రిమాండ్‌కు తరలిస్తున్న ఒక ఖైదీ పోలీస్‌స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
నేలకొండపల్లి(ఖమ్మం జిల్లా): రిమాండ్‌కు తరలిస్తున్న ఒక ఖైదీ పోలీస్‌స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది.
వివరాలు.. మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన గుండా సత్యం అనే వ్యక్తిని పోలీసులు రెండు రోజుల క్రితం రెండు మేకలను దొంగలించిన కేసులో అరెస్ట్ చేశారు. కాగా, సత్యాన్ని బుధవారం రిమాండ్‌కు తరలించనున్నారు. ఈ క్రమంలోనే రిమాండ్‌కు తరలిస్తున్నారని తెలిసి పీఎస్ ఎదట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. విషయం తెలిసిన పోలీసులు సత్యాన్ని వెంటనే ఖమ్మంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఖైదీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.