హైదరాబాద్:చర్లపల్లి జైల్లో ఓ ఖైదీ మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివకుమార్ అనే మూగఖైదీ అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడ్డాడు. దీనిపై అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెల్ ఫోన్లు ఉన్నాయనే కారణంగానే జైలు సిబ్బంది ఆ ఖైదీని చితకబాదినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరో నలుగురి ఖైదీలు కూడా గాయపడ్డారు.
గాయపడిన ఖైదీలు శీను నాయక్, సతీష్,అజార్, జహంగీర్ లుగా గుర్తించారు. శివకుమార్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఖైదీ మహబూబ్ నగర్ జిల్లా వాసిగా సమాచారం.