పుడమిపై చీకట్లను చీల్చుకుంటూ ఉదయభానుడు మెలమెల్లగా పైకి వస్తూ వెలుగులు పంచే మనోహర దృశ్యం అద్భుతం. అదే అంతరిక్షం నుంచి అయితే అది మరింత అద్భుతం. అబ్బురం. సూర్యోదయాన మహా సముద్రం మీదుగా వెలుగు రేఖలు విచ్చుకుంటున్న ఈ సుందర దృశ్యాన్ని తన కెమెరాలో బంధించిన నాసా వ్యోమగామి రీడ్ వీజ్‌మాన్ మగళవారం ఈ ఫొటోను ట్విట్టర్‌లో ఉంచారు. భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో 40వ అంతరిక్ష యాత్రలో భాగంగా ఉంటున్న వీజ్‌మాన్, మరో ముగ్గురు వ్యోమగాములు రెండు వారాల్లో భూమికి తిరిగి రానున్నారు.