open air jail
-
బాధ్యతలు చేపట్టిన ఓపెన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్
బుక్కరాయసముద్రం : ఓపెన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్‌గా ఈశ్వరయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న గోవిందరాజులు విజయవాడ హెడ్ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. నెల్లూరులో ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ రిఫర్మేషన్ సర్వీసెస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న ఈశ్వరయ్య ఇక్కడికి బదిలీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ ఓపెన్ ఎయిర్ జైలు అభివృద్ధికి, ఖైదీల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. గతంలో ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా, జైలు ఇన్చార్జ్ అధికారిగా పని చేసినట్లు ఆయన తెలిపారు. -
కరువు క్షేత్రం
- ఓపన్ ఎయిర్ జైల్లో వ్యవసాయం కుదేలు - భారీగా తగ్గిన జైలు ఆదాయం - ఈ ఏడాది 9 లక్షలే ఆదాయం - ఎండుతున్న మామిడి చెట్లు ఖైదీల వ్యవసాయ క్షేత్రం.. ఎటు చూసినా పచ్చని చెట్లు.. కూరగాయలు, పండ్ల తోటలు, పూల మొక్కలు, జీవిత ఖైదీలు పనులు చేసుకుంటూ కనిపించేది. ఇదంతా రెండేళ్ల కిందటి మాట. నేడు ఎండిపోయిన చెట్లు.. వాడిపోయిన కాయలు, రాలిన ఆకులతో కళావిహీనంగా మారిపోయింది. కరువు రక్కసి పంజా విసరడంతో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయం కుదేలైంది. వ్యవసాయం ద్వారా జైలుకు వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. - బుక్కరాయసముద్రం (శింగనమల) : బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి సమీపంలో ఓపన్ ఎయిర్ జైలు ఉంది. జైలుకు 1427.57 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 118 ఎకరాలు ఏపీఎస్పీ 14వ బెటాలియన్ నిర్మాణానికి, 500 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణానికి, 18.38 ఎకరాలు జిల్లా జైలుకు ఇచ్చారు. 45 ఎకరాల్లో ఓపన్ ఎయిర్ జైలు పరిపాలనా విభాగం ఉంది. 3 ఎకరాల్లో పెట్రోలు బంకులు, హోటల్ నిర్మాణాలు చేపట్టారు. వర్షాలు, హెచ్చెల్సీ నీటి ఆధారంగా 110 ఎకరాల్లో వేప, చింత టేకు చెట్లు పెంచుతున్నారు. మిగిలిన 600 ఎకరాల్లో 5 వేల వరకు వివిధ రకాల మామిడి చెట్లు, కాయగూరలు, వేరుశనగ, చిరుధాన్యాలు, గ్రాసం, పూల వంటి పంటలు సాగు చేస్తున్నారు. భారీగా తగ్గిన జైలు ఆదాయం వర్షాభావం ప్రభావం ఓపన్ ఎయిర్ జైలు ఆదాయంపై పడుతోంది. గత రెండేళ్ల కంటే ఈ ఏడాది ఆదాయం పెద్ద ఎత్తున పడిపోయింది. 2014–15లో రూ.42,66,241 పెట్టుబడి పెట్టగా రూ.37,60,770 ఆదాయం వచ్చింది. 2015–16లో రూ.24,03,346 పెట్టుబడి పెట్టగా రూ.32,95,840 ఆదాయం సమకూరింది. 2016–17లో రూ.23,05,559 పెట్టుబడి పెట్టగా రూ.9,62,350 ఆదాయం వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అదే విధంగా గత ఏడాది మామిడి తోట వేలం వేయగా రూ.23 లక్షలు వచ్చింది. ఈ ఏడాది మామిడి తోట దిగుబడి లేక వ్యాపారస్తులు సరైన ధర పెట్టకపోవడంతో రెండుసార్లు వేలం వాయిదా పడింది. వర్షాలు లేక, హెచ్చెల్సీ నీరు అందక జైలులో మామిడి, టేకు చెట్లు నిలువునా ఎండపోతున్నాయి. ఎక్కడ చూసినా పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. నీరుంటే మంచి ఆదాయం ఓపన్ ఎయిర్ జైలులో వర్షాలు సక్రమంగా పడి, నీరు ఉంటే మంచి పంటలు పండించవచ్చు. జైలులో 80 మంది ఖైదీల వరకు ఉన్నారు. యంత్రాలు కూడా వినియోగించి పనులు చేయిస్తున్నాము. రెండేళ్లలో ఆదాయం 3 రెట్లు తగ్గిపోయింది. ఏ పని చేయించాలన్నా నీరు బాగా కావాల్సి వస్తోంది. ఇలాంటి కరువు పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. వర్షాలు వస్తే వేరుశనగ, కంది, మామిడి చెట్ల పెంపకం, కూరగాయలు సాగు పెద్ద ఎత్తున చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. - గోవిందరాజులు, సూపరింటెండెంట్, ఓపెన్ ఎయిర్ జైలు -
శిక్షణ
-
అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి
బుక్కరాయసముద్రం (శింగనమల) : బుక్కరాయసముద్రం మండల పరి«ధిలోని ఓపెన్ ఎయిర్ జైలులో ఓ జీవిత ఖైదీ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. జైలు అధికారులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం, కస్తూరి రాజుగారిపల్లికి చెందిన రంగయ్య కుమారుడు జయరాం (39)కు ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. జనవరి–16న కడప జైలు నుంచి ఓపెన్ ఎయిర్ జైలుకు తీసుకొచ్చారు. అయితే జయరాం కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. నాలుగు రోజుల క్రితం జైలులో అస్వస్థతకు గురికావడంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం చనిపోయినట్లు జైలు అధికారులు తెలిపారు. జయరాంకు ఇంకా పెళ్లి కాలేదన్నారు. -
గుండెపోటుతో జీవిత ఖైదీ మృతి
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని ఓపెన్ ఎయిర్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. జైల్ సూపరింటెండెంట్ రమేష్ తెలిపిన వివరాలు మేరకు... ప్రకాశం జిల్లా, మార్కాపురంకు చెందిన డి. కృష్ణ (48)కు 2009లో ఓ హత్య కేసులో భాగంగా జీవిత ఖైదు శిక్ష పడింది. ఇందులో భాగంగానే ఓపెన్ ఎయిర్ జైల్‌కు వచ్చాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో జైల్ సిబ్బంది చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. మృతిచెందినట్లు డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్ తెలిపారు. -
నాణ్యత... వారి ప్రత్యేకత!
→ ఖైదీల నిర్వహణలో పెట్రోల్ బంక్‌లు → నాణ్యమైన ఇంధనం.. నిర్ధిష్టమైన కొలతలు → బారులు తీరుతున్న వాహనదారులు → రోజుకు రూ. 4 లక్షలకు పైగా వ్యాపారం బుక్కరాయసముద్రం : ఓపెన్ ఎయిర్ జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో నిర్వహిస్తున్న పెట్రోలు బంకుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఓపెన్ ఎయిర్ జైల్ వద్దlఆధునాతన సౌకర్యాలతో ఈ ఏడాది మే నెలలో 2 ఐఓసీ పెట్రోలు బంకులను రూ. 4 కోట్లతో జైలుశాఖ ఏర్పాటు చేసింది. ఈ పెట్రోల్ బంకుల్లో 20 మంది ఖైదీలు పనిచేస్తున్నారు. నీలంపల్లి రోడ్డు వైపు ఉన్న పెట్రోలు బంక్‌లో రోజుకు రూ. 2.50 లక్షల వ్యాపారం జరుగుతోంది. దీనికి ఎదురుగా ఉన్న మరో పెట్రోలు బంక్‌లో రూ.1.50 లక్షల లావాదేవీలు సాగుతున్నాయి. ఇందులో పనిచేసే ఖైదీలకు రోజుకు 70 రూపాయలు కూలి చెల్లిస్తున్నారు. రోజుకు రూ. 4 లక్షల ప్రకారం నెలకు కోటి రూపాయలకు పైగా వ్యాపారలావాదేవీలు ఖైదీలు నిర్వహిస్తున్నారని జైలు అధికారులు పేర్కొంటున్నారు. నాణ్యమైన పెట్రోలు మీటర్ రీడింగ్ వద్ద మొదలుకుని సరుకు కల్తీ వరకు పలు రకాల్లో వినియోగదారులను చాలా పెట్రోల్ బంక్ నిర్వాహకులు మోసగిస్తుంటారు. అయితే ఓపెన్ ఎయిర్ జైలు పరిధిలో ఉన్న రెండు పెట్రోలు బంకులలో ఇలాంటి అక్రమాలకు తావు లేదు. ఇక్కడ నాణ్యమైన పెట్రోల్ లభిస్తుండటంతో వాహనదారులు ఎక్కువగా వస్తుంటారు. వీటిని పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తుండటం కారణంగా వినియోగదారులు పెట్రోలు, డీజిల్ కోసం క్యూ కడుతున్నారు. ఫుల్ట్యాంక్ కావాలనుకునేవారు తప్పని సరిగా ఓపెన్ ఎయిర్ జైలు వద్ద ఉన్న పెట్రోల్ బంకుల వద్దకే వెళుతుంటారు. నాణ్యమైన పెట్రోల్‌తో పాటు మీటర్ రీడింగ్ కూడా ఇక్కడ కచ్చితంగా ఉంటుందని వాహనదారులు చెబుతున్నారు. బతుకు తెరువుకు దోహదం జైల్లో ఉంటునే పెట్రోలు బంకులో పనిచేస్తున్నా... బయటకు వెళ్లినా పెట్రోలు బంకులలో పని చేస్తూ బతికే ఆత్మసై్థర్యం వచ్చింది. మా దగ్గర నాణ్యమైన పెట్రోల్ దొరుకుతుందని ఎక్కువ మంది ఇక్కడికే వస్తుంటారు. – శంకర్, ఖైదీ పెట్రోల్‌లో నాణ్యత ఎక్కువ మిగతా పెట్రోల్ బంకుల్లో కన్నా ఇక్కడ పోస్తున్న పెట్రోల్‌కు చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ వేయించుకుంటున్న పెట్రోల్‌తో నా బండి మైలేజీ కూడా పెరిగింది. కల్తీ లేకపోవడంతో రిపేరీలు కూడా తగ్గాయి. అందుకే అనంతపురంలో పెట్రోల్ వేయించుకోవడం మానేశాను. కచ్చితంగా జైలు దగ్గరకే వచ్చి పెట్రోల్ పోయించుకుంటున్నాను. – లక్ష్మిరెడ్డి, జంతులూరు నాణ్యమైన పెట్రోలు అందిస్తాం పెట్రోల్, డీజిల్ నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. మేం నాణ్యమైన పెట్రోలు అందిస్తున్నాం కాబట్టే ఎక్కువ మంది వాహనదారులు ఇక్కడికే వచ్చి పెట్రోల్ పోయించుకుంటున్నారు. కొలతల విషయంలో కూడా కచ్చితంగా వ్యవహరిస్తున్నాం. పెట్రోల్ బంకుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలోని జైళ్ల అభివద్ధికి, ఖైదీల సంక్షేమానికి వినియోగిస్తాం. మరో రెండు నెలల్లో పెట్రోలు బంకులలో పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఇప్పటికే మూడు కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరిగి ఉంటుంది. – శ్రీనివాసులు, సూపరింటెండెంట్, ఓపెన్ ఎయిర్ జైలు -
పోలీసులకు చిక్కిన ఎరికలన్న
అనంతపురం : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి ఓపెన్ జైలు నుంచి పరారైన జీవిత ఖైదీ ఎరికలన్న ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బుధవారం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని రెడ్డిపల్లి జైలుకు తరలించారు. ఎరికలన్న జైలు నుంచి మంగళవారం తెల్లవారుజామున పరైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని గుర్తించిన జైలు సిబ్బంది వెంటనే జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్‌కు తెలియజేశారు. ఎరికలన్న కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా అతడిని ఈ రోజు పట్టుకున్నారు. హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఎరికలన్న స్వస్థలం పెద్దవడుగూరు మండలం కొండూరు గ్రామం. -
జైలు నుంచి ఖైదీ పరారీ
అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి ఓపెన్ జైలు నుంచి మంగళవారం తెల్లవారుజామున ఓ ఖైదీ పరారయ్యాడు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఎరికలన్న అనే ఖైదీ జైలు నుంచి పరారయ్యాడు. ఆ విషయాన్ని ఈ రోజు ఉదయం గుర్తించిన జైలు సిబ్బంది వెంటనే జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలియజేశారు. ఎరికలన్న కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఎరికలన్న స్వస్థలం పెద్దవడుగూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన వాడని పోలీసులు చెప్పారు. -
ఓపన్ ఎయిర్జైలులో జీవిత ఖై దీ పరారీ
అనంతపురం జిల్లా బుక్కరాయ సమద్రం మండల పరిధిలోని ఓపన్ ఎయిర్ జైలు నుంచి ఓ జీవిత ఖైదీ పరారైనట్లు జైలు సూపరిండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. జైలు నందు కర్నూలు జిల్లా చిందుకూరు మండలం, గడివేముల గ్రామానికి చెందిన శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో జీవిత ఖైదు శిక్షతో 6 ఏళ్ల క్రితం ఓపన్ ఎయిర్ జైలుకు వచ్చాడన్నారు. ఆదివారం సాయంత్రం ఓపన్ ఎయిర్ జైలు అధికారుల కల్లుకప్పి పారిపోయాడన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. -
చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి ఖైదీ పరార్
హైదరాబాద్ : చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి నర్సింహులు(32) అనే ఖైదీ గురువారం పరారయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్నగర్ మండలం రంగంపల్లికి చెందిన నర్సింహులు ఓ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంకో ఏడాదిలో శిక్ష పూర్తి అవుతుండగా ఇంతలోనే జైలు నుంచి పరారయ్యాడు. పోలీసులు నర్సింహులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
‘జీవిత'oలోకి.. స్వేచ్ఛగా..
బుక్కరాయసముద్రం, న్యూస్‌లైన్ : జీవిత ఖైదును అనుభవించిన 82 మందికి ఆదివారం స్వేచ్ఛ లభించింది. ప్రభుత్వం జారీ చేసిన క్షమాభిక్ష జీవోతో వారంతా స్వేచ్ఛా ప్రపంచంలో జీవనంలోకి వచ్చారు. క్షణికావేశంలోనో, ఉద్దేశ్య పూర్వకంగానో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా జీవిత ఖైదును అనుభవిస్తూ పశ్చాత్తాపంతో.. మానసిక పరివర్తన చెందారు. వీరి సత్ప్రవర్తనను గుర్తించి ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. వీరి విడుదలతో వారిని కలుసుకునేందుకు వారి కుటుంబ సభ్యులు, బంధువులు తరలి వచ్చారు. మండల పరిధిలోని జిల్లా ఓపన్ ఎయిర్ జైలు ఈ దృశ్యాలకు వేదికైంది. రాష్ట్ర వ్యాప్తంగా 390 మంది ఖైదీలు విడుదల కాగా, వీరిలో అనంతపురం ఓపన్ ఎయిర్ జైలు నుంచి అత్యధికంగా 82 మంది విడుదలయ్యారు. రాజమండ్రిలో మొత్తం 74 మంది ఖైదీలు విడుదలయ్యారని సూపరింటెండెంట్ లక్ష్మీపతి తెలిపారు. కాగా ఖైదీలు జైల్లో ఉండగా వారి కోసం ప్రభుత్వం రోజుకు రూ.50 చెల్లించేది. ఆ సొమ్మును అధికారులు పొదుపు చేసేవారు. అది మొత్తం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంది. ఆ డబ్బును జైలు అధికారులు ఖైదీలకు అందజేశారు. తమ వాళ్లకు ఇళ్లకు తీసుకెళ్లడానికి బంధువులు, అనుచరులు భారీ ఎత్తున తరలి వచ్చారు. వారంతా విడుదలైన ఖైదీలను ఆప్యాయంగా పలకరించి, ఉద్వేగం, ఆప్యాయత, ప్రేమానురాగాలు నిండిన హృదయాలతో హత్తుకుని ఆనంద భాష్పాలు రాల్చారు. కాగా విడుదలైన వారిలో అధిక శాతం సంపన్నులు, రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడంతో సంబంధిత నాయకులు, కార్యకర్తలు వందలాది వాహనాల్లో చేరుకున్నారు. జైలు సూపరింటెండెంట్ లక్ష్మీపతి ఖైదీలందరికీ విడుదల పత్రాలు(రిలీజింగ్ ఆర్డర్) ఇచ్చారు. వాటిని తీసుకుని బయటకు రాగానే ఆనందోత్సాహాలతో వారిని తమ వెంట ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు తిమ్మంపల్లి కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి వీఆర్.రామిరెడ్డి, టీడీపీ నాయకులు కంది గోపుల మురళీప్రసాద్, కడప, కర్నూలుకు చెందిన రాజకీయ పార్టీల నేతలు, తదితరులు తరలి వచ్చి విడుదలైన వారిని పరామర్శించారు. ల్యాబ్ టెక్నీషియన్‌గానే కొనసాగుతా... మొదట కర్నూలులో ల్యాబ్ టెక్నీషియన్‌గా ప్రయివేటు క్లీనిక్ నిర్వహిస్తుండేవాడిని. అనుకోని పరిస్థితుల వల్ల జైలుకు వచ్చాను. ఇపుడు మా ఊరెళ్లి బ్యాంక్ ద్వారా రుణం పొంది మళ్లీ ల్యాబ్ టెక్నీషియన్‌గానే జీవితాన్ని కొనసాగుతాను. - విజయమోహన్(కర్నూలు జిల్లా) రాజకీయాల వల్ల నష్ట పోయాం రాజకీయాల వల్ల ఎంతో నష్ట పోయాం. తాడిపత్రిలో ఓ కాంగ్రెస్ నాయకుడి కారణంగా పదేళ్లు జైల్లో గడపాల్సి వచ్చింది. బయటకు వెళ్లి ప్రశాంతంగా జీవిస్తాను, కుటుంబానికి దూరమై ఎంతో కుంగిపోయాను. - ఆలూరి రామచంద్రారెడ్డి, సీంగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఆవేశం వల్ల అనేక అనర్థాలు ఆవేశాల వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయని అనుభవ పూర్వకంగా తెలిసింది. కోపతాపాల వల్ల ఎంతో నష్ట పోయాం.ప్రతి ఒక్కరూ ఓర్పు, సహనంతో జీవించాలి. ఆవేశం కారణంగా మా కుటుంబంలో నాతో పాటు మరో ముగ్గురు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. - రాజగోపాల్‌రెడ్డి, జీవిత ఖైదీ