ఖైదీలకే నయం | Turned down mid-day meal scheme | Sakshi
Sakshi News home page

ఖైదీలకే నయం

Published Mon, Dec 8 2014 2:56 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

ఖైదీలకే నయం - Sakshi

ఖైదీలకే నయం

మధ్యాహ్న భోజన పథకం లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. భావిభారత పౌరులను ఖైదీల కన్నా హీనంగా చూస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా నిధుల మొత్తాన్ని పెంచాల్సిన సర్కారు ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకేయడంలేదు. ఇటీవల ఒక్కో విద్యార్థికి 25 పైసల చొప్పున పెంచి చేతులు దులుపుకుంది. ఒక్కో ఖైదీకి సరాసరి రోజుకు రూ.50 వెచ్చిస్తుండగా అదే విద్యార్థులకు రూ.4.60 నుంచి రూ.6.38 వరకు చెల్లించడం ఎంతవరకు సమంజసమని భోజన ఏజెన్సీ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.
 
- భావిభారత పౌరులతో సర్కార్ ఆటలు
- ఒక్కో విద్యార్థికి 25 పైసల పెంపు
- దీనికి ఏమొస్తాయో చెప్పాలంటున్న వంట ఏజెన్సీలు
- భారంగా మారిన మధ్యాహ్న భోజన పథకం
తిరుపతి తుడా/తిరుచానూరు: జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నవ్వులపాలవుతోంది. చాలీచాలని నిధులతో వంట నిర్వాహకులు మెనూను గాలికొదిలేశారు. తమకు తోచి న విధంగా వడ్డిస్తున్నారు. జిల్లాలో దాదాపు 4 వేల ప్రాథమిక, 490 ప్రాథమికోన్నత, 608 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 3.73 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం, విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారు.

ప్రస్తుతం ప్రాథమిక పా ఠశాల విద్యార్థి ఒకరికి 100 గ్రాముల బి య్యం, రూ.4.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఒకరికి 150 గ్రాము ల బియ్యం, రూ.6 అందజేస్తున్నారు.  వారాని కి ఒక్కో విద్యార్థికి రెండు కోడిగుడ్లతో పాటు పప్పు, కూరగాయలు, ఆకుకూరలు, గ్యాసు, వంటనూనె వంటి ఆహార పదార్థాలను ఆ మొత్తంలోనే వంట నిర్వాహకులు కొనుగోలు చేయాలి. ఈ మొత్తం చాలక వంట ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. పైగా నెలల తరబడి బిల్లు లు మంజూరుకాకపోవడంతో అప్పులపాలవుతున్నారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సం ఘాల నాయకు లు డబ్బులు పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఫలితం లేదు.
 
ఖైదీల కన్నా హీనమే
జైల్లోని ఖైదీలకన్నా ప్రభుత్వ పాఠశాలల్లో చది వే విద్యార్థులను ప్రభుత్వం హీనంగా చూస్తోం ది. ఒక్కో ఖైదీకి రోజుకి 600 గ్రాముల బి య్యం, 100 గ్రాముల పప్పు, 140 మి.లీ పాలు, 250 గ్రాముల కూరగాయలను అంది స్తోంది. వీటితో పాటు ఉదయం అల్పాహారం కింద చపాతి, ఉప్మా, పొంగల్, లెమన్ రైస్ ఇస్తున్నారు. వారానికి ఒకరోజు గుడ్డు, 175 గ్రాముల మాంసం ఇస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో ఖైదీకి సుమారుగా రూ.50 వరకు ఖర్చు చేస్తున్నారు. అదే పేద విద్యార్థికి ఒక పూట పొట్ట నింపేందుకు ప్రభుత్వం రూ.4.60 నుం చి రూ.6.38 వరకు మంజూరు చేస్తోంది.
 
పేరుకే మెనూ..
ఒక రోజుకి విద్యార్థికి సగటున 1,500 నుంచి 1,700 క్యాలరీలు పౌష్టికాహారం అందించాల ని న్యూట్రీషియన్లు పేర్కొంటున్నారు. అయితే  మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఒక పూటకి 150 నుంచి 200 క్యాలరీల వరకే అందుతోం ది. పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలకు సరిపడ  పౌష్టికాహారాన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
 
పెంచిన ధర ఇలా..
ప్రాథమిక పాఠశాల విద్యార్థికి ఇదివరకు రూ.4.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.6 చెల్లించేవారు. అయితే తాజాగా ప్రాథమిక పాఠశాల విద్యార్థికి 25 పైసలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు 38 పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
పెద్ద మొత్తంలో పెంచాలి
మధ్యాహ్న భోజన పథకానికి ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బు సరిపోవడం లేదని పలుమార్లు మా సంఘం తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.7, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థికి రూ.10 పెంచాలని డిమాండ్ చేశాం. అయితే ప్రభుత్వం కేవలం పైసల్లో మాత్రమే పెంచి చేతులు దులుపుకోవడం శోచనీయం.
- కత్తి నరసింహారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీయూ
 
గుడ్డుకే చాలదు
మధ్యాహ్నం భోజన పథకానికి ఒక్కో విద్యార్థికి చెల్లిస్తున్న డబ్బు గుడ్డుకే సరి పోదు. అలాంటప్పుడు పౌష్టికాహారా న్ని విద్యార్థులకు ఎలా అందించగలుగుతాం. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. పౌష్టికాహారం, గుడ్డు అందించాలంటే ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై అధనంగా డబ్బులు అందించాలి.
-కే.ముత్యాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి, యూటీఎఫ్
 
పౌష్టికాహారం అంతంతమాత్రమే
మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం అధిక శాతం నాసిరకమే. దీంతో ఆ బియ్యంతో వండిన అన్నం తినేందుకు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థికి సగటున చెల్లిస్తున్న డబ్బులో ఎటువంటి పౌష్టికాహారం అందించాలో ఆ ప్రభుత్వమే తెలియజేయాలి.
-టీ.గోపాల్, రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్‌జేయూపీ
 
పైసల్ అవుతున్న బతుకులు
పెరిగే వయస్సులో విద్యార్థికి నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాల్సి ఉంది. అప్పుడే విద్యార్థి ఆరోగ్యంగా ఎదుగుతూ చదువుపై దృష్టి పెట్టగలుగుతాడు. అయితే మొక్కుబడిగా ప్రభుత్వం పైసలు పెంచి విద్యార్థులను పైసల్ చేస్తోంది. దీనికి తోడు వంట ఏజెన్సీలకు బకాయిలు చెల్లించడంలో జరుగుతున్న జాప్యం కూడా విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది.  
-వై.శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ
 
ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది
ప్రభుత్వం పేద విద్యార్థులపై చిన్నచూపు చూస్తోంది. రూ. 4.48 పైసలకు భోజనం ఎలా పెడతారు. కోడి గుడ్డుకే  రూ.4 చెల్లించాలి. 48 పైసలతో భోజనం ఎలా వస్తుంది. పైసలను పెంచి ప్రభుత్వం వందలు పెంచినట్టు గొప్పలు చెబుతోంది. పేద విద్యార్థులు చదివే పాఠశాలలపై నిర్లక్ష్యం వీడాలి.
-కె.అక్కులప్పనాయక్, టీఎస్‌ఎఫ్, రాష్ట్ర కార్యదర్శి
 
రూ.20కు పెంచాలి
విద్యార్థుల మిడ్‌డే మీల్స్ రూ.20కి పెం చాలి. చాలీ చాలని డబ్బులతో విద్యార్థుల కడుపులు కాలుస్తున్నారు. ఖైదీల కంటే హీనంగా విద్యార్థులకు పట్టెడన్నం పెట్టమని నిధులు కేటాయించడం సిగ్గుచేటు. ప్రభుత్వానికి సర్కారుబడుల విద్యార్థులపై ఉన్న చిన్నచూపు పోవాలి. అవసరమైన నిధులను కేటాయించి పేద విద్యార్థులను ఆదుకోవాలి.
-హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం
 
పౌష్టికాహారం అందివ్వాలి
ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహరం అందించేందుకు చర్యలు చేపట్టాలి. చాలిచాలని డబ్బు లు కేటాయించడం వల్ల అందాల్సిన పౌష్టికాహారం అందడంలేదు. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థికి 100 గ్రాముల అన్నం ఎలా సరిపోతుంది. పదోతరగతి చదువుతున్న విద్యార్థికి 150 గ్రాముల అన్నం ఏమూలకు సరిపోతుంది. కడుపుకాల్చుకుని చదువుకునే దుస్థితి రావడం దౌర్భాగ్యకరం.         - జయచంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎస్‌ఎఫ్‌ఐ
 
డ్రాపౌట్స్ పెరిగే ప్రమాదం
ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో డ్రాపౌట్స్ సంఖ్య అధికంగా ఉంది. మధ్యాహ్న భోజన పథకం అందుబాటులోకి వచ్చాక చాలామంది పేద విద్యార్థులు తిరిగి సర్కారు బడుల్లో చేరా రు. అయితే సరైన పోషక విలువలు, సరిపడా అన్నం పెట్టకపోవడంతో మళ్లీ స్కూళ్లలో డ్రా పౌట్స్ పెరిగే ప్రమాదం ఉంది. ఇది ప్రభుత్వ విద్యావ్యవస్థ మనుగడకే ప్రమాదకరం.  
 - శంకర్‌నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు, జీవీఎస్
 
సీఎం దృష్టికి తీసుకెళ్తాం
మధ్యాహ్న భోజన పథకంపై పూర్తి స్థాయి నివేదికను తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళతాం. మధ్యాహ్న భోజనానికి సగటున విద్యార్థికి చెల్లిస్తున్న డబ్బులను, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా పెంచాలని ఆయనకు విన్నవించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.
- రవినాయుడు, జాతీయ సమన్వయకర్త, టీఎన్‌ఎస్‌ఎఫ్.
 
నిర్లక్ష్యం తగదు
ప్రభుత్వ బడుల్లో చదువుతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులే. వీరిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రూ.4కు భోజనం పెట్టడం ఏ కాలంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకు వర్తిస్తుందో ప్రభుత్వమే సమాధానమివ్వాలి. పేదలపై ప్రభుత్వానికి చిత్తశుధ్ది ఉంటే పూర్తిస్థాయిలో పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలి.
- దామినేటి కేశవులు, ఎస్సీసంక్షేమ సంఘం నాయకులు
 
జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళతాం
మధ్యాహ్న భోజనానికి కేటాయించిన డబ్బులను పెంచాలని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న బడుల్లో ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బులు చాలడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. భోజన పథకంలో నిర్ణీత ధరలు పెంచే విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాను.
- రవికుమార్‌నాయుడు, ఎంపీడీవో, తిరుపతి రూరల్.
 
ఇబ్బందులు ఉన్నాయి
తక్కువ మంది ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నష్టాల్లో నడుస్తోంది.   చాలీచాలని డబ్బులతో వంట ఏజెన్సీలు వంటలు చేయలేమని ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా పెంచిన పెంపు వీరికి ఏమాత్రం సరిపోదు. ఇలాంటి నేపథ్యంలో తక్కువ మంది పిల్లలున్న పాఠశాలలపై ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే బావుంటుంది.
-ఎం.ప్రసాద్, ఎంఈవో, తిరుపతి రూరల్
 
బకాయిలతో ఇబ్బందులు
గత నాలుగు నెలలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన మధ్యా హ్న భోజన డబ్బులు బకాయి పడడంతో ఇబ్బందులు పడుతున్నాం. దీంతో అప్పులు చేసి వి ద్యార్థులకు వండి పెడుతున్నాం. పెరిగిన కూరగాయల ధరతో ప్రభుత్వం ఇస్తున్న డబ్బు లు సరిపోవడం లేదు. వారంలో రెండు రోజులు విద్యార్థి కి ఇచ్చే డబ్బు కోడి గుడ్డుకే ఖర్చవుతోంది. ఇలాగైతే  ఎలా బతకాలి.          - రంగమ్మ, వంట ఏజెన్సీ సభ్యురాలు
 
పది రూపాయలు చెల్లించాలి
మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి ఇస్తున్న డబ్బు చాలడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన భోజనం ఎలా ఇవ్వగలుగుతాం. అయినా పిల్లలకు అన్యా యం చేయకూడదనే ఉద్ధేశంతో తమకు ఆదాయం లేకున్నా మంచి భోజనం పెట్టేందుకు  నగలు కుదవ పెట్టాం. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ. 10 చెల్లించాలి.   -కే.కుమారి, వంట ఏజెన్సీ సభ్యురాలు
 
రూ.80 వేలు బకాయిలు రావాలి
మధ్యాహ్న భోజనం ద్వారా తమకు ఇప్పటి వరకు రూ.80 వేలు బకాయిలు రావాల్సి ఉంది. దీంతో రూ.5 వడ్డీకి అప్పు తెచ్చి మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. నెల వచ్చేసరికి తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లించలేకపోతున్నాం. ప్రభుత్వం పునరాలోచించి ఏ నెలకు ఆ నెల డబ్బులు చెల్లించాలి.
-బీ.కుమారి, వంట ఏజెన్సీ సభ్యురాలు
 
చిన్న చూపు ఎందుకు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది పేద విద్యార్థులే. అలాంటి పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది.  ఒక పూట తిండి పెట్టేందుకు లెక్కలు వేసుకుంటూ చిన్నచూపు చూస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి.
-మోషి, 10వ తరగతి విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement