జైళ్లల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు : డీఐజీ
నరసన్నపేట : జిల్లాలోని సబ్‌జైళ్లు, జిల్లా జైళ్లలో ఉన్న ఖైదీలకు, ముద్దారుులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి స్థారుులో సౌకర్యాలు కల్పిస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ ఎం.చంద్రశేఖర్ అన్నారు. నరసన్నపేటలోని సబ్‌జైలును శుక్రవారం ఆయన వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరసన్నపేట జైలును రూ.17లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. పాతపట్నం, జిల్లా కేంద్ర జైల్లో కూడా అభివద్ధి పనులు చేశామన్నారు.
శిథిలమై ఎత్తివేసిన సోంపేట, టెక్కలి, ఇచ్ఛాపురం సబ్‌జైళ్లను పునరుద్ధరించే ఆలోచన లేదని చెప్పారు. ఉన్న జైళ్లలోనే సామర్థ్యం మేరకు ముద్దారుులు, ఖైదీలు ఉండడం లేదన్నారు. ప్రస్తుతం సిబ్బంది కొరత ఉందని త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. జైళ్ల శాఖలో 250 పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. నరసన్నపేట జైలు పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని కితాబునిచ్చారు. ఆయన వెంట జిల్లా జైలర్ బి.కూర్మనాధరావు, స్థానిక సబ్‌జైలర్ కె.రామకృష్ణ ఉన్నారు.