అనంతపురం జిల్లా బుక్కరాయ సమద్రం మండల పరిధిలోని ఓపన్ ఎయిర్ జైలు నుంచి ఓ జీవిత ఖైదీ పరారైనట్లు జైలు సూపరిండెంట్ శ్రీనివాసరావు తెలిపారు.
అనంతపురం జిల్లా బుక్కరాయ సమద్రం మండల పరిధిలోని ఓపన్ ఎయిర్ జైలు నుంచి ఓ జీవిత ఖైదీ పరారైనట్లు జైలు సూపరిండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. జైలు నందు కర్నూలు జిల్లా చిందుకూరు మండలం, గడివేముల గ్రామానికి చెందిన శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో జీవిత ఖైదు శిక్షతో 6 ఏళ్ల క్రితం ఓపన్ ఎయిర్ జైలుకు వచ్చాడన్నారు. ఆదివారం సాయంత్రం ఓపన్ ఎయిర్ జైలు అధికారుల కల్లుకప్పి పారిపోయాడన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.