార్చుకోగలడు. మంచి కార్యక్రమాలవైపు మనస్సును మళ్ళించగలడు. అలా అత్యంత ప్రభావవంతమయినవి, బుద్ధిని ప్రచోదనం చేయగలిగినవి, మనిషిని సత్కర్మాచరణవైపు నడిపించగలిగినవి రెండు ఉన్నాయి లోకంలో–ఒకటి సత్సంగం, మరొకటి–మంచి పుస్తక పఠనం. సత్సంగం అంటే మంచి వ్యక్తులతో కూడిక. మనం ఏకాలంలో జీవిస్తున్నామో, ఆ కాలం లోనే కొంతమంది మహాత్ములు కూడా జీవిస్తుంటారు, మంచి గుణాలు కలిగిన కొంతమంది పెద్దలు జీవిస్తుంటారు, సమాజంలో లబ్ధప్రతిష్టులయినవారు, శాస్త్రాన్ని తెలుసుకుని, దానిప్రకారం అనుష్ఠానం చేసేవారు నిరంతరం శాంతికోసం పరితపించేవారు కనబడుతుంటారు. ప్రయత్న పూర్వకంగా అటువంటివారితో స్నేహాన్ని పెంచుకుని వారికి దగ్గరగా జీవించగలగడం, వారితో కలిసి ఉండడం... అనేది మన మనసును మంచి మార్గం వైపు మళ్ళించడానికి తోడ్పడుతుంది. కొన్ని గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలన్నింటినీ చదివి, మంచి విషయాలను బాగా మనసుకు పట్టించుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి ఎంత కాలం పడుతుందో దానికి కోటి వంతు కాలంలో మార్పు తీసుకురాగలగినది–మంచి వ్యక్తులతో కలిసి ఉండడం. అందుకే శంకర భగవత్పాదులు మోహముద్గరంలో–‘‘సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః’’ అంటారు. మంచి మనుషులతో కలిసి ఉన్నంత మాత్రం చేత అది విశేష ప్రభావాన్ని చూపుతుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెబుతుండేవారు... ఏనుగు తనంతట తానుగా ఎవరికీ లొంగదు. కానీ మావటికి లొంగి ఉంటుంది. అయినా నడుస్తూ నడుస్తూ దారిలో కనిపించిన చెట్ల కొమ్మలను తొండంతో విరిచే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ మావటి దాని తొండంమీద చిన్న దెబ్బ వేయగానే తొండాన్ని దించేస్తుంది. అలాగే మంచివారితో కూడి ఉన్న కారణం చేత మనం కూడా మంచి మార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. సమకాలీన సమాజంలో మంచి వ్యక్తులతో కలిసి జీవించడం ప్రయత్నపూర్వకంగా వారి స్నేహాన్ని పొందడం ఎంత గొప్ప లక్షణమో, మంచి పుస్తకాలు ఇంట్లో ఉండడం – అంతమంది మహాత్ములు ఇంట్లో ఉండడంతో సమానం. వివేకానందుడు రాసిన పుస్తకాలు, రామకృష్ణ పరమహంస ప్రవచనాలతో ఉన్న పుస్తకాలు, కంచి కామకోటి పూర్వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర మహా సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణాలు, శృంగేరీ పీఠాధిపతులు భారతీ తీర్ధ మహాస్వామి వారి దివ్యవాక్కులు... ఇటువంటి మహాత్ముల మాటలతో కూడిన పుస్తకాలు ఇంట్లో ఉండడం అంటే అటువంటివారితో కలసి జీవించడంతో సమానం. మీరెప్పుడెప్పుడు అటువంటి వారినుండి నాలుగు మంచి మాటలు విందామని అనుకుంటున్నారో అప్పుడప్పుడు సిద్ధంగా ఉండి మీతో మంచి బోధలు చేయడానికి వాళ్ళు మీ ఇంట్లోనే కుర్చీ వేసుకుని సిద్ధంగా కూర్చోవడంతో సమానం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పుస్తకం.. మా నేస్తం
‘నీళ్లు–నిజాలు’ పుస్తకం చదివితే కలిగిన ఆలోచనలకు ప్రతిరూపమే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన అంటున్నారు మంత్రి హరీశ్‌రావు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి.. ‘మా పల్లె’ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివానో లెక్కేలేదంటున్నారు. ఇంకా.. ‘ద ప్రిన్స్’ చదివి పరిపాలన లక్షణాలను నేర్చుకున్నానని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి.. ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ చదివి నిరాడంబరత అలవర్చుకున్నానని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ చెప్పారు. ఇక, పిల్లల్లో పఠనాసక్తి పెరగాలంటే బోధన కథల రూపంలో సాగాలని ‘కథల తాతయ్య’ ఎన్నవెళ్లి రాజమౌళి అంటున్నారు. సాక్షి మెదక్ : పుస్తకం ఒక విజ్ఞానం.. పుస్తకం ఒక పవిత్ర గ్రంథం.. పుస్తకం ఒక దిక్సూచి.. పుస్తకం చరిత్రలకు సాక్ష్యం.. పుస్తకం భవిష్యత్తుకు ఆధారం.. అలాంటి పుస్తకాలను విజ్ఞానం కోసం చదివే వారు కొందరు.. మార్కుల కోసం చదివేవారు కొందరు.. ఉద్యోగం కోసం చదివేవారు కొందరు.. సరదా కోసం చదివేవారు కొందరు.. కానీ పుస్తకాలను ప్రేమిస్తూ చదివేవారు అరుదుగా ఉంటారు.. అలాంటి వారి కోసమే బుక్ లవర్స్ డే ను నిర్వహిస్తున్నారు.. నేడు ప్రపంచ పుస్తక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం... చరబండరాజు రచించిన మా పల్లె పుస్తకం నాకు అత్యంత ఇష్టం దుబ్బాకటౌన్ : ప్రముఖ విప్లవ రచయిత చరబండ రాజు రచించిన మా పల్లె పుస్తకం నాకు అత్యంత ఇష్టం.. నేను సహజంగా పుస్తక ప్రేమికున్ని. 1981–82లో దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివేరోజుల్లో పీపుల్స్‌వార్ గ్రూపు నాయకుడు శాకమూరి అప్పారావుతో ఏర్పడ్డ పరిచయంతో కారల్ మార్క్స్ రచించిన దాస్క్యాపిటల్తో పాటు రష్యాకు చెందిన అమ్మనవల..మావో ఆలోచనలు చదివాక నాలో అంతర్గతంగా కొత్త ఆలోచనలు, తెలియని శక్తి వచ్చింది. సమాజంలో మార్పు రావాలి దానికి నేను నావంతు బాధ్యత వహించేందుకు విప్లవోద్యమంలో ముందుకు కదిలానని... నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకం విప్లవ రచయిత చరబండ రాజు రాసిన మా పల్లె పుస్తకంను చాలా సార్లు చదివానని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తనకు పుస్తకాలతో ఉన్న అనుబంధాన్ని సాక్షితో పంచుకున్నారు. మా పల్లెపుస్తకంలో పోలీసులు రివార్డులకోసం నక్సలైట్లను వారి కుటుంబాలను బలితీసుకునే సంఘటనలు... పోలీస్ కానిస్టేబుల్ కూతురు రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న యువకుడిని ప్రేమిస్తే ఇది తెలిసి తోటి పోలీసోళ్లు చేసిన హేళనతో తండ్రి, కూతురు చనిపోయిన ఉదాంతంతో పాటు చాలా సంఘటనలు నా మనసును కదిలించాయి... వాసిరెడ్డి సీతాదేవి రాసిన మరీచికలు, అరుణతార, శ్రీశ్రీ రచనలుతో పాటుగా పబ్లిక్ఓరియంటెడ్ పుస్తకాలు వేల సంఖ్యలో చదివాను. పనిఒత్తిడిలో ఎంతో టెన్షన్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఎంత రాత్రయినా సరే నచ్చిన పుస్తకం చదివితే నాకు ప్రశాంతంగా ఉంటుంది. మొదటి నుంచి నేను జర్నలిస్టుగా ఉన్నప్పుడు చాలా పుస్తకాలు చదివాను. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా పుస్తకాలు చదవడం మరువలేను. నా వద్ద వందల పుస్తకాలు భద్రంగా దాచుకున్నా.. ప్రతిరోజు తప్పకుండా ఉదయం 5గంటలకే దినపత్రికలు చదువుతా.. నేను చదివిన మంచి పుస్తకాలతోనే నాకు సమాజం పట్ల మంచి సంబంధాలు.. విలువలు, విజ్ఞానం లభించాయంటున్నారు - దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నీళ్లు నిజాలు’ తోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణలో పేరుగాంచిన నీటిపారుదల ఇంజనీర్ విద్యాసాగర్‌రావు. ఆయన రాసిన ‘నీళ్లు నిజాలు’ అనే పుస్తకంలో తెలంగాణ నుంచి ప్రవహిస్తూ వెళ్తున్న గోదావరి, కృష్ణా నదుల నీరు తెలంగాణ బీళ్లకు రాకపోవడం. ఆంధ్రపాలకుల జలదోపిడీ వివరించారు. తెలంగాణ ప్రాంతంలో కరువు కాటకాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా తీరు.. కళ్లకు కట్టినట్లు ఆ పుస్తకంలో రాశారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరమో ఆ పుస్తకంలో వివరించారు. ఆ పుస్తకం అనేక సార్లు చదివాను. అప్పుడే గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ బీళ్లకు మళ్లించాలి అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఇప్పుడు నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు. – రాష్ట్ర భారీనీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బాగా నచ్చిన పుస్తకం ‘మాకియవెల్లి ప్రిన్స్’ నాకు చిన్నప్పటి నుంచి రాజ్యాలు, రాజులు పరిపాలన విధానం మొదలైన పుస్తకాలు చదవడం బాగా ఇష్టం. అందుకోసమే నేను ఏంఏ పొలిటికల్ సైన్స్‌లో చేరి తర్వాత ఉన్నత ఉద్యోగం పొందాను. ప్రధానంగా మాకియావెల్లి రాసిన ‘ద ప్రిన్స్’ పుస్తకం బాగా నచ్చేది. ఇందులో రాజుకు ఉండాల్సిన లక్షణాలు. ప్రజలను పరిపాలించే తీరు క్షున్నంగా వివరించారు. ప్రతీ నాయకుడు, ఉన్నతాధికారి ఆపుస్తకం చదవాలి. కౌటిల్యుని అర్థశాస్త్రం, ఆరిస్టాటిల్ పొలిటికల్ థాట్ పుస్తకాలు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.. – వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ అబ్దుల్‌కలాం ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’.. కష్టపడితే ఫలితం ఉంటుంది.. అనడానికి అబ్దుల్‌కలాం జీవితమే ఆదర్శం.. భారత రత్న, మాజీ రాష్ట్రపతి అబ్ధుల్‌కలాం సొంత ఊరు రామేశ్వరం మా ఊరుకు సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏ పనికైనా రామేశ్వరం వెళ్లడం మాకు అనవాయితీ.. అప్పుడు అబ్దుల్‌కలాం పెరిగిన తీరు.. కష్టపడిన విధానం మా పెద్దలు చెబుతుండేవారు. కాలానుగుణంగా అబ్దుల్‌కలాం జీవిత చరిత్ర వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివాను. ఆయన జీవితంలోని ప్రతీ సంఘటన నేటితరానికి ఒక పాఠంగా ఉంటుంది. ఎదిగిన కొద్ది ఒదిగే పద్దతి, నిరాడంభరమైన జీవితం ఇలా అబ్దుల్‌కలాం నుంచి ఎన్నొ విషయాలు నేర్చుకోవచ్చు. అందుకే అబ్దుల్ కలాం అన్నా, ఆయన పుస్తకాలన్నా ఇష్టంగా చవుతాను. – జోయల్ డేవిస్, జిల్లా పోలీస్ కమిషనర్ చక్కని పద్య కావ్యం గబ్బిలం.. వర్గల్(గజ్వేల్): నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచే పుస్తక పఠనం ఎంతో ఇష్టం. కవి జాషువా, దాశరథి కృష్ణమాచా ర్య, కరుణశ్రీ రచనలంటే చాలా ఇష్టం. ‘గబ్బిలం’ పద్యకావ్యం నాకు బాగా నచ్చిన పుస్తకం. ఎవరూ ఇష్టపడని ‘గబ్బిలం’ పక్షినే కావ్య వస్తువుగా తీసుకుని కవి జాషువా కలం నుంచి జాలువారిన ఓ చక్కని పుస్తకం. ఎవరూ ఇంట్లోకి రానీయకపోవడంతో ఊరికి దూరంగా, ఓ పాడుపడిన చోట నిరాధరణకు గురైన సామాన్యుడి దైన్య పరిస్థితిని.. గబ్బిలం ద్వారా ఆలయంలో శివుడికి చేరవేసే తీరు అద్భుతం.. సామాన్యుడి వేదనను పద్యకావ్యంలో వర్ణించిన తీరు ఎంతో నచ్చింది. స్ఫూర్తిదాయకం గా నిలిచింది. స్వీయ రచనలకు బా సటగా నిలిచింది. – బట్టపోతుల పరమేశ, తెలుగు పండిట్, నెంటూర్ జెడ్పీ హైస్కూల్ మహనీయుల చరిత్రంటే అమితాసక్తి దుబ్బాక : దుబ్బాక పట్టణ కేంద్రానికి చెందిన దుద్దెడ రాజశేఖర్ ఇంటర్‌తో డీఈడీ పూర్తి చేశాడు. ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని ముందుగా వెళ్లేది స్థానిక గ్రంథాలయంలోకి. అందులో ఉన్న జాతీయ, అంతర్జాతీయ మహనీయుల చరిత్రలను చదవడమంటే చాలా ఇష్టం. స్వామి వివేకానంద, స్వాతంత్య్రోద్యమంలో విరోచిత పోరాటం చేసిన వీరుల చరిత్ర, మహాత్మాగాంధీ, అంబేడ్కర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్ చరిత్రలను చదవడం, అనుకరించడం అమితాసక్తి. వీటితో పాటు శ్రీధర చంద్రశేఖర శాస్త్రీ రచించిన గణిత నిర్వచనాలు ప్రతిరోజు పఠిస్తా. ఇందులో శుద్ధి గణితం, ప్రయుక్త గణితం, అంకగణితం, బీజ గణితం, లేఖా గణితం, వ్యాపార గణితమంటే చాలా ఇష్టం. గణితం నేర్చుకోవడం వల్ల మేధస్సు పెరుగుతుంది. అందుకనే లెక్కలను ప్రతిరోజు పఠిస్తా. మార్కెట్లోకి కొత్త కొత్త పుస్తకాలు వచ్చినా కొనుగోలు చేసుకుని చదువుతా. తనదగ్గర ఉన్న పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా ఇస్తా. గ్రంథాలయంలోనే కాకుండా అప్పుడప్పుడు నెట్లో పుస్తకాలను సేకరిస్తా. మహనీయుల రాసిన పుస్తకాల్లో సామాజానికి కావాల్సిన మంచి మార్గాలను చూపిస్తాయి. – దుద్దెడ రాజశేఖర్, డీఈడీ, దుబ్బాక బాలసాహిత్యానికి బాటలు.. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట) : నేటి బాలలే రేపటి పౌరులు అలాంటి బాలలు మంచి మార్గంలో నడుస్తూ, నీతి, ధర్మాలను చిన్నప్పటి నుంచే అలవరుచుకోవడానికి బాల సాహిత్య పరిషత్ చేస్తున్న కృషి ఎంతో ముఖ్యమైంది. బాల సాహిత్య పరిషత్ ప్రోత్సాహంతో జిల్లాలోని బాల సాహిత్య రచయితలు రచనలు చేస్తూ పుస్తకాలు ప్రచురించడం జరగుతుంది. అంతేకాకుండా సెలవు సమయాల్లో బాలసాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, బాలలకు రచనా మెళకువలను నిర్వహిస్తూ బాలల రచనలకు పుస్తకాలను ముద్రిస్తున్నారు. అలతి అలతి పదాలతో గేయాలు, సరళమైన పదాలను ఉపయోగించి కథలను రాసి బాలలకు అందించడం వలన కలుగు ప్రయోజనాలు చెబుతూ, కొన్ని కథలను పిల్లలకోసం వేదికగా సామాజిక మాధ్యమాలలలో సైతం బాలల కథలను, కవితలను, గేయాలను, పలు పత్రికలకు పంపి ముద్రింపజేస్తున్నారు. బాలసాహిత్య రచయితలు ప్రతినెల బాలవెన్నెల, బాలచెలిమి ముచ్చట్లు, తదితర కార్యక్రమాలకు వెళ్లి, శిక్షణ పోంది బాలసాహిత్యానికి, బాలలకు వారధులుగా నిలుస్తున్నారు రచయితలు. జిల్లాలో 20మందికి పైగా బాలసాహిత్య రచనలు చేస్తూ బాలల లోకంలో విహరిస్తుండడం విశేషం. బాల సాహిత్య పరిషత్ రచయితలు తమ బాలసాహిత్య పుస్తకాలను పాఠశాలలకు ఉచితంగా అందిస్తు, బాలలచే చదివిస్తు బాలసాహిత్య కృషికి పాటుపడుతున్నారు. వివిధ సాహితీ ప్రక్రియల సమావేశాలకు బాలలను తీసుకెళ్లడం విశేషం. ప్రపంచ తెలుగు మహాసభల్లో సైతం బాలలచే కవితాగానం చేయించారు. విజ్ఞాన నేస్తాలు.. హుస్నాబాద్‌రూరల్ : పుస్తకాలు చదువడంతో విజ్ఞానం పెరుగుతుంది. పుస్తక పఠనం ద్వారనే మానసిక ఏకాగ్రత కలుగుతుంది. పుస్తకాలే ఏవరూ లేని సమయంలో నేస్తాలుగా నిలుస్తాయి. మెదడును అలోచింపచేసే శక్తి పుస్తక పఠనం ద్వారనే లభిస్తుందని కవి, రచయిత, గాయకుడు ముక్కెర సంపత్ అభిప్రాయపడుతున్నారు. గ్రంథాలయల వల్ల అనేకమంది పుస్తకాలు చదివి కవులు, రచయితలు అయ్యారు. పుస్తకాలే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసే మార్గాన్ని చూపిస్తాయి, పుస్తకాలలోని ప్రతి వాక్యము మంచి అర్థాన్నిస్తాయి. ఇప్పుడు సెల్ఫోన్లు రావడంతో యువత పుస్తకాలు దూరమవుతున్నారు. గ్రంథాలయల ఏర్పాటు చేస్తే అనేక మంది పుస్తక ప్రియులకు ఆనంద నిలయాలుగా విలసిల్లుతాయి. వృద్ధాప్యంలోని అనేక మంది పుస్తక పఠనం ద్వారా మనశాంతి కలుగుతుంది. ఊరూర గ్రంథాలయలు ఉంటే ఊరంతా విజ్ఞానాన్ని పంచుతాయి. – ముక్కెర సంపత్, కవి, రచయిత మంచి మిత్రుడితో సమానం.. హుస్నాబాద్ : ఒక మంచి పుస్తకం మంచి మిత్రుడితో సమానమని హుస్నాబాద్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెల్ది శ్రీనివాస్ అంటున్నారు. చిన్నప్పటి నుంచే పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుకున్నాను. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పటికి ప్రతిరోజు ఉదయం గ్రంథాలయానికి వెళ్లి దినపత్రికలు, పుస్తకాలు చదవడం అలవాటుగా మార్చుకున్నాను. శారీరక ఆరోగ్యానికి వ్యాయామం ఎలాంటిదో, మానసిక ఆరోగ్యానికి, బుద్ధి వికాసానికి పుస్తకపఠనం అలాంటిది. ప్రతిపుస్తకం ఒక గురువు మాదిరిగా అనేక మంచి విషయాలను తెలియజేయడమే కాకుండా మనకు సరైనమార్గం వైపు పయనింపజేస్తుంది. నెహ్రూ, మండేల, అంబేడ్కర్, కలాం, గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, వివేకానంద లాంటి ప్రముఖుల పుస్తకాలు మనలో నైతిక విలువలు పెంపొందించబడుతాయి. అంతే కాకుండా దేశభక్తి, సేవాగుణం, కష్టపడి పనిచేసే తత్వాన్ని పెంపొంది స్తాయి. నేను ఎక్కువగా వివేకానంద పుస్తకాలు చదువుతాను. ముఖ్యంగా లేవండోయ్ మెల్కోనండి, ధీర యువతకు, స్మృతివనంలో వివేకానంద, ప్రభోదరత్నాకరం మొదలగేనవి ఎంతోగానో తనను ప్రభావితం చేశాయి. దీంతో జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఆసక్తి, ప్రేరణ కలిగింది. ఆ క్రమంలోనే ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించాను. వివేకానంద పుస్తకాలే నా జీవితానికి దిక్సూచిలా పని చేశాయి. - వెల్ది శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, హుస్నాబాద్ -
ఇలా చదివితే కళ్లు పోతాయ్!
లండన్ : అతిగా చదవటం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు శాస్త్రవేత్తలు. సంవత్సరాల తరబడి అలా చదవటం వల్ల కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్ బ్రిష్టల్, కర్డిఫ్ యూనివర్శిటీలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెలుగు చూశాయి. సంవత్సరాల కొద్ది చదువులు చదవటం వల్ల అది నేరుగా కంటిచూపు మీద ప్రభావం చూపుతుందంటున్నారు. వైద్య పరిభాషలో ‘మియోపియా’అని చెప్పబడే కంటి సంబంధ వ్యాధి దాడి చేసే అవకాశం ఉందంటున్నారు. ‘మెండెలియన్ రాండమైజేషన్’ పద్ధతి ద్వారా 40-69 మధ్య వయస్సు కలిగిన దాదాపు 68వేల మందితో ఓ సర్వే నిర్వహించారు శాస్త్రవేత్తలు. ‘మియోపియా’ పెరుగుతూపోతే కంటిచూపు కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. చదువుకునే సంవత్సరాలు పెరిగే కొద్ది వారిలో కంటిచూపు ప్రతి సంవత్సరానికి 0.27 డియోప్ట్రాస్(రిప్రేక్టివ్ ఎర్రర్) మేర నష్టపోయినట్లు వెల్లడైంది. ఇంటర్‌తో చదువు ఆపేసిన వారిలో కంటిచూపు కొంత మెరుగ్గా ఉన్నట్లు తేలింది. చదువులు పెరిగే కొద్ది విద్యార్హత పెరగటంతో పాటు కంటిచూపు తగ్గుతుందని గుర్తించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ర్యాంకుల కోసం పిల్లలకు విశ్రాంతి ఇవ్వకుండా చదివించే తల్లిదండ్రులు కొంచెం ఆలోచిస్తే పిల్లలు ‘కళ్ల’కాలం సుఖంగా ఉంటారని మేథావులు సలహా ఇస్తున్నారు. -
ఆకాశం నుంచి పుస్తక పఠనం
సాక్షి, న్యూఢిల్లీ : కథల పుస్తకాలైనా, శాస్త్ర విజ్ఞాన పుస్తకాలైనా ఎవరికి వారు చదువుకోవడం కన్నా ఎవరైనా చదివి వినిపిస్తే ముఖ్యంగా పిల్లల మెదడుకు బాగా ఎక్కుతుంది. కఠినమైన పదాలు తగిలినప్పుడు అర్థం వివరిస్తూ చదివితే మరింత సులువుగా మెదడులోకి ఎక్కుతుంది. కొంత సమయం అయ్యాక కొందరికి నిద్రకూడా వస్తుంది. వినేవాళ్ల హావభావాలను గమనించకుండా చదివేవాళ్లు వాళ్ల మానాన వాళ్లు పాఠం చెబుతున్నట్లుగా చదువుకుంటూ పోతే కాసేపటికి వినేవాళ్ల గురక వినిపించి చదివే వాళ్ల సమయం వృధా అవుతుంది. అదే వినేవాళ్లు ఆకాశంలోని రంగులను, చుక్కలను చూస్తూ వింటుంటే మరింత సులువుగా మెదడుకు ఎక్కుతుందంటారు. అందుకు చదవడానికి, వినడానికి ఆరుబయట ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో చదివే పుస్తకం సీడీ రూపంలోనే, ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో కూడా అలా చదువుతూ పోవడం కన్నా చదువుతున్న వ్యక్తుల చుట్టూ ఓ కదులుతున్న ప్రపంచం ఉంటే... అదే ఆకాశమో, నక్షత్రాలో ఉంటే మరింతగా వినేవాళ్లను లేదా పాఠకులను ఆకట్టుకుంటుందని భావించిన ‘గ్లోబల్‌స్పేస్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ సంస్థ ఏకంగా ఆకాశంలోని అంతర్జాతీయ ప్రయోగశాలలో వ్యోమగాముల చేతనే పుస్తక పఠన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆకాశంలోని అంతర్జాతీయ ప్రయోగశాలలో భూమ్యాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వ్యోమగాములతో సహా ఏ వస్తువైన చలనంలో ఉంటుందని తెల్సిందే. శూన్యంలో తేలియాడుతున్న పుస్తకాన్ని పట్టుకొని వ్యోమగాములు శూన్యంలో తాము తిరుగుతూ చదివి వినిపిస్తుంటారు. వినేవాళ్లకు వ్యోమగామి చుట్టున్న ప్రపంచం, అంటే ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలు, గ్రహశకలాలు కనిపిస్తుంటాయి. ఇలా ప్రవేశపెట్టిన పుస్తక పఠనం కార్యక్రమానికి ‘స్టోరీ టైమ్ ఫ్రమ్ స్పేస్’ అని పేరు పెట్టారు. కథలు, శాస్త్రవిజ్ఞాన పుస్తకాలు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని ఫౌండేషన్ తెలిపింది. ఇలా పుస్తక పఠనం వినాలనుకునేవాళ్లు ‘స్టోరీ టైమ్ ఫ్రమ్ స్పేస్. కామ్’ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే చాలు. -
ఆకాశంలోని రంగులను, చుక్కలను చూస్తూ వింటుంటే...
-
గడ్చిరోలీ జిల్లా గిన్నిస్ రికార్డు
గడ్చిరోలీ: పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులతో వార్తల్లో నిలిచే మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా అరుదైన ఘనత సాధించింది. గడ్చిరోలీలో శనివారం నిర్వహించిన పుస్తక పఠన కార్యక్రమంలో దాదాపు 7,000 మంది ప్రజలు పాల్గొనడంతో, అత్యధికులు పాల్గొన్న కార్యక్రమంగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. గతేడాది టర్కీలోని అంకారాలో 5,754 మందితో జరిగిన పుస్తక పఠన కార్యక్రమమే ఇప్పటివరకూ తొలిస్థానంలో ఉండేది. మావోల హింసకు పేరుగాంచిన గడ్చిరోలీకి ప్రపంచవ్యాప్తంగా సానుకూల గుర్తింపును తీసుకురావడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ‘గాంధీ విచార్ ఆనీ అహింసా’(గాంధీ ఆలోచనలు–అహింస) అనే మరాఠీ పుస్తకంలోని ఓ భాగాన్ని ప్రజలు చదివినట్లు వెల్లడించారు. జిల్లాలోని విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్‌తో పాటు ప్రత్యేక అతిథులుగా గిరిజన నేత బిర్సాముండా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. -
లైబ్రరీ ఆన్ వీల్స్
గచ్చిబౌలి: విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని బ్లూక్రాస్ సొసైటీ వ్యవస్థాపకురాలు, సినీ నటి అక్కినేని అమల అన్నారు. కొండాపూర్‌లోని చిరెక్ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో మొబైల్ లైబ్రరీ (లైబ్రరీ ఆన్ వీల్స్), ఆడిటోరియాలను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం స్కూల్ మేనేజ్మెంట్ మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ రత్నారెడ్డి మాట్లాడుతూ మొబైల్ లైబ్రరీ వారంలో ఒక రోజు మసీద్‌బండ (శేరిలింగంపల్లి) స్కూల్‌కు వెళ్తుందన్నారు. చిరెక్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్లి ప్రభుత్వ విద్యార్థులతో చదివిస్తారని చెప్పారు. ఈ బస్‌లో తెలుగు, హిందీ పుస్తకాలు, చార్టులు ఉన్నాయి. విద్యార్థుల విరాళాలతో పుస్తకాలు సమకూర్చామన్నారు. ప్రిన్సిపల్ ఇఫ్రత్ ఇబ్రహీం, జోషి తదితరులు పాల్గొన్నారు. -
ఊహాశక్తికి పుస్తకమే మార్గం
పఠనానుభవం కాలేజీ రోజుల్లో హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఓ వెయ్యి పేజీల పుస్తకం చదవడం కన్నా ఒక సినిమా చూడటం సులువు అనే ఆలోచ నతో సినిమాలు విపరీతంగా చూశాను. అప్పుడు పుస్తకాల విలువ నాకు తెలియదు. నేను దర్శకుడి నయ్యాక స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు పుస్తకాల గొప్పతనం అర్థమయింది. సినిమాలో ఓ సన్నివేశం చూసేటప్పుడు మన ఊహాశక్తికి పని ఉండదు. ఎవరో ఊహించి అక్కడ సన్నివేశం రాస్తారు. ఇక సినిమా చూసే ప్రేక్షకులు ఇంకేం ఊహించుకుంటారు! సన్నివేశంలో ఇక్కడ ఇల్లు ఉంటుంది, పిల్లి ఉంటుంది అని వాళ్లే చెప్పేస్తారు. అంతకు మించి ఊహించుకోవడానికి ఏమీ ఉండదు. కానీ పుస్తకం చదివేటప్పుడు ఇమేజినేషన్ పాళ్లు ఎక్కువ. పది మంది ఓ పుస్తకం చదివితే దానిని పదిరకాలుగా ఆలోచిస్తారు. నేను మొట్టమొదటిసారి చదివిన ఇంగ్లీషు పుస్తకం మార్క్ ట్వేన్ ‘ది ఎడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్’. చదివిన తర్వాత మా ఫ్రెండ్స్‌కు దాన్ని యథాతథంగా అప్పజెప్పా. నేను ఇంటర్మీడియట్లో ఉండగా ఓ అమెరికన్ దంపతులు తమ లైబ్రెరీ నుంచి వాళ్ల పుస్తకాలు ఇచ్చారు. అలా మార్క్ ట్వేన్ రచనలన్నీ చదివేశా. అలాగే, రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ నవలలు కూడా నన్ను బాగా ఆకర్షించాయి. పెరల్ ఎస్ బక్ ‘ద గుడ్ ఎర్త్’ నాకు బాగా నచ్చిన పుస్తకాల్లో ఒకటి. అందులో సంభాషణలు సహజంగా ఉంటాయి. నా అదృష్టం ఏంటంటే నవల చదివాక దాని ఆధారంగా వచ్చిన సినిమా చూశా. చైనా వాళ్ల జీవిత విధానం ఎలా ఉంటుందో ఈ నవల కళ్లకు కట్టినట్లు చూపించింది. హెమింగ్వే ‘ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ’ చాలా ఇష్టం. సముద్రంలోని మార్లిన్ అనే చేపకూ, ఓ జాలరికీ మధ్య జరిగే సంఘర్షణ ఈ నవల ఇతివృత్తం. ఎలిజబెత్ బోవన్ అనే నవలా రచయిత దీని గురించి మాట్లాడుతూ-‘ నాట్ ఎ వర్డ్ కెన్ బి రీప్లేస్డ్’ అని వ్యాఖ్యానించారు. ఈ నవల ఆధారంగా ఇదే పేరుతో సినిమా తీశారు. కానీ నాకు ఆ సినిమా నచ్చలేదు. నవల చదువుతున్నప్పుడు కలిగిన అనుభూతి సినిమా చూస్తున్నప్పుడు కలగలేదు. ఆ తర్వాత - నాకు నాటకాలంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో జార్జ్ బెర్నార్డ్ షా నాటకాలంటే ఎగబడేవాళ్లం. ఆయన ‘పిగ్మాలియన్’ బాగా నచ్చింది. ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన ‘షి స్టూప్స్ టు కాన్‌క్వర్’ నాటకం కూడా బాగా నచ్చింది. తెలుగు విషయాని కొస్తే, కాళీపట్నం రామారావు, పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావు రచనలు చాలా ఇష్టం. ముళ్లపూడి వెంకటరమణ రచనలు చాలా ప్రేరణ కలిగించాయి. ఇక, విశ్వనాథ సత్యనారాయణ ‘మా బాబు’ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నేను పెరిగి పెద్దయ్యేవరకూ కూడా ఆ కథలోని పాత్రలు, సన్నివేశాలు నా మనస్సులో అలా ముద్ర పడిపోయాయి. ఇప్పటికీ మరోసారి దాన్ని చదవాలనిపిస్తుంది. - సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు -
రీడ్ అండ్ లీడ్
‘పుస్తకం లేని గది ఆత్మ లేని శరీరం లాంటిది’ అంటారు రోమ్ ప్రముఖ తత్వవేత్త మార్కస్ టులియస్ సిసెరో. ఓ మంచి పుస్తకం విజ్ఞానం, వికాసం వైపు నడిపిస్తుంది. కానీ ప్రస్తుత హైటెక్ యుగంలో పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది. విస్తృతమైన ఇంటర్నెట్, విరుచుకుపడుతున్న గాడ్జెట్స్.. పుస్తకం తెరిచే సమయమే ఉండటం లేదు నేటి తరానికి. ఈ పరిస్థితిని కొంతైనా మార్చి పుస్తకానికి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ‘యానిమల్ రీహాబిలిటేషన్ ప్రొటెక్షన్ ఫ్రంట్’(ఏఆర్‌పీఎఫ్) వారు. ఏటా ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకొని పేద పిల్లలకు వివిధ రకాల పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. వారిని బుక్ రీడింగ్ వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నగరంలోని అనాథ ఆశ్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, మురికి వాడల్లోని పిల్లలు, వారి తల్లిదండ్రులకు పుస్తకం ప్రాముఖ్యాన్ని తెలిపేలా క్యాంపెయిన్ చేపట్టారు. విజ్ఞాన, వినోద పుస్తకాల గురించి వారికి వివరించారు. జంతు సంరక్షణ, భూ సంరక్షణ, జనరల్నాలెడ్జ్ తదితర బుక్స్‌ను పంపిణీ చేశారు. వాటితో పాటు పెన్సిల్స్, పెన్స్ పంచిపెట్టారు. ‘అంతటితోనే మా మిషన్ ఆగిపోదు. ఆయా ప్రాంతాల్లో విద్యపై ఆసక్తి ఉండి, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చదువుకోలేని వారిని బడిలో చేర్పిస్తున్నాం. జీవితానికి ఉపయోగపడే మంచి పుస్తకాలు, వాటి రచయితల విశిష్టతను పిల్లలకు తెలియజెబుతూ వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నాం’ అంటూ చెప్పారు సంస్థ నిర్వాహకుడు నిహార్. ఈ సామాజిక సేవలో నిహార్‌కు తోడుగా ఎంతో మంది వాలంటీర్లు జతకలిశారు. ‘పుస్తకం, విద్య, జీవజాలం, భూమి.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాలంటే వీటి ప్రాధాన్యం నేటితరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అంటారు టీం మెంబర్స్. - సిరి -
నోటికి తాళం వేస్తారా?
ముంబై: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత్‌లో భావ ప్రకటన స్వేచ్ఛను హరించే సంఘటనలు నానాటికి పెరుతుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిష్టాత్మకమైన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్)లో మానవ హక్కుల కార్యకర్త, 'కలర్స్ ఆఫ్ కేజ్' రచయిత అరుణ్ ఫిరీరా బుధవారం నాడు చేపట్టాల్సిన పుస్తక పఠనం కార్యక్రమాన్ని అరగంట ముందు భారత ఇంటెలిజెన్స్ అధికారులు రద్దు చేశారు. ఎందుకు రద్దుచేశారో, ఇంటెలిజెన్స్ అధికారులుగానీ, టాటా ఇనిస్టిట్యూట్‌గానీ అధికారింగా ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. సాహిత్యం గురించి విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు తరచుగా టిస్‌లో సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా పుస్తక పఠనం కార్యక్రం ఉంటుంది. మావోయిస్టు సానుభూతిపరుడైన అరుణ్‌పై గతంలో దేశద్రోహం కేసు నడిచింది. ఆ కేసులో అరెస్టయిన అరుణ్ కొద్దికాలం జైలు జీవితం అనుభవించారు. అప్పుడు అక్కడ తనకు కనిపించిన పరిస్థితులపై అరుణ్ 'కలర్స్ ఆఫ్ కేజ్' పేరిట పుస్తకం రాశారు. ఆ పుస్తక పఠనమే బుధవారం నాటి సాహితీ కార్యక్రమం. టిస్ విద్యార్థి నాయకుల కథనం ప్రకారం.. సరిగ్గా కార్యక్రమం ప్రారంభం కావడానికి అరగంట ముందు సివిల్ దుస్తుల్లో ఉన్న కొంతమంది ఇంటలెజెన్సీ అధికారులు కాలేజీ డీన్ కార్యాలయానికి వచ్చి పుస్తక పఠన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో కాలేజీ నిర్వాహకులు మొత్తం ఆ నాటి కార్యక్రమాలన్నింటిని రద్దు చేశారు. రద్దుకు కారణాలేమిటో మాత్రం అధికారికంగా వివరించలేదు. తనకు దీనిపై అధికారిక వివరణ కావాలంటూ టిస్ డెరైక్టర్ ప్రొఫెసర్ పరశురాం పేరిట అరుణ్ లేఖ రాశారు. దానికి సమాధానం రావాల్సి ఉంది. గత నెలలో ఇదే కాలేజీ యాజమాన్యం 'టాక్ ఆన్ ది కాశ్మీర్' కార్యక్రమాన్ని కూడా అర్ధాంతరంగా రద్దు చేసింది.