
వాషింగ్టన్ : కరోనా వైరస్ ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో ఖైదీలను విడుదల చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఏళ్ల నుంచి జైల్లో మగ్గుతున్న ఖైదీలను గురువారం బయటకు వదిలారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఆల్ ఖైదా ఉగ్రవాది జుబేర్ మహ్మద్ ఇబ్రహింను కూడా అమెరికా విడుదల చేసింది. అనేక ఉగ్ర కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జుబేర్ 2015లో అమెరికాలో పట్టుబడ్డ విషయం తెలిసిందే. (చైనాపై ట్రంప్ ఆగ్రహం)
అప్పటి నుంచి అమెరికా జైల్లోనే అతను శిక్ష అనుభవిస్తున్నాడు. ఆల్ ఖైదా తరపున పెద్దమొత్తంలో నిధులు సమీకరించిన కేసులో జుబేర్ దోషిగా తేలాడు. అయితే జుబేర్ హైదరాబాద్ వాసి కావడంతో అతన్ని భారత్‌కు పంపాలని అమెరికా నిర్ణయించింది. ప్రత్యేక విమానంలో జుబేర్‌ను భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. జుబేర్ భారత్‌లో దిగగానే అతన్ని అదుపులోకి తీసుకుని క్వారెంటైన్‌కు పంపే అవకాశం ఉంది. (ప్రపంచంపై కరోనా పంజా)
Comments
Please login to add a commentAdd a comment