prisoner
-
ఖైదీ కాదు, గూఢచారి!
డమాస్కస్: అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ తీవ్ర భంగపాటుకు గురైంది. అమాయకుడని చెబుతూ సిరియా జైలు నుంచి ఇటీవల ఆ సంస్థ చొరవ తీసుకుని మరీ విడుదల చేసిన ఓ ఖైదీ నిజమైన ఖైదీ కాదని తేలింది. తాజా మాజీ అధ్యక్షుడు అసద్ పాలనలో నిఘా విభాగంలో పని చేసిన అధికారి అని నిజ నిర్ధారణలో వెల్లడైంది. అతని పేరు సలామా మహమ్మద్ సలామా అని, చిత్రహింసలకు, దోపిడీలకే గాక యుద్ధ నేరాలకు కూడా పాల్పడ్డాడని స్థానిక నిజ నిర్ధారణ సంస్థ వెరిఫై–సై తెలిపింది. దాంతో సీఎన్ఎన్ తన తప్పును కప్పిపుచ్చుకునే పనిలో పడింది. ఎందుకంటే సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ క్లారిస్సా వార్డ్, అమె బృందం తిరుగుబాటు బృందంతో పాటు ఇటీవల సిరియా ఇంటలిజెన్స్ కార్యాలయంలోకి వెళ్లింది. అక్కడి ఓ జైలు గదిని తిరుగుబాటుదారులు తెరిచారు. అందులో ఒక వ్యక్తి వణుకుతూ కన్పించాడు. తన పేరు అదెల్ గుర్బల్ అని, మూడు నెలలుగా బందీగా దుర్భర పరిస్థితుల్లో నరకం అనుభవిస్తున్నానని చెప్పుకున్నాడు. అతన్ని వార్డ్ బృందం చొరవ తీసుకుని బయటకు తీసుకొచ్చింది. ఈ దృశ్యాలను సీఎన్ఎన్ ప్రముఖంగా ప్రసారం చేసుకుంది. ఇది తన జీవితంలోనే అత్యంత దారుణమైన ఘటన అని వార్డ్ చెప్పుకొచ్చారు. అసద్ క్రూరమైన పాలన తాలూకు బాధితుల్లో అతనొకడని సీఎన్ఎన్ అభిర్ణించింది. అతనికి ఆహారం అందించి అత్యవసర సేవల విభాగంలో చేర్చినట్టు కథనం ప్రసారం చేసింది. దాంతో పలువురు నెటిజన్లు సీఎన్ఎన్ను అభినందించారు. కానీ ఈ వ్యవహారంపై వెరిఫై–సై అనుమానాలు వ్యక్తం చేసింది. 90 రోజులు ఏకాంతంలో, వెలుతురు కూడా లేని గదిలో తీవ్ర నిర్బంధంలో ఉన్న వ్యక్తి అంత ఆరోగ్యంగా ఎలా కన్పిస్తారని ప్రశ్నించింది. అసలతను స్థానికుడేనని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పింది. అనంతరం కూపీ లాగి, అతను సలామా అని, అసద్ వైమానిక దళం నిఘా విభాగంలో ఫస్ట్ లెఫ్టినెంట్‌గా చేశాడని వెల్లడించింది. వసూళ్ల తాలూకు అక్రమ సంపాదనను పంచుకునే విషయంలో పై అధికారితో పేచీ రావడంతో నెల రోజులుగా జైల్లో ఉన్నట్టు వివరించింది. అతను సైనిక దుస్తుల్లో ఉన్న ఫొటోలను కూడా బయట పెట్టింది. దాంతో సీఎన్ఎన్ కంగుతిన్నది. ఆ వ్యక్తి తమకు తప్పుడు వివరాలు చెప్పి ఉంటాడని అప్పుడే అనుకున్నామంటూ మాట మార్చింది. అతని నేపథ్యం గురించి తామూ లోతుగా విచారణ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. సీఎన్ఎన్ వివాదాస్పద రిపోర్టింగ్ శైలితో అభాసుపాలు కావడం ఇది తొలిసారేమీ కాదు. గతేడాది ఇజ్రాయెల్, గాజా సరిహద్దు వద్ద రిపోర్టింగ్‌కు సంబంధించి కూడా క్లారిస్సా వార్డ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. -
గంజాయి సరఫరా చేస్తున్న ఫార్మసిస్ట్ అరెస్టు
ఆరిలోవ: విశాఖ కేంద్రకారాగారంలో ఖైదీలకు గంజాయి సరఫరా చేసే యత్నంలో ఓ ఉద్యోగి అధికారులకు చిక్కాడు. జైలు సిబ్బంది తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్ వివరాలు ప్రకారం.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కడియం శ్రీనివాస్ ఫార్మసిస్ట్‌గా ఏడాది నుంచి డిప్యుటేషన్‌పై విశాఖ కేంద్ర కారాగారం ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ జైలుకు సంబంధించి ప్రత్యేకంగా నియమించిన వైద్యులు, ఫార్మసిస్టులు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై వచ్చినవారే పనిచేయాల్సి ఉంటుంది.శ్రీనివాస్ మంగళవారం డ్యూటీకి వచ్చేటప్పుడు భోజనం క్యారేజీ తీసుకొచ్చారు. అందులో గంజాయి ఉన్నట్లు జైలు ప్రధాన ద్వారంవద్ద సిబ్బంది తనిఖీల్లో బయటపడింది. ప్రధాన ద్వారం సెక్యూరిటీ సిబ్బంది జైలులో పనిచేస్తున్న ఉద్యోగుల రాకపోకల సమయంలో తనిఖీలు చేస్తుంటారు. దీన్లోభాగంగా చేపట్టిన తనిఖీల్లోనే శ్రీని వాస్ క్యారేజీలో 90 గ్రాముల గంజాయి పట్టుబడింది. దీంతో శ్రీనివాస్‌పై ఆరిలోవ పోలీసులకు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. గంజాయి స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. రిమాండ్‌పై సెంట్రల్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. -
బెయిల్ కాదు.. జైలు
సాక్షి, హైదరాబాద్: ‘జైలు కాదు.. బెయిల్’అన్న సుప్రీంకోర్టు న్యాయసూత్రం ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న వారిలో రెండింట మూడో వంతు విచారణ ఖైదీలే. బెయిల్ లాంటి అంశాల్లో సత్వర విచారణ జరపాలని న్యాయ కోవిదులు చెబుతున్నా అమలు మాత్రం ఆమడ దూరం అన్నట్టుగానే ఉంది. బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక, పూచీకత్తు ఇచ్చేవారు లేక విడుదలకు నోచుకోని వారు కూడా ఉండటం మరింత దారుణం.విచారణ జరిగి శిక్షపడే నాటికి.. వారికి పడే శిక్షాకాలం కూడా పూర్తవుతున్న వారు కొందరు ఉండగా, ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలవుతున్న వారు మరికొందరు. అంటే నేరం చేయకున్నా కొందరు జైళ్లలో మగ్గుతున్నారన్న మాట. ఏళ్లుగా జైళ్లలో ఉండి ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలైనా.. వారి జీవితం, కుటుంబాలు ఆగమైనట్టే కదా అనేది బాధితుల వాదన. మరి ఈ విచారణ ఖైదీల సమస్యకు పరిష్కారం ఎప్పుడు.. ఎలా.. అన్నది ప్రశ్నార్థకం. అయితే గత నెల జైలు అధికారులకు సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు కొంత ఉపశమనం కలిగించనున్నాయి. యువతే అధికం... విచారణ ఖైదీల్లో అత్యధికం యువతే. 2022 గణాంకాలను పరిశీలిస్తే.. 18–30 ఏళ్ల మధ్య ఖైదీలు 2,15,471 మంది ఉండగా, 30–50 ఏళ్ల మధ్య 1,73,876 మంది ఉన్నారు. మొత్తం 4,34,302 విచారణ ఖైదీల్లో రెండింట మూడోవంతు(66శాతం) యువతే ఉండటం గమనార్హం.విచారణా ఖైదీల హక్కులు.. ⇒సత్వర విచారణ పొందేందుకు అర్హులు ⇒హింస, అమానవీయ ప్రవర్తనకు గురికాకుండా హక్కు ఉంటుంది ళీ సరైన కారణాలను అందించకపోతే జైలు నుంచి కోర్టుకు తరలించేటప్పుడు సంకెళ్లు వేయడానికి వీలులేదు. ⇒కేసు విషయంలో కోర్టుకు దరఖాస్తు చేసుకొని ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు. ⇒అరెస్టు చేసే సమయంలో వారి కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడికి తెలియజేయాలి. ⇒నిర్దిష్ట భద్రతా ప్రమాణాలకు లోబడి కుటుంబ సభ్యులకు ఖైదీని సందర్శించే అవకాశం.సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. 2023లో, అంతకుముందు.. ‘జైలు కాదు.. బెయిల్’అనే సూత్రం ప్రమాణంగా విచారణ సాగాలి. విచారణ ఖైదీలతో జైళ్లు కిక్కిరిసిపోవడం న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఒక వ్యక్తిని కోర్టులో నిలబెట్టి, దోషిగా నిరూపించాలని పోలీసులు ఎక్కువగా భావిస్తున్నారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయం ప్రమాదకరం. ఇది పేద, బలహీన వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బెయిల్ పొందినా ఆర్థిక స్తోమత, పూచీకత్తు ఇచ్చేవారు లేక చాలా మంది జైళ్లలోనే మగ్గుతున్నారు. ఈ కారణాలతో జైళ్లలో సంఖ్య పెరిగిపోతోంది. 2024, ఆగస్టులో... దేశవ్యాప్తంగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్న అండర్ ట్రయల్ ఖైదీలను త్వరితగతిన విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జైళ్ల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం. కొత్త క్రిమినల్ న్యాయచట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 479 ప్రకారం సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మూడు నెలల్లోగా అండర్ ట్రయల్ ఖైదీల దరఖాస్తులను ప్రాసెస్ చేయాలి. అయితే, ఈ నిబంధన మరణశిక్ష లేదా జీవిత ఖైదు వంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన అండర్ ట్రయల్‌లకు వర్తించదు. – సుప్రీంకోర్టుఅండర్ ట్రయల్ ఖైదీలకు లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ ద్వారా న్యాయ సాయం అందిస్తాం. దీని కోసం జైళ్లకు కూడా వెళతాం. న్యాయ సాయం కావాల్సిన వారికి న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం. బెయిల్ వచి్చన తర్వాత ఒకవేళ పెద్ద మొత్తంలో షూరిటీలు చెల్లించలేని వారు ఉంటే.. కోర్టును సంప్రదించి ఆ మొత్తాన్ని తగ్గించేలా తోడ్పాటునందిస్తాం. –తెలంగాణ లీగల్ సరీ్వసెస్ అథారిటీ -
జైలులో ఖైదీ మృతి...పరిహారంతో ఆ కుటుంబానికి ఊరట
సాక్షి, హైదరాబాద్: జైలులో ఖైదీ మృతి చెందగా, కోర్టు తీర్పుతో ఆ కుటుంబానికి ఊరట లభించింది. బాధిత కుటుంబానికి రూ.6.20 లక్షల పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2012, జూలై 4 నుంచి 3 శాతం వడ్డీతో కలిపి ఆర్డర్ ఇచ్చిన మూడు నెలల్లో అందజేయాలని తేల్చిచెప్పింది. కేసు వివరాల్లోకి వెళితే.. ఓ కేసులో ఐపీసీ 302 కింద నేరం రుజువు కావడంతో మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కుసంగి గ్రామానికి చెందిన కె.వెంకయ్యకు ట్రయల్‌కోర్టు జీవితఖైదు విధించింది. చర్లపల్లి జైలులో ఉంటున్న వెంకయ్యపై 2012, జూలై 4న మరో ఖైదీ డి.నర్సింహులు కత్తెరతో దాడి చేశాడు. గాయపడిన వెంకయ్యను గాంధీ ఆస్పత్రికి తరలించగా, అదే రోజు మృతి చెందాడు. జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడంటూ భార్య జయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరినా.. అందుకు నిరాకరించిందని పేర్కొన్నారు. దీంతో విధిలేక హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, రూ.10 లక్షలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ న్యాయవాది పల్లె శ్రీహరినాథ్ వాదనలు వినిపిస్తూ జైలు అధికారుల బాధ్యతారాహిత్యమే వెంకయ్య మృతికి కారణమన్నారు. జైలు అధికారులు నిబంధన మేరకే వ్యవహరించారని, ఇందులో వారి నిర్లక్ష్యం ఏమీ లేదని హోంశాఖ తరఫున జీపీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి మృతిచెందే నాటికి 55 ఏళ్ల వెంకయ్య నెలకు రూ.7,200 సంపాదిస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం.. లెక్కగట్టి రూ.6,33,600 అవుతుందని పేర్కొన్నారు. ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.7.2 లక్షల అవుతుందని లెక్కించారు. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు 2018లో రూ.లక్ష చెల్లించినందున మిగిలిన రూ.6.2 లక్షల అందజేయాలని ఆదేశించారు. -
ఖైదీలు నెలకు ఎన్ని లేఖలు రాయవచ్చు?
జైలు ప్రపంచం చాలా విచిత్రమైనది. చాలామంది జైళ్ల గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ ఎవరూ జైలుకు వెళ్లాలని కలలో కూడా అనుకోరు. ఎన్సీఆర్బీ అందించిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా 2020’ నివేదికలోని వివరాల ప్రకారం 2020 చివరి నాటికి దేశవ్యాప్తంగా 4.83 లక్షల భారతీయ పౌరులు వివిధ జైళ్లలో ఉన్నారు. వీరిలో 76 శాతానికి పైగా అండర్ ట్రయల్ నిందితులు కాగా, 23 శాతం మంది దోషులుగా తేలిన వారున్నారు. ఈ అండర్ ట్రయల్ ఖైదీలు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు కాగా, శిక్ష పడిన వారిలో ఎక్కువ మంది 30 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే ఉన్నారు. జైళ్లలో ఖైదీల సంఖ్య ఏటా పెరుగుతోంది. కాగా జైలులోని ఖైదీలు తమ కుటుంబాలకు నెలకు ఎన్ని ఉత్తరాలు రాయవచ్చనేది చాలామందిలో ఉండే సందేహం. జైలు నిబంధనల ప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రతి 15 రోజులకోసారి లేఖ రాయవచ్చని ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జైలు సూపరింటెండెంట్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రతి ఖైదీ నెలకు రెండుసార్లు లేఖ రాయవచ్చు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీ తన కుటుంబ సభ్యులకు లేదా దగ్గరి బంధువులకు మాత్రమే లేఖలు రాయవచ్చు. దీనికి సంబంధించిన రికార్డును జైల్లో భద్రపరుస్తారు. కాగా జైలులోని ఖైదీలు లేఖలు రాసేటప్పుడు అవి జైలుకు, అక్కడి నిబంధనలకు విరుద్ధంగా ఉండకూడదు. జైలు నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ఖైదీ లేఖ రాస్తే ఆ లేఖను జైలు అధికారులు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటారు. -
యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించిన యావజ్జీవ ఖైదీ
-
జైలు నుంచే చదువు.. పీజీ గోల్డ్ మెడల్ కైవశం
కోవెలకుంట్ల: జైలు శిక్షపడిన యువ ఖైదీ అక్కడి అధికారుల సహకారం, పట్టుదలతో లా కోర్సు చదివి న్యాయవాద పట్టాతో తన తండ్రిని నిర్దోషిగా నిరూపించేందుకు న్యాయస్థానంలో వాదించి గెలిచిన ఘటనను 20 ఏళ్ల క్రితం స్టూడెంట్ నంబర్ –1 సినిమాలో చూశాం. అదే తరహాలో యావజ్జీవ కారాగార శిక్షపడిన ఓ యువకుడు నిజ జీవితంలో విజయం సాధించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన దూదేకుల నడిపి మాబుసా, మాబున్నీ కుమారుడు మహమ్మద్ రఫీ 2014లో బీటెక్ చదివేవాడు. ఆ సమయంలో ప్రేమ వ్యవహారంలో ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి హత్యకు కారకుడని భావించి ఆ యువకుడిపై పోలీస్‌స్టేషన్‌లో హత్యకేసు నమోదైంది. కోర్టులో విచారణ అనంతరం 2019 జూలై నెలలో రఫీకి జీవితఖైదు విధించారు. అప్పటి నుంచి కడప కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఖైదీలను సైతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అక్కడి జైలు అధికారులు చదువుపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించారు. పది చదివిన వారిని దూర విద్య కోర్సుల ద్వారా పై చదువులకు ప్రోత్సహించారు. శిక్షపడే నాటికే డిగ్రీ పూర్తి చేసిన మహమ్మద్ రఫీకి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, ఇతర జైలు అధికారులు ప్రోత్సాహమందించారు. 2020లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేసేందుకు అవకాశం కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంకు మహమ్మద్ రఫీ ఎంఏ సోషియాలజీలో అడ్మిషన్ పొందాడు. వివిధ రకాల పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను సమకూర్చుకుని జైలులోనే నాలుగు గోడల మధ్య కష్టపడి చదివాడు. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు 2022లో పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని యూనివర్సిటీ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎంఏ సోషియాలజీలో మొదటి ర్యాంకుతో గోల్డ్ మెడల్ కైవశం చేసుకున్నాడు. జైలులో ఉంటున్న రఫీకి పీజీ పట్టా గోల్డ్ మెడల్ ప్రదానం చేయాలని యూనివర్సిటీ అధికారులు ఇటీవల జైలు అధికారులకు సమాచారం అందించారు. కోర్టు అనుమతితో నాలుగు రోజులు బెయిల్ మంజూరు కావడంతో గురువారం హైదరాబాద్‌లోని అంబేడ్కర్ యూనివర్సిటీలో వైస్ చాన్స్‌లర్ జగదీశ్ ఆధ్వర్యంలో గోల్డ్‌మెడల్ బహూకరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ తన జీవితం జైలు పాలైనప్పటికీ చదువుపై ఉన్న మమకారంతో పట్టుదలతో పీజీ సాధించానన్నారు. తన తల్లిదండ్రులకు ఈ గోల్డ్‌మెడల్ అంకితం చేస్తున్నట్లు తెలిపారు. -
ఖైదీ బిడ్డకు తల్లైన పోలీసమ్మ
-
ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇచ్చాను..!
తమిళనాడు: పెరోల్‌పై బయటకు వెళ్లి మళ్లీ జైలుకు వచ్చిన జీవిత ఖైదీ సంచలన ఆరోపణలు చేశాడు. జైలులో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు రూ.3 వేల చొప్పున ఇచ్చినట్లు అధికారులకు తెలిపాడు. వివరాలు.. సేలం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీ, చైన్నె తండయార్‌పేటకు చెందిన హరి అలియాస్ హరికృష్ణన్ (35) గతేడాది జూన్‌న్‌లో 3 రోజుల పెరోల్‌పై వెళ్లాడు. అతన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన వార్డెన్ రామ కృష్ణన్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ కేసులో జీవిత ఖైదీ హరిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. సోమవారం రాత్రి సేలం సెంట్రల్ జైలుకు తీసుకొచ్చి కేసు నమోదు చేశారు. ఖైదీ హరి అపస్మారక స్థితికి చేరుకోగానే జైలు అధికారులకు వాయిస్ మెసేజ్ పంపాడు. పెరోల్‌పై వెళ్లి తిరిగి వచ్చినందుకు అధికారులకు డబ్బులు చెల్లించాలని.. చిత్రహింసలకు గురిచేశారని అందులో పేర్కొన్నాడు. కోయంబత్తూరు జైలు శాఖ డీఐజీ షణ్ముగసుందరం విచారణ చేపట్టారు. విచారణ జరిపి పెరోల్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు మెమో ఇచ్చారు. త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో పెరోల్‌పై వచ్చిన ఖైదీని 3 రోజుల పాటు సెల్ఫోన్లో మాట్లాడుతూ చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరు వార్డెన్లు కూడా పట్టుబడ్డారు. వారిపై కూడా విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు. పెరోల్ తర్వాత జైలుకు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇద్దరికి ఒక్కొక్కరికి రూ. 3 వేలు చెల్లించినట్లు ఖైదీ హరి అధికారులకు తెలిపాడు. -
చట్టాల్లో మార్పులు అవసరం
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఖైదీలను దండించడానికే రూపొందించిన బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని, కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా తెలిపారు. విశాఖలో సాయిప్రియ రిసార్ట్‌లో రెండు రోజుల పాటు జరిగే అన్ని రాష్ట్రాల జైళ్ల అధిపతుల 8వ జాతీయ సదస్సుకు సోమవారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి మాట్లాడుతూ.. దేశంలో జైళ్ల సామర్థ్యం కంటే 25 శాతం అధికంగా ఖైదీలు ఉన్నట్టు చెప్పారు. అందులో 80 శాతం మంది అండర్ ట్రయిల్ ఖైదీలేనని వెల్లడించారు. పూర్వకాలం నాటి చట్టాల కారణంగా ఈ సమస్య తలెత్తుతోందన్నారు. జైళ్లు దండించడానికి కాదని, ఖైదీలలో పరివర్తన తీసుకువచ్చి వారికి పునరావాసం కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిటిషర్ల ఆలోచనా ధోరణితో రూపుదిద్దుకున్న చట్టాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టినట్టు తెలిపారు. కేసు దర్యాప్తు నుంచి విచారణ వరకు అన్నీ వేగవంతంగా జరిగేలా మార్పులు చేస్తున్నట్టు వివరించారు. కొత్త బిల్లుతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో జైళ్ల ఆధునికీకరణకు రూ.950 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్రమంత్రి వెల్లడించారు. రూ.100 కోట్లతో చేపట్టిన జైళ్ల కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోందన్నారు. ఇప్పటికే 1,100 జైళ్లలో కంప్యూటరీకరణ పూర్తయిందన్నారు. కేంద్ర కారాగారాల్లో నైపుణ్య కేంద్రాలు సదస్సుకు హాజరైన రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జైలు అభివృద్ధి నిధి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాలు జైలు అభివృద్ధి నిధి ఖాతాలోకి వెళ్తాయని చెప్పారు. ఆ నిధి ఖైదీల సంక్షేమానికి వినియోగిస్తున్నట్టు చెప్పారు. అన్ని కేంద్ర కారాగారాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. గర్భిణి ఖైదీలకు, వారి పిల్లలకు, వృద్ధ మహిళా ఖైదీలకు ప్రత్యేక ఆహారాన్ని అందజేస్తున్నామని వెల్లడించారు. సదస్సులో బీపీఆర్ అండ్ డీ డైరెక్టర్ జనరల్ బాలాజీ శ్రీవాస్తవ్, రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్‌కుమార్ గుప్తా పాల్గొన్నారు. -
పీటీ వారంట్!
అటాచ్ చేయనున్న ఆస్తుల వివరాలు.. ఏ–1 చంద్రబాబు కరకట్ట నివాసం (లింగమనేని రమేశ్ కుటుంబం పేరిట ఉన్న ఈ నివాసాన్ని చంద్రబాబు క్విడ్ ప్రో కో కింద పొందారు) ఏ–2 పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేరిట అమరావతిలో ఉన్న 75,888 చదరపు గజాల ఇళ్ల స్థలాలు. ఏ–2 నారాయణ భార్య పొత్తూరి ప్రమీల, కుటుంబ సభ్యులు, బంధువులు రాపూరి సాంబశివరావు, ఆవుల మునిశంకర్, వరుణ్ కుమార్ ఇప్పటివరకు పొందిన కౌలు మొత్తం రూ.1,92,11,482. సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగిన కుంభకోణాలపై దృష్టి సారించిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో మాజీ సీఎం చంద్రబాబును విచారించేందుకు పీటీ వారంట్ కోరుతూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ను ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ భావిస్తోంది. ఈ కేసులో పూర్తి ఆధారాలతో చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌తోపాటు వారి బినామీలైన లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ అంజినీ కుమార్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఇంతవరకు వారిని అరెస్ట్ చేయలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబును ఇందులోనూ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ నిర్ణయించింది. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో కూడా రిమాండ్ ఖైదీగా పరిగణించాలని న్యాయస్థానాన్ని కోరాలని నిర్ణయించి పీటీ వారంట్ దాఖలు చేసింది. అందుకు న్యాయస్థానం అనుమతిస్తే ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో కూడా చంద్రబాబు అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఆ కేసులో కూడా ఆయన్ని విచారించేందుకు తమ కస్టడీకి కోరనుంది. దీంతో కేసు దర్యాప్తులో మరింత పురోగతి సాధించవచ్చని సీఐడీ భావిస్తోంది. చంద్రబాబు, చినబాబు భూ దోపిడీ టీడీపీ హయాంలో జరిగిన భారీ కుంభకోణాలకు మరో ఉదాహరణ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారంగా మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారు. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ కలసి అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. వారి బినామీ లింగమనేని రమేశ్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఇష్టానుసారంగా మెలికలు తిప్పి సింగపూర్ కన్సల్టెన్సీ రూపొందించినట్లు మభ్యపుచ్చారు.అప్పటివరకు రూ.177.50 కోట్లుగా ఉన్న తమ 148 ఎకరాల మార్కెట్ విలువను అమాంతం రూ.877.50 కోట్లకు పెంచుకున్నారు. అమరావతి రాజదాని నిర్మాణం పూర్తయితే ఆ భూముల మార్కెట్ విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు పెరిగేలా పథకం వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములు వీటికి అదనం. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కుంభకోణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా చంద్రబాబు వాటా కల్పించారు. ఆ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉండటం గమనార్హం. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను కొనుగోలు చేసినట్లు చూపించి ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించారు. ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ,ఏ–6 లోకేశ్ ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణాన్ని సిట్ పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి (ఏ–1)గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–6గా లోకేశ్‌పై కేసు నమోదు చేసింది. చంద్రబాబు, నారాయణ బినామీలు లింగమనేని రమేశ్‌ను ఏ–3గా, లింగమనేని రాజశేఖర్ ఏ–4గా, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజని కుమార్‌ను ఏ–5గా పేర్కొంది. చంద్రబాబు, నారాయణ ఆస్తుల అటాచ్ ఈ కేసులో చంద్రబాబు, నారాయణ బినామీల ద్వారా పొందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఆ మేరకు సీఐడీ ప్రతిపాదనను ఆమోదిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్విడ్ ప్రోకో కింద లింగమనేని రమేశ్ నుంచి చంద్రబాబు పొందిన కరకట్ట నివాసంతోపాటు నారాయణ కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తులను అటాచ్ చేయనుంది. -
Babu In Jail: తొలి రోజు గడిచిందిలా..
సాక్షి, అమరావతి, సాక్షి, రాజమహేంద్రవరం: పొద్దున్నే యోగా.. కాసేపు పత్రికల పఠనం... ప్రత్యేకంగా తెప్పించిన ఆహారం... రెండు సార్లు వైద్య పరీక్షలు.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా తొలిరోజు గడిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టై రిమాండ్ ఖైదీ 7691గా ఉన్న ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా, పూర్తి భద్రతతో కూడిన ప్రత్యేక గదిలో ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రత్యేకంగా సహాయకుడు.. వంటకు ప్యాంట్రీ కార్ న్యాయస్థానం ఆదేశాలతో జైలు అధికారులు చంద్రబాబుకు స్నేహ బ్యారక్‌లో ప్రత్యేక గదిని ఆదివారం రాత్రే కేటాయించారు. అందులో వెస్ట్రన్ మోడల్ టాయిలెట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు ప్రత్యేకంగా ఓ సహాయకుడిని అందుబాటులో ఉంచారు. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ఆయన కాన్వాయ్‌లో ఉండే ప్రత్యేక ప్యాంట్రీ కార్‌ను జైలుకు సమీపంలో ఉంచారు. నారా లోకేష్ రాజమహేంద్రవరంలోనే ఓ టీడీపీ నేత ఇంటి వద్ద మకాం వేసి చంద్రబాబుకు అవసరమైనవన్నీ సమకూరుస్తున్నారు. ఉదయం అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్‌తో పాటు వేడినీళ్లు, బ్లాక్ కాఫీని పంపారు. మధ్యాహ్న భోజనంలో 100 గ్రాముల బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగు పంపించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీ తాగేందుకు వేడినీళ్లు అందజేసినట్లు తెలిసింది. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం, మధ్యాహ్న భోజనం అనంతరం చంద్రబాబుకు రెండు సార్లు వైద్య పరీక్షలు చేశారు. ఆయన ఉంటున్న స్నేహ బ్యారక్‌కు ఎదురుగానే జైలుకు సంబంధించిన ఆస్పత్రి ఉండటంతో అక్కడ వైద్య పరీక్షలు చేపట్టారు. రాత్రి కూడా ప్యాంట్రీ కార్ నుంచే పుల్కాలు, పెరుగు తెప్పించి ఆహారాన్ని అందించారు. నిరంతరం 1 + 4 భద్రత జైలు అధికారులు చంద్రబాబు భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన ఉన్న జైలు గది వద్ద 24 గంటలపాటు విధులు నిర్వహించేలా 1 + 4 భద్రతను వినియోగించారు. జైలు లోపల, చుట్టుపక్కల పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు కల్పించారు. కట్టుదిట్టమైన భద్రతతోపాటు జైలులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో పూర్తిస్థాయి భద్రత నడుమ ఉన్నారు. తొలిరోజు ములాఖత్‌లు లేవు సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును తొలిరోజు ఎవరూ కలవలేదు. జైలు నిబంధనల ప్రకారం వారానికి రెండు ములాఖత్‌లను అనుమతిస్తారు. సోమవారం ములాఖత్ కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కుమారుడు లోకేష్ మంగళవారం ఆయన్ను ములాఖత్‌లో కలిసేందుకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. -
చికెన్, పిజ్జా, వేడి ఆహారం కావాలంటూ ఖైదీల ఆందోళన.. జైలు గార్డును బంధించి..
జైలులోని ఖైదీలకు మంచి ఆహారం ఇవ్వరనే ఆరోపణలను వింటుంటాం. ఖైదీలు దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటారని కూడా చాలామంది చెబుతుంటారు. అయితే ఇటీవల మిచిగన్‌లోని ఒక జైలులో ఖైదీలకు అందించే ఆహారం విషయంలో ఆందోళన చెలరేగింది. ఇక్కడి సెయింట్ లూయీస్ ఫెసిలీటీలోని ఖైదీలు మంచి ఆహారం కోసం హడలెత్తించే పనిచేశారు. ఖైదీలంతా కలసి 70 ఏళ్ల గార్డును బంధించారు. తరువాత జరిగిన పరిణామాల అనంతరం ఆ గార్డుకు ఎటువంటి హాని తలపెట్టకుండా, మర్నాటి ఉదయం విడిచిపెట్టారు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు జైలును తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ జైలులో మొత్తం 700 మంది ఖైదీలు ఉన్నారు. వీరు తమకు ఆహారంలో చికెన్, పిజ్జాలు కావాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతీరోజూ వేడి ఆహారం వడ్డించాలని కోరారు. వీటిని తక్షణం నెరవేర్చాలని కోరుతూ 70 ఏళ్ల గార్డును బంధించారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఈ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2021లో ఇక్కడి ఖైదీలు అల్లర్లకు పాల్పడి, జైలులోని కిటికీలను ధ్వంసం చేశారు. ఈ నేపపద్యంలో జైలు ఉన్నతాధికారి డేల్ గ్లాస్ రాజీనామా చేశారు. ఇది కూడా చదవండి: అడ్రస్ అడిగిన డెలివరీ బాయ్‌పై దాడి.. గంటపాటు మహిళ హైడ్రామా! -
ఖైదీ హనీమూన్‌కి పెరోల్
శివాజీనగర: హత్య కేసులో జైలు శిక్షకు గురైన ఓ కోలారు జిల్లావాసికి కోర్టు జీవితఖైదు విధించడంతో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఏప్రిల్ 5న కోర్టు ఆదేశంతో పెరోల్ (సెలవు) పొంది ఏప్రిల్ 11న పెళ్లి చేసుకున్నాడు. ఏప్రిల్ 20వ తేదీకి సెలవు ముగిసింది. అయితే ఆ సమయం చాలదని, హనీమూన్‌కి 60 రోజులు సెలవు కావాలని హైకోర్టులో పిటిషన్వేశాడు. జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న ధర్మాసనం ఈ అర్జీని విచారించింది. అతనికి పెరోల్‌ను మంజూరు చేస్తూ షరతులను కూడా విధించింది. ప్రతి ఆదివారం ఒకసారి నేరం జరిగిన పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశించారు. -
ఐఏఎస్ హత్య కేసు నిందితుడి విడుదల దుమారం..బిహార్ సీఎంపై విమర్శలు
బిహార్‌లోని జైలు మాన్యువల్‌ను సవరించిన కొద్ది రోజుల్లోనే ఐఏఎస్‌ను హతమార్చిన వ్యక్తి కూడా విడుదలైందుకు దారితీసింది . దీంతో నితీష్‌కుమార్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నెల ప్రారంభంలోనే నితీష్ ప్రభుత్వం విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన దోషులకు శిక్షను తగ్గించడాన్ని నిషేధించిన నిబంధనను తొలగించింది. ఈ మేరకు ఏప్రిల్ 20న బిహార్ రాష్ట్ర శిక్షా ఉపశమన మండలి సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని 14 లేదా 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్న సుమారు 27 మంది ఖైదీలను విడుదల చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది బిహార్ ప్రభుత్వం. ఐతే ఆ ఖైదీలలో 1994లో అప్పటి బ్యూరోక్రాట్ జీ కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ కూడా ఉన్నారు. నిబంధనల మార్పుతో ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయడం పెను దుమారానికి దారితీసింది. ఆ ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య ఆంధప్రదేశ్‌లోని మెహబూబ్ నగర్‌కు చెందని నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి. అతన్ని అత్యంత దారుణంగా హత్య చేసిని మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్‌ను విడుదల చేసేందుకు నితీష్ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతో బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయవతి ట్విట్టర్లో ఆ నిబంధనల మార్పును దళిత వ్యతిరేకంగా పేర్కొంది. ఆ నిందితుడి విడుదల దళిత సమాజానికి కోపం తెప్పిస్తుందని, ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు మాయవతి. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయా కూడా ఈ విషయమై నితీష్ కుమార్‌పై విరుచుకుపడ్డారు. కాగా జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్ ఒక ట్వీట్లో.. నియమాలలో మార్పు సామాన్యులు, ప్రత్యేక ఖైదీలను ఏకరీతి ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఉద్దేశించిందేనని సమర్థించుకునే యత్నం చేశారు. మరోవైపు రెండేళ్లుగా రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందని పలువురు రాజకీయ నాయకులు సింగ్‌ను త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదీగాక బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తన మాజీ సహోద్యోగికి అండగా ఉటానని పలు సందర్భాలలో వ్యాఖ్యానించడం గమనార్హం. श्री आनंद मोहन जी की रिहाई पर अब भाजपा खुलकर आई है। पहले तो यू पी की अपनी बी टीम से विरोध करवा रही थी। बीजेपी को यह पता होना चाहिए कि श्री नीतीश कुमार जी के सुशासन में आम व्यक्ति और खास व्यक्ति में कोई अंतर नही किया जाता है। श्री आनंद मोहन जी ने पूरी सजा काट ली और जो छूट किसी… pic.twitter.com/t58DkvoK3r — Rajiv Ranjan (Lalan) Singh (@LalanSingh_1) April 25, 2023 (చదవండి: ట్రక్కు అదుపుతప్పడంతో నుజ్జునుజ్జు అయిన పెట్రోల్ పంపు) -
చెత్త వేసొస్తానని పారిపోయి.. పోదల్లో నిద్రపోయిన ఖైదీ.. చివరికి
సాక్షి, పరకాల(హనుమకొండ): చుట్టూ పచ్చనిపొలాలు.. పంటకాల్వల్లో ఉరకలేస్తున్న జలాలు.. ఆ పక్కనే చీమ చిటుక్కున్నా వినిపించేంత నిశ్శబ్దం అలుముకున్న చెట్లపొదలు. ఆ పొదల్లో ఓ వ్యక్తి ఆదమరిచి నిద్రపోతున్నాడు. ఏదో అలికిడికి ఉలిక్కిపడి లేచి చూసేసరికి చుట్టూ సాయుధులైన పోలీసులు. తప్పించుకోబోయి చివరికి పోలీసులకు చిక్కాడు. జైలు సిబ్బందిని నమ్మించి పారారైన రిమాండ్ ఖైదీ చివరికి అతడి భార్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులకు పట్టుబడ్డాడు. 2019లో మహదేవ్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలికపై అత్యాచారం కేసులో ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామానికి చెందిన సైకిల్ మెకానిక్ షేక్ గౌస్ పాషా అలియాస్ చోటు(22) కరీంనగర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతుండటంతో ఈ ఏడాది మార్చి 18న పోలీసులు అతడిని అరెస్టు చేసి పరకాల సబ్‌జైలుకు తరలించారు. అప్పటి నుంచి జైలు సిబ్బందితో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో మున్సిపల్ వాహనంలో చెత్తవేయడానికని తాజాగా సోమవారం తెల్లవారుజామున 6.20 గంటలకు జైలు గేటు దాటి వచ్చి పరారయ్యాడు. భార్య ఇచ్చిన సమాచారంతో... పరారైన తరువాత భార్యకు నిందితుడు ఫోన్ చేసి ఉంటాడని జైలు అధికారులు పసిగట్టి పరారీ విషయాన్ని ఆమెకు ఫోన్‌ద్వారా తెలియజేశారు. అతడు తిరిగి జైలుకువస్తే శిక్ష తక్కువగా ఉంటుందని, లేకపోతే మరింత ఎక్కువ కాలం శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. కొద్దిసేపటి తరువాత అనుకున్నట్టే గౌస్ పాషా ఇతరుల సెల్‌ఫోన్‌తో భార్యకు ఫోన్ చేశాడు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ నంబర్ లొకేషన్ గుర్తించి అయ్యప్ప గుడి వద్దకు చేరుకున్నారు. అతడు అదే ప్రాంతంలో ఉంటాడని భావించిన పోలీసులు ఆ చుట్టుపక్కల పంటపొలాలు, కాల్వలు, చెట్లపొదలలో గాలించారు. చివరకు ఓ పంటకాల్వ సమీపంలోని చెట్లపొదల్లో నిద్రపోతూ పోలీసులకు చిక్కాడు. -
ఖైదీ పెళ్లికి పెరోల్ మంజూరు చేయండి
బనశంకరి: హత్యకేసులో పదేళ్ల జైలుశిక్షకు గురైన ఖైదీ పెళ్లి చేసుకోవడానికి 15 రోజుల విరామం (పెరోల్) పై విడుదల చేయాలని హైకోర్టు పరప్పన సెంట్రల్ జైలు అధికారులను ఆదేశించింది. వివరాలు.. 2015 ఆగస్టు 16న కోలారు జిల్లా మాస్తి హోబళి నాగదేవనహళ్లిలో ఒక హత్య జరిగింది. ఇందులో ఆనంద (29) అనే నిందితున్ని పోలీసులు అరెస్టు చేయగా కేసు నడిచింది. నేరం రుజువు కావడంతో సెషన్స్‌కోర్టు 2019లో యావజ్జీవిత శిక్ష విధించింది. దీనిని అతడు హైకోర్టులో అప్పీల్ చేయగా, శిక్షను 10 ఏళ్లకు తగ్గించింది. మరోవైపు ఊర్లోనే ఇతడు ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోవడానికి అతన్ని తాత్కాలికంగా విడుదల చేయాలని అతని తల్లి, ప్రియురాలు హైకోర్టులో వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న తో కూడిన బెంచ్ సోమవారం విచారించింది. ఇరువర్గాల వాదనలు ఆలకించిన తరువాత, అతనికి కట్టుదిట్టమైన షరతులతో ఏప్రిల్ 5 మధ్యాహ్నం లోగా 15 రోజులు పెరోల్ ఇవ్వాలని ఆదేశించారు. అతని పెళ్లికి అడ్డంకి తొలగింది. -
మేకులు మింగిన ఖైదీ.. ఆసుపత్రి బాత్రూం నుంచి తప్పించుకుని..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : మేకులు (స్క్రూలు) మింగిన ఓ రిమాండ్ ఖైదీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా సెంట్రీ కళ్లు గప్పి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన సీహెచ్.అరవింద్ పలు దొంగతనం కేసుల్లో నిందితుడు. అతడిని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేయగా, ఖమ్మం జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన ఓ దొంగతనం కేసులో పీటీ వారెంట్‌పై తీసుకువచ్చిన పోలీసులు సంగారెడ్డి సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. అరవింద్ శనివారం జైలులో మేకులు మింగడంతో జైలు అధికారులు చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మేల్ సర్జికల్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పిన అరవింద్ బాత్రూంలో ఉన్న కిటికీ ఊచను తొలగించి అందులోంచి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సంగారెడ్డిటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పరారీలో ఉన్న అరవింద్‌ను పట్టుకునేందుకు మూడు బృందాలను నియమించినట్లు పోలీసులు తెలిపారు. అరవింద్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయి. జైలులో మేకులెలా దొరికాయి? సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అరవింద్‌కు జైలులో మేకులు ఎలా దొరికాయనేది ప్రశ్నార్థకంగా మారింది. జైలులో ఉండే స్విచ్‌బోర్డుకు ఉన్న స్క్రూలను మింగినట్లు జైలు అధికారులు భావిస్తున్నారు. అరవింద్ కడుపు నొస్తుందని జైలు అధికారులకు చెప్పగా అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్‌రే తీయడంతో ఆయన కడుపులో రెండు మేకులు ఉన్నట్లు గుర్తించారు. అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సెంట్రీ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అరవింద్ తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. రిమాండ్ ఖైదీలు బాత్రూం వెళితే తప్పనిసరిగా చేతులకు గొలుసులు వేయాల్సి ఉంటుంది. అయితే ఏఆర్ పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అరవింద్ పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ఇదేందయ్యా.. ఖైదీని షాపింగ్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. వైరల్ వీడియో
లక్నో: విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఓ ఖైదీని తమ వెంటబెట్టుకుని షాపింగ్ మాల్‌కు వెళ్లారు. జైలుకి తీసుకెళ్లాల్సిన వ్యక్తిని షాపింగ్‌కు తీసుకెళ్లిన పోలీసుల ఘనకార్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర పోలీసు శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్ఐ పాటు కానిస్టేబుళ్లను ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిషబ్ రాయ్ అనే వ్యక్తిని అక్రమ ఆయుధాల కేసులో గత జూన్‌లో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే ఇటీవల తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆసుప్రతి వెళ్లేందుకు కోర్టును అనుమతి కోరాడు రిషబ్ రాయ్. అతని దరఖాస్తుని పరిశీలించిన కోర్టు రిషబ్‌కు అనుమతిని కూడా మంజూరు చేసింది. ఈ క్రమంలో పోలీసు అధికారులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించడంతో పాటు వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం వాళ్లు తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. అయితే నేరుగా జైలుకు కాకుండా దారిలో షాపింగ్ మాల్‌కు వెళ్లారు పోలీసులు. వెళ్తూ తమతో పాటు ఆ ఖైదీని కూడా మాల్ లోపలికి తీసుకెళ్లారు. ఇదంతా ఆ పరిసరాల్లోని సీసీటీవీ పుటేజ్‌లో రికార్డ్ కాగా.. ఈ వీడియోని ఓ ట్విటర్ యూజర్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది. #लखनऊ मेडिकल पर आए #बंदी को #मॉल घुमाते #पुलिसकर्मियों का #वीडियो हुआ #वायरल मामले में एक #दारोगा और 3 #सिपाहियों को #निलंबित किया गया है जिला #जेल से मेडिकल के लिए आया था #बंदी@lkopolice pic.twitter.com/iS98ggC5xj — Goldy Srivastav (@GoldySrivastav) March 17, 2023 చదవండి Viral Video: ఇంత బలుపేంటి భయ్యా.. దెబ్బకు తిక్క కుదిరిందిగా.. -
జైల్లో ఆకస్మిక తనిఖీలు.. మొబైల్ ఫోన్ మింగేసిన ఖైదీ..
పాట్నా: బిహార్ గోపాల్‌గంజ్ జిల్లా జైల్లో ఓ ఖైదీ మొబైల్ ఫోన్ మింగేశాడు. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో ఫోన్ విషయం బయటపడుతుందని భయపడి దాన్ని అమాంతం నోట్లో వేసుకున్నాడు. హమ్మయ్య ఇక ఎవరూ కనిపెట్టలేరని ఊపిరిపీల్చుకున్నాడు. శనివారం ఈ ఘటన జరిగింది. అయితే ఆదివారం ఇతనికి అసలు సమస్య మొదలైంది. భరించలేని కడుపునొప్పి వచ్చింది. దీంతో అధికారులకు అసలు విషయం చెప్పేశాడు. తన పొట్టలో మొబైల్ ఉందని, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. దీంతో అధికారులు వెంటనే అతడ్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్-రే తీయగా అతని కడుపులో ఫోన్ ఉన్నట్లు తేలింది. దాన్ని బయటకు తీసేందుకు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. అనంతరం ఖైదీని పాట్నా మెడికల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మొబైల్ ఫోన్ మింగేసిన ఈ ఖైదీ పేరు ఖైసర్ అలీ. 2020 జనవరి 17న డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. మూడేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. అయితే ఖైదీ వద్దకు మొబైల్ ఫోన్ ఎలా చేరిందని ప్రశ్నలు వెళ్లువెత్తుతున్నాయి. జైలు అధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిహార్ జైళ్లలో ఖైదీల వల్ల మొబైల్ ఫోన్లు బయటపడటం సాధారణమైపోయింది. 2021 మార్చి నుంచి ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో 35 సెల్ఫోన్లు ఖైదీల వద్ద లభ్యమయ్యాయి. భారత్‌లోని జైళ్లలో మొబైల్ ఫోన్స్ వినియోగంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయినా కొందరు ఖైదీలు వీటిని ఉపయోగిస్తున్నారు. చదవండి: దివ్యాంగ వృద్ధుడికి డ్రోన్ ద్వారా పెన్షన్ -
జిందాల్‌కు బెదిరింపు
రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ సెంట్రల్ జైలు ఖైదీ ఒకడు పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కు బెదిరింపు లేఖ రాశాడు. రూ.50 కోట్లను 48 గంటల్లోగా పంపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని అందులో హెచ్చరించాడు. ఈ మేరకు గత వారం రాయ్‌గఢ్‌లోని పత్రపాలి గ్రామంలో ఉన్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్(జేఎస్పీఎల్)కు లేఖ అందింది. దీనిపై కోట్రా రోడ్ పోలీసులు సెక్షన్లు 386, 506 కింద కేసు నమోదు చేశారు. సదరు బెదిరింపు లేఖను బిలాస్పూర్ జైలులోని ఖైదీ పోస్టు ద్వారా పంపినట్లు తేలిందని దర్యాప్తులు పోలీసులు చెప్పారు. -
విజిట్ చేసేందుకు వచ్చిన వైద్యురాలిపై ఖైదీ అఘాయిత్యం
న్యూఢిల్లీ: జైలులోని ఖైదీలను విజిటి చేసేందుకు వచ్చిన వైద్యురాలిపై ఖైదీ అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలోని మండోలి జైలులో చోటు చేసుకుంది. జైలు అధికారులు తెలిపిన ప్రకారం...ఒక మహిళా డాక్టర్ జైలులోని ఖైదీలను విజిట్ చేసేందుకు వచ్చారు. ఇంతలో ఒక ఖైదీ ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించడమే కాకుండా ఆమెను చంపేందుకు కూడా ప్రయత్నించాడు. ఈ ఘటనతో స్పందించిన అధికారులు హుటాహుటిన సదరు భాదితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు నిందితుడు ఖైదీ సుబ్రత్ పిళ్లైపై అత్యాచారం, హత్యాయత్నం వంటి కేసులను నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సదరు నిందితుడు పిళ్లైపై ఒక కేసులో కోర్టు పదివేలు పూచికత్తుతో జరిమాన విధించడమే కాకుండా ఒక ఏడాది జైలు శిక్షను కూడా విధించింది. ఈ శిక్షను అనుభవిస్తున్న తరుణంలోనే ఈ ఖైదీ మరో అఘాయిత్యానికి తెగబడ్డాడు. అలాగే ఈఘటన ఎలా జరిగిందనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: ఫోన్లో పరిచయం.. యువతిని ప్రేమించా.. పెళ్లి చేయకుంటే చంపుతా) -
కారాగారం కాదు.. కర్మాగారం
కడప సెంట్రల్ జైలు ఎంతో మంది ఖైదీలకు క్రమశిక్షణ.. కొత్తజీవితం.. మంచి నడవడిక నేర్పిస్తున్న స్థలం. ఖైదీలు ఇక్కడ నేర్చుకున్న వృత్తులు.. విడుదలయ్యాక వారి కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నాయి. సెంట్రల్ జైలు కారాగారంలా కాకుండా కర్మాగారంగా విలసిల్లుతోంది. ఉత్పత్తుల కేంద్రంగా మారింది. ఖైదీలు తినుబండారాలు, సబ్బులు, ఫర్నీచర్ తయారు చేస్తున్నారు. సిమెంట్, ఇటుకలు సైతం ఉత్పత్తి చేస్తున్నారు. పాలడెయిరీ, 24గంటలపాటు పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారూ ఉన్నారు. కడప అర్బన్: సమాజంలో జీవిస్తున్న ప్రజల్లో కొందరు క్షణికావేశంతోనో, పరిస్థితుల ప్రభావంతోనో నేరాలకు పాల్పడి నేరతీవ్రతను బట్టి శిక్ష అనుభవిస్తున్నారు. మరికొందరు నేరాలకు పాల్పడకపోయినా చట్టం దృష్టిలో నేరస్తుడిగా రుజువు కావడంతో శిక్షలు అనుభవిస్తున్నవారు లేకపోలేదు.యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఖైదీ నుంచి మూడేళ్లు జైలు జీవితం గడిపే వారి వరకు కుటుంబాలపై ధ్యాస వెళ్లకుండా తమ వంతు కష్టపడి కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం శిక్ష పడ్డ ఖైదీలు బీరువాలు, పాఠశాల బెంచీలు తదితర వస్తువులు తయారు చేస్తారు. వీటిని ప్రభుత్వ కార్యాలయాలకు, హాస్టళ్లకు, ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారు. పెంట్రోల్ బంకు నిర్వహణ ద్వారా రోజుకు రూ.3లక్షల నుంచి రూ. 5లక్షల వరకు వ్యాపారం జరగుతుంది. ►కడప కేంద్రకారాగారంలో మూడేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు పడిన ఖైదీలకు వివిధ కేటగిరీల్లో శిక్షణ ఇస్తున్నారు.దీనిని సద్వినియోగం చేసుకుని జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ శిక్షపడిన ఖైదీలు 479 మంది, రిమాండ్‌లో ఉన్న వారు 163 మంది ఉన్నారు. వీరుగాక పీడీ యాక్ట్ కింద 36 మంది ఖైదీలు ఉన్నారు. ► ఇక్కడి పరిశ్రమల్లో పనిచేస్తున్న వారందరికీ తాము పనిచేసిన కాలాన్ని బట్టి నిబంధనల మేరకు వేతనం, ప్రశంసాపత్రాలు, గుర్తింపునకు సంబంధించిన సర్టిఫికెట్లను అందజేస్తారు. శిక్షణ పూర్తి చేసుకుని వెళ్లిన తరువాత వారికి సమాజంలో తమకు పనిచేసుకునే వీలుగా ఈ సర్టిఫికెట్లు పంపిణి చేస్తారు. వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. ► కోవిడ్–19 సమయంలో మాస్క్‌లను తయారీ చేయడంలో ఖైదీలు కీలకపాత్ర పోషించారు. ► విద్యాభివృద్ధిలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో చదువుకుని డిగ్రీలు, పీజీలు చేసిన వారు ఉన్నారు. యుగంధర్ అనే జీవిత ఖైదీ డిగ్రీ పూర్తి చేయడంతో పాటు, పీజీని సాధించగలిగారు. ఖైదీల సంక్షేమం కోసం కృషి కేంద్రకారాగారంలో శిక్షను అనుభవిస్తున్న వారందరికి ఏదో ఒకపనిమీద ధ్యాస కలిగేలా శిక్షణను ఇప్పిస్తున్నాం.వీరిలో సత్ప్రవర్తన ద్వారా త్వరగా విడుదలయ్యేందుకు కూడా ఈ శిక్షణలు దోహదపడతాయి. ప్రతి జీవిత ఖైదీకి ఈ శిక్షణ ద్వారా మంచి విద్యతో పాటు విజ్ఞానం పెంపొందించుకునే అవకాశం ఏర్పడింది. వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం – ఐ.ఎన్.హెచ్ ప్రకాష్, సూపరింటెండెంట్, కడప కేంద్ర కారాగారం -
రాజీవ్ గాంధీ హత్య కేసు: న్యాయవాది లేకుండానే తన కేసును వాదించుకున్న ఖైదీ
వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో మురుగన్ వేలూరు సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయన ఇతని భార్య నళిని ప్రస్తుతం పెరోల్‌పై విడుదలై కాట్పాడిలోని బ్రహ్మపురంలో ఉంటోంది. ఈనేపథ్యంలో తన బంధువులతో కలిసి మాట్లాడేందుకు 6 రోజుల పెరోల్ ఇప్పించాలని మురుగన్ జైలు అధికారులకు వినతిపత్రం అందజేశాడు. అయితే మురుగన్ గదిలో సిమ్‌కార్డు దొరకడం, మహిళా పోలీసుల వద్ద అసభ్యంగా నడుచుకోవడం, వాట్సాప్ వీడియోలో ఇతర దేశాల్లోని బంధువులతో మాట్లాడిన కేసులు పెండింగ్‌లో ఉన్నందున జైళ్లశాఖ పెరోల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇదిలా ఉండగా ఈ కేసు విచారణలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మురుగన్ ఈనెల 2వ తేదీ నుంచి దీక్ష చేపట్టారు. అప్పటి నుంచి జైలులోని వైద్యాధికారులు తరచూ మురుగన్‌కు గ్లూకోస్ ఎక్కిస్తున్నారు. అయితే వాట్సాప్‌లో ఇతర దేశాలకు ఫోన్లో మాట్లాడిన కేసుపై మురుగన్ సోమవారం సాయంత్రం పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ వేలూరు కోర్టులో హాజరు పరిచారు. కేసుకు సంబంధించిన సాక్షిగా.. జైలు కానిస్టేబుల్ తంగమాయన్ హాజరయ్యారు. ఆ సమయంలో న్యాయవాది లేకుండా మురుగన్ నేరుగా అతని కేసును వాదించుకున్నాడు. జైలు కానిస్టేబుల్ తంగమాయన్‌ను సుమారు అర్ధగంట పాటు మురుగన్ క్రాస్ ప్రశ్నలు వేశారు. అనంతరం ఈ కేసును న్యాయవాది పద్మకుమారి వాయిదా వేశారు. అనంతరం మురుగన్‌ను జైలుకు తరలించారు. చదవండి: ఏం ధైర్యం తల్లి! పదేపదే కాటేస్తున్న ఆ పాముని అలాగే పట్టుకుంది -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. ఎంత ఈజీగా జైలు నుంచి తప్పించుకున్నాడో!
వాడొక కరడు గట్టిన క్రిమినల్. డ్రగ్ సప్లయ్‌తో యువత జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. పోలీసులు కష్టపడి పట్టుకుంటే.. చావు నాటకం ఆడి తెలివిగా తప్పించుకున్నాడు. ఆపై ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రూపు మార్చుకున్నా.. టైం బాగోలేక దొరికిపోయాడు. కానీ, ఇప్పుడు ఏదో చుట్టాల ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు జైలు, అదీ కఠినమైన భద్రత నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జువాన్ క్యాస్ట్రో అలియాస్ మటాంబా.. కరడుగట్టిన కొలంబియన్ డ్రగ్ డీలర్. నైరుతి కొలంబియా నారినో ప్రావిన్స్‌లో 20 శాతం కొకైన్ మాఫియాకు కారణం ఇతనే. బోగోటాలోని లా పికోటా జైల్ నుంచి గత శుక్రవారం తప్పించుకున్నాడు. అది అలా ఇలా కాదు. సెక్యూరిటీ గార్డు దుస్తుల్లో, ముసుగు ధరించి చాలా క్యాజువల్‌గా బయటకు వచ్చేశాడు. గట్టి భద్రత, ఏడు హైసెక్యూరిటీ గేట్లు ఉన్నా, అలవోకగా దాటేశాడు. 🔴 En los videos se aprecia al poderoso narcotraficante salir por una reja que le deja abierta un inspector de apellido Jiménez ► https://t.co/66DoBnmIKk 📹: cortesía. pic.twitter.com/2iTgOgZYgQ — EL TIEMPO (@ELTIEMPO) March 20, 2022 సిబ్బంది తొలగింపు ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు Iván Duque Márquez సీరియస్ అయ్యారు. హై లెవల్ ఎంక్వైరీకి ఆదేశించారు. దర్యాప్తులో.. జువాన్ క్యాస్ట్రో పారిపోయేందుకు సహకరించిన గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు అధికారి మిల్టన్ జిమెనెజ్తో పాటు 55 మంది గార్డులపైనా వేటు వేశారు. సుమారు ఐదు మిలియన్ డాలర్ల లంచం పోలీసులకు చెల్లించి.. తప్పించుకున్నాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు. అంతేకాదు ఈమధ్యకాలంలో కొంత మంది జువాన్‌ను వచ్చి కలిసినట్లు పేర్కొన్నారు. 🚨 Finalmente, alias Matamba sale por la puerta haciendo un gesto con su mano derecha en señal de que todo está bien. Acá los detalles ► https://t.co/66DoBnmIKk Vía @JusticiaET pic.twitter.com/dGzH7s3q9x — EL TIEMPO (@ELTIEMPO) March 20, 2022 కంత్రిగాడు జువాన్ ఇప్పటివరకు పన్నెండుసార్లు అరెస్ట్ అయ్యాడు. అయితే తప్పించుకోవడం మాత్రం రెండోసారి. 2018లో జైలు నుంచి మెడికల్ లీవ్‌లో వెళ్లిన అతను చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించాడు స్వేచ్ఛగా తిరిగాడు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని కొత్త లుక్‌తో స్వేచ్చగా తిరిగాడు. కిందటి ఏడాది.. పుట్టినరోజు వేడుకల్ని ఫ్లారిడాబ్లాంకాలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో నిర్వహించుకున్నాడు. అయితే పేరుతో ఇన్విటేషన్ ఇవ్వడంతో.. ఎట్టకేలకు పోలీసులు పట్టేసుకునేవారు. జువాన్ క్యాస్ట్రో అలియాస్ మటాంబా మే 2021లో అరెస్ట్ అయ్యాడు. ఇంకో నెలలో అతన్ని అమెరికాకు అప్పగించాల్సి ఉంది. ఈలోపే తప్పించుకుని పోవడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. -
వారి విడుదలకు చర్యలు తీసుకోండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హత్యలాంటి తీవ్రమైన నేరాల్లో కాకుండా ఇతర నేరాల్లో న్యాయ స్థానాలు బెయిల్ మంజూరు చేసినా పూచీకత్తు మొత్తాన్ని చెల్లించలేక జైళ్లలోనే మగ్గిపోతున్న విచారణ ఖైదీల విడుదలకు చర్యలు తీసుకోవాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలను హైకోర్టు ఆదేశించింది. ఆయా కోర్టుల్లో పిటిషన్లు వేయాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిల ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. తమ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక సమర్పించాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. బెయిల్ మంజూరైనా పేదరికంతో పూచీకత్తు మొత్తాన్ని చెల్లించలేక రాష్ట్రవ్యాప్తంగా 180 మంది కొన్ని నెలలుగా జైళ్లలో మగ్గుతున్నారని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మురళి కరణం దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. పూచీకత్తు చెల్లించలేని కారణంగా విచారణ ఖైదీలు జైళ్లలో మగ్గిపోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. సొంత పూచీకత్తుపై వీరిని విడుదల చేసేలా ఆదేశించాలని అభ్యర్థించారు. పూచీకత్తు చెల్లించలేని విచారణ ఖైదీలను గుర్తించి వారి విడుదలకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున న్యాయవాది అనిల్‌కుమార్ నివేదించారు. స్పందించిన ధర్మాసనం.. జిల్లాల లీగల్ సర్వీస్ అథారిటీల సహకారంతో ఇలాంటి వారి విడుదలకు చర్యలు తీసుకోవాలలని ఆదేశించింది. -
ఆమె.. ఒక మిస్టరీ! జిహాదీలకు ఆమె రోల్ మోడలా?
ఆమెను లేడీ అల్‌ఖాయిదా అని పిలిచేవారు మోస్ట్ వాంటెడ్ వుమెన్ జాబితాలో కూడా ఆమె పేరు చేరింది అభిమానులు ఆమెను ఇస్లాం మతాన్ని కాపాడే రాడికల్‌గా భావిస్తే అమెరికా ఆమెపై అల్ ఖాయిదా తొలి మహిళా ఉగ్రవాది అన్న ముద్ర వేసింది అమెరికాలోని టెక్సాస్ జైల్లో మగ్గుతున్న ఆఫియా సిద్ధిఖీ విడుదల కోసం ఇప్పటి వరకు 57 మంది ప్రాణాలు బలయ్యాయి. ఇంతకీ ఎవరీ ఆఫియా సిద్ధిఖీ? ఆమె విడుదల కోసం పాక్‌కి ఎందుకీ ఆరాటం? అమెరికాలోని టెక్సాస్‌లో జనవరి 15న ఒక యూదు ప్రార్థనాలయంలో నలుగురిని బందీలుగా చేపట్టిన ఓ బ్రిటీష్ పాకిస్తానీ యువకుడు వారిని వదిలేయాలంటే, అక్కడికి సమీపంలో జైల్లో మగ్గుతున్న ఆఫియా సిద్ధిఖీని విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. 10 గంటల ఉత్కంఠ తర్వాత అమెరికా పోలీసుల చేతుల్లో హతమయ్యాడు. ► 2011లో అల్ ఖాయిదాలో నెంబర్ 2 ఉగ్రవాది అల్ జవహరి.. ఆఫియాను విడుదల చేస్తే, తమ దగ్గర బందీగా ఉన్న యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఉద్యోగి వారెన్ వీన్స్టెన్ను విడుదల చేస్తామని బేరం పెట్టాడు. ► 2014లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ తమ బందీగా ఉన్న అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలేని విడుదల చేస్తామని, బదులుగా ఆఫియాను విముక్తురాలిని చేయాలని డిమాండ్ చేసింది. అమెరికా అంగీకరించకపోవడంతో ఆ జర్నలిస్టు తలనరికి చంపేసింది. ► 2017లో పాకిస్తాన్ ఎన్నికల ప్రచారంలో ఇమ్రాన్‌ఖాన్ తాను అధికారంలోకి వస్తే ఆఫియాను విడుదలకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. వీరే కాదు జీహాది సంస్థలు, సామాన్య జనం, యావత్ ముస్లిం సమాజం ఆఫియా విడుదల కోసం ఎన్నో ప్రదర్శనలు చేశారు. అమెరికాలో ఎవరిని బందీగా తీసుకున్నా ఆఫియా విడుదల కోసమేనా అన్నట్టుగా పరిస్థితులు మారాయి. ఆఫియా చుట్టూ ఆరోపణలు ఆఫియా జీవితమే ఒక మిస్టరీగా మారింది. అమెరికాలో ఉండగా ఆమెపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. 10 వేల డాలర్లతో నైట్ విజన్ గాగుల్స్ కొన్నదని , రక్షణ కోసం కవచాలు, ఒక సైనికురాలిగా స్వీయ శిక్షణ తీసుకోవడానికి అవసరమయ్యే పుస్తకాలు కొనుగోలు చేసినట్టుగా ప్రచారం జరిగింది. సెప్టెంబర్ 11 దాడుల మాస్టర్‌మైండ్ ఖలీద్ షేక్ మహమ్మద్ మేనల్లుడు అమ్మర్ అల్ బలూచిని ఆమె రహస్య వివాహం చేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. 2003లో ఖలీద్ అరెస్ట్ అయిన నెలరోజులకే ఆఫియా కొన్నాళ్లు అదృశ్యమైపోవడం ఆ ఆరోపణలకి ఊతమిచ్చింది. డర్టీ బాంబ్స్ తయారు చేసి అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు సృష్టించడానికి అఫియా కుట్ర పన్నిందన్న ఆరోపణలు వచ్చాయి. జైల్లో ఉన్నప్పటి చిత్రం 2008లో అఫ్గానిస్తాన్‌లో అమెరికా అధికారిపై కాల్పులకు తెగబడిందన్న ఆరోపణలతో ఆమెను అరెస్ట్ చేశారు. 2010లో అమెరికా కోర్టు ఆమెకు ఏకంగా 86 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అంటే ఆఫియాకి శిక్షా కాలం పూర్తయ్యేటప్పటికీ ఆమె ప్రాణాలతో ఉంటే వయసు 124 ఏళ్లు వస్తాయి. అయితే ఆఫియా సిద్ధిఖీ అమాయకురాలని, ఆమెకు ఆ నేరంతో ఎలాంటి సంబంధం లేదని, అమెరికా మిలటరీయే ఆఫియాని కిడ్నాప్ చేసి నేరాన్ని మోపిందంటూ వాదించేవారూ ఉన్నారు. 2001, సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అగ్రరాజ్యం అమెరికా ఉగ్రవాదంపై పోరాటం పేరుతో అమాయకులపై కూడా టెర్రరిస్టు ముద్ర వేస్తోందని ముస్లిం సమాజం గళమెత్తింది. ఇప్పుడు ఎలా ఉంది ? టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్ జైల్లో ఉన్న ఆఫియా సిద్ధిఖీ ప్రాణాలకు ఇంకా ముప్పు పొంచే ఉందని తెలుస్తోంది. ఇటీవల ఆమెపై తోటి ఖైదీలు దాడులకు దిగారని జైలు రికార్డులు చెబుతున్నాయి. పొగలు కక్కే కాఫీని ఆమె ముఖంపై పోయడంతో కాలిన గాయాలయ్యాయి. కళ్లు కూడా తెరవలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెను మరో మహిళా ఖైదీ చితకబాదింది.. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక పాకిస్తాన్లో హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆఫియాను విడుదల చేయాలంటూ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. విదేశీ జైళ్లలో మగ్గిపోతున్న పాకిస్తానీయుల విడుదలకు తాను పాటుపడతానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టెక్సాస్ యూదు ప్రార్థనాలయంలో ఆఫియా విడుదల కోసం ఘటన జరగడంతో మరోసారి ఈ అల్ ఖాయిదా లేడీ ఉగ్రవాదిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విశ్వవిఖ్యాత మసాచుసెట్స్ వర్సిటీలో చదివి.. అపై పీహెచ్డీ చేసి జీవితంపై ఎంతో విశాల అవగాహన ఉన్న ఆఫియా చట్ట వ్యతిరేక ఉగ్రమార్గాన్ని ఎంచుకోవడం ఎప్పటికీ విస్మయపరిచే అంశమే. పెద్దయ్యాక పాశ్చాత్యదేశాల్లో పెరిగింది. ఆ దశలో ఆమెకు ఉగ్రభావాలున్న పరిచయం అయ్యే అవకాశం ఉండదు. అంటే పాక్‌లో సెకండరీ విద్యను అభ్యసించే లోపలే... లేదా సేవా కార్యక్రమాల కోసం ప్రపంచదేశాలు తిరుగుతున్న తరుణంలో ఎవరో ఆమెకు బ్రెయిన్ వాష్ చేసి ఉంటారని అనుకోవచ్చు!. ఎవరీ ఆఫియా సిద్ధిఖీ? ఆఫియా సిద్ధిఖీ పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన న్యూరో సైంటిస్ట్. 1990లో టీనేజ్‌లో ఉండగానే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంది. బ్రాండీస్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేసింది. 1995లో కరాచీకి చెందిన అంజాద్‌ఖాన్‌తో నిఖా జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2002లో భర్తతో విడిపోయింది. అమెరికాలో విద్యార్థిగా ఉండగానే ఆమె మసీదులకి వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చేది. ఇస్లాం మతం సంరక్షణ కోసం ప్రచారం చేసేది. అఫ్గానిస్తాన్, బోస్నియా, చెచన్యాలో సంక్షోభ పరిస్థితులపై ఉద్యమాలు చేసింది. భారీగా విరాళాలు సేకరించి ఆయా దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె తండ్రి మహమ్మద్ సిద్ధిఖీ వైద్యుడు, సామాజిక కార్యకర్త. పాకిస్తాన్ జనరల్ జియా ఉల్ హక్ హయాంలో ఆయనకి అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. దీంతో సిద్ధికీ ఏం చేసినా బాగా ప్రచారం వచ్చేది. ఆమెకి ఎందరో అభిమానులు ఏర్పడ్డారు. పైగా అకర్షణీయమైన రూపం, అత్యంత ప్రతిభావంతురాలు, ఉన్నత విద్యను అభ్యసించి ఉండటంతో... పాక్ సమాజంతో పాటు ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉండేది. –నేషనల్ డెస్క్, సాక్షి -
మొబైల్ మింగేశాడు.. ఎండోస్కోపీతో..
Delhi: తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీ ఒకరు మొబైల్ ఫోన్ మింగేశాడు. జైలు అధికారులు తన వద్ద మొబైల్ ఉన్నట్లు గుర్తిస్తారన్న భయంతో ఖైదీ ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖైదీని ఆస్పత్రికి తరలించి ఎండోస్కోపీ ద్వారా మొబైల్‌ను బయటకు తీశారు. జనవరి 5న ఈఘటన జరిగినట్లు జైళ్ల శాఖ ఐజీ సందీప్ గోయల్ చెప్పారు. చికిత్స పూర్తైన అనంతరం తిరిగి ఖైదీని జైలుకు తరలించామన్నారు. ఖైదీ ఆరోగ్యం స్థిరంగానే ఉందని చెప్పారు. చదవండి: (ఒకే కూర.. ఒకే స్వీటు.. మత పెద్దల సంచలన నిర్ణయం) -
నేరస్తుడితో లిప్‌లాక్ చేసిన మహిళా న్యాయమూర్తి.. వీడియో వైరల్
ప్రేమ.. ఎప్పుడు, ఎవరి మధ్య చిగురిస్తుందో చెప్పలేం. రెండు అక్షరాల ప్రేమ రెండు జీవితాలను పెనవేస్తోంది. అయితే అందరి ప్రేమలు విజయవంతంగా ముగియవు.. కొన్ని మధ్యలోనే ముగిసిపోతాయాయి. సాధారణంగా స్నేహితులు, క్లాస్‌మెట్స్, సహోద్యోగులిద్దరూ ప్రేమలో పడటం చూశాం. కానీ న్యాయమూర్తి, నేరస్తుడితో ప్రేమలో పడినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా? వినడానికి కొంచెం వింతగా నిజంగానే ఇది జరిగింది. ఒక మహిళా న్యాయమూర్తి ఏకంగా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో ప్రేమలో పడింది. దక్షిణ చుబుట్ ప్రావిన్స్‌లోని ఓ మహిళా న్యాయమూర్తి, నిందితుడు జైల్లో రొమాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో వీరిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. డెయిలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఘటన అర్జెంటీనాలో డిసెంబరు 29న చోటుచేసుకుంది. ఇందులో ఓ పోలీస్ అధికారిని హత్య చేసిన జైలులో ఉన్న క్రిస్టియన్ ‘మై’ బస్టోస్ అనే ఖైదీ న్యాయమూర్తి మారియల్ సువారెజ్ ముద్దుపెట్టుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది: చదవండి: వైరల్: దొంగతనానికి వచ్చి.. ఆకలేయడంతో వంటగదిలో కిచిడీ వండుతూ.. 2009లో పోలీస్ అధికారి లియాండ్రో 'టిటో' రాబర్ట్స్‌ని బస్టోస్ హత్య చేశాడు. అతనికి జీవిత ఖైదు విధించాలా వద్దా అని నిర్ణయించే న్యాయమూర్తుల ప్యానెల్లో మారియల్ భాగం. బస్టోస్‌కు జీవిత ఖైదుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక న్యాయమూర్తి ఆమె. బస్టోస్‌ను ‘అత్యంత ప్రమాదకరమైన ఖైదీ’ అని చెప్పినప్పటికీ, యావజ్జీవ శిక్షకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్యానెల్‌లోని ఏకైక న్యాయమూర్తి సువారెజ్. బస్టోస్‌ను రక్షించడానికి ఆమె ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. దీంతో అతడికి జీవిత ఖైదు శిక్ష విధించారు. మరోవైపు మహిళా న్యాయమూర్తి ఖైదీని ముద్దు పెట్టుకుంటున్న వీడియో బయటపడడంతో దీనిపై విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి తెలిపారు. చదవండి: కోపంతో రెచ్చిపోయిన మహిళ.. రోడ్డుపై పండ్లు విసురుతూ.. వీడియో వైరల్ VIDEO DOCUMENTO. AMIGOS ARGENTINA TOCO FONDO. JUEZA QUE INTEGRO TRIBUNAL QUE CONDENO A PERPETUA AL ASESINO DE UN POLICIA EN CHUBUT, FUE HACERLE MATE Y MIMOS A LA PRISION AL CONDENADO. FUE SUMARIADA. LA JUEZA SE LLAMA, MARIEL ALEJANDRA SUAREZ. pic.twitter.com/Gf07UEIA1H — MARCELO FAVA (@MARCELOFAVAOK) January 4, 2022 -
తాటతీస్తున్న టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చట్టబద్ధంగా పడుతున్న శిక్షలశాతం పెరుగుతోంది. పోలీసుల దర్యాప్తులోని సాంకేతిక సంస్కరణలకు తోడు నిందితుల గుర్తింపునకు, ఆధారాల సేకరణకు ఎప్పటికప్పుడు పాటిస్తున్న మెళకువలు శిక్షల శాతాన్ని పెంచాయి. ఈ మేరకు పోలీస్ శాఖ తన వార్షిక నివేదిక లో పలు వివరాలు వెల్లడించింది. గతంలో నిందితులకు శిక్షల శాతం 11, 12 ఉండేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అది గత ఐదేళ్లు క్రమంగా పెరుగుతూ గతేడాది 50 శాతానికి చేరుకున్నట్లు పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత మేర శిక్షలశాతం నమోదు కాకపోవడం గమనార్హం. గతేడాదిలో ఒకరికి ఉరి... 2021లో న్యాయస్థానాలు ఒక నిందితుడికి ఉరిశిక్ష, 82 కేసుల్లో 126 మందికి జీవితఖైదు విధించాయి. ఒక కేసులో నిందితుడికి 30 ఏళ్లు, మరో నిందితుడికి 25 ఏళ్ల శిక్ష విధించాయి. మరో 21 మంది ఖైదీలకు 20 ఏళ్లు, ఒకరికి 15 ఏళ్లు, ఒకరికి 14 ఏళ్ల శిక్ష విధించాయి. 2021లో ఒకరోజు జైలుశిక్ష నుంచి ఉరిశిక్ష వరకు పడినవారి జాబితాలో 38,812 మంది ఉన్నారు. 126 మందికి జీవితఖైదు శిక్షపడ్డగా.. వారిలో 92 మంది హత్యకేసుల్లో నిందితులేనని, మరో 9 మంది మర్డర్ ఫర్ గెయిన్ కేసుల్లో, ఇంకో 25 మంది లైంగిక దాడి(అత్యాచారం) కేసుల్లో నేరస్తులని పోలీస్‌శాఖ తెలిపింది. మహిళలపై దాడుల కేసులో... గతేడాది లైంగికదాడి చేసి హత్య చేసిన ఉదంతాల్లో, వరకట్న వేధింపులతో హత్య చేసిన కేసుల్లో, లైంగికదాడి కేసు, సాధారణ హత్య కేసుల్లో మొత్తం 39 మందికి జీవితఖైదును కోర్టులు విధించాయి. 8 మంది వరకట్న వేధింపులకు పాల్పడి హత్య చేసినవారు కాగా, లైంగికదాడికి పాల్పడి హతమార్చిన కేసులో ఇద్దరు, లైంగికదాడి కేసుల్లో 9 మంది, మహిళల హత్య కేసుల్లో 20 మందికి జీవితఖైదు పడింది. 2021లో పోక్సో యాక్ట్ కేసుల్లో ఒకరికి ఉరిశిక్ష పడగా, 18 మందికి న్యాయస్థానాలు జీవితఖైదు విధించినట్టు పోలీస్ శాఖ స్పష్టం చేసింది. కోర్టులు ఒకరికి 30 ఏళ్లు, ఒకరికి 25, 21 మందికి 20 ఏళ్లు, ఇద్దరు నిందితులకు 15 ఏళ్లు, 14 ఏళ్లు పోక్సో కేసుల్లో శిక్ష విధించాయని తెలిపింది. -
జైలర్ దారుణం.. ఇనుప చువ్వ కాల్చి ఖైదీ వీపుపై ‘ఆత్వాది’ అని..
చండీగఢ్: పంజాబ్‌లోని బర్నాల జిల్లా జైలు అధికారి ఓ ఖైదీ పట్ల వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. జైలులో కనీస హక్కులకోసం ఎదురు తిరిగిన కరమ్‌జిత్ సింగ్ (28) అనే ఖైదీపై జైలు సూపరింటెండెంట్ బల్బీర్ సింగ్ అమానుష చర్యకు పాల్పడ్డారు. అతని వీపుపై ‘ఆత్వాది’ (పంబాబీలో టెర్రరిస్టు) అనే అక్షరాలను ఇనుప చువ్వను కాల్చి వాతలు పెట్టి చెక్కారు. డజనుకుపైగా కేసుల్లో దోషిగా తేలిన బాలామ్‌ఘర్‌కు చెందిన కరమ్‌జిత్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా డ్రగ్స్ కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరిగినప్పుడు అతను తన గోడును వెళ్లబోసుకున్నాడు. జైలు సూపరింటెండెంట్ బల్బీర్ సింగ్ తనపై విచక్షణా రహితంగా దాడి చేసి.. ఒంటిపై ‘ఆత్వాది’ అని ఇనుప చువ్వతో కాల్చాడని కోర్టు దృష్టికి తేవడంతో విషయం వెలుగుచూసింది. (చదవండి: CID Show: సీఐడీ షో స్ఫూర్తి: దారుణానికి పాల్పడ్డ మైనర్లు) అయితే, ఈ ఆరోపణలను జైలు సూపరింటెండెంట్ తోసిపుచ్చారు. కరమ్‌జిత్ తరచూ నేరాలు చేసి జైలుకొస్తాడని, సానుభూతి కోసం కట్టు కథలు చెబుతాడని అన్నారు. ఇక ఈ విషయంపై పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ రణ్‌ధావా విచారణకు ఆదేశించారు. ఫిరోజ్‌పూర్ డీఐజీ తేజింద్ సింగ్ మౌర్‌ను విచారణ అధికారిగా నియమించారు. మరోవైపు సిక్కులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఘటనకు బాధ్యుడైన జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలని అకాలీదళ్ అధికార ప్రతినిధి మన్జిందర్ సింగ్ సిర్సా డిమాండ్ చేశారు. (చదవండి: పండుగ పూట విషాదం: కల్తీ మద్యం తాగి 10 మంది మృతి.. మరో 14 మంది..) A jail inmate in Barnala, Karamjit Singh beaten brutally by Jail Superintendent. The word “Attwadi” meaning TERRORIST engraved on his back! This is disgusting and a serious violation of human rights. We demand strict possible action against officials involved @CHARANJITCHANNI Ji https://t.co/mYKcWyPWMh pic.twitter.com/icmiIiBSit — Manjinder Singh Sirsa (@mssirsa) November 3, 2021 -
ఖైదీ కుటుంబాలకు గుడ్‌న్యూస్: ఇకపై నేరుగా
సాక్షి, హైదరాబాద్: ఖైదీ కుటుంబాలకు తెలంగాణ జైళ్ల శాఖ శుభవార్త తెలిపింది. ఆగస్టు 25వ తేదీ నుంచి జైళ్ల శాఖలో ములాకత్‌లు ఉంటాయని జైళ్ల శాఖ డీ.జి రాజివ్ త్రివేది శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లల్లో, కేంద్ర కారాగారాల్లో ఖైదీలకు ములాకత్ ఇచ్చేందుకు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ల నుంచి ములాకత్‌లను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఖైదీలు తమ కుటుంబసభ్యులతో ములాకత్లో కలుసుకునేందుకు వీలు లేకుండాపోయింది. రెండేళ్లుగా కుటుంబీకులతో మాట్లాడలేకపోవడంతో ఖైదీలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటివరకు ఖైదీలకు జైలులో వాట్సాప్ వీడియో ములాకత్‌లకు పరిమితం చేశారు. అయితే ఖైదీలు ప్రత్యక్షంగా తమ కుటుంబసభ్యులతో ములాకత్ లేకపోవడంతో మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై ఖైదీలు జైలు శాఖ ఉన్నతాధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. జైళ్లల్లో కూడా పరిస్థితులు ప్రశాంతంగా నెలకొనడంతో ములాకత్‌లు పునః ప్రారంభించనున్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులను ఖైదీలు ఇకపై నేరుగా కలుసుకోవడానికి అవకాశం లభించనుంది. -
రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
కుషాయిగూడ: ఖైదీల వరుస ఆత్మహత్యలు చర్లపల్లి జైలులో భద్రతా లోపాలను ఎత్తిచూపుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు ఆత్మహత్యలకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత ఆదివారం సిద్దిపేట జిల్లా తూర్పుతండాకు చెందిన బానోతు శ్రీను నాయక్ బెడ్ షీట్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ షేక్ ఖాజామియా టవల్‌తో కిటికీకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా తేరుకున్న జైలు సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఓ దొంగతనం కేసులో పట్టుబడ్డ ఖాజామియాను మల్కాజిగిరి కోర్టు తీర్పు మేరకు కుషాయిగూడ పోలీసులు ఈ నెల 7న చర్లపల్లి జైలులో రిమాండ్ చేశారు. అనారోగ్యమా..మానసిక స్థితో తెలియదు కాని అతడు జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. జైల్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ మన్మోహన్ తెలిపారు. వారం రోజుల్లో ఇద్దరు ఖైదీలు.. శ్రీను నాయక్ ఆత్మహత్య మరువక ముందే మరో ఖైదీ ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైలులో ఖైదీలు ఆత్మహత్యలకు ఎలా పాల్పడుతున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం, జైలు అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై జైళ్లశాఖ డీఐజీ ఎన్. మురళీబాబును వివరణ కోరగా జైదీల మానసిక స్థితి బాగోలేకనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రతి బ్లాక్ వద్ద పటిష్ట భద్రత ఉంటుందన్నారు. వార్డర్, హెడ్‌వార్డర్, చీఫ్ హెడ్ వార్డర్‌తో పాటుగా వారిని పర్యవేక్షించేందుకు డిప్యూటీ జైలర్లు ఉంటారని తెలిపారు. వారంలో ఇద్దరు ఖైదీలు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
కరోనా సోకిన ఖైదీ ఆస్పత్రి నుంచి పరార్
అస్సాం: కరోనా వైరస్ బారిన పడిన కొందరు బాధితులు చికిత్స పొందుతూ ఆస్పత్రుల నుంచి పారిపోయిన వార్తలను చూశాం. అయితే తాజాగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయి చికిత్స పొందుతున్న ఓ ఖైదీ ఆస్పత్రి నుంచి పారిపోవటం అస్సాంలోని కర్బీ జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. అస్సాంలోని కర్బీ జిల్లాలో ఓ ఖైదీకి కరోనా వైరస్ సోకడంతో గురువారం మధ్యాహ్నం డిఫు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ఆస్పత్రి వైద్యులు కోవిడ్ వార్డులో కరోనా చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కోవిడ్ వార్డులో ఆ ఖైదీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఆ ఖైదీ కోవిడ్ వార్డు నుంచి పారిపోయినట్ల తెలిపారు. అతను జూన్ 12న డిఫు పోలీసు స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను జూడిషియల్ కస్టడీలో ఉన్నాడు. పారిపోయిన ఖైదీ కోసం బృందాలుగా ఏర్పడి తీవ్రంగా వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: వ్యక్తిగత సమస్యలతో జర్నలిస్ట్ ఫేక్ డ్రామా: నొయిడా పోలీసులు -
జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం
కైలాస్‌నగర్ (ఆదిలాబాద్): ఓ హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న ఎంఐఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఫారుఖ్ అహ్మద్ బుధవారం జైలులో ఆత్మహత్యకు యత్నించాడు. గత డిసెంబర్ 18న సయ్యద్ జమీల్, ఆయన కుటుంబసభ్యులపై ఫారుఖ్ తుపాకీతో కాల్పులు జరిపిన విషయం తెల్సిందే. కాల్పుల్లో గాయపడిన సయ్యద్ జమీల్ చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో ఫారుఖ్‌పై హత్య కేసు నమోదైంది. అప్పటినుంచి జిల్లా జైల్లో ఖైదీగా ఉన్నాడు. రెండు రోజుల క్రితం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో మనస్తాపం చెంది ఉరేసుకున్నాడు. ఇది గమనించిన జైలు సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వెంటనే జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్‌లో చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇదిలా ఉండగా, ఫారుఖ్ అహ్మద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, పోలీసులు.. రాజకీయ నాయకులు కుమ్మక్కై అతడిని చంపడానికి చూస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫారుఖ్‌కు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మనస్తాపం చెంది ఉండవచ్చు రెండు రోజుల క్రితం ఫారుఖ్ బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో మనస్తాపం చెంది ఉండవచ్చు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆతడికి కౌన్సెలింగ్ ఇచ్చాం. హైకోర్టును ఆశ్రయించాలని సూచించాం. కప్పుకునేందుకు ఇచ్చిన దుప్పటిని చించి.. బాత్రూమ్లో ఉరేసుకున్నాడు. ఇది గమనించిన మా సిబ్బంది వెంటనే ఆయనను రక్షించి రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాం. – శోభన్ బాబు, ఆదిలాబాద్ జైలర్ -
అచ్చెన్న.. ఖైదీ నంబర్ 8775
సాక్షి, శ్రీకాకుళం: టెక్కలి మండలం నిమ్మాడలో తమకు ప్రత్యర్థిగా పోటీ చేసిన కింజరాపు అప్పన్నపై దాడి చేసిన ఘటనలో అరెస్టయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు 14 రోజుల రిమాండ్ ఖైదీగా శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ నంబర్ 8775గా ఉన్నారు. జైలు జీవితం రెండు రోజులు గడిచింది. తొలి రోజైన మంగళవారం సాయంత్రం మూడు చపాతీలు, చిక్కుడుకాయల కూర తిని, రాత్రి 9.30 గంటలకు నిద్రపోయారు. బుధవారం ఉదయం 5.30కి నిద్రలేచి టీ తీసుకున్నారు. జైలు సిబ్బంది తీసుకొచ్చిన సాక్షి, మరో పత్రికను చదివారు. ఉదయం 8.30కి పొంగలి తీసుకున్నారు. రిమాండ్ ఖైదీగా వచ్చినప్పుడు తీసుకెళ్లిన డ్రస్‌ను బుధవారం మార్చుకున్నారు. ఎవర్నీ కలవనియ్యవద్దని ఆయన సిబ్బందితో చెప్పారు. గురు, శుక్రవారాల్లో లోకేశ్, మరికొందరు అచ్చెన్నాయుడిని కలిసే అవకాశముందని పోలీసులకు సమాచారం వచ్చింది. చదవండి: ('అందర్నీ గుర్తు పెట్టుకుంటా.. సంగతి తేలుస్తా’) -
జైళ్లలో ఖైదీలకన్నా నిందితులే ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : ఖైదీలు కాకుండా నేర విచారణను ఎదుర్కొంటున్న నిందితుల నిర్బంధంతోనే నేడు దేశంలోకి జైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ 2019లో విడుదల చేసిన డేటా ప్రకారం 4,78,600 మంది జైలు నిర్బంధంలో ఉండగా, వారిలో ప్రతి పది మందిలో ఏడుగురు కేసు విచారణను ఎదుర్కొంటోన్న నిందితులే. నిందితుల్లో 37 శాతం మంది అన్యాయంగా మూడు నెలల నుంచి ఏడాది వరకు జైలు జీవితం గడుపుతున్న వారే. ఫలితంగా వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడమే కాకుండా రెగ్యులర్ ఉద్యోగాలు కూడా కోల్పోయారు. (చదవండి : కరోనా టెస్టులు.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం) జైళ్లలో మగ్గుతున్న నిందితుల్లో 64 శాతం మంది వెనకబడిన, నిమ్న వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఎస్సీలకు చెందిన వారు 21.7 శాతం, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు 12.3 శాతం, వెనకబడిన వర్గాలకు చెందిన వారు 30 శాతం మంది ఉన్నారు. ప్రతి ఐదుగురు నిందితుల్లో ఒకరు ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారు. దారిద్య్రక పరిస్థితులు, ఉచిత న్యాయ సహాయం దొరక్క పోవడం వల్లనే ఈ వర్గాలకు చెందిన వారు జైళ్లలో మగ్గుతున్నారని సామాజిక శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రపంచంలో 14 దేశాల్లో మాత్రమే విచారణ ఎదుర్కొంటోన్న నిందితులు జైళ్లలో ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలోకెల్లా లిబియాలోనే అత్యధికంగా అండర్ ట్రయల్స్ జైళ్లలో మగ్గుతుండగా, ఆ తర్వాత స్థానాల్లో వరుసగా శాన్ మారినో, బంగ్లాదేశ్, గబన్, పరాగ్వే, బెనిన్, హైతి, ఫిలిప్పీన్స్, కాంగో, కాంబోడియా, బొలీవియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజీరియా, యెమెన్ దేశాలుండగా, 15వ స్థానంలో భారత్ ఉంది. (చదవండి : భారత్‌లో పబ్జీ కథ ముగిసినట్లేనా?) విచారణ ఎదుర్కొంటోన్న నిందితుల్లో ఎక్కువ మంది వెనకబడిన,దళిత వర్గాలకు చెందిన వారే కావడం ఒక్క భారత దేశానికి పరిమితం కాలేదని, ప్రపంచంలోనే పలు దేశాల్లో కొనసాగుతోందని, ఇది సమాజంలోని అసమానతలను, వివక్షతలకు అద్దం పడుతోందని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ‘సెంటర్ ఫర్ క్రిమినాలజీ అండ్ జస్టిస్’ విభాగానికి చెందిన ప్రొఫెసర్ విజయ్ రాఘవన్ వ్యాఖ్యానించారు. -
ఆరోపణలు రుజువైతే రియాకు పదేళ్ల జైలు!
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు నేపథ్యంలో డ్రగ్స్ ఆరోపణలపై అరెస్టయిన సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని బుధవారం ఉదయం పోలీసులు ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. డ్రగ్స్ కేసులో మూడు దశలుగా రియాను విచారించిన నార్కొటిక్స్ సెంట్రల్ బ్యూరో అధికారులు నిన్న(మంగళవారం) రియాను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారించిన మేజిస్ట్రేట్ రియాకు బెయిలును తిరస్కరించి 14 రోజుల పాటు రిమాండుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. దీంతో మంగళవారం రాత్రంతా రియా ఎన్సీబీ కార్యాలయంలోనే గడపాల్సి వచ్చింది. అయితే రేపు రియా బెయిలు పిటిషన్‌పై కోర్టు విచారణ జరపనుంది. ముంబైలో మహిళలకు ఉన్న ఏకైక జైలు బైకుల్లా జైలు. ఈ జైలులోనే కోరీగావ్-భీమాలోని షీనా బోరా హత్య కేసలో ప్రధాన నిందితులుగా అరెస్టు అయిన ఇంద్రాణి ముఖర్జీయా, కార్యకర్త సుధా భరద్వాజ్ సహా మరి కొందరు మహిళ ఖైదీలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. (చదవండి: రియా చక్రవర్తి నిజంగా నేరం చేశారా?!) (చదవండి: బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు: రియా) కాగా, ఈ కేసులో రియా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే ఆరోపణలను ఎదుర్కొంటోంది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు సుశాంత్ మాజీ మేనేజర్ శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్ సహాయంతో డ్రగ్స్ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన మూడు రోజుల విచారణలో రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల సరఫరాతో సంబంధం ఉందని, ఆమె సిండికేట్ సభ్యురాలుగా ఉన్నట్లు వెల్లడైంది. మూడవ దశ విచారణలో రియా డ్రగ్స్ దందాలో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారని 25 మంది పేర్లు, డ్రగ్స్ ఉపయోగించే పార్టీల జాబితాను ఎన్సీబీకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్, శామ్యూల్ మిరాండా సహా సుశాంత్ వద్ద పనిచేసిన మాజీ ఉద్యోగులను కూడా పోలీసలు ఆరెస్టు చేసి జైలుకు తరలించారు. (చదవండి: రియా చక్రవర్తి అరెస్ట్) -
బాధితుల కోసం నిలబడినవాడే బాధితుడు
ఖైదీల హక్కుల కోసం పనిచేసిన రోనా విల్సన్ తానే ఒక ఖైదీలా ఏప్రిల్ 2018 నుంచి జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్ చాలాసార్లు తిరస్కరణకు గురైంది. 2018 ఏప్రిల్ 17న పుణే పోలీసులు ఢిల్లీలోని ఆయన ఇంటిమీద దాడి చేసి, భీమా కోరేగావ్ హింసలో ఆయన పాత్ర ఉందని ఆరో పిస్తూ అరెస్ట్ చేశారు. ప్రభు త్వాన్ని కూలదోయడం కోసం రాజీవ్‌గాంధీ హత్య తరహాలో ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేం దుకు నక్సలైట్లు పన్నిన బృహత్ కుట్రలో భాగమ య్యారని మరో ఆరోపణ చేశారు. దీన్ని నిరూపిం చడానికిగానూ ఆయన లాప్టాప్లో దొరికిందని చెబుతూ ఒక లేఖను చూపారు. కానీ సైబర్ ఫోరె న్సిక్ నిపుణులు, ఈ లేఖను మాల్వేర్ ద్వారా ద్రోహచింతనతో ఆయన లాప్టాప్లో చేర్చివుం డొచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ ఈ తీవ్ర ఆరోపణ బెయిల్ ఇవ్వకుండా ఆయన్ని జైల్లో ఉంచడానికి కారణమైంది. రాజకీయ ఖైదీల విడుదల కోసం పనిచేసే సీఆర్పీపీ (ద కమిటీ ఫర్ ద రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్) వ్యవస్థాపక సభ్యుడు రోనా విల్సన్. జాతీయ భద్రతా చట్టం, చట్టవ్యతిరేక కార్యకలా పాల నిరోధక చట్టం లాంటి వాటి ఆధారంగా తీవ్రవాద నేరారోపణలు ఎదుర్కొనే వారికి సీఆర్పీపీ న్యాయ సహాయం అందిస్తుంది. పది హేను, ఇరవై ఏళ్లుగా రోనా రాజకీయ ఖైదీల విడుదల కోసం పనిచేస్తున్నారు. రోనా లాంటివాళ్లు అసమ్మతివాదుల చివరి ఆశ, అంటారు రచయిత్రి మీనా కందసామి. భీమా కోరే గావ్ స్మారకోత్సవంలో దాడికి జనాన్ని సమీకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందుత్వ నాయకులు మిలింద్ ఎక్బోటే, శంభాజీ భిడేను కాపాడుకోవడానికే వీళ్ల మీద ప్రభుత్వం ఈ నింద మోపిందని చాలామంది కార్యకర్తలు ఆరోపించారు. స్వభావ రీత్యా ప్రచారాన్ని కోరుకోని రోనా గురించి పెద్దగా ఎవరూ రాయలేదని రచయిత్రి అరుంధతీ రాయ్ అంటారు. పాండి త్యమూ, పరిశ్రమా చేయగలిగిన పరిశోధకుడిగా ప్రొఫెసర్ జి.హరగోపాల్ ఆయన్ని అభివర్ణిం చారు. తన విలువల పట్ల ఆయన నిబద్ధత రాజీలేనిది. పేద ప్రజలు, ఖైదీలు, గిరిజనుల పట్ల గల చింతే ఆయన ప్రపం చాన్ని మలిచిందని కారవాన్ పత్రిక రాసింది. 2001 పార్లమెంట్ మీద దాడి కేసులో ముందు మరణదండన పడి, తగిన సాక్ష్యాధా రాలు లేని కారణంగా 22 నెలల తర్వాత ఎస్.ఎ.ఆర్.గిలానీ విడుదలయ్యాక సీఆర్పీపీ ఏర్పడింది. రాజకీయ కారణాల వల్ల నిర్బంధానికి గురయ్యేవారి విడుదల కోసం పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించిన గిలానీ, అమిత్ భట్టాచార్య, రోనా విల్సన్ దీన్ని స్థాపించారు. అయినా ఈ ధోరణి తగ్గుముఖం పట్టలేదు. తనకు వ్యతిరేకులు అనుకునేవారినందరినీ వ్యవస్థ బంధిస్తోంది. మేధావులు, రచయితలు, న్యాయవాదులు, పాత్రి కేయులు, పరిశోధకులు, విద్యార్థులు, కార్యకర్తలు ఎందరో పెద్ద సంఖ్యలో జైళ్లలో మగ్గడాన్ని చూస్తు న్నాం. అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరా గాంధీ సర్కారు టార్గెట్ చేసిన ఎందరో రెండేళ్ల పాటు జైళ్లలో ఉన్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వ కాలంలో కొంతమంది రెండేళ్లకంటే ఎక్కువ కాలంగా జైళ్లలో మగ్గుతున్నారు. ఇలాంటివారి కోసం పనిచేయడానికి రోనా విల్సన్ లాంటివారి అవసరం ఎంతోవుంది. అరెస్టుకు ముందు తన పీహెచ్డీ కోసం విదే శాలకు వెళ్లే సన్నాహాల్లో ఉన్నారాయన. ఇంగ్లండ్ లోని సర్రీ యూనివర్సిటీ, లెస్టర్ యూనివర్సిటీ లకు అప్లై చేసుకున్నారు. జైల్లో ఉన్నా కూడా ఆయన తృష్ణ ఆవిరి కాలేదు. రెండు విశ్వవిద్యా లయాల్లోని ఆచార్యగణంతో కాంటాక్టులో ఉండి తన అనిశ్చిత పరిస్థితి గురించి తెలియజేయవల సిందిగా కుటుంబ సభ్యులకు ఒక లేఖ రాశారు. ఈ దేశానికి చెందిన ఒక తెలివైన పరిశోధకుడి ఖైదు నిందార్హమైనది. ఆయనకు వ్యతిరేకంగా రాజ్యం చేసిన తీవ్ర ఆరోపణలను ఖండితంగా నిరూపించుకోవాలి లేదా మిగిలిన అందరు రాజకీయ ఖైదీలతో సహా ఆయన్ని కూడా విడుదల చేయాలి. – సందీప్ పాండే, అతుల్ సందీప్ పాండే, సోషలిస్ట్ పార్టీకి చెందినవారు. అతుల్, ఎల్ఎల్బీ విద్యార్థి -
ఉదయం పెళ్లి.. రాత్రి జైలుకు
సాక్షి ప్రతినిధి, చెన్నై: పెళ్లంటే నూరేళ్ల పంట. స్త్రీ, పురుషులు ఒకరి కోసం ఒకరుగా కలిసిమెలసి పండించుకోవాల్సిన నిండైన జీవితం. కొందరు యువతుల జీవితాల్లో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. భార్యల కాళ్లపారాణి ఆరకముందే వారి భర్తలు కటకటాల వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇదేం చోద్యమని సాక్షాత్తు న్యాయమూర్తులే ఆశ్చర్యం వ్యక్తంచేశారు. విచారణ జరపాలని జాతీయ మహి ళా కమిషన్‌ను ఆదేశించారు. యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న తన భర్త కు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఒక యువతి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎన్ కృపాకరన్, వీఎం వేలుమణి విచారించారు. పెళ్లి చేసుకునేటప్పు తన భర్త ఒక యావజ్జీవ ఖైదీ అనే విషయం తెలియదని ఆమె చెప్పింది. ఒక హత్య కేసులో కింది కోర్టు భర్తకు యావజ్జీవ శిక్ష విధించడాన్ని హైకోర్టులో సవాలు చేసి జామీనుపై బయటకు వచ్చిన సమయంలో తనను పెళ్లిచేసుకున్నాడని పేర్కొంది. దీంతో న్యాయమూర్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇలాంటి కేసులు మరికొన్ని దాఖలయ్యాయి. గతంలో అస్లాం అనే ఖైదీకి 30 రోజుల పెరోల్ మంజూరు చేసేలా జైళ్ల శాఖను ఆదేశించాలని కోరుతూ అతడి భార్య అడ్‌కొనర్వ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మహిళ తన భర్త ఒక యావజ్జీవ ఖైదీ అని తెలిసే పెళ్లి చేసుకుంది. 20 ఏళ్లుగా జైల్లో ఉంటున్న భర్తను పెరోల్‌పై విడుదల చేయాల్సిందిగా కోరింది. పదేళ్లకు ముందు ఒక్కరోజు పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చినపుడు పెళ్లి చేసుకున్నాడని, అదే రోజు రాత్రి జైలుకు వెళ్లిపోవడంతో అత్తగారితోపాటూ ఉంటు న్నట్లు తెలిపింది. దీనిపై న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో పెళ్లి చేసుకునే వారు అనేక వివరాలను సేకరిస్తున్నారని, ఒక ఖైదీని, అందునా యావజ్జీవ ఖైదీని వివాహమాడేందుకు ఏ యువతీ అంగీకరించదన్నారు. యువతుల అభీష్టం మేరకు పెళ్లిళ్లు జరుగుతున్నాయా? లేక బలవంతంగా చేస్తున్నారా అన్న దానిపై విచారణ చేసి బదులు పిటిషన్ వేయాలని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా శిశు సంక్షేమం, అభివృద్ధి శాఖలను ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు. కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు. -
కరోనా: భారత్‌కు ఉగ్రవాదిని పంపిన యూఎస్
వాషింగ్టన్ : కరోనా వైరస్ ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో ఖైదీలను విడుదల చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఏళ్ల నుంచి జైల్లో మగ్గుతున్న ఖైదీలను గురువారం బయటకు వదిలారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఆల్ ఖైదా ఉగ్రవాది జుబేర్ మహ్మద్ ఇబ్రహింను కూడా అమెరికా విడుదల చేసింది. అనేక ఉగ్ర కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జుబేర్ 2015లో అమెరికాలో పట్టుబడ్డ విషయం తెలిసిందే. (చైనాపై ట్రంప్ ఆగ్రహం) అప్పటి నుంచి అమెరికా జైల్లోనే అతను శిక్ష అనుభవిస్తున్నాడు. ఆల్ ఖైదా తరపున పెద్దమొత్తంలో నిధులు సమీకరించిన కేసులో జుబేర్ దోషిగా తేలాడు. అయితే జుబేర్ హైదరాబాద్ వాసి కావడంతో అతన్ని భారత్‌కు పంపాలని అమెరికా నిర్ణయించింది. ప్రత్యేక విమానంలో జుబేర్‌ను భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. జుబేర్ భారత్‌లో దిగగానే అతన్ని అదుపులోకి తీసుకుని క్వారెంటైన్‌కు పంపే అవకాశం ఉంది. (ప్రపంచంపై కరోనా పంజా) -
ఢిల్లీ రోహిణి జైలులో ఖైదీకి సోకిన కరోనా
ఢిల్లీ : రోహిణి జైలులో ఓ క్రిమినల్ ఖైదీకి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. అయితే అతనికి ఎలా సోకిందనే విషయం ఇంకా తెలియలేదు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..ఢిల్లీ రోహిణీ జైలులోని ఖైదికి అనారోగ్యం కారణంగా శస్ర్త చికిత్స చేశారు. ఆ తర్వాత కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షించగా, కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతనికి కరోనా ఎలా సోకిందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. జైలులో ఉన్నప్పుడు ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని జైలు అధికారు పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా జైలులోని 20 మంది ఖైదీలు, ఐదుగురు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించి క్వారంటైన్లో ఉంచారు. ఢిల్లీ సంగం విహార్ నివాసి అయిన కరోనా బాధితుడికి హత్యాయత్నాం, దోపిడి లాంటి మూడు క్రిమినల్ కేసులకు పాల్పడినట్లు అధికారి తెలిపారు. ఇక ముంబై ఆర్థర్ రోడ్ జైలులోని ఖైదీలకు అత్యధికంగా కరోనా సోకిన సంగతి తెలిసిందే. అక్కడ మొత్తం ఖైదీలు, సిబ్బందికి కలిపి 180 కి పైగానే కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా తీహార్ జైలులోనూ కరోనా కేసులు వెలుగుచూశాయి. (ముంబై జైలులో 100 మందికి కరోనా ) -
కరోనా ఉందంటూ నాటకమాడి ఖైదీ పరారీ
సాక్షి, చెన్నై : కరోనా వైరస్ లక్షణాలను ఒక ఖైదీ తనకు అనుకూలంగా మలచుకున్నాడు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా శ్రీవైంకుఠంకు చెందిన మాయండి అనేక దోపిడీ, చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతడి కోసం పోలీసులు గాలిస్తూ వస్తున్నారు. అయితే గత వారం ఆళ్వార్ తిరునగర్‌లో జరిగిన ఓ దోపిడీ కేసులో మాయాండిని ఎట్టకేలకు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తూత్తుకుడి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచానంతనరం తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టైలోని కేంద్రకారాగారానికి సాయంత్రం తరలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వాహనంలో ఎక్కించుకుని వెళ్తుండగా మార్గం మధ్యలో మాయాండి కరోనా వైరస్ లక్షణాలున్నట్లుగా ప్రవర్తించాడు. మార్గం మధ్యలో అదే పనిగా దగ్గడం, తుమ్మడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. తనకు జ్వరం, జలుబు దగ్గు ఉందని పేర్కొంటూ ఇది కరోనా ప్రభావం ఏమో అని పేర్కొన్నాడు. దీంతో భద్రతా సిబ్బంది హడలెత్తారు. రాత్రి ఏడు గంటల సమయంలో అతడ్ని పాళయం కోట్టై మార్గంలో ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎందుకైనా మంచిదనుకున్న పోలీసులు అతడికి కాస్త దూరంగానే ఉన్నారు. దీనిని పరిగణించి మాయాండి వైద్యుల వద్ద మరుగుదొడ్డికి వెళ్తున్నట్టు చెప్పి జారుకున్నాడు.(కరోనా : 40 రోజుల బతుకు లాక్డౌన్) పరారీలో ఉన్న ఖైదీ కోసం ఆరా తీస్తున్న పోలీసులు ఈ మాయగాడి కోసం తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లా పోలీసులు వేట మొదలెట్టారు. దీంతో పోలీసులు తూత్తుకుడి, తిరునల్వేలి పరిసరాల్లో ఉన్న 25 చెక్ పోస్టులలో గాలింపు చేపట్టారు. విషయాన్ని ముందే ఊహించిన మాయాండి వేందనాకులం నదిలో ఈదుకుంటూ ఉడాయించడం గమనార్హం. మాయండి బంధువు ఒకరు సమాచారం అందించడంతో ఫైబర్ పడవల్ని రంగంలోకి దించి నదిలో గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 'మాయాండి ..వాంటెడ్' అంటూ వాట్సాప్ గ్రూపుల్లో అతడి ఫోటోల్ని షేర్ చేశారు. అలాగే, అతడికి భద్రత నిమిత్తం వచ్చి నలుగురు పోలీసులకు ముందస్తుగా పాళయం కోట్టై కరోనా కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు. పోలీసునే చితక్కొట్టాడు.. లాక్ డౌన్‌వేళ పోలీసులు లాఠీలకు పని పెట్టిన సంఘటనలు అనేకం. అయితే, మాస్క్ ధరించ లేదని తనను ప్రశ్నించడాన్న ఆగ్రహంతో ఓ టీ వ్యాపారి పోలీసును చితక్కొట్టాడు. తంజావూరు జిల్లా తిరునంతాల్ గ్రామంలో సైకిల్ మీద ఓ వ్యాపారి టీ విక్రయిస్తూ వచ్చాడు. లాక్ డౌన్ వేళ ఎవరు బయటకు రాకూడదన్న నిబంధనలు ఉన్నా అది లెక్కచేయకుండా ఆ వ్యాపారి రోడ్డుమీదకు వచ్చాడు. అయితే భద్రతా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఆ వ్యాపారి పోలీసు మీద తిరగబడి చేతిలోని లాఠీ లాక్కుని చితక్కొట్టేశాడు. లాఠీ దెబ్బల నుంచి తప్పించుకునేందుకు కానిస్టేబుల్ యత్నించాడు. చివరకు జనం అడ్డుకోవడంతో వ్యాపారి ఉడాయించాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
కరోనాపై పోరు..మేముసైతం అంటున్న ఖైదీలు
-
శానిటైజర్‌ను ఆల్కహాల్ అనుకుని తాగి..
తిరువనంతపురం : ఆల్కహాల్ అనుకుని శానిటైజర్ తాగిన ఓ ఖైదీ శుక్రవారం మృతి చెందాడు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్‌లో చోటుచేసుకుంది. రామన్ కుట్టి అనే వ్యక్తి ఫిబ్రవరి 18 నుంచి రిమాండ్ ఖైదీగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రామన్ కుట్టి కళ్లు తిరిగి పడిపోవడంతో జైలు అధికారులు అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు జైలులో ఖైదీల చేత శానిటైజర్ తయారు చేయిస్తారు. ఈ నేపథ్యంలో గత గురువారం రామన్ కుట్టి ఆల్కహాల్ అనుకొని శానిటైజర్ తాగుంటాడని జైలు అధికారులు భావిస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి వరకు అతని ఆరోగ్యం సాధారణ స్థితిలోనే ఉందని, బుధవారం రోల్ కాల్ కోసం కూడా హాజరయ్యాడని పేర్కొన్నారు. కానీ గురువారం ఉదయం 10 గంటల సమయంలో కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందడానికి వెల్లడించారు. కాగా, ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తరువాతే ఖైదీ మరణానికి గల కారణాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. జైలు అధికారులు హ్యాండ్ శానిటైజర్ తయారీలో ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌ను ప్రధాన పదార్థంగా ఉపయోగిస్తారు. ఈ పదార్థమే ఖైదీ చావుకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి : లాక్డౌన్ : రోడ్డుపై అనుకోని అతిథి -
దారుణంగా చంపేశాడు, జైలులో ఆత్మహత్య
గతంలో భార్య మరణానికి కారణమయ్యాడు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుని పెంచిన ఇద్దరు కూతుర్లనూ నెలరోజుల క్రితం దారుణంగా చంపేశాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. జైలులో మానసిక సంఘర్షణ చిత్రవధ చేసింది. పిల్లల్ని పొట్టన బెట్టుకున్నానని.. పశ్చాత్తాపం వెంటాడిందో ఏమో..ఆ తండ్రి జైలులోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. వైఎస్ఆర్ జిల్లా, గోపవరం :క్షణికావేశంతో ఓ తండ్రి చేసిన పాపం కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. కన్నబిడ్డలనూ చంపేలా చేసింది. చివరికి జైలుపాలై మానసిక క్షోభ తట్టుకోలేక ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చేసిన పాపాలకు తానే మరణ శాసనాన్ని రాసుకున్నాడు. వివరాలివి.. గోపవరం మండలం శ్రీనివాసాపురానికి చెందిన తాళ్ల బాలకొండయ్యకు ఇతనికి ఇద్దరు కుమార్తెలు. భార్య చనిపోయినప్పటి నుంచి వ్యవసాయ పనులతో పాటు ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని బాడుగలకు తిప్పుకుంటూ ఇద్దరు కుమార్తెలను అల్లారుముద్దుగా చూసుకుంటుండేవాడు. స్థానిక పాఠశాలలో చదివించేవాడు. చిన్నకుమార్తె శోభన రాత్రి సమయంలో తండ్రి వద్దే నిద్రించేది. పొలం వద్ద తండ్రి రాత్రి సమయంలో నిద్రిస్తున్నా అక్కడికి వెళ్లి తండ్రి వద్దే నిద్రపోవాలని మొండికేస్తుండేదని బంధువులు చెబుతున్నారు. ప్రేమాభిమానాలుగా పిల్లలను చూసుకునే బాలకొండయ్య ఒక్కసారిగా మనసు మార్చుకున్నాడు. తన క్షణాకానందానికి పిల్లల్ని అడ్డం కాకుండా తొలగించుకోవాలనుకుని రాక్షసుడిగా మారాడు. గత నెల 27వ తేదీన బాలకొండయ్య తన ఇద్దరు కుమార్తెలు భావన, శోభనలను ఏదో కొనిపెడతానని చెప్పి బైకు ఎక్కించుకున్నాడు. గ్రామానికి సమీపంలో ఉన్న బావిలో తోసేసి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. కొద్దిరోజుల తర్వాత పోలీసులు ఇతడ్ని అరెస్టు చేసి బద్వేలులోని సబ్‌జైలుకు తరలించారు.(జూబ్లీహిల్స్‌లో సీఆర్పీఎఫ్ ఎస్ఐ అత్మహత్య) వెంటాడిన పశ్చాత్తాపం తాను చేసిన పాపానికి బాలకొండయ్యను బలంగా వెంటాడింది. పిల్లలను హతమార్చి జైలుకెళ్లాక నిద్రలేని రాత్రులు గడిపాడని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రేమగా సాకి పిల్లలను బలవంతంగా చంపేశానని బాధ పడి ఉంటాడని భావిస్తున్నాడు. బద్వేలు సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బాలకొండయ్యను అతని తల్లిదండ్రులు గాని బంధువులు గాని చూడటానికి కూడా వెళ్లలేదని తెలిసింది. తాను ఎవరి కోసం బతకాలని, అటు భార్య బుజ్జమ్మ చావుకు తానే కారణమని, ఇటు ఇద్దరు కుమార్తెలను కిరాతకంగా హత్యచేసిన సంఘటనను గుర్తు చేసుకుంటూ పశ్చాతాపానికి గురై చివరికి మృత్యువును ఆహ్వానించాడు. అరెస్టయిన సబ్ జైలులోనే బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.(ప్రేమను చంపుకోలేక..) -
వీళ్లు మారరు !
అనంతపురం న్యూ సిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఇంకా కొందరు వైద్యుల్లో నిర్లక్ష్యం వీడలేదు. వీరి బాధ్యతారాహిత్యం.. నిండు ప్రాణాలపై ప్రభావం చూపుతోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతేడాది తాడిపత్రికి చెందిన అక్తార్‌భాను అనే బాలింతకు రక్తమార్పిడి చేసి నిండు ప్రాణాన్ని తీసిన విషయ విధితమే. దీనిపై ప్రభుత్వం స్పందించి అందుకు బాధ్యులైన వైద్యులను సస్పెండ్ చేసింది. అయినా కూడా చాలా మంది వైద్యుల్లో ఎలాంటి మార్పు రావడం లేదన్న చర్చ జరుగుతోంది. ఆస్పత్రిలో ఓ ఖైదీ సర్జరీ విషయంలో అనస్తీషియా విభాగం వైఫల్యం ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 12న ఓ ఖైదీ ఆస్పత్రిలో అడ్మిషన్ అయ్యాడు. ఖైదీని పరీక్షించిన వైద్యులు లాపొరాక్టమీ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 13న సర్జన్లు ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో సర్జరీ చేశారు. అంతకంటే ముందు ఓ అనస్తీషియా వైద్యురాలు.. అనస్తీషియా విభాగం హెచ్‌ఓడీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనస్తీషియా ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవంగా ఖైదీకి సర్జరీ చేసే సమయంలో కచ్చితంగా సంబంధిత హెచ్ఓడీ పర్యవేక్షణలో అనస్తీషియా ఇవ్వాల్సి ఉందని ఆస్పత్రి వర్గాల చెబుతున్నాయి. సర్జరీ జరిగిన కాసేపటికే ఖైదీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్యులు అప్రమత్తమై ఆంబు బ్యాగ్, ఆక్సిజన్ సిలిండర్ ద్వారా శ్వాసను అందించి అక్యూట్ మెడికల్ కేర్‌కు తరలించారు. వెంటిలేటర్ ద్వారానే వైద్యం అందించారు. మొదట స్పైన్‌కు అనస్తీషియా ఇవ్వడం ద్వారానే ఈ సమస్య ఏర్పడినట్లు సమాచారం. అన్నీ అయ్యాక ఈ విషయాన్ని హెచ్ఓడీ దృష్టికి తీసుకెళ్లాగా హెచ్ఓడీ తీవ్ర స్థాయిలో సంబంధిత వైద్యురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏమైనా జరిగితే తమ ఉద్యోగాలు ఊడిపోతాయని బహిరంగంగానే చెప్పినట్లు సమాచారం. ఖైదీ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి విషమించడంతో శుక్రవారం ట్రెకాష్టమీ చేసినట్లు తెలిసింది. ఇదే రోజున ఖైదీకి ఎంఆర్ఐ చేశారు. ఆస్పత్రిలో ఈ అంశం పెద్దచర్చనీయాంశమవడంతో రోజూ ముగ్గురు అనస్తీషియా వైద్యులు ప్రత్యేకంగా ఖైదీని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సర్జరీ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. దీనిపై లోతుగా విచారణ చేపడుతామని తెలిపారు. అనస్తీషియా హెచ్ఓడీ నవీన్‌కుమార్ తనకు ఖైదీ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని, సర్జరీ పూర్తయ్యాకే వైద్యురాలు తనకు దృష్టికి తీసుకొచ్చారని సమాధానమిచ్చారు. -
జీవిత ఖైదును సవాల్ చేసిన చచ్చి, బతికిన ఖైదీ
సాక్షి, న్యూఢిల్లీ : ఇదో చిత్రమైన కేసు. చచ్చి, బతికిన ఓ ఖైదీ దాఖలు చేసిన పిటిషన్‌తో యావత్ దేశం దృష్టికి వచ్చిన కేసు. తనకు విధించిన యావజ్జీవ శిక్ష తన చావుతోనే ముగిసిందని, తనను తక్షణమే విడుదల చేయాలంటూ ఖైదీ వాదించిన కేసు. ఈ వాదనతోటి కోర్టు అంగీకరిస్తుందా, లేదా? అంటూ తీర్పు కోసం దేశ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూసిన కేసు.....చివరకు ఏమైందీ? అమెరికా, అయోవా రాష్ట్రంలోని పెనిటెన్చరీ జైలులో హత్యానేరం కింద యావజ్జీవ కారాగారా శిక్ష అనుభవిస్తున్న బెంజామిన్ శ్రైబర్ ఓ రోజు హఠాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. జైలు అధికారులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన ఆస్పత్రి అధికారులు పెదవి విరిచారు. ‘లాభం లేదు, చనిపోయాడు’ అన్నారు. అంతలోనే ఖైదీ గుండె కొట్టుకోవడం గమనించారు. వైద్య చికిత్సల కోసం అతడిని ఆపరేషన్ థియేటర్లోకి తరలించారు. తనకు ‘పునర్జీవ చికిత్స’లు చేయరాదంటూ అంతకు కొన్నేళ్ల ముందే బెంజామిన్ ఓ పత్రం మీద సంతకం చేసి ఉన్నారు. బతికే అవకాశం లేదనుకున్న రోగులకు నరాల్లోకి కొన్ని రకాల రసాయనాలను పంపించడాన్ని ‘పునర్జీవ చికిత్స’లుగా వ్యవహరిస్తారు. బెంజామిన్ అపస్మారక స్థితిలోనే ఉండడంతో టెక్సాస్‌లో ఉన్న అతని సోదరుడిని పిలిపించి రోగి పరిస్థితిని వివరించారు. కిడ్నీ నిండా రాళ్లు పేరుకు పోయాయని, పునర్జీవ చికిత్స ద్వారా ఆయన్ని స్ప్రహలోకి వస్తే ఆపరేషన్ చేయవచ్చని చెప్పారు. ‘బెంజామిన్‌కు ఏమైనా బాధ కలుగుతుంటే అందుకు మందులివ్వండి. లేదంటే అలాగే వదిలేయండి’ అని చెప్పడాన్ని అనుమతిగా తీసుకున్న వైద్యులు అన్ని చికిత్సలు చేసి బెంజామిన్‌ను బతికించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయగానే బెంజామిన్ జైలు అధికారులు తిరిగి జైలుకు తీసుకెళ్లారు. 1997లో ఓ దారుణ హత్య కేసులో బెంజామిన్‌కు ఒక్క రోజు పెరోల్ కూడా దొరకని యావజ్జీవ కారగార శిక్ష పడింది. 2015, మార్చి నెలలో అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రి పాలయ్యారు. తిరిగి జైలుకొచ్చాక తాను చావుదాకా వెళ్లి తిరిగి వచ్చినట్లు బెంజామిన్‌కు తెల్సింది. 2018, ఏప్రిల్ నెలలో జిల్లా కోర్టులో బెంజామిన్ ఓ చిత్రమైన పిటిషన్‌ను దాఖలు చేశారు. తనకు విధించిందీ యావజ్జీవ కారాగార శిక్ష కనుక, తన చావుతో అది ముగుస్తుందని, తాను ఆస్పత్రిలో చనిపోయినప్పుడే అది ముగిసిపోయిందని, అనవసరంగా నాలుగేళ్లు అదనంగా తనను జైలులో ఉంచారంటూ కేసు వాదించారు. అందుకు సంబంధించి ఆస్పత్రి రికార్డుల కాపీలను కూడా సమర్పించారు. వాదోపవాదాలు విన్న తర్వాత కేసులో జీవం లేదని, అస్సలు పరిశీలనార్హం కూడా కాదంటూ జిల్లా జడ్జీ తీర్పు చెప్పారు. దాంతో తీర్పును సవాల్ చేస్తూ బెంజామిన్ న్యాయవాది అయోవాలోని అప్పీళ్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మొన్న బుధవారం నాడు అప్పీళ్ల కోర్టు తీర్పు చెప్పింది. ‘యావజ్జీవ కారాగార శిక్ష అంటే డాక్టరిచ్చే డెత్ సర్టిఫికెట్తో ముగిసేది కాదు. బతికున్నంత కాలం జైలులో ఉంచడమే యావజ్జీవ కారాగార శిక్ష. పైగా నీవు బతికి లేకుంటే కోర్టుకు ఎలా వచ్చావు?’అంటూ జడ్జీ అమంద పాటర్‌ఫీల్డ్ కేసును కొట్టివేశారు. ‘పునరుజ్జీవ చికిత్స’ వద్దంటూ తన క్లైంట్ సంతకం చేశాక ఎలా చేస్తారని, అందుకు నష్ట పరిహారం చెల్లించాలంటూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ గురించి బెంజామిన్ న్యాయవాది ప్రశ్నించగా, జిల్లా కోర్టు ఆ అంశాన్ని ప్రస్తావించలేదు కనుక, తాము పరిగణలోకి తీసుకోలేదని జడ్జీ స్పష్టం చేశారు. -
కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా?
సాక్షి, అమరావతి: ఓ ఖైదీ విడుదల విషయంలో తమ ఆదేశాలను అమలు చేయని అధికారులది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్, న్యాయశాఖ కార్యదర్శి ఎవరో ఒకరు తప్పనిసరిగా బాధ్యులవుతారని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గని శ్రీనివాసులు అనే ఖైదీని విడుదల చేయాలంటూ హైకోర్టు ఏప్రిల్ 9న ఆదేశాలు జారీ చేయగా అధికారులు అమలు చేయలేదు. దీనిపై కోర్టు ప్రశ్నించగా ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపారు. తర్వాత జూన్ 14న విడుదల చేయాలని కోర్టు మరోసారి ఆదేశించింది. అయినా స్పందించకపోడంతో శ్రీనివాసులు సోదరుడు పవన్‌కుమార్ అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు కోర్టు ఆదేశాలను అమలు చేయని మీ చర్యలను ఎందుకు కోర్టు ధిక్కారం కింద పరిగణించరాదో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని అప్పటి హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ఎం.రవికిరణ్ తదితరులను ఆదేశించారు. వారు శనివారం కోర్టు ముందు హాజరవ్వగా ధర్మాసనం విచారణ జరిపింది. అధికారుల తీరుపై మండిపడుతూ కోర్టు ఆదేశాలంటే అధికారులకు లెక్క లేకుండా పోయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జూన్ 14న ఆ ఖైదీ విడుదలకు ఆదేశిస్తూ జూలై 4న విడుదల చేశారని, అది కూడా కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలైన తరువాతని తెలిపింది. దీనిని ఉపేక్షించేది లేదని, తగిన ఉత్తర్వులిస్తామని తీర్పును వాయిదా వేసింది. -
వార్డర్ వేధింపులతో ఖైదీ ఆత్మహత్యాయత్నం?
సాక్షి, రాజమహేంద్రవరం క్రైం: వార్డర్ పెట్టే వేధింపులు తట్టుకోలేక ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న అప్పలనాయుడు ఈ నెల 5న బాత్రూమ్ కడిగే యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. దీంతో అతడ్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జైల్లో పని చేసే ఒక వార్డ ర్ వేధింపుల వల్లే ఆ ఖైదీ యాసిడ్ తాగినట్టు తెలి సింది. జైల్లోని ఖైదీలు తమ బంధువులతో మా ట్లాడుకునేందుకు ఫోన్ సౌకర్యం కల్పిస్తారు. ఓవార్డర్ ఖైదీని నగదు అడగడంతో ఇవ్వలేకపోయిన అతడు ఫోన్లో మాట్లాడుకునే అవకాశం కల్పించకపోవడంతో మనస్తాపం చెంది బాత్రూమ్ను క్లీన్ చేసే యాసిడ్ తాగినట్టు సమాచారం. దీనిపై రాజమహేంద్రవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి సీఐ త్రినాథ్ దర్యాప్తు చేస్తున్నారు. జీవిత ఖైదు పడిందనే మనస్తాపంతోనే... ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న వన్‌టౌన్ సీఐ త్రినాథ్‌ను వివరణ కోరగా ఖైదీకి జీవిత శిక్ష పడిం దనే మనస్తాపంతో సబ్బు నీళ్లు తాగినట్టు తమకు వాగ్మూలం ఇచ్చాడని తెలిపారు. వార్డర్ వేధింపులు కారణమని తమకు ఆ ఖైదీ చెప్పలేదన్నారు. బెయిల్ రాలేదన్న మనస్తాపంతో... దీనిపై జైల్ ఇన్చార్జి సూపరింటెండెంట్ రాజారా వును వివరణ కోరగా ఖైదీ అప్పలనాయుడు బెయి ల్ రాలేదనే మనస్తాపంతో సోప్ వాటర్ తాగాడని తెలిపారు. జీవిత ఖైదీలకు సాధారణంగా బెయిల్ మంజూరు కాదని, ఈ నేపథ్యంలో మనస్తాపంతో అతడు సోప్ వాటర్ తాగితే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. -
జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ వద్ద గల జిల్లా జైలులో ఓ జీవితఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అరగొండ గ్రామానికి చెందిన వెంకట్ (65) తన మనుమడిని చంపిన కేసులో ఈ నెల 9వ తేదీన కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న వెంకట్.. మంగళవారం సాయంత్రం జైలులోని బాత్రూమ్లో టవల్‌తో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు 6వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఒక్కసారిగా మలుపు తిరిగిన ‘ఖుషీ’ జీవితం
సెంట్రల్ జైల్లో ఉన్న ఒక పాపను జిల్లా కలెక్టర్ స్కూల్లో చేర్పించగానే ఆ స్ఫూర్తితో మరో పదిహేడు మంది చిన్నారుల్ని తమ స్కూల్లో చేర్చుకుని ఉచిత విద్య, వసతి ఇచ్చేందుకు స్కూళ్ల యాజమాన్యాలు ముందుకు వచ్చాయి! సంజయ్ కుమార్ అలాంగ్.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లా కలెక్టర్. ఏటా ఆయన బిలాస్‌పూర్‌లోని సెంట్రల్ జైల్ తీరుతెన్నుల్ని పర్యవేక్షించేందుకు వెళుతుంటారు. వెళ్లి, ఖైదీల బాగోగులను, వారి వ్యక్తిగత వివరాలను అడిగి తెలుసుకుంటారు. వారికేమైనా సమస్యలున్నాయేమో కనుక్కుంటారు. పోలీసు అధికారులు జైలును సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని కూడా ఖైదీలను అడుగుతారు! తల్లి చనిపోయింది.. తండ్రి జైలుపాలు! సంజయ్ కుమార్ ఈ ఏడాది కూడా బిలాస్పూర్ సెంట్రల్ జైలుకు వెళ్లారు. అలా వెళ్లినప్పుడు మహిళా వార్డులో కొందరు ఖైదీల మధ్యన కూర్చొని ఒక బాలిక కనిపించింది! ఆ బాలిక పేరు ఖుషీ. ఐదేళ్లుగా జైల్లో ఉంటోంది. అయిదేళ్లుగా అంటే.. దాదాపుగా ఆమె పుట్టినప్పటి నుంచీ! తండ్రి ఏదో నేరం చేసి, ఐదేళ్ల క్రితం జైలు పాలు అయినప్పట్నుంచీ ఖుషీ కూడా అదే జైల్లో ఉంటోంది. ఖుషీ తల్లి ఖుషీ 15 రోజుల బిడ్డగా ఉన్నప్పుడే పచ్చకామెర్లతో చనిపోయింది. ఈ వివరాలన్నీ కలెక్టర్‌కు చెప్పారు జైలు అధికారులు. అప్పటికి ఆయన వెళ్లిపోయారు. ఆ తర్వాత ఖుషీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆమెను ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించారు కలెక్టర్ సంజయ్ కుమార్. నిజానికి అది కలెక్టర్ విధులలో భాగం కాదు. అంతరాత్మ ప్రబోధానుసారం ఆయన ఆ బాధ్యతను స్వీకరించారు. కలెక్టర్ సంజయ్ కుమార్ ఖుషీ అనేది అసలు పేరు కాదు. చట్ట ప్రకారం ఆమె అసలు పేరును వెల్లడించడానికి లేదు. అలాగే ఆమె ఫొటోను పత్రికల్లో చూపించడానికి లేదు. ఈ జాగ్రత్తలన్నీ కలెక్టర్ తీసుకున్నారు. మొదటి రోజు తనే స్వయంగా ఖుషీని స్కూలుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఖుషీ ప్రమేయం లేకుండా ఖుషీ జీవితం ఎలా జైలు వైపు అడుగులు వేసిందో, అలాగే ఖుషీ ప్రమేయం లేకుండా ఖుషీ అంతర్జాతీయ పాఠశాల వైపు నడిచింది. జైలు నిబంధనల ప్రకారం మహిళా ఖైదీల మైనర్ పిల్లల్ని ఇంట్లో చూసేవాళ్లెవరూ లేనప్పుడు, మరీ చిన్నవారిగా ఉన్నప్పుడు తల్లితో పాటే జైల్లో ఉంచుతారు. ఒకవేళ తల్లి లేని పిల్లలు అయి ఉండి, తండ్రి నేరం చేసి జైలుకు వెళితే అదే జైల్లో మహిళా ఖైదీలతో పాటు పిల్లల్ని ఉంచి, ఆరేళ్ల వయసు వచ్చాక బంధువులకు గానీ, బంధువులు కూడా లేకుంటే ప్రభుత్వ సంరక్షణ గృహాలకు గానీ తరలిస్తారు. ఆ తర్వాత వాళ్లే స్కూల్లో చే ర్పిస్తారు. స్కూల్లో తొలి రోజు.. ఖుషీ మర్చిపోలేదు ఖుషీని స్కూల్లో చేర్పిచాలన్న ఆలోచన వచ్చిన వెంటనే కలెక్టర్ సంజయ్ కుమార్.. ‘‘పెద్దయ్యాక నువ్వేం అవాలని అనుకుంటున్నావు’’ అని అడిగారు. ‘‘పెద్ద స్కూల్లో చదవాలని ఉంది’’ అని చెప్పింది ఖుషీ. వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న పెద్దస్కూళ్లకు సమాచారం పంపించారు. ‘ఇలా ఒక చిన్నారి జైల్లో ఉంది. ఆమెకు అడ్మిషన్ కావాలి’ అని అడిగించారు. జైన్ ఇంటర్నేషనల్ స్కూలు ముందుకు వచ్చింది. ఉచితంగా చదువు చెప్పడం మాత్రమే కాక, ఆమె ఇంటర్ పూర్తి చేసేవరకు ఉచితవసతి కల్పిస్తామని తెలిపింది. వెనువెంటనే అడ్మిషన్ ప్రాసెస్ అంతా చకచకా జరిగిపోయింది. ‘‘తాము చేయని తప్పుకు అన్యాయంగా జైల్లో ఉంటున్న పిల్లల్ని చదివించనన్నా చదివించాలి లేదా వారికోసం మంచి యాక్టివిటీస్‌ని అయినా రూపొందించాలి. అలా కాలానికి వదిలిపెట్టడం సరికాదు’’ అని సంజయ్ అంటారు. స్కూల్లో మొదటిరోజు ఖుషీకి అనూహ్యమైన ఆదరణ లభించింది. ఎవరో చీఫ్ గెస్ట్ వస్తున్నట్లుగానే ప్రిన్స్‌పాల్ సహా సిబ్బంది అంతా స్వాగతం పలికారు. ఆ అపురూపమైన సందర్భం ఖుషీకి బహుశా జీవితాంతం గుర్తుండి పోతుంది. ఖుషీని ఆయన స్కూల్లో చేర్చగానే, ఆ విషయానికి ప్రాధాన్యం లభించి, సెంట్రల్ జైల్లో ఉన్న మరో పదిహేడు మంది చిన్నారులను స్కూల్లో చేర్పించడం కోసం ఎన్జీవో సంఘాలు దరఖాస్తు పెట్టుకున్నాయి! సంజయ్ కుమార్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ అది. బాల్యం తిరిగి రానిది. తిరిగిరాని ఆ బాల్యాన్ని జైల్లో ఉంచి స్వేచ్ఛ లేకుండా చేయడంపై ఇండియాలో ఏళ్లుగా చర్చ నడుస్తోంది. దానికొక ముగింపు రావడం లేదు. అమ్మగానీ, నాన్న గానీ, అమ్మానాన్న గానీ జైల్లో ఉన్నప్పుడు బయటెవరూ లేని పిల్లల్ని జైల్లో ఉంచితే భద్రంగా ఉంటారు కదా అనే వాదన కూడా ఉంది. భద్రత ఉంటే సరిపోయిందా? భవిష్యత్తు ఉండొద్దా? ఆరేళ్లకే ఏం భవిష్యత్తు ఏర్పడుతుంది అనే వాళ్లు ఉన్నారు. ఆరేళ్లకు భవిష్యత్ ఏర్పడకపోవచ్చు. అరవైఏళ్ల భవిష్యత్తు ఈ ఆరేళ్ల మీదే కదా ఆధారపడి ఉండేది. ఇప్పుడే కదా ఆలోచనలు వికసించేది. ఇప్పుడే కదా ఆశలు చిగురించేది. ఇప్పుడే కదా జ్ఞాపకాలు స్థిరపడిపోయేది. -
ఆ 'శిక్ష'ణ తో.. ఉప'యోగా'లెన్నో..
పెద్దాపురం: క్షణికావేశంలో చేసిన తప్పుకు జైలు శిక్ష అనుభవించాడు. సత్పప్రవర్తతో అందరికీ ఆదర్శంగా నిలవాలంటే ఏ మార్గమైతే మంచిదంటూ కుటుంబాన్ని తీసుకుని వేరే గ్రామంలో కాపురం పెట్టాడు. ఉన్న కుట్టు మెషీన్‌తో కుటుంబ పోషణ సాగిద్దామంటే చాలీచాలని సొమ్ములతో ఎన్నాళ్లీ బతుకంటూ ఓ పెట్రోల్ బంకులో పని కుదుర్చుకుని, టైలరింగ్ వృత్తి చేస్తూ కాలం గడుపుతున్నారు. అంతా బాగానే సాగిపోతోంది కానీ ఏదో వెలితి... తాను జైలు శిక్షలో ఉన్నప్పుడు మదిలో కలిగిన ఆలోచన ఆయనను వెంటాడుతోంది. జైలులో పొందిన యోగా శిక్షణను పల్లె ప్రజలకూ ఇస్తే బాగుంటుందని భావించాడు. యోగా గురువుగా మారాడు. పల్లె ప్రజలకు యోగా శిక్షణ ఇస్తూ పల్లె ప్రాంతంలో యోగా కేంద్రం ఏర్పాటు చేసి ప్రస్తుతానికి సుమారు వంద మందికి శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలిచిన యోగా గురువు జీవిత గాథ ఇది.కోరుకొండ మండలం ఇల్లెందుపాలేనికి చెందిన మసిముక్కల రామకృష్ణ సుమారు 13 ఏళ్ల క్రితం ఆ గ్రామ రాజకీయ ఘర్షణల నేపథ్యంలో వ్యక్తి హత్య కేసులో ముద్దాయిగా మారాడు. వాదోపవాదాల అనంతరం కోర్టు ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. భార్య, కుమారుడు, కుమార్తె ఒంటరి కావడంతో భార్య సుబ్బలక్ష్మి ఇరువురిని తీసుకుని పెద్దాపురం మండలం దివిలి అమ్మగారి ఇంటి వద్దకు వచ్చేసింది. ఆమెకు ఉన్న కుట్టు మెషీన్ సాయంతో కుమార్తెకు వివాహం చేశారు. ఇటీవల 2016 జనవరి 26న సత్ప్రవర్తతోనే ఉండే ఖైదీలను విడుదల చేసే సమయంలో జైలు నుంచి రామకృష్ణ విడుదలయ్యాడు. శిక్ష పూర్తి చేసుకుని అటు స్వగ్రామం వెళ్లలేక అత్తారింటికి కాపురం వచ్చేశాడు రామకృష్ణ. మంచి సత్పప్రర్తనతో మెలగాలనే.. అత్తారింటికి కాపురం వచ్చేసిన రామకృష్ణ జైలు జీవితం నుంచి సమాజంలో మంచి సత్పప్రవర్తనతో మెలగాలని భార్య, కుమారుడితో సంసార జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నాడు. పులిమేరు పెట్రోల్ బంకులో పనికి చేరాడు. తనతో పాటు కుమారుడు ప్రేమ్‌కు కూడా అక్కడే ఉద్యోగం సంపాదించి ఇద్దరూ బంకులోనే పనిచేస్తుండడంతో కాపురాన్ని పులిమేరు మకాం మార్చాడు. అంతేకాదు తనకు తెలిసిన యోగాసనాలు మరికొందరికి నేర్పాలనే ఉద్దేశంతో అదే గ్రామంలో ఓ మైదానంలో యోగా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ సుమారు 100 మందికి ఉచితంగా శిక్షణ ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు రామకృష్ణ.యోగాతో మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం లభిస్తుందంటూ పులిమేరు పరిసర గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు రామకృష్ణ. ప్రతి పదిహేను రోజులకోసారి దివిలి, తిరుపతి, చదలాడ, పులిమేరు, పిఠాపురం మండలం విరవ గ్రామాల్లో యోగాసనాలు వేస్తూ అవగాహన కల్పిస్తుంటారు. ఆయా గ్రామాల నుంచి 12 ఏళ్ల వయస్సు నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు సుమారు 100 మంది ఇక్కడ శిక్షణ నేర్పిస్తున్నారు. జైలులో నేర్పిన యోగానే నా జీవితానికి మలుపు జైలు శిక్ష సమయంలో రాజమహేంద్రవర్మ కర్మాగారంలో నేర్పిన యోగాయే తన జీవితంలో మంచి మార్పు తెచ్చిపెట్టింది. చాలా అనారోగ్య పరిస్థితిల్లో క్షణికావేశంలో జైలుకు వెళ్లిన నాకు అక్కడ యెగా నేర్పడంతో అనారోగ్యాలు దూరమై మానసిక ప్రశాంతత లభించింది. అదే మార్పును సమాజంలోని ప్రతి ఒక్కరికీ యోగా నేర్పించాలన్నదే నా ప్రధాన ధ్యేయం.– మసిముక్కల రామకృష్ణ, యోగా గురువు, పులిమేరు, పెద్దాపురం మండలం -
వస్తువులం కాదు.. మనుషులమే
న్యూఢిల్లీ : తీహార్ జైలులో ఓ ముస్లిం ఖైదీ వీపు మీద బలవంతంగా ఓం గుర్తును ముద్రించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనపై ఏఐఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘మమ్మల్ని అవమానించడానికి రోజుకోక కొత్త మార్గాన్ని కనిపెడుతున్నారు. అతన్ని ఓ పశువులాగా భావించి ఓం గుర్తును ముద్రించారు. ఇది చాలా అసాధరణమేకాక ఎంతో అవమానకరం కూడా. మేము మనుషులమే.. వస్తువులం కాదు. కావాలనే నబ్బీర్ ఒంటి మీద ఈ ప్రత్యేక గుర్తును ముద్రించారు.. తప్ప ఇందుకు వేరే ఇతర బలమైన కారణాలు ఏం లేవు కదా’ అని ట్వీట్ చేశారు. Everyday, a more innovative way is developed to humiliate us To brand someone like cattle is cruel, unusual & dehumanising. We’re not chattel, we’re HUMAN. (Let’s not pretend there’s any other reason why Nabbir was branded with this specific symbol)https://t.co/eFMUvWTJJZ — Asaduddin Owaisi (@asadowaisi) April 19, 2019 ఇంతకు విషయం ఏంటంటే షబ్బీర్ అలియాస్ నబ్బీర్ అనే వ్యక్తి తీహార్ జైలులో ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం నబ్బీర్.. తమ బ్యారక్‌లోని ఇండక్షన్ స్టవ్ సరిగా పని చేయడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వారు ‘ఫిర్యాదులు చేస్తున్నావ్.. నాయకుడిగా ఎదగాలని చూస్తున్నావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్లి చితకబాదారు. అంతటితో ఊరుకోక మెటల్ ఓం సింబల్‌ని తీసుకొచ్చి.. కాల్చి దాన్ని నబ్బీర్ వీపు మీద ముద్రించారు. ఓ రెండు రోజుల పాటు అతనికి భోజనం కూడా పెట్టలేదు. ఈ విషయం గురించి తోటి ఖైదీలకు ‘నబ్బీర్ హిందువుగా మారాడు. ప్రస్తుతం నవరాత్రి దీక్ష చేస్తున్నాడు. దానిలో భాగంగా ఉపవాసం ఉన్నాడని’ తెలిపారు. ఈ క్రమంలో జైలులో తనకు జరిగిన అవమానం గురించి నబ్బీర్ తన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఈ క్రమంలో ఈ నెల 17న నబ్బీర్ కేసు ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సమయంలో నబ్బీర్ తల్లి జైలులో తన కొడుకుకు ప్రాణాపాయం ఉందని బెయిల్ మంజూరు చేయమని కోర్టును కోరింది. దాంతో న్యాయమూర్తి విషయం ఏంటని ప్రశ్నించగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. -
ప్రేమఖైదీకి ఊరట
చెన్నై,టీ.నగర్: మైనర్ బాలికను ప్రేమించి వివాహం చేసుకుని, గర్భవతిని చేసిన కేసులో నిందితుడిపై పోక్సో చట్టం ప్రయోగించేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. చెన్నై చూళైమేడుకు చెందిన 17 ఏళ్ల బాలిక అదే ప్రాంతంలోగల పాఠశాలలో ప్లస్‌వన్ చదువుతూ వచ్చింది. ఈమె పాఠశాలకు వెళ్లి వస్తుండగా ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మన్నడికి చెందిన మహ్మద్ రియాస్ (28)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. బాలిక మైనర్ కావడంతో వీరి ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇదిలావుండగా ఈనెల ఎనిమిదో తేదీన ప్రేమజంట హఠాత్తుగా మాయమయ్యారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు చూలమేడు పోలీసు స్టేషన్లో మహ్మద్ రియాస్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. వారు నాగపట్నంలో ఉన్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి ఇద్దరిని చెన్నైకు తీసుకువచ్చారు. బాలిక మైనర్ కావడంతో మహ్మద్ రియాస్‌ను థౌజండ్‌లైట్స్ మహిళా పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ఇదిలాఉండగా మహ్మద్ రియాస్‌ను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో విద్యార్థిని వద్ద మేజిస్ట్రేట్ విచారణ జరిపారు. ఆ సమయంలో విద్యార్థిని మహ్మద్ రియాస్తోనే జీవిస్తానని తెలిపింది. దీంతో మేజిస్ట్రేట్ మహ్మద్ రియాస్‌ను పోక్సో చట్టం కింద జైలులో నిర్బంధించడం సాధ్యం కాదని వెల్లడించారు. దీంతో పోలీసులు గత్యంతరం లేకుండా మహ్మద్ రియాస్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
బాహ్య ప్రపంచంలోకి ఖైదీ
ఆరిలోవ(విశాఖ తూర్పు): మహాత్మా గాంధీజీ 150వ జయంతి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి విముక్తి కలిగింది. మరో రెండు నెలల్లో జైలు శిక్ష ముగియనున్న ఆయన శుక్రవారం బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టాడు. వివరాలిలా ఉన్నాయి. జాతిపిత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శిక్ష పడిన ఖైదీలలో సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేయడానికి నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టు 27న క్షమాభిక్ష జోవో విడుదల చేసింది. నిబంధనలు ప్రకారం అర్హులైన ఖైదీలను విడుదల చేయాలని పేర్కొంది. దీంతో ఇక్కడ జైలు అధికారులు ఆగమేఘాలపై అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ఇక్కడ నుంచి 14 మంది అర్హులైన ఖైదీల జాబితా జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు పంపించారు. వాటిని స్క్రూటినీ చేసి 9 మంది అర్హులుగా ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే గురువారం రాత్రి ఆ జాబితాలో ఒక్కరే అర్హుడిగా ప్రకటిస్తూ ఉన్నతాధికారుల నుంచి ఇక్కడ జైలు అధికారులకు ఉత్తర్వులు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు విడుదల కాగా.. వారిలో విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఒకరికి అవకాశం కలిగింది(మిగిలిన నలుగురు రాజమండ్రి కారాగారం నుంచి విడుదలయ్యారు). ఈ ఉత్తర్వుల ప్రకారం క్షమాభిక్షకు అర్హుడైన విజయనగరంలో వీటి అగ్రహారం పెద్దవీధికి చెందిన బోడసింగి శ్రీనివాసరావును జైల్ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. గాంధీ రాసిన గ్రంథంపై ఆయనతో జైలు డిప్యూటీ సూపరింటెండెంట్లు వెంకటేశ్వర్లు, జి.మనోహర్‌రెడ్డి, జైలర్లు సమక్షంలో జైల్ ముందున్న గాంధీ విగ్రహం వద్ద ప్రమాణం చేయించారు. విగ్రహానికి విడుదలైన ఖైదీతో పూలదండ వేయించి నివాళులు అర్పించారు. అనంతరం బాహ్య ప్రంచంలోకి విడిచిపెట్టారు. నిబంధనలు ప్రకారం ఆయనతో పూచికత్తు బాండ్ రాయించుకున్నామని డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు విలేకరులకు తెలిపారు. ఆయన బాహ్య ప్రపంచంలో ఎలాంటి నేరాలు, గొడవలకు పాల్పడితే మళ్లీ జైలుకు తీసుకొస్తామన్నారు. శ్రీనివాస్‌కు 498ఏ, 324 కేసుల్లో శిక్ష శ్రీనివాసరావు తన భార్యను వేధించిన కేసులో సెక్షన్ 498ఏ కేసులో కోర్టు సంవత్సరం శిక్ష, రూ.1,000లు జరిమానా విధించింది. ఆయన రూ.1000లు జరిమానా చెల్లించాడు. దీంతో పాటు సెక్షన్ 324 కేసులో మరో ఆరు నెలల శిక్ష పడింది. ఈ రెండిండికి కోర్టు ఏక కాలంలో శిక్ష విధించింది. నాలుగు నెలల పాటు విజయనగరం సబ్ జైల్లో రిమాండ్ ఖైదు అనుభవించిన శ్రీనివాసరావు శిక్ష పడిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ క్షమాభిక్షలో అర్హుడు కావడంతో మరో రెండు నెలలు శిక్షా కాలం ఉండగానే విడుదలయ్యాడు. గాంధీ దయవల్లముందుగానే బయటపడ్డా.. శిక్షా కాలం పూర్తి కాకుండానే మహాత్మా గాంధీ దయ వల్ల రెండు నెలల శిక్షా కాలం ఉండగానే బయటపడ్డాను. బాహ్య ప్రపంచంలో ఎలాంటి గొడవలు, నేరాలకు పాల్పడకుండా జీవిస్తాను. జైలు జీవితం నాలో మంచి మార్పు తీసుకొచ్చింది. జైలులో స్వేచ్ఛను కోల్పోయినా మంచి ప్రవర్తన నాలో కలిగింది. – శ్రీనివాసరావు,క్షమాభిక్షపై విడుదలైన వ్యక్తి -
ఎట్టకేలకు నాని దొరికిపోయాడు!
ఆదోని టౌన్: ఆదోని సబ్‌జైల్ నుంచి తప్పించుకున్న మహేష్ అలియాస్ నాని అనే ఖైదీని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మంగళవారం రాత్రి గుంటూరు–మంగళగిరి మధ్యలో అరెస్ట్ చేసి, ఆదోనికి తీసుకొచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఎమ్మిగనూరుకు చెందిన ఇతను ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, చీటీల పేరిట పలువురిని మోసం చేశాడు. ఈ కేసుల్లో శిక్ష పడడంతో 2013 జూన్ 21న ఆదోని సబ్‌జైలుకు వచ్చాడు. జైలులోనే ఉంటూ తప్పించుకునేందుకు అనుచరగణం, పోలీస్, న్యాయవ్యవస్థలోని కొంతమందితో కలిసి పథకాన్ని రచించాడు. ఈ పథకం అమల్లో భాగంగా కొందరు వ్యక్తులు 2013 జూలై 17న తాము పోలీసులమని, మహేష్‌ను తీసుకెళ్లడానికి పీటీ వారెంట్‌తో వచ్చామని ఆదోని సబ్‌జైలు సిబ్బందిని నమ్మించారు. అది నకిలీ పీటీ వారెంట్ అని గుర్తించేలోపే అతన్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చి..వెంటనే ప్రత్యేక వాహనంలో సరిహద్దు దాటించారు. దీంతో ఈ విషయంపై జైలు సూపరింటెండెంట్ రత్నం ఆదోని టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేష్, మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహేష్ కోసం అప్పట్లో ప్రత్యేక బృందాలతో గాలించినా ఫలితంలేకపోయింది. మిగిలిన వారిని మాత్రం అరెస్టు చేశారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని.. జైలు నుంచి పరారైన తర్వాత మహేష్ తనను ఎవరూ గుర్తు పట్టకుండా మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓ మత గురువుగా మారి జనానికి చేరువైనట్లు సమాచారం. అయితే..ఇతను మారువేషంలో మంగళగిరి ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు ఉప్పందింది. దీంతో డీఎస్పీ క్రైంపార్టీ ఏఎస్ఐ ఆనంద్, పోలీసులు శాంతరాజ్, క్రిష్ణ, రంగన్న మంగళవారం రాత్రి అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం అతన్ని ఆదోనికి తరలించి విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
రాజుగారికి నచ్చిన అబద్ధం
షేక్ సాదీ (అలై రహ్మా) గొప్ప పండితులుగా పేరు గడించారు. ఆయన చెప్పిన గాథలు సమాజ సంస్కరణ కోసం ఎంతో ఉపయోగపడేవి. ఆయన చెప్పినదే ఈ గాథ. ఓ రాజుగారు ఫలానా ఖైదీని ఉరితీయండి అని తలారిని ఆజ్ఞాపించారు. ఈ మాటలు విన్న ఖైదీ ప్రాణం మీద ఆశలు వదులుకున్నాడు. రాజుగారి మీద కోపం కట్టలు తెగింది. ఎలాగూ చావు తప్పదని రాజుగారిని తనదైన భాషలో నానా దుర్భాషలాడటం మొదలెట్టాడు. ఆ విధంగా రాజుగారి మీద కక్ష తీర్చుకున్నాడు. రాజుగారికి ఖైదీ మాటలు అర్థంకాక పక్కనే ఉన్న మంత్రులను అడిగారు. అందులో నుంచి ఒక మంత్రి కలగజేసుకొని ‘‘ఈ ఖైదీ మిమ్మల్ని దీవిస్తున్నాడు. ‘‘తమ కోపాన్ని దిగమింగేవారు, ఇతరులను క్షమించేవారంటే అల్లాహ్‌కు ఎంతో ఇష్టం’’ అనే ఖుర్ఆన్ వచనాన్ని వల్లిస్తున్నాడు’’ అని రాజుగారికి మంత్రి వివరించాడు. మంత్రి చెప్పిన ఈ మాటలతో రాజుగారికి ఖైదీ మీద కోపం చల్లారింది. ఆ ఖైదీ ఉరిశిక్షను రద్దుచేస్తూ క్షమాభిక్ష పెట్టారు. పక్కనే ఉన్న మరోమంత్రి కలగజేసుకుని ‘‘ఈ ఖైదీ దీవెనలు ఇచ్చింది, క్షమాపణలు కోరింది అంతా పచ్చి అబద్ధం. రాజుగారికే అబద్ధం చెబుతావా! రాజుగారూ ఈ ఖైదీ మిమ్మల్ని నానా దుర్భాషలాడాడు’’ అని నిజం చెప్పాడు. రెండోమంత్రి నిజం చెప్పినా అతని మాటలు రాజుగారికి నచ్చలేదు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ‘‘నువ్వు చెప్పిన నిజం కంటే మొదటి మంత్రి చెప్పిన అబద్ధం నాకెంతో నచ్చింది. ఎందుకంటే మొదటి మంత్రి అబద్ధం చెప్పినా అతని సంకల్పం సత్యంపై ఉండింది. నువ్వు నిజం చెప్పినా నీ సంకల్పం నాకు నచ్చలేదు.’’ అన్నారు. మొదటి మంత్రిని అభినందించారు. – అమ్మార్ -
ఖమ్మం జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం
ఖమ్మంరూరల్: స్థానిక రామన్నపేటలో గల జిల్లా జైలులో మాదాసు శ్రీనివాస్ అనే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న ఖైదీ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఖమ్మం నగరానికి చెందిన శ్రీనివాస్ గత ఐదు సంవత్సరాల క్రితం హత్యకేసులో జీవిత ఖైదుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే నెలరోజుల పెరోల్ కింద ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గడిపి, రెండు రోజులక్రితం తిరిగి జైలుకు వచ్చాడు. అప్పటి నుంచి వింతగా ప్రవర్తిస్తుండటంతో జైలు అధికారులు ఒక దఫా కౌన్సెలింగ్ ఇచ్చారు. తన జీవితం జైలులో పూర్తవుతుందని, ఇక తాను ఏమీ చేయలేనని మనోవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తోటి ఖైదీలతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. తెల్లవారుజామున గది డోర్ కర్టెన్‌కు ఉన్న ఇనుప క్లిప్పులతో మెడపై కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన ఖైదీలు విధుల్లో ఉన్న జైలు వార్డర్‌కు చెప్పపడంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్ సెలవులో ఉండటంతో వరంగల్ ఎంజీఎం హాస్పిటకు పంపారు. వైద్యులు శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. -
ఒక్క రాత్రి కోసం
ఎవరో సంగీతకారుడు ఎడతెగకుండా ఒకే స్వరం వాయిస్తున్నట్టు మానిటర్ల బీప్ బీప్ శబ్దం వినిపిస్తూ ఉంది. ఆ శబ్దం వినసొంపుగా ప్రాణానికి చాలా హాయిగా ఉంది. మంచం పక్కనే కాపలాదారుల్లాంటి యంత్రాలు, వాటినుంచి బయటకు వచ్చిన లెక్కకు మించిన వైర్లు, స్ట్రాపులు మంచం మీద శరీరాన్ని అంటి పెట్టుకుని ఉన్నాయి. అవి బాకాల్లా చేస్తున్న తూతూమనే చప్పుడు కూడా వినిపిస్తోంది. నాకిక్కడ ఉండాలని లేదు. కానీ ఉన్నాను. పక్క గదిలోంచి నవ్వులు వినిపించాయి. తాతగారు కోలుకున్నారని కుటుంబ సభ్యులంతా కేరింతలు కొడుతున్నారేమో? అయ్యుండచ్చు. వాళ్ళందరికీ అనారోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వారి ఆనందం నా వేదనకి పూర్తి వ్యతిరేకం. నేనున్న ఈ గదిలో కోలుకోవటం అనేది ఉండదు. మూత్రం, ఫినాయిల్ వాసనలు చావుకి దగ్గర వాసనల్లా అనిపిస్తున్నాయి. పావురం గూటిలాంటి ఈ ఇరుకు గదిలో వాడిపోతున్న పూలు పరిసరాల్లాగే చావుని తలపిస్తున్నాయి. వాటిని విదిలించి కొట్టాను. నేల మీద చెల్లాచెదురుగా పడిపోయాయి జీవం లేని పూలు! దయనీయమైన అవిటి స్థితిలో నేలమీద పరుచుకున్న వాటిని చూసి పరిహాసంగా నవ్వాను. నవ్వుతో పాటే వచ్చిన హుంకారం గొంతుకడ్డం పడి లోపల్నించీ కుళ్ళిన పైత్యరసం తన్నుకొచ్చింది. అది నా గొంతుని కాల్చేసి వంద హాంగోవర్ల అనుభూతిని రగిల్చి నోరంతా వ్యాపించింది. ఇక్కడ – నాకు ఉండాలని లేని ఈ స్థలంలో – ఎంత సేపట్నుంచీ ఉన్నానో తెలియడం లేదు. చావు చాలా చంచలమైన గుణం కలవాడు. వాడి కాల ప్రమాణం వేరు. దానికనుగుణంగా మాత్రమే పని చేస్తాడు. మనుషుల్ని చంపెయ్యడమే పని అయినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు చేయచ్చు కదా!గిన్నెలోంచి ఒక ద్రాక్ష పండు చేతిలోకి తీసుకున్నాను. అది రంగు మారిపోయి కొంచెం వత్తితే చాలు రసం వచ్చేట్టు మెత్తగా కుళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. గదిలోని వేడి ఇప్పుడు తెలుస్తోంది. పూలు పళ్ళు వాడిపోయాయంటే పోవూ మరి? మా అక్క వాటినిక్కడకు తెచ్చి రెండు రోజులే అయింది. అక్క చాలా మంచిది. ‘‘ఈ రాత్రికి నువ్వు విశ్రాంతి తీసుకో’’ అని నేనే పట్టుబట్టి పంపించేశాను. రోజూ ఆస్పత్రికి రావటం వల్ల తను ఏరోబిక్స్ తరగతులకు వెళ్లలేకపోతోంది. ‘ఈ రోజుల్లో ఎవరికీ మంచి మనసు లేదు’ అనే ఫెర్గల్ షార్కీ పాట పాడాను తనకోసం. ఇందులోని జోక్ అర్థమైందో లేదో గానీ ఈ పరిస్థితుల్లో ధైర్యంగా ఉండటానికి నేను చేస్తున్న ప్రయత్నాన్ని అక్క మెచ్చుకుంటున్నట్టే అనిపించింది. పార్శ్వపు తలనొప్పి వచ్చేలా ఉంది. వెలుతురుని భరించలేక మంచం మీదున్న రిమోట్ తీసుకొని దీపకాంతి తగ్గించాను. నాకు ఒత్తిడి శత్రువు. గదిలో పైకప్పు మీద ఓ చిన్న ఎల్ఈడీ దీపం ఎర్రగా వెలుగుతోంది. నన్ను చూసి అది మిణుకు మిణుకుమంది. నేనూ దాన్ని చూసి రెప్పలు కొట్టాను. అలా మాట్లాడుకున్నాక, నాకు దాని మీద చాలా ఈర‡్ష్య కలిగింది. ఈ దీపం జీవితం ఏ కష్టాలు సమస్యలూ లేకుండా ఎంత హాయిగా గడిచిపోతోంది?! దాని ఆయువులో సగం కూడా ఏ మనిషీ బతకలేడేమో. చిన్నదైనా ఎంతో ముఖ్యమైనది అనిపించేలా ఉంది దాని వాలకం. దయలేని దాని దర్జా బతుకులో నేను కోరుకున్నవన్నీ ఉన్నాయి – కష్టాలు లేని దీర్ఘాయుష్షు, సమస్యలు లేని సుదీర్ఘ జీవితం. చేతిలోని ద్రాక్ష దాని మీదకు విసిరేశాను. దానికీ నాకూ స్నేహం లేదిక. హఠాత్తుగా జానీ క్యాష్ పాడిన ‘ఇరవై ఐదు నిమిషాలు’ అనే పాట కూనిరాగాలు తీయడం మొదలు పెట్టాను. ఒక ఖైదీ ఉరికంబం ఎక్కే ఇరవై ఐదు నిమిషాల ముందు నుంచీ ఏమి జరుగుతుందో పాడాడు క్యాష్. చివర్లో ఉరితాడుకి వేలాడుతున్న ఖైదీని తాడుతో సహా ఒక గద్ద తన్నుకుపోతుంది. నా పరిస్థితికీ పాట అసందర్భంగా లేదూ? పక్క గదిలోంచి నవ్వులు నా పాటను ఆపేశాయి. నిజంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఆ తాత నిజంగానే డిశ్చార్జి అయి వెళ్ళిపోతున్నాడేమో. లేకుంటే నర్సు ఆయనకి మంచంలోనే స్నానం చేయిస్తూ కుటుంబమంతా నవ్వటానికి ఏదో కారణం కనుక్కున్నట్టుంది. ఈ ఆలోచన నా బాల్య స్మృతులను తట్టి లేపింది. చెత్త కుప్పలో పారేసిన పాత చెప్పుల్లా వాటిని ఎప్పుడో వదిలించుకున్నా పరుగున వచ్చి నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నా తండ్రి నాకు భిక్షగా ప్రసాదించిన దూషణ తిట్లు, దెబ్బలు, హింస గుర్తొచ్చాయి. నా తల్లి ఆయన్నే సమర్థిస్తూ నాకు నచ్చచెప్పడానికి చూసేది. ‘‘ఆయన ఒక శాసకుడు. నీకు అంతా మంచి జరగాలనే, నువ్వు అన్నిట్లోనూ ముందుండాలనే ఆయన ఇలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు’’ అని పదే పదే చెప్తుండేది. అంతా మంచి జరగటం అంటే దెబ్బలకి కమిలిపోయిన కళ్ళు నొప్పెట్టడం, చీకటంటే భయం కలగటం అయితే కచ్చితంగా నా తండ్రి క్రమశిక్షణలో కృతకృత్యుడయ్యాడు. ఉన్నట్టుండి నా ఆలోచనలకు కళ్ళెం పడింది. రోగి గుండె కొట్టుకోవటం ఆగిపోయినప్పుడు యంత్రం చేసే కీచుమనే చప్పుడు నా తపస్సుని భంగం చేసింది. చటుక్కున తలతిప్పి నా పక్కనున్న మానిటర్ని చూశాను. ఈ మానిటర్ కాదు. అంత అదృష్టం కూడానా? ఇక్కడ నేనుండటం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతోంది. గాజు తలుపులోంచి బయటకు చూశాను. నర్సులంతా ఎక్కడికో హడావుడిగా పరిగెత్తుతున్నారు. ఇంకెక్కడికి? డిశ్చార్జ్ అవుతున్న ఆ ముసలి తొక్కుగాడి దగ్గరికే. వాడికి పెట్టిన వైర్లన్నీ పీకేశారు. అందుకే ఆ చప్పుడు. కులుక్కుంటూ ఇంటికెళ్ళడానికి తయారయ్యాడు. కొడుకు కాబోలు తలుపు దగ్గరికి నడిపించుకుంటూ వచ్చాడు. ఇద్దరూ నవ్వుతున్నారు. కొడుకు తండ్రి ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు చాలా సంతోషంగా, సుఖంగా ఉన్నారు. దొంగ నా కొడుకులు. శాపనార్థాలు పెడుతూ వాళ్ళని శాశ్వతంగా ద్వేషిస్తానని అప్పటికప్పుడే అక్కడిక్కడే శపథం చేసుకున్నాను. నాకు తెలుసు నా తండ్రిని ఎప్పటికీ అలా పట్టుకోలేనని. మళ్ళీ తండ్రి గురించిన ఆలోచనలు. శారీరక హింస కన్నా మానసిక హింస చాలా భయానకం. ఒంటి మీది గాయాలు మానిపోతై. పగిలిన మనసు అతుక్కుంటుందా? నల్ల జాతీయుణ్ణి డేట్ చేస్తున్నానని చెప్పినప్పుడు నన్ను కోమాలోకి జారిపోయేట్టు కొట్టాడు. అయినా నేను ఆయన మీద పరువు నష్టం దావా వేశానా? పోలీసులకి చెప్పి బొక్కలోకి తోయించానా? అప్పట్నుంచీ మా మధ్య మాటలు తక్కువయ్యాయి, అంతే! అయినా, నా తప్పు లేకుండా చాలాసార్లు మాట్లాడిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా పోయిన నెల ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చినప్పటి నుండి. కానీ సరిదిద్దుకోలేని తప్పులు చేయటం వల్లో పశ్చాత్తా్తపం కట్టి కుదిపెయ్యటం వల్లో తేలు కుట్టిన దొంగలా ఆయనే జవాబివ్వలేదు. ఆ ముసలి వాడి కుటుంబం వెళ్ళిపోయినట్టున్నారు. బయట నిశ్శబ్దంగా ఉంది. బీప్ శబ్దం, నా ఊపిరి శబ్దం మాత్రమే వినిపిస్తున్నాయి ఈ నిర్బంధ ప్రదేశంలో. ఇంకో గంటవరకూ నర్సులెవరూ ఇటువైపు రారని నాకు తెలుసు. వాళ్ళు వచ్చినా పక్క తడిసిందా, బీపులు వినిపిస్తున్నాయా అని మాత్రమే చూస్తారు. అచేతనంగా నిశ్చలంగా కూర్చున్నాను, గత కొన్ని వారాల నుంచి ప్రతి రాత్రి కూర్చున్నట్టే. ఇంకా ఇలాగే కొనసాగే ఓపికుందా నాకు? లేమ్మా, నువ్వే పూనుకుని ఏదైనా చెయ్యాలి అని నన్ను నేనే బతిమాలుకున్నాను. చావు వాడంతట వాడు రాడు. వాడు – కాదు కాదు, వాళ్ళు– చావు, నా తండ్రి – ఇద్దరూ నా బలహీనతల్ని ఎగతాళి చేస్తారు. నేను ఈ విషయంలో చాలా గట్టిగా ఉండాలి. ఎందుకీ ఎదురు చూపు? అనుమతి కోసమా? ఎవరున్నారు అవుననడానికి కాదనడానికి? ఇక్కడ నేనూ ఈ యంత్రపు సూదీ తప్ప ఎవరూ లేరు. నేనే సర్వాధికారిని. చావు నన్ను కొరుక్కు తిననీ. వాడికన్నా నేనే బాగా చేయగలను. వాడుత్త కల్పన! మనుషుల మరణం మీద వాడికసలు పట్టు ఉందా? లేదు అంటున్నాను బల్ల గుద్ది! ఇక నేనే ఆధిపత్య కళ్ళాలు తీసుకుంటున్నా. విధి దుష్ట హస్తాన్ని నేనే అవుతా ఈ రాత్రికి. అత్యంత దయనీయంగా పడుకొని ఉన్న ఆయన్ని చూశాను. హార్ట్ ఎటాక్ తర్వాత మనిషి చాలా పీక్కుపోయాడు. ఇక ఎందుకూ పనికిరాడు. పనెక్కువ జీతాలు తక్కువ అయినా దేవదూతల్లాంటి ఈ ఆస్పత్రి నర్సుల వల్ల, హాస్పిటల్ వాళ్ళిచ్చే టీఎల్సీ ఆహారం వల్లా, కంప్యూటర్ యంత్రాల వల్లా ఆయనింకా బతికున్నాడు. ఆయన చేతి మీద చొక్కాగుడ్డ ఎత్తాను. ఇంజక్షన్ చేయటానికి వీలుగా సిరంజిలో కడ్డీని నెమ్మదిగా పళ్ళతో పట్టి బయటకు లాగాను. దాన్ని నోట్లోనే చప్పరించాను. చిన్న కరెంట్ షాక్ కొట్టింది. చాల జాగ్రత్తగా, నెమ్మదిగా సూదిని సెలైన్ ఎక్కుతున్న నరంలోకి గుచ్చాను. డెమెరాల్ పని చేయటం మొదలుపెడుతుంది. ఓ గంటలో చనిపోతాడు. హార్ట్ ఎటాక్ పేషెంట్ హార్ట్ ఎటాక్‌తో పోతే ఇంకా అనుమానాలేముంటాయి? పోస్ట్‌మార్టం కూడా ఉండదు. పర్ఫెక్ట్ మర్డర్. ఆయన నుదుటి మీద ముద్దు పెట్టుకోవడానికి వంగినప్పుడు నా కన్నీటి చుక్క రాలిపడింది. ‘‘గుడ్ బై నాన్నా’’ అన్నాను.ఆస్పత్రి క్యాంటీన్ వైపు నడిచాను కాఫీ కోసం. ఎలాగూ ఓ గంటలో మళ్ళీ రావాలిగా. ఈ లోపు కారు నడుపుకుంటూ ఇంటికి వెళ్లి రావటం దండగ. నా నిరీక్షణ ఫలించబోతోంది. ఇక్కడ కొచ్చినందుకు సంతోషంగా ఉంది. -
లాలూ రోజుకూలీ @ రూ. 93
పట్నా : దాణా కుంభకోణంలో శిక్ష ఖరారైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను అధికారులు బిర్సా ముండా జైలుకు తరలించారు. లాలూ వయసును దృష్టిలో పెట్టుకుని.. ఆయన చేయ గలిగిన పనులనే అప్పగిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం లాలూకు బిర్సా ముండా జైల్లో తోటపని అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ పని చేసినందుకు గానూ లాలూ రోజుకు.. 93 రూపాయల కూలీ లభిస్తుంది. ఇదిలావుండగా.. గడ్డి కుంభకోణంలో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే లాలూ ప్రసాద్ యాదవ్ హిందీలో ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. లౌకికతత్వం, సామాజిక న్యాయం, సమానత్వం, దళితులు, వెనుకబడిన వర్గాల కోసం ప్రాణాలైనా ఇస్తాగానీ.. కాషాయ పార్టీకి తలొగ్గేది లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లను మనువాదులుగా అభివర్ణించారు. -
123 ఏళ్ల జైలుశిక్ష.. అంతలోనే ఆత్మహత్య!
వాషింగ్టన్: పలు కేసుల్లో దోషిగా తేలడంతో ఆ నిందితుడికి 123 ఏళ్ల జైలుశిక్ష విధించారు. కానీ ఆ మరుసటిరోజే జైళ్లో ఆ నిందితుడు తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంది. జార్జ్ జాన్సన్(28) అదివరకే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో గత అక్టోబర్ లో పోలీసులు జాన్సన్ ను అదుపులోకి తీసుకునేందుకు చూడగా మొదట ఓ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి ఆపై ఓ ఆఫీసులో (బర్గర్ కింగ్)కి ప్రవేశించాడు. ముగ్గురు ఉద్యోగులు సహా ఓ ఏడేళ్ల బాలికను తుపాకీతో బెదిరించాడు. ఎంతగానో వేడుకోగా రెండు గంటల తర్వాత ఇద్దరు ఉద్యోగులను వదిలిపెట్టాడు జాన్సన్. దాదాపు ఐదునున్న గంటల పాడు ఓ ఉద్యోగి, బాలిక అతడి నిర్బంధంలోనే ఉండిపోయారు. చివరికి ఎలాగోలా పోలీసులు జాన్సన్ ను అదుపులోకి తీసుకున్నారు. 2016లో ఆటోమేటిక్ హ్యాండ్ గన్ తో కొన్ని గంటలపాటు కాల్పులకు పాల్పడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో దోషిగా తేల్చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేసే కొన్ని రోజుల ముందు ఓ యువతిపై అత్యాచారం జరిపిన కేసుకుగానూ జాన్సన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జాన్సన్ పై నమోదైన పలు కేసుల్లో దోషిగా తేలడంతో మేజిస్ట్రేట్ నిందితుడికి 123 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. ఆపై కొన్ని గంటల తర్వాత జైలు గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. -
రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
ప్రకాశం : అండర్ ట్రైల్లో ఉన్న ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి సబ్ జైలులో చోటుచేసుకుంది. రిమాండ్ ఖైదీ రమేష్(21) టాయిలెట్ రూంలో తన లుంగీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు రమేష్‌ను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఓ దొంగతనం కేసులో రమేష్ రిమాండ్ ఖైదీగా ఉన్నట్లు జైలు సూపరిండెంట్ వసంత రావు తెలిపారు. రమేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
చర్లపల్లి జైలు అధికారిపై ఖైదీ దాడి!
హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగార డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరతంపై ఓ ఖైదీ దాడికి పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడిలో గాయపడి చెయ్యి విరిగిన జైలు అధికారి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా దాడి జరగలేదని పెనుగులాట మాత్రమే జరిగిందని జైలు పర్యవేక్షణాధికారి ఎం.ఆర్. భాస్కర్ అంటున్నారు. అసదుద్దీన్ ఒవైసీపై దాడి కేసులో పదేళ్ల జైలు శిక్షపడిన మహ్మద్ పహిల్వాన్ అనుచరుడు అహ్మద్‌బీన్ సౌద్ జైల్లోని స్వర్ణముఖి బ్యారక్‌లో ఉంటున్నాడు. అతను సెల్‌ఫోన్ వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న జైలు అధికారులు అతనిపై నిఘా పెట్టారు. అందులో భాగంగా ఉప పర్యవేక్షణాధికారి చింతల దశరతం ఆకస్మిక తనిఖీ చేసి సెల్‌ఫోన్‌ను గుర్తించారు. ఆ సెల్‌ఫోన్‌ను స్వా ధీనం చేసుకునే క్రమంలో అహ్మద్‌బీన్ సౌద్ విచక్షణ కోల్పోయి దశరతంపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దశరతం చెయ్యి విరగడంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రి కి తరలించారు. ఈ నెల 1న ఆయన చేతికి శస్త్ర చికిత్స చేశారు. ఇదంతా జరిగి 10 రోజులు గడుస్తున్నా విషయం బయటకు తెలియకుండా జైలు అధికారులు గుట్టుగా వ్యవహరించారు. ఈ ఘటనపై జైలు పర్యవేక్షణాధికారి భాస్కర్‌ను వివరణ కోరగా దాడి జరగలేదని, సెల్ స్వాధీనం చేసుకునే క్రమంలో పెనుగులాట జరిగిందంటూ సమాధానం చెప్పడం గమనార్హం. సెల్ఫోన్లు, మద్యం బాటిళ్లు జైల్లోకి ఎలా వచ్చాయి? అహ్మద్‌బీన్ సౌద్ ఉంటున్న బ్యారక్‌లో సెల్‌ఫోన్‌తో పాటు మద్యం బాటిళ్లు కూడా లభ్యమైనట్లు తెలిసింది. ఇంత సెక్యూరిటీ ఉన్నా జైలులోకి నిషిద్ధ వస్తువులు ఎలా ప్రవేశించాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు చర్లపల్లి జైలు పర్యవేక్షణాధికారి భాస్కర్ తెలిపారు. -
ఒక్క కౌగిలి... నేరస్థుడిని మార్చింది..!
-
ఒక్క కౌగిలి... నేరస్థుడిని మార్చింది..!
స్నేహం మనిషిని మారుస్తుందా? హంతకుడిని మానిషిని చేస్తుందా? ఇటువంటి ప్రశ్నలకు సజీవ సాక్ష్యాలుగా.. ఇయాన్ మాన్యుయేల్, డెబ్బీ బెగ్రీ నిలుస్తారు. స్త్రీ పురుష సంబంధాలు బలహీనమవుతున్న ఈ కాలంలో స్నేహం విలువను కాపడడమేకాక కొత్త విలువలు చాటారు. వీరిద్దరి గురించి చెప్పుకోవాలంటే దాదాపు రెండున్నర దశాబ్దలు వెనక్కు వెళ్లాలి. అది 1991 సంవత్సరం. అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతం. నిత్యం రద్దీగా ఉండే పార్క్ ఏరియా. అక్కడ తన ఇద్దరు పిల్లలతో కలిసి డెబ్బీ (28) అక్కడకు వచ్చింది. అంతలోనే దారి దోపిడీ చేసేందుకు 13 ఏళ్ల ఇయాన్ మాన్యుయేల్ అక్కడకు వచ్చాడు. చూస్తున్నంతలోనే ఇయాన్ చేతిలోని తుపాకి బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. డెబ్బికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఇయాన్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పర్చారు. దోపిడీ, హత్యా నేరాలపై విచారణ జరిపిన కోర్టు.. ఇయాన్కు యావజ్జీవ శిక్ష విధించింది. శిక్ష పడే నాటికి ఇయాన్కు 14 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులోనే జీవితం జైలుకు అంకితం కావడంతో ఇయాన్ విలవిల్లాడాడు. ఏడాది తరువాత పశ్చాత్తాపం మొదలై.. డెబ్బీతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. మొదట్లో ఇయాన్‌తో మాట్లాడేందుకు డెబ్బీ అంగీకరించలేదు. అయితే ఇయాన్ పట్టుదల చూసి క్షమించి అతనితో మాట్లాడడం మొదలు పెట్టింది. ఇది క్రమంగా స్నేహంగా మారింది. ఆ తరువాత ఈ స్నేహం మరింత గట్టిపడింది. ఇక్కడ నుంచే కథ మరో మలుపు తిరిగింది. ఇయాన్‌ను విడిపిచడం కోసం డెబ్బీ.. ఈక్వల్ జస్టిస్ ఇన్షియేటివ్ సంస్థను కలిసింది. ఆ సంస్థ లాయర్ బ్రెయాన్ స్టావెన్సన్.. ఇయన్ తరఫున వాదించేందుకు అంగీకరించాడు. వాదనలు.. ప్రతివాదనలు సుదీర్ఘంగా సాగాయి. చివరకు ఇయాన్కు క్షమాభిక్ష పెట్టేందుకు కోర్టు అంగీకరించింది. చిట్టచివరకు ఇయాన్ 39 ఏళ్ల వయసులో జైలు నుంచి 2016 ఆఖరులో విడుదల అయ్యారు. జైలు నుంచి విడుదల అయిన తరువాత కూడా ఇయాన్-డెబ్బీలు తమ పవిత్ర స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇయాన్ నా పిల్లలతో సమానం అంటోంది డెబ్బీ. ఈ పరిణామాల క్రమాన్ని ఇద్దరు కలసి ఒక వీడియో రూపొందించి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
వరుస చోరీలు చేసి.. జైలుకెళ్లి..
♦ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య ♦ నిందితుడిపై పలు కేసులు ♦ మానసిక స్థితి బాగోలేకనేనన్నజైలు అధికారులు నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్) : సారంగపూర్ వద్ద ఉన్న జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీ ఒకరు శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొన ఊపీరితో ఉన్న అతడిని అధికారులు వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిందితుడు చివరిసారిగా నవీపేటలో చోరీ చేసి అరెస్టు అయ్యాడు. ఇతడిని గత మే 16న కోర్టులో హాజరుపరుచగా అప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్నాడు. నగరంలోని గాజుల్‌పేట్‌కు చెందిన మక్కల లక్ష్మయ్య, గంగవ్వ చిన్న కుమారుడు మక్కల హన్మంత్(24) చదువుకోలేదు. తండ్రి లక్ష్మయ్య మేస్త్రీ పనిచేస్తాడు. హన్మంత్ పనిచేయకుండా చోరీలు చేసేవాడు. ఇతడిపై నిజామాబాద్ నాల్గోటౌన్, మాక్లూర్, నవీపేట పోలీస్స్టేషన్లలో దాదాపు 15 కేసులు ఉన్నట్లు తెలిసింది. కాగా చివరి సారిగా నవీపేట మండలం పోతంగల్లో మే 4న హన్మంత్‌తో పాటు ధర్పల్లి సాయిలు సెల్ఫోన్లు చోరీ చేశారు. దీనిపై నవీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హన్మంత్‌ను మే 16న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా, కోర్టు రిమాండ్‌కు పంపింది. అప్పటి నుంచి హన్మంత్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం అందరూ ఖైదీలతోపాటు ఇతడిని జైలు ఆవరణలో వదిలారు. వారందరూ వివిధ పనులు చేస్తుండగా మ«ధ్యాహ్నం 2.20 గంటలకు హన్మంత్ జైలులోని ఒకటో బ్యారక్ వెనుక ఓ చెట్టుకు టెలిఫోన్ వైర్‌తో ఉరేసుకున్నాడు. అటువైపు వచ్చిన జైలు అధికారులు కొన ఊపీరితో ఉన్న హన్మంత్‌ను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఖైదీ హన్మంత్ సాయంత్రం 5గంటలకు మృతిచెందాడు. దీనిపై జైలు సూపరింటెండెంట్ కళాసాగర్ ఆరోటౌన్ పోలీసులకు తెలుపగా ఎస్ఐ లక్ష్మయ్య, రూరల్ సీఐ వెంకటేశ్వర్లు ఆస్పత్రికి చేరి కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న మృతుడి తల్లి గంగవ్వ, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరి మృతదేహంపై పడి బోరన విలపించారు. గతంలో పలుమార్లు ఆత్మహత్యాయత్నం.. అండర్ ట్రయల్ ఖైదీ హన్మంత్ గతంలోనూ పులుమార్లు చో రీలు చేసి జైలుకు వచ్చి వెళ్లాడు. ఆయా సమయాల్లోనూ ప లుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటు జైలు అధికా రులు తెలిపారు. రాళ్లతో చేతులపై, కడుపులో కోసుకునేవాడ ని, బాత్రూం గదుల్లో ఉండే బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ తాగి ఆస్పత్రి పాలయ్యాడని అధికారులు తెలిపారు. ఇతడికి వైట్నర్ తాగే అలవాటు ఉందని, పలుమార్లు వింతగా ప్రవర్తించేవాడని అధికారులు తెలిపారు. -
ఆస్పత్రిలో రిమాండ్ ఖైదీ మృతి
సిరిసిల్లా: చోరికేసులో వెంకటేశ్ అనే వ్యక్తిని ఎల్లారెడ్డిపేట పోలీసుల వారం క్రితమే అరెస్టు చేశారు. ఈ కేసులో భాగంగా అతని జైలుకు పంపారు. జైలులో ఆస్వస్థకు గురైన ఖైదీని పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే చనిపోయడంటూ అతని బంధువలు ఆందోళనకు దిగారు. ఈ విషయంలో ఎల్లారెడ్డి పోలీసుల పై కఠినచర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. -
అద్దెకు తెలంగాణ జైళ్లు
- ఏడాది తర్వాత అమలుకు యోచన - ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు - జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ వెల్లడి హైదరాబాద్: తెలంగాణ జైళ్లలో ఖైదీల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇక్కడి బ్యారక్‌లను ఖైదీలు ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాలకు అద్దెకు ఇవ్వాలని జైళ్ల శాఖ యోచిస్తోంది. ఏడాది తర్వాత దీన్ని అమల్లోకి తీసుకురావడానికి వీలుగా రూపొందిం చిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు ఆ శాఖ డీజీ వీకే సింగ్ బుధవారం తెలిపారు. నార్వే తరహాలో రాష్ట్రంలోని జైళ్లను ఇతర రాష్ట్రాల ఖైదీలకు అద్దెకు ఇవ్వాలని యోచిస్తున్నామన్నారు. రాష్ట్ర జైళ్ల సామర్థ్యం 6,848 మంది ఖైదీలు కాగా.. ఈ నెల 15 నాటికి ఆ సంఖ్య 6,083గా ఉందని తెలిపారు. మరో ఏడాది పాటు ఈ ఖైదీల సంఖ్య పరిగణనలోకి తీసుకుని ‘అద్దెకు జైళ్లు’ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. బిహార్, ఉత్తరప్రదేశ్ జైళ్లలో ఖైదీల సంఖ్య సామర్థ్యాన్ని మించిపోయిందని, అలాంటి వారిలో గరిష్టంగా 800 మందికి రాష్ట్ర జైళ్లలో ఖైదు చేసే ఆస్కారం ఉందన్నారు. తద్వారా ఏటా రూ.25 కోట్ల ఆదాయం సమకూర్చుకోవచ్చని స్పష్టం చేశారు. మహాపరివర్తన్, విద్యాదాన్, ఉన్నతి వంటి కార్యక్రమాల వల్ల కరడుగట్టిన నేరస్తులు సైతం జీవనోపాధి పొంది కొత్త జీవితాలు ప్రారంభించారని వివరించారు. ఇటీవల చర్లపల్లి కారాగారాన్ని సందర్శించిన బిహార్ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ అమీర్ సుభాని రాష్ట్రంలోని జైళ్లలో జరుగుతున్న మార్పులు, కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రశంసలు కురిపించారని చెప్పారు. త్వరలో మరో 29 ఖైదీల పెట్రోల్ బంకులు.. జైళ్ల శాఖను ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్లేందుకు ఖైదీలు నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌లు కీలకంగా మారాయని వీకే సింగ్ చెప్పారు. ఈ స్ఫూర్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా మరో 29 పెట్రోల్ బంక్‌లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. చర్లపల్లి జైల్లో 3, వరంగల్ జైల్లో 2, నల్లగొండ జిల్లాలో 5, నిజామాబాద్ జిల్లాలో 1, కరీంనగర్ జిల్లాలో 6, ఖమ్మం జిల్లాలో 1, ఆదిలాబాద్‌లో 2, వరంగల్ సబ్ జైల్ పరిధిలో 1, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 3, మహబూబ్‌నగర్ సబ్ జైల్ పరిదిలో 2 బంక్‌లు, వీటితో పాటు మరో వారం రోజుల్లో సరూర్ నగర్, లింగోజీగూడ, ఆసిఫాబాద్‌ల్లో ప్రారంభిస్తామన్నారు. -
నవ్వుతూనే అక్కడ కొరికాడు ?
లఖ్‌నవూ: బహుశా ఇంత వరకు మనం ఇలాంటి సంఘటన గురించి వినిఉండం. జైలులో ఖైదీలు జోకులేసుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. హఠాత్తుగా వారిలోనే ఓ ఖైదీ తోటి ఖైదీ అంగాన్ని కొరికేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హర్దోయా జైలులో చోటుచేసుకుంది. జైలులోని ఏడో నంబర్ బ్యారక్ లో ఖైదీలు శుక్రవారం రాత్రి సరదాగా జోకులేసుకుంటూ నవ్వుకుంటున్నారు. అదే సమయంలో ఓ ఖైదీ తోటి ఖైదీ మర్మాంగాన్ని తీవ్రంగా కొరికాడు. బాధతో కేకలు వేస్తుండగా పక్కనున్న వారు అతడిని విడిపించారు. వెంటనే అధికారులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావటంతో అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాధితుడు నూర్ మహ్మద్ ఓ రేప్ కేసులో నాలుగు నెలలుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడని జైలర్ మృత్యంజయ్ నారాయణ్ తెలిపారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి మానసికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ చేపట్టామని జైలర్ అన్నారు. -
జడ్జి ఎదుటే ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : కోర్టులో జడ్జి ముందు విచారణ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నగర శివారు రాజేంద్రనగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...బహదూర్ పురా కిషన్ బాగ్‌కు చెందిన షేక్ అమీర్ దొంగతనం , దోపిడీ కేసులలో జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. అయినా తీరు మారకుండా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ ఖైదీగా ఉన్న షేక్ అమీర్ ఉప్పరిపల్లిలోని 8వ మెట్రో పాలిటన్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. అయితే విచారిస్తున్న సమయంలో జడ్జి ముందు అమీర్ వెంట తెచ్చుకున్న బ్లేడుతో ముఖం , ఛాతిపై తీవ్రంగా గాయపరుచుకున్నాడు. రక్తస్రావం కావడంతో అమీర్‌ను ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స నిర్వహించి తిరిగి కోర్టులో హాజరు పరిచారు. మెరుగైన వైద్యం కల్పించాలని జడ్జి ఆదేశించడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అమీర్‌పై రెండు దొంగతనం, నాలుగు దోపిడీ కేసులతో పాటు పీడీ యాక్టు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న అమీర్ పై మరలా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఎరవాడ జైలులో ఖైదీ హత్య
పింప్రీ: పుణే ఎరవాడ సెంట్రల్ జైలులో హత్య జరిగింది. ఓ ఖైదీ మరో ఖైదీ తలపై రాయితో మోది హత్య చేశాడు. ఈ సంఘటన పుణేతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేకెత్తించింది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుఖదేవ్ మహాపూర్ (43) అనే వ్యక్తి అపహరణ నేరంపై శిక్ష అనుభవిస్తుండగా దినేష్ దబడే (35) అనే వ్యక్తి హత్యా నేరంపై జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. వీరిద్దరి మధ్య వంట గదిలో స్వల్ప విషయంపై వాగ్వాదం జరిగింది. దీంతో కొద్దిసేపటికి వెనుక నుంచి వచ్చిన దబడే సుఖదేవ్ తలపై పెద్ద బండతో మోదాడు. దీంతో సుఖదేవ్ అక్కడికక్కడే మరణించినట్టు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ఒకే బారికేడ్లో ఉండేవారని తెలిసింది. ఈ విషయంపై జైలు యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. -
ఖైదీ పరారీ
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎస్కేడీ కాలనీ జీరో రోడ్డుకు చెందిన బోయ వీరేష్(20) అనే ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. వీరేష్ 2015లో స్థానిక త్రీ టౌన్ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం కేసులో నిందితుడు. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. అప్పట్లో రిమాండ్‌కు ఆదేశించింది. అప్పటి నుంచి ఆదోని సబ్‌జైలులో ఉంటున్నాడు. గురువారం తీర్పు ఉండడంతో పోలీసులు అతన్ని కోర్టుకు తీసుకొచ్చారు. ఆదోని ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సాయిరాం కేసు పూర్వపరాలను పరిశీలించి..అతనికి ఆరు నెలల జైలుశిక్ష ఖరారు చేశారు. దీంతో వీరేష్‌ను త్రీటౌన్ పోలీసులు భాస్కర్,సురేష్ సబ్ జైలుకు తరలిస్తుండగా.. వారి కళ్లు కప్పి పరారయ్యాడు. ఖైదీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
టైపింగ్‌లో తప్పిదం.. పరారీలో హంతకుడు
న్యూఢిల్లీ: టైపింగ్‌లో తప్పు దొర్లడంతో ఓ హంతతకుడు జైలు నుంచి విడుదల అయ్యాడు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో టైపింగ్ తప్పిదంతో రెండు హత్య కేసుల్లో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఢిల్లీ వర్సిటీ మాజీ విద్యార్థి అయిన జితేందర్ 1999 మార్చి 10న ఓ విద్యార్థి సంఘ నాయకుడ్ని హత్య చేశాడు. ఆ మరుసటి రోజు ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చిన ఓ సాక్షి ఇంటికి వెళ్లి అతని తండ్రిని చంపేశాడు. జితేందర్‌కు మొదటి కేసులో 30 ఏళ్ల జైలు శిక్ష, మరో కేసులో జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై జితేందర్ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం జితేందర్ ఇప్పటికే 16 ఏళ్ల 10 నెలల పాటు జైలు శిక్ష అనుభవించినందున అతన్ని విడుదల చేస్తూ 2016 డిసెంబర్ 24న తీర్పు వెలువరించింది. దీనిపై సాక్షులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు డిసెంబర్ 24న వెలువరించిన తీర్పులో టైపింగ్ తప్పిదం దొర్లిందని పేర్కొంది. అంతకుముందు తీర్పులో పేర్కొన్న.. ఇప్పటికే 16 ఏళ్ల 10 నెలల పాటు శిక్ష పూర్తయ్యింది. ఇతర కేసుల్లో దోషి అవసరం లేకుంటే విడుదల చేయొచ్చు.. అన్న వాక్యాలను తొలగిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ తీర్పునిచ్చింది. అలాగే, జితేందర్‌ను అరెస్టు చేయాలని, సాక్షులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. కాగా, జితేందర్ విడుదలైనప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. -
మతిస్థిమితంలేదని యువకుడు బందీ
-
జిల్లా జైలు ఆకస్మిక తనిఖీ
కర్నూలు : కర్నూలు శివారులోని పంచలింగాల దగ్గర ఉన్న జిల్లా జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులోని పరిసరాలను, గదులను ఖైదీలకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. ఖైదీలకు కల్పిస్తున్న వసతుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేనివారికి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. అనంతరం ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయవాదులు ఆదినారాయణరెడ్డి, పి.నిర్మల, నాగమణి, జైలు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఖైదీ మృతి
జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్ర సబ్‌జైలులో విచారణ ఖైదీ జీవన్‌సింగ్ తీవ్ర అస్వస్థతతో ఏరియా ఆస్పత్రిలో శనివారం వేకువజామున మృతిచెందాడు. జైలులో ఉన్న జీవన్‌సింగ్ శుక్రవారం అస్వస్థతతు గురికావడంతో పోలీసులు ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సపొందుతూ శనివారం వేకువజామున మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. -
చర్లపల్లి జైల్లో సెల్ ఫోన్ కలకలం
హైదరాబాద్: చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ వద్ద సెల్‌ఫోన్ లభ్యం అయిన ఘటన కలకలం రేపింది. మానస బ్లాక్‌లో రెండు నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్న విదేశీయుడి వద్ద సోమవారం అధికారులు తనిఖీ చేసి సెల్‌ఫోన్ ఉన్నట్లు తేల్చారు. దీని వెనుక జైలు సిబ్బంది హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ను స్వాధీనం చేసుకుని, ఖైదీని విచారిస్తున్నారు. -
శిక్ష ఖరార్..ఖైదీ పరార్
హైదరాబాద్ : నాంపల్లి కోర్టు ఆవరణ నుంచి బుధవారం ఓ ఖైదీ పరారయ్యాడు. ఓ కేసు విషయంలో పోలీసులు బుధవారం సాయంత్రం నిసార్‌అహ్మద్ అనే ఖైదీని నాంపల్లి కోర్టుకు హాజరు పరచగా.. న్యాయస్థానం అతనికి శిక్ష ఖరారు చేసింది. అనంతరం బయటకు రాగానే నిసార్ అహ్మద్ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. పరారైన ఖైదీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగరంలోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. -
జైళ్లల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు : డీఐజీ
నరసన్నపేట : జిల్లాలోని సబ్‌జైళ్లు, జిల్లా జైళ్లలో ఉన్న ఖైదీలకు, ముద్దారుులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి స్థారుులో సౌకర్యాలు కల్పిస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ ఎం.చంద్రశేఖర్ అన్నారు. నరసన్నపేటలోని సబ్‌జైలును శుక్రవారం ఆయన వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరసన్నపేట జైలును రూ.17లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. పాతపట్నం, జిల్లా కేంద్ర జైల్లో కూడా అభివద్ధి పనులు చేశామన్నారు. శిథిలమై ఎత్తివేసిన సోంపేట, టెక్కలి, ఇచ్ఛాపురం సబ్‌జైళ్లను పునరుద్ధరించే ఆలోచన లేదని చెప్పారు. ఉన్న జైళ్లలోనే సామర్థ్యం మేరకు ముద్దారుులు, ఖైదీలు ఉండడం లేదన్నారు. ప్రస్తుతం సిబ్బంది కొరత ఉందని త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. జైళ్ల శాఖలో 250 పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. నరసన్నపేట జైలు పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని కితాబునిచ్చారు. ఆయన వెంట జిల్లా జైలర్ బి.కూర్మనాధరావు, స్థానిక సబ్‌జైలర్ కె.రామకృష్ణ ఉన్నారు. -
ఖైదీ మృతిపై 22న విచారణ
హన్మకొండ చౌరస్తా : వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ జూలై 23న మరణించిన స్టేషన్ ఘన్పూర్ మం డలం కొండాపూర్ గ్రామానికి చెందిన జీవిత ఖైదీ (నెంబర్ 2603) ఇట్టబోయిన వెంకటయ్య మృతిపై ఈ నెల 22న మెజి స్టీరియల్ విచారణ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్డీఓ వెంకటమాధవరావు శుక్రవారం ఒక ప్రకటన చేశారు. హన్మకొండలోని ఆర్డీఓ కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు జరిగే విచారణ లో సంబంధిత వ్యక్తులు తగిన సాక్ష్యాధారాలతో వాంగ్మూలం ఇవ్వవచ్చన్నారు. -
ఖైదీకీ సమాచార హక్కు వర్తింపు
ఒక వ్యక్తి తాను జైల్లో ఎందుకున్నాడో కూడా తెలియకుండా పది రోజులపాటు కారాగారంలో గడపడం కొంత వేధింపు అయితే, తర్వాత ఏడాది పాటు తన అభ్యర్థనకు సమాచారాన్ని ఇవ్వకపోవడం మరో వేధింపు. దీనికి అతడికి పరిహారం చెల్లించాల్సిందేనని కమిషన్ తీర్పు ఇచ్చింది. ఆర్టీఐ కింద ఒక ఖైదీ అడిగినా సమాచారం ఇవ్వకపోవడం మరీ అన్యాయం. ఈ దేశంలో అనేక వింతలు జరుగుతూ ఉంటాయి. ఒక యువకుడు చదువుకోలేదు. పేదవాడు. ఒక వీధి కొట్లా టలో ఇరుక్కున్నాడు. తననే అరెస్టు చేసారు, తనతో తగాదా పడిన వారిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదో తెలియదు. కేసు తనపైనే ఉందని కూడా తెలియదు. ప్రథమ సమాచార నివేదిక తనపైనే, కేసు తనపైనే చివరకు శిక్ష పడింది కూడా తనకు మాత్రమే. జైల్లో ఉండాలన్నారు. మొత్తం వేయి రూపాయలు కూడా కట్టాలన్నారు. ఎందుకో తెలియదు. చెల్లించాడు. రసీదు తీసుకున్నాడు. జైలులో పదిరోజుల శిక్ష అనుభవించాడు. అందుకు చాలా అవమానంగా ఉంది. అతని చెల్లెలికి మరీ అవమానంగా తోచింది. అసలు ఎందుకు కేసు, దేనికి శిక్ష అర్థం కాలేదు. ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు. తనను ఏ సెక్షన్ కింద జైల్లో పెట్టారు తన దగ్గర వేయి రూపాయలు ఎందుకు వసూలు చేశారు? మళ్లీ ఆ డబ్బు వాపస్ ఇస్తారా లేదా అని ఆయన ప్రశ్నలు. తీహార్ రెండో జైలు అధికారికి ఆర్టీఐ దరఖాస్తును బదిలీ చేశాడు సమాచార అధికారి. కాని జవాబు లేదు. మొదట అప్పీలు అధికారి పది రోజుల్లో సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. కాని జైలు అధికారులు ఈ ఆదేశాన్ని పెడచెవిన పెట్టారు. రెండో అప్పీలు తప్పలేదు విడుదలైన ఖైదీ దరఖాస్తుదారు సంజయ్ అదృష్టం కొద్దీ జైలు అధికారులు రెండో అప్పీలు విచారణకు హాజ రైనారు. సంబంధిత ఫైళ్లు కూడా తెచ్చారు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 160 కింద చిల్లర తగాదా కేసులో అత నికి జైలు శిక్ష పడిందని దాంతో పాటు వేయిరూపాయల జరిమానా కూడా విధించారని, అతను చెల్లించిన సొమ్ము జరిమానాయే తప్ప, డిపాజిట్ కాదు కనుక, అతనికి ఆ డబ్బు వాపస్ ఇవ్వబోరని అధికారులు వివ రించారు. సంజయ్ చెల్లెలు చాలా కోపంగా అడిగింది, మా అన్ననే ఎందుకు ైజైలుకు పంపారు. మామీద దాడి చేసి కొట్టిన వారి మీద కేసు ఎందుకు పెట్టలేదు, జైలుకు ఎందుకు పంపలేదు. మా అన్నే దొరికాడా? అని నిల దీసింది. కాని జైలు అధికారులు ఈ ప్రశ్నలకు సమా ధానం చెప్పలేదు. ఆ విషయం ఆమెకు ఇప్పుడు చెప్పినా అర్థం కావడం లేదు. అన్యాయం జరిగిందనే భావనతో తలెత్తే ప్రశ్నలకు సమాచార హక్కుకింద సమాధానం దొరకడం సాధ్యం కాదు. అది సరే ఈ సమాచారం ముందే ఇవ్వవచ్చు కదా, ఎందుకింత ఆలస్యం చేసారు? ఎందుకు ఏడిపించారు? రెండో అప్పీలు దాకా ఎందుకు సాగదీసారు?. ఈ ప్రశ్నలకు అధికారుల సమాధానం ఏమంటే అడ్రస్‌లో పొరబాటు 34 అంకెకు ముందు 1 అనే నెంబర్ పడిందని, కనుక తాము పోస్ట్ చేసిన కవర్ తిరిగి వాపస్ వచ్చిందని. మళ్లీ ఎందుకు పంపలేదు అంటే జవాబు అదే. తప్పుడు అడ్రస్ కనుక మళ్లీ పంపినా ప్రయోజనం లేదని పంపలేదు. నిజానికి అరెస్టయినప్పుడే అతనికి అన్ని వివరాలు తెలియజేయడం బాధ్యత అని తెలుసుకోవడం అతని హక్కు అని రాజ్యాంగం తదితర చట్టాలు ఘోషిస్తు న్నాయి. ఎన్నో తీర్పులు కూడా ఉన్నాయి. కాని జరిగేది ఇది. తన అన్నను అన్నీ ఒప్పుకోమంటే ఒప్పుకున్నాడని కనుక శిక్ష పడిందని ఆమె వాదించింది. సంజయ్‌ని నేరం ఒప్పుకునే విధంగా సంతకాలు చేయించిన మహా నుభావుడెవరో ఎవరికీ తెలియదు. దాన్ని తెలుసుకో వడం సమాచార హక్కు ద్వారా సాధ్యం కాదు. మామూ లుగా నిందితుడి స్థాయిలో లేదా ఖైదీ స్థాయిలో కూడా తెలియవలసిన సమాచారాన్ని అతను ఆర్టీఐ ద్వారా అడిగే పరిస్థితి రావడం ఏమాత్రం న్యాయం కాదు. తన జరిమానాకు రసీదు కూడా సహజంగానే లభించాలి. మొత్తం కేసు కాగితాలు, జైలు శిక్ష వివరాలు, శిక్ష అను భవించిన పత్రాలు కూడా అతనికి ఇవ్వవలసి ఉంటుంది. ఒక ఖైదీగా అతనికి ఆ హక్కు ఉంది. సమా చార హక్కు కింద అడిగినా ఇవ్వకపోవడం మరీ అన్యాయం. ఏ మాటా చెప్పకుండా దరఖాస్తును బదిలీ చేయడం, మొదటి అప్పీలు అధికారి ఆదేశించినా పాటించకుండా సమాచారం నిరాకరించడం సమాచార హక్కు చట్టం ఉల్లంఘనే అవుతుంది. తీహార్ రెండో జైలు అధికారి వార్డ్ నెంబర్ 5కు సంబంధించిన అధికారులు మొత్తం రికార్డులను పరిశీ లించి, సంజయ్‌కు చెందిన కాగితాల ధృవీకృత ప్రతు లను తనకు ఉచితంగా నెలరోజుల్లో ఇవ్వాలని, ఎవరికీ బదిలీ చేయడం కుదరదని కమిషన్ ఆదేశించింది. సంజయ్ సొంతంగా మళ్లీ ఫిర్యాదు చేసే అవసరం లేకుండా జైలు అధికారి శ్రద్ధ తీసుకుని అతని పత్రాలన్నీ అందే వీలు కల్పించాలని కమిషన్ ఆదేశించింది. నెలరోజుల్లోగా సమాచారం ఇవ్వాలని చట్టం నిర్దే శించినా, అసలు ఏ జవాబూ ఇవ్వనందుకు, మొదటి అప్పీలు అధికారి ఆదేశాన్ని పాటించకుండా సంజయ్‌ని రెండో అప్పీలు చేసే పరిస్థితి కల్పించినందుకు, అడ్రస్ సరిగా ఉందో లేదో పరిశీలించకుండా పంపినందుకు, ఆ తరువాతైనా తప్పు సవరించనందుకు అతనికి నామ మాత్రంగా 1500 రూపాయల నష్టపరిహారం చెల్లించా లని కూడా కమిషన్ ఆదేశించింది. ఎందుకు జైల్లో ఉన్నాడో తెలియకుండా పది రోజులపాటు జైల్లో గడ పడం కొంత వేధింపు అయితే, తర్వాత ఏడాది పాటు తన అభ్యర్థనకు సమాచారాన్ని ఇవ్వకపోవడం మరో వేధింపు అనీ, కాబట్టి పరిహారం చెల్లించాల్సిందే అనీ కమిషన్ తీర్పు. (సంజయ్ వర్సెస్ తీహార్ జైల్ సీఐసీ నంబర్ ఎస్ఏఏ 2016, 001077 కేసులో 23 జూన్ 2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ - మాడభూషి శ్రీధర్ ఈమెయిల్: professorsridhar@gmail.com -
ప్రమాదవశాత్తూ ఖైదీ మృతి
సారంగపూర్‌లో ఉన్న జిల్లా జైలులో షేక్ రఫీక్(31) అనే చెందాడు. నీటి సంపును శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి చనిపోయాడు. మృతుడు స్వస్థలం నిజామాబాద్ జిల్లా దోమకొండ. ఓ హత్యకేసులో ఐదున్నర సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నాడు. -
పోలీసుల కళ్లుగప్పి..ఖైదీ పరారు
సోదరుని అంత్యక్రియల్లో హాజరయ్యేందుకు వచ్చిన ఓ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం అమ్మవారిపల్లెలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురుకుండి శ్రీనివాసులు హత్యకేసులో నెల్లూరు జైలులో జీవిత ఖై దు అనుభవిస్తున్నాడు. అయితే, అతని సోదరుడు చిన్నవెంకటేశ్వర్లు సోమవారం చనిపోయాడు. మంగళవారం జరిగే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెరోల్‌పై అతడిని పోలీసులు అమ్మవారిపల్లెకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు ఏమరుపాటులో ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న శ్రీనివాసులు పరారయ్యాడు. అతని కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. -
సెంట్రల్ జైలు ఖైదీ పరారీ
వరంగల్: కోర్టు నుంచి బస్సులో తీసుకెళ్తుండగా టాయిలెట్కని దిగిన ఓ జీవిత ఖైదీ తప్పించుకు పారిపోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా జనగామ మండలం యశ్వంతాపూర్ వద్ద చోటుచేసుకుంది. వరంగల్ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఉప్పల సూరిని పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ నిమిత్తం తీసుకువచ్చారు. తిరిగి అతడిని భూపాలపల్లి డిపో బస్సులో వరంగల్‌కు తీసుకెళ్తున్నారు. యశ్వంతాపూర్ సమీపంలోకి వెళ్లగానే మూత్రం వస్తోందంటూ అతడు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు బస్సును ఆపించారు. అతడు బస్సు దిగి, మూత్రానికని దూరంగా వెళ్లి అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిపైకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అయినప్పటికీ అతడు దొరక్కుండా తప్పించుకుపోయాడు. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అతడి కోసం గాలింపు చేపట్టింది. -
విడుదలైన ఖైదీలకు ఉపాధి అవకాశాలు
* ప్రణాళిక సిద్ధం చేసిన జైళ్ల శాఖ * పలు ప్రైవేటు కంపెనీలతో అవగాహనా ఒప్పందం * వచ్చే 15 ఏళ్లలో 10 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖ పూచీకత్తుగా విడుదలైన ఖైదీలకు ఆ శాఖ భాగస్వామ్యంతో పనిచేసే ప్రైవేటు కంపెనీలలోనూ 25 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. శనివారం చంచల్గూడలోని జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 91 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. వచ్చే 15 ఏళ్లలో పదివేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. జైళ్ల శాఖ వస్తువులకు భారీ డిమాండ్.. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో తయారయ్యే వస్తూత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. నాణ్యతతో కూడిన వస్తువులు కావడంతో విద్యాశాఖ తమ ఫర్నిచర్ కోసం భారీగా ఆర్డర్లు ఇచ్చింది. రాష్ట్రంలోని పలు జైళ్లల్లో ఖైదీలకు పెట్రోల్ బంకుల నిర్వహణ, నేచురల్ స్పా, కుట్లు, అల్లికలు, ఫర్నిచర్, స్టీల్ సామగ్రి తయారీలో శిక్షణనిచ్చి మూడుషిప్టుల్లో పనిచేయిస్తున్నారు. పెట్రోల్‌బంకుల లాభాల బాట పట్టడంతో కొత్తగా మరో మూడు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. గతేడాది జైళ్లశాఖ వివిధ మార్గాల ద్వారా రూ.4.42 కోట్ల లాభాలను ఆర్జించింది. నెలకు రూ. 8 వేలు ఇస్తున్నారు: మనోజ్‌కుమార్ సోని, విడుదలైన ఖైదీ పదేళ్లలో ఇప్పటి వరకు 16 సార్లు జైలుకు వెళ్లాను. చాలాసార్లు చేయని నేరానికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఖైదీ అనే ముద్ర పడటంతో ఎక్కడా ఉపాధి లభించలేదు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోనే నాలుగు కేసులు నమోదు చేశారు. ఇన్ఫార్మర్గా మారాలని లేకపోతే పీడీయాక్టు పెడతామంటూ పోలీసులు బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని జైలు అధికారులకు చెబితే వారే ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం నెలకు రూ.ఎనిమిది వేలు ఇస్తున్నారు. -
ఖైదీలకు రుణాలు మంజూరు చేసిన జైళ్ల శాఖ
హైదరాబాద్: రాష్ట్ర జైళ్ల శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాపరివర్తన్ కార్యక్రమంలో భాగంగా ఖైదీలకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేసినట్లు ఆ శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జై ళ్లకు చెందిన 34 మంది ఖైదీలకు వారి పిల్లల విద్య, వివాహాల ఖర్చులకు సంబంధించి వడ్డీలేని రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో మొత్తం రూ. 11,47,500 రుణాలు (ఒక్కో ఖైదీకి రూ. 13500 నుంచి రూ. 45 వేల వరకు) నిర్ణయించినట్లు తెలిపారు. ఖైదీలకు రుణాల పంపిణీ వల్ల వారి జీవితాల్లో మంచి మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్య
కడప: కడప సెంట్రల్ జైలులో ఒక ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. జీవిత ఖైదు అనుభవిస్తున్న కుమార్ మంగళవారం ఉదయం జైలు ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన తోటి వారు అతడిని కిందికి దించి అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అతడిని వెంటనే రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అనారోగ్యం, మానసిక కారణాలతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. -
సబ్ జైలులో ఖైదీ ఆత్మహత్య
ఉరవకొండ : అనంతపురం జిల్లా ఉరవకొండ సబ్‌జైలులో శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పటాన్ షమీర్ ఖాన్(35) అనే రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం సబ్ జైలులో స్నానాల గదికి వెళ్లిన షమీర్ గంజి వార్చేందుకు ఉపయోగించే తాడుతో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నానాల గది నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి వెళ్లి పరిశీలించగా... ఉరేసుకున్న విషయం తెలిసింది. వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇతని భార్య షాను ప్రస్తుతం జిల్లాలోని సోమదేవపల్లి మండలం పత్తికుంటపల్లిలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఘటనపై జిల్లా జైళ్ల శాఖ అధికారి సుదర్శన్‌రావు విచారణ జరిపారు. ఈ ఘటనపై సమగ్ర నివేదికను జైళ్ల శాఖ డీఐజీకి పంపుతామని తెలిపారు. -
సబ్‌జైలు నుంచి ఖైదీ పరారీ
గోప్యంగా ఉంచిన అధికారులు ఏడాదిగా శిక్ష అనుభవిస్తున్న ఒడిశా యువకుడు సబ్‌జైలును పరిశీలించిన జైళ్ల శాఖ డీఐజీ బొబ్బిలి: బొబ్బిలి సబ్‌జైలు నుంచి ఓ ఖైదీ పరారైన వార్త సంచలనం కలిగిస్తోంది. ఒడిశా రాష్ట్రం లోని జైపూర్‌కు చెందిన ధనురాన అలియాస్ బడాపెట్టు (ఖైదీ నంబర్ 2576) అనే 25 ఏళ్ల యువకుడు సబ్ జైలు నుంచి గోడ దూకి పరారయ్యాడు. ఈ సంఘటన ఈ నెల 24వ తేదీన జరిగినా విషయం బయటపడకుండా ఆ శాఖ అధికారులు జాగ్రత్త పడ్డారు. రామభద్రపురం వద్ద గత ఏడాది జూలై 16 జరిగిన లారీ దోపీడీ కేసులో యువకుడు ధనురాస ఎ2గా శిక్ష అనుభవిస్తున్నాడు. గోడ గ్రిల్‌పై ఉండే వైర్లను తొలగించి అక్కడ నుంచి పరారైనట్లు భావిస్తున్నారు. వెంటనే జైళ్ల శాఖ అధికారులు, సిబ్బంది గుర్తించి వెతుకులాట ప్రారంభించినా ఫలితం లేకపోవడంతో అదే రోజు రాత్రి బొ బ్బిలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పరారైన ఖైదీ గురించి సీఐ రవి ఆధ్వర్యంలో వేట మొదలు పెట్టారు. రెండు రోజులుగా ఖైదీని పట్టుకోవడానికి ఎస్సై, ఏఎస్సైలతో కూడిన బృందం గాలిస్తోంది. విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీఐజీ చంద్రశేఖరరావు, జిల్లా జైళ్ల అధికారి కిశోర్‌కుమార్‌లు గురువారం వచ్చి పరిశీలించారు. పరారైన ఖైదీతో పాటు జైలు లోపల 16 మంది నిందితులున్నారు. దీనిపై జిల్లా జైళ్ల అధికారి కిశోర్ కుమార్‌ను ప్రశ్నించగా ఖైదీ పరారవడం వాస్తవమేనని, గాలిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై పట్టణ సీఐ రవిని వివరణ కోరగా జైళ్ల శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. పరారైన ఖైదీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, 24 గంటల్లో పట్టుకుంటామని చెప్పారు. కాగా ఖైదీ పరారైన సంఘటనలో హెడ్ వార్డర్ సింహబలుడు, వార్డర్ గాంధీ నాయుడులను బాధ్యులను చేస్తూ జైళ్ల శాఖ డీఐజీ వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : నగరంలోని చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఖైదీ గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన జైలు సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నగరానికి చెందిన రౌడీషీటర్ రమేష్ ఓ కేసులో చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం జైల్లో మేకులు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన జైలు సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. -
చావుకు దగ్గర్లో.. విడిచారు
కుషాయిగూడ: అనారోగ్యం బారిన పడి చావుకు దగ్గరైన ఓ ఖైదీని జైలు అధికారులు విడుదల చేసిన సంఘటన గురువారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో చోటుచేసుకుంది. జైలు అధికారి కొలను వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కస్తూరి శంకర్ అనే వ్యక్తి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మర్డర్ కేసులో నిందితుడు. కేసులో భాగంగా అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 2, 2015న చర్లపల్లి జైలుకు తరలించారు. మద్యం అతిగా తాగడం వల్ల అతని లివర్ చెడిపోయి అనారోగ్యంతో భాదపడుతున్నాడు. కొంతకాలం పాటు జైలులోనే చికిత్స జరిపించిన అధికారులు పరస్థితి విషమించడంతో శంకర్‌ను ఈ నెల 7న గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని రక్తం ఎక్కించాలని సూచించారు. దీంతో చర్లపల్లి జైలు వార్డర్ నాగయ్య ఈ నెల 17న రక్తదానం కూడా చేశారు. అయినా ఎలాంటి ఫలితం లభించలేదు. మానవత్వంతో స్పందించిన జైలు అధికారులు చావుకు దగ్గరైన శంకర్‌ను కుటుంబ సభ్యులతో కలిసి జీవించేందుకు అవకాశం కల్పించాలని భావించారు. అందుకు అవసరమైన పత్రాలను జైలు అధికారులు కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన మల్కాజిగిరి పదవ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ రూ. 20 వేల పూచికత్తుపై విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు శంకర్‌ను గురువారం చర్లపల్లి జైలు నుంచి విడుదల చేసినట్లు పర్యవేక్షణాధికారి వెంకటశ్వర్‌రెడ్డి తెలిపారు. -
జైలు నుంచి ఖైదీ పరారు
మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది జైలు నుంచి బుధవారం మధ్యాహ్నం ఒక ఖైదీ తప్పించుకు పోయాడు. తూప్రాన్ మండలం గున్రెడ్డిపల్లికి చెందిన యాదగిరి ఒక కేసులో కంది జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం అధికారులు ఖైదీలను తోటపని చేయిస్తున్న సమయంలో యాదగిరి అదును చూసి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓపన్ ఎయిర్జైలులో జీవిత ఖై దీ పరారీ
అనంతపురం జిల్లా బుక్కరాయ సమద్రం మండల పరిధిలోని ఓపన్ ఎయిర్ జైలు నుంచి ఓ జీవిత ఖైదీ పరారైనట్లు జైలు సూపరిండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. జైలు నందు కర్నూలు జిల్లా చిందుకూరు మండలం, గడివేముల గ్రామానికి చెందిన శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో జీవిత ఖైదు శిక్షతో 6 ఏళ్ల క్రితం ఓపన్ ఎయిర్ జైలుకు వచ్చాడన్నారు. ఆదివారం సాయంత్రం ఓపన్ ఎయిర్ జైలు అధికారుల కల్లుకప్పి పారిపోయాడన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. -
ప్రజా కోర్టులో బాబు ఖైదీ
- ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు - ప్రత్యేక హోదా కావాలో.. వద్దో టీడీపీ ఎంపీలు, మంత్రులు తేల్చి చెప్పాలి - 29న రాష్ట్ర బంద్‌కు అందరూ మద్దతు ఇవ్వాలి - వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత సమావేశంలో పరిశీలకుడు మేరుగ నాగార్జున కడప కార్పొరేషన్ : ఇచ్చిన హామీలన్నీ మాఫీ చేసి, ప్రత్యేక హోదాపై డ్రామాలాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా కోర్టులో ఖైదీగా నిలబడక తప్పదని వైఎస్ఆర్సీపీ జిల్లా పరిశీలకుడు మేరుగ నాగార్జున హెచ్చరించారు. కడపలోని అపూర్వ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన ఆ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలు విస్మరిస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటాడుతున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ వనరులను ఆ పార్టీ నేతలు దోచుకుంటున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థను నాశనం చేశారని, పరిపాలన గాలి కొదిలేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కావాలా.. వద్దా అనేది టీడీపీ ఎంపీలు, మంత్రులు తేల్చి చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా అంటే తనకు తెలీదని ఒక ఎంపీ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఈ నెల 29వ తేదీన కనీ, వినీ ఎరుగని రీతిలో బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. మరో పరిశీలకుడు, నగర మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే కేంద్ర నిధులన్నీ గ్రాంటు రూపంలో వస్తాయన్నారు. ఆ నిధులను తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్‌ను కాదని, బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.1.25 లక్షల కోట్లు ఇస్తామని ప్రకటించడం దారుణం అన్నారు. జెడ్పీ చైర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ పచ్చచొక్కాలు వేసుకొన్నవారికే ఈ ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదన్నారు. శవ రాజకీయాలు చేసింది ఎవరు? గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన బెట్టుకొని శవ రాజకీయాలు చేసిందెవరని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును జైల్లో పెడతారనే ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు, మంత్రులు మాట్లాడటం లేదన్నారు. ప్రధాని న రేంద్ర మోదీ తీరు చంద్రబాబును మరిపిస్తోందని దుయ్యబట్టారు. కడప శాసన సభ్యుడు ఎస్బి అంజద్‌బాషా మాట్లాడుతూ విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం బుట్టదాఖలు చేస్తోందన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన వాగ్దానాలు, చేసిన బాసలు మర్చిపోయాయని, కర్రు కాల్చి వాత పెడితేనే వాటిలో చలనం వస్తుందన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ బంద్‌ను నిర్వీర్యం చేయాలనే కుట్రలను తిప్పికొట్టాలన్నారు. డిప్యూటీ మేయర్ బి. అరీఫుల్లా మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ నెల 29న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలనే పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశం ప్రారంభంలో ఇటీవల నారాయణ కళాశాలలో నందిని, మనీషాల మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. సమావేశంలో వైఎస్ఆర్సీసీ సీనియర్ నాయకులు నవనీశ్వర్‌రెడ్డి, గౌసులాజం, జిల్లా అధికార ప్రతినిధులు టీకే అఫ్జల్ఖాన్, జి. రాజేంద్రరెడ్డి, నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు పులిసునీల్, వేణుగోపాల్‌నాయక్, నాగేంద్రారెడ్డి, బంగారు నాగయ్య, కరిముల్లా, చల్లా రాజశేఖర్, షఫీ, ఖాజా, ఏ. సుబ్బరాయుడు, త్యాగరాజు, ఆదిత్య, సాయిచరణ్, టీపీ వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. బంద్‌ను విజయవంతం చేయాలి తుపాకులు ఎక్కుపెట్టినా, బుల్లెట్ల వర్షం కురిసినా ఈ నెల 29న బంద్‌ను విజయవంతం చేయాలి. రాష్ట్ర విభజనకు మూల కారణం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలే. ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాడు ప్రధాని ప్రకటిస్తే, ఐదేళ్లు సరిపోదు.. పదేళ్లు కావాలని అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు పట్టుబట్టారు. నేడు వారు కేంద్ర మంత్రులై ఉండీ ప్రత్యేక హోదాపై నోరుమెదపడం లే దు. గట్టిగా మాట్లాడితే జైలుకు పంపుతారేమోనని చంద్రబాబు మౌనం విహ స్తూ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. - ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు -
బెంగళూరులో కాల్పుల కలకలం..
బెంగళూరు: బెంగళూరులో ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్(ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్)లో విచారణలో ఉన్న ఖైదీ కాల్పుల కలకలం సృష్టించాడు. మానసిక స్థితి సరిగా లేని ఒక విచారణలో ఉన్నఖైదీని వేద్యపరీక్షల కోసం ఆదివారం ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్కి తీసుకువచ్చారు. అయితే అక్కడ గన్‌మెన్ దగ్గర ఉన్న గన్ని లాక్కొని ఆ ఖైదీ విచక్షణ రహితంగా కాల్పులకు దిగాడు. అయితే ఈ కాల్పులలో ఎవరికి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ఖైదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పోలీస్ స్టేషన్ వద్ద ఖైదీ ఆత్మహత్యాయత్నం
నేలకొండపల్లి(ఖమ్మం జిల్లా): రిమాండ్‌కు తరలిస్తున్న ఒక ఖైదీ పోలీస్‌స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది. వివరాలు.. మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన గుండా సత్యం అనే వ్యక్తిని పోలీసులు రెండు రోజుల క్రితం రెండు మేకలను దొంగలించిన కేసులో అరెస్ట్ చేశారు. కాగా, సత్యాన్ని బుధవారం రిమాండ్‌కు తరలించనున్నారు. ఈ క్రమంలోనే రిమాండ్‌కు తరలిస్తున్నారని తెలిసి పీఎస్ ఎదట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. విషయం తెలిసిన పోలీసులు సత్యాన్ని వెంటనే ఖమ్మంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఖైదీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. -
రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
గుంటూరు: నరసరావుపేట సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి జైలు బ్యారక్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నను చంపిన కేసులో నిందితునిగా ఉన్న భీమవరపు ప్రసన్నకుమార్ (38) ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి నరసరావుపేట సబ్ జైలులో ఉంటున్నాడు. అన్నను చంపిన సమయంలోనే అతను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. సబ్‌జైలులో ఉన్నప్పుడు భార్యాబిడ్డలెవరూ చూసేందుకు కూడా రాకపోవడంతో మనస్తాపం చెందిన ప్రసన్నకుమార్ గురువారం బ్యారక్‌లోని బాత్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
గొంతు కోసుకుని ఖైదీ ఆత్మహత్యాయత్నం
రాజమండ్రి: రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఓ ఖైదీ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయవాడ సత్యనారాయణపురంకు చెందిన టి.మోహన వెంకట దుర్గా ప్రసాద్ ఓ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ రాజమండ్రి జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. అయితే, తనకు న్యాయవాదిని కేటాయించలేదంటూ దుర్గా ప్రసాద్ సోమవారం మధ్యాహ్నం స్నానాల గది తలుపు రేకుతో పీక కోసుకున్నాడు. రక్తస్రావం అవుతున్న అతన్ని జైలు సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. -
వీడెక్కడి ఖైదీరా బాబూ..
చికాగో: పోలీసులను చూసి ఖైదీ భయపడటం సహజం. అయితే ఖైదీని చూసి పోలీసులే బెంబేలెత్తుతున్నారు. ఇంతకీ అసలు కథేమిటంటే.. పిజ్జా షాపుపై దాడి కేసులో చికాగోకు చెందిన 17 ఏళ్ల లామెంట్ క్యాథేని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. కారాగారంలోకి వచ్చాక మనోడి మానసికస్థితి దెబ్బతింది. దీంతో అన్నం తినడం మానేసి కనబడిన ప్రతీ లోహపు వస్తువునూ తినేయడం మొదలెట్టాడు. చివరికి జైలులోని సెక్యూరిటీ కెమెరాలను కూడా వదల్లేదు. దీని వల్ల పలుమార్లు అనారోగ్యం పాలవడంతో క్యాథేని ఇప్పటివరకూ 24సార్లు ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్సలు చేయించారట. ఈ ఆపరేషన్లు, చికిత్సకు రూ.8 కోట్లకు పైనే ఖర్చయిందట. దీంతో వీడెక్కడి ఖైదీరా బాబూ అని జైలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
మరో ఖైదీ వద్ద సెల్‌ఫోన్ లభ్యం
చర్లపల్లి (హైదరాబాద్) : చర్లపల్లి జైల్లో ఖైదీలు యధేచ్చగా సెల్ఫోన్లు వాడేస్తున్నారు. తాజాగా మరో ఖైదీ వద్ద సెల్‌ఫోన్ వెలుగు చూసింది. బుధవారం రౌడీషీటర్ ఖైసర్ సెల్‌ఫోన్ వాడుతున్నట్టు గుర్తించిన సిబ్బంది దాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత నెల రోజుల వ్యవధిలో ఖైదీల వద్ద రెండు సార్లు సెల్ఫోన్లు వెలుగు చూసిన విషయం తెలిసిందే. -
కడప సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్య
కడప : జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఒక ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం వైఎస్సార్ కడప జిల్లాలోని కేంద్ర కారాగారంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతరపురం జిల్లా తలపుల మండలానికి చెందిన కృష్ణమూర్తికి తన భార్యను హత్య చేసిన కేసులో అనంతపురం జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితమే కృష్ణమూర్తిని జైలు అధికారులు కడప కేంద్రకారాగారానికి తరలించారు. కాగా మంగళవారం జైలులో ఉన్న బాత్రూంలో ఉరి వేసుకొని కృష్ణమూర్తి ఆత్మహత్య చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. -
చర్లపల్లి జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైల్లో మరో ఖైదీ ఆత్యహత్యకు పాల్పడ్డాడు. జీవిత శిక్ష అనుభవిస్తున్న శేఖర్ అనే ఖైదీ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. శేఖర్ యాసిడ్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. గమనించిన తోటి ఖైదీలు జైలు అధికారులు తెలిపారు. బాధితుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే సోమవారం ఉదయం జైల్లో ఖైదీలు ఆందోళనకు దిగారు. తరచూ అధికారులు తమను వేధిస్తున్నారని ఖైదీలు ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఈరోజు ఉదయం అల్పాహార సమయంలో వేధిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలంటూ పట్టుబట్టారు. ఖైదీల దగ్గర సెల్ ఫోన్ లు ఉన్నాయంటూ అధికారులు వేధిస్తున్నారని.. ఖైదీలు ఆందోళన చెందుతున్నారు. కాగా ఇదే విషయమై ఆదివారం ఉదయం శివకుమార్ అనే మూగఖైదీ అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడ్డాడు. దీనిపై అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెల్ ఫోన్లు ఉన్నాయనే కారణంగానే జైలు సిబ్బంది ఆ ఖైదీని చితకబాదినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు మరో నలుగురి ఖైదీలు కూడా గాయపడ్డారు. అయితే శివకూమార్ గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. ఆరోపణలు అవాస్తవని జైలు అధికారులు తెలిపారు. -
చర్లపల్లి జైల్లో ఖైదీ అనుమానస్పద మృతి
హైదరాబాద్:చర్లపల్లి జైల్లో ఓ ఖైదీ మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివకుమార్ అనే మూగఖైదీ అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడ్డాడు. దీనిపై అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెల్ ఫోన్లు ఉన్నాయనే కారణంగానే జైలు సిబ్బంది ఆ ఖైదీని చితకబాదినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరో నలుగురి ఖైదీలు కూడా గాయపడ్డారు. గాయపడిన ఖైదీలు శీను నాయక్, సతీష్,అజార్, జహంగీర్ లుగా గుర్తించారు. శివకుమార్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఖైదీ మహబూబ్ నగర్ జిల్లా వాసిగా సమాచారం. -
కడప సెంట్రల్ జైల్ వద్ద ఖైదీ పరారీ
-
ఖైదీలకే నయం
మధ్యాహ్న భోజన పథకం లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. భావిభారత పౌరులను ఖైదీల కన్నా హీనంగా చూస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా నిధుల మొత్తాన్ని పెంచాల్సిన సర్కారు ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకేయడంలేదు. ఇటీవల ఒక్కో విద్యార్థికి 25 పైసల చొప్పున పెంచి చేతులు దులుపుకుంది. ఒక్కో ఖైదీకి సరాసరి రోజుకు రూ.50 వెచ్చిస్తుండగా అదే విద్యార్థులకు రూ.4.60 నుంచి రూ.6.38 వరకు చెల్లించడం ఎంతవరకు సమంజసమని భోజన ఏజెన్సీ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. - భావిభారత పౌరులతో సర్కార్ ఆటలు - ఒక్కో విద్యార్థికి 25 పైసల పెంపు - దీనికి ఏమొస్తాయో చెప్పాలంటున్న వంట ఏజెన్సీలు - భారంగా మారిన మధ్యాహ్న భోజన పథకం తిరుపతి తుడా/తిరుచానూరు: జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నవ్వులపాలవుతోంది. చాలీచాలని నిధులతో వంట నిర్వాహకులు మెనూను గాలికొదిలేశారు. తమకు తోచి న విధంగా వడ్డిస్తున్నారు. జిల్లాలో దాదాపు 4 వేల ప్రాథమిక, 490 ప్రాథమికోన్నత, 608 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 3.73 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం, విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రాథమిక పా ఠశాల విద్యార్థి ఒకరికి 100 గ్రాముల బి య్యం, రూ.4.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఒకరికి 150 గ్రాము ల బియ్యం, రూ.6 అందజేస్తున్నారు. వారాని కి ఒక్కో విద్యార్థికి రెండు కోడిగుడ్లతో పాటు పప్పు, కూరగాయలు, ఆకుకూరలు, గ్యాసు, వంటనూనె వంటి ఆహార పదార్థాలను ఆ మొత్తంలోనే వంట నిర్వాహకులు కొనుగోలు చేయాలి. ఈ మొత్తం చాలక వంట ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. పైగా నెలల తరబడి బిల్లు లు మంజూరుకాకపోవడంతో అప్పులపాలవుతున్నారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సం ఘాల నాయకు లు డబ్బులు పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఫలితం లేదు. ఖైదీల కన్నా హీనమే జైల్లోని ఖైదీలకన్నా ప్రభుత్వ పాఠశాలల్లో చది వే విద్యార్థులను ప్రభుత్వం హీనంగా చూస్తోం ది. ఒక్కో ఖైదీకి రోజుకి 600 గ్రాముల బి య్యం, 100 గ్రాముల పప్పు, 140 మి.లీ పాలు, 250 గ్రాముల కూరగాయలను అంది స్తోంది. వీటితో పాటు ఉదయం అల్పాహారం కింద చపాతి, ఉప్మా, పొంగల్, లెమన్ రైస్ ఇస్తున్నారు. వారానికి ఒకరోజు గుడ్డు, 175 గ్రాముల మాంసం ఇస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో ఖైదీకి సుమారుగా రూ.50 వరకు ఖర్చు చేస్తున్నారు. అదే పేద విద్యార్థికి ఒక పూట పొట్ట నింపేందుకు ప్రభుత్వం రూ.4.60 నుం చి రూ.6.38 వరకు మంజూరు చేస్తోంది. పేరుకే మెనూ.. ఒక రోజుకి విద్యార్థికి సగటున 1,500 నుంచి 1,700 క్యాలరీలు పౌష్టికాహారం అందించాల ని న్యూట్రీషియన్లు పేర్కొంటున్నారు. అయితే మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఒక పూటకి 150 నుంచి 200 క్యాలరీల వరకే అందుతోం ది. పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలకు సరిపడ పౌష్టికాహారాన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పెంచిన ధర ఇలా.. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి ఇదివరకు రూ.4.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.6 చెల్లించేవారు. అయితే తాజాగా ప్రాథమిక పాఠశాల విద్యార్థికి 25 పైసలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు 38 పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద మొత్తంలో పెంచాలి మధ్యాహ్న భోజన పథకానికి ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బు సరిపోవడం లేదని పలుమార్లు మా సంఘం తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.7, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థికి రూ.10 పెంచాలని డిమాండ్ చేశాం. అయితే ప్రభుత్వం కేవలం పైసల్లో మాత్రమే పెంచి చేతులు దులుపుకోవడం శోచనీయం. - కత్తి నరసింహారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీయూ గుడ్డుకే చాలదు మధ్యాహ్నం భోజన పథకానికి ఒక్కో విద్యార్థికి చెల్లిస్తున్న డబ్బు గుడ్డుకే సరి పోదు. అలాంటప్పుడు పౌష్టికాహారా న్ని విద్యార్థులకు ఎలా అందించగలుగుతాం. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. పౌష్టికాహారం, గుడ్డు అందించాలంటే ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై అధనంగా డబ్బులు అందించాలి. -కే.ముత్యాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి, యూటీఎఫ్ పౌష్టికాహారం అంతంతమాత్రమే మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం అధిక శాతం నాసిరకమే. దీంతో ఆ బియ్యంతో వండిన అన్నం తినేందుకు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థికి సగటున చెల్లిస్తున్న డబ్బులో ఎటువంటి పౌష్టికాహారం అందించాలో ఆ ప్రభుత్వమే తెలియజేయాలి. -టీ.గోపాల్, రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్జేయూపీ పైసల్ అవుతున్న బతుకులు పెరిగే వయస్సులో విద్యార్థికి నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాల్సి ఉంది. అప్పుడే విద్యార్థి ఆరోగ్యంగా ఎదుగుతూ చదువుపై దృష్టి పెట్టగలుగుతాడు. అయితే మొక్కుబడిగా ప్రభుత్వం పైసలు పెంచి విద్యార్థులను పైసల్ చేస్తోంది. దీనికి తోడు వంట ఏజెన్సీలకు బకాయిలు చెల్లించడంలో జరుగుతున్న జాప్యం కూడా విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. -వై.శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది ప్రభుత్వం పేద విద్యార్థులపై చిన్నచూపు చూస్తోంది. రూ. 4.48 పైసలకు భోజనం ఎలా పెడతారు. కోడి గుడ్డుకే రూ.4 చెల్లించాలి. 48 పైసలతో భోజనం ఎలా వస్తుంది. పైసలను పెంచి ప్రభుత్వం వందలు పెంచినట్టు గొప్పలు చెబుతోంది. పేద విద్యార్థులు చదివే పాఠశాలలపై నిర్లక్ష్యం వీడాలి. -కె.అక్కులప్పనాయక్, టీఎస్ఎఫ్, రాష్ట్ర కార్యదర్శి రూ.20కు పెంచాలి విద్యార్థుల మిడ్డే మీల్స్ రూ.20కి పెం చాలి. చాలీ చాలని డబ్బులతో విద్యార్థుల కడుపులు కాలుస్తున్నారు. ఖైదీల కంటే హీనంగా విద్యార్థులకు పట్టెడన్నం పెట్టమని నిధులు కేటాయించడం సిగ్గుచేటు. ప్రభుత్వానికి సర్కారుబడుల విద్యార్థులపై ఉన్న చిన్నచూపు పోవాలి. అవసరమైన నిధులను కేటాయించి పేద విద్యార్థులను ఆదుకోవాలి. -హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం పౌష్టికాహారం అందివ్వాలి ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహరం అందించేందుకు చర్యలు చేపట్టాలి. చాలిచాలని డబ్బు లు కేటాయించడం వల్ల అందాల్సిన పౌష్టికాహారం అందడంలేదు. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థికి 100 గ్రాముల అన్నం ఎలా సరిపోతుంది. పదోతరగతి చదువుతున్న విద్యార్థికి 150 గ్రాముల అన్నం ఏమూలకు సరిపోతుంది. కడుపుకాల్చుకుని చదువుకునే దుస్థితి రావడం దౌర్భాగ్యకరం. - జయచంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐ డ్రాపౌట్స్ పెరిగే ప్రమాదం ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో డ్రాపౌట్స్ సంఖ్య అధికంగా ఉంది. మధ్యాహ్న భోజన పథకం అందుబాటులోకి వచ్చాక చాలామంది పేద విద్యార్థులు తిరిగి సర్కారు బడుల్లో చేరా రు. అయితే సరైన పోషక విలువలు, సరిపడా అన్నం పెట్టకపోవడంతో మళ్లీ స్కూళ్లలో డ్రా పౌట్స్ పెరిగే ప్రమాదం ఉంది. ఇది ప్రభుత్వ విద్యావ్యవస్థ మనుగడకే ప్రమాదకరం. - శంకర్‌నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు, జీవీఎస్ సీఎం దృష్టికి తీసుకెళ్తాం మధ్యాహ్న భోజన పథకంపై పూర్తి స్థాయి నివేదికను తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళతాం. మధ్యాహ్న భోజనానికి సగటున విద్యార్థికి చెల్లిస్తున్న డబ్బులను, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా పెంచాలని ఆయనకు విన్నవించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. - రవినాయుడు, జాతీయ సమన్వయకర్త, టీఎన్ఎస్ఎఫ్. నిర్లక్ష్యం తగదు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులే. వీరిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రూ.4కు భోజనం పెట్టడం ఏ కాలంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకు వర్తిస్తుందో ప్రభుత్వమే సమాధానమివ్వాలి. పేదలపై ప్రభుత్వానికి చిత్తశుధ్ది ఉంటే పూర్తిస్థాయిలో పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలి. - దామినేటి కేశవులు, ఎస్సీసంక్షేమ సంఘం నాయకులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళతాం మధ్యాహ్న భోజనానికి కేటాయించిన డబ్బులను పెంచాలని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న బడుల్లో ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బులు చాలడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. భోజన పథకంలో నిర్ణీత ధరలు పెంచే విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాను. - రవికుమార్‌నాయుడు, ఎంపీడీవో, తిరుపతి రూరల్. ఇబ్బందులు ఉన్నాయి తక్కువ మంది ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నష్టాల్లో నడుస్తోంది. చాలీచాలని డబ్బులతో వంట ఏజెన్సీలు వంటలు చేయలేమని ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా పెంచిన పెంపు వీరికి ఏమాత్రం సరిపోదు. ఇలాంటి నేపథ్యంలో తక్కువ మంది పిల్లలున్న పాఠశాలలపై ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే బావుంటుంది. -ఎం.ప్రసాద్, ఎంఈవో, తిరుపతి రూరల్ బకాయిలతో ఇబ్బందులు గత నాలుగు నెలలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన మధ్యా హ్న భోజన డబ్బులు బకాయి పడడంతో ఇబ్బందులు పడుతున్నాం. దీంతో అప్పులు చేసి వి ద్యార్థులకు వండి పెడుతున్నాం. పెరిగిన కూరగాయల ధరతో ప్రభుత్వం ఇస్తున్న డబ్బు లు సరిపోవడం లేదు. వారంలో రెండు రోజులు విద్యార్థి కి ఇచ్చే డబ్బు కోడి గుడ్డుకే ఖర్చవుతోంది. ఇలాగైతే ఎలా బతకాలి. - రంగమ్మ, వంట ఏజెన్సీ సభ్యురాలు పది రూపాయలు చెల్లించాలి మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి ఇస్తున్న డబ్బు చాలడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన భోజనం ఎలా ఇవ్వగలుగుతాం. అయినా పిల్లలకు అన్యా యం చేయకూడదనే ఉద్ధేశంతో తమకు ఆదాయం లేకున్నా మంచి భోజనం పెట్టేందుకు నగలు కుదవ పెట్టాం. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ. 10 చెల్లించాలి. -కే.కుమారి, వంట ఏజెన్సీ సభ్యురాలు రూ.80 వేలు బకాయిలు రావాలి మధ్యాహ్న భోజనం ద్వారా తమకు ఇప్పటి వరకు రూ.80 వేలు బకాయిలు రావాల్సి ఉంది. దీంతో రూ.5 వడ్డీకి అప్పు తెచ్చి మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. నెల వచ్చేసరికి తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లించలేకపోతున్నాం. ప్రభుత్వం పునరాలోచించి ఏ నెలకు ఆ నెల డబ్బులు చెల్లించాలి. -బీ.కుమారి, వంట ఏజెన్సీ సభ్యురాలు చిన్న చూపు ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది పేద విద్యార్థులే. అలాంటి పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ఒక పూట తిండి పెట్టేందుకు లెక్కలు వేసుకుంటూ చిన్నచూపు చూస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. -మోషి, 10వ తరగతి విద్యార్థి -
రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి
సందేహాలకు తావిస్తున్న సూసైడ్ నోట్ పోలీసులే హత్యచేశారన్న ఆరోపణలు విశాఖపట్నం : కేంద్రకారాగారంలో పి.మంగరాజు(31) అనే రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒడిశా రాష్ట్రం మల ్కన్‌గిరి జిల్లా పుట్టమర్రి గ్రామానికి చెందిన ఇతను 16 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మావోయిస్టులతో సంబంధాలు, హత్య, కిడ్నాప్, మారణాయుధాలు కలిగి ఉన్న కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన్ని 2010లో విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ కేంద్ర కారాగారానికి 2010, సెప్టెంబరు 5న తరలించారు. 6 కేసుల్లో బెయిల్ లభించింది. మరో పది కేసుల్లో బెయిల్ రాకపోవడంతో ప్రసుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మావోయిస్టు ఖైదీలుండే ప్రాణహిత బేరక్‌లో ఉంటున్నాడు. జైలు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో మంగరాజు మరుగుదొడ్డి లోపల ఇనుప గజాలకు ఉరి వేసుకున్నారు. బెడ్‌షీటు అంచు చించి తాడులా చేసి ఉరివేసుకున్నారు. సిబ్బంది గమనించి వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజాము 3గంటల సమయంలో ప్రాణాలు విడిచారు. మంగరాజు మృతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతున్నప్పటికీ ఈ విషయంపై తీవ్ర గోప్యత పాటిస్తుండటం సందేహాలకు తావిస్తోంది. ‘సూసైడ్ నోట్’ అని అనధికారికంగా బయటకు వచ్చిన ఓ లేఖ సందేహాలను మరింతగా పెంచింది. మంగరాజు బ్యాగ్‌లో అధికారులు ఆ లేఖను గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఆ లేఖలో కొంతభాగమే మీడియాకు చేరడం గమనార్హం. మంగరాజు రాశాడని చెబుతున్న ఆ లేఖలో అంశాలు కూడా సందేహాస్పదంగానే ఉన్నాయి. మావోయిస్టుల భయంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మంగరాజు పేర్కొన్నారు. ఖైదీలుగా ఉన్న మావోయిస్టులు జగదీష్, ప్రదీప్‌సింగ్ తదితరులు వేధించారని ఆయని పేర్కొన్నాడు. జైలులోనే ఉన్న మహిళా మావోయిస్టు తంబెళ్ల కమల అలియాస్ రుప్పి తనత సన్నిహితంగా ఉండటాన్ని వారు తప్పుగా చిత్రీకరించారని కూడా మంగరాజు చెప్పినట్లుగా ఉంది. తనకు కమలకు మధ్య సోదర బంధం తప్పా మరేమీ లేదని... కానీ మావోయిస్టులు మాత్రం తమను తప్పుగా అర్థం చేసుకుని వేధించారని ఆయన చెప్పారు. కమలను, తనను చంపేస్తామని బెదింరించారన్నారు. వేధింపులు పడలేకే తాను ఆత్మహత్య చేసుకుంటుఉన్నానని కూడా వివరించాడు. ఈ లేఖ మంగరాజు రాసిందేనా లేక ఎవరైనా సృష్టించారా అన్నది సందేహాస్పదంగానే ఉంది. విచారణ పేరిట వేధించి పోలీసులే మంగరాజును హత్య చేసి ఉంటారని విరసం నేత చలసాని ప్రసాద్ ఆరోపించారు. ఆ తప్పు నుంచి తప్పించుకునేందుకే సూసైడ్ నోట్‌ను సృష్టించి కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారని చెప్పారు. ఈ సంఘటనపై నిష్పక్షికంగా విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని చలసాని ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగరాజు మానసిక రోగి అని జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. గత ఏడాది జూలై 30న నగరంలో మెంటల్ ఆసుత్రికి తరలించామన్నారు. అక్కడ చికిత్స అనంతరం నవంబరు 5న తిరిగి అక్కడ వైద్యులు జైల్‌కు పంపించామన్నారు. -
జైల్లో హలో..హలో
ఖైదీలకు ఫోన్ సౌకర్యం నెల్లూరు(క్రైమ్) : చెముడుగుంటలోని జిల్లా కేంద్రకారాగారంలో ఉంటున్న ఖైదీలకు ఫోన్ సౌకర్యాన్ని జైళ్లశాఖ ఐజీ బి.సునీల్‌కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఖైదీల్లో మానిసిక బాధను తగ్గించడంతో పాటు మానసిక పరివర్తన పెంపొందించేందుకు ఈ సౌకర్యం దోహదపడుతుందన్నారు. వొడాఫోన్ నెట్‌వర్క్‌తో ఒప్పందం ఏర్పాటు చేసుకుని రెండు ల్యాండ్లైన్లను కారాగారంలో ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఖైదీ నెలకు ఎనిమిదిసార్లు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుకోవచ్చన్నారు. ఖైదీలు తాము మాట్లాడే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫోను నంబర్లను జైలు సిబ్బందికి అందించాలన్నారు. వారు ఆ నంబర్లను రిజిస్టర్ చేసుకుంటారన్నారు. ఖైదీలు మాట్లాడే ప్రతి మాటా ఆటోమెటిక్‌గా రికార్డు అవుతుందన్నారు. ఇప్పటికే చర్లపల్లి, చెంచల్‌గూడ, రాజమండ్రితో పాటు పలు కేంద్ర కారాగారాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అనంతరం ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఫోన్ సౌకర్యం కల్పించడంపై ఖైదీలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కారాగారంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరలోనే ఆ శాఖ డీజీ కృష్ణంరాజు పర్యటన ఉన్న దృష్ట్యా పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచిం చారు. ఖైదీలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి ఆయన పాతజైలును సందర్శించారు. పాతజైలును త్వరలోనే సీకా (స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్)గా మార్చనున్నారు. ఆంధ్రరాష్ట్రంలోని జైలుశాఖ అధికారులకు, సిబ్బందికి ఇకపై నెల్లూరులోని సికాలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అంశాలపై ఆయన జైలు సూపరింటెండెంట్ ఎంఆర్ రవికిరణ్‌తో మాట్లాడారు. ఐజీ పర్యటన ఆద్యంతం గోప్యంగా సాగింది. -
ఎక్కడి దొంగలు అక్కడికే!
-
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీల తిరుగుబాటు
-
ఖైదీ చేతికి తుపాకీ!
ఒంగోలు : ఒంగోలు జిల్లా జైలు నుంచి ఓ ఖైదీని వైద్య పరీక్షల కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించడానికి ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అయితే వాహనం నడిపే కానిస్టేబులు తన తుపాకీ (వెపన్)ని మధ్యలో కూర్చున్న ఖైదీ చేదికిచ్చాడు. ఖైదీలను కోర్టులకు, ఆస్పత్రులకు తరలించేటప్పుడు వారు పోలీసుల కళ్లుగప్పి పారిపోతున్న సంఘటనలు తరచూ సంభవిస్తున్నా ఖాకీల తీరు ఏమాత్రం మారలేదనడానికి ఈ చిత్రం ఓ నిదర్శనం. -
ఖైదీ పారిపోతుండగా పోలీసులు కాల్పులు
ఖమ్మం : ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి శనివారం ఉదయం తుపాకుల మోతతో దద్దరిల్లింది. వైద్యం కోసం తీసుకొచ్చిన ఓ రిమాండ్ ఖైదీ పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. ఎట్టకేలకు పరారవుతున్న ఖైదీని పట్టుకున్నారు. కాగా పోలీసుల కాల్పులలో ఖైదీ స్వల్పంగా గాయపడ్డాడు. అనంతరం అతనికి చికిత్సకు తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఖైదీతో న్యాయవాది ప్రేమ పెళ్లి
అన్నానగర్, న్యూస్‌లైన్: ఇది సినిమా కథ కాదు. నిజ జీవితపు సంఘటన ఒక హత్య కేసులో 12 ఏళ్లుగా జీవిత ఖైదును అనుభవిస్తున్న ఒక నేరస్తుడితో ప్రేమలో పడిన ఒక మహిళా న్యాయవాది కథ. ఈ ఇద్దరి ప్రేమా నేడు వ్యాసర్పాడిలోని ఒక కల్యాణ మండపంలో పెళ్లిపీటలెక్కబోతోంది. మహిళా న్యాయవాది ఏ అరుణ (27), జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న సోమసుందరం(38) అలియాస్ సోముతో ఆదివారం హిందూ సంప్రదాయ పద్ధతిలో ఏడడుగులు నడవనున్నారు. తన పెళ్లి కోసం సోము తరపున ఆమె మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసి 30 రోజుల పెళ్లి సెలవులు కోరారు. అయితే ఈ విషయం విన్న న్యాయమూర్తులు పిఎన్ ప్రకాష్, ఎస్ రాజేశ్వరన్ విస్తుపోయూరు. అరుుతే అరుణ అడిగిన నెలరోజుల పెళ్లి సెలవులు మంజూరు చేయలేమని చెబుతూ చివరకు 10 రోజుల సెలవును మంజూరు చేశారు. శనివారం, ఫిబ్రవరి ఒకటో తేదీ సాయంత్రం సోము పుళళ్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి ఏడు గంటలకు సోము తిరిగి జైలులో కన్పించాలని న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేశారు. సెలవు కాలంలో సోముకు అవసరమైన రక్షణను పోలీసులు ఏర్పాటు చేశారు. మాజీ శాసన సభ్యుడైన(అన్నాడీఎంకే) ఎంకే బాలన్ హత్య కేసులో రెండో ప్రధాన ముద్దాయిగా తేలిన సోము న్యాయవాది ఎ.అరుణకు దూరపు బంధువు అవుతాడని జైలు అధికారులు తెలిపారు. ఆమె పలుమార్లు సోమును కలిసేందుకు జైలుకు వచ్చి వెళుతుండేదన్నారు. ఆమె కలిసినప్పుడు తాను చేసిన హత్యకు సిగ్గపడుతున్నానని సోము పలుమార్లు అరుణతో చెప్పాడు. దీంతో ఆమెకు సోముపై నమ్మకంతో పాటుగా ప్రేమ కూడా పుట్టిందని అరుణ సహాయకుడు పి పుహళేంది తెలిపారు. జనవరి 17న వీరిద్దరి పెళ్లి నిశ్చితార్థం జరిగినట్లు వివరించారు. ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 7.30 నుంచి 8.30 మధ్యలో సోము-అరుణ మెడలో మూడుముళ్లు వేయనున్నట్లు చెప్పారు. సోముతో జరిగే తన పెళ్లికోసం ఆమె ఎవరినీ చట్ట వ్యతిరేకంగా ఇబ్చంది పెట్టకపోవడంతో ఆమెకు 10 రోజుల సెలవు మంజూరు చేశామని న్యాయమూర్తులు తెలిపారు. గత 12 ఏళ్లుగా జైలులో ఉంటున్న సోము ప్రవర్తన సంతృప్తికరంగా ఉందన్నారు. -
యెర్వాడ జైలులో ఖైదీ ఆత్మహత్య
పింప్రి, న్యూస్‌లైన్: యెర్వాడ జైలులో ఓ ఖైదీ ఆదివారం సాయంత్రం తనకు తానుగా ఓ పదునైన ఆయుధంతో తీవ్రంగా గాయపర్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ జైలులో ఖైదీ ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండవసారి. ఈ సంఘటన విషయమై జైలు అధికారులు అందజేసిన వివరాల ప్రకారం.. జాంబూర్వాడిలోని అంబేగావ్కు చెందిన ప్రహ్లాద్ వామన్ వీర్ జూలైలో కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యను హత్య చేసి శిక్ష అనుభవిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం జైలులో ప్రత్యక్షంగా చాలా మంది ఖైదీలు చూస్తుండగానే తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో పొడుచుకున్నాడు. ఇది గమనించిన జైలు సిబ్బంది అతడిని వెంటనే జైలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదిలా ఉండగా యెర్వాడ జైలులో ఏడాది క్రితం శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన సిద్ధిక్‌ను శరత్ మోహలే అనే ఖైదీ హత్య చేయగా, నాలుగు నెలల క్రితం ఒక ఖైదీ టవల్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
చర్లపల్లి జైల్లో ఖైదీ ఆత్మహత్య
హైదరాబాద్ చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం జైలు గదిలో దుప్పటితో ఉరేసుకున్నాడు. అతణ్ని పార్థనాయక్గా గుర్తించినట్టు జైలు అధికార వర్గాలు తెలిపాయి. కూతుర్నిహత్య చేసిన కేసులో నాయక్ శిక్ష అనుభవిస్తున్నాడు. అతణ్ని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నాయక్ సొంతూరు రంగారెడ్డి జిల్లా మంచాల. జైలుకెళ్లిన తర్వాత అతను మానసిక క్షభకు గురైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అతను అగాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. -
25 ఏళ్ల తర్వాత ఖైదీ గోకరాజు నర్సరాజు ప్రత్యక్షం
గుంటూరు:గత కొన్ని సంవత్పరాలుగా పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని తిరుగుతున్న ఓ ఖైదీనీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గోకరాజు నర్సరాజు అనే వ్యక్తిని గోకరాజు పాలెంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెరోల్ పై బయటకి వచ్చిన అతను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఓ వ్యక్తి తిరిగి ఇంటికి చేరాడన్న 'సాక్షి' కథనంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. అతను గతంలో శిక్ష పడిన ఖైదీగా నిర్థారించుకున్నపోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను గతంలో చంచలగూడ జైల్లో 5 సంవత్సరాల శిక్ష అనుభవించాడు. అనంతరం పెరోల్ పై బయటకి వచ్చి తప్పించుకుని తిరుగుతున్నాడు.