హైదరాబాద్ చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం జైలు గదిలో దుప్పటితో ఉరేసుకున్నాడు. అతణ్ని పార్థనాయక్గా గుర్తించినట్టు జైలు అధికార వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్ చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం జైలు గదిలో దుప్పటితో ఉరేసుకున్నాడు. అతణ్ని పార్థనాయక్గా గుర్తించినట్టు జైలు అధికార వర్గాలు తెలిపాయి. కూతుర్నిహత్య చేసిన కేసులో నాయక్ శిక్ష అనుభవిస్తున్నాడు.
అతణ్ని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నాయక్ సొంతూరు రంగారెడ్డి జిల్లా మంచాల. జైలుకెళ్లిన తర్వాత అతను మానసిక క్షభకు గురైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అతను అగాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.