చర్లపల్లి (హైదరాబాద్) : చర్లపల్లి జైల్లో ఖైదీలు యధేచ్చగా సెల్‌ఫోన్లు వాడేస్తున్నారు. తాజాగా మరో ఖైదీ వద్ద సెల్‌ఫోన్ వెలుగు చూసింది. బుధవారం రౌడీషీటర్ ఖైసర్ సెల్‌ఫోన్ వాడుతున్నట్టు గుర్తించిన సిబ్బంది దాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత నెల రోజుల వ్యవధిలో ఖైదీల వద్ద రెండు సార్లు సెల్‌ఫోన్లు వెలుగు చూసిన విషయం తెలిసిందే.