fertilizer poison
-
పోలీస్ స్టేషన్ వద్ద ఖైదీ ఆత్మహత్యాయత్నం
నేలకొండపల్లి(ఖమ్మం జిల్లా): రిమాండ్కు తరలిస్తున్న ఒక ఖైదీ పోలీస్స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది. వివరాలు.. మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన గుండా సత్యం అనే వ్యక్తిని పోలీసులు రెండు రోజుల క్రితం రెండు మేకలను దొంగలించిన కేసులో అరెస్ట్ చేశారు. కాగా, సత్యాన్ని బుధవారం రిమాండ్కు తరలించనున్నారు. ఈ క్రమంలోనే రిమాండ్కు తరలిస్తున్నారని తెలిసి పీఎస్ ఎదట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. విషయం తెలిసిన పోలీసులు సత్యాన్ని వెంటనే ఖమ్మంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఖైదీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. -
భార్య తిట్టిందని.. కనిపించకుండా పోయాడు
ధరూరు(మహబూబ్నగర్): సాగు చేస్తున్న పైర్లపై చీడపీడలు పట్టినా పట్టించుకోవటం లేదంటూ భార్య తిట్టటంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. మహబూబ్నగర్ జిల్లా ధరూరు మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ... మండలంలోని అల్వాలపాడు గ్రామానికి చెందిన కావలి లక్ష్మన్న (45) తనకున్న మూడున్నర ఎకరాల పొలంలో పత్తి, వరి సాగు చేశాడు. పత్తికి విపరీతంగా తెగుళ్లు సోకాయని...ఇంట్లో ఉన్న పురుగు మందును ఎందుకు పిచికారీ చేయడం లేదంటూ భార్య జములమ్మ ఆదివారం భర్తతో వాదనకు దిగింది. ఆమె మాటలకు మనస్తాపం చెందిన లక్ష్మన్న అదేరోజు సాయంత్రం ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. పరిచయస్తులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.